Skip to main content

Posts

Showing posts from December, 2020

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కలిసిన చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు.

  తెలంగాణ రాష్ష్ట్ర  ప్రణాళికా సంఘం   ఉపాధ్యక్షులు  శ్రబోయినపల్లి  వినోద్ కుమార్  గారిని  కలిసిన చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు.  తెలంగాణ స్మాల్ మీడియం  న్యూస్ పేపర్స్ మరియు  మ్యాగజైన్స్ అసోసియేషన్   అధ్యక్షులు  యూసుఫ్ బాబు  గారి ఆధ్వర్యంలో   నేడు అనగాతేదీ  31.12. 2020 న బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో గల   మినిస్టర్స్  క్వార్టర్స్  నందు  బోయనపల్లి   వినోద్ కుమార్  గారిని వారి   నివాసంలో   కలిసి  చిన్న పత్రికల సమస్యల పై వివరించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి నెల ప్రకటనలు లేక  రాక  చిన్న పత్రికలు  మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని ,  కావున   చిన్న పత్రికల కు  ప్రతినెలా ప్రకటనలు విడుదల చేసి ఆదుకునేలా మా సమస్యను  సీఎం గారి దృష్టి కి తీసుకెళ్లాల్సిందిగా  కోరడం జరిగింది.  అన్ని విషయాలు వినోద్ కుమార్ గారికి వివరంగావివరించగా  సానుకూలంగా స్పందిస్తూ సమాచార శాఖ కమిషనర్ తో మాట్లాడిన తర్వాత  సీఎం దృష్టి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు  యూసఫ్ బాబు ,డిప్యూటీ ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్ , ఉపాధ్యక్షులు అగస్టీన్ , రాష్ట్ర నాయకులు  బి.వెంకటయ్య జూన్ షహీద్ ,అఫ్రోజ్,ఖాసిం  తదితర పత్రికా సంప

కాళేశ్వ‌రం పై శ్వేత పత్రం విడుదల చేయాలి - ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌

కాళేశ్వ‌రం పై శ్వేత పత్రం విడుదల చేయాలి - ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌  కాళేశ్వ‌రం నీటి పారుద‌ల ప్రాజెక్టు  పార‌ద‌ర్శ‌క‌త, జ‌వాబుదారీత‌నం లేక అవినీతి జ‌రుగుతుందని  శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయ‌మ‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌  వారు  గ‌వ‌ర్న‌ర్ గారికి విన‌తి ప‌త్రం ఇచ్చారు.

చిన్న పత్రికలకు ప్రకటనలివ్వండి మంత్రి కేటీఆర్ కు వినతి

  చిన్న పత్రికలకు ప్రకటనలివ్వండి మంత్రి కేటీఆర్ కు  వినతి చిన్న పత్రికలకు ప్రకటనలిచ్చి ఆదుకోవాలని రాష్ట్ర పురపాలక, ఐటి పరిశ్రమ ల శాఖ మంత్రి కేటిఆర్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లు చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు తెలిపారు. సోమవారం దేశోద్ధారక భవన్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  సురవరం ప్రతాప రెడ్డి 125 వ జయంతి ఉత్సవాల లోగో ఆవిష్కరించేందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర  ఐటీ శాఖ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావును  కలిసి చిన్న పత్రికలకు ప్రతినెల  విడుదల చేసే ప్రకటనలు విడుదల చేసి, దినపత్రికలను కాపాడాలని   కోరామన్నారు. అలాగే ప్రభుత్వ ముఖ్య సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారికి మన సమస్యలను వివరించామని, సీఎం దృష్టికి తీసుకు వెళ్లవలసిందిగా కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షులు  అగస్టీన్, కోశాధికారి  ఆజoఖాన్, రాష్ట్ర నాయకులు, వెంకటయ్య   యూసుఫ్ ఉద్దీన్,   ఇక్బాల్, అఫ్రోజ్ ఖురేషి,  రియాసత్,  ఖాదిర్ ,ఫారూఖి, వాజీద్ మసూద్ తదితర పత్రికా సంపాదకులు పాల్గొన్నారు.  

మోడీ తీసుకొచ్చిన Ews రిజెర్వేషన్ అమలు చేస్తాం, *100 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

*మోడీ తీసుకొచ్చిన Ews  రిజెర్వేషన్ అమలు చేస్తాం, *100 కోట్లతో ఆర్యవైశ్య  కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం  - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 10 శాతం రిజర్వేషన్లు, ఆర్యవైశ్య  కార్పొరేషన్   ఏర్పాటుకు కేసీఆర్ కు భగవంతుడు సద్బుద్ధి కల్పించాలని కరీంనగర్ లో ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు బుస్సా  శ్రీనివాస్   ఆధ్వర్యంలో సకృత్ చండి మహా యాగం నిర్వహించారు. ఈ  దీక్ష కార్యక్రమానికి  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కేసీఆర్ వెంటనే మోడీ తీసుక వచ్చిన  10శాతం రిజర్వేషన్లు,  ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  ఆయన  విఫలం అయితే  2023 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే  రిజెర్వేషన్లు అమలు చేస్తామని, 100 కోట్ల తో ఆర్యవైశ్య కార్పొరేషన్  ఏర్పాటు చేస్తామని  తెలిపారు.   కుల సంఘాల నాయకులు కులాల కొరకు పనిచేయకుండా,  కులాల అభివృద్ధికి కృషి చేయాలనే విషయాన్ని  మరిచి పోయి  కేసీఆర్ మోచేతి నీళ్లు త్రాగుతూన్నారని  విమర్శించారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి,   ఐక్య వేదిక  ప్రధాన కార్యదర్శి పడకంటి రమేష్, రామేశం,  కార్యాచరణ కమిట

