**గురుకుల పాఠశాల విద్యార్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించండి- నల్గొండ ఇంఛార్జి జిల్లా కలెక్టర్ వి.చంద్ర శేఖర్**
నల్గొండ,జనవరి 30.జ్వరంతో జిల్లా కేంద్ర ఆసుపత్రి లో చేరిన నకిరేకల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఇంఛార్జి జిల్లా కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. జ్వరం తో బాధపడుతూ గురువారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో19 మంది విద్యార్థులు ఆసుపత్రి లో చేరి చికిత్స పొందుతున్నారు.గురువారం ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా 19 మంది విద్యార్థుల్లో 4 గురు జ్వరం,దగ్గుతో బాధపడుతున్నారని,మిగతా విద్యార్థులు సాధారణ స్థితి లో వున్నారని,వారి రక్త శాంపిల్స్ సేకరించి పరీక్ష కు పంపి రాత్రి చికిత్స అందిస్తున్నారు. విద్యార్తులు కొలుకునెలా మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఇంఛార్జి కలెక్టర్ ఆదేశించారు.విద్యా ర్థులు కు అవసరమైన రాత్రి వైద్య సేవలు అందేలా ఇద్దరు డాక్టర్ లు,ఎస్.సి.గురుకుల జిల్లా కో ఆర్డినేటర్ కుర్షిద్ ను, రీజియనల్ కో ఆర్డినేటర్ హెచ్ అరుణ కుమారి ని దగ్గరుండి పర్యవ