Posts

Showing posts from October, 2022

కల్వకుంట్ల కుటుంబం అంటే అబద్దాలకు విష ప్రచారాలకు పెట్టింది పేరు - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Image
 కల్వకుంట్ల కుటుంబం అంటే అబద్దాలకు విష ప్రచారాలకు పెట్టింది పేరు - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నల్గొండ :; మునుగోడు లోని  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ప్రెస్ మీట్... *కామెంట్స్....* ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన చండూరు బహిరంగ సభలో అంతర్జాతీయ దేశ రాష్ట్ర సమస్యలతో పాటు మునుగోడు సమస్యలు మాట్లాడారు   ముఖ్యమంత్రి గారికి సూటి ప్రశ్న.... మీ పరిపాలనలో నైతికత ఉందా,, మీరు ఇచ్చిన హామీలు అమలు చేశారా...  2014లో 2018లో 1,70000 ఎకరాలకు సాగు నీరు ఇస్తామని   చెప్పారు... ఒక్క అంగుళానికైనా నీరు ఇచ్చార  నీటిపారుదల ప్రాజెక్టులకు ఎవరు అడ్డు వచ్చారు... మీరు అనుకున్న ప్రాజెక్టులను పూర్తి చేశారు ఎవరైనా అడ్డొచ్చారా... ప్రజల సమస్యలు చిన్న చిన్న సమస్యలు అంటున్నారు  వాటిని కనీసం తీర్చారా    తొమ్మిది సంవత్సరాలు మీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించారు మునుగోడు లో రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉంది   9 సంవత్సరాలుగా చేయని ముఖ్యమంత్రి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లో పరిష్కరిస్తా అంటున్నాడు  కొద్దిగా అయినా సిగ్గుండాలి ముఖ్యమంత్రికి   15 రోజుల్లో ఏ రకంగా పరిష్కర

గ్లోబల్ టెండర్లో ఎల్ 1 గా వచ్చినందుకే కాంట్రాక్టు దక్కింది - అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేస్తే పరువు నష్టం దావాకు వేనుకాడం - సుశి ఇన్ఫ్రా

Image
 గ్లోబల్ టెండర్లో ఎల్ 1 గా వచ్చినందుకే  కాంట్రాక్టు దక్కింది  -   అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేస్తే పరువు నష్టం దావాకు వేనుకాడం -  సుశి ఇన్ఫ్రా  హైదరాబాద్, ( గూఢచారి): మైనింగ్  కంట్రాక్టు టెండరు ఖరారుకు సంబంధించిన వాస్తవాలను, సాంకేతిక అంశాలను రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజలకు వివరించేందుకు సుశి ఇన్ఫ్రా పూర్తి వివరాలతో ఓ ప్రకటనను   విడుదల చేసింది.  అందులోని వివరాలు:  చంద్రగుప్త బొగ్గు గని - గని అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టు - ఝార్ఖండ్ సిసిఎల్ నాలుగు దశాబ్దాలుగా  దేశ వ్యాప్తంగా మౌలిక వసతులు కల్పనా రంగంలో ఏటా వేల కోట్ల కాంట్రాక్ట్ వర్కులు చేస్తున్న సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీకి ఝార్ఖండ్ లో కోల్ మైనింగ్ కాంట్రాక్ట్ దక్కించుకోవడం పెద్ద విషయమే కాదని, సుశీ కంపెనీ ట్రాక్ రికార్డ్ స్టడీ చేస్తే ఎవరికైనా స్పష్టమవుతుందని తెలిపింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీకి ఝార్ఖండ్ రాష్ట్రంలోని చంద్రగుప్త కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ దక్కడం వెనక బిజెపి పెద్దల హస్తముందంటూ గత మూడు నెలలుగా కొన్ని రాజకీయ పార్టీలకు

హవ్వ...సంతలో పశువుల్లా అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ఆణిముత్యాలట - బండి సంజయ్

