Posts

Showing posts from September, 2022

హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ లాయర్ గా ప్రముఖ అడ్వకేటు సాయి కుమార్ నియామకము

Image
 హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ లాయర్ గా ప్రముఖ అడ్వకేటు  సాయి కుమార్ నియామకం హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ లాయర్ గా ప్రముఖ అడ్వాకేటు  సాయి కుమార్ ను   లీగల్ సర్వీస్ కమిటీ నియమించింది. ఈయన గతం లో ఒక్కసారి వాడబడే ప్లాస్టిక్ నిషేధం పై పిల్ వేసి అమలు జరిగేలా కృషిచేశారు. అంతేకాకుండా పలు ప్రజా ప్రయోజన వాజ్యాలు వేసి మారులు తెచ్చినందుకు గుర్తించి ఆయన్ను నియమించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఒప్పగించిన భాద్యతలకు న్యాయం చేస్తానని తెలిపారు. వీరి నియామకం పట్ల ధర్మ పీట నిరాకార అఖడా వారు మరియు సీనియర్ జర్నలిస్టు భూపతి రాజు శుభాకాంక్షలు తెలిపారు.

గ్లోబల్ అల్యూమినియం కంపెనీ అక్రమ కట్టడాలు కూల్చివేత - గ్రామ కార్యదర్శి శంకర్ గౌడ్

Image
 గ్లోబల్  అల్యూమినియం కంపెనీ అక్రమ కట్టడాలు  కూల్చివేత  - గ్రామ కార్యదర్శి శంకర్ గౌడ్ మెదక్ జిల్లా:  మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కాళ్లకల్  గ్రామ పరిధి లో సర్వే నెంబర్  157, 158, 161, 162 లలో  గ్లోబల్  అల్యూమినియం కంపెనీ అక్రమంగా నిర్మించిన కట్టడాలను  కూల్చివేయాలని గ్రామపంచాయతీ  అత్యవసర  సమావేశం లో తీర్మానించినట్లు గ్రామ కార్యదర్శి శంకర్ గౌడ్ తెలిపారు.  గ్లోబల్  అల్యూమినియం కంపెనీ  అక్రమంగా  నిర్మించిన కట్టడాలను తొలగించాలని ఈ నెల 15న జిల్లా కలెక్టర్ మెమో ద్వారా ఆదేశించారు.  ఈ రోజు గ్రామ  పంచాయతీ ప్రత్యేక సమావేశంలో రేపు 29 రోజున 10.30 ల నుండి అక్రమ కట్టడాలను పోలీసుల సహకారంతో  కూలగొట్టాలని తీర్మానించారని తెలిపారు.    పోలీసులను బందోబస్తు కూడా  ఏర్పాటు చేయాలని కోరామని ఆయన తెలిపారు.         ఈ అక్రమ కట్టడాలపై పలువురు ఫిర్యాదు చేయడం తో హెచ్ ఎమ్ డి ఏ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారి  విచారణ జరిపి నివిధిక సమర్పించడం తో   కలెక్టర్ అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశిస్తూ మెమో జారీచేశారు. యిది యిలా ఉండగా హైదరాబాద్ అమీర్పేట్ లోని ఓ ప్రధాన  కార్యాలయపు అధికారి  అక్రమ కట్టడాలను రక్షించడానికి కృషి చ

పండగపూటైనా ఒకటో తేదీకి జీతాలు, పెన్షన్లు ఇవ్వండి : డా. దాసోజు శ్రవణ్

Image
  పండగపూటైనా ఒకటో తేదీకి జీతాలు, పెన్షన్లు ఇవ్వండి : డా. దాసోజు శ్రవణ్  హైదరాబాద్:  తెలంగాణ ప్రభుత్వం సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఎందుకు ఉందని బీజేపీ నేత డా. దాసోజు శ్రవణ్ విమర్శించారు. ధనిక రాష్ట్రం అయిన తెలంగాణాలో .. ఉద్యోగులకు ఒకటో తేదీన ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  దసరా పండగ సమయానికైనా వేతనాలు వస్తాయా? లేదా? అనే ఆందోళనలో ఉద్యోగులు, పెన్సనర్లలో వుందని, గత ఏడాది కూడా దసరా పండక్కి జీతాలు ఇవ్వలేదని గుర్తు చేశారు.  సమయానికి జీతం రాక అప్పులు చేస్తున్న ఉద్యోగులు వచ్చిన జీతాన్ని వడ్డీలకి ఇచ్చి ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. కనీసం ఈ ఏడాదైన కుటుంబ అవసరాల నిమిత్తం దసరా పండక్కి జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని కోరారు.   ''అక్టోబర్ 5 లోగ సద్దుల బతుకమ్మ, దసరా పండుగలున్నందున, కుటుంబ అవసరాల నిమిత్తం సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్స్ అక్టోబర్ 1 న చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి'' చేశారు దాసోజు.

దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు - మంత్రి కొప్పుల ఈశ్వర్

Image
   తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం   దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు  కామారెడ్డి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన  నిజాంసాగర్ మండలంలో దళిత బంధు కింద 1297 మందికి రూ.128.80 కోట్ల ఆస్తులు పంపిణీ తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశాని ఆదర్శమని రాష్ర్ట సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.  కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లో దళితబంధు లబ్దిదారులకు ఆస్తుల పంపిణి కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అర్హులైన దళితునికి 10 లక్షల రూపాయలు అందించి ఆ కుటుంబాలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారన్నారు. నిజాంసాగర్ మండలంలో మొత్తం 24 గ్రామాల్లో 1297 మంది లబ్దిదారులను గుర్తించి.. 128.80 కోట్ల రూపాయల విలువ చేసే ఆటోలు, ట్రాన్స్ పోర్టు వాహనాలు, ట్రాక్టర్లు, జేసీబీలు, వ్యవసాయ సంబంధిత వాహనాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమన్నారు. దళిత కుటుంబాలను ఆర్ధికంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పార

