Skip to main content

Posts

Showing posts from April, 2020

కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి  కె  చంద్రశేఖర్ రావు

కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి  కె  చంద్రశేఖర్ రావు గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్న క్రమంలో ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను ముఖ్యమంత్రి  కె  చంద్రశేఖర్ రావు అప్రమత్తం చేశారు.  ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో కేసులు పెరుగకుండా చూడాలని ఆదేశించారు.  సిఎం గారి ఆదేశాలమేరకు చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్,  ముఖ్యమంత్రి గారి ముఖ్యకార్యదర్శి నర్సింగా రావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంత కుమారి, మున్సిపల్ , వ్యవసాయ శాఖ ముఖ్య  కార్యదర్శులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. సిఎం  సూచనల మేరకు కంటైన్మెంట్ ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్ శాఖల సమన్వయంతో పని చేస్తున్నాయని సిఎం  నివేదించినట్లు మంత్రి తెలియజేశారు.  ఈ రోజు 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 1038 కి చేరుకున్నాయి.  మలకపెట్ గంజ్ లో పనిచేస్తున్నపహాడీ షరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్లో ముగ్గురు షాపుల యజమానులకు, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులక

ఆరు కిలోల కోత ఎలా -జీవన్‌రెడ్డి

తెలంగాణధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యటించిన జీవన్‌రెడ్డి జగిత్యాల: కొనుగోలు కేంద్రాల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పర్యటించారు. కొనుగోళ్లు పూర్తయ్యాక రైతుకు ఏం సంబంధమని వారిని మిల్లర్ల దగ్గరకి ఎందుకు పంపుతున్నారని ప్రశ్నించారు. క్వింటాకు ఆరు కిలోల కోత ఎలా చేస్తారని నిలదీశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. మిల్లర్లతో అధికారులు కుమ్మక్కయ్యారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.

తెలంగాణలో కరోనా కేసుల తాజా సమాచారం

తెలంగాణలో కరోనా కేసుల తాజా సమాచారం తేది : 29-04-2020 ఈరోజు 7  పాజిటివ్ కేసులు నమోదు  ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు* : 1016 కరోనాతో మరణించిన వారు 25. ఇప్పటి వరకు వ్యాధి తగ్గి డిశ్చార్జ్ అయిన వారు 406 ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్న వారు585

హరీస్, హాలిమ్ విక్రయాలు సాగిస్తు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి

హరీస్, హాలిమ్ విక్రయాలు సాగిస్తు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి హాలిమ్, హారీస్ కౌంటర్లకు ఎక్కడా అనుమతి ఇవ్వలేదు బేకరీలు, పాన్, కిరాణా షాపులు  కౌంటర్లు ఏర్పాటు చేయడం నిషేధం వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ ఆధ్వర్యంలో కేసుల నమోదు నల్లగొండ : లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి హరీస్, హాలీమ్ కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్న అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణంలో వన్ తౌన్ పరిధిలో రాయల్ సి కేఫ్, స్పైసి హోటల్, గ్రాండ్ హోటల్స్ నిర్వాహకులు, సిబ్బంది లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ నేతృత్వంలో కేసులు నమోదు చేశామని చెప్పారు. హరీస్, హాలిమ్ విక్రయాలు సాగిస్తున్న స్పైసి హోటల్ నిర్వాహకుడు యం.డి.ఫరీదుద్దీన్, అందులో పని చేసే ముస్తాక్, రాయల్ సి కేఫ్ నిర్వాహకుడు ఇమ్రాన్, అందులో వంట మాస్టర్ గా పని చేసే మహ్మద్ లతీఫ్, గ్రాండ్ హోటల్ నిర్వాహకుడు షేక్ అరిఫ్ లను అదుపులోకి తీసుకొని ఏపీడమిక్ డిసిస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టుల కింద కేసు

బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ భాద్యతలు స్వీకరణ

బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ భాద్యతలు స్వీకరణ బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్  బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించే ముందు పూజాధికార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యరద్శి పి.మురళీధర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, వివేక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్-29-ఆంధ్రప్రదేశ్-కరోనా-బులిటీన్

ఏపి లో 1332 కి చేరుకున్న కరోన పాజిటివ్ కేసులు. గడిచిన 24 గంటల్లో73 కేసులు నమోదు అయ్యాయి. అత్యందికంగా గుంటూరు లో 29 కేసులు నమెదు  అయ్యాయి. ఆక్టివ్ కేసులు 1014, ఇప్పటివరకు 287 డిశ్చార్జ్ అయ్యారు, 31 మంది  మృతి చెందారు.    

ఏప్రిల్ 28-తెలంగాణ-కరోనా-సమాచారం

ఏప్రిల్ 28-తెలంగాణ-కరోనా-సమాచారం ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే 6 పాజిటివ్ కేసులు రాష్ట్రలో 1009 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో 25 మంది చనిపోయారు ఇవాళ 42 మంది డిశ్చార్జి మొత్తం 374 మంది డిశ్చార్జి అక్టీవ్ కేసుల 610

జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల బీమా కల్పించాలి- తెలంగాణ సీఎస్ కు తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ వినతి

జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల బీమా కల్పించాలి- తెలంగాణ సీఎస్ కు తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ వినతి తెలంగాణలోని ప్రతి జర్నలిస్టుకూ రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవికుమార్, ప్రధాన కార్యదర్శి మేకల క్రుష్ణ కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కలిసి  వారు వినతిపత్రం సమర్పించారు. నానాటికీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి ఏ విధంగా అయితే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారో, అదేవిధంగా ప్రాణాలు సైతంగా ఫణంగా పెట్టి పనిచేస్తున్న జర్నలిస్టులకూ బీమాను వర్తింపజేయాలని మనవి చేశారు. ఇప్పటికే పలు రాష్ర్ట ప్రభుత్వాలు జర్నలిస్టులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయాన్ని  తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవికుమార్ గుర్తు చేశారు. అలాగే.. ఈ విపత్కర సమయంలో ప్రతి జర్నలిస్టు కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు. మరోవైపు..తెలంగాణలో పత్రికలు, చిన్న పత్రికలు, చానళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి వాటిని ఆదుకోవాలని  తెలంగాణ జర్నలిస

ఏప్రిల్ 27- తెలంగాణ కరోనా బులిటీన్

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ. తెలంగాణలో ఇవాళ కొత్తగా  2   పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇవాళ 16 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం 332  మంది  కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణా లో  1003 కేసులు, తెలంగాణా లో అక్టీవ్ కేసులు 646,  ఇప్పటి వరకు 25 మంది మృతి. ఇవాళ  జిహెచ్ఎంసీ లో  రెండు కేసులు నమోదు అయ్యాయి.    

మాస్కులు, శానిటైజార్స్  లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు అందచేసిన ఫిషన్ ల్యాబ్స్ ఫౌండర్,ఎం.డి. NRI పో రెడ్డి కిషోర్ 

మాస్కులు, శానిటైజార్స్  లను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు అందచేసిన ఫిషన్ ల్యాబ్స్ ఫౌండర్,ఎం.డి. NRI పో రెడ్డి కిషోర్  నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఫిషన్ ల్యాబ్స్ ఫౌండర్,ఎం.డి. NRI పో రెడ్డి కిషోర్... కరోనా పై శ్రమిస్తున్న  వైద్య ఆరోగ్య, పోలీస్, జర్నలిస్టులకు  మాస్కులు, శానిటైజార్స్  ఉచితంగా పంపిణీ చేయుటకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్   రాహుల్ శర్మలకు సోమవారం అంద  చేశారు .

టిఆర్ఎస్  జెండాను ఎగురవేసిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంచనపల్లి రవీందర్ రావు

టిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు టిఆర్ఎస్  జెండాను ఎగురవేసిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంచనపల్లి రవీందర్ రావు  

ఔదార్యం చాటుకున్న సుంకరి మల్లేష్ గౌడ్- అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి

 ఔదార్యం చాటుకున్న సుంకరి మల్లేష్ గౌడ్- అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి కరోనా వైరస్ మీద రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న పోరాటానికి ఆర్ధికంగా మద్దతు తెలుపుతూ పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అందులో బాగంగా సోమవారం ఉదయం నల్గొండ లోని టి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి ని కలసి లక్షా 8 వేల చెక్ ను సీనియర్ టి ఆర్ యస్ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్ అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మరిని తరిమెందుకు చేస్తున్న ప్రయత్నాలకు తోడు మల్లేష్ గౌడ్ లాంటి నేతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆర్ధికంగా మద్దతు తెలపడం అభినంద నియమన్నారు. ఈ కార్యక్రమానికి నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మాజీ యం ఎల్ సి పూల రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 26, తెలంగాణ బులిటీన్

  ఏప్రిల్ 26, తెలంగాణ బులిటీన్ కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ తెలంగాణలో ఇవాళ కొత్తగా  11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. ఇవాళ 9 మంది డిశ్చార్జి. ఇప్పటి వరకు 316  మంది  కోలుకుని డిశ్చార్జి. ఇప్పటి వరకు తెలంగాణా లో  1001 కేసులు. తెలంగాణా లో అక్టీవ్ కేసులు..660. ఇప్పటి వరకు 25 మంది మృతి.

