Skip to main content

Posts

Showing posts from December, 2019

**నల్గొండ మున్సిపాలిటీ లో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పై సమీక్షిస్తున్న ఇంచార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్**

నల్గొండ మున్సిపాలిటీ లో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పై సమీక్షిస్తున్న ఇంచార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్

**తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన  గవర్నర్**

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన  గవర్నర్ తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరరాజన్ ఒక సందేశంలో రాష్ట్ర ప్రజలకు తన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మరియు నూతన సంవత్సర 2020 రాష్ట్రంలోని ప్రజలకు ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని ఇస్తుందని ఆకాంక్షించారు.      

**గిరిజన ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన  రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్**

గిరిజన ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన  రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్   2019 డిసెంబర్ 31వ తేదీ. సంవత్సరం ఆఖరి రోజున రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్  విద్యార్థుల సంక్షేమం లక్ష్యంగా, సిఎం కేసిఆర్ మానస పుత్రికలైన గురుకులాల నిర్వహణ ఆయన ఆలోచన మేరకు గొప్పగా నడవాలన్న సంకల్పంతో  మహబూబాబాద్ జిల్లా, కురవి మండలంలోని గిరిజన ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కురవి ఏకలవ్య పాఠశాలలో ఉదయం విద్యార్థులు ప్రార్థన చేసే సమయానికి అక్కడికి చేరుకుని ప్రార్థనలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. విద్యార్థుల మార్చ్ సెల్యుట్ ను స్వీకరించారు. డిసెంబర్ 31వ తేదీ జన్మదినోత్సవం ఉన్న విద్యార్థినికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరి విద్యార్థులతో కలిపి హ్యాపీ బర్త్ డే పాటను పాడించారు. ఉదయం విద్యార్థులు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండడంతో మంత్రి గారు కూడా వారితో కలిసి బాక్సింగ్ చేశారు.  వారికొక ఉత్సాహాన్ని కల్పించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, గురుకులంలోని మౌలిక సదుపాయాల గుర

**రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్, నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి**

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్, నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఎక్కువ సమయం ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం వల్ల సోమేశ్ కుమార్ ను నియమించడం వల్ల స్థిరత్వం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రిటైర్ కాబోతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి వ్యవహరించనున్నారు.

**ఉపాధ్యాయులకు  నిష్ట శిక్షణా కార్యాక్రమం**

ఉపాధ్యాయులకు  నిష్ట శిక్షణా కార్యాక్రమం నల్లగొండ లోని గోకుల్ బి.ఎడ్ కళాశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు జరుగుచున్న నిష్ట శిక్షణా కార్యాక్రమంలొ భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి.వేణు ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయులకు జువనైల్ జస్టిస్, బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నిషేధం, పోక్సో యాక్ట్, విధ్యా హక్కు చట్టం పై విశదీకరించి  గురువు దైవంతొ సమానమని, గురుతర బాధ్యత ఎంతో ఉందని, బాల, బాలికలపై ఎన్నో అకృత్యాలు జరుగుచున్నవని నేటి రోజులలొ సాంకేతిక విజ్ఞానం పెరిగినా కొద్ది మంచి చెడు నిర్ణయించటం పెను సవాలుగా మారుతుందని, చట్టాలున్నా, విజ్ఞానమున్నా మనుషులలొ మార్పు లేకుంటె నాగరిక సమాజం పొందలేమన్నారు, దేశ భవితను పెంపొందించే రాజ్యాంగ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఎంతో ఉందని తెలుపుతూ న్యాయ సేవ అధికార చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అందరికి అందుబాటులొ న్యాయం అనే సిద్దాంతం ద్వారా న్యాయ సేవలు న్యాయ సేవ సంస్థ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఇంచార్జి చంద్రశేఖర్, రిసోర్స్ పర్సన్స్ యోగీంద్రనాథ్, రాములు పాల్గొన్

**ఆంద్రప్రదేశ్ రాష్ట్ర  ప్రజలందరికీ సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్.జగన్ వీడియో చూడండి**

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర  ప్రజలందరికీ సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి  వైయస్.జగన్ వీడియో చూడండి https://youtu.be/24ebJbCDj2w  

**సీతారామ ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్  **

సీతారామ ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్   సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ పువ్వాడ అజయ్ కుమార్  సందర్శించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. వ్యవసాయానికి చివరి ఎకరా వరకు సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నిర్మాణ పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంప్ హౌస్ల పనులు పరిశీలించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారు,  ఎంపీ శ్రీమతి మాలోతు కవిత గారు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ గారు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు.

**పోలవరం పనుల పురోగతిపై సీడబ్ల్యూసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. **

విజయవాడ: పోలవరం పనుల పురోగతిపై సీడబ్ల్యూసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించిన సీడబ్ల్యూసీ అధికారులు... సోమవారం పీపీఏ, రాష్ట్ర ఇరిగేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.  స్పిల్‌వే మినహా ఎలాంటి పనులు జరగడం లేదని ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ అధికారులు వ్యాఖ్యానించారు.  గోదావరి నీటిని కూడా వెనక్కి పంపలేకపోయారన్నారు.  రెండు నెలల సమయాన్ని వృథా చేశారని చెప్పారు.  కాఫర్‌ డ్యామ్‌ వచ్చే జూన్‌ దాకా అయ్యే పరిస్థితి లేదని తెలిపారు.  స్పిల్‌వే, గేట్ల బిగింపు ప్రణాళికకు..క్షేత్రస్థాయి పనులకు పొంతన లేదన్నారు.  ఢిల్లీలో త్వరలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.  అయితే రాష్ట్ర ఇరిగేషన్ అధికారుల వాదన మరోలా ఉంది.  నిధులు ఇవ్వకపోవడంతో పాటు డిజైన్లకు ఆమోదం తెలపలేదని అందుకే ఆలస్యం అవుతుందని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. 

**చరవాణి పోయినా, ఎవరైనా దొంగలించినా ఎక్కడుందో కనిపెట్టేందుకు దిల్లీలో ఓ నూతన పోర్టల్**

న్యూఢిల్లీ ఎప్పుడైనా చరవాణి పోయినా, ఎవరైనా దొంగలించినా ఎక్కడుందో కనిపెట్టేందుకు దిల్లీలో ఓ నూతన పోర్టల్ ప్రారంభమైంది.  ఈ వెబ్​ పోర్టల్​ను కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్​ ప్రసాద్ ప్రారంభించారు​.  ఈ ఏడాది సెప్టెంబర్​లో దీన్ని ముంబయిలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలిపారు. పోగొట్టుకున్న, దొంగలించిన చరవాణిల వివరాలు పోలీసులకు తెలియజేయాటానికి, చరవాణిని బ్లాక్​ చేయడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని రవిశంకర్​ చెప్పారు.

**ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వెబ్‌సైట్లు, యాప్‌ల వాడకంపై నౌకాదళం నిషేధం**

న్యూఢిల్లీ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వెబ్‌సైట్లు, యాప్‌ల వాడకంపై నౌకాదళం నిషేధం విధించింది.  నౌకలు, నౌకా నిర్మాణ కేంద్రాల్లో తమ సిబ్బంది స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా సైట్లు, యాప్‌లు వాడరాదని పేర్కొంటూ ఆదేశాలను జారీ చేసింది.  సైబర్‌ గూఢచర్యం అభియోగాలతో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్టు నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించింది.

**ఆ ఇంటి విలువ రూ 130 కోట్లు**

ఆ ఇంటి విలువ రూ 130 కోట్లు ఢీల్లీలోని సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్ధీ పూర్వీకులకు సంబంధించిన ఇంటి విలువను రూ 130 కోట్లుగా ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది. 1970లో​ కాంగ్రెస్‌ నేతకు రష్ధీ తండ్రి ఈ ఇంటిని అమ్మేందుకు సిద్ధపడగా ఇరు పక్షాల మధ్య నెలకొన్న వివాదంతో ఆ ఒప్పందం నిలిచిపోయింది. ఈ వివాదం సర్వోన్నత న్యాయస్ధానానికి చేరగా 2012లో కాంగ్రెస్‌ మాజీ నేత భికురాం జైన్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఉత్తర్వులు వెలువడిన నాటికి మార్కెట్‌ రేటు ప్రకారం ఆ ఇంటిని జైన్‌కు అప్పగించాలని రష్ధీ వారసులను కోర్టు ఆదేశించింది. ఈ ఆస్తి మార్కెట్‌ విలువను నిర్ధారించాలని సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టును కోరింది.రూ 130 కోట్లకు తమ ఇంటిని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారు సిద్ధంగా ఉన్నారని రష్ధీ వారసులు తెలపడంతో ఇంటి మార్కెట్‌ ధరను ఢిల్లీ హైకోర్టు రూ 130 కోట్లుగా నిర్ధారించింది. ఈ ధరకు ఇంటిని కొనుగోలు చేసేందుకు జైన్‌లు సిద్ధంగా లేకుంటే ఆరు నెలల్లోగా ఇతరులకు రష్ధీ వారసులు తమ ఇంటిని విక్రయించవచ్చని జస్టిస్‌ రాజీవ్‌ సహాయ్‌ ఎండ్లా తెలిపారు. రూ 130 కోట్లకు ఇంటిని నిర్ధేశిత గడువులోగా రష్ధీలు అమ్మలేని పక

**దిగివస్తున్న ఉల్లి ధరలు..**

దిగివస్తున్న ఉల్లి ధరలు.. హైదరాబాద్‌ : కొన్ని రోజులుగా వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు కొద్దికొద్దిగా దిగి వస్తున్నాయి. నెల రోజుల క్రితం క్వింటాల్‌ ఉల్లి ధర హోల్‌సేల్‌ మార్కెట్‌లో 12,000 నుంచి 13,000 రూపాయలు పలుకగా సోమవారం క్వింటాల్‌కు 8,500 నుంచి 9 వేల రూపాయలు పలికింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లోనూ కిలో 90 రూపాయల నుంచి 100 రూపాయలు పలుకుతోంది. రెండు నెలల ధరలతో పోలిస్తే దాదాపు కిలోకు 50 నుంచి100 రూపాయలు తగ్గినట్టేనని వ్యాపారులు చెబుతున్నారు. గత రెండు రోజుల నుంచి హోల్‌సేల్‌ మార్కెట్‌లకు ఉల్లి దిగుమతులు బాగా పెరిగాయి. రోజుకు 80 నుంచి 100 లారీల వరకు వస్తున్నాయని మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు.ప్రస్తుతం తెలంగాణ, ఎపి తో పాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి కూడా నగరానికి ఉల్లి దిగుమతి పెరిగింది. మరో వారం రోజుల్లో గుజరాత్‌ నుంచి ఉల్లిగడ్డ నగరానికి చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ లెక్కన మరో 15 రోజుల్లో ఉల్లి ధరలు సాధారణ స్ధితికి వస్తాయని హోల్‌సేల్‌ ఉల్లి వ్యాపారి ధరణికోట సుధాకర్‌ వెల్లడించారు. ఇప్పటికే మార్కెట్‌కు ఉల్లి కొత్తపంట రాక మొదలైందని తెలిపారు.

**సిమ్లా, ముస్సూరీ కంటే.. ఢిల్లీలోనే ఎందుకింత చలి?**

 *సిమ్లా, ముస్సూరీ కంటే.. ఢిల్లీలోనే ఎందుకింత చలి?* దేశ రాజధాని ఢిల్లీలో చలి చంపేస్తోంది. నగరవాసులను గజగజ వణికిస్తోంది. వింటర్ సీజన్ కావడంతో చలి తీవ్రత మరింత పెరిగిపోయింది. బయటకు రావాలంటేనే ఢిల్లీవాసులు వణికిపోతున్నారు. సాధారణంగా వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు పర్వతాల పైకెళ్లి సేద తీరుతుంటారు. కానీ, ఢిల్లీ-NCRలో డిసెంబర్ నెలలో మాత్రం గడ్డు కట్టించేంత చలి పెరిగిపోయింది. 119ఏళ్లలో డిసెంబర్ నెలలో చలి తీవ్రత ఈ స్థాయికి చేరుకోవడం ఇది రెండోసారి. గడిచిన 100 ఏళ్లలో 4 ఏళ్లలో (1919, 1929, 1961, 1997) మాత్రమే ఉష్ణోగత్రలు ఒక్కసారిగా పడిపోయాయి. శతాబ్ద కాలంలో 1997 తర్వాత అది డిసెంబర్ నెలలోనే 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2019 ఏడాదిలో డిసెంబర్ 26 వరకు గరిష్టంగా 19.85 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొన్నిరోజులుగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రసిద్ధ పర్వత ప్రాంతాలైన సిమ్లా, ముస్సూరీ కంటే ఢిల్లీలోనే చలి తీవ్ర స్థాయిలో నమోదువుతోంది.   

