పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి *సనత్ నగర్ (ఎర్రగడ్డ)* *పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* * ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం కృషి చేస్తుంది. * యేడాది కాలంలో దాదాపు 1500 కోట్ల ఎల్వోసీలు, సీఎంఆర్ఎఫ్ లకు చెల్లించాం. * ఆరోగ్యశ్రీని పటిష్ట పరిచి పది లక్షలకు పెంచాం * పేదవారు కార్పోరేట్లకు పోయి చికిత్స తీసుకొని అప్పులపాలు కాకుండా ఉండేల టిమ్స్ ల నిర్మాణం * మాది స్కీంల ప్రభుత్వం – బీఆర్ఎస్ స్కాంల పార్టీ * మా టాప్ ప్రయార్టీ పేద ప్రజల సంక్షేమమే * *సనత్ నగర్ (ఎర్రగడ్డ) టిమ్స్ నిర్మాణ పనుల పరిశీనానంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు* పేద ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సనత్ నగర్ (ఎర్రగడ్డ)లోని టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం రోజున గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సనత్ నగర్ (ఎర్రగడ్డ...