*చిన్న పత్రికలను విస్మరించడం* *సరైంది కాదు* *-టీయూడబ్ల్యూజే నేత విరాహత్*

Image
 *చిన్న పత్రికలను విస్మరించడం* *సరైంది కాదు*  *-టీయూడబ్ల్యూజే నేత విరాహత్* ------------------------------------------ హైదరాబాద్:  ఎన్నో ఆశలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెగించి కొట్లాడిన చిన్న, మధ్యతరగతి పత్రికల ప్రచురణకర్తలను విస్మరించడం సరైంది కాదని, వారికి న్యాయం జరిగేంతవరకు తాము అండగా నిలిచి పోరాడుతామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు. సోమవారం నాడు లోవర్ ట్యాంక్ బండ్ లోని టీయూడబ్ల్యూజే కేంద్ర కార్యాలయంలో తెలంగాణ చిన్న, మధ్యతరగతి మరియు మేగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, ఉప ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారి ఆజం ఖాన్ తో పాటు పలు పత్రికల సంపాదకులు టీయూడబ్ల్యూజేలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విరాహత్ అలీ పాల్గొని మాట్లాడారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో తమ సంఘం చిన్న పత్రికలకు పక్షపాతిగా నిలబడి పోరాడుతుందన్నారు. ప్రభుత్వం నియమించే అక్రెడిటేషన్ కమిటీల్లో చిన్న పత్రికలకు ప్రాతినిధ్యం దక్కడం తమ సంఘం ఘనతేనని విరాహత్ స్పష

ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను కాలరాస్తే ప్రజల పాలిట అండగా నిలవల్సింది జర్నలిస్టులే - ఎంపీ లక్ష్మణ్,** ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట పత్రిక స్వేచ్ఛ లేదు - ఎమ్మెల్యే ఈటెల

Image
  ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను కాలరాస్తే ప్రజల పాలిట అండగా నిలవల్సింది జర్నలిస్టులే - ఎంపీ లక్ష్మణ్, ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట పత్రిక స్వేచ్ఛ లేదు - ఎమ్మెల్యే ఈటెల సికింద్రాబాద్ : ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( IFWJ),74 వ జాతీయ కౌన్సిల్ సమావేశాలు వెస్ట్ మారెడ్ పల్లిలోని పద్మశాలి భవన్లో జరిగిన  సమావేశాలకు  ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరైనారు.  డాక్టర్ కే లక్ష్మణ్,  మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను కలరాస్తే ప్రజల పాలిట అండగా నిలవల్సిందే జర్నలిస్టులేనని,  ప్రజలు యూపీ మోడల్ పరిపాలనను కోరుకుంటున్నారని అన్నారు. సమాజంలో వ్యవస్థలు పరస్పరం విఫలమైనప్పుడు వాటి బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల బాధ్యత చారిత్రాత్మకంగా నిలుస్తుందిని పేర్కోన్నారు. :ఈటలరాజేందర్ మాట్లాడుతూదేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట పత్రిక స్వేచ్ఛ లేదని,  నియంతృత్వ ధోరణి నడుస్తుందని, షోయబ్ ఉల్లా ఖాన్ నిజాం కి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు హత్యచేశారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికా

బతుకమ్మ పండుగను పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలి

Image
*బతుకమ్మ పండుగను పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలి* మహిళా ఉద్యోగులందరు పాల్గోనాలి ప్రతి శాఖల వారిగా ప్రత్యేక బతుకమ్మలతో పాల్గోనాలి. బతుకమ్మ చీరల పంపిణిని నోడల్ అధికారులు పర్యవేక్షించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు 0 0 0 0 ఈనెల  25 నుండి ఎంగిలిపూల  బతుకమ్మ తో ప్రారంభమై  అక్టోబర్ 3న జరుగు సద్దుల బతుకమ్మ వరకు పండుగను ఘనంగా పండుగ వాతావరణం లో నిర్వహించేలా ఏర్పాట్లు ఉండాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.  గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించి అధికారులకు ఏర్పాట్లపై ఆయన దిశానిర్దేశం చేశారు.  ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంబమై సద్దుల బుతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న బతుకమ్మ పండుగ ఏర్పాట్లు జిల్లాలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా  ఘనంగా నిర్వహించాలని అన్నారు. వచ్చే ఆదివారం 25వ తేదినుండి ప్రారంభం కానున్న బతుకమ్మ పండుగను జిల్లాలోని ఎన్.జి.కళాశాల మైదానం లో 9 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్నిశ

రేపటి నుండి 2 రోజుల పాటు ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ కౌన్సిల్ సమావేశాలు - టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు

Image
  రేపటి నుండి 2 రోజుల పాటు ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ కౌన్సిల్ సమావేశాలు - టీజేయు రాష్ట్ర  అధ్యక్షులు కప్పర ప్రసాదరావు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (IFWJ) జాతీయ కౌన్సిల్  సమావేశాలు ఈనెల జరుగనున్నాయి.  సెప్టెంబర్ 23, 24 తేదీలలో జరుగనున్న సమావేశాలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతుండగా.. అధితులు బీజేపీ సెల్ ఓబీజీ మోర్చా ప్రెసిడెంట్, ఎంపీ డా.లక్షణ్, ఎంపీ కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న అతిరథమహారథులకు  స్వాగతం తెలుపుతున్న తెలంగాణ జర్నలిస్టు యూనియన్ .  కాగా ఈ సమావేశాలు పద్మశాలి కళ్యాణమండపం, వెస్ట్ మారేడ్ పల్లీ సికింద్రాబాద్ లో జరుగనున్నాయి.  టీజేయు రాష్ట్ర  అధ్యక్షులు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ... జర్నలిస్టుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  అక్రిడేషన్ తో సంబంధం లేకుండా కొత్తజిల్లాల్లో ఒకే చోట ఇండ్లు ఇవ్వాలని.. హెల్త్ కార్డులు, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, మరణించిన జర్నలిస్టుల కుటుంబానికి నెల నెలకు 20 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు, చిన్న మరియు మధ్యతరహా