Image
• హవ్వ...సంతలో పశువుల్లా అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ఆణిముత్యాలట - బండి సంజయ్ నల్గొండ... *మునుగోడు నియోజకవర్గం   మర్రిగూడెం మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మీడియా సమావేశం...*  కామెంట్స్: మునుగోడు ఎన్నికలు టీఆర్ఎస్, బీఆర్ఎస్ కు సమాధిరాయి కాబోతోంది • టోపి పెట్టుకుని వచ్చి మునుగోడు ప్రజలకు టోపీ పెట్టిన కేసీఆర్ • ఒక్క సామాజికవర్గం గురించి కూడా మాట్లాడలేకపోయిన సీఎం • మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించకుండానే పారిపోయిన కేసీఆర్ • 8 ఏళ్లుగా చేయని పనులు... 15 రోజుల్లో ఎట్లా పూర్తి చేస్తావ్? • పచ్చి అబద్దాలతో మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైన కేసీఆర్ • సూడు సూడు నల్లగొండ...పాట కేసీఆర్ రాయనేలేదు... ఆ పాట రాసింది కోదాటి శ్రీను  • హవ్వ...సంతలో పశువుల్లా అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ఆణిముత్యాలట • కమ్యూనిస్టు పార్టీల రంగులు వెలిసిపోయినయ్.....ఆ కార్యకర్తలే అసహ్యించుకుంటున్నరు • మునుగోడు ఉప ఎన్నికలై పోగానే కరెంట్ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్ కుట్ర • జీతాలివ్వకుండా 317 జీవో పేరుతో ఉద్యోగాలను రాచిరంపాన పెట్టినందుకు టీఎన్జీవో నాయకులు టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నారా? •

,*చరిత్రలో సువర్ణావకాశం మీదే.. కేసీఆర్*

Image
 *చరిత్రలో సువర్ణావకాశం మీదే.. కేసీఆర్* బీఆర్ ఎస్ పార్టీకి పునాదిరాయి పెట్టింది మునుగోడు. మీరే ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి. దేశం బాగుపడాలంటే మీరు అడుగు ముందుకేయాలి. మునుగోడును గుండెల్లో పెట్టుకుంటా. దేశంలో జరిగే పోరాటంలో మీరే పునాది రాయి వేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవాలి. ఎనిమిదేళ్ళయినా మా నీళ్ళు చూపడానికి, మా వాటా ఎప్పుడిస్తావు? నేను మహా మొండి. వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవిన్యూ డివిజన్ ఇస్తా. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లో మీ కోరిక నెరవేరుస్తా. ప్రజల్లో ఉండే మనిషిని ఓడించి.. రాజగోపాల్ రెడ్డిని 2018లో గెలిపించారు. గొడ్డలిని గెలిపించారు అభివృద్ది లేదు. రోడ్లన్నీ బాగుచేస్తా. గెలిచినవారు పత్తా లేరు. కష్టానికి వచ్చారు. ఆయన్ని గెలిపించండి *ఉప ఎన్నిక ఫలితం కూడా తేల్చేశారు-సీఎం కేసీఆర్* మునుగోడులో అవసరం లేకుండా ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక ఫలితం కూడా తేల్చేశారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. గత 20 రోజులుగా ఎన్నో చర్చలు జరిగాయి. న్యాయం ఏందో... ధర్మం ఏంటో మీకు తెలుసు. నాలుగు విషయాలు మీకు చెబుతాను. ఎన్నికలు వస్తాయి.. అనేక రకాలుగా వస్తాయి. ఎన్నిక రాగానే గాయి.. గాయి గత్తర్... గత్తర్ ల

కేసీఆర్ కాన్వాయ్ లో డబ్బు సంచులు - బండి సంజయ్

Image
  కేసీఆర్ కాన్వాయ్ లో డబ్బు సంచులు - బండి సంజయ్ బహిరంగకేసీఆర్ సభ వేదికగా మరో డ్రామాకు కేసీఆర్ స్కెచ్ కేసీఆర్ కాన్వాయ్ లో డబ్బు సంచులు దమ్ముంటే మునుగోడుకు చేసిన అభివ్రుద్ధిపై మాట్లాడాలి కుట్ర చేయలేదని నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి సభా వేదికగా ప్రమాణం చేసే దమ్ముందా? మీరు తప్పు చేయకుంటే సీబీఐ విచారణకు అభ్యంతరమేంది? లిక్కర్ స్కాం వెలుగులోకి రాగానే భయంతోనే సీబీఐ రాకుండా జీవో విచారణకు ఆదేశించకుండా కోర్టులోనూ అఫిడవిట్ దాఖలు చేయడం సిగ్గు చేటు గత 8 ఏళ్లలో 34 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్.... ఆయా ఎమ్మెల్యేలకు ఎంత డబ్బు ఇచ్చారో సభా వేదికగా సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్ చండూరు బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో డ్రామాకు తెరలేపబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్  వ్యాఖ్యానించారు.  మునుగోడు ప్రజలను సెంటిమెంట్ తో టీఆర్ఎస్ వైపు మళ్లించేందుకు ఏడుపు డ్రామాకు సిద్ధమయ్యారని అన్నారు. ఉప ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు సిద్ధం చేసిన డబ్బును సీఎం కాన్వాయ్ లోనే తరలించబోతున్నారని సంచలన అరోపణ చేశారు. కేసీఆర

ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యావరణ ఆఫీస్ లోని ఓ అధికారి నిర్లక్ష్యమా? వైఫల్యమా?

