జర్నలిస్టుల సమస్యలపై డబ్ల్యూ జే ఐ పోరాటం
*జర్నలిస్టుల సమస్యలపై డబ్ల్యూ జే ఐ పోరాటం* నల్గొండ, గూఢచారి:: పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ దేశాయ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. నల్లగొండ జిల్లా కేంద్రం లో జరిగిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్న అక్రిడేషన్లు వెంటనే ఇచ్చే విధివిధానాలను ప్రకటించి అర్హులైన వారందరికీ ఇవ్వాలని అన్నారు... జర్నలిస్టులు సంక్షేమంలో భాగంగా అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఆసుపత్రులలో ఉచిత చికిత్స, తదితర అంశాలతో పాటు పాత్రికేయుల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైళ్లు, విమానాల టికెట్లలో జర్నలిస్టులకు రాయితీ ఇవ్వాలని, టోల్ ఛార్జీల మినహాయింపు ఇవ్వాలని తాము పోరాడుతున్నట్లు తెలిపారు. తమ వృత్తిలో భాగంగా జర్నలిస్టులు నిష్పక్షపాతంగా ఉంటేనే సమాజంలో వారిపట్ల గౌరవం పెరుగుతుందనీ, వారు దేశహితం కోసమే పని చేయాలని సూచించారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ...