Posts

Showing posts from August, 2022

ఏసీబీ సోదాల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్

Image
 వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో   *ఏసీబీ సోదాల్లో రెడ్ హ్యాండెడ్ గా  పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాష్*   *6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం*  *పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*

నిరుపేద ఆర్యవైశ్య, విశ్వకర్మ కుటుంబాల పేద అమ్మాయిలకు ఉప్పల ఫౌండేషన్ అండ

Image
నిరుపేద ఆర్యవైశ్య, విశ్వకర్మ కుటుంబాల పేద అమ్మాయిలకు ఉప్పల ఫౌండేషన్ అండ ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన ఆర్యవైశ్య కులానికి చెందిన విశాల తండ్రి లేని కూతురు వాణి, నాగోల్ బండ్లగూడ లో నివాసం ఉంటున్న అనురాధ కృష్ణమాచారీ ల కూతురు అనూష వివాహం సందర్భంగా తన కార్యాలయంలో వారి కుటుంబానికి పుస్తెమట్టెలు, చీర, గాజులు అందచేసిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  

వాసవీ అమ్మ వారికి తలవంపులు తెస్తున్న అక్రమార్కులు

Image
  వాసవీ అమ్మ వారికి తలవంపులు తెస్తున్న అక్రమార్కులు వాసవీ అమ్మవారు సత్యం, ధర్మం, త్యాగానికి మారుపేరు. ఆత్మాభిమానం  కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి అగ్నికి ఆహుతి అయ్యింది. ఆమె జాతిలో పుట్టిన  ఆర్యవైశ్యులు కొందరు  దానికి విరుద్ధంగా  వాసవీ అమ్మ వారి  పేరు తో కులం పేరుతో * బ్యాంకులు * వెంచర్స్ పేరుతో స్కీమ్స్    * రియల్ ఎస్టేట్  సంస్థలు   * బిజినెస్ గ్రూప్స్ * విద్యా సంస్థలు   * హాస్పిటల్ లు * సేవా కేంద్రాలు * కో -ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు * చిట్ ఫండ్ సంస్థలు  * అవార్డు సంస్థలు    * హాస్టళ్లు  * మార్కెటింగ్ సంస్థలు   * అన్నదాన సత్రాలు  పెట్టి ప్రజలను దోచుకోవడమే  లక్షంగా సంస్థలు స్థాపిస్తున్నారు. అమ్మవారికి తలవంపులు తెస్తున్నారు . వాసవీ అమ్మ వారి పేరు పెట్టుకుంటే త్యాగాలు చేయాలి కానీ అంత మోసం దగా సంస్థలలో  నాయకులుగా చెలామణి అవుతూ, సమాజంలో గుర్తింపు పొందుతూ, వసూలు చేసిన చందాల్లో వెనుకనుండి  30 శాతం కమీషన్లు దొబ్బి అక్రమాలకు పాల్పడుతున్నారు. సంస్థలో  పదవులు పొందిన తర్వాత దశాబ్దాలపాటు ఎన్నికలు నిర్వహించకుండా, సంస్థ జమాఖర్చులు సభ్యులకు ఆర్యవైశ్య  సమాజానికి  చెప్పకుండా వారి సొంత ఆస్తులుగా అనుభవి

వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ Office లో I-Tax searches

Image
 వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ Office లో I-Tax searches ఏకకాలంలో ఏపీ తెలంగాణలో పది చోట్ల ఐటీ సోదాలు.... ఉదయం నుండి కొనసాగుతున్న ఐటీ రైడ్స్ వాసవి గ్రూప్స్ ప్రధాన కార్యాలయలో సోదాలు చేస్తోన్న 20 మంది ఐటీ అధికారులు బృందం  వాసవి రియాల్టీ, వాసవి నిర్మాన్,  శ్రీ ముఖ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్,  ఇండ్మాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాసవి ఫిడిల్ వెంచర్స్ పేరుతో సంస్థలు. వేల కోట్లు పనులు చేస్తూ ఇన్ కం ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారని అరోపణలు.. అక్రమ లావాదేవీలపై అరా తీస్తున్న ఐటీ అధికారులు. వాసవి గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి అరా తీస్తున్న ఐటీ  అధికారులు. వాసవి గ్రూప్స్ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు

అధ్యక్షుని ప్రమాణ స్వీకారం లో హైలైట్స్ పదనిసలు

Image
  అధ్యక్షుని ప్రమాణ స్వీకారం లో హైలైట్స్  పదనిసలు *పాపం ఎల్వీకి  అవమానం. జిల్లా సంఘం లో స్వర్గీయ కొత్త వెంకటేశ్వర్లు కాలం నుండి  4,5 పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా  సుదీర్ఘంగా సేవలందించారు.  ఈ రోజు జిల్లా భవన్ ఉందంటే స్వర్గీయ  వీరెల్లి మరియు ఎల్వీ ల ఘనతే. ఎల్వీ భూమి కొనుగులునుండి బిల్డింగ్ నిర్మాణం కొరకు సొంత డబ్బులు  పెట్టి అప్పులు తెచ్చి తిప్పలు పడి ఓ రూపు కు తీసుక వచ్చాడు.  అలాంటి వ్యక్తి కి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా ప్రసంగం మధ్యలో రాష్ట్ర నాయకుడు, జిల్లా నాయకులు అడ్డుపడడం చాలా బాధాకరం  ఇలాంటి సంఘటనలు మంచి సేవలకు  విఘాతం కలుగే అవకాశం ఉంది. *జిల్లా నాయకత్వం ఒక్కరి కి బందీ అయ్యిందని గుసగుసలు *రాష్ట్ర నాయకునికి  అవమానం ,  రాష్ట్ర అధ్యక్ష పదవి పై జిల్లా నాయకుడి కన్ను పడ్డట్లు ఉన్నదని ముచ్చట్లు. *ప్రమాణ స్వీకారం లో నవ్వులు, రెండు సంవత్సరాల కాలానికి అని రాష్ట్ర అధినేత ప్రమాణ స్వీకారం చెపిస్తుంటే , దానికి బదులుగా జిల్లా అధ్యక్షుడు  అతి ఉత్సాహం తో ఈ రోజు నుండి రెండు రెండు సంవత్సరాలు అని చెప్పడం తో రాష్ట్ర అధినేత అభ్యంతరం చెప్పడం తో సభలో నవ్వులు. పాపం జిల్లా అధ్యక్షుడు ఎక్

సైకిల్ రేస్ మరియు స్కిప్పింగ్ పోటీల్లో అతిధిగా పాల్గొన్న గార్లపాటి జితేంద్రకుమార్

Image
 సైకిల్ రేస్ మరియు స్కిప్పింగ్  పోటీల్లో  అతిధిగా పాల్గొన్న   గార్లపాటి జితేంద్రకుమార్. నల్గొండ: ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా 75వ స్వతంత్ర దినోత్సవ  సందర్బంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నల్గొండలో సైకిల్ రేస్ మరియు స్కిప్పింగ్  పోటీల్లో  అతిధిగా పాల్గొన్న బీజేపీ నాయకులు మరియు లయన్స్ క్లబ్ మెంబర్ గార్లపాటి జితేంద్రకుమార్.

రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమం

Image
 రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల  దగ్ధం కార్యక్రమం నల్గొండ: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు  బండి సంజయ్ కుమార్  చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర -3 పాదయాత్ర పై  తెరాసా గుండాలు జరిపిన దాడిని వ్యతిరేకిస్తు ,దాడికి నిరసనగా రేపు అనగా  16న ఉదయం 10:00 లకు  అన్ని మండల కేంద్రాల్లో ,పట్టణాలలో కేంద్రాల్లో అధ్యక్షుల అధ్వర్యంలో  ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులను  బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీదర్ రెడ్డి కోరారు.

బండి సంజయ్ పాదయాత్ర పై గుండాల దాడిపై డా దాసోజు శ్రవణ్ బీజేపీ, పత్రిక ప్రకటన యధాతథంగా

Image
బండి సంజయ్  పాదయాత్ర పై గుండాల దాడిపై డా దాసోజు శ్రవణ్ బీజేపీ,  పత్రిక ప్రకటన యధాతథంగా 1. బండి సంజయ్  పాదయాత్ర పై గుండాల దాడిని ఖండిస్తూ, దాడికి  ప్రోత్సహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై   హత్యాయత్నం కేసులు పెట్టాలి.   2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పాదయాత్ర సందర్బంగా తెరాస గుండాల కర్రలతో, రాళ్లతో చేసిన దాడిని ఖండింస్తున్నాం.  3. ఇది తెరాస అహంకార అరాచక వైఖరికి నిదర్శనం, వారి రాక్షస ప్రవృత్తికి ప్రతీక.  4. బండి సంజయ్ గారి పాదయాత్ర నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ కి పెరుగుతున్న జనాదరణ చూసి తట్టుకోలేక ఈ రకమైన హింసకు పాల్పడుతున్నారు.  5. ప్రత్యక్షంగా దాడికి  పాల్పడ్డ వారిపై, మరియు వారిని ప్రోత్సహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై హత్యాయత్నం కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.  6. దాడి జరుగక ముందే, ఎర్రబెల్లి దయాకర్ రావు పత్రిక సమావేశం పెట్టి మరీ బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటాం అని రెచ్చగొట్టే ప్రకటన చేసి  కుట్రపూరితంగా ఈ దాడికి పాల్పడ్డడు.  7. వినాశకాలే విపరీతబుద్ది  అన్నట్లు, 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా,  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్త

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు మహాత్మా గాంధీ కి వినతి

Image
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు  మహాత్మా గాంధీ కి వినతి నల్గొండ: నల్గొండ ఆర్యవైశ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం రోజు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు  కు నాయకులకు మంచి మనసు కల్పించాలని కోరుతూ చిట్యాల లోని మహాత్మా గాంధీ గుడి లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అంద చేశారు. ఈ కార్యక్రమం లో భూపతి రాజు, యమా మురళి, కోటగిరి చంద్రశేఖర్, వనామా మనోహర్,   ఓంప్రసాద్, యమా శ్యామ్ కుమార్,  నల్గొండ శ్రీనివాస్, వనామా రమేష్, గుండా కరుణాకర్, శివ , నల్గొండ యోగీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

నిద్ర 'మత్తు' లో నల్గొండ డిపిఆర్వో

Image
  నిద్ర 'మత్తు' లో   నల్గొండ డిపిఆర్వో   నల్గొండ:    డిపిఆర్వో   పని  వత్తిడి తో   పతాక ఆవిష్కరణ   మీడియా  ఇన్విటేషన్ లో  ఉదయం 10.30 కి బదులు రాత్రి  10.30 అని  వాట్సాప్ లో  వ్రాసారు.   అయ్యో  ఏంది సర్  ఇలా వ్రాసారని ఓ జర్నలిస్టు అడగడం తో ఆయన భాద ను చెప్పుకొచ్చారు. సిబ్బంది అనుమతి లేకుండా సెలవులు పెడుతున్నారని దాంతో పని  భారం  పెరిగి నిద్రకు కూడా సమయం సరిపోవడం లేదని దీనితో పొరపాట్లు జరుగుతున్నాయన్నారు.  అంతే కాక   స్టాఫ్ తక్కువ వుండటం తో చాలా ఇబ్బందులకు గురువుతున్నానని,  నన్ను ఇక్కడినుండి ట్రాన్స్ఫర్ చేస్తే బాగుండు అని మీరయిన ట్రాన్స్ఫర్ చేయించండని మా ప్రతినిధి ని రిక్వెస్ట్ చేశారు. అయ్యో పాపం డిపిఆర్వో

బీజేఎం ఆధ్వర్యంలో *తిరంగ యాత్ర*

Image
 బీజేఎం ఆధ్వర్యంలో *తిరంగ యాత్ర* నల్గొండ: ఆజాద్ క అమృత్ మహోత్సవం లో భాగంగ ఈ రోజు భారతీయ జనతా యువమోర్చా ఆద్వర్యంలో  నల్లగొండ పట్టణ కేంద్రంలో *తిరంగ యాత్ర* నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు  *యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు   మాట్లాడుతూ మనకు దేశ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశ స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు భారతీయ జనతా పార్టీ నిర్వహించడం చాలా సంతోష కరమని,  భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త దేశభక్తి ని చాటుకుంటూ ఇతరులను కూడా ఈ కార్యక్రమంలోకి తీసుకురావడం ప్రతి మనిషి దేశ భక్తి కలిగి వుండాలని ప్రతి ఒక్కరిని  జాగృతం చేయటమే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త భాద్యత అని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు సంవత్సరము నుంచి ప్రతి కార్యక్రమం సందర్భంగా మనం నిర్వహించడం జరిగింది ప్రజలలో చైతన్యం తీసుకురావడం కోసం మరియు మన దేశంలో ఉన్న ఉన్న కొందరు స్వార్థం కోసం దేశం పై బురద చల్లేప్రయత్నం చేయడం జరుగుతుంది అలాంటి వారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దేశభక్తి కలిగి సరైన మార్గము లో నడవాలని సూచించడం జరిగిందని ప్రతి పౌర

మునుగోడు పోటీలో ఆర్యవైశ్యులు - ఆర్యవైశ్య నాయకుడు ఓంప్రసాద్

Image
  మునుగోడు పోటీలో ఆర్యవైశ్యులు - ఆర్యవైశ్య నాయకుడు ఓంప్రసాద్ నల్లగొండ:  ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన  కొరకు మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయడానికి  ఆర్యవైశ్య యువకులు  సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు చేశారని, అమలు మాత్రం మరిచారని విమర్శించారు.  మునుగోడు నియోజక వర్గంలో దాదాపు 15 నుండి 20 వేల ఆర్యవైశ్యు లు ఉన్నారని వారు అంతా సత్త చూపించాలని, కార్పొరేషన్ ఏర్పాటుకు తుడ్పాటు అందించాలని వారు  కోరారు.  క్రొత్తగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ కు  ప్రమాణ స్వీకారం  చేస్తున్న కార్యవర్గం కార్పొరేషన్ కొరకు తీర్మానం చేసి ఏర్పాటుకు కృషి చేయాలని  కోరారు.

స్మాల్ అండ్ మీడియం డైలీ అండ్ పిరియాడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలు

Image
 స్మాల్ అండ్ మీడియం డైలీ అండ్ పిరియాడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలు ఈరోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ స్మాల్ అండ్ మీడియం డైలీ అండ్ పిరియాడికల్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ తరఫున స్వాతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలు జరుపుకోవడంలో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లో జాతీయ జెండాతో ర్యాలీ తీసి వజ్రోత్సవం జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదినం జిల్లా అధ్యక్షులు కోటగిరి చంద్రశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి మక్సూద్ భూపతి టైమ్స్ ఎడిటర్ భూపతి రాజు సత్య ఛానల్ చైర్మన్ గోలి విజయ్ పత్రికా ఎడిటర్లు సంఘ నాయకులు ఎండి శౌక త్ అలి ఎండి అఫ్జ ల్ ఖాన్ కారింగుల యాదగిరి ఎండి ఖుద్దుస్ సయ్యద్ పేర్ల వెంకటయ్య వీరెల్లి సతీష్ సందీప్ గోవిందు బాలరాజ్ లెనిన్ లింగయ్య రాజశేఖర్ ఊర రమేష్ సాగర్ జయంత్ తదితరులు పాల్గొన్నారు

గుర్రంపోడ్ మండల ఆర్యవైశ్య సంఘం ఒకరి సొంత జాగిరా?

Image
  గుర్రంపోడ్ మండల  ఆర్యవైశ్య సంఘం ఒకరి సొంత జాగిరా? నల్గొండ జిల్లా : ప్రజాస్వామ్యాన్ని, పెద్దల ముందు జరుగిన నియామకులను అపహాస్యం చేస్తూ   నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం  ఆర్యవైశ్య సంఘాన్ని సొంతజాగీరుల అధ్యక్షుడు  వాడుకుంటున్నాడని మండల వైశ్య నాయకులు ఆరోపిస్తున్నారు. 2021 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికలలో  మునిసిపల్ ఛైర్మెన్ మరియు ఇతర పెద్దలముందు నియమించుకున్న వారిని తొలగించి ఇతరులకు పదవులు  ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి తీర్మానం లేకుండా  జిల్లా ఎన్నికల్లో  కౌన్సిల్ సభ్యులను నియమించుకున్నాడని,  ఇప్పడు జిల్లా కార్యవర్గంలో కూడా మండల కమిటీ లో చర్చించకుండా పదవులకు సిఫారసు  చేశాడని ఆరోపిస్తున్నారు.  ఈ విషయాలన్నీ జిల్లా అధ్యక్షుడు కి విన్నవించుకున్న  ఎలాంటి మార్పు జరగలేదని వాపోతున్నారు. మేము ఎన్నో ఏండ్లనుండి వైశ్యుల సమస్యల పై పోరాటం చేస్తున్నామని, సంఘం లో జరిగిన పొరపాట్లను ప్రశ్నిస్తే  పొరపాట్లను సరి చేయకుండా మమ్ముల తొలగించి అవమణిస్తున్నారని తెలిపారు.

నేటితో 9వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర

Image
  *యాదాద్రి....* *నేటితో 9వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర"* *ఉదయం 10 గంటలకు యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర* ఆజాదీ కా అమృత మహాత్సవంలో భాగంగా కాసేపట్లో పాదయాత్ర శిబిరం వద్ద స్వతంత్ర సమర యోధుడు బత్తిని మొగలయ్య గౌడ్ కు నివాళులు అర్పించనున్న బండి సంజయ్ కుమార్. అనంతరం సిరిపురం నుంచి రామన్నపేట, దుబ్బాక మీదుగా మునిపంపుల వరకు కొనసాగనున్న పాదయాత్ర *ఇవాళ రాత్రికి మునిపంపుల సమీపంలో బండి సంజయ్ రాత్రి బస* *నేడు 12.5KM మేర కొనసాగనున్న పాదయాత్ర* రామన్నపేట వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్. పాదయాత్రలో భాగంగా వివిధ ప్రజలతో మమేకం కానున్న బండి సంజయ్.

ఉచితంగా జాతీయ జెండా పంపిణీ

Image
 ఉచితంగా జాతీయ జెండా పంపిణీ నల్గొండ జిల్లా : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా *ఆజాది క అమృత్ మహోత్సవంలో* భాగంగా భారత ప్రదాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటి పై జాతీయ జెండ  కార్యక్రమంలో భాగంగ ఈ రోజు నల్గొండ, దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో  కేంద్రాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు పార్లమెంట్ కాంటెస్టడ్ అభ్యర్థి 2019   గార్లపాటి జితేంద్ర కుమార్  ఆధ్వర్యంలో ఉచితంగా  పంపిణీ చేశారు. ..

నవ్య పైన దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి* పాలడుగు ప్రభావతి ఐద్వా నల్గొండ జిల్లా కార్యదర్శి డిమాండ్.

Image
 *నవ్య పైన దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి*          పాలడుగు ప్రభావతి ఐద్వా నల్గొండ జిల్లా కార్యదర్శి డిమాండ్.      నల్లగొండ పట్టణ కేంద్రంలో నాగార్జున కళాశాల విద్యార్థిని నవ్య పైన అత్యంత పాశవికంగా కత్తితో దాడి చేసి హత్య   ప్రయత్నం చేసిన నిందితుడు రోహిత్ అతనికి సహకరించిన  దుండగులను కఠినంగా శిక్షించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు..ఈరోజు ఐద్వా,యస్ యఫ్ ఐ ల ఆద్వర్యంలో నల్గొండ సుభాష్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు.మరియు జిల్లా యస్.పి రెమా రాజేశ్వరీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందీ. విద్యార్దినిలపైనా మహిళల పైనా అత్యంతా పాశవికంగా సభ్య సమాజం తలదించుకునే విదంగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. నవ్యపైనా గతంలో కుాడా ఈ దుర్మార్గులు దాడిచేసి పోలీసులకు తెలియజేశారనీ కఠినంగా దండిస్తే మళ్ళీ ఈ ఘటన పునారవృత్తం కాకపోయేదనీ అన్నారు.జులాయిలు, మత్తు పదార్దాలకు భానిసలైనా వారిని ఉపేక్షించరాదనీ అన్నారు.       యస్ యఫ్ ఐ జిల్లా కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ కాలేజీలు హస్టల్ లో అమ్మాయిలకు అబ్బాయికు చైతన్యం కలగించే చట్టాలు ఎంత కఠినంగా ఉ

