Skip to main content

Posts

Showing posts with the label NATIONAL

లాక్ డౌన్ లో పుట్టింట్లోనే ఉండిపోయిన భార్య మరో పెళ్లి చేసుకున్న భర్త

లాక్ డౌన్ నేపథ్యంలో పుట్టింట్లోనే ఉండిపోయిన భార్య మరో పెళ్లి చేసుకున్న భర్త దేశంలో కరోనా వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ అనేక సంఘటనలకు కారణమవుతోంది. బీహార్ లోని ఓ వ్యక్తి భార్య కాపురానికి రాకపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. పాట్నా పాలీగంజ్ కు చెందిన ధీరజ్ కుమార్ కు దుల్హిన్ బజార్ కు చెందని యువతితో ఇటీవలే పెళ్లయింది. కొన్నిరోజుల కిందటే ఆమె పుట్టింటికి వెళ్లగా, ఆపై లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో ఆ యువతి పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ధీరజ్ కుమార్ అసహనానికి లోనై, భార్యను వెంటనే వచ్చేయాలని అనేకమార్లు ఫోన్ చేశాడు. వాహనాలు లేకపోవడం, పోలీసుల ఆంక్షలతో ఆ యువతి భర్త వద్దకు రాలేకపోయింది. దాంతో మరింత అసంతృప్తికి గురైన ధీరజ్ కుమార్ తన భార్యపై కోపంతో మాజీ ప్రియురాలి మెళ్లో తాళికట్టేశాడు. దాంతో దిగ్భ్రాంతికి గురైన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.

లాక్ డౌన్ మార్గ దర్శకాలు ఈ నెల 20 నుండి వీటికి అనుమతులు

లాక్ డౌన్ మార్గ దర్శకాలు ఈ నెల 20 నుండి వీటికి అనుమతులు.... 1. నిత్యావసరాలు తప్ప అన్నీ క్లోజ్ 2. వ్యవసాయ,ఉద్యాన వన పనులకు పూర్తి అనుమతి 3.భవన నిర్మాణ పనులకు షరతులతో అనుమతి 4.చేపలు,రొయ్యల రవాణా కు అనుమతి 5.వ్యవసాయ మార్కెట్ లో కొనుగోళ్లకు అనుమతి 6.కొరియర్,ఈ కామర్స్ కు అనుమతి 7 అన్ని రకాల సరుకుల రవాణాకు అనుమతి 7.ఎక్కడ ఉండే కార్మికులకు అక్కడే పనులకు అనుమతి 8.ఉపాధి హామీ పనులకు గ్రీన్ సిగ్నల్ 9. స్కూళ్లు,కాలేజీలు,కోచింగ్ సెంటర్లకు అనుమతి *లేదు* .. 10.ఆస్పత్రులు,టెలీ మెడిసిన్ యధాతధం 11.సరిహద్దులు దాటేందుకు అనుమతి *లేదు*  12. బ్యాంకు కార్యాకలాపాలు యధాతధం 13.బార్లు మూసివేత 14.బహిరంగ ఉమ్మివేయడం నేరం 15.అంత్యక్రియలు,ఇతర కార్యాక్రమాలకు 20 మంది వరకు అనుమతి 16.విత్తనోత్పత్తి,పురుగు మందుల దుకాణాలకు అనుమతి 17. దాణా,ఆక్వా హేచరీస్ కు అనుమతి 18.ఔషద పరిశ్రమలకు అనుమతి 19.అనాద, దివ్యాంగ,కేంద్రాలకు అనుమతి 20 కూలీల తరలింపునకు అనుమతి..లేదు. 21. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అనుమతి