సూర్యపేట జిల్లా కేంద్రంలో  మెడిసిన్స్ తో పాటు ఇటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు

  సూర్యాపేట జిల్లా కేంద్రంలో  మెడిసిన్స్ తో పాటు ఇటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు  లాక్ డౌన్ పూర్తిగా అమలులో ఉన్న సూర్యపేట జిల్లా కేంద్రంలో అటు మెడిసిన్స్ తో పాటు ఇటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తాజా పరిణామాల పై ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక సమీక్ష నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పలు అంశాలపై సుదీర్ఘంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి భాస్కరన్ లతో పాటు అదనపు కలెక్టర్ సంజీవ్ రెడ్డి పి డి డి ఆర్ డి ఏ. కిరణ్ కుమార్ ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి, స్థానిక మున్సిపల్ కమిషనర్ రామంజూల్ రెడ్డి తదితరులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.గడిచిన నాలుగు రోజులుగా జరుగుతున్న పురోగతి తో పాటు లాక్ డౌన్ అమలులో బాగంగా కంటైన్మెంట్ జోన్ లుగా గుర్తించిన ప్రాంతాలను అధికారులు మ్యాప్ లతో సహా మంత్రి జగదీష్ రెడ్డి కి వివరించారు. ఎక్కడికక్కడ పటిష్టవంతమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.అన్నింటినీ సమీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్

పార్టీ ఆవిర్భావ వేడుకలను యిండ్లలోనే జరుపుకోవాలి-ఉమ్మడి నల్గొండ జిల్లా లీడర్, క్యాడర్ కు మంత్రి జగదీష్ రెడ్డీ

పార్టీ ఆవిర్భావ వేడుకలను యిండ్లలోనే జరుపుకోవాలి-ఉమ్మడి నల్గొండ జిల్లా లీడర్, క్యాడర్ కు మంత్రి జగదీష్ రెడ్డీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం వేడుకలను లీడర్, క్యాడర్ వారి వారి యిండ్లలోనే జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరి ఇండ్ల మీద వారే జెండా ఆవిష్కరించు కోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రబలడంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఈ రకంగా జరుపుకోవాలని అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారని అందుకు అనుగుణంగానే మనం జరుపుకోవాలని కోరారు. కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ వీరోచితంగా పోరాడుతున్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో పాలు పంచుకునే లీడర్, క్యాడర్,ప్రజాప్రతినిధులు విధిగా బౌతిక దూరం పాటించాలని మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు. కరోనా మహమ్మారి పై జరుగుతున్న యుద్ధం లో జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకత ఉందని అందుకు గులాబీ శ్రేణులు సన్నద్ధం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.  నల్గొండలో నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయంలో జరుగుతున్న పార్టీ ఆవిర్భావ దినోత్

తెలంగాణ కరోనా హెల్త్ బులిటిన్ - ఏప్రిల్ 25

  కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ తెలంగాణలో ఇవాళ కొత్తగా  7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..  ఇప్పటి వరకు 25 మంది మృతి  307  మంది  కోలుకుని డిశ్చార్జి ఇప్పటి వరకు తెలంగాణా లో  990 కేసులు తెలంగాణా లో అక్టీవ్ కేసులు..658

నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచి వుంచుకోవచ్చు : ఎస్పీ రంగనాధ్

నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచి వుంచుకోవచ్చు : ఎస్పీ రంగనాధ్ జి.ఓ. 45 ప్రకారం అనుమతించబడిన దుకాణాలు అన్నీ సాయంత్రం 6.00 వరకు తెరిచి ఉంచే వెసులుబాటు ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలిగించవద్దని సూచన లాక్ డౌన్ నిబంధనల ప్రకారం అందరూ సహకరించాలి నల్లగొండ : లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.నెంబర్ 45 ప్రకారం అనుమతించబడిన నిత్యావసర సరుకుల దుకాణాలు, కిరాణా, పాల దుకాణాలు సాయంత్రం 6.00 గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు కల్పించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు. జిల్లాలో అనేక ప్రాంతాలలో మధ్యాహ్నం తర్వాత దుకాణాలు మూసివేస్తున్నారని దీనివల్ల ప్రజలు    ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జి.ఓ. 45లో సూచించిన దుకాణదారులంతా ఉదయం 6.00 నుండి సాయంత్రం 6.00 వరకు తెరిచి ఉంచే వెసులుబాటు కల్పించారని ఆయన చెప్పారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని, లాక్ డౌన్ లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించిందని, వ్యాపారులు పోలీసులతో సహకరిస్తూ లాక్ డౌన్ నిబంధనలు పాటించడంతో పాటు ప్రతి షాప్ వద్ద విధిగా సామాజిక దూరం

లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి - కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా

లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి - కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా స్థానికంగా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు ప్రజలంతా తప్పనిసరిగా మాస్కు ధరించాలి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయించిన రంగాల్లో జాగ్రత్తలు పాటించాలి ఉపాధి హామీ పనులు, గ్రామీణ అభివృద్ధి పనులకు అనుమతి వ్యవసాయాధారిత పనులు ఆటంకం కలిగించవద్దు వలస కూలీల కనీస వసతులు కల్పించాలి కోవిడ్ 19 వైరస్ నివారణ, పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎస్ లు,జిల్లా కలెక్టర్ లు,ఎస్.పి.లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నల్గొండ, ఏప్రిల్ 25:  కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణ కొరకు చేపట్టిన లాక్ డౌన్ అమలు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు,జిల్లా కలెక్టర్ లు, ఎస్. పి.లకు సూచించారు. లాక్ డౌన్ అమలు తీరు పై తీసుకుంటున్న చర్యలపై ఆయన శనివారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు,జిల్లా కలెక్టర్ లు,ఎస్.పి.లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ప్రపంచంలోని అగ్ర రాజ్యాల సైతం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో తీవ్ర సంక

ఏప్రిల్ 25 - AP కరోనా బులిటీన్ -

ఏపీలో 1016కు చేరిన కరోనా పాజిటీవ్ కేసులు* గడిచిన 24గంటల్లో కొత్తగా 61 పాజిటీవ్ కేసులు నమోదు కృష్ణాజిల్లాలో మరింత విజృంభిస్తున కరోనా గడిచిన 24గంటల్లో కృష్ణ లో కొత్తగా 25 పాజిటీవ్ కేసులు నమోదు.జిల్లాలో మొత్తం 127కు చేరిన పాజిటీవ్ కేసులు. కృష్ణా జిల్లా ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

GMR పెట్రోలింగ్  డ్రైవర్   మృతి

GMR పెట్రోలింగ్  డ్రైవర్   మృతి మెదక్ జిల్లా:- నార్సింగి మండలం సంకాపూర్ చౌరస్తా వద్ద  పాల వ్యాన్  బోల్తా , GMR పెట్రోలింగ్ వెహికిల్ క్రేన్ సాయంతో వ్యాన్ ను  తీస్తుండగా, వెనక నుండి స్పీడ్ గా వస్తున్న మరో వ్యాన్ GMR పెట్రోలింగ్ వెహికల్ ను డి కొట్టగా పెట్రోలింగ్  డ్రైవర్  ప్రశాంత్ మృతి.

నల్గొండ   జిల్లా ఎప్రిల్ 24,   కరోనా బులిటెన్

నల్గొండ   జిల్లా ఎప్రిల్ 24,   కరోనా బులిటెన్ నల్గొండ జిల్లా ఎప్రిల్ 24 కరోనా బులిటీన్ ను  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారు. ఈ రోజు కరోనా  పాజిటివ్ కేసులు రాలేదని  పేర్కొన్నారు.  ఈ రోజు వరకు మొత్తం 15 పాజిటివ్ కేసులు.  

