Posts

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపల్ ఆఫీస్‌లో ఏసీబీ సర్‌ప్రైజ్ తనిఖీ

Image
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపల్ ఆఫీస్‌లో ఏసీబీ సర్‌ప్రైజ్  తనిఖీ గూఢచారి, కరీంనగర్, డిసెంబర్ 30:  29.12.2025న, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ కరీంనగర్ రేంజ్ యూనిట్ ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. పరిపాలనా రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, చట్టబద్ధమైన రిజిస్టర్లు, పెండింగ్ దరఖాస్తులు మరియు మున్సిపల్ కార్యాలయం యొక్క మొత్తం పనితీరును ధృవీకరించడానికి ఏసీబీ బృందానికి ఆడిట్ మరియు సాంకేతిక సిబ్బందితో సహా సంబంధిత విభాగాల అధికారులు సహాయం చేశారు. జమ్మికుంటలోని మునిసిపాలిటీ కార్యాలయంలో జరిగిన ఆకస్మిక తనిఖీలో, అనేక అవకతవకలు గుర్తించబడ్డాయి, వాటిలో రిజిస్టర్లు మరియు రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం; పరిమిత తిరస్కరణలతో ఆస్తి పన్ను స్వీయ-అంచనాలకు అసాధారణంగా అధిక ఆమోదం, తగినంత పరిశీలన జరగలేదని సూచిస్తుంది; ₹41,170 విలువైన లెక్కల్లో లేని నగదు రికవరీ మరియు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఖాతాలో లెక్కించని ఫోన్ పే లావాదేవీలు గమనించబడ్డాయి, ఇది ఆర్థిక అవకతవకలను సూచిస్తుంది; సరైన భౌతిక లేదా ధృవీకరించదగిన ఆన్‌లైన్ రికార్డులు లేకుండా 246 ఎలర్ఎస్  మరియు భవన...

పర్యాటక రంగంలో నూతన ఒరవడి రావాలి-మంత్రి జూప‌ల్లి

Image
 *పర్యాటక రంగంలో నూతన ఒరవడి రావాలి* *ప‌ర్యాట‌క అద్భుతాలను ప్రపంచానికి చూపండి* *తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుదాం* *వినూత్న ఆవిష్కరణలతో పర్యాటకులను ఆకర్షించాలి* *వసతులు, హాస్పిటాలిటీలో రాజీ పడొద్దు* *టూరిజం అండ్ ఇట్స్ విజన్ – 2026” వర్క్‌షాప్‌లో అధికారులకు మంత్రి జూప‌ల్లి దిశానిర్దేశం* హైదరాబాద్, డిసెంబ‌ర్ 30: తెలంగాణ పర్యాటక రంగం దేశానికే దిక్సూచిగా మారాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటకులను ఆకర్షించేలా వినూత్న మార్పులు తీసుకురావాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మంగళవారం తారామతి బరాదరిలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026’ మేధోమథన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టి.జీ.టి.డి.సి రూపొందించిన ‘టేబుల్ క్యాలెండర్‌’ -2026 ను ఆవిష్కరించారు.   ఈ సదస్సులో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎండీ క్రాంతి వల్లూరు, నిథమ్ డైరెక్టర్ వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావు,...

టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ప్రదీప్ కుమార్

Image
 టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ప్రదీప్ కుమార్ హైద్రాబాద్, గూఢచారి: GHMCలో అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బి. ప్రదీప్ కుమార్ కు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 950 జారీచేసింది. ఈయనతో పాటు మరో ముగ్గురికి ఎమ్. భవానీ రాణి, బీఎస్. చంద్రిక, బి. వెంకన్న లకు పదోన్నతులు కల్పించి నట్లు జీవో లో పేర్కొన్నారు. 

చెన్నైలో ఘనంగా IFWJ 79వ కార్యవర్గ–జాతీయ సమావేశం

Image
 చెన్నైలో ఘనంగా IFWJ 79వ కార్యవర్గ–జాతీయ సమావేశం దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై విస్తృత చర్చ భారత్ జయహో హైదరాబాద్ డిసెంబర్ 27 ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ) ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన 79వ కార్యవర్గ–జాతీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ జాతీయ స్థాయి సమావేశానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య అధ్యక్షత వహించారు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జర్నలిస్టుల అక్రిడేషన్ విధానం, పత్రికా స్వేచ్ఛపై పెరుగుతున్న ఆంక్షలు, మీడియాపై జరుగుతున్న దాడులు, జర్నలిస్టుల భద్రత, సంక్షేమ పథకాలు వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, వారి రక్షణకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని వక్తలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ డబ్ల్యూ జి సెక్రటరీ జనరల్ పరమానంద్ పాండే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికా స్వేచ్ఛే బలమైన పునాది అని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కులను కాపాడటం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. జర్...

కిషన్ నాయక్‌పై ఏసీబీ కేసు నమోదు

కిషన్ నాయక్‌పై ఏసీబీ కేసు నమోదు  మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కిషన్ నాయక్‌కు సంబంధించిన ఆస్తులపై హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కిషన్ నాయక్ గతంలో పనిచేసిన పాపారావుకు సన్నిహితుడిగా, ప్రధాన శిష్యుడిగా గుర్తింపు ఉన్నట్లు సమాచారం.

*డీలిమిటేషన్‌పై ఫైనల్ నోటిఫికేషన్.. 12 జోన్లు, 60 సర్కిల్స్‌ 300 వార్డులు*

Image
 *డీలిమిటేషన్‌పై ఫైనల్ నోటిఫికేషన్.. 12 జోన్లు, 60 సర్కిల్స్‌ 300 వార్డులు*

సర్కార్ వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఐఏఎస్‌లు..

Image
 సర్కార్ వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఐఏఎస్‌లు..   ప్రభుత్వ హాస్పిటల్స్ కు క్యూ కడుతున్న ఆఫీసర్లు తాజాగా గాంధీలో ప్రసవించిన ఐఏఎస్ అధికారి గౌతమ్ సతీమణి తల్లీబిడ్డ క్షేమం.. విజయవంతంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ శోభ బృందం మొన్న శ్రీహర్ష, నిన్న పమేలా సత్పతి.. నేడు గౌతమ్.. మారుతున్న సీన్ అధికారుల రాకతో సామాన్య ప్రజల్లో సర్కార్ వైద్యంపై పెరుగుతున్న ధీమా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. ఒకప్పుడు ప్రభుత్వ హస్పిటల్ అంటేనే భయపడే పరిస్థితి నుంచి, నేడు రాష్ట్రంలోని అత్యున్నత స్థాయి అధికారులే క్యూ కట్టే స్థాయికి సర్కార్ వైద్యం ఎదిగింది. ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లే స్థోమత ఉన్నప్పటికీ, ప్రభుత్వ డాక్టర్ల నైపుణ్యంపై భరోసాతో ఐఏఎస్‌లు తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే చికిత్స చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గాంధీలో ఐఏఎస్ గౌతమ్ సతీమణి...  ఐఏఎస్ అధికారి గౌతమ్ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ను ఎంచుకున్నారు. తన భార్య ప్రసవం నిమిత్తం ఆమెను గాంధీ హాస్పిటల్ లో చేర్పించ...