తెలంగాణా లో అక్షర యోధులకు అవమానాలు, తెలంగాణలో మోసపోయిన జర్నలిస్ట్- టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్

Image
   తెలంగాణా లో అక్షర యోధులకు అవమానాలు, తెలంగాణలో మోసపోయిన జర్నలిస్ట్- టీజేయు రాష్ట్ర అధ్యక్షులు  కప్పర ప్రసాద్ *తెలంగాణలో మోసపోయిన జర్నలిస్ట్* *ఎనిమిదేండ్ల నుంచి సమాచార శాఖకు మంత్రి లేడు, *పూర్తిస్థాయి కమిషనర్ లేడు* *చతికపడ్డ మీడియా అకాడమీ* *పెద్ద సారు కలవడు *అధికారులు మారరు* *ప్రభుత్వ పక్షాన ఉండే నాయకులు ఆసుపత్రిలో చేరితే సీఎం రిలీఫ్ ఫండ్ లక్షలు .*గ్రామీణ ప్రాంత పేద జర్నలిస్టులకు ఎందుకు రావు అన్నది ఇదో పెద్ద ప్రశ్న* హైదరాబాద్:  తెలంగాణ కోసం ఉద్యమించిన సబ్బండ వర్గాలలో జర్నలిస్ట్ లు ముందువరుసలో ఉన్నారని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు  కప్పర ప్రసాద రావు అన్నారు.  1969నుంచి తెలంగాణ కోసం జర్నలిస్ట్ లు ఉద్యమాలను విడవకుండా కొనసాగిస్తూనే ఉన్నారని. ప్రజలను ఉద్యమం లోకి తీసుకు వచ్చేందుకు కృషి సాగించారుని. చాలా మంది సమైక్య వాదుల మనసు మార్చి వారిని తెలంగాణ వాదులుగా తీర్చి దిద్దిన ఘనత జర్నలిస్టులదేనాని,  రాజకీయ ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమౌతుంది అని భావించిన తరువాత నాయకులను ఉద్యమంలోకి తీసుకు రావడానికి జర్నలిస్టుల దశాబ్దాల కృషి ఉన్నదని. తెలంగాణ సాకారమైతే ప్రజల బతుకుల్లో మార్పు వస్త

*సూదిగాళ్ళు చిక్కారు...*

Image
 *సూదిగాళ్ళు చిక్కారు...*   *సంచలనం కల్గించిన సూదిమందుతో హత్యకేసులో పోలీసుల పురోగతి...*   *మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకునేందుకు 4 బృందాలు...*   *నరిశెట్టి వెంకటేష్, మోహన్ రావు, ఆర్ ఎంపీ బండి వెంకట్*   *అక్రమ సంబందం కు అడ్డోస్తున్నాడనే దారుణం...*

రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని బాబుఖాన్ ఎస్టేట్ లో వ్యభిచార దందా

Image
 రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని బాబుఖాన్ ఎస్టేట్ లో వ్యభిచార దందా పలువురు సెలబ్రిటీలను అదుపులోకి తీసుకున్న పోలిసులు. పిఎస్ కు తరలింపు కొనసాగుతున్న విచారణ. విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న రాయదుర్గం పోలీసులు సెలెబ్రిటీలు ఎవరు లేరని బుకాయింపు

అర్హులందరికి దళితబంధు అమలు చేస్తున్నాం - మంత్రి కొప్పుల ఈశ్వర్

Image
  అర్హులందరికి దళితబంధు అమలు చేస్తున్నాం - మంత్రి కొప్పుల ఈశ్వర్ దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికి ప్రయోజనం చేకూరుతందని రాష్ర్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం నాడు దళిత బంధుపథకం అమలుపై సంబంధిత శాఖ అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ సూచనలను పరిగణలోకి తీసుకొని ఒక్కో నిరుపేద దళితకుటుంబానికి 10 లక్షల అర్ధిక సాయన్ని అందచేస్తున్నట్లు వివరించారు. ఆర్ధికసాయం పొందిన లబ్దిదారులు వారికి నచ్చిన యూనిట్లు స్థాపించుకొని ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 3500 మించి అప్లికేషన్లు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం యూనిట్లు గ్రౌండింగ్ పూర్తి అయ్యిందన్నారు. లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పైరవీలకు తావు లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరిని గుర్తించి యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా నియోజకవర్గ శాసనసభ్యులు సూచించిన లబ్ధిదారులకు కూడా దళితబంధు పథకం వర్తింప చేస్తున్నట్లు మంత్రి కొప్పుల చెప్పారు. అక్కడక్కడ

ఏసీబీ వలలో బులెట్ బండి ఫేమ్ అశోక్

Image
  ఏసీబీ వలలో బులెట్ బండి ఫేమ్ అశోక్ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ సోదాలు... టౌన్ ప్లానర్  అశోక్ 30వేలు లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అదికారులు... ప్రస్తుతం అశోక్ నివాసం లో కొనసాగుతున్న ఏసీబి సోదాలు. బులెట్ బండి ఫేమ్ అశోక్ గా గుర్తింపు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పెళ్లి డాన్స్

కురుమల అభివృద్ధికి తోడ్పడండి - కురుమ రిజర్వేషన్ పోరాట సమితి. KRPS బండి సంజయ్ కు వినతి