ఢిల్లీలో దారుణం.. అత్త, మామలను కడతేర్చిన కోడలు

ఢిల్లీలో దారుణం.. అత్త, మామలను కడతేర్చిన కోడలు కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో దేశ రాజధానిలో దారుణం జరిగింది. భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగానే అత్తా, మామలను అత్యంత కిరాతకంగా@@ కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో దేశ రాజధానిలో దారుణం జరిగింది. భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగానే అత్తా, మామలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కోడలు ఉదంతం వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీ చావ్లా ప్రాంతంలోని దుర్గా విహార్‌ ఫేజ్‌-2లోని తమ ఇంటిలో కవిత (35) అనే మహిళ తన అత్తమామలు రాజ్‌ సింగ్‌(61), ఓంవతి (58)లను దారుణంగా కొట్టి ఆపై కసితీరా కత్తితో పొడిచి చంపిందని పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె భర్త సతీష్‌ సింగ్‌ (37)నూ ఈ కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. జంట హత్యల కేసులో కవిత, ఆమె భర్తను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 రూ.1400 కోట్లు మహిళా సంఘాల ఖాతాల్లో వేసిన ఏపీ సీఎం జగన్

 రూ.1400 కోట్లు మహిళా సంఘాల ఖాతాల్లో వేసిన ఏపీ సీఎం జగన్ సెర్ప్, మెప్మా పరిధి ప్రాంతాల్లోని పొదుపు సంఘాల ఖాతాల్లో నగదు జమ 90,37,254 మంది మహిళలకు లబ్ధి 'వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం' కింద సాయం కట్టవలసిన మొత్తం వడ్డీని వేసిన ప్రభుత్వం  కరోనా విజృంభణ నేపథ్యంలో మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు సీఎం జగన్ ఈ రోజు సున్నా వడ్డీ పథకం ప్రారంభించారు. ఈ మేరకు రూ.1400 కోట్లు విడుదల చేశారు. వడ్డీ కింద ఈ డబ్బులు జమ చేస్తారు.  ఈ మేరకు రూ.1400 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఏపీలో 90,37,254 మందికి లబ్ధి చేకూరుతుంది. 'వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం' కింద స్వయం సహాయక సంఘాలు  2019, ఏప్రిల్ 1 నుండి 2020, మార్చి 31 వరకు కట్టవలసిన మొత్తం వడ్డీ రూ.1400 కోట్లను మహిళల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆయా సంఘాల ఖాతాల్లో జమచేసింది. సెర్ప్, మెప్మా పరిధి ప్రాంతాల్లోని పొదుపు సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ అయింది. దీని వల్ల పేద మహిళలకు ఎంతగానో లాభం చేకూరుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా ఒకే ఒక్క క్లిక్‌తో సీఎం జగన్‌ నగదు బదిలీ  చేశారు. దీంతో సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండ

ఇండియన్ రెడ్ క్రాస్ నివారణ  విభాగం కన్వీనర్ గా డాక్టర్ కాచం సత్యనారాయణ

  హైదరాబాద్: ఇండియన్ రెడ్ క్రాస్  గ్రేటర్ హైదరాబాద్ విపత్తు నివారణ  విభాగం కన్వీనర్ గా డాక్టర్ కాచం సత్యనారాయణ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గ్రేటర్ హైదరాబాద్ విపత్తు నివారణ  విభాగం కన్వీనర్గా డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా నియమిస్తూ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని రెడ్క్రాస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన  కార్యక్రమంలో నియామక ఉత్తర్వులను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ  రెడ్ క్రాస్ సంస్థ లో బాధ్యతాయుతమైన హోదా దక్కడం ఎంతో బలాన్నిచ్చింది అన్నారు . లాక్ డౌన్ నే పద్యంలో గడిచిన నెల రోజులుగా ప్రతిరోజు 1500 మంది పోలీస్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు నిర్వాసితులకు బిర్యానీ బాక్సులు పంపిణీ చేస్తున్నామన్నారు . రెడ్ క్రాస్  వారు తనకు గౌరవ స్థానాన్ని ఇచ్చి బాధ్యతలు రెట్టింపు చేశారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. STAY HOME - STAY SAFE భౌతిక దూరం పాటించండి - మా స్కులు ధరించండి

తెలంగాణ  ఎప్రిల్ 23,  కరోనా బులిటెన్

తెలంగాణ  ఎప్రిల్ 23,  కరోనా బులిటెన్ తెలంగాణ  ఎప్రిల్ 23  రోజున కరోనా 27 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసులు 970. ఈ రోజు 58 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం డిశ్చార్జెస్  252,   ఈ రోజు ఒకరు మరణించారు. మొత్తం మరణాలు 25. మొత్తం ఆక్టివ్ కేసులు 693 STAY HOME - STAY SAFE భౌతిక దూరం పాటించండి - మా స్కులు ధరించండి

నల్గొండ   జిల్లా ఎప్రిల్ 23,  కరోనా బులిటెన్

నల్గొండ   జిల్లా ఎప్రిల్ 23,  కరోనా బులిటెన్ నల్గొండ జిల్లా ఎప్రిల్ 23 కరోనా బులిటీన్ ను  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారు. ఈ రోజు కరోనా  పాజిటివ్ కేసులు రాలేదని  పేర్కొన్నారు.  ఈ రోజు వరకు మొత్తం 15 పాజిటివ్ కేసులు. STAY HOME - STAY SAFE భౌతిక దూరం పాటించండి - మా స్కులు ధరించండి

సూర్యాపేట  జిల్లా ఎప్రిల్ 23, కరోనా బులిటెన్

సూర్యాపేట  జిల్లా ఎప్రిల్ 23,  కరోనా బులిటెన్ జిల్లా ఎప్రిల్ 23 కరోనా బులిటీన్ ను  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారు. ఈ రోజు కరోనా  పాజిటివ్ కేసులు రాలేదని  పేర్కొన్నారు.  ఈ రోజు వరకు మొత్తం 83 పాజిటివ్ కేసులు, STAY HOME - STAY SAFE భౌతిక దూరం పాటించండి - మా స్కులు ధరించండి

ఆర్ణబ్ గోస్వామి పై దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు

ఆర్ణబ్ గోస్వామి పై దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు. సీనియర్ పాత్రికేయుడు, ఎడిటర్ ఆర్ణబ్ గోస్వామి పై  దాడి చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ)లు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో తమ భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తీకరించే జర్నలిస్టులపై దాడులు చేయడం సరైంది కాదని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, వర్కింగ్ కమిటీ సభ్యులు ఎల్గొయి ప్రభాకర్ లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులకు  రాజకీయ,మతపరమైన సంస్థలు, పార్టీలతో సంబంధం లేకుండా ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తీకరించే హక్కు వుంటుందని అన్నారు. జర్నలిస్టులు వ్యక్తపరిచే అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వ్యక్తపరిచేందుకు అనేక మార్గాలున్నాయని,కానీ ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడడం సరైంది కాదని, ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని అన్నారు. ఆర్ణబ్ గోస్వామి పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. STAY HOME - STAY SAFE భౌతిక దూరం

ఆంధ్రప్రదేశ్  హెల్త్ బులిటెన్  23 ఏప్రిల్

ఆంధ్రప్రదేశ్  హెల్త్ బులిటెన్  23 ఏప్రిల్ నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు ఆంద్రప్రదేశ్ లో  6522 మంది సాంపిల్స్ సేకరణ ఏపీలో కొత్తగా 80 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కొత్తగా కర్నూలులో 31, గుంటూరు 18, చిత్తూరు 14 కేసులు అనంతపురం 6, తూర్పుగోదావరి జిల్లా 6,  కృష్ణా 2 ప్రకాశం 2 విశాఖ 1 కేసు నమోదు రాష్ట్రంలో 893కు పెరిగిన కరోనా కేసులు  కర్నూలు జిల్లాలో 234 కేసులు, గుంటూరు జిల్లాలో 195 కేసులు  ఇప్పటి వరకు 27 మంది మృతి చెందగా... 141 మంది డిశ్చార్జ్   STAY HOME - STAY SAFE భౌతిక దూరం పాటించండి - మా స్కులు ధరించండి

బీజేపీ ఆధ్వర్యంలో 22 వ రోజు భోజన వితరణ

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 22వ రోజు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కీర్తిశేషులు శ్రీ గుండ గోని సైదులు గౌడ్  శంకరమ్మ గార్ల జ్ఞాపకార్ధం వారి కుమారులు శ్రీ గుండ గోని గిరిబాబు రాష్ట్ర బిజెపి నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గుండ గాని పరమేష్   సహాయ సహకారాలతో భోజన వితరణ కార్యక్రమం నిర్వహించారు.           ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్సిపల్ ఫ్లోర్లీడర్  బండారు ప్రసాద్  బిజెపి  నాయకులు  మొరిశెట్టి నాగేశ్వరరావు,  పొగాకు నాగరాజు  మంగళపల్లి కిషన్ గారు పరశురాం  కుమ్మరి కుంట సాయి  సైదులు తదితరులు పాల్గొన్నారు STAY HOME - STAY SAFE భౌతిక దూరం పాటించండి - మా స్కులు ధరించండి

ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ:  ఏప్రిల్  22 వరకు పురోగతి 

  ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ:  ఏప్రిల్  22 వరకు పురోగతి  ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద 33 కోట్లకు పైగా పేదలకు 31,235 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం లభించింది.  మహిళా జన ధన్ ఖాతాదారులకు రూ .10,025 కోట్లు 20.05 కోట్లకు పంపిణీ చేశారు  సుమారు 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ .1405 కోట్లు పంపిణీ చేశారు  పిఎం-కిసాన్ మొదటి విడత: 8 కోట్ల మంది రైతులకు రూ .16,146 కోట్లు బదిలీ  68,775 స్థావరాలలో రూ .162 కోట్లు ఇపిఎఫ్ సహకారంగా బదిలీ చేయబడి 10.6 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూర్చింది;  2.17 కోట్ల భవనం; నిర్మాణ కార్మికులకు 3497 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం లభించింది ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ఆన్ యోజన 39.27 కోట్ల మంది లబ్ధిదారులు ఆహార ధాన్యాల ఉచిత రేషన్ పంపిణీ చేశారు పప్పుధాన్యాల 1,09,227 మెట్రిక్ టన్నులు; వివిధ రాష్ట్రాలు / యుటిలకు పంపించారు  ప్రధాన్ మంత్రి ఉజ్జ్వాల యోజన: 2.66 కోట్ల ఉచిత ఉజ్జ్వాలా సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయి   భౌతిక దూరం పాటించండి - మాస్కు ధరించండి కరోనా  నివారణకు పాటు పడండి  

జర్నలిస్టులకు మోడీ రేషన్ కిట్లను అందచేసిన నల్గొండ బీజేపీ

భౌతిక దూరం పాటించండి - మస్కులు ధరించండ జర్నలిస్టులకు మోడీ రేషన్ కిట్లను అందచేసిన నల్గొండ బీజేపీ కరోనా వైరస్ కారణంగా లాక్ ఔట్ వల్ల నెలరోజులు గా అనేక ఇబ్బందులు పడుతూ 24 గంటలు శ్రమిస్తూ,ప్రాణాలను సైతం  లెక్క చేయకుండా ప్రజలకు  కరోనా వైరస్ అప్డేట్ వార్తలు అందిస్తూన్న విలేకరులకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి  సౌజన్యం తో మోడీ రేషన్ కిట్లల ను గురువారం ఈ రోజు  ఉదయం 10.30  గంటలకు  బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రా  నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి,బాకీ పాపయ్య,బండారు ప్రసాద్,పట్టణ అధ్యక్షుడు నిమ్మల రాజా శేఖర్ రెడ్డి, జగ్జీవన్, యదగిరచారీ,కంచర్ల విద్యాసాగర్ రెడ్డి,కిషన్ తదితరులు పాల్గొన్నారు STAY HOME - STAY SAFE భౌతిక దూరం పాటించండి - మస్కులు ధరించండి

ఎమ్మెల్యే కంచర్ల కు  ముఖ్యమంత్రి సహాయనిధికి 50 వేల చెక్కును అందచేసిన మనోరమ హోటల్ యాజమాన్యం

భౌతిక దూరం పాటించండి - మాస్కు ధరించండి కరోనా  నివారణకు పాటు పడండ ఎమ్మెల్యే కంచర్ల కు  ముఖ్యమంత్రి సహాయనిధికి 50 వేల చెక్కును అందచేసిన మనోరమ హోటల్ యాజమాన్యం నల్లగొండ మనోరమ హోటల్ కు చెందిన యాజమాన్యం బాలాజీ నాయక్, గద్దర్ (కాసాల) నర్సిరెడ్డి, రేగట్ట నవీన్ రెడ్డి.. 50,000/-రూపాయలు విలువ  చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధి( రిలీఫ్ ఫండ్) కు గాను నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ  రెక్కాడితే కానీ డొక్కాడని పేద వర్గాలకు కరోనా శాపంగా పరిణమించినదని దాతలు  పదిమందికి సహాయపడాలనే మనసున్న వారు ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని  కోరారు. విరాళాలు అందించిన మనోరమ హోటల్ యజమానులకు  కృతజ్ఞతలు తెలియజేశారు. నల్లగొండ నియోజకవర్గంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి తమ తమ పరిధిలో వంట సామాగ్రి అన్నదానం  మాస్కులు శానిటరీ కిట్ లు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్. పదో వార్డు కౌన్సిలర్ ఆంగోతు ప్రదీప్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న

కరోనా కట్టడకి కేరళ ఏంచేసింది - కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు ఎందుకు

STAY HOME   STAY SAFE  కరోనా కట్టడికి  కేరళ ఏంచేసింది. కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు ఎందుకు కరోనా కట్టడిలో చర్యలు భళా. కరోనాని కట్టడి చేయాలంటే లాక్‌డౌన్, భౌతిక దూరం. ఇవి రెండే చాలవు, ఇంకా చాలా చేయాలి. ఆ పని చేసి చూపించింది కేరళలో పి.విజయన్‌ ప్రభుత్వం. ప్రపంచం మేల్కొనక ముందే కళ్లు తెరిచింది. కరోనా ఎంత భయంకరంగా కమ్మేస్తుందో తెలుసుకుంది ముందుగా జాగ్రత్త పడింది. అదే పదిమందికి స్ఫూర్తినిస్తోంది ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీ, కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసి వలస కూలీలకు, నిలువ నీడలేని వారికి ఆహార పొట్లాలు అందిస్తోంది.     *తిరువనంతపురం:* ప్రాణాంతక నిఫా వంటి వైరస్‌లు, వరదలు వంటి ప్రకృతి బీభత్సాలను ఎదుర్కొన్న అనుభవం కేరళకి బాగా కలిసి వచ్చింది. భారత్‌లో తొలి కేసు నమోదైన రాష్ట్రమైన కేరళ రికవరీలోనూ ముందుంది. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. చదరపు కిలోమీటర్‌కి 860 మంది వరకు నివసిస్తారు. విదేశీ రాకపోకలు ఎక్కువే. గల్ఫ్‌ దేశాలలో కేరళ కార్మికులే ఎక్కువ. ఇక చైనాలోని వూహాన్‌లో చదువుకునే వైద్య విద్యార్థులు అధికభాగం కేరళ వారే. 60 ఏళ్ల వయసు పై బడిన జనాభా 12 శాతం. ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులు ఎక్కువే. అయినా కరోనా కట్టడి చర్య

మీడియాను దూషించిన సాయికిరణ్ రెడ్డి పై కేసు నమోదు

మీడియాను దూషించిన సాయికిరణ్ రెడ్డి పై కేసు నమోదు...  మీడియాని దూషిస్తూ.. రిపోర్టర్ల అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డ.. మల్కాజిగిరి కి చెందిన సాయి కిరణ్ రెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన జర్నలిస్టులు. మీడియా ప్రతనిధుల అంతు చూస్తామని బెదిరించిన sai   సోషల్ మీడియాలో మీడియా ఛానల్లను, రిపోర్టర్ లను అంతు చూస్తానంటూ రెచ్చగొడుతూ వీడియో అప్ లోడ్ చేసిన సాయికిరణ్.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.  ఇప్పటికే నగరంలోని పలు పోలీస్ స్టేషన్ లలో సాయి కిరణ్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన పలువురు జర్నలిస్టులు.

తెలంగాణలో  ఏప్రిల్ 22 బులిటీన్,  15  కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో  ఏప్రిల్ 22 బులిటీన్,  15  కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణ లో 22 ఏప్రిల్ బులిటీన్లో  ఈ రోజు 15 కరోనా  పాజిటివ్ కేసులు వచ్చాయని  ఒక్కరు మరణించారని  పేర్కొన్నారు. మొత్తం ఆక్టివ్ కేసులు 725.   ఇప్పటి వరకు రికవరీ అయిన కేసులు 194,  మరణించిన వారు 24.

యాదాద్రి భువనగిరి జిల్లా ఎప్రిల్ 22 కరోనా బులిటీన్ (Zero+ve cases)

యాదాద్రి భువనగిరి జిల్లా ఎప్రిల్ 22 కరోనా బులిటీన యాదాద్రి భువనగిరి జిల్లా ఎప్రిల్ 22 కరోనా బులిటీన్ ను విడుదల చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి.  ఈ బులిటీన్లో   జిల్లా లో ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు లేవని పేర్కొన్నారు.   

అనవసరంగా బయటికి వస్తే చర్యలు తప్పవు : ఎస్పీ రంగనాధ్

అనవసరంగా బయటికి వస్తే చర్యలు తప్పవు : ఎస్పీ రంగనాధ్  నల్లగొండ, మిర్యాలగూడ రెడ్ జోన్లు, దామరచర్ల రిలీఫ్ క్యాంపు పరిశీలించిన ఎస్పీ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశం నల్లగొండ : కరోనా బారి నుండి ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని, అనవసరంగా బయటికి వస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ హెచ్చరించారు. బుధవారం ఆయన నల్లగొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ ప్రాంతాలలో రెడ్ జోన్లతో పాటు దామరచర్లలోని రిలీఫ్ క్యాంపును పరిశీలించారు. రిలీఫ్ క్యాంపులో ఏర్పాటు చేస్తున్న భోజనాన్ని ఆయన పరిశీలించి వారితో మాట్లాడారు. కరోనా వైరస్ పెరిగిపోతున్న మే 7వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని, అందువల్ల ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లాలని, అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని సూచించారు. లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటిష్టంగా చర్యలు తీసుకుంటూ జిల్లాలో కోవిడ్ - 19 కేసులు పెరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట స్థానిక పోలీస్ అధికారులు నిగిడాల సురేష్, రమేష్ బాబు తదితరులున్నారు.

