Posts

TJU ఆధ్వర్యంలో విశ్వకర్మ జర్నలిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణకి ఘన సన్మానం.

Image
 తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జర్నలిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణకి ఘన సన్మానం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో శనివారం రోజున విశ్వకర్మ జర్నలిస్టు సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మా ఆత్మీయ మిత్రుడు సీనియర్ జర్నలిస్టు పి లక్ష్మీనారాయణ మరియు జిల్లా ఉపాధ్యక్షులు కూరెళ్ళ మల్లేష్ కీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ శానూర్ బాబా  అనంతరం వారు మాట్లాడుతూ విశ్వకర్మ జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయాలని ప్రభుత్వ నుండి రావాల్సిన పథకాల ద్వారా స్కీముల ద్వారా విశ్వకర్మ జర్నలిస్టులకు అందించే విధంగా కృషి చేయాలని కోరారు.  విశ్వకర్మ జర్నలిస్టులకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, సీనియర్ జర్నలిస్టు దాత్రాక్ దయాకర్ , జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టిగప్పుల శ్రీనివాస్ టీ జే యూ సభ్యులు గడ్డమీ సత్యనా...

మేడే ను జయప్రదం చేయండి*. పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ కార్యదర్శి పిలుపు,

Image
*మేడే ను జయప్రదం చేయండి*.  పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ కార్యదర్శి పిలుపు,  ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చారు. 138వ మేడే దినోత్సవం సందర్బంగా ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా కార్యలయం లో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక పండుగగా మే డేని భావిస్తారని మే 1వ తేదీన అంతర్జాతీయంగా దాదాపు 180 దేశాలు మేడే దినోత్సవాన్ని జరుపుకుంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 1886 వ సంవత్సరంలో పని గంటల కొరకు చికాగోలో మొదలైన పోరాటంలో కార్మికుల రక్తం నుండి ఉద్భవించిందే ఎర్రజెండా అన్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇతర కార్మిక సంఘాలు వారి వారి జండాలను సృష్టించుకున్నారని కేవలం ఎర్రజెండా మాత్రం కార్మికుల రక్తం నుంచి ఉద్భవించిందన్నారు. భారతదేశంలోకి మొదటిసారిగా ఏఐటీయూసీ ద్వారానే ఎర్రజెండా వచ్చిందన్నారు. 104 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఏకైక సంఘం ఏఐటీయూసీ నే అని ఆయన కొనియాడారు. భారతదేశంలో మొదటిసారిగా ఏఐటీయూసీ నాయకులు, కమ్యూనిస్టు నేత సింగారవేలి శెట్టి ...

ఈ నెల 28న వామ్ ఆల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు

Image
  వామ్ ఆల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో 1000 మందికి ఉచిత భోజనాలు ఈ నెల 28న మధ్యాహ్నం ఒంటి గంటకు ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ అడ్వైజర్ మరియు నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విటల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ గా కౌటికె విటల్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, కార్యక్రమము సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర నిర్వహించబడుతున్నట్లు ఆయన  తెలిపారు.

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఎక్కువ పోలింగ్ అయ్యేవిధంగా చూడాలి-

Image
       లోకసభ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఎక్కువ పోలింగ్ అయ్యేవిధంగా చూడాలని లోకసభ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ ర్రావు సూర్యవంశి అన్నారు.      శనివారం ఆయన నల్గొండ పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కేషరాజుపల్లి, తిప్పర్తి, మాడుగుల పల్లి, కుక్కడం, వేములపల్లి తదితర మండలాలు, గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి కనీస సౌకర్యాలను ,ఇతర అంశాలను పరిశీలించారు.          అనంతరం మిర్యాలగూడలోని లోకసభ ఎన్నికల పంపిణీ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూము తనిఖీ చేశారు.      ఆయా పోలింగ్ కేంద్రాల సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకసభ ఎన్నికల సందర్భంగా ఎక్కువ పోలింగ్ అయ్యేవిధంగా చూడాలని ,ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ చిట్టిలను పంపిణీ చేయాలని, అదే సమయంలో పోలింగ్ తేదీని సైతం తెలియజేయాలని సూచించారు.          మిర్యాలగూడ ఆర్డిఓ శ్రీనివాసరావు, తహసిల్దార్ హరిబాబు ,ఆయా మండలాల తహసిల్దార్లు ఉన్నారు. ____________________________...

నల్గొండలో 25 మంది నామినేషన్లు తిరస్కరణ

Image
  శుక్రవారం నల్గొండ లోక్ సభ ఎన్నికల నామినేషన్ల పరిశీలన అనంతరం( 25) మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా (31) మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగింది.  అంగీకరించిన నామినేషన్ల అభ్యర్థుల వివరాలు

అలీన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం..

Image
  షాద్నగర్.. అలిన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం..  ఫార్మా కంపెనీలో భారీగా చెలరేగిన మంటలు..  రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది..  అగ్నిప్రమాదం సమయంలో కంపెనీలో 300 మంది కార్మికులు..  కంపెనీలో చిక్కుకుపోయిన దాదాపు 50 మంది కార్మికులు.. మంటలు వేడి తాళలేక బిల్డింగ్ పైనుంచి దూకిన నలుగురు కార్మికులు..  లోపల ఉన్నవారిని బయటకు తెచ్చే ప్రయత్నం..   తమను కాపాడాలంటూ కార్మికులు ఆర్ధ నాదాలు..  కార్మికులను బయటకు రప్పిస్తున్న ఫైర్ సిబ్బంది..  నిచ్చెన ద్వారా కంపెనీ నుంచి బయటికి వస్తున్న కార్మికులు..  ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారా అనేదానిపై అధికారులు ఆరా..  మంటలు దాటికి చుట్టుపక్కల వ్యాపించిన పొగ .. పొగతో ఉక్కిరి బిక్కరవుతున్న సానికులు.. *50 మంది కాపాడినబాలుడు*  షాద్నగర్ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడి సాహసం 50 మంది ప్రాణాలను నిలబెట్టింది. స్థానికంగా నివసించే సాయిచరణ్ అనే బాలుడు మంటలను గమనించి భవనం పైకెక్కి తాడు కట్టాడు. ఆ తాడు సహాయంతో బిల్డింగ్ లోని కార్మికులు కిందకు దిగారు. లేదంటే వారందరూ అక్కడే సజీవదహనమయ్యేవారు. కాగా వెల్డింగ్ పనుల వల్లే అ...

మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

Image
        లోక సభ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని, సోషల్ మీడియా, సువిధ, ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ కంట్రోల్ రూమ్ , సి విజిల్ తదితర విభాగాలను జిల్లాకు నియమించబడిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, ఎన్నికల వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్, పోలీస్ పరిశీలకులు అమోగ్ జీవన్ గాంకర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ,సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు.       ఈ సందర్భంగా వారు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ప్రకటనల గుర్తింపు, పెయిడ్ న్యూస్ స్కానింగ్, రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తదితర రిజిస్టర్ లను తనిఖీ చేశారు.       అనంతరం సోషల్ మీడియా విభాగాన్ని సందర్శించి సోషల్ మీడియా పోస్టింగ్ లను పరిశీలన చేశారు. ఆ తర్వాత సువిధ ద్వారా ఇచ్చే అనుమతులు, సి-విజిల్ యాప్ కు వచ్చిన...