ఆంద్రప్రదేశ్ కరోనా బులిటీన్ 18 ఏప్రిల్

  ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన కలిగిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు 603కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  గడచిన 24 గంటల్లో  కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ 128 బులిటెన్‌ విడుదల* కృష్ణా జిల్లా లో 18 కేసులు నమోదు కర్నూల్ లో అత్యధికంగా 129 కరోనా పాజిటివ్ కేసులు  పాజిటివ్‌ కేసుల్లో 546 మంది చికిత్స  కరోనా పాజిటివ్ నుండి కోలుకుని  42 మంది డిశ్చార్జి కాగా,  ఇప్పటి వరకు ఏపీ లో కరోనా పాజిటివ్ తో 15 మంది మృతి

ఎయిర్‌టెల్, వొడాఫోన్ వినియోగదారులకు శుభవార్త

ఎయిర్‌టెల్, వొడాఫోన్ వినియోగదారులకు శుభవార్త ముంబై: భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ ఖాతాదారులకు మరోమారు శుభవార్త చెప్పాయి. అతి తక్కువ ఆదాయం కలిగిన ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీ కాలపరిమితిని మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి. ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ యూజర్ల ఇన్‌కమింగ్ సర్వీసులను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. సరిగ్గా అదే రోజుతో దేశ వ్యాప్తంగా పొడిగించిన లాక్‌డౌన్ గడువు కూడా ముగియనుంది. భారతీ ఎయిర్‌టెల్ కూడా ఇంచుమించు ఇలాంటి ప్రకటనే చేసింది. ఖాతాదారుల వ్యాలిడిటీ గడువు ముగిసినప్పటికీ మే 3 వరకు ఇన్‌కమింగ్ కాల్స్ అందుకోవచ్చని తెలిపింది. 

www.vysyaseva.org వెబ్సైట్ లో వైశ్యుల సేవాకార్యక్రమలు - వెబ్సైట్ నిర్వహక్కులు గుప్తా

www.vysyaseva.org వెబ్సైట్ లో వైశ్యుల సేవాకార్యక్రమలు - వెబ్సైట్ నిర్వహక్కులు గుప్తా కరోనా నేపధ్యంలో  వైశ్యులు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, డోనేషన్లు ఇస్తున్నారని వాటి వివరాలు vysyaseva2020@gmail.com   ద్వారా  పంపవలసిందిగా www.vysyaseva.org వెబ్సైట్ నిర్వాహకులు గుప్తా కోరారు. ఈ వెబ్సైట్లో మీరు పంపిన ఈ మెయిల్స్ ను పొందుపరుస్తామని తెలిపారు. ఈ వెబ్సైట్ www.vysyaseva.org   ఓపెన్ చేసి మరొన్ని వివరాలు పొందవచ్చు

ఆరోగ్యం కోసం WHO సలహాలు సూచనలు ఇవే 

  ఆరోగ్యం కోసం WHO సలహాలు సూచనలు ఇవే  ★ మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోండి. ★ మద్యం  చక్కెర పానీయాలను పరిమితం చేయండి. ★ ధూమపానం చేయవద్దు. ఇది COVID-19 లక్షణాలను పెంచుతుంది. తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. ★ పెద్దలకు రోజుకు కనీసం 30 నిమిషాలు, పిల్లలు రోజుకు ఒక గంట వ్యాయామం చేయండి. ★ మీకు బయటికి వెళ్ళడానికి అనుమతి ఉంటే.. నడక, పరిగెత్తడం లేదా బైక్ రైడ్ వెళ్తే ఇతరులకు దూరంగా ఉండాలి.  ★ మీరు ఇంట్లో ఉండే డ్యాన్స్ చేయండి.. కొంత యోగా చేయండి లేదా మెట్లు పైకి క్రిందికి నడవండి. ★ ఇంటి నుండి పనిచేసే వ్యక్తులు ఒకే స్థానంలో ఎక్కువసేపు కూర్చోకూడదు.  ★ ప్రతి 30 నిమిషాలకు 3 నిమిషాల విరామం తీసుకోండి. ★ సంక్షోభం నుండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. సంగీతం వినండి, పుస్తకం చదవండి లేదా ఆట ఆడండి. ★ సంక్షోభ సమయంలో ఒత్తిడి, గందరగోళం  భయపడటం సాధారణం.  ★ మీకు తెలిసిన  నమ్మదగిన వ్యక్తులతో మాట్లాడటం సహాయపడుతుంది ★ మీకు ఆత్రుతగా ఉంటే ఎక్కువ వార్తలు చదవడానికి లేదా చూడటానికి ప్రయత్నించకండి.  ★ రోజుకు ఒకటి లేదా రెండుసార్లు నమ్మదగిన సోర్సు నుంచి వార్తా సమాచారాన్ని పొందం