సూర్యాపేట జిల్లా కరోనా బులిటీన్  ఏప్రిల్ 22

సూర్యాపేట జిల్లా కరోనా బులిటీన్  ఏప్రిల్ 22 సూర్యాపేట జిల్లాలో ఈ రోజు 3 కేసులు పాజిటివ్,  మొత్తం కేసులు 83,   

వలస కూలీలు, కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్

వలస కూలీలు, కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ లాక్ డౌన్ నేపథ్యంలో కూలీలు, కార్మికులు, రేషన్ కార్డులు లేని వారిని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ కోరారు.బుధవారం స్పెషల్ కలెక్టర్  రాహుల్ శర్మ ను కలిసి వలస కార్మికులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ తో ప్రభుత్వాలు లాక్ క్ డౌన్ విధించడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు, వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వారికి ప్రభుత్వం తగిన వసతి కల్పించి నిత్యావసర సరుకులను అందజేయాలని కోరారు.దీపం పథకం కింద మహిళా సంఘాలకు ఉచితంగా సిలిండర్ లను కూడా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్ సమీపిస్తున్నందున రైతులు ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం కావలసిన అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరారు.లాక్ డౌన్ లో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు అందరికీ బ్యాంకులలో 1500 రూపాయలు జమ చేస్తానని పేర్కొనగా, ఇంకా చాలామంది ఖాతాలో డబ్బులు జమ కాలేదని పేర్కొన్నారు. రేషన్ కార్డు దారులు అందరికీ బ్యాంకులో డబ్బులు జమ అయ్య

TS  ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ , వీ త్రీ న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో  జూనియర్ ఆర్టిస్టులకు, సినీ కార్మికులకు  నిత్యావసర సరుకుల పంపిణీ 

TS  ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ , వీ త్రీ న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో  జూనియర్ ఆర్టిస్టులకు, సినీ కార్మికులకు  నిత్యావసర సరుకుల పంపిణీ  లాక్ డాన్ కారణంగా తెలంగాణ సినీ కార్మికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని  భువనగిరి మాజీ ఎంపీ  Dr బూర నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు.  తెరపై అందరికీ వినోదాన్ని పంచే సినీ కార్మికులు ఇప్పుడు చేతినిండా పని లేక తెరవెనుక దుఃఖాన్ని దిగమింగుతూ ఉన్నారన్నారు. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ , వీ త్రీ న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ జూనియర్ ఆర్టిస్టులకు, సినీ కార్మికులకు  Rice నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. (100 members )ఈ కార్యక్రమానికి  భువనగిరి మాజీ ఎంపీ Dr బూర నర్సయ్య , తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్  Dr ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు . ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సినీ కార్మికులకు అండగా ఉండేందుకే తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ TFCC ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఈ ఛాంబర్ తోడు నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వి త్రి న్యూస్ చైర్మన్, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో  వీడియో కాల్ కాన్ఫిరెన్సు లో రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్.

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో  వీడియో కాల్ కాన్ఫిరెన్సు లో రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్.   వీడియో కూడా చూడండి. https://youtu.be/WDxCKFe3HGI వీడియో కాల్ కాన్ఫెరెన్సులో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో పాల్గొన్న రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్. కరోనా నేపథ్యంలో  IVF ద్వారా రాష్ట్రంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి వివరించారు.  తెలంగాణలో కేసీఆర్ కరోనా నివారణకు చేపడుతున్న  కార్యక్రమాలు వివరించారు.  ఈ వీడియో కన్ఫరెన్సీలో ఫౌండర్ ప్రేసిడెంట్  అశోక్ అగర్వాల్ జి ,ఐవీఫ్ పది రాష్ట్రాల అధ్యక్షులు,హాంగ్ కాంగ్ ,ఇతర దేశాల ఐవీఫ్ అధ్యక్షులు పాల్గొన్నారు.  రాష్ట్రం లో సేవ కార్యక్రమాలు చేపట్టిన ఉప్పల శ్రీనివాస్ ను అభినందించిన  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.  

సూర్యాపేటలో కరోనా నివారణకు సమర్థవంతంగా  పనిచేసేందుకు  అదనపు అదికారులను నియమించాం-CS సోమేశ్ కుమార్

కరోనా నివారణకు సమర్థవంతంగా  పనిచేసేందుకు  అదనపు అదికారులను నియమించాం-CS సోమేశ్ కుమార్ సూర్యాపేట జిల్లా :-  సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 83 కి చేరడంతో ప్రభుత్వం అప్రమాత్రమై  నివారణ చర్యలు తీసుకుంటున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల  మేరకు CS సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డిలు సూర్యాపేటను సందర్శించారు.  CS సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్,  జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డిలు జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్,  కన్ టైన్ మెంట్ జోన్ లను, వాటి చుట్టు ప్రక్కల పరిసరాలను పరుశీలించారు. ఈ సందర్బంగాసీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ సూర్యాపేట లో ఇప్పటివరకు 83 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, నేరుగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని సీఎం కెసిఆర్ ఆదేశించారని తెలిపారు. దీనిపై మరింత సమర్థ వంతంగా పనిచేసేందుకు అదనపు అదికారులను నియమించామని, కంటైన్మెంట్ జోన్లలో జీరో మూవ్ మెంట్ చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు.ఆర్ అండ్ బీ వాళ్లకు తగిన సూచనలు చేశామని, ఆయా ప్రాంతాలకు కొత్తవారు ఏవరు వచ్చారనేదానిపై సర్వే చేయాలని నిర్ణయిం

50 లక్షల బీమా పథకాన్ని అమలు చేయాలి-టీయూడబ్ల్యూజే (ఐ జే యు)డిమాండ్

50 లక్షల బీమా పథకాన్ని అమలు చేయాలి-టీయూడబ్ల్యూజే (ఐ జే యు)డిమాండ్ కరోనా మహమ్మారిని అరికట్టడంలో వైద్య ఆరోగ్య మున్సిపల్ పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులు ఉద్యోగుల తో పాటుగా జర్నలిస్టులు కూడా ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని వారికి కూడా కేంద్రం ప్రకటించిన 50 లక్షల బీమా పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఇండియన్ జర్నలిస్టుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి ముంబైలో లో 53 మంది జర్నలిస్టులకు కరోనా వ్యాధి సోకిన నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు ప్రత్యేక బీమా పథకాన్ని అమలు చేయడంతోపాటు  వారి కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని గుర్తించాలని టీయూడబ్ల్యూజే (ఐ జే యు) అధ్యక్షులు నగునూరి శేఖర్,  ప్ర.కార్యదర్శి కే. విరాహత్అలీ  డిమాండ్ చేశారు.  తమిళనాడు ప్రభుత్వం వారి రాష్ట్రంలో లో పనిచేస్తున్న జర్నలిస్టులకు లాక్ డౌన్ కాలంలో నెలకు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడాన్ని గుర్తు చేస్తున్నామని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆర్థిక బీమా పథకాలను ప్రకటించాలని టీయ

సంస్కారం

                                  సంస్కారం రాజస్థాన్ లోని సికర్ జిల్లా లోని ఒక గ్రామంలో కొంతమంది  కార్మికులను ఒక పాఠశాల భవనంలో క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. ఊరక తిని కూర్చోవడంతో విసుగెత్తిపోయింది. ఆ పాఠశాల భవనానికి ఎన్నో ఏళ్ళుగా సున్నం లేదా పెయింటింగ్ చేయడం జరగలేదని ఆ క్వారంటైన్ లో ఉన్న కార్మికులకు అనిపించింది. వాళ్ళు వెంటనే ఆ గ్రామ సర్పంచ్ తో పాఠశాల భవనానికి పెయింట్ వేస్తామని ప్రస్తావన చేశారు. దాంతో ఆ సర్పంచ్ అవసరమైన వస్తువులు తెప్పించాడు. కార్మికులు తమ క్వారంటైన్ వ్యవధి ముగిసేలోగా భవనానికి పెయింట్ వేసేశారు. ఆ పని చేసినందుకు ఆ గ్రామ సర్పంచ్ , వారికి డబ్బులివ్వబోతే, మాకు ఇన్నాళ్ళూ ఉచితంగా భోజనాలు పెట్టారు. అందుకుగాను మేమూ ఏదో ఒకటి చేయాలనుకున్నాము. పాఠశాల భవనానికి పెయింట్ వేసే అవకాశం లభించింది. మాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు.అయినా మీరు ఏమైనా ఇవ్వదలచుకుంటే మీ ఊరి ఈ పాఠశాలకే ఇవ్వండి అని , డబ్బును నిరాకరించారు.                  ఇదీ సంస్కారం. - మరోవైపు చూస్తే, దీనికి భిన్నంగా విధ్వంసకాండ, ఉన్న ప్రదేశాన్ని అసహ్యంగా మార్చుకోవడం అపరిశుభ్రంగా తయారు చేయడం, వైద్యులు, నర్సుల పట్ల అసహ్య ప్రవర్తన,

