Posts

జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల బీమా కల్పించాలి- తెలంగాణ సీఎస్ కు తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ వినతి

Image
జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల బీమా కల్పించాలి- తెలంగాణ సీఎస్ కు తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ వినతి తెలంగాణలోని ప్రతి జర్నలిస్టుకూ రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవికుమార్, ప్రధాన కార్యదర్శి మేకల క్రుష్ణ కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కలిసి  వారు వినతిపత్రం సమర్పించారు. నానాటికీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి ఏ విధంగా అయితే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారో, అదేవిధంగా ప్రాణాలు సైతంగా ఫణంగా పెట్టి పనిచేస్తున్న జర్నలిస్టులకూ బీమాను వర్తింపజేయాలని మనవి చేశారు. ఇప్పటికే పలు రాష్ర్ట ప్రభుత్వాలు జర్నలిస్టులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయాన్ని  తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవికుమార్ గుర్తు చేశారు. అలాగే.. ఈ విపత్కర సమయంలో ప్రతి జర్నలిస్టు కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు. మరోవైపు..తెలంగాణలో పత్రికలు, చిన్న పత్రికలు, చానళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి వాటిని ఆదుకోవాలని  త...

ఏప్రిల్ 27- తెలంగాణ కరోనా బులిటీన్

Image
కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ. తెలంగాణలో ఇవాళ కొత్తగా  2   పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇవాళ 16 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం 332  మంది  కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణా లో  1003 కేసులు, తెలంగాణా లో అక్టీవ్ కేసులు 646,  ఇప్పటి వరకు 25 మంది మృతి. ఇవాళ  జిహెచ్ఎంసీ లో  రెండు కేసులు నమోదు అయ్యాయి.    

మాస్కులు, శానిటైజార్స్  లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు అందచేసిన ఫిషన్ ల్యాబ్స్ ఫౌండర్,ఎం.డి. NRI పో రెడ్డి కిషోర్ 

Image
మాస్కులు, శానిటైజార్స్  లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు అందచేసిన ఫిషన్ ల్యాబ్స్ ఫౌండర్,ఎం.డి. NRI పో రెడ్డి కిషోర్  నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఫిషన్ ల్యాబ్స్ ఫౌండర్,ఎం.డి. NRI పో రెడ్డి కిషోర్... కరోనా పై శ్రమిస్తున్న  వైద్య ఆరోగ్య, పోలీస్, జర్నలిస్టులకు  మాస్కులు, శానిటైజార్స్  ఉచితంగా పంపిణీ చేయుటకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్   రాహుల్ శర్మలకు సోమవారం అంద  చేశారు .

టిఆర్ఎస్  జెండాను ఎగురవేసిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంచనపల్లి రవీందర్ రావు

Image
టిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు టిఆర్ఎస్  జెండాను ఎగురవేసిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంచనపల్లి రవీందర్ రావు  

ఔదార్యం చాటుకున్న సుంకరి మల్లేష్ గౌడ్- అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి

Image
 ఔదార్యం చాటుకున్న సుంకరి మల్లేష్ గౌడ్- అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి కరోనా వైరస్ మీద రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న పోరాటానికి ఆర్ధికంగా మద్దతు తెలుపుతూ పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అందులో బాగంగా సోమవారం ఉదయం నల్గొండ లోని టి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి ని కలసి లక్షా 8 వేల చెక్ ను సీనియర్ టి ఆర్ యస్ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్ అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మరిని తరిమెందుకు చేస్తున్న ప్రయత్నాలకు తోడు మల్లేష్ గౌడ్ లాంటి నేతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆర్ధికంగా మద్దతు తెలపడం అభినంద నియమన్నారు. ఈ కార్యక్రమానికి నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మాజీ యం ఎల్ సి పూల రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 26, తెలంగాణ బులిటీన్

Image
  ఏప్రిల్ 26, తెలంగాణ బులిటీన్ కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ తెలంగాణలో ఇవాళ కొత్తగా  11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఇవాళ 9 మంది డిశ్చార్జి. ఇప్పటి వరకు 316  మంది  కోలుకుని డిశ్చార్జి. ఇప్పటి వరకు తెలంగాణా లో  1001 కేసులు. తెలంగాణా లో అక్టీవ్ కేసులు..660. ఇప్పటి వరకు 25 మంది మృతి.

సూర్యపేట జిల్లా కేంద్రంలో  మెడిసిన్స్ తో పాటు ఇటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు

Image
  సూర్యాపేట జిల్లా కేంద్రంలో  మెడిసిన్స్ తో పాటు ఇటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు  లాక్ డౌన్ పూర్తిగా అమలులో ఉన్న సూర్యపేట జిల్లా కేంద్రంలో అటు మెడిసిన్స్ తో పాటు ఇటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తాజా పరిణామాల పై ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక సమీక్ష నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పలు అంశాలపై సుదీర్ఘంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి భాస్కరన్ లతో పాటు అదనపు కలెక్టర్ సంజీవ్ రెడ్డి పి డి డి ఆర్ డి ఏ. కిరణ్ కుమార్ ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి, స్థానిక మున్సిపల్ కమిషనర్ రామంజూల్ రెడ్డి తదితరులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.గడిచిన నాలుగు రోజులుగా జరుగుతున్న పురోగతి తో పాటు లాక్ డౌన్ అమలులో బాగంగా కంటైన్మెంట్ జోన్ లుగా గుర్తించిన ప్రాంతాలను అధికారులు మ్యాప్ లతో సహా మంత్రి జగదీష్ రెడ్డి కి వివరించారు. ఎక్కడికక్కడ పటిష్టవంతమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.అన్నింటినీ సమీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లా...