మద్యం  తో కరోనావైరస్ ముప్పు ఎక్కువ

మద్యం  తో కరోనావైరస్ ముప్పు ఎక్కువ మద్యం తాగడం వల్ల కోవిడ్ -19 వైరస్ ప్రభావం మరింత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కరోనా లాక్‌డౌన్ సమయంలో మద్యం వినియోగాన్ని పరిమితం చేయాలని WHO సిఫారసు చేసింది. ఆల్కహాల్ తాగితే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది.. తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది అని యూరప్ లోని WHO ప్రాంతీయ కార్యాలయం పేర్కొంది.  ఆల్కహాల్ వినియోగం అనేక సంక్రమణ వ్యాధులతో ముడిపడి ఉంది. కోవిడ్ -19కు సంక్రమించే వ్యక్తికి మరింత హాని చేస్తుంది. మానసిక ఆరోగ్య సమస్యలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మాట్లాడే ప్రవర్తన, హింసను కూడా పెంచుతుంది. ప్రత్యేకించి సామాజిక దూరం వంటి చర్యలను అమలు చేసిన దేశాలలో ప్రజలను వారి ఇళ్లలో నిర్బంధంగా ఉంచుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల కరోనావైరస్‌ను చంపుతుందని అపోహలపై WHO ఒక ఫ్యాక్ట్ షీట్‌ను కూడా ప్రచురించింది.  మద్యం సేవించడం కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు మరణానికి కూడా దారితీస్తుందని తెలిపింది. ప్రత్యేకించి మిథనాల్‌తో కల్తీ అయితే మాత్రం.. ఏడాదిలో సుమారుగా 3 మిలియన్ల మరణాలు మ

కోవిడ్19 తెలంగాణ బులిటీన్ 17 ఏప్రిల్

కోవిడ్19 తెలంగాణ  బులిటీన్ 17 ఏప్రిల్

డ్వాక్రా మహిళలకు శుభవార్త

డ్వాక్రా మహిళలకు శుభవార్త డ్వాక్రా మహిళలకు శుభవార్త తెలిపారు  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ మల్లి ప్రసన్నకుమార్. శుక్రవారం ఆయన మాట్లాడుతూ  తిరువూరు బ్రాంచ్ అయిన యూబీఐ వారు కోవిడ్-19 సువిధ పథకం కింద డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున లోన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పథకానికి సంబంధించి దరఖాస్తులు సోమవారం నుండి స్వీకరించనున్నట్లు వారు పేర్కొన్నారు.._

నో లిక్కర్‌.. నష్టం ఎంతో తెలుసా?