దాసోజుకు ఘన స్వాగతం

Image
  దాసోజుకు ఘన స్వాగతం హైదరాబాద్:  భారతీయ జనతపార్టీ నేత డా. దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలు భారీ ఎత్తున ఘనస్వాగతం పలికారు.  ఈ సందర్భంగా డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. భారతీయ జనతపార్టీలో చేరి మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డమీద అడుగుపెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. నన్ను ఎంతో ప్రేమతో పార్టీలోకి స్వాగతించిన భారతీయ జనతపార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారతీయ జనతపార్టీలో చేరిన తర్వాత తెలంగాణలో కొనసాగుతున్న కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడొచ్చచ్చు, అధికార మార్పిడి జరుగుతుంది, భారతీయ జనతపార్టీ నేతృత్వంలో కేసీఆర్  దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడతామనే నమ్మకం కలిగింది. ఈ దిశలో మునుగోడు ఎన్నికలో కర్రుకాల్చి టీఆర్ఎస్ పార్టీకి వాత పెట్టె పరిస్థితి ఏర్పడుతుందని బలంగా నమ్ముతున్నాం.  రానున్న రోజుల్లో సామజిక, ప్రజాస్వామిక తెలంగాణ కోసం భారతీయ జనతపార్టీ కార్యకర్తగా నిరంతరం కృషి చేస్తా'' అన్నారు ''నేడు తెలంగాణ సమాజం కీలకమైన పరిణామంలో వుంది. తెలంగాణ సమాజం బాగుపడుతుంది, అమరవీరుల త్యా

మూడవ సారి ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ గా నియమింప బడ్డ అల్లం నారాయణ గారికి సన్మానం, చిత్రంలో tju రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్

Image
మూడవ సారి  ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ గా  నియమింప బడ్డ అల్లం నారాయణ   గారికి సన్మానం, చిత్రంలో tju రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ గారు, నల్గొండ జిల్లా tju అధ్యక్షుడు భూపతి రాజు బి 9 న్యూస్ రవికాంత్ పులిజ్వాల, ab న్యూస్ బ్రహ్మము, v5  న్యూస్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా లో కొనసాగుతున్న సంజయ్ యాత్ర. యాత్రలో జాయిన్ అయిన దాసోజు

Image
 నల్గొండ జిల్లా లో కొనసాగుతున్న సంజయ్ యాత్ర. యాత్రలో జాయిన్ అయిన దాసోజు చిట్యాల : "ప్రజా సంగ్రామ యాత్ర"లో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకనపల్లికి చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర* గీతకార్మికులతో  మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న సంజయ్. ఈ సందర్బంగా కాల్లు రుచి చూసిన సంజయ్

9 నెలలకు కుదిరిన ముహూర్తం? ఆర్యవైశ్య మహాసభ సేవ కు మిగిలింది ఒక సంవత్సరం 3 నెలలే?

Image
  9 నెలలకు  మంచి ముహూర్తం ?  ఆర్యవైశ్య మహాసభ సేవ కు మిగిలింది ఒక సంవత్సరం 3 నెలలే? నల్గొండ: నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహా సభ ఎన్నికలు  హోరా హోరీగా జరిగి దాదాపు 9 నెలలు కావస్తోంది.  ప్రమాణ స్వీకారాని జరగలేదు. ఇంకా  సేవ చేయడానికి మిగిలింది ఒక సంవత్సరం 3 నెలలే.  సేవ చేస్తానని, ఉత్సాహము తో పోటీ చేసి గెలుపొందిన  వనామా వెంకటేశ్వర్లు కు భారీ మెజారిటీ నే వచ్చింది.  అందరూ తొందరలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని  అభివృద్ధి జరుగుతుందని ఎదురు చూశారు.  సంఘ సేవ చేయడానికి మంచి ముహూర్తం 9 నెలలకు దొరకనట్లు ఉందని కొందరు  చర్చించుకుంటున్నారు. అప్పటి కార్యవర్గం పట్టించుకోక పోవడంతో  లో అక్రమాలు, అసాoగీక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న   ప్రచారం తో  పాటు అభివృద్దే నినాదంగా  వెళ్లిన వనామా వెంకటేశ్వర్లు కు  మహాసభ కౌన్సిల్ సభ్యులు  ఆయన్ని నమ్మి భారీ మెజార్టీ ఇచ్చారు. అన్ని మారిపోతాయని, వైశ్యుల అభివృద్ధి,  సంక్షేమం జరుగుతుందని  బిల్డింగ్  అభివృద్ధి జరుగుతుందని ఆశపడ్డవారికి ఎదురు చూపులే  మిగిలాయి.   ఎట్టకేలకు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్  అయినట్లు తెలిసింది.  అసలు పదవి కాలం రెండు యేండ్లు మాత్రమే,  9 నెల లు మంచ