Image
 కురుమల అభివృద్ధికి తోడ్పడండి    కురుమ రిజర్వేషన్ పోరాట సమితి. KRPS  బండి సంజయ్ కు వినతి    గొర్రె పిల్ల కోసం పులితో పోరాడే కురుమలకు అన్యాయం చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలి కురుమలను అభివృద్ధి చేయడంలో బిజెపి పార్టీ ముందుంటుంది కురుమలను కేంద్రమంత్రి గవర్నర్ ను చేసిన చరిత్ర బిజెపిది వేల గొర్రెల్లో గొర్రెను గుర్తించే కురుమలకు తమకు అన్యాయం చేస్తున్న పార్టీని గుర్తించి శక్తి ఉంది రాష్ట్రంలో కురుమల ఎదుర్కొంటున్న సమస్యలపై కురుమ రిజర్వేషన్ పోరాట సమితి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కు వినతి పత్రం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల గొర్రెల మందలో ఏ గొర్రె తనతో గుర్తించే కురుమలకు ఏ పార్టీ మేలు చేస్తుందో కూడా గుర్తించే నైపుణ్యం ఉంటుందని కురుమలకు కీడు చేసే పార్టీని ఓడించడంలో కురుమలు ముందుండాలని గొర్రెను కాపాడేందుకు పులితో సాహసం చేసే కురుమలకు రాజకీయంగా కురుమలను అనగ తొక్కాలని చూస్తున్న పార్టీలను భూస్థాపితం చెయ్యడం పెద్ద లెక్కెం కాదని బిజెపి పార్టీ కురుమలకు మద్దతుగా ఉంటుందని బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రిగా గవర్నర్ గా అవకాశం కల్పించిన పార్టీ బిజెపి పార్టీ అన్నారు. ఇప్పటివరకు అసెంబ్లీకి పోనీ కు

*(IFWJ) జాతీయ కౌన్సిల్ సమావేశాల కరపత్రం విడుదల చేసిన: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి*

Image
 *(IFWJ) జాతీయ కౌన్సిల్ సమావేశాల కరపత్రం విడుదల చేసిన: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి*  సెప్టెంబర్ 23 24 తేదీలలో హైదరాబాదులో జరిగే IFWJ జాతీయ కౌన్సిల్ సమావేశాల కరపత్రం  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేసారు. జర్నలిస్ట్ లకి కేంద్రం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు  మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా వివిధ దేశాల నుండి కూడా జర్నలిస్టులు పాల్గొంటారని తెలంగాణలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ సమావేశాలకు పలువురు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు సీనియర్ జర్నలిస్టు పాల్గొంటారని తెలిపారు, 1950లో దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభమైన మొదటి యూనియన్ అని తెలంగాణలో దానికి అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టు యూనియన్ తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం రిజిస్టర్ అయిన మొట్టమొదటి యూనియన్ అని అన్నారు,

వివాహిత మహిళపై అత్యాచారం.

Image
 నల్గొండ జిల్లా:  *వేములపల్లి మండల కేంద్రంలో వివాహిత మహిళపై అత్యాచారం. *చికిత్స కోసం ప్రవేట్ ఆసుపత్రికి తరలింపు. *మూడు రోజుల క్రితం జరిగిన ఘటన. రాజకీయ ఒత్తిళ్లతో  ఆలస్యంగా వెలుగుచూసిన సమాచారం. *అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు సైదులుగా గుర్తింపు.

జయహో జగదీష్ రెడ్డి మంత్రి గారికి అంటూ జై కొట్టిన సూర్యాపేట ఎస్పీ చూడండి వీడియో

Image
  తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో   జయహో జగదీష్ రెడ్డి మంత్రి గారికి అంటూ జై కొట్టిన సూర్యాపేట ఎస్పీ

మేజిషియన్ ప్రవీణ్ కు సన్మానం

Image
 మేజిషియన్ ప్రవీణ్ కు సన్మానం హైదరాబాద్:  మ్యాజిక్ , మిమిక్రీ, మైమ్ (MMM)  మాయావినోదం పేరుతో 1991 సెప్టెంబర్ 16వ తేదీన డా,, కె.వి.రమణాచారి గారి నిర్వహణలో నిర్విరామంగా నిర్వహింపబడినది ఈ మూడురంగాల కళాకారులకు అవాకాశాలు మరియు గుర్తింపు లభించాయి మళ్ళీ ఈ తేదీన ఈ మూడురంగాల కళాకారులను  డా,, కె.వి.రమణాచారి ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో సి.వి.రమణ , జేన్నీ గారు, మల్లం రమేష్ రామడుగు వసంత్ ,  భవిరి శివ , కె.వి.చారి , ప్రవీణ్  , రాంబాబు  మరియు ఇతర కళాకారులు పాల్గొన్నారు

మాదాపూర్ లోని అనుస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఈడి సోదాలు..

Image
 *ఈడీ సోదాలు....* మాదాపూర్ లోని అనుస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఈడి సోదాలు... రెండు తెలుగు రాష్ట్రాల లో ఉన్న అనూస్ బ్యూటీ పార్లర్... మాదాపూర్ లోని అలైఖ్య ప్రవణవ్ హోమ్స్ లో కొనసాగుతున్న ఈడీ సోదాలు.. ఉదయం నుండి  నలుగురు  ఈడి అధికారుల బృందం ఈ సోదాలు నిర్వహిస్తున్నారు...

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవంలో అపశృతి పలువురు విద్యార్థులకు గాయాలు

Image
 బ్రేకింగ్ న్యూస్  నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవంలో అపశృతి పలువురు విద్యార్థులకు గాయాలు -క్యాంప్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభ వద్ద ప్రమాదవశాత్తు ఎల్ఈడి స్క్రీన్ కిందపడి పలువురు విద్యార్థులకు గాయాలు -గాయాలైన విద్యార్థులను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలింపు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి హైదరాబాద్ లో సోదాలు

Image
 ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఈడీ సోదాలు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు

4 విడత ప్రజా సంగ్రామ యాత్ర 5వ రోజు షెడ్యూల్

Image
 బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 16-09-2022 రోజు షెడ్యూల్ BJP Telangana President Shri Bandi Sanjay Kumar 4th Phase Praja Sangrama Yatra Schedule (16-09-2022)  #PrajaSangramaYatra4 🚶DAY 5🚶‍♂️