Image
 ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యావరణ ఆఫీస్ లోని ఓ అధికారి నిర్లక్ష్యమా? వైఫల్యమా? నల్గొండ, (గూఢచారి) ఆయనో నల్గొండలో పర్యవరణాన్ని కాపడవలసిన అధికారి ఆయన భాద్యతల్లో  నిర్లక్ష  ఫలితంగా  కావచ్చు లేక వైఫల్యం కారణంగా అయిన కావచ్చు ఉమ్మడి జిల్లా లో రోజు రోజు కు   పర్యావరణ పరిస్థితి లు దిగజారుతున్నట్లు  వివిధ పత్రికల్లో వస్తున్న వార్తల నిదర్శనం. నిర్లక్ష్యం ఎందుకు  అనే సందేహం కలగమానదు కదా ఆ అధికారికి ఇష్టం లేని నల్గొండ ప్రాంతానికి రాష్ట్ర అధికారాలు బదిలీ చేయడంతో బాధ్యత లల్లో నిర్లక్ష్యం వహిస్తే  పనిష్మెంట్ క్రింద బదిలీ వస్తది అన్న ఆశ కాబోలు!  వైఫల్యమంటే కొందరు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఈ అధికారి  అన్ని విషయాలపై గట్టి పట్టు వున్నదని అంటున్నారు వారు.  అయితే ఎందుకు పరిస్థితులు దిగజారుతున్నాయన్న ది ప్రశ.  ఇదో ప్రణాళిక ప్రకారం జరుగుతుందని పర్యావరణ రక్షణ చర్యలు చేపట్టని కంపినెల వారితో  ఈయన కొందరి ప్రైవేట్ ఏజంట్లు సమకుర్చుకొని వారితో ప్రైవేట్ లావాదేవీలు సెలవు దినాల్లో  నిర్వహిస్తున్నట్లు వినికిడి. ఆయన అఫిస్ లో ఎవరికి అనుమానాలు రాకుండా సెలవు దినాల్లో ప్రైవేట్ లావాదేవీలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నా

బి జే పి పార్టీ పై జిల్లా ఎన్నికల అధికారికి టి.ఆర్.ఎస్. నేతల ఫిర్యాదు..

Image
బి జే పి పార్టీ పై  జిల్లా ఎన్నికల అధికారికి టి.ఆర్.ఎస్. నేతల ఫిర్యాదు.. ఎన్నికల నియామావళి ఉల్లంగించిన బండి.. యదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రమాణం చేయడం నేరం... విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్న బి.జే.పి. పై కఠిన చర్యలు తీసుకోవాలి... మొత్తం ఐదు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి పై ఫిర్యాదు చేసిన టి ఆర్ ఎస్ నాయకులు  టి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , శాసనసభ్యులు గండ్ర వెంకట రమణ రెడ్డి , కంచర్ల భూపాల్ రెడ్డి , విద్య మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ అధ్యక్షులు రావుల శ్రీధర్ రెడ్డి , నల్లగొండ గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి ఈ సాయంత్రం జిల్లా కలెక్టరు, ఎన్నికల అధికారిని కలిసి బి జే పి పార్టీ ఎన్నికల నిభంధనలను ఉల్లఘించి అక్రమాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి పై వారి కుటుంబం పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎటువంటి అనుమతులు తీసుకోకుండా బి జే పి  పార్టీ పక్షాన కుల సంఘాల మీటింగులు పెడుతున్నారని ఎన్నికల నిభందనలకు విరుద్ధముగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఎదుట ప్రమాణం చేస

కొత్త నాటకం మొదలు పెట్టిన కెసిఆర్ - బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్