నల్గొండ జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణా రెడ్డి

Image
 సూర్యాపేట జిల్లా  సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి బదిలీ  పాటిల్ హేమంత్ కేశవ్ కు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా భాద్యతలు.  ప్రస్తుత కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ గా బదిలీ

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన దాసోజు శ్రవణ్

Image
 బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన దాసోజు శ్రవణ్

బిజెపి అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ అందరికీ పక్కా గృహాలు : బండి సంజయ్

Image
   బిజెపి అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ అందరికీ పక్కా గృహాలు : బండి సంజయ్ కేసిఆర్ కుటుంబం జర్నలిజం తో వ్యాపారం చేస్తుంది,  కెసిఆర్ ప్రభుత్వం నిజాలు రాసే జర్నలిస్టులను వేధిస్తుంది. నిజాలు నిర్భయంగా వార్తలు రాసే జర్నలిస్టులకు బిజెపి అండ ఉంటుంది. భువనగిరి: 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా జర్నలిస్టులతో సంజయ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు అధ్యక్షతన జరిగిన  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ పాలనలో ప్రజలే కాదు జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిజం రాసే జర్నలిస్టులకు నిద్ర లేకుండా కేసీఆర్ కుటుంబం వేధిస్తోందని దీనినీ బిజెపి పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.  కెసిఆర్ పాలన అవినీతి మయమైందని కెసీఆర్  కుటుంబ పాలన తెలంగాణలో అన్ని వ్యవస్థలతో  పాటు జర్నలిజాన్ని వ్యాపారం చేశారన్నారు.  సమాజం హితం కోసం పాటుపడే జర్నలిస్టులు ఎదుర్కొనే ప్రతి సమస్య తనకు తెలుసన్నారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి జర్నలిస్టులకు ఇల్లు ఇప్పించే బాధ్యత తనదే అన్నారు.  తెలంగాణ సాధనలో జర్నలిస్

సర్వాంగ సుందరంగా ముస్తాబై న నల్గొండ లోని ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం

Image
  నిర్వాహకుల  అవిరళ కృషితో ,సర్వాంగ సుందరంగా ముస్తాబై న   నల్గొండ లోని ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం.

బీజేపీ నాయకులు గార్లపాటి జితేందర్ కుమార్ జన్మదినము వేడుకలు

Image
 బీజేపీ నాయకులు గార్లపాటి జితేందర్ కుమార్  జన్మదినము  వేడుకలు భారతీయ జనతా పార్టీ నల్గొండ  పార్లమెంట్ ఇన్చార్జి గార్లపాటి జితేందర్ కుమార్  జన్మదినము  వేడుకలు జరుగుతాయని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ తెలిపర్రు.  ఆగస్టు 1 సోమవారం రోజున ఉదయం 11 గంటలకు నల్గొండ లో  హైదరాబాద్ రోడ్ వెంకటేశ్వర కాలనీ ప్లాట్ నెంబర్ 33  నందు నూతన గృహప్రవేశం మరియు జన్మదిన వేడుకలు ఉంటాయని తెలిపారు. బీజేపీ పట్టణ జిల్లా, రాష్ట్ర నాయకులు  కార్యకర్తలు అభిమానులు  పాల్గొనవలసిందిగా మనవి చేశారు.  

కాల్పుల కలకలం

Image
 హైదరాబాద్ మాదాపూర్‌లో తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇస్మాయిల్ అనే వ్యక్తిని సోమవారం తెల్లవారు మూడు గంటల సమయంలో ముజీబ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రునికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థిరాస్తి గొడవల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.