ఆంద్రప్రదేశ్ కరోనా బులిటీన్, ఏప్రిల్ 22

24గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదు... పెరిగిన కేసులతో కలుపుకొని ఏపీలో 813కు చేరుకున్న పాజిటివ్ కేసుల సంఖ్య కర్నూల్ 19,  గుంటూరులో 19, చిత్తూర్ 6, కడపలో 5, కృష్ణా 3, ప్రకాశంలో 4 కేసులు నమోదు గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో ఇద్దరు మృతి ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ తో 24 మంది మృతి మొత్తం 5757 మంది శాంపిల్స్ పరీక్ష ఆసుపత్రి నుంచి 120 మంది కోలుకుని డిశ్చార్జ్ ప్రస్తుతం 669 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స

తెలంగాణలో 56  కరోనా పాజిటివ్ కేసులు, ఏప్రిల్ 21 బులిటీన్

తెలంగాణలో 56  కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణ లో 21 ఏప్రిల్ ఈ రోజు 56 కేసులు కరోనా పాజిటివ్.  రికవరీ 8 కేసులు, మొత్తం ఆక్టివ్ కేసులు 711.  ఇప్పటి వరకు రికవరీ అయిన కేసులు 194, ఇప్పట్టి వరకు మరణించిన వారు 23.

సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది.... ఈ ఒక్కరోజే   సూర్య పేట లో 26 కరోన పాజిటివ్ కేసులు

సూర్య పేట జిల్లా.. సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది.... ఈ ఒక్కరోజే   సూర్య పేట లో 26 కరోన పాజిటివ్ కేసులు నమోదు.. ఈ ఫలితాల తో సూర్యాపేట రాష్ట్రంలో 2వ స్థానానికి చేరింది.. నిన్నటి వరకు సూర్య పేట జిల్లాలో 54 కరోన పాజిటివ్ కేసులు ఉండగా ఈరోజు వచ్చిన ఫలితాలలో మరో 26మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు....  దీంతో సూర్య పేట జిల్లా లో మొత్తం కరోన పాజిటివ్ కేసులు 80కి చేరాయి... కోవిడ్-19 తీవ్రత నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు సూర్య పేటకు మున్సిపల్ పరిపాలన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి. వేణు గోపాల్ రెడ్డి ని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డి) గా నియమిస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ అడ్మనిస్ట్రేషన్ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి.

జర్నలిస్టులందరూ జాగ్రత్తలు తీసుకోవాలి -  రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం

జర్నలిస్టులందరూ జాగ్రత్తలు తీసుకోవాలి -  రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం ముంబయిలో 53 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకిన వార్తలు వస్తున్నందున తెలుగు రాష్టాల్లోని జర్నలిస్టులందరూ ఈ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు.   వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు,  పారిశుధ్య కార్మికులు, పారిశుధ్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా వైరస్ ప్రభావం పొంచి ఉన్నప్పటికీ జర్నలిస్టులు సమాచార సేకరణ కోసం విధి నిర్వహణలో నిరంతరం పాల్గొంటున్నారు. ఇట్లాంటి క్లిష్ట  పరిస్థితిలో జర్నలిస్టులు వృత్తి కత్తి మీద సాము లాంటిది. వార్తలు, సమాచారం కోసం అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాపించిన ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉన్నందున, జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. వృత్తి కన్నా ప్రాణం విలువైనదని, ముందుగా ప్రాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులనుండి వస్తున్న సమాచారం మేరకు జర్నలిస్టులు కరోనా వైరస్ పట్ల తగిన జాగ్రత్తలు పాటించడం లేదని తెలియవస్తున్నదని ఈ

ఆహారం పంపిణి చేసిన  ఇద్దరు మునిసిపల్ కౌన్సిల్లెర్స్ కి పాజిటివ్, జాగ్రత్తలు తీసుకొండని దాతలకు సూచించిన నల్గొండ ఎస్పీ రంగనాధ్

ఆహారం పంపిణి చేసిన  ఇద్దరు మునిసిపల్ కౌన్సిల్లెర్స్ కి పాజిటివ్, జాగ్రత్తలు తీసుకొండని దాతలకు సూచించిన నల్గొండ ఎస్పీ రంగనాధ్. గద్వాల్‌లోని ఇద్దరు మున్సిపాల్ కౌన్సిలర్లకు  కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, వారు ఆహారం, కిరాణా పంపిణీలో పాల్గొన్నారని మీ మీ ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండని దాతలకు సూచించిన  నల్గొండ ఎస్పీ రంగనాధ్.

కరోనా AP బులిటీన్, 21 ఏప్రిల్

కరోనా AP బులిటీన్,  21 ఏప్రిల్

రెండో దశ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు, భోజన వితరణ చేసే వారంతా పార్సిల్ విధానంలో అన్నదానం చేయాలి-  ఎస్పీ రంగనాధ్ 

రెండో దశ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు, భోజన వితరణ చేసే వారంతా పార్సిల్ విధానంలో అన్నదానం చేయాలి-  ఎస్పీ రంగనాధ్  రెడ్ జోన్ల పరిధిలో ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు అన్నదానం చేసే వ్యక్తులు, సంస్థలను పార్సిల్స్ పద్ధతిలో మాత్రమే అనుమతిస్తాం  లాక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కేసులు తప్పవు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు మరింత బాధ్యతాయుతంగా సహకరించాలి లాక్ డౌన్ పటిష్ట అమలుకు పోలీసులతో సహకరించండి నల్లగొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఆదేశాల మేరకు బుధవారం నుండి రెండో దశ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు. కోవిడ్ - 19 వ్యాప్తి నియంత్రణ లక్ష్యంగా అమలు జరుగుతున్న లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయడమే కాకుండా వాటిని ఎవరు ఉల్లంఘించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ - 19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను పోలీస్ శాఖ చేపడుతుందని స్పష్టం చేశారు. జిల్లాలోని రెడ్ జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాల పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు అనుమతించడం జరగదని, అదే సమయం

పేకాట స్థావరాలపై పోలిసుల దాడులు

భద్రాద్రి కొత్తగూడెం :భద్రాచలంలోని ఏ ఎంసీ కాలనీలో  పేకాట స్థావరాలపై పోలిసుల దాడులు.  పేకాట ఆడుతున్న 10మందిని అరెస్ట్ చేసి 4వేల960 నగదు స్వాధీనం చేసుకున్న ఎసై నరేష్ 

కరోనా తెలంగాణ ఏప్రిల్ 20 బులిటీన్

కరోనా తెలంగాణ ఏప్రిల్ 20 బులిటీన్

సింగిల్ లేడీ కావాలంటే ఈ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టండని మోసం

  ఫ్రెండ్ షిప్  పేరుతో మోసం.  మీకు సింగిల్ లేడీ కావాలంటే ఈ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టండి.  గంటలో మీ ఇంట్లో ఉంటుంది అని ఫేస్ బుక్ లో ఫోన్ నెంబర్ పెట్టిన సైబర్ నేరగాళ్లు.  అమ్మాయి అనుకోని చాటింగ్ చేసినా హైదరాబాద్ బొల్లారం కు చెందిన వ్యక్తి.  చాటింగ్ చేస్తూ సైబర్ లేడీ పంపించిన అకౌంట్లకు 91000 వేల రూపాయల నగదు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్  చేసిన బాధితుడు.  డబ్బులు రావడంతో నంబర్ బ్లాక్ చేసిన చీటర్.  మోసపోయానని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు..

కోవిడ్19 నల్గొండ బులిటీన్, 20 ఏప్రిల్

కోవిడ్19 నల్గొండ  బులిటీన్, 20 ఏప్రిల్

కోవిడ్19 ఆంద్రప్రదేశ్ బులిటీన్, 20 ఏప్రిల్

కోవిడ్19 ఆంద్రప్రదేశ్  బులిటీన్, 20 ఏప్రిల్.  

కేసులు ఎత్తివేయాలని సీపీని కలిసిన టీయూడబ్ల్యూజే బృందం

కేసులు ఎత్తివేయాలని సీపీని కలిసిన టీయూడబ్ల్యూజే బృందం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ లో రెండు న్యూస్ చానళ్ల ప్రతినిధులపై పై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మోతే వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధి బృదం సోమవారం రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ విలేకరులపై పెట్టిన కేసులను ఎత్తివేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ప్రచారాలు చేయవద్దని, పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ ప్రతినిధులు బాల్ రాజ్, రాయుడు, అశోక్, బాలాజీ, నరసింహా రెడ్డి, మహేష్, రవికుమార్, పవన్ , తేజ తదితరులు పాల్గొన్నారు.