Image
   కొత్త నాటకం మొదలు పెట్టిన కెసిఆర్ - బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ నల్గొండ:; 4గురు ఎమ్మెల్యేల బేరసారాలు కెసిఆర్, పికే కుత్రేనని బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక పార్టీలో గెలిచిన వారిని కొనుగోలు చేసే వ్యక్తి కెసిఆర్ అని, తెలంగాణ వచ్చిన వెంటనే 12 మంది ఎమ్మెల్సీలను కొనుగోలు చేశారని విమర్శించారు. టిడిపిని కొనుక్కొని తెలంగాణలో ఆ పార్టీని మూసి వేశారని, ఏ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీ కాంగ్రెస్ ను  నిండా ముంచింది  కెసిఆర్ నని అన్నారు. 18 మంది గెలిస్తే 12 మందిని కొనుక్కున్న వ్యక్తి ఈ కెసిఆర్.  హోదా పట్టి కొనుగోళ్లు, హోదా పట్టి డబ్బులు ఇచ్చి విలువకడుతున్నారని, కొనుగోళ్ల సాంప్రదాయం మొదలు పెట్టింది కెసిఆర్ నని అన్నారు. బి ఆర్ యెస్ పెట్టీ దేశమంతా కూడా ఇదే చేస్తారా ? అని ప్రశ్నించారు.బిజెపి పార్టీకి ఎమ్మెల్యేను కొనాల్సిన అవసరం కూడా లేదుని,  రాజకీయ నాయకులను ప్రలోవ పెట్టే విధానం బిజెపి పార్టీ సిద్ధాంతం కాదని, ఆ నలుగురు ఎమ్మెల్యేలు అర్ధ రూపాయి కూడా విలువ లేదని అన్నారు. ఈ కార్యక్రమంల

నియంత పాలనను సాగిస్తున్న తెరాస కుటుంబ పాలనను సాగనంపాలి - మాజీ ఎంపీ బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్

Image
 నియంత పాలనను సాగిస్తున్న తెరాస కుటుంబ పాలనను  సాగనంపాలి - మాజీ ఎంపీ బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్ నల్గొండ: తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండలో  జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమములో  మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో మొదటి నుండి క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలకు,   కెసిఆర్ ను  కలిసి  ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం  లేకుండా పోయిందని, కెసిఆర్ నియంత్రత్వ విధానాలకు  విసిగి వేసారిన, ఆత్మ గౌరవాన్ని   కాపాడుకోవడం, వ్యవస్థ లో మార్పుకోసం బిజెపి పార్టీలో చేరాల్సిన అవస్యకత ఏర్పడిందని తెలిపారు. ఉద్యమ సమయంలో ప్రధాన భూమిక పోషించి తెలంగాణ ఉద్యమాన్ని దశ దిశలా తెలియపరిచిన జర్నలిస్ట్ లకు ఇచ్చిన హామీలను సైతం ముఖ్యమంత్రి పూర్తిగా విస్మరించినాడని, తెలంగాణా ఏర్పాటు తర్వాత అన్నీ వర్గాల  ప్రజలను కెసిఆర్ మోసగించాడని, ఎస్సి, ఎస్టీ, బిసి ల పట్ల  నిర్లక్ష్య వైఖరితో  ఎటువంటి సంక్షేమ పతకాలు చేపట్టకుండా నియంత పాలనను సాగిస్తున్న తెరాస కుటుంబ పాలనను  సాగనంపాలని కోరారు.  మునుగోడు లో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్

కోమటిరెడ్డి సంకీర్థ్ రెడ్డి ట్వీట్ 100% సత్యం

Image
కోమటిరెడ్డి సంకీర్థ్ రెడ్డి ట్వీట్  100% సత్యం మునుగోడు ప్రజల ముందుకు యావత్ తెలంగాణ అసెంబ్లీ సభ్యులను, మంత్రులను తీసుకవచ్చిన రాజగోపాల్ రెడ్డి  నుద్దేశిస్తూ డాడ్ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాని కోమటిరెడ్డి సంకేర్త్ రెడ్డి  చేసిన ట్వీట్ అక్షర సత్యం. ఇప్పటికే మునుగోడు ప్రజలు గెలిచారన్న  ట్వీట్ లో చివరి మాట.  జరుగుతున్న  పరిణామాలు అందుకు నిదర్శనం. ఇప్పటి వరకు తన తండ్రి ఎంత అడిగిన, అరిచిన పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు తో పాటు 84 మంది శాసన సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీ, ఎంపీలు మునుగోడు ప్రజల మోకాళ్ళ ముందు వంగి ఓట్లు అడుగుతున్న దృశ్యం కోమటిరెడ్డి సంకేర్త్ రెడ్డి ట్వీట్ లో  100 శాతం కనబడింది. ఒక్క రాజీనామాతో  రాష్ట్ర రాజకీయాల్లో  మార్పుకు స్వీకారం చుట్టిన రాజగోపాల్ రెడ్డి ని మునుగోడు మరియు రాష్ట్ర ప్రజలంతా అభినందించవలసిన విషయమే.  ఓట్ల వేయించుకునే  వరకు ప్రజాస్వామ్యము, గెలిచిన తరువాత రాజరికము అన్న చందంగా ఉన్న ఈ పరిస్థితి నుండి  ఒక్క సరిగా పాలకులను ప్రజల దగ్గరికి తీసుకు వచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డిది.  మంత్రులకు, ఎమ్మెలీలకు, ప్రజలకు కలవడానికి అనుమతి ఇవ్వని భవన్ నేడు బార్లాగా తలుపులు తీసి అవమానాలకు

