Posts

ఐదుగురు యువతుల అరెస్టు

Image
 బ్రేకింగ్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమాజిగూడలో  బ్యూటీ అండ్ స్పాపై పోలీసుల దాడులు.. ఐదుగురు యువతులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు.

ప్రెస్ అకాడమీ నిధుల జమా ఖర్చులు, అక్రిడేషన్ల పై ఆర్టీఐ దరఖాస్తు సంధించిన సీనియర్ జర్నలిస్టు రూపారాణి కోనేరు

Image
 ప్రెస్ అకాడమీ నిధుల జమా ఖర్చులు, అక్రిడేషన్ల  పై ఆర్టీఐ దరఖాస్తు సంధించిన సీనియర్ జర్నలిస్టు రూపారాణి కోనేరు హైద్రాబాద్:  సమాచారహక్కు చట్టం పరిధిలో తెలంగాణ ప్రెస్ అకాడమీ నిధుల జమాఖర్చుల వివరాలు,  అక్రిడిటేషన్లు పొందినవారి వివరాలు. సంక్షేమ లబ్ది పొందినవారి వివరాలు కోరుతూ సీనియర్  జర్నలిస్టు రూపారాణి దరఖాస్తు చేశారు   తెలంగాణ ఏర్పడిన తరువాత పాత్రికేయుల సంక్షేమం కోసం 100 కోట్లు ప్రెస్ అకాడమీకి 8 ఏళ్ల క్రితం కేటాయించింది రాష్ట్రప్రభుత్వం. వాటిలో 16 కోట్లు ఖర్చు చేసినట్టుగా పెస్ అకాడమీ చైర్మన్ ప్రకటించారని. అలాగే 18 వేల మందికి అక్రిడిటేషన్లు ఇచ్చినట్టు, నాలుగువేల మందికి శికణ ఇచ్చినట్లు కూడా వెల్లడించారని, ఆయా వివరాలను కోరుతూ పారదర్శకత కోసం ఒక పాత్రికేయురాలిగా సమాచారం హక్కు చట్టం పరిధిలో 20 ప్రశ్నలతో  పాత్రికేయురాలు గా   దరఖాస్తును  పోస్టు ద్వారాను, మెయిల్ ద్వారా, స్వయంగా ఆఫీస్ కు వెళ్లి దరఖాస్తు అందచేయడం జరిగిందని యూట్యూబ్ లో  ( లింక్ ను టచ్ చేసి చూడొచ్చు)    https://youtu.be/7_nofsA1pag   ఓ వీడియో చేశారు.  ప్రజ...

జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి.....

Image
 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మహిళ అధికారిపై లైంగిక దాడి ...పరారీలో నిందితుడు......     ఆర్టీఏ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న మహిళ పై అదే డిపార్ట్మెంట్ లో హోమ్ గార్డు గా పని చేస్తున్న వ్యక్తి ఆమే పై లైంగిక వేధింపులు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం 2018 లో బదిలీపై ఖమ్మం కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ తనకు ఎవ్వరు పరిచయం లేకపోవడంతో అదే ఆర్టీ ఏ లో హోమ్ గార్డు గా పని చేస్తున్న స్వామి అనే వ్యక్తి ఆమెకు అన్నీ విధాలుగా సహాయం చేశాడు.అప్పటి నుంచి ఆమే నమ్మకాన్ని ,ఆమే కుటుంబ సభ్యులకు దగ్గర అయ్యాడు. బాధితురాలు తన భర్త తో వచ్చిన మనస్పర్థల కారణంగా భర్త నుంచి దూరంగా ఉంటుంది. ఆమెకు సంభందించిన వ్యక్తి గత విషయాలను తెలుసుకున్నాడు .కాగా ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని  ఆమెకు మాయమాటలు చెప్పి ఆమే ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఆమే కు జ్యుస్ లో మత్తు మందు ఇచ్చి ఆమే పై అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాన్ని తన మొబైల్లో చిత్రీకరించి వాటి ని ఇతరులకు చూపిస్తాను అని చెప్పి ఆమెను బయ బ్రాంతులకు గురి చేశాడు.వీడియోల ను బూచి గా చూపి ఆమే వద్ద నుంచి లక్షలు వసూలు ...