మాస్కు పెట్టుకుంటేనే పెట్రోల్

  మాస్కు లేకుంటే పెట్రోల్  పోయనంటున్న   డీలర్లు పెట్రోల్ కొట్టించుకునేందుకు వెళుతున్నారా.. అయితే జేబులో డబ్బులు ఉంటే సరిపోదు.. ముఖానికి మాస్కు కూడా ఉండాలి.. అవును మాస్కు లేకుండా పెట్రోల్ బంకుకు వచ్చిన వారికి  పెట్రోల్  అమ్మవద్దని  డీలర్లు నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ పంపులు సంవత్సరం పొడవునా.. 24 గంటలూ తెరిచే ఉంటాయి. వీటిలో పనిచేసేవారు ఎల్లప్పుడూ కస్టమర్లతో ప్రత్యక్షంగా కాంటాక్ట్‌లో ఉండవలసి ఉంటుందని వారి రక్షణ కూడా మా  భాద్యత అని  డీలర్లు అంటున్నారు.  ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా పాటించేందుకు కూడా ఈ నియమం ఉపయోగపడుతుంది.  మాస్కు లేకుండా ఏ కస్టమర్ వచ్చినా వారికి పెట్రోల్‌ను ఎట్టిపరిస్థితీుల్లో విక్రయించేది లేద’ని వారు తేల్చి చెప్పారు. ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఉన్న పెట్రోల్ బంకుకు వచ్చిన ఓ కస్టమర్‌ను మాస్క్ ధరించాల్సిందిగా అక్కడి సిబ్బంది కోరారు. అంతేకాకుండా మాస్క్ లేకపోవడంతో అతడికి పెట్రోల్‌ను విక్రయించేందుకూ వారు నిరాకరించారు. దీనిని ఆ కస్టమర్‌ కూడా సమర్థించారు. .

ఓ జర్నలిస్టు  ఆవేదన

ఓ జర్నలిస్టు  ఆవేదన అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే మనం గొప్పగా చూపిస్తాం కానిస్టేబుల్ చిన్న సహాయం చేసిన గొప్పగా చిత్రీకరించి చూపిస్తాం పోలీస్ కన్నా నిజమైన హీరో ఎవరులేరని ప్రజలమదిలో గుర్తుండిపోయేలా కథనాలు వేస్తాం ప్రతి దృశ్యం వాళ్ళని ఉన్నతులుగా చూపించే ప్రయత్నం చేస్తాం ఎన్నోసార్లు వాళ్ళు ఫోన్ చేసి మేము ఈ పని చేసాం కాస్త మాకు పబ్లిసిటి ఇవ్వండి అని విన్నవిస్తే మనవాళ్లే కదా అని పరిధికి మించి సహాయాం చేస్తాం... వాళ్లకు నచ్చని న్యూస్ స్క్రోలింగ్ వస్తే కేవలం ఫోన్ చేసి చెబితే మన వృత్తి ధర్మాన్ని పక్కనబెట్టి సహకరిస్తాం ఎన్ని ఘటనలు ఎన్ని తప్పులు....అయినా ప్రజల శ్రేయస్సు అధికారుల పట్ల గౌరవంతో రాజి పడతాం... ఒక చిన్న స్క్రోలింగ్ ని ఆసరా చేసుకుని రిపోర్టర్ మీద కేసు పెడతారా? ఒక పోలీస్ ఫిర్యాదు చేయడమేంటి ? దాని ఆధారంగా అదే పోలీసుస్టేషన్ అధికారి కేసు ఫైల్ చేయడమేంటి? ఎందుకింత డ్రామా?  కమిషనేర్ కి తెలియకుండా నే ఇదంతా జరిగిందా? స్క్రోలింగ్ తప్పు అయితే ఫోన్ చేసి చెబితే మార్చేవారు కదా? చేసారా...? రోజుకి పదులసంఖ్యలో మెసేజిలు ఫోటోలు వీడియోలు మీరు పంపిస్తే మీరు కేసు పెట్టిన రిపోర్టర్ కూడా వాళ్ళ ఛానల్ లో వ

జీతాలు సక్కగా ఇవ్వటం లేదని మానవ హక్కుల  కమిషన్ కు  ఫిర్యాదు

జీతాలు సక్కగా ఇవ్వటం లేదని మానవ హక్కుల  కమిషన్ కు  ఫిర్యాదు కరీంనగర్ జిల్లా శాతవాహన విశ్వవిద్యాలయం లో.  పని చేస్తున్నా డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రవీందర్ లాక్ డౌన్ లో భాగంగా జీతాలు ఇవ్వట్లేదని  చాలా ఇబ్బందులు గురవుతున్నామని. ఈమెయిల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్. కమిషన్ స్పందిస్తూ సమగ్ర విచారణ జరిపి. మే15 తారీకు వరకు రిపోర్టు ఇవ్వాలని. శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్టర్ కు ఆదేశాలు జారీ చేసిన కమిషన్.

సైబర్ మోసాలు జర జాగ్రత్త

సైబర్ మోసాలు జర జాగ్రత్త హైదరాబాద్ ఫోన్ పే కు క్యాష్ బ్యాక్ఆఫర్ వచ్చిందంటూ మోసం.  ఓపెన్ చేసి చూడమని చెప్పిన సైబర్ నేరగాళ్లు.  ఫోన్ పే మెసేజ్ ని చదవకుండానే క్లిక్ చేసిన బషీర్ బాగ్ చెందిన.  సర్వేష్ jaiswal అనే బిజినెస్ మాన్. అతని అకౌంట్ నుండి 59 వేల నగదు డ్రా చేసిన.  సైబర్ చీటర్ మోసపోయాను గమనించి.  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు                  మరో మోసం పేటీఎం కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఫోన్ కు వచ్చిన మెసేజెస్ లోని.  నెంబర్ కు ఫోన్ చేసిన అంబర్ పేట్ లోని బాగ్ అంబర్ చెందిన శ్రీనివాస్ చారి అనే వ్యక్తి.  నంబర్ కట్ చేసి మరో నంబర్ తో ఫోన్ చేసిన చీటర్.  వారు చెప్పినట్టు హాప్ డౌన్లోడ్ చేసుకొని కేవైసీ నంబర్ అప్డేట్ చేసిన బాధితుడు.  ఈ అకౌంట్ నంబర్ అప్డేట్ కావడం లేదని. మరో అకౌంట్ నెంబర్ ఉంటే చెప్పమని సైబర్ నేరగాళ్లు అడగడంతో మరో అకౌంట్ నెంబర్ చెప్పిన బాధితుడు.  రెండు అకౌంట్ నెంబర్ లో నుండి 70 వేల నగదు  ద్వారా డ్రా చేసిన మోసగాళ్లు. తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు. ఫిర్యాదు చేసిన బాధితుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు. కెనడాలో ఉద్య

నల్గొండ జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.

నల్గొండ : బ్రేకింగ్.... జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా. జిల్లాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా. నిన్న కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ కొడుకు,కూతురుకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ. జిల్లాలో 15కు చేరిన కరోనా పాజిటివ్ ల సంఖ్య. ఈ కుటుంబం ఢిల్లీ మర్కజ్ సభకు వెళ్లొచ్చిన ప్రైమరీ కేసులుగా అనుమానం.

దివ్యాంగు లు ఎటువంటి సమస్య వున్నా ఉచిత టోల్ ప్రీ  నంబర్ 1800 572 8980 కు ఫోన్ చేయండి-నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

దివ్యాంగు లు ఎటువంటి సమస్య వున్నా ఉచిత టోల్ ప్రీ  నంబర్ 1800 572 8980 కు ఫోన్ చేయండి-నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కరోనా వ్యాప్తి నియంత్రణకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దివ్యాంగు లు ఎటువంటి సమస్య వున్నా దివ్యాంగులు,సీనియర్ సిటిజన్స్  సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత టోల్ ప్రీ  నంబర్ 1800 572 8980 కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటన లో తెలిపారు.అదే విధంగా సీనియర్ సిటిజన్స్ ఎటువంటి సమస్య ఉన్నా కోసం ఏర్పాటు చేసిన టోల్ ప్రీ  నంబర్ 14567 కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ఈ టోల్ ప్రీ నంబర్ సేవలు ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు వారం లో 7 రోజులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

రక్తదానం చేసిన  చిరంజీవి

రక్తదానం చేసిన  చిరంజీవి రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో…బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గుతున్నాయి.  ఈ క్రమంలో తన వంతు సాయంగా సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ డొనేట్ చేశారు. హైదరాబాద్ లోని బ్లడ్ బ్యాంకులో ఆయన రక్తదానం చేశారు. లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు అందించే బ్లడ్ బ్యాంకులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా ఉండేందుకు, వాటిలో రక్త నిల్వలు తగ్గకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌జ‌లు అభిమానులు విరివిగా ర‌క్త‌దానం చేయాల‌ని అందుకు స‌మీప బ్ల‌డ్ బ్యాంక్స్ కి వెళ్లాల‌ని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు . అంతేకాదు లాక్ డౌన్ ఉన్నా ర‌క్త‌దానం చేయొద్ద‌ని ఎవ‌రూ ఆప‌రని.. పోలీసులతో ఏ ఇబ్బందీ రాదన్నారు. ర‌క్త‌దానం చేస్తున్నాం అని తెల‌ప‌గానే బ్ల‌డ్ బ్యాంక్ వారి నుంచి మీ ఫోన్ వాట్సాప్ కు పాస్ వ‌స్తుంది. అది పోలీసుల‌కు చూపిస్తే స‌రిపోతుందని తెలిపారు చిరంజీవి.

