*ఫ్యూచర్ సిటీ పోలీసుల భారీ ఆపరేషన్.. రూ.6.78 కోట్ల దొంగ నోట్ల ముఠా పట్టివేత, నలుగురు అరెస్ట్*


 *ఫ్యూచర్ సిటీ పోలీసుల భారీ ఆపరేషన్.. రూ.6.78 కోట్ల దొంగ నోట్ల ముఠా పట్టివేత, నలుగురు అరెస్ట్*


*హైదరాబాద్, నవంబర్ 3:* ఫ్యూచర్ సిటీ పోలీసులు దొంగ నోట్ల భారీ రాకెట్ ను బట్టబయలు చేశారు. రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు.


ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, షాద్ నగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.


*కుంట్లూరులోని అద్దె ఇంట్లో ప్రింటింగ్:*

నిందితులు కుంట్లూరులోని ఓ అద్దె ఇంట్లో ఫోటోషాప్ ఉపయోగించి నకిలీ నోట్లను ప్రింట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


సోదాల్లో నకిలీ నోట్లతో పాటు నకిలీ ఐడీ కార్డులు, డమ్మీ పిస్టళ్లు, వాకీ టాకీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వేషంలో అమాయకులను బెదిరించి అసలు నోట్లను దోచుకునేవారని విచారణలో తేలింది.


ఈ కేసు వివరాలను ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి, ఐపీఎస్ మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?