బీజేఆర్ నగర్‌ ప్రభుత్వ పాఠశాలను దుస్థితిఫై ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ఫైర్

Image
 బీజేఆర్ నగర్‌ ప్రభుత్వ పాఠశాలను దుస్థితిఫై ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ఫైర్ హైదరాబాద్, జులై 25: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బీజేఆర్ నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గత 15 రోజులుగా వరద ముంపుకు గురైంది. వందలాది మంది విద్యార్థులు చదువుకునే ఈ పాఠశాల లో మోకాల్లోతు నీరు వచ్చి చేరిన.. ఒక్కసారి కూడా అధికారులెవరూ వచ్చిపాఠశాలలో ఉన్న నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకపోవడం పట్ల ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. పాఠశాలలోని గదులతో సహా ఆవరణ మొత్తం మోకాల్లోతు నీటితో నిండిపోయింది. ఇంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నప్పటికీ దీనిని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మరియు విద్యాశాఖ అధికారులపై పట్టించుకోకపోవడం ఫై  డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కనీసం సొయా ఉందా అని ప్రశ్నించారు. మీ నియోజకవర్గం లో గత రెండువారాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా నీరు ఉంటె మీరు ఏంచేస్తున్నారు..? పంపులు పెట్టించి ఈ వాటర్ ను తీసేయొచ్చు..ఒకవేళ నాలా ఔట్లెట్ లేకపోతే.. దానిని ఏర్పటు చేయొచ్చు.. GHMC అధికారులుకానీ , స్థానిక నేతలు కానీ , విద...

వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్ అధ్యక్షులుగా నూకల జైపాల్ రెడ్డి

Image
 నల్గొండ:  వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్  అధ్యక్షులుగా   నూకల జైపాల్ రెడ్డి ఎన్నికైనారు. ఎన్నికైన నూతన  అధ్యక్షుడు కి మరియు వారి కార్యవర్గ సభ్యులకు కాలనీవాసులు  హార్దిక శుభాకాంక్షలు

ప్రముఖ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ కన్ను మూత

Image
  ఆమనగల్లు: ప్రముఖ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఆయన్ను కడ్తాల్‌ మహేశ్వర పిరమిడ్‌కు తరలించారు. ఆదివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం 5గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పిరమిడ్‌ ధ్యాన్‌ ట్రస్టు సభ్యులు తెలిపారు.

ప్రముఖ అడ్వకేట్, ఆర్టీఐ ట్రైనర్ కె.ఎన్. సాయికుమార్ పిల్ తో తెలంగాణ లో వన్ టైం యుస్డ్ ప్లాస్టిక్ నిషేధం

Image
 ప్రముఖ అడ్వకేట్, ఆర్టీఐ ట్రైనర్ కె.ఎన్. సాయికుమార్  పిల్ తో  తెలంగాణ లో వన్ టైం యుస్డ్ ప్లాస్టిక్ నిషేధం హైదరాబాద్: 2016 లో  కేంద్ర  ప్రభుత్వం ఫ్లెక్సీ బ్యానర్లు మరియు వన్ టైం యుస్డ్ ప్లాస్టిక్ వాడకము పై , తయారీ పై నిషేధం విధించింది. అట్టి నిషేధం  తెలంగాణలో అమలు కాకపోడంతో ప్రముఖ అడ్వకేట్, ఆర్టీఐ ట్రైనర్ కె.ఎన్. సాయికుమార్ 2020లో తెలంగాణ హైకోర్టులో నిషేధం అమలు పరచాలని పిల్ దాఖలు చేశానని తెలిపారు. .  ఈ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు   జూన్ లో రెండు వారాల్లో  తీసుకున్న   చర్యలు  కోర్టు కు తెలపాలని    ప్రభుత్వాన్నీ అదేశించింది.  దీంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం  జులై 1 నుండి  నిషేధం విధిస్తూ జీవో 40 ని విడుదల చేసినట్లు తెలిపింది.