అక్రమ కేసును ఎత్తివేయాలి-టీయుడబ్ల్యుజె డిమాండ్

అక్రమ కేసును ఎత్తివేయాలి-టీయుడబ్ల్యుజె డిమాండ్ మేడ్చల్ జిల్లా నేరేడ్ మెట్ లో కరోనా పాజిటివ్ వార్తను ప్రసారం చేసిన రెండు న్యూస్ ఛానళ్ల ప్రతినిధులపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె)  రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ లు ఖండించారు. రాష్ట్రంలో కరోనాను నిర్మూలించేందుకు గాను ప్రభుత్వం చేస్తున్న కృషికి పూర్తి చేయూతనందిస్తూ మీడియా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోందని,  కొన్ని వాస్తవాలను కొందరు అధికారులు దాచిపెట్టే ప్రయత్నాలు చేయడం సమాజానికి నష్టం చేకూర్చే విధంగా ఉండడంతో, మీడియా మాత్రం వాస్తవాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తోందని, . దీనిని జీర్ణించుకోలేకే పథకం ప్రకారం మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కే ప్రయత్నాలు చేయడం సహించారని చర్యగా భావిస్తున్నామని తెలుపారు.  నేరేడ్ మెట్ లో పోలీసులు అదే పని చేసారని ఒక వ్యక్తికి కరోనా పాజిటీవ్ ఉన్న నిజాన్ని NTv, AP24 న్యూస్ ఛానెల్స్ బహిర్గతం చేసాయని. అధికార యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేసిన ఈ మీడియా సంస్థలను అభినందించాల్సిం

కరోనా AP బులిటీన్ 19 ఏప్రిల్

కరోనా AP బులిటీన్ 19 ఏప్రిల్

అధిక ధరలకు విక్రయం.. షాప్  సీజ్

అధిక ధరలకు విక్రయం.. షాప్  సీజ్ సంగారెడ్డి : సదాశివపేటలో అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న కిరాణా షాపును అధికారులు సీజ్ చేశారు. శనివారం సదాశివపేటలోని కిరాణా దుకాణాలను మున్సిపల్ కమిషనర్ స్పందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిరాణా షాపుల్లో ధరల పట్టికను డిస్‌ప్లే చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలకు వస్తువులను విక్రయించడంపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంతో ఓ షాపును సీజ్ చేశారు

లాక్ డౌన్ లో పుట్టింట్లోనే ఉండిపోయిన భార్య మరో పెళ్లి చేసుకున్న భర్త

లాక్ డౌన్ నేపథ్యంలో పుట్టింట్లోనే ఉండిపోయిన భార్య మరో పెళ్లి చేసుకున్న భర్త దేశంలో కరోనా వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ అనేక సంఘటనలకు కారణమవుతోంది. బీహార్ లోని ఓ వ్యక్తి భార్య కాపురానికి రాకపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. పాట్నా పాలీగంజ్ కు చెందిన ధీరజ్ కుమార్ కు దుల్హిన్ బజార్ కు చెందని యువతితో ఇటీవలే పెళ్లయింది. కొన్నిరోజుల కిందటే ఆమె పుట్టింటికి వెళ్లగా, ఆపై లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో ఆ యువతి పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ధీరజ్ కుమార్ అసహనానికి లోనై, భార్యను వెంటనే వచ్చేయాలని అనేకమార్లు ఫోన్ చేశాడు. వాహనాలు లేకపోవడం, పోలీసుల ఆంక్షలతో ఆ యువతి భర్త వద్దకు రాలేకపోయింది. దాంతో మరింత అసంతృప్తికి గురైన ధీరజ్ కుమార్ తన భార్యపై కోపంతో మాజీ ప్రియురాలి మెళ్లో తాళికట్టేశాడు. దాంతో దిగ్భ్రాంతికి గురైన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్ చెక్కులపై పేర్లు రాయండి

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్ చెక్కులపై పేర్లు రాయండి  పేర్లు రాయకుండా ఖాళీ చెక్కులు ఇవ్వొద్దని బిజెపి నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విన్నపం కోవిడ్ 19 విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మానవతా దృక్పథంతో ఇస్తున్న విరాళాల విషయంలో దాతలు కొన్ని నిబంధనలు పాటించాలని మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా ఆర్థిక సహాయం కింద ఎవరు విరాళాల రూపంలో చెక్కులు ఇచ్చినా చెక్కులపై పీఎం లేదా సీఎం రిలీఫ్ ఫండ్ అని స్పష్టంగా రాసి ఇవ్వాలని సూచించారు.  చాలామంది ఖాళీ చెక్కులు ఇవ్వడం వల్ల అవి పక్కదారి పట్టే పరిస్థితులు ఉన్నాయని, కొంతమంది చెక్కులు స్వచ్ఛందంగా తమ స్వచ్ఛంద కార్యకలాపాలకు లేదా ఇతర సంస్థలకు చెల్లిస్తున్నారని ఇది సమంజసం కాదని తెలిపారు. ఎవరైనా సరే చెక్కులపై స్పష్టంగా పేర్లు రాసి ఇవ్వాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే తమ చెక్కులపై  పేరు రాయడం మర్చిపోకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతి పైసా ప

ప్ర‌ధాన‌మంత్రి స‌డ‌క్ యోజ‌న - వెయ్యి కిలోమీట‌ర్ల నిడివికి రూ.620 కోట్ల నిధుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమతులు

  ప్ర‌ధాన‌మంత్రి స‌డ‌క్ యోజ‌న ప‌థ‌కం కింద వెయ్యి కిలోమీట‌ర్ల నిడివికి రూ.620 కోట్ల నిధుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్రాథ‌మికంగా అనుమ‌తులు తెలిపింది. రాష్ట్రానికి కేటాయించిన 2,427 కి.మీల‌లో మిగిలిన 1,427కి.మీ. నిడివికి అవ‌స‌ర‌మైన అనుమ‌తుల కోసం ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాలి. అలాగే ఎన్ఆర్ఇజిఎస్ ప‌థ‌కం కింద ఉపాధి హామీ కూలీల సంఖ్య క‌రోనా వైర‌స్ లాక్ డౌన్ స‌మ‌యంలోనూ రోజుకు 6ల‌క్ష‌ల‌కు చేర‌డం శుభ ప‌రిణామం. మ‌రో వారం రోజుల్లో వ్య‌వ‌సాయ ప‌నులు ముగుస్తున్నందున ఈ సంఖ్య 10ల‌క్ష‌ల‌కు చేరే అవ‌కాశం ఉంది. ఈ ద‌శ‌లో అధికారులు అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు అత్యంత సేఫ్టీగా ఉండే ప‌ద్ధ‌తుల్లో ర‌క్ష‌ణ క‌ల్పించాలి. మంచినీరు, మాస్కులు అందించాలి.  స‌మ‌ర్థ‌వంతంగా ప‌నులు జ‌రిగేలా చూడాలి. నిరంత‌రం అధికారులు ఆయా ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించాలి. అని రాష్ట్ పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు మంత్రి, హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలోని త‌న నివాసంలో శ‌నివారం ఉన్న‌త స్థాయి స‌మీక్ష చేశారు. ఈ స

మానవసేవే మాధవసేవ  - ప్రేమ్ గాంధీ - భోజనాల వితరణ సరకుల పంపిణీ

మానవసేవే మాధవసేవ  - ప్రేమ్ గాంధీ భోజనాల  వితరణ     249 మంది కుటుంబలకు     నిత్యావసర వస్తువుల పంపిణీ  26వ రోజు  అనాథలకు,వికలాంగులకు, మతిస్ధిమితంలేని వారికి  ఉదయం రాత్రి  భోజనాలు వితరణ     249 మంది కుటుంబలకు     నిత్యావసర వస్తువుల వితరణ (5 కేజీల బియ్యం, 1 కేజీ కంది పప్పు, 1 కేజీ నూనె , ఉల్లిగడ్డ, కారం ,పసుపు, ఉప్పు)

కోవిడ్ 19 తెలంగాణ బులిటీన్ 18 ఏప్రిల్

కోవిడ్ 19 తెలంగాణ బులిటీన్ 18 ఏప్రిల్