**ఢీకొట్టిన ఇసుక లారీ ..ఇద్దరు మృతి**

ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీ చౌరస్తాలో స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ ..ఇద్దరు మృతి మరో ఆరుగురికి గాయాలు మరో ముగ్గురు క్షేమం. హబ్సిగూడ  భాష్యం స్కూల్ చెందిన విద్యార్థులు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

**NRC ,CAA ,CAB లకు మద్దతుగా  రామంతపూర్ లో   భారీ ర్యాలీ **

  NRC ,CAA ,CAB లకు మద్దతుగా  రామంతపూర్ లో   భారీ ర్యాలీ NRC ,CAA ,CAB లకు మద్దతుగా ఉప్పల్  రామంతపూర్ లో తేదీ 29-12-2019 న  భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ శాసన సభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో  జరిగింది. .ఈ ర్యాలీ లో నియోజకవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు,ప్రజలు అనేకమంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

**ముంబయి సివంగి’ ఎన్‌.అంబిక విజయగాథ **

ముంబయి సివంగి' ఎన్‌.అంబిక విజయగాథ  పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది... పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు... 'నేను ఇంకేం సాధించలేను' అని ఆమె నిరాశపడలేదు... పట్టుదలతో పోరాడి ఐపిఎస్‌ సాధించారు. నార్త్‌ ముంబయి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 35 ఏళ్ల 'ముంబయి సివంగి' ఎన్‌.అంబిక విజయగాథ ఇది.  ''పోలీస్‌ పరేడ్‌కి హాజరు కావాలంటూ ఆ రోజు ఉదయాన్నే నా భర్త ఇంటి నుంచి బయలుదేరారు. ఆ కార్యక్రమం టీవీలో చూశాను. డీజీపీ, ఐజీ హాజరయ్యారు. వారికి పోలీసులు నమస్కరిస్తూ చేసిన గౌరవమర్యాదలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. నా భర్త పోలీస్‌ కానిస్టేబుల్‌. ఆయన ఇంటికి రాగానే అడిగాను- ''డీజీపీ, ఐజీ అంటే ఎవరు'' అని. ''వాళ్లు మా పోలీస్‌ డిపార్టుమెంట్‌లో మొదటి ర్యాంకు అధికారులు'' అంటూ నా భర్త చెప్పారు. అప్పటి వరకూ ఇల్లు, పిల్లలే నా ప్రపంచం. 'అప్పుడే నేను కూడా ఆ స్థాయి అధికారిణి కావాలని నిర్ణయించుకున్నా. అయితే అది అంత సులువు కాదని నాకు తెలుసు'' అంటూ తనలో స్ఫూర్తి నింపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు అంబిక.  కళ్ళెదుట ఎన్నో అవరోధాలు: తమిళనాడుకు చ

*మీడియా సోదరులతో ముఖాముఖిలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి, ఉన్నత అధికారులు**

హాకా భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  నూతన సంవత్సరం రాక సంధర్భంగా మీడియా సోదరులతో ముఖాముఖి హాజరైన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి గారు, కమీషనర్ రాహుల్ బొజ్జా గారు, వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీ ప్రవీణ్ రావు గారు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామక్రిష్ణా రెడ్డి గారు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఉద్యానశాఖ కమీషనర్ వెంకట్రాంరెడ్డి గారు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు గారు, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి గారు, అగ్రోస్ ఎండీ రాములు గారు.

**సిరిసిల్ల బ్రిడ్జి వద్ద మిడ్ మానేరు బ్యాక్ వాటర్ లో పూలు వేసి పూజ చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.**

సిరిసిల్ల బ్రిడ్జి వద్ద మిడ్ మానేరు బ్యాక్ వాటర్ లో పూలు వేసి పూజ చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.

**AP మరియు తెలంగాణ కు చెందిన టూర్స్ & ట్రావెల్స్ ఆపరేటర్ లతో సమావేశం నిర్వహించిన మంత్రి   శ్రీనివాస్ గౌడ్**

 AP మరియు తెలంగాణ కు చెందిన టూర్స్ & ట్రావెల్స్ ఆపరేటర్ లతో సమావేశం నిర్వహించిన మంత్రి   శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు  ఆధ్వర్యంలో పర్యాటక రంగ అభివృద్ధి కి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. బోగస్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్ ల కారణంగా రాష్ట్రానికి వచ్చే దేశీయ, విదేశీ  పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా నిబంధనలు పై రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  మనోహర్  తో చర్చించారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖలో  గుర్తింపు నమోదు చేసుకోవాలనే విధంగా విధి విధానాలు రూపొందించాలని టూరిజం M D ని ఆదేశించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు.  తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తున్న రంగమన్నారు. పర్యాటక రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, పర్యాటకాన్ని సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటక ప్రదేశాలు నిర్లక్ష్యం చేయబడ్డాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని సీఎం కేసీఆర్ ఆద

***_రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే రైతుల తలరాత కూడా మారిపోయింది_**

  *_రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే రైతుల తలరాత కూడా మారిపోయింది_* *_సన్మానాలు, సత్కారాలు అందుకున్న చోటే లాఠీ దెబ్బలు_* *_13వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు_* *_అమరావతే రాజధాని అని ప్రకటించే వరకూ నిరసనలు ఆగవు_* *_రాజధాని రైతులకు తెదేపా పూర్తి మద్దతు ఉంటుంది_* *_నందిగామ :-  రాజధాని తరలింపును నిరసిస్తూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్న రైతులను అణచివేసేందుకు ప్రభుత్వం భారీసంఖ్యలో పోలీసులను మోహరించి కక్ష పూరిత చర్యలకు పాల్పడుతుందని నందిగామ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. రైతుల ఉద్యమాన్ని నీరుకార్చేందుకే  పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సౌమ్య తెలిపారు. ఉచితంగా భూమి ఇచ్చిన తమకు మంచి బహుమానమే ఇచ్చారని, దాతృత్వం చూపినవారిని కటకటాల పాలుజేసిన ఘనత జగన్మోహన్‌రెడ్డి సర్కారుకే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే రైతుల తలరాత కూడా మారిపోయిందని, సన్మానాలు, సత్కారాలు అందుకున్న చోటే లాఠీ దెబ్బలు మిగిలాయని విచారం వ్యక్తం చేసారు. రాజధాని రైతుల ఆందోళనలు 14వ రోజుకు చేరాయని, అమరావతే రాజధాని అని ప్రకటి

**భయం తో బాంబును అండర్ వేర్ లో పెట్టుకున్న మృతుడు**

  అడవి పందుల వేట కోసం నాటు బాంబుతో వెళుతుండగా ప్రమాదం. పోలీసులు తనిఖీ చేస్తారన్న భయం తో బాంబును అండర్ వేర్ లో పెట్టుకున్న మృతుడు. ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద బైక్ అదుపు తప్పి కింద పడటంతో రాపిడి జరిగి పేలిన బాంబ్. ముక్కలు ముక్కలైన మృతదేహం.. వెనకాల కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు ,పరిస్థితి విషమం, మహారాష్ట్ర వాసులుగా గుర్తింపు

**డ్రోన్ కెమెరా కు పట్టుబడిన 10మంది మందుబాబులు**

*డ్రోన్ కెమెరా కు పట్టుబడిన 10మంది మందుబాబులు* కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడ్ గ్రామ శివారులో గల బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న పదిమంది మందు బాబులను ఆదివారం నాడు పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో పట్టుకున్నారు.పట్టుబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ కు చెందిన టి శ్రీకాంత్, జి లక్ష్మణ్, యం రంజిత్, బొమ్మకల్ కు చెందిన జి లకేష్, పెద్దపల్లి కి చెందిన కే రాజేష్, దుర్షేడ్ చెందిన వి సాయి, టి వేణు, ఎం వంశీ, మానకొండూరు కు చెందిన కే రాకేష్, వికారాబాద్ కు చెందిన కే సాయి కిరణ్ లు పట్టుబడ్డారు. వీరిని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. 

***చలికి వణుకుతున్న ఏపీ..***

చలికి వణుకుతున్న ఏపీ.. భయపెడుతున్న శీతల గాలులు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలులు కళింగపట్నంలో తొలిసారి 14.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు గడ్డకడుతున్న ఏజెన్సీ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. బంగాళాఖాతంలో కొనసాగిన ద్రోణి ప్రభావంతోపాటు ఉత్తర, మధ్య తూర్పు భారతదేశం నుంచి శీతల గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో కోస్తాలో చలి ఒక్కసారిగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు పడిపోయాయి. ముఖ్యంగా ఒడిశాకు ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలికి గడ్డకట్టుకుపోతున్నారు. కోస్తా తీర ప్రాంతమైన కళింగపట్నంలో ఈ సీజన్‌లోనే తొలిసారి అత్యంత తక్కువగా 14.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆరోగ్యవరంలో 16.5, నందిగామలో 17.6, తునిలో 18.7 డిగ్రీలు నమోదయ్యాయి.

**కాల్ మనీ కాలనాగుల వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే కాలువలో దూకి ఆత్మహత్య.**

  విజయవాడ లో దారుణం. కాల్ మనీ కాలనాగుల వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే కాలువలో దూకి ఆత్మహత్య. తన మరణానికి కారణం కాసుల రంగారావు, కోలా కిరణ్ , కోలా రాంబాబు, తూపాకుల మహేష్ అంటూ సెల్ఫి విడియో చెప్పిన ప్రేమ్. నాలుగు లక్షల కు 16 లక్షల రూపాయలు కట్టానంటూ సెల్ఫి విడియో లో కన్నీరు పట్టుకున్న ప్రేమ్ . విజయవాడ పటమట పోలీస్ స్టేషను లో ఫీర్యాదు చేసిన పట్టించుకోలేదని అవేధన చెందిన ప్రేమ్. అ నలుగురు పోలీసుల ముందే పోలీస్ స్టేషను లో కులం పేరుతో దూషించి న పోలీసులు పట్టించుకోలేదంటు అవేధన. తన భర్త మరణానికి కరమైన నలుగురు కఠినంగా శిక్షించాలంటున్న ప్రేమ్ కుటుంబ సభ్యులు.

**రాజధాని ఆందోళనలపై చర్చించాలని పవన్ కల్యాణ్ నిర్ణయం**

రాజధాని ఆందోళనలపై చర్చించాలని పవన్ కల్యాణ్ నిర్ణయం అమరావతిలో ఆందోళనలు, నిరసనలు రేపు మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం నేతల అభిప్రాయాలు తెలుసుకోనున్న పవన్ గత కొన్నిరోజులుగా అమరావతిలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రేపు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమైన విభాగాల నాయకులతో పవన్ భేటీ కానున్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులు, మూడు రాజధానుల అంశంపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ముఖ్యంగా అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు, పార్టీ విధానంపై చర్చించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా, పార్టీపరమైన కార్యక్రమాల షెడ్యూల్ పైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు. రాజధాని గ్రామాల్లో జనసేన నేతల పర్యటన నివేదికను కూడా పరిశీలిస్తారు.

**మరో డ్రగ్ ముఠాను చేదించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.**

మరో డ్రగ్ ముఠాను చేదించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. న్యూ ఇయర్ జోష్ లో ఈవెంట్ ఆర్గనైజర్ల తో డ్రగ్ సరఫరా చేసేందుకు డ్రగ్ మాఫియా ప్లాన్. షాబాజ్ అనే  ఈవెంట్ ఆర్గనైజర్ ను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.  కొకైన్,ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం. మరో నిందితుడి కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు.

**డ్రంకన్ డ్రైవ్-66 మంది పై కేసులు**

 హైదరాబాద్, శనివారం రాత్రి 17.చోట్ల డ్రంకన్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాల నడిపిన 66 మందిపై కేసు నమోదు 5.ఫోర్ విల్లర్స్ 6.ఆటోలు 55.టూవీలర్స్  సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు...

**రూ. లక్షతో గుట్టుగా బైక్‌ కొన్న బాలుడు వ్యక్తి మృతికి కారణం ×*

రూ. లక్షతో గుట్టుగా బైక్‌ కొన్న బాలుడువ్యక్తి మృతికి కారణం కావడంతో విషయం రట్టు బేగంపేట (అమీర్‌పేట), న్యూస్‌టుడే: ఓ బాలుడు ఇంట్లో తెలియకుండా సుమారు రూ. లక్ష విలువైన ద్విచక్ర వాహనం కొన్నాడు. దాన్ని నడుపుతూ ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు. దీంతో విషయం బయటికొచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాసరావు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నాచారం సమీపంలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన బాలుడు (17) తన సోదరుడు (19)తో కలిసి బేగంపేటలోని ఓ షోరూంలో సెప్టెంబరు 30న ద్విచక్ర వాహనాన్ని కొన్నాడు. దాని విలువ సుమారు రూ. లక్ష. హాస్టల్లో ఉంటున్న బాలుడు బైకును తన వద్దనే ఉంచుకున్నాడు. వారం కిందట అతడు బైక్‌ నడుపుతుండగా ఘట్‌కేసర్‌ సమీపంలో ఒక వ్యక్తిని ఢీకొట్టి అతడి మృతికి కారణమయ్యాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. అతడి తండ్రి, బంధువులు శనివారం వాహన షోరూంకు వచ్చి బైక్‌ ఎందుకు విక్రయించారని నిలదీశారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అక్కడికి వెళ్లిన తమపైనా బాలుడి బంధువులు దురుసుగా ప్రవర్తించారని కానిస్టేబుళ్లు కూడా ఫిర్యాదు ఇచ్చారు.

**మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ మానవహారం**

విజయవాడ:  మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ జిల్లాలోని బెంజ్‌సర్కిల్‌లో ఆదివారం ఉదయం మానవహారం నిర్వహించారు.  అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.  సేవ్ అమరావతి నినాదంతో హైస్కూల్ రోడ్డు నుంచి విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని మండిపడ్డారు.  రాజధాని అభివృద్ధి కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు.  అభివృద్ధి వికేంద్రీకరణ చేయచ్చు కానీ, పాలనను వికేంద్రీకరణ చేయడం మంచిది కాదని తెలిపారు.  అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రకటన చేసే వరకు తమ ఉద్యమం ఆగదని, అమరావతి రాజధాని పోరాటంలో రైతులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సమితి నేతలు స్పష్టం చేశారు.

**అమరావతి: రాజధానిలో రైతుల ఇళ్లలో పోలీసుల సోదాలు**

*అమరావతి: రాజధానిలో రైతుల ఇళ్లలో పోలీసుల సోదాలు* *అమరావతి:* ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడం గ్రామానికి చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అర్ధరాత్రి దాటాక తమ ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారని, కొందరిని అరెస్టు చేసి తీసుకెళ్లారని చెప్పారు. వెంకటపాలెం, మోదుగుల లింగాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని రైతులు ఆరోపించారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడిచిపెట్టకపోతే పీఎస్‌ల ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అరెస్టయినవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని రైతులు తెలపారు.

**టీటీడీలో అస్తవ్యస్థంగా ఆడిటింగ్ వ్యవస్థ: ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి**

*టీటీడీలో అస్తవ్యస్థంగా ఆడిటింగ్ వ్యవస్థ: ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి* *తిరుమల:* టీటీడీలో ఆడిటింగ్ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు.  శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలకు లెక్కలు లేవన్నారు.  స్వామి వారికి భక్తులు సమర్పించే ప్రతీ కానుకకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత టీటీడీపైనే ఉందన్నారు.  తిరుమలను క్రిస్టియానిటీ కేంద్రంగా మారుస్తున్నారంటూ సీఎం జగన్‌పై వస్తున్న ఆరోపణలలో నిజం లేదని తెలిపారు.  చైర్మన్ సుబ్బారెడ్డి అన్యమతస్థుడంటూ చేసిన ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు.  రమణ దీక్షితులును తిరిగి ప్రధాన అర్చకుడిగా తీసుకోవడం శుభపరిణామని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.  ఆదివారం తిరుమల శ్రీవారిని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, కేంద్ర సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జర్ దర్శించుకున్నారు.

**గుట్కా తింటోందని.. భార్యను సజీవదహనం చేసిన భర్త....**

గుట్కా తింటోందని.. భార్యను సజీవదహనం చేసిన భర్త.... గుట్కా తినడం మానడం లేదనే కోపంతో కట్టుకున్న భార్యను సజీవ దహనం చేశాడు ఓ భర్త. మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో 2010లో ఈ ఘటన చోటుచేసుకోగా.. నిందితుడికి న్యాయస్థానం ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. అదనపు పీపీ రాము కథనం ప్రకారం.. మేడ్చల్‌ మండల కేంద్రానికి చెందిన పిట్ల కిరణ్‌, సుకన్యలకు 2010లో వివాహం జరిగింది. ఆటోడ్రైవర్‌గా పని చేసే కిరణ్‌ మద్యానికి, భార్య సుకన్య గుట్కాకు బానిసయ్యారు. అయితే గుట్కా తినడం మానేయాలని కిరణ్‌ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. కానీ ఆమె భర్త మాటలను లక్ష్యపెట్టలేదు. ఈ క్రమంలో 2010 డిసెంబర్ 31న మరోసారి గుట్కా విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన కిరణ్‌ భార్య సుకన్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పివేసి ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. ఈ మేరకు మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అనంతరం కిరణ్‌పై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.

**నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ కేసులపై వార్షిక సమావేశం...**

మచిలీపట్నం లో కృష్ణ జిల్లాలో2019 సం.. నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ కేసులపై వార్షిక సమావేశం... మీడియా సమావేశంలో వివరించిన జిల్లా ఎస్.పి రవీంద్రనాథ్ బాబు  కామెంట్స్ జిల్లాలో 2019 సం కు సంభందించి జిల్లాలో నేర నియంత్రణకు పటిష్ట చర్యలు... గత సం2018 తో పోల్చితే క్రైమ్ రేటు తగ్గుమొహం ...  మొట్టమొదటి జీరో ఎఫ్.ఐ .ఆర్  కృష్ణ జిల్లాలో నమోదు ... జిల్లాలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ద్వారా స్పందన కార్యక్రమంలో 7817 కేసులను పరిష్కరించడం జరిగింది...  మెగా లోక్ అదాలత్ ద్వారా అన్ని పోలీసుస్టేషన్ పోలీస్ కేసుల పరిష్కారంలో రెండు తెలుగు రాష్టలల్లో కృష్ణ జిల్లా మొదటి స్థానంలో ఉంది ... మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ మహిళలపై దాడులు అరికట్టగలిగాము.... ట్రాఫిక్ నియంత్రణ ఎప్పటికపుడు నిఘా కెమెరాలద్వారా కేవలం నిముషాల వ్యవధిలో పరిష్కరం .... ఐటీ సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక సెల్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ... కిడ్నప్ కేసులు ఈ సం 219 నమోదు అయ్యాయని, మైనర్ బాలురు, బాలికలు ఇంటి నుండి పారిపోయిన కూడా అవి కిడ్నప్ కేసులుగా నమోదు చేయటం జరుగుతాయి...కేసు పర

**వసతి గృహంలో దారుణం...  గర్భం దాల్చిన ముగ్గురు డిగ్రి విద్యార్థినులు,**

అసిఫాబాద్ గిరిజన  వసతి గృహంలో దారుణం...  గర్భం దాల్చిన ముగ్గురు డిగ్రి విద్యార్థినులు,రిమ్స్ లో చేర్చిన అధికారులు, ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్,విచారణకు అదేశం

**తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో నాటు బాంబుల కలకలం.**

తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో నాటు బాంబుల కలకలం.   కవర్ లో ఉన్న బాంబులను లాక్కెళ్లిన కుక్కలు.   రెండు నాటు బాంబులు పేలడంతో మృతి చెందిన కుక్క.   సమీపంలో మనుషులెవ్వరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం.  ఆటోలో ఆరు నాటు బాంబులు గుర్తించిన పోలీసులు.  తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్ 

** *ఏ.యం.అర్.పి.లో లెవల్ కెనాల్ నుండి సాగు నీరు విడుదల చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి**

*ఏ.యం.అర్.పి.లో లెవల్ కెనాల్ నుండి సాగు నీరు విడుదల చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి* ఏ.యం.అర్.పి. లో లెవల్ కెనాల్ (దిగువ కాలువ)నుండి పంపులు స్వీచ్ ఆన్ చేసి ఆయకట్టు రైతాంగానికి సాగు నీటిని శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సాగు నీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.రైతులు ప్రతి నీటి చుక్కను వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ.యం.అర్.పి.లో లెవల్ కెనాల్  ద్వారా .65 టీ.యం.సి నీటిని 27 చెరువులు నింపడమే గాక,2.67 టీ.యం. సీ.నీటిని రబీలో  6 తడుల కు ఆన్ అండ్ ఆఫ్ (వార బంది) పద్దతి ద్వారా ఏప్రిల్ 4 వరకు  విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.పంటల పరిస్థితి,సాగు నీటి లభ్యత ననుసరించి నీటి విడుదల కొనసాగించ నున్నట్లు తెలిపారు .హై లెవెల్ కెనాల్ ద్వారా 2 లక్షల 20 వేల ఎకరాల రబీ ఆయకట్టు కు నీటి విడుదల కొనసాగుతోందని అన్నారు. ఏడు విడతలు వార బంధి పద్ధతిన  ఏప్రిల్ మొదటి వరకు ఇవ్వడానికి ప్రణాళిక ఖరారు చేయడం జరిగిందని తెలిపారు. నీటివిడుదల నీటి లభ్యత పంటల పరిస్థితి ని అనుసరించి నీటి విడుద

**మిడ్ నైట్ రెండు వర్గాలమధ్య గొడవ ...**

 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 23 న మిడ్ నైట్ రెండు వర్గాలమధ్య గొడవ ... పార్క్ హోటల్ లో పార్టీ అట్టెండ్ ఐనా తరువాత బయటకు వచ్చినా ఈ రెండు వర్గాలు , తమ గర్ల్ ఫ్రెండ్ ను అదో రకంగా చూస్తున్నారని పరస్పరం గొడవకు దిగారు . ఈ గొడవలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి , వారి వద్ద నుంచి కంప్లైంట్ తీసుకున్న ఎస్సై విజయభాస్కర్ రెడ్డి బాధితులను  మెడికల్ టెస్ట్ నిమిత్తం హాస్పిటల్ కి పంపించారు .  బాధితులు పై దాడి చేసిన ఎస్మాతుల్లాహ్ నూరుజాయ్ ని మరియు ఖోస్తాయి ఇస్మాయిల్ జాన్ ను అరెస్టు చేసి ఈరోజు రిమాండ్ కు పంపిస్తున్నారు ..

**ఆస్క్ ఆధార్**

  ఆధార్ కార్డుదారులకు 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIAI)'... 'ఆస్క్ ఆధార్' పేరుతో మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. యూఐడీఏఐ ఛాట్‌బాట్ సర్వీస్... అంటే ఆధార్‌కు సంబంధించిన సందేహాలు, సమస్యలను ఛాట్‌బాట్ సర్వీస్ ఉపయోగించుకుని పరిష్కరించుకోవచ్చు. మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in / ఓపెన్ చేస్తే ఛాట్‌బాట్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ పైన క్లిక్ చేసి సమస్యను వివరించవచ్చు. ఆధార్ అప్‌డేట్ సమాచారం, ఆధార్ స్టేటస్, డౌన్‌లోడ్ ఇ ఆధార్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్... ఇలా ఎలాంటి అంశాలనైనా ప్రస్తావించవచ్చు. 'ఆధార్‌'కు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఛాట్‌బాట్ అందుబాటులో ఉంది. ఆధార్‌కు సంబంధించిన వీడియోలు, సంబంధిత టాపిక్స్ కూడా ఇదే విండోలో చూడొచ్చు. ఇదిలా ఉంటే... ఆధార్‌కు సంబంధించి యూఐడీఏఐ మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 125 కోట్ల మంది ఆధార్ కార్డు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది యూఐడీఏఐ. ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపు కార్డుగా ఉపయోగించడం పెరిగిపోయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఆధ

**విశాఖ ఉత్సవ్‌**

విశాఖపట్నం నగరానికి వచ్చే పర్యటకులను రెండు రోజుల పాటు అలరించేందుకు... విశాఖ ఉత్సవ్‌ సిద్ధమైంది.  ఉత్సవ్‌లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేశారు.  తొలి రోజున దేవిశ్రీప్రసాద్‌, రెండో రోజు ఎస్​.ఎస్​. తమన్‌ సంగీత విభావరులు ఉండనున్నాయి.  ఈ ఉత్సవ్‌కు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.  స్థానిక కళాకారులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారితో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయించారు.  వేలాది మందితో బీచ్‌లో జరగబోయే కార్నివాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న తొలి ఉత్సవ్‌ కాబట్టి... ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దీన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి అవంతి శ్రీనివాసరావు చెబుతున్నారు.  విశాఖ ఉత్సవ్‌ నేపథ్యంలో నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.  కేజీహెచ్ , కలెక్టరేట్, బీచ్‌ రోడ్డు కూడలి ప్రాంతాల్లో విద్యుత్‌ వెలుగు జిలుగులు దర్శనమిచ్చాయి.

