Posts

ACB వలలో TGSPDCL ఆర్టిజన్, Gr-IV,

Image
  ACB వలలో TGSPDCL  ఆర్టిజన్, Gr-IV,   హైద్రాబాద్,(గూఢచారి):   అబ్దుల్ రెహమాన్, ఆర్టిజన్, Gr-IV, TGSPDCL, మంగళ్ హట్ డివిజన్, హైదరాబాద్ లోని పాత మీటర్ లో దొరికిన నష్టాన్ని బయటపెట్టకుండా, పెనాల్టీ లేకుండా నిర్వహించాలని అధికారిక మద్దతు తెలిపినందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.20,000/- లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి స్వీకరించినందుకు తెలంగాణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. *అవినీతి జరుగుతుందని తెలిసినా.. లేదా మిమ్మల్ని ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాలలో పని చేయడానికి లంచం అడిగినా..*   *ACB డిపార్టుమెంట్ నెంబర్లను సంప్రదించగలరు.*  *తెలంగాణ రాష్ట్ర ఏసీబీ కాంటాక్ట్ నెంబర్స్:* ACB Whats App: 9440446106 Toll free Number: 1064 Head Quarters: 04023251501. 1. Hyderabad City Range-I: 040-24617291 9440446109. 2. Hyderabad City Range-II: 040-24617408 9440446134. 3. Ranga Reddy Range: 040-24610142 9440446140. 4. Mahabub Nagar Range: 08542-242733 9491305609. 5. Nalgonda Range: 08682-225681 7382625525. 6. Warangal Range: 0870-2577510 9440446146. 7. Karimnagar Range: 0878-2243693...

యాంత్రికరణ లో ఎటువంటి రాజకీయం సంబంధాలు, లేకుండా మహిళా రైతులకి న్యాయం చేయాలని వినతి

Image
  యాంత్రికరణ లో ఎటువంటి రాజకీయం సంబంధాలు, లేకుండా మహిళా రైతులకి న్యాయం చేయాలని వినతి హైద్రాబాద్ , గూఢచారి: *SMAM* (Sub-Mission on Agriculture Mechanization) లో మహిళా రైతులకి వ్యవసాయ యాంత్రికరణ లో ఎటువంటి రాజకీయం సంబంధాలు, పైరవీలు, లేకుండా నిరుపేద అర్హులైన రైతులకి న్యాయం చేయాలని కోరుతూ వ్యవసాయ కమీషనర్ గోపి కి నల్గొండ జిల్లా bjym ఉపాధ్యక్షులు నేరెళ్ళ అజయ్ వినతి పత్రం సమర్పించాడు. రైతు వేదిక నిర్వహణ వాటికి సంబంధించిన కూడా వీలైనంత తొందరగా బిల్లు మంజూరు చేసి AEO లపై భారం పడకుండా చూడాలని, Soil-Sample 2018-19కి సంబంధించిన బిల్లు విడుదల చేయలని అయన కోరారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన DCS {Digital Crop Survey} కూడా ప్రైవేట్ ఏజెన్సీ వారికి ఇవ్వాలని నిరుద్యోగులకి ఉపాధి కలుగుతుందని కోరినట్లు అయనవతెలిపారు.  జిల్లా వ్యవసాయ శాఖ కి సంబంధించిన వ్యవసాయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ తోటి చర్చించడం జరిగిందని తెలిపారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని ఇస్తుంది

Image
 నల్గొండ జిల్లా: గూఢచారి: భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని ఇస్తున్నదని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ అన్నారు.     గురువారం అయన నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని గుండ్లపల్లి మండలకేంద్రం డిండి లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ప్రారంభించారు.      సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక కార్యక్రమని ఆయన అన్నారు .ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం పథకంలో అనేక లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా ఈ బియ్యం 90 శాతం రీసైక్లింగ్ అవుతున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో లేనివిధంగా సన్నబియాన్ని రేషన్ షాపుల ద్వారా ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రైతులు పండించిన సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతున్నదని, అందువలన రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని ఆయన కోరారు. ఏదుల రిజర్వాయర్ నుండి చేపట్టిన దింది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని ఆయన తెలిపారు.       ...

ACB వలలో TGSPDCL AE

Image
  ACB వలలో TGSPDCL  AE హైదరాబాద్, గూఢచారి: 11 KV లైన్ షిఫ్ట్ చేయడానికి మరియు కేబుల్ వేయడానికి వర్క్ ఎస్టిమేషన్ అందించడానికి అధికారిక అనుకూలంగా చూపినందుకు ఫిర్యాదుదారుని నుండి 30,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు TGSPDCL, జీడిమెట్ల డివిజన్,A.E., S. సురేందర్ రెడ్డి, తెలంగాణ ACB అధికారులకు పట్టుబడ్డారు.

హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం

Image
  🔥🔥 హైదరాబాద్ MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం ట్రైన్‌లో నుండి దూకేసిన యువతి.. తీవ్రగాయాలు అవ్వడంతో గాంధీ ఆసుపత్రికి తరలింపు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా కొంపల్లి వద్ద యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడు బోగీలో యువతి ఒక్కరే ఉండటంతో అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడు

దాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Image
  దాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ:  నల్లగొండ జిల్లాలోని పానగల్లు గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభం చేసిన రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని మద్దతు ధర పొందాలని కోరారు. ధాన్యంలో తరుగు పేరుతో కోతలు లేకుండా చివరి గింజవరకు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ చిన్న సమస్య తలెత్తినా రైతుకు అండగా ప్రభుత్వం ఉంటుంద న్నారు.

“నీటిని రక్షించడం మన బాధ్యత” - ఘనంగా లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్ లో ప్రపంచ జల దినోత్సవం

Image
  “ “నీటిని రక్షించడం మన బాధ్యత”  -  ఘనంగా లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్ లో   ప్రపంచ జల దినోత్సవం హైద్రాబాద్:   దిల్షుఖ్ నగర్ లోని లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్ లో ప్రపంచ జల దినోత్సవం జరుపుకున్నారు.  “నీటిని రక్షించడం మన బాధ్యత”  నీటి సంరక్షణ ప్రాముఖ్యత మరియు నీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి అవగాహన పై కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు అతిథులు హాజరయ్యారు. తన ప్రసంగంలో, ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. నాగేశ్వరరావు TGPCB ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుకోవడంలో నీటి పాత్ర మరియు పరిరక్షణ అవసరాన్ని వివరించారు. "జీవితానికి నీరు చాలా అవసరం, మరియు భవిష్యత్ తరాల కోసం దానిని సంరక్షించడం మన బాధ్యత" అని ఆయన అన్నారు. నీటి కాలుష్యాన్ని తగ్గించడం, నీటి వనరులను రక్షించడం మరియు వర్షపు నీటి సేకరణ, నీటి శుద్ధి మరియు రీసైక్లింగ్ మరియు చెట్ల పెంపకం వంటి నీటి-సమర్థవంతమైన పద్ధతులను ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రాజెక్ట్ ఆఫీసర్ హైలైట్ చేశారు. ప్రపంచ నీటి వనరులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమిష్టి చర్య యొక్క అవసరాన్ని ఆయన...