ఆర్య వైశ్యులకు అమరవాది లక్ష్మీనారాయణ క్షమాపణ చెప్పాలి

ఆర్య వైశ్యులకు అమరవాది లక్ష్మీనారాయణ క్షమాపణ చెప్పాలి - ఆర్య వైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సముద్రాల రమేష్ గుప్తా ధర్మపురి, (గూఢచారి), మార్చి 07 : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ తెలంగాణ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్తా డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండల కేంద్రం లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ సభ వేదికలో అమరవాది మాట్లాడుతూ ఆర్యవైశ్యులను ఉద్దేశించి పని పాట లేని కొంతమంది వెధవలు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొనడం సరైంది కాదన్నారు. అయ్యా అమరవాధి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగిన మీరు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక కూడా మీకు మీరే అధ్యక్షుడిగా ప్రకటించుకొని 10 సంవత్సరాలు కొనసాగావు. అయ్యా మీ సేవలు మా ఆర్యవైశ్యులకు ఇక చాలు, మీకు సెలవు, అని యావత్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులంతా ముక్తకంఠంతో మీ...