**భారీ అగ్నప్రమాదం**

  మహానగరం ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో శుక్రవారం అర్థరాత్రి దాటాక భారీ అగ్నప్రమాదం సంభవించింది.  సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.  వారు చేపట్టిన సహాయక చర్యల్లో ఒక మహిళ, ఒక పురుషుని మృతదేహాలను వెలికితీసినట్టు సమాచారం.  ఈ సందర్భంగా అగ్నిమాపకదళ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతయ్యారని, రెండు మృతదేహాలు వెలికితీశామని, మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

**అయోధ్యలో ఫిబ్రవరి 25వరకు నిషేధాజ్ఞలు...**

*అయోధ్యలో ఫిబ్రవరి 25వరకు నిషేధాజ్ఞలు...* రామ జన్మభూమి అయిన అయోధ్య నగరంలో ఫిబ్రవరి 25వ తేదీ వరకు నిషేధాజ్ఞలు విధిస్తూ అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. అయోధ్య నగరంలో ఫిబ్రవరి 25వతేదీ వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయోధ్యలో నలుగురి కంటే ఎక్కువ మంది సమావేశం అవరాదని అనూజ్ కుమార్ కోరారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెల్లువెత్తిన నిరసన ఉద్యమాలతో అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ ముందుజాగ్రత్త చర్యగా ఈ నిషేధాజ్ఞలు విధించారు. అయోధ్యలో నిషేధాజ్ఞలు విధించిన నేపథ్యంలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని అధికారులు కోరారు.

** *9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం..!!**

  *9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం..!! నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని 9 ఏళ్ల చిన్నారిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడిన ఉదంతం మండలంలోని కనుపర్తి అరుంధతీ యవాడ లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. 9 ఏళ్ల చిన్నారి కనపర్తి లోని నానమ్మ వద్ద ఉంటోంది. వీరి తల్లిదండ్రులు నెల్లూరులోని ఓ అపార్ట్మెంట్ లో స్వీపర్లుగా పనిచేస్తున్నారు.గురువారం సాయంత్రం చిన్నారి నానమ్మ నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు కాలనీ నుంచి గ్రామంలో కి వెళ్ళింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు గడియ పెట్టాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సుమారు గంట సేపు చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కి గురైన చిన్నారి ఏడుస్తూ గ్రామం నుంచి తిరిగి వచ్చిన నానమ్మకు తన పరిస్థితిని వివరించింది.ఈ క్రమంలో పరార్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడు కుమార్ ను గ్రామస్తులు పట్టుకొని శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. నిందితుడిపై నిర్భయ చట్టం నమోదు చేసినట్లు సీఐ జి గంగాధర్ రా

**ప్రధాని ఇంటికి మార్చ్​..***

ప్రధాని ఇంటికి మార్చ్​.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.  దిల్లీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.  పౌర చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  మసీదు వద్ద ఆందోళనల నేపథ్యంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఇటీవల హింసాత్మక ఘటనలు పెద్ద ఎత్తున చెలరేగిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.  భీమ్​ ఆర్మీ అధినేత చంద్రశేఖర్​ ఆజాద్​ను​ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరసనకారులు ప్రధాని ఇంటికి మార్చ్​ నిర్వహించారు.  మధ్యలోనే పోలీసులు అడ్డుకుని వారిని నిలిపివేశారు.  మార్చ్​లో భాగంగా చేతులను కట్టేసుకున్న నిరసనకారులు.. తాము హింసకు కారణం కాదంటూ నినదించారు.  అటు ఆందోళనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో కూడా భద్రతను పటిష్టం చేశారు.  ఘజియాబాద్, బులంద్ షెహర్, మీరట్, ముజఫర్ నగర్, షామ్లీ ప్రాంతాల్లో అంతర్జాల సేవలను మళ్లీ నిలిపేశారు.  ఈ రోజు సాయంత్రం వరకు అంతర్జాల సేవలను నిలిపేశామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. 

**ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి గవర్నర్‌ ఆమోదం**

ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి గవర్నర్‌ ఆమోదం ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌  ఆమోదం తెలిపారు. ఈమేరకు గవర్నర్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభలో ఆమోదం పొందిన ఏపీ ఆర్టీసీ చట్టం-2019 ప్రకారం ఉద్యోగుల విలీనానికి అంగీకారం తెలిపారు. విలీనానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది..

**రాష్ట్రానికి విశాఖే బెస్ట్‌ : టి. సుబ్బిరామిరెడ్డి**

  రాష్ట్రానికి విశాఖే బెస్ట్‌ : టి. సుబ్బిరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖపట్టణాన్ని ఎంచుకోవడంపై రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామిరెడ్డి స్పందించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన జీఎన్‌ రావు కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించిందన్న సమాచారం మీడియా ద్వారా తెలుసుకున్నా. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావడం ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. విభజనకు ముందు హైద్రాబాద్‌ తర్వాత పెద్ద సిటీ విశాఖే. నగరంలో మౌలిక సదుపాయాలతో పాటు విస్తారమైన భూములున్నాయి. పరిశ్రమలున్నాయి. పారిశ్రామికవేత్తలకు పరిచయమైన ప్రాంతం కావడంతో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అయితే మరింత మంది పారిశ్రామిక వేత్తలు వస్తారు. విస్తరణకు మంచి అవకాశముంది. ఆర్థిక సమస్యలున్న దృష్ట్యా ప్రస్తుతానికి రెడీమేడ్‌ సిటీ విశాఖయే మంచి ఆప్షన్‌. మరింత అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అద్భుతమైన రాజధాని అవుతుందని వ్యాఖ్యానించారు.

**రాజధాని రైతులపై బాబుకు ఉండే కృతజ్ఞత కన్నా వైసీపీ ఎమ్మెల్యేలు మరింత చూపాలి: సబ్బం హరి**

రాజధాని రైతులపై బాబుకు ఉండే కృతజ్ఞత కన్నా వైసీపీ ఎమ్మెల్యేలు మరింత చూపాలి: సబ్బం హరి రైతులపై కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు కృతజ్ఞత చూపాలి అలా చేస్తే ఆ రైతుల త్యాగానికి సార్థకత ఉంటుంది సీఎం జగన్ దయచేసి విజ్ఞతో ఆలోచించాలి   రాజధాని అమరావతి ప్రాంతానికి ఇంత చేసిన చంద్రబాబునాయుడి పార్టీకి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుండా జగన్ కు 'ఒక్క ఛాన్స్' ఇద్దామని నమ్మి ఓట్లు వేశారని, ఆ విషయాన్ని అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం గ్రహించాలిగా అని ప్రముఖ రాజకీయవేత్త సబ్బం హరి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై నమ్మకంతో భూములిచ్చిన వారు తమను నమ్మి ఓట్లు వేసి.. ఎమ్మెల్యేను చేశారన్నకృతజ్ఞత వైసీపీ వాళ్లకు ఉండాలని సూచించారు. రాజధాని కోసం భూములిచ్చిన రాజధాని ప్రాంత రైతులపై చంద్రబాబు కు ఉండే కృతజ్ఞత కన్నా మరింత కృతజ్ఞతతో కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటే ఆ రైతుల త్యాగానికి సార్థకత ఉంటుందని అభిప్రాయడపడ్డారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్ అని చెప్పడం అంతా 'బోగస్' అని, సీఎం జగన్ ఏది చెబితే అదే నిర్ణయం అని అన

**అమరావతి పై రోజుకో మాట మాట్లాడుతున్నారు - చంద్రబాబు**

*అమరావతి* *తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కామెంట్స్* అమరావతి పై రోజుకో మాట మాట్లాడుతున్నారు తలోమాట మాట్లాడి రాజధాని ని నాశనం చేస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు ను అంధకారం లోకి నెడుతున్నారు ప్రభుత్వ కుట్రలు గమనించాలని 5కోట్ల ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా అమరావతి ఎప్పటికీ ప్రజా రాజాధానే రాజధాని కి లక్ష కోట్లు కావాలి అంటున్న మంత్రులకు సంపద సృష్టిపై అవగాహన లేదా కనీస మౌలిక సూత్రాలు కూడా తెలియని విధంగా మాట్లాడుతున్నారు భూ సమీకరణ వినూత్న ఆలోచన... *సచివాలయం, కోర్టు ఇక్కడ నడుస్తుండగా పరిపాలన కు కొత్తగా  డబ్బులెందుకు..* *నిధులు లేవు అని చెప్పటం ఒక సాకు మాత్రమే* *ఇప్పుడు తరలింపు కోసం అదనంగా డబ్బు ఖర్చుపెట్టాలి కానీ ఉన్న వాటిని వినియోగించుకోటానికి  ఇబ్బందేంటి* కావాలనే పదే పదే డబ్బులు లేవని మాట్లాడుతున్నారు నిన్నటి వరకూ ఒకే సామాజిక వర్గం అని మాట్లాడారు కాదు 75శాతం వెనుకబడినవారున్నారని నిరూపిస్తే వెనక్కి తగ్గారు తర్వాత ముంపు ప్రాంతమని మాట్లాడారు అందుకనుగుణంగానే ముంచటానికి అనేక కుట్రలు పన్నారు  అదీ సాధ్యపడలేదు అందుకే ఇప్పుడు డబ్బులు లేవని కొత్త రాగం అందుకున్నారు..

**అధికార వికేంద్రీకరణ కాదు... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.- ఎంపీ సుజనాచౌదరి

హైదరాబాద్ అధికార వికేంద్రీకరణ కాదు... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని... ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యానించారు.  రాజధాని ప్రాంత రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సుజనా అందజేశారు.  రాజకీయ విద్వేషాలతోనే సీఎం జగన్ రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు.  ఈ 7 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదని మండిపడ్డారు. హైకోర్టు ఉంటే రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు

**రాష్ట్రంలో అర్హులైన 25 లక్షల మంది  పేదలకు ఉగాది నాటికి ఇళ్ళస్థలాలు**

అమరావతి రాష్ట్రంలో అర్హులైన 25 లక్షల మంది  పేదలకు ఉగాది నాటికి ఇళ్ళస్థలాలు • ఇప్పటివరకు కేంద్రం నుంచి పట్టణ పేదలకు మొత్తం 7,53,527 గృహాలు మంజూరు • సంతృప్తస్థాయిలో  అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు : రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అమరావతి, డిసెంబర్ 27 : వచ్చే ఉగాది నాటికి కులం, మతం, జాతి వివక్ష అన్నది లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.  కేంద్ర మంజూరు మరియు పర్యవేక్షణ కమిటీ (సీఎస్ఎంసీ) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 3,70,255 గృహాలు మంజూరు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు  వెల్లడించారు.  అందులో భాగంగా 1,28,941 గృహాలు పట్టణ ప్రాంతానికి సంబంధించినవి కాగా, 2,41,314 గృహాలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో మంజూరు అయ్యాయని మంత్రి పేర్కొన్నారు.  ఈ గృహాల ప్రాజెక్టు విలువ రూ.10,545.78 కోట్ల

**ATM మోసాలకు చెక్‌.. నగదు విత్‌డ్రాకు ఓటీపీ**

ATM మోసాలకు చెక్‌.. నగదు విత్‌డ్రాకు ఓటీపీ  ఏటీఎం మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నడుం బిగించింది. ఏటీఎంలో జనవరి 1 నుంచి రూ.10వేలు, అంతకు పైబడి నగదు ఉపసంహరణకు ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చేసే లావాదేవీలకు ఓటీపీ విధానం వర్తిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది.  ఎస్‌బీఐ వినియోగదారులు ఏటీఎంలో నిర్దేశించిన సమయంలో నగదు విత్‌ డ్రా చేయడానికి వెళ్లేటప్పుడు స్క్రీన్‌పై ఓటీపీ అడుగుతుంది. వారి రిజిస్టర్‌ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా లావాదేవీ జరపొచ్చు. ఓటీపీ ద్వారా కేవలం ఒక్క లావాదేవీ మాత్రమే చేయొచ్చని ఎస్‌బీఐ తెలిపింది. దీనివల్ల అనధికార లావాదేవీలను నివారించొచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ వినియోగదారులు ఇతర ఏటీఎంల్లో గానీ, ఇతర బ్యాంకు కార్డు వినియోగదారులు ఎస్‌బీఐ ఏటీఎంల్లో గానీ ఈ సదుపాయాన్ని పొందలేరు. ఈ మార్పు చేయడానికి ఏటీఎంల్లో పెద్ద మార్పులేమీ అవసరలేదని, జనవరి 1 నుంచి ఓటీపీ విధానం తీసుకొస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. ఈ విధానం ద్వారా ఏటీఎం కేంద్రాల్లో క్లోనింగ్‌ కార్డుల ద్వారా జరిగే మోసాలకు చె

**రాజధాని మహిళల ఆగ్రహం... సీఐ, ఎస్సైకి గాయాలు**

*రాజధాని మహిళల ఆగ్రహం... సీఐ, ఎస్సైకి గాయాలు* వెలగపూడిలో రైతుల ఆందోళన ఓ వాహనంపై ఆందోళనకారుల దాడిఅడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు ఏపీ రాజధాని అమరావతి అట్టుడుకుతోంది.  రాజధాని మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ గత కొన్నిరోజులుగా ఇక్కడి రైతులు,  వారి కుటుంబసభ్యులు నిరసనలు, ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.  తాజగా వెలగపూడిలో నిర్వహిస్తున్న రైతుల దీక్ష ఉద్రిక్తంగా మారింది. రైతులు ఆందోళన చేస్తుండగా,  అక్కడికి వచ్చిన ఓ వాహనాన్ని రాజధాని మహిళలు చుట్టుముట్టి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి.  మహిళలను,ఇతర ఆందోళనకారులను అడ్డుకునేందుకు యత్నించిన ఓ సీఐ, ఎస్సై గాయపడ్డారు.  తాము చేసిన త్యాగాలకు విలువ ఇవ్వకుండా రాజధానిని మార్చుతారా అంటూ మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

