Posts

పార్టీ ఆవిర్భావ వేడుకలను యిండ్లలోనే జరుపుకోవాలి-ఉమ్మడి నల్గొండ జిల్లా లీడర్, క్యాడర్ కు మంత్రి జగదీష్ రెడ్డీ

పార్టీ ఆవిర్భావ వేడుకలను యిండ్లలోనే జరుపుకోవాలి-ఉమ్మడి నల్గొండ జిల్లా లీడర్, క్యాడర్ కు మంత్రి జగదీష్ రెడ్డీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం వేడుకలను లీడర్, క్యాడర్ వారి వారి యిండ్లలోనే జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరి ఇండ్ల మీద వారే జెండా ఆవిష్కరించు కోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రబలడంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఈ రకంగా జరుపుకోవాలని అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారని అందుకు అనుగుణంగానే మనం జరుపుకోవాలని కోరారు. కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ వీరోచితంగా పోరాడుతున్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో పాలు పంచుకునే లీడర్, క్యాడర్,ప్రజాప్రతినిధులు విధిగా బౌతిక దూరం పాటించాలని మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు. కరోనా మహమ్మారి పై జరుగుతున్న యుద్ధం లో జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకత ఉందని అందుకు గులాబీ శ్రేణులు సన్నద్ధం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.  నల్గొండలో నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయంలో జరుగుతున్న పార్టీ ఆవిర్భావ ది...

తెలంగాణ కరోనా హెల్త్ బులిటిన్ - ఏప్రిల్ 25

Image
  కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ తెలంగాణలో ఇవాళ కొత్తగా  7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..  ఇప్పటి వరకు 25 మంది మృతి  307  మంది  కోలుకుని డిశ్చార్జి ఇప్పటి వరకు తెలంగాణా లో  990 కేసులు తెలంగాణా లో అక్టీవ్ కేసులు..658

నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచి వుంచుకోవచ్చు : ఎస్పీ రంగనాధ్

నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచి వుంచుకోవచ్చు : ఎస్పీ రంగనాధ్ జి.ఓ. 45 ప్రకారం అనుమతించబడిన దుకాణాలు అన్నీ సాయంత్రం 6.00 వరకు తెరిచి ఉంచే వెసులుబాటు ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలిగించవద్దని సూచన లాక్ డౌన్ నిబంధనల ప్రకారం అందరూ సహకరించాలి నల్లగొండ : లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.నెంబర్ 45 ప్రకారం అనుమతించబడిన నిత్యావసర సరుకుల దుకాణాలు, కిరాణా, పాల దుకాణాలు సాయంత్రం 6.00 గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు కల్పించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు. జిల్లాలో అనేక ప్రాంతాలలో మధ్యాహ్నం తర్వాత దుకాణాలు మూసివేస్తున్నారని దీనివల్ల ప్రజలు    ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జి.ఓ. 45లో సూచించిన దుకాణదారులంతా ఉదయం 6.00 నుండి సాయంత్రం 6.00 వరకు తెరిచి ఉంచే వెసులుబాటు కల్పించారని ఆయన చెప్పారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని, లాక్ డౌన్ లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించిందని, వ్యాపారులు పోలీసులతో సహకరిస్తూ లాక్ డౌన్ నిబంధనలు పాటించడంతో పాటు ప్రతి షాప్ వద్ద విధిగా సామా...

లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి - కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా

Image
లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి - కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా స్థానికంగా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు ప్రజలంతా తప్పనిసరిగా మాస్కు ధరించాలి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయించిన రంగాల్లో జాగ్రత్తలు పాటించాలి ఉపాధి హామీ పనులు, గ్రామీణ అభివృద్ధి పనులకు అనుమతి వ్యవసాయాధారిత పనులు ఆటంకం కలిగించవద్దు వలస కూలీల కనీస వసతులు కల్పించాలి కోవిడ్ 19 వైరస్ నివారణ, పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎస్ లు,జిల్లా కలెక్టర్ లు,ఎస్.పి.లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నల్గొండ, ఏప్రిల్ 25:  కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణ కొరకు చేపట్టిన లాక్ డౌన్ అమలు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు,జిల్లా కలెక్టర్ లు, ఎస్. పి.లకు సూచించారు. లాక్ డౌన్ అమలు తీరు పై తీసుకుంటున్న చర్యలపై ఆయన శనివారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు,జిల్లా కలెక్టర్ లు,ఎస్.పి.లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ప్రపంచంలోని అగ్ర రాజ్యాల సైతం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్...

ఏప్రిల్ 25 - AP కరోనా బులిటీన్ -

Image
ఏపీలో 1016కు చేరిన కరోనా పాజిటీవ్ కేసులు* గడిచిన 24గంటల్లో కొత్తగా 61 పాజిటీవ్ కేసులు నమోదు కృష్ణాజిల్లాలో మరింత విజృంభిస్తున కరోనా గడిచిన 24గంటల్లో కృష్ణ లో కొత్తగా 25 పాజిటీవ్ కేసులు నమోదు.జిల్లాలో మొత్తం 127కు చేరిన పాజిటీవ్ కేసులు. కృష్ణా జిల్లా ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

GMR పెట్రోలింగ్  డ్రైవర్   మృతి

GMR పెట్రోలింగ్  డ్రైవర్   మృతి మెదక్ జిల్లా:- నార్సింగి మండలం సంకాపూర్ చౌరస్తా వద్ద  పాల వ్యాన్  బోల్తా , GMR పెట్రోలింగ్ వెహికిల్ క్రేన్ సాయంతో వ్యాన్ ను  తీస్తుండగా, వెనక నుండి స్పీడ్ గా వస్తున్న మరో వ్యాన్ GMR పెట్రోలింగ్ వెహికల్ ను డి కొట్టగా పెట్రోలింగ్  డ్రైవర్  ప్రశాంత్ మృతి.

నల్గొండ   జిల్లా ఎప్రిల్ 24,   కరోనా బులిటెన్

Image
నల్గొండ   జిల్లా ఎప్రిల్ 24,   కరోనా బులిటెన్ నల్గొండ జిల్లా ఎప్రిల్ 24 కరోనా బులిటీన్ ను  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారు. ఈ రోజు కరోనా  పాజిటివ్ కేసులు రాలేదని  పేర్కొన్నారు.  ఈ రోజు వరకు మొత్తం 15 పాజిటివ్ కేసులు.