Posts

Showing posts from September, 2021

చర్లపల్లి 16 వ వార్డులో జాతీయ జెండా ఆవిష్కరణ

Image
  చర్లపల్లి 16 వ వార్డులో జాతీయ జెండా ఆవిష్కరణ నల్గొండ: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చర్లపల్లి 16 వ వార్డులో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో లో బిజెపి రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ జిల్లా నాయకులు రాపోలు విద్యాసాగర్ బద్దం నగేష్ రాపోలు భాస్కర్ గోని సుధాకర్ నాగేశ్వరరావు సుంకరబోయిన శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు

అయ్యో పాపం ఆ వృద్దురాలు.. చేతిదాక వచ్చిన సొంతిల్లు చేజారిపోయిందా ..?

 అయ్యో పాపం ఆ వృద్దురాలు.. చేతిదాక వచ్చిన సొంతిల్లు చేజారిపోయిందా ..? కొడుకు ఉపాధి మార్గమే కొంప ముంచిందా ..? వృద్దాప్యంలో తల్లిదండ్రులకు నిలువ నీడకలిపించి వారి ఆలన ..పాలన చూడాల్సిన కొడుకు చేసే పని ఆ ముసలి తల్లికి ప్రభుత్వం నుండి అందే ప్రభుత్వ ఫలం అందకుండా ఆమెను నిలువ నీడకు దూరం చేసిన విషయం ఆ ప్రాంతంలో అందరిని కలిచివేసింది. ఆమె చిన్న నాటి నుండి కన్న కల ఒక్కటే సొంత ఇల్లు తండ్రి దండ్రులు వంటపని చేసుకొని జీవనం సాగించే వారు. అనంతర వివాహం జరిగిన తరువాత భర్త కూడా సాదా సీదా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. అనారోగ్యం సమస్యతో బాదపడుతూ మంచి వైద్యం అందించేందుకు ఆర్దిక స్తోమత లేక మృత్యువాత పడ్డాడు.  ఇద్దరు పిల్లలు ఆడ పిల్లను వారి కుటుంబ పరిస్తితిని అర్దం చేసుకున్న మనసున్న మనిషి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక అబ్బాయి డిగ్రీ వరకు చదువుకొని కంప్యూటర్‌ నేర్చుకొని ప్రభుత్వం మీసేవ కోసం వేసిన నోటిఫికేషన్‌లో అర్హత సాధించి స్తానికంగా మీసేవ నడుపుకుంటూ వారిరువురు జీవనం సాగిస్తున్నారు. 2019లో ఆమెకు చాతిలో పెద్ద గడ్డకావటంతో హైద్రాబాద్‌లోని కిమ్స్‌కు తీసుకెళితే సుమారు ఒక్కరోజే 30వేల రూపాయల టెస్ట