**ఏపీ కేబినెట్ నిర్ణయాలు..ఇవే..**

ఏపీ కేబినెట్ నిర్ణయాలు..ఇవే.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతనలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు.  * 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీ ఎన్నికలు. * పంచాయతీ ఎన్నికల నిర్వాహణ కోసం రిజర్వేషన్ల ఖరారు.  * కడప జిల్లా రాయచోటిలో వక్ఫ్ బోర్డుకు 4 ఎకరాలు కేటాయింపు.  * మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది.  * 412 కొత్త 108 వాహనాలు కొనుగోలు. మార్చి 31లోపు కొనుగోలు చేసేందుకు రూ. 71 కోట్ల 48 లక్షలను నిధులు కేటాయింపు.   * 104 వాహనాలు (656) కొనుగోలు. ఇందుకు రూ. 60 కోట్ల 51 లక్షలతో నిధుల కేటాయింపు.  * వ్యవసాయ ఉత్పత్తి కొనుగోలుకు కొత్త విధానం.    * రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలు గాను, 150 ఉప మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని నిర్ణయం. ఁ * పసుపు, మిర్చీ, ఉల్లి, చిరుధాన్య పంటలకు ప్రతి సంవత్సరం మద్దతు ధర ముందే ప్రకటిస్తాం. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

**రాజధాని నిరసనలు**

_*కృష్ణాజిల్లా :- కంచికచర్ల  రాజధాని నిరసనలు _కంచికచర్ల లో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిరసనలు. జాతీయ రహదారిపై బైఠయంచి తమ నిరసన తెలిపారు  _జగన్ మొండి వైఖరి నసించాలి, సీఎం డౌన్ డౌన్, మూడు ముక్కలాట మాకొద్దంటూ నినాదాలు ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేసిన తెలుగు దేశం పార్టీ నాయకులు..... ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు

**మీడియా ప్రతినిధులపై రైతుల దాడి..**

ఉద్దండ్రాయపాలెం దగ్గర మీడియా కవారేజి నిమిత్తం వెళ్లిన మీడియా ప్రతినిధులపై రైతుల దాడి.. కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష కవరేజి కవరేజి కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులు.. టీవి 9, మహా టివి, ఐ న్యూస్, ఎన్ టివి ప్రతినిధులపై తీవ్రస్థాయిలో దాడి ఇంటర్వ్యూ చేసే సమయంలో ముందుగా టీవీ9 రిపోర్టర్ దీప్తిపై దాడికి ప్రయత్నం. మహిళా జర్నలిస్ట్ పై దాడి చేయటం తగదని వరించే ప్రయత్నం చేసిన ఎన్ టివి రిపోర్టర్ హరీష్ వెళ్లగా అతనిపై కూడా దాడికి తెగబడిన ఆందోళనకారులు..  అక్కడితో ఆగకుండా వీరిపై దాడిని అడ్డుకోబోయిన మహా టివి రిపోర్టర్ వసంత్ పై, ఐ న్యూస్ రిపోర్టర్ రామారావుపై దాడికి తెగబడిన రైతులు,, తీవ్ర స్థాయిలో గాయాల పాలైన విలేకరులు.. రైతుల దాడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చే క్రమంలో వెలగపూడి దగ్గర మరోసారి దాడికి తెగబడిన రైతులు,, ఆందోళనకారులు.. టీవీ 9 కారు అద్దాలు పగలగొట్టి మీడియా ప్రతినిధులు బయటికి రాకుండా దాడి చేసిన వైనం దాడితో కారులో ఉన్న దీప్తికి,, మహటివి వసంత్ కి మరిన్ని గాయాలు.. ధ్వంసమైన కారు.. కారులో ఉన్న టీవి9 కెమెరా మెన్ సురేష్ కి, దీప్తికి శరీరంలో దిగిన కారు అద్దాలు.. మీడియా ప్రతినిధులపై పిడిగుద్దులు గుద్ది,,

**300 కేజీల గంజాయి స్వాధీనం**

ఖమ్మం :ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద 300 కేజీల గంజాయి స్వాధీనం, భద్రాచలం వైపు నుంచి హహైదరాబాద్ కు కంటైనర్లో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న రూరల్ పోలీసులు

**400కిలోల గంజాయి.రెండు కార్లు పలువురు యువకులను...**

హైదరాబాద్ పాతబస్తీ లో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. 400కిలోల గంజాయి.రెండు కార్లు పలువురు యువకులను అరెస్ట్ చేసిన ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి హైదరాబాద్ కి తరలిస్తున్న 400కిలోల గంజాయి

**పురుగుల మందు, పెట్రోల్ బాటిల్ సీసాలతో బాధిత రైతులు**

*జనగామ జిల్లా:-* *నర్మెట్ట ఎమ్మర్వో కార్యాలయంలో ముందు పురుగుల మందు, పెట్రోల్ బాటిల్ సీసాలతో బాధిత రైతులు ప్రమీల, కుటుంబ సభ్యులు ఆత్మహత్య యత్నం...* *నర్మెట్ట మండలం గండిరామరం గ్రామంలో సర్వే నెంబర్లు 186/b4 లో 2- 28 గుంటలు పట్టా చెయ్యట్లేదంటూ, అధికారపార్టీ నాయకులు బెదిరిస్తున్నారంటూ,పట్టా అపుతున్నారని ఆవేదన...* *పోలీసులు అదుపులో బాధిత రైతులు...*

**బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కామెంట్స్**

అమరావతి ః *బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కామెంట్స్* ఏపి రాజధాని ని అమరావతి లో ఉంచాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రైతులతో పాటు ప్రభుత్వ భూములకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చింది. గత ప్రభుత్వం రాజధాని పేరు తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. గత ప్రభుత్వ సాకు తో  జగన్ ప్రభుత్వం ఏకంగా రాజధానిని అమ్మేస్తుంది. ఈ రాష్టాన్ని జగన్ నిట్టనిలువునా ముంచుతాడని ప్రజలు ఊహించలేదు. గత ప్రభుత్వం కొంత మంది తో గాలి మాటలు మాట్లాడుస్తే.... వైసిపి  అంతకంటే బరితెగించింది. ఏపి రాజధాని అమరావతి గానే కేంద్రం గుర్తించి ప్రపంచ పటంలో పెట్టింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కేంద్రం నిధులు ఇచ్చింది. రైతులు భూములు ఇచ్చి త్యాగాలు చేశారని ట్యాక్స్  మినహాయింపు కూడా కేంద్రం ఇచ్చింది. రైతులు ఇచ్చిన భూములు అమ్మడానికే  జగన్ సిద్దమయ్యాడు. రాజధాని వైసిపి జాగీర్  కాదు. జి.ఎన్.రావు కమిటీ నివేదిక రాక ముందే సీఎం  రాజదాని పై ప్రకటన చేస్తాడు. క్యాబినెట్ నిర్ణయం రాకముందే వైజాగ్ లో వైసిపి  సంబరాలు జరుపుతుంది. రాజధాని తరలింపు ను ఎట్టిపరిస్దితుల్లో అంగీకరించం. క్యాబినెట్ నిర్ణయం మేరకు బిజేపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్

**ఐదుగురు మావోయిస్టులు  లొంగుబాటు**

ఛత్తీస్‌గఢ్‌:  దంతెవాడ జిల్లా మలంగిర్‌ ఏరియాకు చెందిన ఐదుగురు మావోయిస్టులు  లొంగిపోయినట్ట్లు దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ తెలిపారు. లొంగిపోయిన వాళ్లలో మడకం దేవా, మడకం మాసా, సోనా హేమ్లా, సుక్దా మాండవి, ధృవ్‌ సోరి ఉన్నట్టు ఆయన వెల్లడించారు. వీరిలో మడకం దేవాపై రూ.లక్ష రివార్డు ఉన్నదని, లొంగిపోయిన ప్రతిఒక్కరికీ రూ.10 వేలు ప్రోత్సాహకాలను అందజేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు....

**రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం**

*రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం* *కడప:* రాజంపేట మండలం తప్ప వారి పల్లి సమీపంలో కడప చెన్నై హైవే రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.  బీఎండబ్ల్యూ కారు.. బొలెరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక చిన్నారి మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.  మృతి చెందిన చిన్నారిని, క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు.

**ఓ వ్యక్తి దారుణ హత్య* *

*ఓ వ్యక్తి దారుణ హత్య*  కడప జిల్లా..  చక్రాయపేట..  సురభి గ్రామం నాగులుగుట్ట పల్లె లో విషాదం చోటు చేసుకుంది.. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.. హత్యకాబడిన వ్యక్తి  కుప్పం గ్రామానికి చెందిన ఆంజినేయలు( 55).. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు..  హత్యకు గల కారణాలపై చక్రాయపేట పోలీసులు ఆరా తీస్తున్నారు.

**10వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు**

*అమరావతి* *10వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు* *అన్నదాతల ఆగ్రహావేశాలతో అట్టుదుకుతున్న అమరావతి* *మంత్రివర్గ సమావేశం దృష్ట్యా ఉగ్రరూపం దాల్చిన ఉద్యమం* *తుళ్లూరు మండలం లోని అన్ని గ్రామాల్లో 144సెక్షన్ విధించిన పోలీసులు* *ప్రతి గ్రామ కూడలిలో ముళ్ల కంచెలు సిద్ధం చేసి ఉంచిన పోలీసులు* *సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున దిగిన పోలీసు బలగాలు*  *మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద భారీ బందోబస్తు*  *తుపాకులు, లాఠీ చార్జ్‌ వినియోగించే పరికరాలతో బస్సుల్లో పెద్ద ఎత్తున దిగిన బలగాలు*  *సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌ వాహనాలతో పాటు అగ్నిమాపక దళాల మోహరింపు*  *అప్రకటిత యుద్ధ వాతావరణం తలపిస్తున్న  రాజధాని గ్రామాలు* *గ్రామాల్లో పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించడాన్ని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాo. -రైతులు*  *సచివాలయం వెళ్లే ప్రధాన రహదారి కావటం తో మందడం వద్ద ఉద్రిక్త వాతావరణం* *10వ రోజూ రహదారిపై మహాధర్నా కొనసాగించాలని రైతుల నిర్ణయం* *వెలగపూడి, కృష్ణాయపాలెం లో కొనసాగనున్న 10వ రోజు రిలే నిరాహారదీక్ష లు* *ఉద్దండరాయిని పాలెం శంకుస్థాపన ప్రదేశంలో ఉదయం నుంచి నిరసన తెలపన

**నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్ష చేయనున్న కన్నా..**

గుంటూరు  గుంటూరులోని తన నివాసం  నుంచి ఉద్దండరాయపాలెం బయలుదేరి వెళ్లిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.. ఉద్దండరాయపాలెంలో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్ష చేయనున్న కన్నా..    కన్నా తో పాటు భారీగా తరలివెళ్లిన బిజెపి నేతలు...