సచివాలయానికి అంబెడ్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించడం చారిత్రాత్మకమ్ - మంత్రి కొప్పుల ఈశ్వర్

Image
 సచివాలయానికి  అంబెడ్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించడం చారిత్రాత్మకమ్ - మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణా సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడం చారిత్రాత్మకమని రాష్ట్ర యస్ సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. భారతదేశంలో మరెక్కడా లేని విదంగా దళితులను సుసంపన్నం చేసేందుకు గాను దళితబంధు పధకాన్ని ప్రవేశ పెట్టి దళితుల పక్షపాతి గా చాటుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ పేరు పెట్టి దళిత పక్షపాతి అన్న పేరును సార్ధకం చేశారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన అరుదైన గౌరవంగా ఆయన అభివర్ణించారు. ఈ నిర్ణయం యావత్ భారత దేశానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తోందన్నారు.నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కుడా బాబాసాహెబ్ అంబెడ్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. 

మహిళల తిరంగ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభింసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Image
  భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినార్ వద్ద  హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళల తిరంగ బైక్ ర్యాలీని జెండా ఊపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.

షేర్ బంగ్లా సంతోష్ మాత గుడి బంగారం, వెండి ఆభరణాలు బద్రంగానే ఉన్నాయా?

Image
షేర్  బంగ్లా సంతోష్ మాత గుడి బంగారం,  వెండి ఆభరణాలు బద్రంగానే ఉన్నాయా?  నల్గొండ:  షేర్ బంగ్లా సంతోష్ మాత గుడి అమ్మవారి బంగారం,  వెండి ఆభరణాలు  బద్రంగానే ఉన్నాయా? అని సందేహాము వ్యక్తం చేస్తున్న భక్తులు.    రెండు బంగారు నక్ లెస్ లు, దాదాపు 10 బంగారు ముక్కుపుడకలు, బంగారు బొట్టు బిల్లలు, ముద్ద బంగారం   మరియు   4 నుండి 5 కిలోల వెండి భక్తులు భక్తితో అమ్మవారికి సమర్పించినవి ఉన్నట్లు  సమాచారం. ఇక్కడ మేనేజర్ గా  పనిచేసిన వ్యక్తి ట్రాన్సఫర్ అయ్యి దాదాపు 3 నెలలు ఆయునప్పటికి ఇంతవరకు  క్రొత్త మేనేజర్ కు బంగారం, వెండి ఆభరణాలు అప్పగించ లేదని తెలిసింది. దీనితో భక్తుల  మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది.  ఈ విషయం పై ప్రస్తుత మేనేజర్ జయరామయ్య ను వివరణ కోరగా  పాత మేనేజర్  రిజిస్టర్ మాత్రమే ఇచ్చాడని, త్వరలోనే  బంగారం,  వెండి ఆభరణాలను ఇస్తానన్నాడని, తీసుకునే  సమయంలో భక్తుల ముందే తీసుకుంటానని తెలిపారు.  ఈ గుడి లో  నిర్వహణ సక్రమంగా లేదని,  కొత్త గా చార్జి తీసుకున్న మేనేజర్ ఇంత వరకు గుడికే రాలేదని, గుడి చుట్టూ  కంపౌండ్ కట్టకుండా కాంట్రాక్టర్  వదిలి పోయాడని భక్తులు అనుకుంటున్నారు. గుడిలో భక్తులు కానుకలు సమర్పణకు

నాకు లంచం వద్దు* సవాల్

Image
 *నాకు లంచం వద్దు* తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం పాలకీ డు మండలం ఆర్. ఐ చిలకరాజు నర్సయ్య నాకు లంచం వద్దు అని చొక్కా జేబుకు కార్డు పెట్టుకొని తోటి ఉద్యోగులకు సవాల్ విసురుతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది...

మొక్కలు నాటిన ఉప్పల సాయితేజ

Image
  మొక్కలు నాటిన ఉప్పల సాయితేజ హైదరాబాద్:  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  పిలుపు మేరకు తన పుట్టినరోజు సందర్భంగా వారి నివాస ప్రాంగణంలో మొక్కలు నాటిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తనయుడు ఉప్పల సాయితేజ

కొత్త పింఛన్ల పంపిణీ లో ఎమ్మెల్యే కంచర్ల ఆసక్తికర వ్యాఖ్యలు.

Image
 నల్గొండ పట్టణంలో కొత్త పింఛన్ల పంపిణీ లో ఎమ్మెల్యే కంచర్ల ఆసక్తికర వ్యాఖ్యలు.* **తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కెసిఆర్ నాయకత్వంలో  అన్నివిధాల న్యాయం జరుగుతుంది* **తెలంగాణలో రైతుబందు ద్వారా ఆత్మహత్య లు ఆగిపోయినాయి.* **రైతుల కోసం వారి కుటుంబాల కు బాసటగా రైతు బీమా ఇస్తున్న , కెసిఆర్ ను బిజెపి నరేంద్ర మోడీ  ప్రభుత్వం అడ్డుకుంటుంది* *ఆడపిల్లలకు వారి పెళ్లికి 1లక్ష116 లు ఇస్తున్న కెసిఆర్ ను ప్రజలు మహిళలు ఆదరించాలి.* **2000 ,3000 వేల పింఛన్లను ప్రజలకు ఇవ్వకుండా అడ్డుకోవాలని నరేంద్ర మోడీ చూస్తుండు.* *బిజెపి ప్రభుత్వం వున్న రాష్ట్రాలలో పింఛన్లు ఎందుకు 3000 నరేంద్ర మోడీ ఇస్తలేడు చెప్పాలి.* *తెలంగాణా లో ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత కే సి ఆర్ కె ఉంది.* *బిజెపి రాష్టాలలో ఇంకా కరెంటు లేక బుడ్డి దీపాలే ఉన్నాయి.* *నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను  మోడీ సామాన్యులను మళ్ళీ రోడ్డు మీదకు తీసుకువస్తున్నాడు.* **ప్రజలు బిజెపి నీ బొంద పెట్టాలి ఎమ్మెల్యే కంచర్ల  ** **తెలంగాణా రాష్టం కే సి ఆర్ నాయకత్వం  లోనే  అభివృద్ధి చెందుతుందీ.ప్రజలు టీ ఆర్ ఎస్ వెంటే వుండాలి,కారు గుర్తును మర్చిపోవద్దు* **నరేంద్ర మోడీ 100 లక్షల క

