Posts

ఇంటి స్థలం కోసమే నా పోరాటం - టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి

Image
  *నీ ఇంటి స్థలం కోసమే నా పోరాటం..* *టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి* *ఇండ్ల జాగాల ఉద్యమం లో సంఘాలన్నీ కలిసి రావాలి* *గణతంత్ర వేడుక దినోత్సవ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు* ఖమ్మం, జనవరి 24 : జర్నలిస్టుల ఇంటి జాగా సాధించే వరకు తమ ఉద్యమం ఆగదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి స్పష్టం చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో టిడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ సన్నాహ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని అన్నారు. అవసరమైతే ఉద్యమాన్ని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జర్నలిస్టుల ఇంటి జాగాల విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఇకపై సహించేది లేదని ఆయన హెచ్చరించారు. జర్నలిస్టుల కుటుంబాలకు భద్రత, గౌరవం కల్పించే వరకు టిడబ్ల్యూజేఎఫ్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి అదనపు సభ్యుల నియామకం చేపట్టారు. అనంతరం ...

హైదరాబాద్ నుమైష్ -2026లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్

Image
  హైదరాబాద్ నుమైష్ -2026లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్  హైదరాబాద్, గూఢచారి:  ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమైష్ -2026)లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్ – కాలుష్య నియంత్రణ పై ప్రజల్లో అవగాహన. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ప్రదర్శన స్టాల్ను ఏర్పాటు చేసింది. ఈ స్టాల్లో మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు, పరిశ్రమల వల్ల కలిగే జల కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఈ-వ్యర్థాల (ఈ-వేస్ట్) నిర్వహణ, కాలుష్యం వలన పర్యవరణానికి కలిగే హాని పై సమాచారం అందించారు. వివిధ రకాల పోస్టర్లు ప్రదర్శనల ద్వారా కాలుష్యానికి కారణాలు, దుష్పరిణామాలు మరియు నియంత్రణ చర్యలపై సందర్శకులకు అవగాహన కల్పించారు. “పంటల మిగులు అవశేషాలను (స్టబ్బుల్) కాల్చడం భారతదేశంలో గాలి కాలుష్యాన్ని పెంచుతున్న ప్రధాన సమస్యగా మారింది. పంటల స్టబ్బుల్ను వెర్మీకంపోస్ట్గా మార్చాలి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వినియోగాన్ని ప్రోత్సహించాలి మరియు 15 సంవత్సరాలకు మించిన పాత వాహనాలను ఎలక్ట్రిక్...

శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి నిర్వహణ అభివృద్ధి కమిటీ నుండి తప్పుకున్న గుబ్బ శ్రీనివాస్

Image
  శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి నిర్వహణ అభివృద్ధి కమిటీ నుండి తప్పుకున్న గుబ్బ శ్రీనివాస్ నల్గొండ:  నల్లగొండ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మంగారీ గుట్ట నిర్వహణ అభివృద్ధి కమిటీ (రిజిస్టర్) మెంబర్గా శ్రీ చింతా హరిప్రసాద్ నన్ను నియమించారనీ ఆయన కీర్తి శేషులు అయినారని, నాకు కొన్ని వ్యక్తిగత కారణముల కమిటినుండి తప్పుకొను చున్నాని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుబ్బ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నేటినుండి పైన తెలిపిన కమిటీకి నాకు ఎటువంటి సంబంధములు ఉండవని పత్రికా ముఖంగా తెలియ చేయు చున్నానని ఆయన తెలిపారు.

గ్యాస్ ఎజెన్సీ రద్దు కు ఒక్క ఫిర్యాదు చాలు - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్

Image
 గ్యాస్ ఎజెన్సీ రద్దు కు ఒక్క ఫిర్యాదు చాలు -  పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్  గ్యాస్ సిలిండర్ సరఫరాలో అక్రమాలు ఉపేక్షించే ప్రసక్తే లేదని,గ్యాస్ డెలివరీ బాయ్ ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల కు అధిక వసూళ్లపై కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేయగా.. శనివారం నాడు గ్యాస్ సరఫరా చేసే బండ్ల ను  తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీకి అక్రమంగా అధికంగా వసూలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. గ్యాస్ బండల సరఫరాలో కొందరు డెలివరీ బాయ్ లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదు లు వస్తున్నాయన్నారు. అక్రమ వసూళ్ల కు పాల్పడే వారిపై ఒక్కరు ఫిర్యాదు చేసినా చాలు అని రఘునందన్ సూచించారు. గ్యాస్ కు రశిదు కూడా ఇవ్వటం లేదన్న ఫిర్యాదులు అధికంగా ఉన్నాయని ఆక్షేపించారు. గ్యాస్ ఎజెన్సీ అనుమతి రద్దు కు ఒక్క ఫిర్యాదు చాలు అని హెచ్చరించారు. వినియోగదారుల ను వి ఐ పి లు గా పరిగణించాలని సూచించారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా*

   *తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా*

జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు - టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ

Image
 జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు - టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ   పోలీసులు సంయమనం పాటించాలి! పండుగనాడు భయభ్రాంతులకు గురి చేయడం తగదు! తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి! టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ సంగారెడ్డి:   ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్‌లను పోలీసులు అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకోవడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే(ఐజేయు) తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ పేర్కొన్నారు.విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను నేరస్తుల మాదిరిగా అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయడం పత్రికా స్వేచ్ఛను నొక్కివేయడమే అని వారు అన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధ మని పేర్కొన్నారు. జర్నలిస్టులపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడం ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి తగదు. అని అన్నారు.ఏదైనా అంశంపై వివరణ కోరాల్సి ఉంటే చట్టబద్ధమైన పద్ధతుల్లో నోటీసులు ఇవ్వాలి తప్ప, ...

గూఢచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.

Image
  గూఢచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.    హైద్రాబాద్, 13, జనవరి: గూడచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను నాగోల్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు తాజా వార్తలను భూపతి టైమ్స్, గూఢచారి అందిస్తున్నాయని అన్నారు. ఆవిష్కరణ లో ఎడిటర్ భూపతి రాజు ఉన్నారు. పత్రికల అభివృద్ధి కి సహాయ సహకారాలు అందిస్తున్న ఉప్పల శ్రీనివాస్ కు ఎడిటర్ భూపతి రాజు కృతఙ్ఞతలు తెలిపారు.