**_రాజధానిలోని 29 గ్రామలను రైతుల ధర్నా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు_**

*అమరావతి* _రాజధానిలోని 29 గ్రామలను రైతుల ధర్నా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు_ *సీఎం, మంత్రులు, వెళ్లే మార్గంలో భారీగా పోలీసుల మోహరింపు 700 మంది పోలీసులతో బందోబస్తు* _మందడంలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు... పాలు, మందులు దుకాణాలకు మాత్రమే అనుమతి_  *సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌, అగ్నిమాపక దళాలు మోహరింపు* *చర్యలు తప్పవు తుళ్లూరు డీఎస్పీ* *మంత్రివర్గ సమావేశం దృష్ట్యా మందడం రైతుల ధర్నాకు అనుమతి లేదు* _రైతులు ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ_ *తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమలు* _శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం_ *ప్రతి గ్రామంలోనూ పోలీస్ పికెటింగ్ పెట్టాం*

**ఎడ్లబండి ను ఢీ కొన్న లారీ* *ఘటన స్థలంలోనే ఇద్దరు రైతులు మృతి**

*ఎడ్లబండి ను ఢీ కొన్న లారీ* *ఘటన స్థలంలోనే ఇద్దరు రైతులు మృతి* *శ్రీకాకుళం* ;- జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది,, 👉 *వీరఘట్టం మండలం* వెంకంపేట గ్రామం మరియగిరి కొండ వద్ద కలప లోడ్‌తో వెళ్తున్న ఎడ్లబండిని లారీ ఢీ కొట్టింది,, 👉ఈ ప్రమాదంలో నాగభూషణం, పట్టాభి అనే ఇద్దరు రైతులు మృతి చెందారు,, 👉సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు,, 👉కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

**ఉల్లి లారీ బోల్తా..  క్షణాల్లో ఉల్లిపాయల బస్తాలు మాయం**

ఉల్లి లారీ బోల్తా..  క్షణాల్లో ఉల్లిపాయల బస్తాలు మాయం ఉల్లిధరలు ఆకాశాన్నంటాయి. ఒక్క ఉల్లి దొరికినా కళ్ళకు అద్దుకుని మరీ తీసుకుంటున్న రోజులివి. అలాంటి పరిస్థితుల్లో ఉల్లిపాయలు తీసుకెళ్లేలారి బోల్తా పడితే పరిస్థితి ఎలా వుంటుంది. ఈ ఘటన జార్ఖండ్‌లో జరిగింది. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 35 క్వింటాళ్ళ లోడుతో బొకారో- రామ్‌గఢ్ రోడ్డుపై ఉల్లి బస్తాలతో లోడుతో వస్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.బోకారో జిల్లాలోని కాశ్మారాలోని నేషనల్ హైవే-23 సమీపంలో ఉల్లి వ్యాను బోల్తా పడడంతో స్థానికులకు పంట పండింది. విషయం తెలుసుకున్న స్థానికులు వ్యాన్ బోల్తాపడ్డ చోటికి పరుపరుగున వెళ్లిపోయారు. వ్యాన్ లో ఉన్న 3500 కిలోల ఉల్లిపాయలను ఎత్తుకెళ్ళిపోయారు.క్రిస్మస్ పండుగ వేళ శాంతాక్లాజ్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉల్లిపాయల్ని పట్టుకెళ్ళిపోయారు.హైవే పక్కనే వున్న కమలాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారంతా సంచులు పట్టుకుని అక్కడికి చేరుకున్నారు. వ్యాన్లో వున్నవారి యోగక్షేమాలను పట్టించుకోకుండా ఉల్లిపాయల్ని సంచిల్లో నింపుకుని వెళ్లిపోయారు. ఈ ఉల్లిపాయల ఖరీదు 3లక్షల వరకూ వుంటుంది. అరగంటలో ఉల్లిపాయలు మాయం కావడంతో వ్యాన్‌ యజమ

** రూ.10-20కే కిలో ఉల్లి ...**

రూ.10-20కే కిలో ఉల్లి విక్రయం..  ఇద్దరు యువకుల అరెస్ట్ !గ్వాలియర్: ఉల్లి ధరల పెంపుపై ఆగ్రహించిన ఇద్దరు యువకులు తీసుకున్న ఓ నిర్ణయం వారిని కటకటాల పాలయ్యేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పెరుగుతున్న ఉల్లి ధరల కారణంగా సామాన్యులకు ఉల్లి అందుబాటులో లేకుండా పోవడంపై ఆగ్రహం చెందిన అజయ్ జాతవ్, జీతు వాల్మికి.. సమీపంలోని కూరగాయల మార్కెట్‌లోని ఓ గోడౌన్‌ నుంచి ఆరు క్వింటాళ్ల ఉల్లిగడ్డ, మరో క్వింటాల్ ఎల్లిగడ్డ దొంగిలించారు. దొంగిలించిన ఉల్లి గడ్డ, ఎల్లి గడ్డను మరో చోట బహిరంగ మార్కెట్‌లో రూ.10-20లకే విక్రయించారు. తద్వారా సామాన్యులకు కారుచౌకగా ఉల్లి అందించేలా చేస్తున్నామనే భావించారు కానీ తాము చేస్తోంది నేరం అని తెలుసుకోలేకపోయారు.ఇదిలాఉండగా.. మార్కెట్‌లో ఉల్లి గడ్డ, ఎల్లి గడ్డ చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఉండగానే ఇద్దరు యువకులు ఇలా తక్కువ ధరకే ఉల్లిని విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో వారిని అరెస్ట్ చేశారు. రూ.100 కాస్త అటు ఇటుగా అమ్ముడవుతున్న ఉల్లిగడ్డను రూ.10-20కే ఎలా వ

**ఉల్లికి.. వెల్లుల్లి తోడైంది.. ఇక జనం పరిస్థితి అంతే..!**

ఉల్లికి.. వెల్లుల్లి తోడైంది.. ఇక జనం పరిస్థితి అంతే..! మొన్నటి వరకూ ఉల్లి హడలెత్తిస్తే.. ఇప్పుడు వెల్లుల్లి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. మూడునెలలతో పోలిస్తే వెల్లుల్లి గడ్డ ధర ఏకంగా 250 రూపాయలకు చేరింది. ఉల్లి, వెల్లుల్లి ధరలు పెరిగిపోవడంతో వంట ఎలా చేసుకోవాలో తెలియక పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంతలా ధరలు పెరగడం ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు. నిన్నటి వరకూ ఉల్లి ధర పేలిపోయింది. కోయడం కాదు కదా ముట్టుకోవాలంటే జనం భయపడే పరిస్థితి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో జనం అల్లాడిపోయారు. ప్రభుత్వ ఈజిప్టు నుంచి ఉల్లిదిగుమతులు చేసుకుని.. వాటిని రాయితీపై అందించే వరకూ ఉల్లి రెండువందల రూపాయలే పలికింది. ఇప్పుడిప్పుడే ఉల్లి ధర దిగివస్తోంది. ఇలాంటి సమయంలో వెల్లుల్లి .. ఒక్కసారిగా విశ్వరూపాన్ని చూపిస్తోంది. ధర కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెల్లుల్లి రెండు వందల పైచిలుకు పలుకుతోంది. ఇది కూడా హోల్ సేల్ మార్కెట్లో ఈ ధరకు లభిస్తోంది. ఇక రిటైల్ మార్కెట్‌లో నైతే... ఏకంగా 250 పైనే ధర ఉంది. ఉల్లి తరహాలో ప్రభుత్వం వెల్లుల్లి గడ్డలను కొనుగోల

**పెళ్లయిన వ్యక్తితో ప్రేమ.. పెళ్లి చేయాలని పీఎస్‌లో యువతి హల్‌చల్..**

పెళ్లయిన వ్యక్తితో ప్రేమ.. పెళ్లి చేయాలని పీఎస్‌లో యువతి హల్‌చల్.. హైదరాబాద్‌లోని బాబుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. ప్రియుడితో తన పెళ్లి జరిపించాలని పట్టుబట్టింది. పోలీస్ స్టేషన్‌లో వస్తువులను కిందపడేసింది. తలను గోడకు బాదుకుంటూ.. బయటకు పరుగులు తీస్తూ పోలీసులను తిప్పలు పెట్టింది. చివరకు సదరు ప్రియుడిని పోలీస్ స్టేషన్‌కు రప్పిస్తామని చెప్పడంతో శాంతించింది. వివరాల్లోకి వెళ్తే.. మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీకి చెందిన ఓ యువతి(22)కి కొన్నాళ్ల క్రితం మాదాపూర్‌లోని ఓ టెక్ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ మేనేజర్‌తో పరిచయమైంది. క్రమంగా అది ప్రేమగా మారింది. దీంతో ఆ యువతి పెళ్లి చేసుకుందామని చెప్పింది. అయితే అతను వివాహితుడు కావడంతో ఆ యువతితో మాట్లాడటం మానేశాడు.దీంతో బుధవారం నేరుగా బాచుపల్లిలోని అతనికి నివాసానికి వెళ్లింది. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. మీ అబ్బాయితో పెళ్లి జరిపించాలని ఇంట్లో గొడవ చేసింది. అసలేం జరుగుతుందో తెలియక ఆ వృద్ద దంపతులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఆ యువతితో పాటు అతని తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతనితో తనకు పెళ

**గుట్కా వ్యాపారం గుట్టు రట్టు**

గుట్కా వ్యాపారం గుట్టు రట్టు ఎస్‌బీ పోలీసుల దాడుల్లో రూ.లక్ష విలువైన గుట్కా స్వాధీనం నలుగురు వ్యాపారుల అరెస్ట్‌ ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో రవాణా  ఖాజీపేట కేంద్రంగా గత కొంతకాలంగా సాగుతున్న గుట్కా వ్యాపారం గుట్టు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసుల దాడితో రట్టయింది. సుమారు రూ.లక్ష విలువైన గుట్కాను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యాపారులను అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఖాజీపేట కేంద్రంగా గత కొంతకాలంగా గుట్కా, ఖైనీ, మావా వంటి నిషేధిత గుట్కాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఈ విషయం స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు సమాచారం రావడంతో మైదుకూరు ఎస్‌బీ ఏఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, ఎస్‌బీ కానిస్టేబుళ్లు సంతోష్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలు బుధవారం చిల్లర కొట్టు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు లక్ష రూపాయల విలువగల గుట్కా, ఖైనీ, మావా వంటి పాకెట్ల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల్లో అమ్మకాలు సాగిస్తున్న మేడా మోహన్‌చంద్ర, సుంకు ప్రహ్లాద, నల్లగుండు వెంకటసుబ్బయ్య, కోనేటి నాగేంద్రలను అదుపులోకి తీసుకుని ఖాజీపేట పోలీసులకు అప్పగించారు. ఖాజీపేట నుంచే సరఫరా ఖాజీపేటలోని పలువురు వ్యాపారులు హైదరాబాద్, బెంగళూరు ను

**బెంగాల్‌ మంత్రికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్‌**

బెంగాల్‌ మంత్రికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్‌ పశ్చిమ బెంగాల్‌ గ్రంథాలయ శాఖ మంత్రి, జమాత్‌ ఉలేమా హింద్‌ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిక్‌ అల్లాహ్‌ చౌదరికి బంగ్లాదేశ్‌ వీసా నిరాకరించింది. వీసా నిరాకరణకు గల కారణం వెల్లడికాలేదు. ఈ విషయంపై సిద్ధిక్‌ చౌదరి మాట్లాడుతూ.. 'డిసెంబర్‌ 26 నుంచి 31ల మధ్య ఐదు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటనకు ఈ నెల 12వ తారీఖున వీసా కోసం దరఖాస్తు చేశాను. అక్కడ ఓ సదస్సులో పాల్గొనమని నాకు ఆహ్వానం వచ్చింది. నాకూ కొన్ని వ్యక్తిగత పనులున్నాయి. వీసా ఇస్తున్నట్టుగానీ, తిర​స్కరిస్తున్నట్టు గానీ నాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. వీసా కోసం అన్ని పత్రాలను సమర్పించాను. అవసరమైన అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద తీసుకున్నాను.అయినా వీసా రాకపోవడంతో ఇప్పటికే బుక్‌చేసుకున్న టికెట్‌ను క్యాన్సిల్‌ చేసేశా'నని వెల్లడించారు. ఈ విషయంపై బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ను వివరణ కోరగా, ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ కార్యాలయ సిబ్బంది కూడా అందుబాటులోకి లేకుండా పోయారు. ఈ విషయంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. వీసా రాకపోవడంపై మేము నిజంగా ఆశ్చర్యపోతున్నాం. ఒక మంత్

**మానస కేసులో చార్జిషీట్‌ దాఖలు**

మానస కేసులో చార్జిషీట్‌ దాఖలు అత్యాచారం, హత్యకు గురైన వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ దీన్‌దయాల్‌నగర్‌కు చెందిన గాదం మానస కేసులో సుబేదారి పోలీసులు గురువారం కోర్టులో చార్జి షీట్‌ దాఖలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మం డలం నెమలిగొండకు చెందిన పులి సాయిగౌడ్‌.. నవంబర్‌ 27న మానసను ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం, ఆపై హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో పోలీసులు 24 గంటల్లో నిందితున్ని అరెస్టు చేశారు. అనంతరం వారం పాటు పోలీసు కస్టడీకి తీసుకుని శాస్త్రీయంగా వివరాలను సేకరించారు. మృతు రాలి దుస్తులపై ఉన్న రక్తం, వీర్యం మరకలతో పాటు, పోస్టుమార్టం నివేదిక, డీఎన్‌ఏ రిపోర్ట్, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలు అన్నీ నిందితుడు సాయిగౌడ్‌ ఆధారాలతో సరిపోయినట్లు పోలీసులు తెలిపారు.కాగా, మానసపై అత్యాచారం, హత్యకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని సేకరించామని సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.అజయ్‌ తెలిపారు. నేరం జరిగిన 30 రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేశామని, నిందితుడికి శిక్ష పడేందుకు అవసరమైన ప్రతి విషయాన్ని సేకరించామని పేర్కొన్నారు.