ఐఐటీ జేఇఇ/నీట్ 2022 విజేతలకు సన్మాన, అభినందన కార్యక్రమం

Image
  ఐఐటీ జేఇఇ/నీట్ 2022 విజేతలకు   సన్మాన, అభినందన కార్యక్రమం  హైదరాబాద్:; తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటీ జేఇఇ/నీట్ 2022 విజేతలకు MCRHRD లో  సన్మాన, అభినందన కార్యక్రమం నిర్వహించారు.  మంత్రులు  కొప్పుల ఈశ్వర్,హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రాస్, గోట్ అండ్ షీప్ కార్పొరేషన్ ఛైర్మెన్ బాలరాజు యాదవ్ పాల్గొన్నారు.  మంత్రి కొప్పుల ఈశ్వర్ కామెంట్స్.... గురుకులాల వల్ల పేదల విద్యార్థులకు, చదువుకు దూరం ఉన్నవారు గొప్ప అవకాశం పొందుతున్నారని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. ఒకప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు.  కేవలం తెలంగాణ రావడం, 1000 గురుకులాలు నిర్వహించడం వల్ల ఇది సాధ్యమైంది. అద్బుత ఫలితాలు తెస్తున్నాయి, మొత్తం 5 లక్షల మంది దాకా చదువుతున్నారు. ప్రతిభ చాటిన విద్యార్ధులను మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు తెలిపారు. తెలంగాణలో ఐదు లక్షల మందికి విద్యను అందిస్తూ దేశంలోని అగ్రభాగా

డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహ నిర్మాణపు పనులను పరిశీలించిన రాష్ట్ర యస్ సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్, శాసనసభ్యుల బృందం

Image
 డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్  విగ్రహ నిర్మాణపు పనులను పరిశీలించిన రాష్ట్ర యస్ సి సంక్షేమ  శాఖామంత్రి  కొప్పుల ఈశ్వర్, శాసనసభ్యుల బృందం  హైదరాబాద్ నడిబొడ్డున ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని రాష్ట్ర యస్ సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 125 వ జయంతి నాటికి ఇంతటి ఎత్తైన విగ్రహ నిర్మాణపు పనులు పూర్తి చేసిన మీదట ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించే గౌరవానికి ప్రతీకగా ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోని ఎన్ టి ఆర్ గార్డెన్ వద్ద నిర్మించ తలపెట్టిన 125 అడుగుల డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహ నిర్మాణపు పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనసభ్యుల బృందంతో కలసి పరిశీలించారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ రాజ్యాంగాన్ని లిఖించి దేశ ఔన్నత్యాన్ని నిలపెట్టిన బాబాసాహెబ్ అంబెడ్కర్ గౌరవార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ 125 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నందుకు దళిత వర్గాల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

Image
 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నల్గొండ:;తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం తక్షణమే అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం. బిజెపిఆధ్వర్యంలో బైక్ ర్యాలీ  నిర్వహించామనివ్బీజేవైఎం జిల్లా అధ్యక్షులు‌‌ అయిత రాజు సిద్ధూ  తెలుపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అయిన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచ న దినంగా నిర్వహించాలని బీజేపీ కిసాన్ మోర్చ జాతీయ కారువర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు... సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ పట్టణంలో బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు .. బీజేపీ కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు...  ఈ సందర్భంగా గోలి మధుసూధన్ మాట్లాడుతూ...  తెలంగాణ ప్రభుత్వం కొంత మంది కి భయపడి విమోచన దినోత్సవం గా కాకుండా సమైక్యత దినోత్సవం పేరిట జరపడాన్ని ఆయన తప్పు పట్టారు... సెప్టెంబర్ 17ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందనే ప్రకటనతో నే హడావుడిగా 3రోజుల ఉత్సవాలకు సిద్ధమయ్యిందని ఆరోపించారు ... కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్

పురపాలక చట్టం సవరణల పై గవర్నర్ కు లేఖ వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

Image
 పురపాలక చట్టం సవరణల పై  గవర్నర్ కు లేఖ వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైదరాబాద్: పురపాలక చట్టంలో 6 సవరణలు చేస్తూ, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన సవరణ లపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కు కొన్ని అనుమానాలున్నాయిని పేర్కొంటూ రాష్ట్ర గవర్నర్  కు లేక వ్రాసింది. ఈ చట్ట సవరణలకు ఆమోదం తెలిపే ముందుగా తామూవ్ లేవనెత్తిన విషయాలను పరిగణన లోనికి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ ను కోరింది.    యధాతథంగా చదవండి 1. నామినేట్ సభ్యుల పెంపు: హైదరాబాదు పురపాలక సంస్థలో 5 నుంచి 15 కు అలాగే ఇతర పురపాలక సంస్థలలో 5 నుంచి 10 కి నామినేట్ సభ్యుల సంఖ్య పెంచబడింది. నామినేట్ సభ్యులు పురపాలక పనులలో మరియు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉన్నవారుగా ఉండాలని నిర్దేశించినను ఎటువంటి నియమాలు పాటించడంలేదు. హైదరాబాదు మునిసిపల్ చట్టం సెక్షన్ 8 - (ఎ) ప్రకారము ప్రతి మునిసిపల్ వార్డులో స్థానికంగా ఉన్న స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు అలాగే ఇతర నిష్ణాతులతో పురపాలక ఎన్నికల పిదప మూడు నెలలలో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి. కాని మూడు సంవత్సరాలు గడిచినా వాటి ఊసే లేదు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు నామినేట్ సభ్యుల సంఖ్య 15 కు పెంచడం సమంజసంగా లేదు. ఈ చర

