రసాయన కాలుష్యంపై అంతమ్మగూడెం వాసుల పోరాటం - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి
రసాయన కాలుష్యంపై అంతమ్మగూడెం వాసుల పోరాటం - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పీకర్ హామీ మద్దతుగా నిలిచిన ప్రముఖ పర్యావరణవేత్తలు పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని రసాయన పరిశ్రమల వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర కాలుష్య సమస్యలపై "అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి" సమరశంఖం పూరించింది. హజేలో తదితర పరిశ్రమల నుండి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల పీల్చే గాలి, త్రాగే నీరు, తినే పంటలు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయి గ్రామంలో జీవనం అస్తవ్యస్తంగా మారిందని, ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ సమితి సభ్యులు బుధవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ గ్రామాన్ని కాలుష్యం బారి నుండి కాపాడాలని వేడుకున్నారు. ప్రముఖ పర్యావరణవేత్తలు కుంభం పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి ల సహకారంతో స్పీకర్‌కు ఓ సమగ్ర వినతిపత్...