**ఎట్టకేలకు వంద కోట్లు దాటిందిస**

ఎట్టకేలకు వంద కోట్లు దాటిందిస ల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం 'దబాంగ్‌ 3' ఎట్టకేలకు వంద కోట్ల క్లబ్‌లో చేరింది. మొదటి 6 రోజుల్లో ఈ సినిమా రూ.107 కోట్ల నికర వసూళ్లు సాధించినట్టు 'బాక్సాఫీస్‌ ఇండియా' వెల్లడించింది. బుధవారం రూ.15.50 కోట్లు వసూలు చేసినట్టు తెలిపింది. అంతకుముందు రోజు(మంగళవారం) కలెక్షన్లతో పోల్చుకుంటే ఇది 65 శాతం అధికం. క్రిస్మస్‌ పండుగ నేపథ్యంలో ఆరో రోజు కలెక్షన్లు మెరుగుపడ్డాయి. క్రిస్మస్‌ సెలవులు అయిపోవడంతో గురువారం నుంచి వసూళ్లు తగ్గుతాయిని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం విడుదల కానున్న అక్షయ్‌ కుమార్‌ తాజా సినిమా 'గుడ్‌న్యూస్‌' సల్మాన్‌ఖాన్‌ చిత్రానికి గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన 'దబాంగ్‌ 3'లో మహేశ్‌ మంజ్రేకర్‌, అర్బాజ్‌ఖాన్‌, కిచ్చా సుదీప్‌, సొనాక్షి సిన్హా ముఖ్యపాత్రల్లో నటించారు.

**వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌కు చేదు అనుభవం**

*వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌కు చేదు అనుభవం* *కర్నూలు జిల్లా:* కోడుమూరు నియోజకవర్గం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.  మరోసారి ఎమ్మెల్యే సుధాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది.  వెంకటగిరి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలే ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు.  పార్టీలో మొదటినుంచి పనిచేసినవారికి కాకుండా కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే ఎంత సర్ది చెప్పినా కార్యకర్తలు పట్టించుకోలేదు.  పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

**సంక్రాంతి స్పెషల్‌ @ 4940రెండు తెలుగు రాష్ట్రాల్లో తిప్పాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం**

సంక్రాంతి స్పెషల్‌ @ 4940రెండు తెలుగు రాష్ట్రాల్లో తిప్పాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం జనవరి 10 నుంచి 13 మధ్య అందుబాటులోకి దూరప్రాంత సర్వీసులకు 50% అదనపు చార్జీ సంక్రాంతి సందర్భంగా నగరం నుంచి వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 4,940 బస్సులను నడపాలని నిర్ణయించింది. జనవరి 10 నుంచి 13 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ పరిధిలో 3,414 బస్సులు, ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని ప్రాంతాలకు 1,526 బస్సులు ప్రత్యేక సర్వీసులుగా తిరగనున్నాయి. రోజువారి నడిచే రెగ్యులర్‌ సర్వీసులకు ఇవి అదనం. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, సీబీఎస్, జూబ్లీబస్‌ స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, టెలీఫోన్‌ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు, ఎల్‌బీనగర్‌లతోపాటు నగరంలోని కొన్ని ముఖ్యమైన కాలనీల నుంచి ఈ సర్వీసులు బయల్దేరనున్నాయి.తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు, ముఖ్యమైన పట్టణాలు, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూల

**యూపీ పోలీసులే విధ్వంసకారులు సినీ నటి స్వరాభాస్కర్‌**

యూపీ పోలీసులే విధ్వంసకారులు సినీ నటి స్వరాభాస్కర్‌ పౌరసత్వ చట్ట సవరణ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ వ్యతిరేక ఉద్యమంలో ఉత్తరప్రదేశ్‌ పోలీసుల తీరుపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా విమర్శలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పథకం ప్రకారమే ఆందోళనకారులను ప్రజానీకం దృష్టిలో ఒంటరి చేసేందుకు ఆ విధ్వంసానికి పాల్పడి నాటకాలు ఆడుతున్నారని వర్తమాన సినీ నటి స్వరాభాస్కర్‌ వ్యాఖ్యానించారు. చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారులపై వ్యతిరేకత వచ్చేందుకు పోలీసులే ప్రజల ఆస్తులను పెద్దఎత్తున ధ్వంసం చేసినట్టు ఆమె విమర్శించారు. గురువారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆందోళకారులు సంయమనం పాటిస్తూ పోరాటం చేస్తున్నారని వివరించారు.అయినా, ప్రభుత్వ వారిపై తప్పడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రతి పౌరుడి హక్కు అని ఆమె గుర్తు చేశారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మోడీ సర్కార్‌ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆందోళనకారులు చెబుతున్నట్టు రాజ్యాంగ ఉల్లంఘన నిజం కాదా? అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటువంటి కీలక సమయాల్లోనే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాల

**తొలిసారిగా రష్మీతో తన రిలేషన్ ని బయటపెట్టిన సుధీర్....!!**

తొలిసారిగా రష్మీతో తన రిలేషన్ ని బయటపెట్టిన సుధీర్....!! బుల్లితెర షో జబర్దస్త్ గురించి తెలియని తెలుగు వారు ఉండరు అనే చెప్పాలి. ఇక ఆ షో ప్రసారం అవుతున్న ఈటివి ఛానల్ వారికి అత్యధిక స్థాయిలో రేటింగ్స్ అందిస్తుండడంతో పాటు, యూట్యూబ్ లో కూడా భారీగా వ్యూస్ ని కురిపిస్తోంది. ఇకపోతే ఆ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. మొదట మెజిషియన్ గా పనిచేసిన సుధీర్, తన స్నేహితుడి సహాయంతో హైదరాబాద్ చేరుకొని, ఆ తరువాత రామోజీ ఫిలిం సిటీలో ఉద్యోగం, దాని అనంతరం జబర్దస్త్ షో లో చిన్న ఛాన్స్ సంపాదించారు. అయితే మెల్లగా తన టాలెంట్ తో ఆ షోలో ఎదిగిన సుధీర్, ఇటీవల తన పేరుతో ఏకంగా సుడిగాలి సుధేర్ పేరుతో ఒక టీమ్ ని కూడా ఏర్పరుచుకుని ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్, క్రేజ్ దక్కించుకున్నాడు. యాంకర్ రష్మీ గౌతమ్ కూడా అదే షో ద్వారా యాంకర్ గా మంచి పేరు దక్కించుకున్నారు. ఇకపోతే ఒకానొక సందర్భంలో ఆ షోలోని ఒక స్కిట్ లో భాగంగా రష్మీకి, సుధీర్ కు పెళ్లి జరుగుతుంది. ఇక అక్కడి నుండి వారిద్దరి మధ్య ఏదో ఉందని, తప్పకుండా వారు అతి త్వరలో పెళ్లి చేసుకుంటారు అంటూ ఇప్పటివరకు కూడా పలు పుకార్లు ప్రచారం అవుతూనే

ఖాకీ కామం: ***

ఖాకీ కామం:  కంచే చేను మేసేందుకు ప్రయత్నిస్తే అనే సామెతను వింటుంటాం కదా? కాపాడాల్సిన ఖాకీనే కాటు వెయ్యడానికి ప్రయత్నిస్తే.. ఇటువంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఓ పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. స్టేషన్‌లో పనిచేసే మహిళ కానిస్టేబుల్‌ను అదే స్టేషన్‌కు చెందిన ఓ ఎస్ఐ లైంగిక వేధింపులకు గురిచేశాడు. తన కోరిక తీర్చాలంటూ, అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ నిత్యం వేధిస్తున్నాడు. తరుచూ ఆమెకు వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. న్యూడ్ చాట్ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. తాను అలాంటి దాన్ని కాదని, తన జోలికి రావద్దంటూ సదురు బాధితురాలు మొర పెట్టుకున్నా ఎస్ఐ వినిపించుకోలేదు. ఈ క్రమంలో బాధితురాలు అదే సబ్‌ డివిజన్‌కు చెందిన సీఐతో తన బాధ పంచుకుంది. తనను ఎస్ఐ ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ ఆ కీచక ఎస్ఐని పిలిపించి చీవాట్లు పెట్టాడు. అయినా ఆ కామాంధుడిలో మార్పు రాలేదు. బాధను భరించలేక బాధితురాలు జిల్లా ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన ఎస్‌పీ ఆ కీచక ఎస్‌ఐ వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించుకుని

**స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000?**

 స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000? కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించేందుకు సిద్ధమౌతోంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ద్వారా లబ్దిదారులకు రెట్టింపు పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. నెలవారి పెన్షన్ మొత్తాన్ని రూ.10,000కు పెంచాలని యోచిస్తోంది. ఇదేజరిగితే లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ద్వారా అందించే పెన్షన్ మొత్తం పెంపు ప్రతిపాదనలపై చర్చిస్తోంది.. అసంఘటిత రంగంలోని వారికి ప్రయోజనం చేకూరేలా తగిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ప్రముఖ జాతీయ మీడియా ఎకనమిక్ టైమ్స్‌ ఈ విషయాలు వెల్లడించింది. మోదీ సర్కార్ కేవలం పెన్షన్ పెంపునకు మాత్రమే పరిమితం కాకుండా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ వయసు పరిమితిని కూడా పెంచాలని యోచిస్తోంది.ప్రస్తుతం ఈ పెన్షన్ పథకంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న వారు చేరొచ్చు. వయసు పరిమితిని 50 ఏళ్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. 'అటల్ పెన్షన్ స్కీమ్ వయసు పరిమితిని, పెన్షన్ డబ్బులను పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశాం. అలాగే కేంద్రానికి దీనికి సంబంధించిన అన్ని వివరాలు అందించాం' అని పీఎఫ్‌ఆర్‌డీఏ మెం

**హాజీపూర్ హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి కేస్ జనవరి 3 కు వాయిదా  **

నల్లగొండ జిల్లా......  హాజీపూర్ హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి కేస్ ను జనవరి 3 కు వాయిదా  వేసిన  నల్లగొండ కోర్ట్............. 313  CRPC  సెక్షన్ కింద    శ్రీనివాస్ రెడ్డిని ఎగ్జామినేషన్ చేసిన కోర్ట్...   మూడు హత్యలల్లో  101 సాక్ష్యులు చెప్పిన   స్టేట్ మెంట్ లలో సగం స్టేట్ మెంట్ లను     శ్రీనివాస్ రెడ్డికి వినిపించి    శ్రీనివాస్ రెడ్డి తరపు వాదనల్ని విన్న కోర్ట్..... ... మిగిలిన  మరి కొన్ని స్టేట్ మెంట్ లను జనవరి  3 న ఎగ్జామినేషన్ చేయనున్న కోర్ట్......

***సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున దిగిన పోలీసు బలగాలు* *

*అమరావతి* *సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున దిగిన పోలీసు బలగాలు*  *మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద లాఠీలు పట్టుకుని కవాతు చేసిన పోలీసులు*   *తుపాకులు, లాఠీ చార్జ్‌ వినియోగించే పరికరాలతో బస్సుల్లో పెద్ద ఎత్తున దిగిన బలగాలు*  *సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌ వాహనాలతో పాటు అగ్నిమాపక దళాల మోహరింపు*  *అప్రకటిత యుద్ధ వాతావరణం తలపిస్తున్న  రాజధాని గ్రామాలు* *గ్రామాల్లో పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించడాన్ని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాo. -రైతులు*  *శాంతియుతంగా నిరసన చేసుకునే తమను రెచ్చగొట్టే విధంగా పోలీసు చర్యలు ఉన్నాయి.-రైతులు*  *మంత్రివర్గ సమావేశానికి సహకరిo చేందుకు మా ధర్నా వేదికను ఉద్ధండరాయుని పాలెనికి మార్చుకోవాలని యోచించాం.-రైతు*  *పోలీసు చర్యలతో తిరిగి మందడంలోనే కొనసాగిoచే ఆలోచన చేస్తున్నాం.-రైతులు*  *ఎన్ని కేసులు పెట్టినా, లాఠీలు ప్రయోగించినా రాజధానిగా అమరావతి కొనసాగించే అంశంపై వెనక్కి తగ్గేది లేదు. -రైతులు*

**ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతులు లేవు : ఎస్పీ రంగనాధ్**

*ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతులు లేవు : ఎస్పీ రంగనాధ్* - - ఎన్నికల కోడ్ అమలులో ఉన్న క్రమంలో ఎలాంటి ర్యాలీలు చేపట్టకూడదు - - అంగీకరించిన ముస్లిం మత పెద్దలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల జె.ఏ.సి. - - నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు - - ర్యాలీలో పేరుతో యువతను ప్రేరేపించే విధంగా రాజకీయ లబ్దికి ప్రయత్నించవద్దు - - బహిరంగ సభ దృష్ట్యా పట్టణమంతా 144 సెక్షన్ అమలు నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని, ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ చెప్పారు. గురువారం ఆయన ఛాంబర్ పోలీస్ అధికారులు, ముస్లిం మత పెద్దలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ముస్లిం సంస్థలు, జె.ఏ.సి. ఎన్.ఆర్.సి. సిఏఏ కు నిరసనగా  నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ నేపథ్యంలో ఎలాంటి అపశ్రుతులు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన క్రమంలో

**వినియోగదారులకు తమ హక్కులు, చట్టాల పట్ల మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది -  పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్**