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే & బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీ ఈటల రాజేందర్

Image
https://youtu.be/susDngzAqUc  హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నాంపల్లిలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతన్న ఎమ్మెల్యే & బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు  ఈటెల రాజేందర్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈటెల కామెంట్స్: అకారణంగా, అత్యంత దుర్మార్గంగా సస్పెండ్ చేశారు. అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. మరమనిషి అంటే సొంత అలోచన లేకుండా ఇతరులు చెప్పినట్టు చేసే వారు. నేను రాజీనామా చేసినప్పుడు కనీసం నా రాజీనామా లేఖ తీసుకోకుండా నన్ను స్పీకర్  అవమాన పరిచారు.  294 మంది ఎమ్మెల్యేలు, 36 మంది మంత్రులు, 10-12 పార్టీలకు రూమ్ సరిపోయినప్పుడు. ఇప్పుడు రూమ్ కేటాయించకుండా అవమానపరచారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ఉండదు. ఎందుకు ఉండవు అని అడిగినందుకు మమ్ముల్ని సస్పెండ్ చేశారు. స్పీకర్ మా హక్కులు కాపాడలేక పోయారు. BAC కి మమ్ముల్ని పిలవలేదు అని స్పీకర్ గారిని అడిగితే ముఖ్యమంత్రి గారిని పోయి అడగమన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి అసెంబ్లీ

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకి మూడు లక్షల ఎక్స్ గ్రేషియా ... హోం మంత్రి మహమూద్ అలీ

Image
అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకి మూడు లక్షల ఎక్స్ గ్రేషియా ... హోం మంత్రి మహమూద్ అలీ  రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సికింద్రాబాద్ లోని అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని మంగళవారం నాడు అగ్నిమాపక డిజి సంజయ్ జైన్, హైదరాబాద్ నార్త్ జోన్ డి.సి.పి. చందన దీప్తి  మరియు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాద సంఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికీ మూడు లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియ అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. సంఘటనా స్థలంలో లాడ్జింగ్ ఉన్నందువల్ల వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని తెలియజేశారు. చనిపోయిన వారిలో, ఢిల్లీ వాస్త్యవులు రాజీవ్ మాలిక్, సందీప్ మాలిక్, వీరేంద్ర కుమార్,  ఒడిశా రాష్ట్రము బాలాసోర్ వాస్తవ్యులు  మిథాలి మహాపాత్ర, కటక్ వాస్తవ్యులు చందన్ జేతి, ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ వాస్తవ్యులు అల్లాడి హరీష్, చెన్నై నుండి సీతరామన్, యెన్. బాలాజీ లు గా గుర్తించడం జరిగిందని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత దట్టమైన పొగ  వ్యాపించడంతో వీరు ప్రాణాలు కోల్పోయారని ప్రాధమికంగా తెలిసిందన్నారు. ఇది చాలా బాధాకరమని అన

*ఎస్సై స్రవంతి రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి*

Image
 *ఎస్సై స్రవంతి రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి* *మాదిగ జేఏసీజిల్లా అధ్యక్షుడు*        *నెమలి కిషోర్* *ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఎస్సై స్రవంతి రెడ్డి పై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాదిగ  జేఏసీ ఖమ్మంజిల్లా అధ్యక్షులు నెమలి కిషోర్ డిమాండ్ చేశారు*  *ఈ మేరకు ఆయన మంగళవారం మాట్లాడుతూ ఎస్సీ కాలనీ యువకులతో వాగ్వాదానికి దిగిన మహిళ ఎస్సై స్రవంతి రెడ్డి వారిని కులం పేరుతో దూషించటం బాధాకరం అన్నారు* *బాధ్యతగల అధికారినిగా* *వ్యవహరించవలసిన ఎస్సై అన్నీ మరిచి అగ్రకుల అహంకారంతో దళిత యువకులను కులం* *పేరుతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు* *సదురు ఎస్సై పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, విధుల నుండి తొలగించాలన్నారు బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఎస్సీ ఎస్టీల పై దాడులు చేస్తూ కులం పేరుతో దూషిస్తున్న వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తేవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు*.*అలా జరగని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు*

పదిరోజుల్లో రాజాసింగ్ ను విడుదల చేయకపోతే హైద్రాబాద్ ను ముట్టడిస్తాం...అఖిల భారత శ్రీరామ్ సెనా*

Image
  *బ్రేకింగ్*  *పదిరోజుల్లో రాజాసింగ్ ను విడుదల చేయకపోతే హైద్రాబాద్ ను ముట్టడిస్తాం...అఖిల భారత శ్రీరామ్ సెనా* *అఖిల భారత శ్రీరామ్ సేనా జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ మూతాలిక్* రాజాసింగ్ ఎమ్మెల్యే ను కలవడానికి జైల్ కి వెళ్తే అనుమతించలేదు...దీన్ని మేము తీవ్రంగా కండిస్తున్నాము రాజాసింగ్ ఏమైనా టెర్రరిస్టా...ఏంటి అస్సలు ఎందుకు కలవనియారు కర్ణాటకానుండి రాజాసింగ్ కు కలవడానికి వస్తే ...మూలకత్ కు అనుమతించరా తెలంగాణ రాష్ట్ర గౌర్నమెంట్ ఒక ఎమ్మెల్యే రాజసింగ్ పై అక్రమ పిడియాక్ట్ పెట్టడం మేము తీవ్రంగా కండిస్తున్నాము రాజాసింగ్ కు జైల్ లో ఎలాంటి సౌకర్యాలు లేవు రాజాసింగ్ కు ఏమి జరిగిన ప్రభుత్వం కేసీఆర్ ఏ బాద్యుడు ఒక హిందువు ఎమ్మెల్యే పై ఇలాంటి అక్రమ కేసులు పెట్టి జైల్ కు తరలించడం పై భారత దేశ హిందువులందరిని ఏకం చేస్తాం రాజాసింగ్ పై పెట్టిన కేసులు ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే..లక్షలాది మందితో హైద్రాబాద్ ను ముట్టడిస్తాం...అందులో ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఒక ముస్లిం మునవర్ ఫారూఖ్ అలీ హిందువు దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఎలా ఉరుకుంటాం హిందువు దేవుళ్లను కించపరిచిన మునవర్ ఫారుకీ ష

ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు? - కేంద్రానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ సూటి ప్రశ్న

Image
 ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు? - కేంద్రానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ సూటి ప్రశ్న #ఏ పెద్దల మెప్పుకోసం కేంద్ర నిర్ణయాలు?  #చేతి వృత్తులను దెబ్బతీసేందుకు కుట్ర #బండి సంజయ్ యాత్ర ఎందుకూ...? #తెలంగాణాలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల రద్దు కోసమా..? హైదరాబాద్:; ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర యస్.సి.సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.  రైతులు, వెనుకబడిన వర్గాలు.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారి ప్రయోజనాలు దెబ్బతీయడంలో భాగమే అన్నారు. ఎల్ఐసీ, రైల్వే, టెలిఫోన్ రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ వస్తున్న కేంద్రం.. వ్యవసాయ రంగం, కోళ్ల పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమలపై ఆధారపడి జీవనం చేసుకునే వారిని కూడా వదలటం లేదని ఆరోపించారు. ఏ పెద్దల మెప్పుకోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్కో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్ సరఫరా చేసినట్టు కేంద్రం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. దేశ చరిత్రలోనే తొలి సారిగా వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని మంత

*ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ‌కరోనా పాజిటివ్*

Image
 *ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ‌కరోనా పాజిటివ్* హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.  గత రెండు ‌మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న ఎమ్మెల్సీ కవిత, పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్దారణ అయింది.  దీంతో గత కొన్ని రోజులుగా తనను‌ కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. అంతేకాదు కొన్ని రోజుల పాటు హోం ‌ఐసోలేషన్ లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

*పలువురు జిల్లా అటవీ అధికారుల బదిలీ*

 *తెలంగాణ అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు* *17 మంది ఐఎఫ్ఎస్ లు, 8 మంది డీఎఫ్ఓల బదిలీలు, పోస్టింగ్ లు* *పలువురు జిల్లా అటవీ అధికారుల బదిలీ*  *నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్*  *పంచాయితీరాజ్ శాఖ జాయింట్ కమిటిషనర్ గా (డీసీఎఫ్) ప్రదీప్ కుమార్ షెట్టి* *ఫారెస్ట్ అకాడమీలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) గా ప్రవీణ*  *సిద్దిపేట డీఎఫ్ఓగా కే.శ్రీనివాస్* *హన్మకొండ, జనగామ డీఎఫ్ఓగా జే. వసంత* *ములుగు డీఎఫ్ఓగా కిష్టాగౌడ్*  *యాదాద్రి భువనగిరి డీఎఫ్ఓగా పద్మజారాణి* *నిజామాబాద్ డీఎఫ్ఓగా వికాస్ మీనా* *రంగారెడ్డి డీఎఫ్ఓగా జాదవ్ రాహుల్ కిషన్* *నాగర్ కర్నూల్ డీఎఫ్ఓగా జీ. రోహిత్* *మంచిర్యాల డీఎఫ్ఓగా శివ్ ఆశీష్ సింగ్* *ఖమ్మం డీఎఫ్ఓగా సిద్దార్థ్ విక్రమ్ సింగ్* *సంగారెడ్డి డీఎఫ్ఓగా సీ. శ్రీధర్ రావు* *చార్మినార్ సర్కిల్ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓగా వీ. వెంకటేశ్వర రావు* *మున్సిపల్ శాఖ అడిషనల్ డైరెక్టర్ గా ఎం.అశోక్ కుమార్* *అమనగల్ ఫారెస్ట్ డివిజనల్ అధికారిగా వేణుమాధవ రావు* *వికారాబాద్ డీఎఫ్ఓగా డీవీ రెడ్డి* *సూర్యాపేట డీఎఫ్ఓగా వీ. సతీష్ కుమార్* *సూర్యాపేట డీఎఫ్ఓ ముకుంద్ రెడ్డి బదిలీ,

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన గుడికి ఆర్థిక సహాయం అందించిన - పిల్లి రామరాజు యాదవ్

Image
 శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన గుడికి ఆర్థిక సహాయం అందించిన - పిల్లి రామరాజు యాదవ్ తిప్పర్తి మండలం వెంకటద్రిపాలెం గ్రామం ఎస్సీ కాలనీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన నిర్మాణానికి ఆర్థిక సహాయం *20000/-* ఇరవై వేలు అందించిన *TRS పార్టీ నల్గొండ టౌన్ అధ్యక్షులు RKS ఫౌండేషన్ చైర్మన్ 8 వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్  అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు శేఖర్ గారు నాగయ్యగారు శ్రీను జానయ్య లచ్చయ్యగారు శివలింగం గారు పరమేష్  రాజు  చెరుకుపల్లి గారు మరియు తదితరులు పాల్గొన్నారు..

సీఎం కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ

Image
సీఎం కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ  హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను ఆయన కలిశారు. నేతలిద్దరూ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌, కుమారస్వామి చర్చిస్తున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై నేతలిద్దరూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఇప్పటికే బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామితో చర్చించారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీల నేతలతో చర్చించారు. భాజపాను గద్దె దించేందుకు కలిసి రావాలని ఆయా పార్టీల నేతలను కోరారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ వచ్చిన కుమారస్వామి.. కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.