TJU ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బిజిపి నాయకులు శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారితో మీట్ ది ప్రెస్

Image
 TJU ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బిజిపి నాయకులు శ్రీ బూర నర్సయ్య గౌడ్ గారితో మీట్ ది ప్రెస్ నల్గొండ : తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (రి.నెo. A-4534/12)ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బిజిపి నాయకులు  బూర నర్సయ్య గౌడ్ గారితో మీట్ ది ప్రెస్ కార్యక్రమము  బుధవారం 26/10/2022 రోజున  మద్యాహ్నం 3.00 గంటలకు నల్గొండ లక్ష్మీ గార్డెన్స్ మినీ హాల్లో  నిర్వహిస్తున్నామని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, నల్గొండ జిల్లా అధ్యక్షులు భూపతి రాజు, ప్రధాన కార్యదర్శి మీసాల నరహరి తెలిపారు.ఈ కార్యక్రమానికి టీజేయు రాష్ట్ర అధ్యక్షులు  కప్పర ప్రసాదరావు   గారు అధ్యక్షత వహిస్తారని,   ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరు సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరారు.   *తేదీ 26/10/2022* మధ్యాహ్నం 3.00 గంటలకు  లక్ష్మీ గార్డెన్స్ మినీ హాల్, నల్గొండ.

కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచానికి భారీ స్పందన

Image
వీడియో   కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచానికి భారీ స్పందన నల్గొండ జిల్లా.... మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలంలో  కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె  నాలుగు సంవత్సరాల నుండి ప్రజల కోసం మునుగోడు అభివృద్ధి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో చాలా సందర్భంలో ప్రశ్నించారని...ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండని మునుగోడుకు అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు... మునుగోడు అభివృద్ధి చేయాలనే ఉద్దేశం తోనే రాజీనామా చేసాడని...మీ కోసం తెలంగాణ ప్రజల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో సాధ్యమైద్దని బిజెపి తరఫున పోటీ చేస్తున్నాడని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.....

*ఈడీ అప్డేట్స్.....*

Image
  *ఈడీ అప్డేట్స్.....* చంచల్ గూడా జైలు నుండి సుఖేష్ గుప్తా ను ఈడీ కార్యాలయానికి తరలించిన ఈడీ అధికారులు... శ్రేయి ఫైనాన్స్ లో తీసుకున్న రుణాల తో పాటు MMTC సంస్థ లో కొనుగోలు చేసిన బంగారం పై ప్రశ్నించునున్న ఈడీ అధికారులు.. శ్రేయి ఫైనాన్స్ లో 110 కోట్ల రుణాలు తీసుకున్న సుఖేష్ గుప్తా.. రియల్ ఎస్టేట్ పేరు తో శ్రేయి ఫైనాన్స్ లో రుణాలు పొందిన సుఖేష్ గుప్తా.. మాణిలాండరింగ్ కోణం లో సుఖేష్ గుప్తా ను తొమ్మిది రోజుల పాటు విచారించునున్న ఈడీ.

కేసీఆర్‌ ఝూఠా మాటల పోస్టర్లను విడుదల చేసిన బండి సంజయ్‌

Image
 కేసీఆర్‌ ఝూఠా మాటల పోస్టర్లను విడుదల చేసిన బండి సంజయ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బిజెపి రాష్ట్రశాఖ ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లను రూపొందించింది. ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లను   బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్‌కుమార్‌ మంగళవారం నాడు విడుదల చేశారు. కేసీఆర్‌ ఝూఠా మాటలు పోస్టర్లను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తదితర సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని బిజెపి శ్రేణులను ఆయన కోరారు. * ఒక దళిత నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తా. నేను చెప్పిన అంటే తల నరుక్కుంటా గానీ, ఆ మాట తప్పను. ఖచ్చితంగా, ఎట్టిపరిస్థితుల్లో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటారు... * దళితులకు మూడెకరాల భూమి ఇస్తా ... * 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మిస్తా ... * ప్రతీ మండలంలో అంబేద్కర్‌ వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాం...  * బంగారుతెలంగాణలో రైతు ఆత్మహత్యలుండవు ... * రైతులు పండిరచిన ఆఖరి గింజవరకు మేమే కొంటాం ... * తెలంగాణలోని ప్రతీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మనవి చేస