నో లిక్కర్‌.. నష్టం ఎంతో తెలుసా?  కరోనా ఎఫెక్ట్ రోజుకు రూ.700 కోట్లు దేశం లో మద్యం అమ్మకాల నిషేధంతో భారీగా నష్టము జరిగింది. గత నెల 22 నుంచి రూ.17,500 కోట్లకు పైగా నష్ట పోయాయి రాష్ట్రాలు. తెలంగాణ లోనే రూ.2 వేల కోట్లు, మహారాష్ట్ర లోనూ అదే స్థాయిలో నష్ట పోయాయి. లాక్‌ డౌన్‌ ఉన్నా లిక్కర్‌ విక్రయాలకు పలు రాష్ట్రాల ప్రయత్నాలను అనుమతించని కేంద్రం. మద్యం తాగితే ఎంత కిక్కు వస్తుందో తాగే వారికే తెలుస్తుంది కానీ.. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానా కు మాత్రం కిక్కే, ఎంత కిక్కంటే.. కొన్ని సార్లు ప్రభుత్వాలు తక్షణావసరాల కోసం ఈ కిక్కు ద్వారా వచ్చే నిధుల పైనే ఆధార పడతాయంటే అతిశయోక్తి కాదు.  అలాంటిది దేశంలో లాక్‌ డౌన్‌ కారణంగా గత 25 రోజులుగా అమలవుతోన్న మద్య నిషేధం కారణంగా ఎంత నష్టం జరుగుతుందో తెలిస్తే అవాక్కు కాక తప్పదు.. రోజుకు అక్షరాలా రూ.700 కోట్లు నష్టం. ఈ మొత్తం ఆయా ప్రభుత్వాల ఖజానా లకు చేరాల్సింది మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే మద్యం అమ్మకాల నిషేధం కారణంగా గత 25 రోజులుగా దేశం లోని అన్ని రాష్ట్రాలు కలిపి రూ.17,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు నష్ట పోయాయన్న మాట.  రూ. 20 వేల కోట్ల పై మాటే..!*_

13 వేలు దాటినా కరోనా కేసులు

  13 వేలు దాటినా కరోనా కేసులు, నాలుగు వందలకు పైగా మరణాలు మహారాష్ట్ర,ఢిల్లీ,తమిళనాడు,మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్,ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఏపీలో విజృంభిస్తున్న కరోనా వైరస్ మహారాష్ట్రలో 3202 కేసులు,194 మంది మృతి ఢిల్లీలో 1640 కేసులు,38 మంది మృతి తమిళనాడులో 1267 కేసులు,15 మంది మృతి మధ్యప్రదేశ్ లో 1164 కేసులు,55 మంది మృతి రాజస్థాన్ లో 1131 కేసులు,11 మంది మృతి గుజరాత్ లో 929 కేసులు,36 మంది మృతి ఉత్తరప్రదేశ్ లో 805 కేసులు,13 మంది మృతి తెలంగాణాలో 700 కేసులు,18 మంది మృతి ఆంధ్రప్రదేశ్ లో534 కేసులు,14 మంది మృతి కేరళలో 394 కేసులు,ఇద్దరు మృతి కర్ణాటకలో 315 కేసులు,13 మంది మృతి జమ్మూకాశ్మీర్ లో 314 కేసులు,నలుగురు మృతి

11 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు

11 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం ఒక వైపు కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా.. మృగాళ్లు మాత్రం మారడం లేదు. నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వస్తున్నా, నిందితులను ఎంతో కఠినంగా శిక్షిస్తున్నా..- ఒక వైపు కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా.. మృగాళ్లు మాత్రం మారడం లేదు. నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వస్తున్నా, నిందితులను ఎంతో కఠినంగా శిక్షిస్తున్నా.. వారిలో మార్పులు రావడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మృగాలు రెచ్చిపోతున్నారు. కరోనా వ్యాప్తి చేయకుండా లాక్‌డౌన్ విధిస్తే.. కీచకులకు మాత్రం అదే వరంలా మారుతోంది. లాక్‌డౌన్‌ సమయంలోనూ మహిళలపై, బాలికలపై గృహ హింస, అత్యాచారం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా 11 ఏళ్ల బాలికపై ఓ 50 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం దర్శి మండలం కోర్లమడుగులో చోటుచేసుకుంది. కాగా.. అత్యాచారం చేసి అనంతరం నిందితుడు పారిపోయాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముంబయిలో కండోమ్స్‌, హైదరాబాద్‌లో ఐ-పిల్‌.. ఎక్కువగా ఆర్డర్ 

