Posts

నల్గొండ 45 వ మున్సిపల్ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గా గడాలె విజయ

Image
 నల్గొండ 45 వ మున్సిపల్ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గా గడాలె విజయ. నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ 45 వ డివిజన్ నుండి BRS పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా గడాలె విజయ ను ప్రకటించిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఈ సందర్భంగా గడాలె విజయ మాట్లాడుతూ  45 డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేయుచున్నానని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాననీ, ఈ ప్రయాణంలో డివిజన్ అందరి సహాయ సహకారం, మద్దతు నాకు ఎల్లప్పుడూ అవసరం అని, మీ నమ్మకానికి తగ్గట్టుగా, నిరంతరం మన డివిజన్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో సేవలు అందిస్తానని హామీ ఇస్తున్నాననీ తెలిపారు. ఈ అవకాశాన్ని అందించిన మా ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాననీ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాననీ తెలిపారు. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని డివిజన్ ప్రజలను అభ్యర్థించారు.

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు

Image
  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలను 2 నెలలో నిర్వహించాలని  న్యాయవాది  పి. గోపి మానవేంద్రనాథ్ ను నియమించిన కోర్టు గూఢచారి, హైదరాబాద్, 29 జనవరి:  తెలంగాణ ఆర్యవైశ్య  మహాసభ ఎన్నికల పై ఆగీర్ వెంకటేశం వేసిన కేసుకు కోర్టు పిటిషనర్ యొక్క ప్రస్తుత పిటిషన్ ను ఈ రోజు కోర్టు అనుమతిస్తు,   24-02-2025న మెమో నెం.6395/Regn.II/2025 ద్వారా తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నికల అధికారి స్థానంలో న్యాయవాది పి. గోపి మానవేంద్రనాథ్ ను  నియమిస్త ఉత్తర్వులు జారీ చేసినది. ఈ  తేదీ నుండి రెండు నెలల వ్యవధిలో ప్రతివాది నెం.1 సొసైటీ  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ యొక్క బై-లాస్ ప్రకారం ఎన్నికలను నిర్వహించడానికి మరియు ఓట్లను లెక్కించి, తదనుగుణంగా తగిన భద్రతతో ఫలితాలను ప్రకటించి, కోర్టు ముందు సమ్మతి నివేదికను దాఖలు చేయాలని ఆర్డర్ ఇచ్చింది. అడ్వకేట్ కమిషనర్ ఫీజు రూ.10,000/- గా నిర్ణయించబడిందనీ మరియు పిటిషనర్ అడ్వకేట్ కమిషనర్ ఫీజును అడ్వకేట్ కమిషనర్‌కు చెల్లించి, ఈ ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుండి (7) రోజులలోపు కోర్టు ముందు మెమోతో పాటు రసీదును దాఖలు చేయాలని ఆ ఆర్డర్ లో తెలిపింది.

ఫ్లాష్.. ఫ్లాష్.. BRS రెండవ జాబితా విడుదల

Image
 నల్గొండ  మున్సిపల్ కార్పొరేషన్ BRS అభ్యర్థుల రెండవ జాబితా విడుదల

ఏం.ఫార్మసి విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసిన సెల్ వెల్ సంస్థ సీఎండీ సుబ్బా రావు

Image
 ఏం.ఫార్మసి విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసిన సెల్ వెల్ సంస్థ సీఎండీ సుబ్బా రావు హైదరాబాద్:  సెల్ వెల్ సంస్థ సీఎండీ విద్యా దాత సుబ్బా రావు సార్ చంద్రిక M. ఫార్మసి చదువు కాలేజ్ ఫీజు నిమిత్తం 35000 చెక్ అందచేశారు. ఈ సందర్భంగా మొగుళ్ళపెల్లి ఉపేందర్ సుబ్బారావు కు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలిపారు.

పంచముఖ హనుమాన్ దేవాలయంలో 18 అడుగుల విరాట హనుమంతుని విగ్రహ ప్రతిష్ట* ఘనంగా నిర్వహణ..

Image
 నల్గొండ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ..! నల్గొండ పట్టణం వెంకటేశ్వర కాలనీలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో భక్తుల జయజయధ్వానాల నడుమ *18 అడుగుల విరాట హనుమంతుని విగ్రహ ప్రతిష్ట* ఘనంగా నిర్వహణ..! వేద మంత్రోచ్చారణలు, పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో విగ్రహ ప్రతిష్ట పూర్తి... భారీగా తరలివచ్చిన భక్తజనం... జై శ్రీరాం నినాదాలతో మారుమ్రోగిన కాలనీ పరిసరాలు..! ప్రాంత ప్రజలతో పాటు హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేశారు... భక్తి.. శక్తి.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం వెంకటేశ్వర కాలనీ పంచముఖ హనుమాన్ ఆలయం...

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత..

Image
 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత.. గచ్చిబౌలి లోని కేశవ్ నగర్ లో ఉంటున్న సాయి కిరణ్ (26)దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న మాదాపూర్ జోన్ ఏస్ఓటీ పోలీసులు..  లక్ష 30వేల విలువ చేసే 11గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్,రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం.. బెంగుళూరు నుండి తెచ్చి హైదరాబాద్ లో అమ్మడానికి ప్రయత్నిస్తున్న సాయి కిరణ్.. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్న సాయి కిరణ్.. ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయిస్తున్న సాయికిరణ్.. విశ్వసనీయ సమాచారంతో సాయి కిరణ్ ను పట్టుకున్న మాదాపూర్ sot పోలీసులు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

కామారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న జిల్లా సివిల్ సప్లై కార్యాలయంపై ACB దాడి

Image
 కామారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న జిల్లా సివిల్ సప్లై కార్యాలయంపై ACB దాడి 2026 జనవరి 24న మధ్యాహ్నం 12:15 గంటలకు, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, కామారెడ్డిలోని జిల్లా మేనేజర్ కార్యాలయంలో ACB అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో, అనేక లోపాలు బయటపడ్డాయి. 2021-22 ఖరీఫ్ సీజన్‌లో: 39 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు; 2 రైస్ మిల్లర్లపై చర్య, లోటు: 581 మెట్రిక్ టన్నులు (₹64 లక్షలు). 2022-23 ఖరీఫ్ సీజన్‌లో: 37 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు; 2 రైస్ మిల్లర్లపై చర్యలు, కొరత: 19,529 మెట్రిక్ టన్నులు (₹41 కోట్లు). 2023-24లో: ఖరీఫ్ సీజన్‌లో 7 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు; 3 రైస్ మిల్లర్లపై చర్య, లోటు: 5,194 మెట్రిక్ టన్నులు (₹2.5 కోట్లు). 2023-24లో, గ్రీన్ హిల్స్ ఆగ్రో ఇండస్ట్రీస్ (కోడ్: 177375) కస్టమ్ మిల్డ్ రైస్‌ను చెల్లించడంలో డిఫాల్ట్ అయింది, దీని ఫలితంగా క్రిమినల్ కేసు నమోదైంది. అయినప్పటికీ, అధికారులు ఖరీఫ్ మరియు రబీ 2024-25 దిగుబడిని అదే మిల్లర్‌కు కేటాయించారు. సెప్టెంబర్ 2025 నుండి, జిల్లా పౌర సరఫరా అధికారి మరియు జిల్లా మేనేజర్,...