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం- రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి

  రైతుల ఆదాయం  రెట్టింపు చేయడమే కేంద్ర  ప్రభుత్వ లక్ష్యం- రాష్ట్ర  బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి జయంతి సూపారిపాలన దినోత్సవం సందర్బంగా ఒక్క క్లిక్ తో దేశంలో  9  కోట్ల రైతులకు 18 వెల  కోట్ల  రూపాయలు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద  రైతుల ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్బంగా  ప్రధాన మంత్రి నేరుగా 2 కోట్ల  మంది రైతులతో వ్యవసాయ చట్టాల పై వర్చువల్లో  ముఖ ముఖ లో పాల్గొన్న  కార్యక్రమాన్ని  బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక్ష  ప్రస్సారం చేశారు.ఈ కార్యక్రమానికి  విచ్చేసిన రాష్ట్ర బీజేపీ కార్య దర్శి  ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ   రైతుల  ఆదాయం రెట్టింపు చేయడమే  ప్రధాన మంత్రి మోడీ లక్ష్యమని, దేశంలో వ్యవసాయంలో సమృద్ధి సాధించడం, రైతులకు మేలు చేయడానికి ఈ చట్టల ఉద్దేశ్యం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు పల్లెబోయిన శ్యామసుందర్, నూకల వెంకట నారాయణ రెడ్డి,  జిల్లా కోశాధికారి విద్యాసాగర్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సీతారాంరెడ్డి, , పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వ

ఉప్పల పౌండేషన్ తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఓ బృహత్తర కార్యక్రమం

  తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఉప్పల పౌండేషన్ తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఓ బృహత్తర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లక్ష్మి అనే దివ్యాంగురాలికి, సూర్యనారాయణ అనే కంటి చూపులేని వ్యక్తి వివాహానికి శ్రీమతి ఉప్పల స్వప్న  బంగారు పుస్తెలు, వెండి మెట్టెలు ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. కుల మత ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉప్పల ఫౌండేషన్ సేవలు నేడు దివ్యాంగులకు సైతం అందడం పట్ల ఫౌండేషన్ ను సర్వత్రా అభినందిస్తున్నారు.

చిన్న పత్రికలకు అన్ని విధాలా సహకరిస్తా - ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

  చిన్న పత్రికలకు అన్ని విధాలా సహకరిస్తా - ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండలో జరిగిన తెలంగాణ స్మాల్ అండ్ మీడియం  అసోసియేషన్ నల్గొండ జిల్లా సమావేశంలో నల్గొండ శాసన సభ్యులు  కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ  చిన్న మరియు మధ్యతరహా పత్రికలకు అన్ని విధాలా సహకరించి ఆదుకుంటామని తెలిపారు. అరుహులైన చిన్న పత్రికల  వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని, ఇంటి స్థలం ఉన్న వారికి  ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్ధిక సహకారం  ఇప్పస్తామని తెలిపారు. నల్గొండ నియోజవర్గాన్ని ముఖ్యన్గా నల్గొండ  పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ  సందర్బంగా శాసన సభ్యులు భూపాల్ రెడ్డికి, నల్గొండ మునిసిపల్ ఛైర్మెన్ సైదిరెడ్డి గార్లకు  చిన్న పత్రికల తరపున ఘనంగా  సన్మానం చేశారు.  ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ మాట్లాడుతూ చిన్న పేపర్లకు ప్రకటనల కొరకు నిరాహారదీక్ష కు సిద్ధమని, అవసరమైతే నాగార్జున సాగర్ ఎన్నికల్లో అందరం నామునేషన్లు వేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర  twju రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్,  భాస్కర్, యాతకుల లింగయ్య, జిల్లా  జర్నలిస్టుల సంఘ ప్రధాన కార్యదర్శి గుండగొని జ

మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం

  మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం సోమవారం 14న నల్గొండలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం నల్గొండ  పట్టణ ప్రజలచే నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు గంగడి మనోహర్ రెడ్డి, కంకణాల శ్రీధర్ రెడ్డి,  మాదగోని శ్రీనివాస్ గౌడ్ ఒరుగంటి రాములు, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, నూకల నరసింహ రెడ్డి, శ్రీ రామోజు షణ్ముఖ, బండారు ప్రసాద్, పల్లెబోయిన శ్యామ్ సుందర్, నూకల  వెంకట నారాయణ రెడ్డి లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే నని భారీ సంఖ్యలో హాజరై  విజయవంతం చేయగలరని కోరారు.