ముంబయిలో కండోమ్స్‌, హైదరాబాద్‌లో ఐ-పిల్‌.. ఎక్కువగా ఆర్డర్  లాక్‌డౌన్ నేపథ్యంలో బయటకు రావడానికి వీల్లేకుండా పోయింది. నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం మాత్రమే ప్రజలను బయటకు అనుమతినిస్తున్నారు-లాక్‌డౌన్ నేపథ్యంలో బయటకు రావడానికి వీల్లేకుండా పోయింది. నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం మాత్రమే ప్రజలను బయటకు అనుమతినిస్తున్నారు. అందుకోసం కూడా కొన్ని గంటల సమయం మాత్రమే గడువు పెడుతున్నారు. అయితే ఈ లాక్‌డౌన్ నేపథ్యంలో కండోమ్స్‌, ప్రెగ్నేన్సీ కిట్‌ లాంటి.. కొన్ని వస్తువులు బయట దొరకడం లేదు. దీంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముంబయిలోని ప్రజలు ఎక్కువగా కండోమ్స్‌, హైదరాబాద్‌లోని ప్రజలు ఎక్కువగా ఐ-పిల్‌లను ఆర్డర్ చేశారు. ఈ వివరాలను ప్రముఖ డంజో యాప్‌ బయటపెట్టింది.ఈ నెల 14న జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ప్రదేశాల్లోని ప్రజలు ఏఏ వస్తువులు ఎక్కువగా ఆర్డర్ చేశారో.. వాటికి సంబంధించి వివరాలను డంజో యాప్‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వివరాల ప్రకారం.. బెంగళూరు, పుణెలో ప్రెగ్నెన్సీ కిట్.. చెన్నై, జ

సైబర్ మోసాలు

ఓటిపి పేరుతో ఏడు లక్షల నగదు స్వాహా   చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారుల మంటూ ఎస్ బి ఐ బ్యాంక్ యాప్ సీక్రెట్ నెంబర్ చెప్పాలని సూచించిన సైబర్ నేరగాళ్లు.  నమ్మి ఓటిపి ఆప్ నంబర్ చెప్పేసిన మహిళ.  అకౌంట్ నుండి 5 లక్షల నగదు ఆన్లైన్ ద్వారా డ్రా చేసిన సైబర్ చీటర్.  మోసపోయానని గమనించి లంగారౌస్ గోల్కొండకు చెందిన ఈషాక్ అనే వ్యక్తి.  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇదే తరహాలో మరో మోసం ఓటిపి ద్వారా 70 వేల నగదు కాజేసిన ఆన్లైన్ దొంగలు.  మోసపోయామని గమనించి నల్లగుట్ట బేగంపేటకు చెందిన కమలేష్ అనే వ్యక్తి.  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు. మానవతా  దృక్పథంతో కరోనా బాధితులకు తనవంతు సాయం చేయాలని.  సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆన్లైన్ ద్వారా 10000 వేల నగదు బదిలీ చేసిన.  హైదరాబాద్ కు చెందిన వేణుగోపాల్. తన అకౌంట్ నుండి డిటెక్ట్ కాకపోవడంతో.  ఆన్లైన్లో ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి చెప్పిన వేణు.  అదే అదనుగా చేసుకుని క్యూఆర్ నెంబర్ పంపించి.  లక్ష రూపాయల వరకు ఆన్లైన్ ద్వారా డ్రా చేసిన నేరగాళ్లు. సైబర్ పోలీసులకు ఫిర్యాదు.

హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్ - దేశంలోనే ఫస్ట్ టైమ్

హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్ - దేశంలోనే ఫస్ట్ టైమ్ దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌ కరోనా పేషెంట్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రాణాలకు తెగించి కరోనా రోగుల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులపై దేశ వ్యాప్తంగా దాడులు సాగుతున్నాయి. ఏవోవే సాయకులతో కొందరు డాక్టర్లను, నర్సులను వేధిస్తున్నారు.  సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌ కరోనా పేషెంట్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.  ప్రాణాలకు తెగించి కరోనా రోగుల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులపై దేశ వ్యాప్తంగా దాడులు సాగుతున్నాయి. ఏవోవే సాయకులతో కొందరు డాక్టర్లను, నర్సులను వేధిస్తున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రెసిడెంట్ వైద్యుడిపై దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. కాగా దేశంలో ఒక కరోనా పేషెంటును అరెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అలాగే గత కొద్ది రోజుల క్రితం తమిళనాడులో వైద్యం అందిస్తోన్న ఓ వైద్యుడిపై.. కరోనా పేషెంట్ ఉమ్మి వేశాడు. దీంతో పోలీసులు అతనిపై మర్డర్ ఎటెమ్ కేసు నమోదు చేశారు.కాగా ఈ నెల 1వ తేదీన గాంధీ ఆస్పత్రిలో ఒక కరోనా పేషెంట్(56) బాత్రూమ్‌లో జారి పడి మరణించాడు. అయితే డాక్టర్ల నిర్లక్

తెలంగాణ కరోనా మీడియా బులిటీన్ 15 ఏప్రిల్

తెలంగాణ కరోనా మీడియా బులిటీన్ 15 ఏప్రిల్ 

వివిధ సామాజిక సేవలందిస్తున్న వైశ్య సంస్థ లన్నింటికి V 3 ఛానల్   చైర్మన్ కాచం విజ్ఞప్తి 

  వివిధ సామాజిక సేవలందిస్తున్న వైశ్య సంస్థ లన్నింటికి V 3 ఛానల్   చైర్మన్ కాచం విజ్ఞప్తి మొదట విధించిన లాక్ డౌ న్ పీరియడ్  పూర్తి అయింది. భారత ప్రధాని మోడీ గారు మరో 19 రోజులు లాక్డౌన్ పొడిగించారన అంటే మే 3 వరకు లాక్ డౌన్  ఉంటుందని  ప్రధాని మోడీ అభ్యర్దించిన విధంగా 7 సూత్రాలను పాటించ వలసిందిగా V 3 ఛానల్, వైశ్య వికాస వేదిక ఛైర్మన్ కాచం సత్యనారాయణ కోరారు.   అలాగే ప్రధాని  పేదలు,నిర్భాగ్యు లు, ఆకలితో అలమటించే వారిని సాధ్యమైనంత వరకు ఆదుకొమ్మని ప్రత్యేకంగా చెప్పారని  తెలిపారు. ఈ దిశలో మన వైశ్యులు, వైశ్య సంస్థలు పేదలకు ఆహార పొట్లాల పంపిణీ పెద్ద ఎత్తున చేస్తూనే ఉన్నారని, V3 ఛానల్, వై శ్య వికాస వేదిక మరియుఇతర సంస్థలు తమ  తమ శక్తి మేరకు పేదలు, నిర్భా గ్యులు, అన్నార్తులను ఆదు కుంటున్నాయని అన్నారు.    వైశ్య సమాజ సేవ లో తన వంతు బాధ్యతను స్వీకరించిన వైశ్య వికాస వేదిక,  V 3 ఛానల్    సహాయ కార్యక్రమాల వివరాలు నిర్వాహకులు ముందుగా ఫోన్ నెంబర్  లకు (9441222429 off no 040 -40032429 ) తెలియ చేసినట్లు అయితే తప్పకుండా మీ మీ కార్యక్రమాలను  నిస్వార్థంగా మా బాధ్యతగా భావించి, కవర్ చేసే బాధ్యతను స్వీకరిస్తున్నామన

