Posts

ఢిల్లీలో దారుణం.. అత్త, మామలను కడతేర్చిన కోడలు

ఢిల్లీలో దారుణం.. అత్త, మామలను కడతేర్చిన కోడలు కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో దేశ రాజధానిలో దారుణం జరిగింది. భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగానే అత్తా, మామలను అత్యంత కిరాతకంగా@@ కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో దేశ రాజధానిలో దారుణం జరిగింది. భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగానే అత్తా, మామలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కోడలు ఉదంతం వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీ చావ్లా ప్రాంతంలోని దుర్గా విహార్‌ ఫేజ్‌-2లోని తమ ఇంటిలో కవిత (35) అనే మహిళ తన అత్తమామలు రాజ్‌ సింగ్‌(61), ఓంవతి (58)లను దారుణంగా కొట్టి ఆపై కసితీరా కత్తితో పొడిచి చంపిందని పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె భర్త సతీష్‌ సింగ్‌ (37)నూ ఈ కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. జంట హత్యల కేసులో కవిత, ఆమె భర్తను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 రూ.1400 కోట్లు మహిళా సంఘాల ఖాతాల్లో వేసిన ఏపీ సీఎం జగన్

 రూ.1400 కోట్లు మహిళా సంఘాల ఖాతాల్లో వేసిన ఏపీ సీఎం జగన్ సెర్ప్, మెప్మా పరిధి ప్రాంతాల్లోని పొదుపు సంఘాల ఖాతాల్లో నగదు జమ 90,37,254 మంది మహిళలకు లబ్ధి 'వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం' కింద సాయం కట్టవలసిన మొత్తం వడ్డీని వేసిన ప్రభుత్వం  కరోనా విజృంభణ నేపథ్యంలో మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు సీఎం జగన్ ఈ రోజు సున్నా వడ్డీ పథకం ప్రారంభించారు. ఈ మేరకు రూ.1400 కోట్లు విడుదల చేశారు. వడ్డీ కింద ఈ డబ్బులు జమ చేస్తారు.  ఈ మేరకు రూ.1400 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఏపీలో 90,37,254 మందికి లబ్ధి చేకూరుతుంది. 'వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం' కింద స్వయం సహాయక సంఘాలు  2019, ఏప్రిల్ 1 నుండి 2020, మార్చి 31 వరకు కట్టవలసిన మొత్తం వడ్డీ రూ.1400 కోట్లను మహిళల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆయా సంఘాల ఖాతాల్లో జమచేసింది. సెర్ప్, మెప్మా పరిధి ప్రాంతాల్లోని పొదుపు సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ అయింది. దీని వల్ల పేద మహిళలకు ఎంతగానో లాభం చేకూరుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా ఒకే ఒక్క క్లిక్‌తో సీఎం జగన్‌ నగదు బదిలీ  చేశారు. దీంతో సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతా...

ఇండియన్ రెడ్ క్రాస్ నివారణ  విభాగం కన్వీనర్ గా డాక్టర్ కాచం సత్యనారాయణ

Image
  హైదరాబాద్: ఇండియన్ రెడ్ క్రాస్  గ్రేటర్ హైదరాబాద్ విపత్తు నివారణ  విభాగం కన్వీనర్ గా డాక్టర్ కాచం సత్యనారాయణ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గ్రేటర్ హైదరాబాద్ విపత్తు నివారణ  విభాగం కన్వీనర్గా డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా నియమిస్తూ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని రెడ్క్రాస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన  కార్యక్రమంలో నియామక ఉత్తర్వులను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ  రెడ్ క్రాస్ సంస్థ లో బాధ్యతాయుతమైన హోదా దక్కడం ఎంతో బలాన్నిచ్చింది అన్నారు . లాక్ డౌన్ నే పద్యంలో గడిచిన నెల రోజులుగా ప్రతిరోజు 1500 మంది పోలీస్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు నిర్వాసితులకు బిర్యానీ బాక్సులు పంపిణీ చేస్తున్నామన్నారు . రెడ్ క్రాస్  వారు తనకు గౌరవ స్థానాన్ని ఇచ్చి బాధ్యతలు రెట్టింపు చేశారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. STAY HOME - STAY SAFE భౌతిక దూరం పాటించండి - మా స్కులు ధరించండి

తెలంగాణ  ఎప్రిల్ 23,  కరోనా బులిటెన్

Image
తెలంగాణ  ఎప్రిల్ 23,  కరోనా బులిటెన్ తెలంగాణ  ఎప్రిల్ 23  రోజున కరోనా 27 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసులు 970. ఈ రోజు 58 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం డిశ్చార్జెస్  252,   ఈ రోజు ఒకరు మరణించారు. మొత్తం మరణాలు 25. మొత్తం ఆక్టివ్ కేసులు 693 STAY HOME - STAY SAFE భౌతిక దూరం పాటించండి - మా స్కులు ధరించండి

నల్గొండ   జిల్లా ఎప్రిల్ 23,  కరోనా బులిటెన్

Image
నల్గొండ   జిల్లా ఎప్రిల్ 23,  కరోనా బులిటెన్ నల్గొండ జిల్లా ఎప్రిల్ 23 కరోనా బులిటీన్ ను  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారు. ఈ రోజు కరోనా  పాజిటివ్ కేసులు రాలేదని  పేర్కొన్నారు.  ఈ రోజు వరకు మొత్తం 15 పాజిటివ్ కేసులు. STAY HOME - STAY SAFE భౌతిక దూరం పాటించండి - మా స్కులు ధరించండి

సూర్యాపేట  జిల్లా ఎప్రిల్ 23, కరోనా బులిటెన్

Image
సూర్యాపేట  జిల్లా ఎప్రిల్ 23,  కరోనా బులిటెన్ జిల్లా ఎప్రిల్ 23 కరోనా బులిటీన్ ను  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారు. ఈ రోజు కరోనా  పాజిటివ్ కేసులు రాలేదని  పేర్కొన్నారు.  ఈ రోజు వరకు మొత్తం 83 పాజిటివ్ కేసులు, STAY HOME - STAY SAFE భౌతిక దూరం పాటించండి - మా స్కులు ధరించండి

ఆర్ణబ్ గోస్వామి పై దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు

Image
ఆర్ణబ్ గోస్వామి పై దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు. సీనియర్ పాత్రికేయుడు, ఎడిటర్ ఆర్ణబ్ గోస్వామి పై  దాడి చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ)లు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో తమ భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తీకరించే జర్నలిస్టులపై దాడులు చేయడం సరైంది కాదని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, వర్కింగ్ కమిటీ సభ్యులు ఎల్గొయి ప్రభాకర్ లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులకు  రాజకీయ,మతపరమైన సంస్థలు, పార్టీలతో సంబంధం లేకుండా ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తీకరించే హక్కు వుంటుందని అన్నారు. జర్నలిస్టులు వ్యక్తపరిచే అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వ్యక్తపరిచేందుకు అనేక మార్గాలున్నాయని,కానీ ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడడం సరైంది కాదని, ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని అన్నారు. ఆర్ణబ్ గోస్వామి పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. STAY HOME - STAY SAFE భౌ...