**ఈ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు**

ఈ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాల్లో మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ నియమాలను నిక్కచ్చిగా అమలు చేయాలనీ జిల్లా కలెక్టర్ లు, ఎస్పి లను కేంద్ర కేబినెట్  కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు* *బుధవారం దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్ లు, ఎస్పి లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు*  సమావేశంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ... ఈ లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింద నీ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి తెలిపారు. మే 3 వరకూ అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులుఇస్తున్నట్లు ప్రకటించిందన్నారు. * ఏప్రిల్‌ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు అనుమతి,రాష్ట్రం లో ఇప్పటికే ముఖ్య మంత్రి వ్యవసాయ కొనుగోళ్లు, కార్యక

**మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని మోడీ ** 7 పనులను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని మోడీ**

మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని మోడీ * * 7 పనులను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని మోడీ** * వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. * సామాజిక దూరాన్ని ఆచరించండి. * రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ చిట్కాలను అనుసరించండి. * ఆరోగ్య సేతు అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేయండి. * పేదవారిని చూసుకోండి. * ఉద్యోగాల నుండి ప్రజలను తొలగించవద్దు. * COVID-19 యోధులను గౌరవించండి ****** *లాక్ డౌన్ పైన ప్రధాని మోడీ ప్రసంగం హైలెట్స్* ఇప్పుడు ఉన్న దేశ పరిస్థితులలో  మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇంట్లో ఉండే పండుగ చేసుకోవడం శ్రేయస్కరం లాక్ డౌన్ సంతృప్తికరంగా అమలవుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పోరాటం సంతృప్తికరంగా ఉంది. లాక్ డౌన్ చాలామందికి ఇబ్బందులు కలుగుతున్నాయి. భారత్ తీరు ప్రపంచానికి మార్గనిర్దేశం. ఇది భారతీయుల విజయం ప్రపంచంతో పోలిస్తే ఇండియా అన్ని విధాల  తినడానికి, ప్రయాణాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ భారత దేశ ప్రజలు దీన్ని ఎంతో సహనంతో పాటిస్తున్నారు. భారతదేశంలో 10 వేల కరోనా  కేసులు నమోదయ్యాయి, 300 మంది చనిపోయారు. ఎకనామి కంటే జీవితం గొప్పది. ఎయిర్ పోర్టు స్క్రీనింగ్ పూర్తయ్యాక

**హోం మేడ్‌ మాస్క్‌తో మోదీ.. ప్రజలకిచ్చిన సందేశమిదే**

హోం మేడ్‌ మాస్క్‌తో మోదీ.. ప్రజలకిచ్చిన సందేశమిదే..! ప్రధాని మోదీ శనివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ పొడగింపుతో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాస్క్‌ ధరించి పాల్గొన్నారు. అయితే మాస్క్‌ ధరించడం సాధారణ విషయమే అయినా.. ఆయన ధరించిన మాస్క్‌ హోం మేడ్‌ మాస్క్ అవ్వడం విశేషంగా మారింది. తెలుపు రంగులో ఉన్న మాస్క్‌ ధరించి.. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. ప్రస్తుతం ఎక్కువ ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. పలు రాష్ట్రాలు మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ కఠిన నిబంధనలు పెట్టాయి. దీంతో మాస్క్‌ల కొరత ఏర్పడే అవకాశం ఉన్న క్రమంలో.. హోం మేడ్ మాస్క్‌లు కూడా ధరించవచ్చని మోదీ పరోక్షంగా సూచించినట్లైంది. ప్రజలు మాస్క్‌లు లేవని ఇబ్బంది పడకుండా ఇంట్లోనే తయారు చేసి ధరించవచ్చని ఆయన ధరించి ఓ సందేశాన్ని ఇచ్చారు. కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రజలంతా బయటకు వెళ్తే మాస్క్‌లు తప్పకుండా ధరించాలని సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. మోదీతో పాటు.. పలువురు ముఖ్యమంత్రులు కూడా మాస