వినియోగదారులకు తమ హక్కులు, చట్టాల పట్ల మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది -  పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్ వినియోగదారులకు తమ హక్కులు, చట్టాల పట్ల మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్ అన్నారు. చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల వినియోగదారులు సరైన న్యాయం పొందలేకపోతున్నారని, మోసపోతే చట్టం తనకు అండగా ఉందనే నమ్మకం వినియోగదారులకు కలిగించాలని అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు పారసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు.  హైదరాబాద్లో  జరిగిన కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ  చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల, పరిష్కారాల  కమిషన్ ప్రెసిడెంట్ ఎం.ఎస్.కె. జైస్వాల్, పౌరసరఫరాల శాఖ కమిషనర్  పి. సత్యనారాయణరెడ్డి, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ శ్రీమతి బి. బాలమాయాదేవి తదితరులు  పాల్గొన్నారు.  వినియోగదారులు హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన వాల్పోస్టర్ను ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ ఆవిష్కర

**పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్**

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు గ్రామంలో రూ.6.40 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను    రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్     ప్రారంభించారు.  రూ. 6.06 కోట్ల రూపాయలతో నిర్మించించిన ఖమ్మంపాడు - తొండలగోపవరం, మీనవోలు తొండలగోపవరం వరకు బ్లాక్ టాప్(BT) రోడ్డు ప్రారంభించారు..  రూ.10 లక్షలతో ఖమ్మంపాడు గ్రామంలోని అన్ని సెంటర్లలో ఏర్పాటు చేసిన HAI MAST విద్యుత్ లైట్లు, రూ. 16 లక్షలతో నిర్మించిన ఖమ్మంపాడు గ్రామ పంచాయతీ భవనం,  రూ. 8 లక్షలతో గ్రామంలో  నిర్మించిన SC కమ్యూనిటీ భవనం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు గారు, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు గారు, గ్రామ సర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మ వెంకటేశ్వర్లు గారు జడ్పీటీసీలు, ఎంపిటిసిలు తదితరులు ఉన్నారు.

**బ్రహ్మానంద రెడ్డి పార్క్ జాతీయ వన నిర్వహణ ను ప్రశంసించిన  తెలంగాణ చీఫ్  సెక్రటరీ  ఎ స్ కే జోషి***

 బ్రహ్మానంద రెడ్డి పార్క్ జాతీయ వన నిర్వహణ ను ప్రశంసించిన  తెలంగాణ చీఫ్  సెక్రటరీ  ఎ స్ కే జోషి హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ ప్రాంతం లో ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ జాతీయ వనాన్ని  తెలంగాణ చీఫ్  సెక్రటరీ  ఎ స్ కే జోషి  సందర్శించి నిర్వాహణ పట్ల అటవీ శాఖ శ్రద్ధను ప్రశంసించారు. ఉదయమే సతీ సమేతంగా శ్రీమతి అనురాధ జోషి గారితో విచ్చేసిన చీఫ్ సెక్రటరీ శ్రీమతి ఆర్ శోభ ప్రిన్సిపల్ చీఫ్ కాంసెర్వేటర్ అఫ్ ఫారెస్ట్ అండ్ HOFF తెలంగాణ  చంద్ర శేఖర్ రెడ్డి, అడిషనల్ ప్రిన్సిపాల్ చీఫ్ కాంసెర్వేటర్ అఫ్ ఫారెస్ట్ మరియు పి వెంకటేశ్వరులు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, హైదరాబాద్ స్వాగతం పలికి పార్క్ లోని వివిధ సదుపాయాలను చీఫ్ సెక్రటరీ గారికి చూపిస్తూ పార్కు నిర్వహణను వివరించారు. పార్క్ విజిటర్ జోన్ లో ఉన్న EEC సెంటర్, ఓపెన్ క్లాస్ జిం, యోగ షెడ్, నేచర్ క్యాంపు వివరాలను చీఫ్ సెక్రటరీ  నగరములో ఇలాంటివి ఉపయోగంగా ఉన్నాయిని,  చాల అద్భుతంగా నిర్వహిస్తున్నారాని వీరందరినీ కొనియాడారు. పార్కు నిర్వహణలో ప్రదర్శిస్తున్న శ్రద్ధను అటవీ శాఖను అభినందించారు। కన్సర్వేషన్ జోన్ లో ని వాచ్ టవర్ ఫై నుంచి పార్కు పచ్చదనాన్ని చూసి ప

***గవర్నర్‌ను కలిసిన రాజధాని రైతులు.**

*అమరావతి* *గవర్నర్‌ను కలిసిన రాజధాని రైతులు.* *అమరావతి రైతులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను గురువారం కలిశారు.* రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు వినతిపత్రం సమర్పించారు.  *తొమ్మిది రోజులుగా రాజధానిలో జరుగుతున్న పరిణామాలను ఈ సందర్భంగా రైతులు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆనాడు ప్రభుత్వం అడిగితే అందరమూ భూములు ఇచ్చామని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.* రాజధాని అమరావతిలోనే ఉండేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరినట్లు వారు తెలిపారు. అయితే గవర్నర్ ఈ విషయాలపై సానుకూలంగానే స్పందిచినట్లు రైతులు తెలిపారు. *175 మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఆనాడు అమరావతిని రాజధానిగా అంగీకరించారని, జగన్ కూడా ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పినట్లు వారు గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు ఏకపక్షంగా రాజధానిని తరలిస్తామని ప్రకటించడం అన్యాయమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.* అమరావతిలోనే రాజధాని ఉంచాలని, లేకుండా తమ జీవితాలు రోడ్ల పాలవుతాయని అన్నారు *మా బాధను అర్థం చేసుకొని అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు*

**విధులు బహిష్కరించిన హైకోర్టు న్యాయవాదులు.**

*అమరావతి* *విధులు బహిష్కరించిన హైకోర్టు న్యాయవాదులు.* *కోర్టులో నిలిచిన కార్యకలాపాలు.* *న్యాయవాదులు విధుల  బహిష్కరించి అమరావతి కి అనుకూలంగా నినాదాలు.*

**భారీ ఉగ్రదాడులకు వ్యూహం**

న్యూఢిల్లీ : భారత్‌లో భారీ ఉగ్రదాడులకు వ్యూహం రూపొందిస్తూ పాకిస్తాన్‌లో ఇటీవల ఖలిస్తాన్‌ ఉగ్రమూకల భేటీ జరిగిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు పంజాబ్‌లో ఉగ్ర దాడులు చేపట్టేందుకు పాకిస్తాన్‌ నుంచి ఆయుధాలను సమీకరిస్తున్నారని తెలిపాయి. పంజాబ్‌లోకి భారీగా ఆయుధాలను తరలించేందుకు ఉగ్ర సంస్థలు బబ్బర్‌ ఖల్సా, ఖలిస్తాన్‌ జిందాబాద్‌లు పాక్‌ ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఖలిస్తాన్‌ను కోరే ఉగ్ర మూకల కార్యకలాపాలు ఇటీవల రాజస్ధాన్‌, హరియాణాల్లోనూ వెలుగులోకి వచ్చాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఖలిస్తాన్‌కు మద్దతిచ్చే ఉగ్రవాదుల కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వం ఇప్పటికే సరిహద్దు భద్రతా దళం, ఎన్‌ఐఏ, రా, ఐబీ వర్గాలను ఆదేశించింది. మరోవైపు పంజాబ్‌లోకి ఆయుధాలు తరలిరాకుండా పంజాబ్‌ సరిహద్దుల వద్ద భద్రతా దళాలు నిఘాను ముమ్మరం చేశాయి. భారత్‌లో ఉగ్రదాడులు చేపట్టేందుకు ఖలిస్తాన్‌ను కాంక్షించే ఉగ్రవాదులు చేపడుతున్న శిక్షణా శిబిరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా రాబట్టేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు యూపీలోని అయోధ్యలో ఉగ్రదాడికి జైషే మహ్మద్‌ యోచిస్తోందని నిఘా

**అశ్లీల వీడియోలను వీక్షిస్తున్న***

అశ్లీల వీడియోలను వీక్షిస్తున్న చెన్నైలో 30 మంది గుట్టును రట్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. వీరిలో 24 మంది అడ్రస్సులను గుర్తించారు. వీరిని అరెస్టు చేయడానికి మహిళా పోలీసు అ ధికారి జయలక్ష్మి నేతృత్వంలోని బృందం సిద్ధమైంది. హైదరాబాద్‌లో దిశా ఘటన తరువాత మహిళలు, యువతులు, బాలికలకు రక్షణను మరింత  మెరుగు పరిచే విధంగా రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతూ అశ్లీల వీడియోలను వీక్షించే వారిని, వాటిని డౌన్‌లోడ్‌ చేసే వారు, షేరింగ్‌ చేసే వాళ్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అశ్లీల వీడియోలను వీక్షిస్తున్న మూడు వేల మందిని రాష్ట్రవ్యాప్తంగా గుర్తించారు. వీరికి హెచ్చరికలు ఇచ్చారు. అలాగే, పదే పదే తమకు పట్టుబడితే ఏడేళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో తిరుచ్చికి చెందిన క్రిష్టోఫర్‌ అల్ఫోన్స్‌ రాజా(40) ఆదవన్‌....ఆదవన్‌ పేరిట ఓ మెసెంజర్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని అశ్లీల వీడియోల్ని ఇష్టానుసారంగా షేర్‌ చేస్తూ రావడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అతడ్ని అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన తొలి వ్యక్తి రాజా. ఈ పరిస్థితుల

**మియాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరి మృతి**

మియాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరి మృతి హైదరాబాద్: మియపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువకులు కారు నడపడంతో అది అదుపుతప్పి బస్టాప్‌లో ఉన్న ఆటోని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మియపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

**మిర్యాలగూడ రూరల్ ఎస్.ఐ. సైదాబాబు సస్పెన్షన్**

*మిర్యాలగూడ రూరల్ ఎస్.ఐ. సైదాబాబు సస్పెన్షన్* - - అవినీతి ఆరోపణలపై విచారణ చేసి సస్పెన్షన్ కు సిఫార్సు చేసిన ఎస్పీ రంగనాధ్ - - 15 రోజుల సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు నల్గొండ : పలు అవినీతి ఆరోపణలు, పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం లాంటి ఆరోపణలపై మిర్యాలగూడ రూరల్ ఎస్.ఐ. సైదాబాబును హైదరాబాద్ రేంజ్ డిఐజి సస్పెండ్ చేశారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకుండా వ్యవహరించడం, దర్యాప్తులు సక్రమంగా చేయకపోవడం, రోడ్డు ప్రమాదాల ఘటనలోనూ కేసులు నమోదు చేయకుండా అక్రమాలకు పాల్పడడం లాంటి అవినీతి ఆరోపణల క్రమంలో ఆయనను సస్పెండ్ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఎస్.ఐ..సైదాబాబు సెల్ ఫోన్ కాల్ డేటా తో పాటు గత 15 రోజులుగా సమగ్రంగా విచారణ జరిపిన జిల్లా ఎస్పీ సస్పెన్షన్ కు సిఫార్సు చేయడంతో హైదరాబాద్ రేంజ్ డిఐజి శివశంకర్ రెడ్డి మిర్యాలగూడ రూరల్ ఎస్.ఐ. సైదాబాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

**గ్రహణాలు - అపోహలు.**

*గ్రహణాలు - అపోహలు.* వ్యవహారిక భాషలో 'గ్రహణాన్ని' చెడుకు పర్యాయపదంగా వాడటం పరిపాటి. గ్రహణం పట్టింది, గ్రహణం వీడింది అనే పదాలు మన జీవితంలో కష్టసుఖాలకి అన్వయింపబడుతుంటాయి. సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల, ఉపగ్రహాల వల్ల గ్రహణాలు ఏర్పడతాయనే విషయం అందరికి తెలిసిందే. కానీ అనాది కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలో గ్రహణాలపై ప్రజలలో అపోహలున్నాయి. వాటిలో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి. గ్రహణ సమయంలో వంట చేయకూడదని, తినకూడదని, ఏమీ త్రాగకూడదని, ఇలా చేస్తే చెడు ఫలితాలొస్తాయని మనదేశంలో నమ్ముతారు. అమెరికాలోని కొంతమంది గ్రహణాలు ఏర్పడటాన్ని సృష్టి వినాశనానికి సంకేతంగా భావిస్తారు. ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలలో గ్రహణం ఏర్పడమంటే సూర్యచంద్రులిద్దరూ కలిసి ఘర్షణ పడతారని నమ్ముతారు. చాలా దేశాల్లో గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలని బయటకి రావద్దని హెచ్చరిస్తారు. మరికొన్ని దేశాలలో గ్రహణాలు ఏర్పడితే భూకంపాలు వస్తాయని, తద్వారా మానవ వినాశనం జరుగుతుందని నమ్ముతారు. మన దేశంలో విస్తృతంగా ప్రచారంలో వున్న రాహు, కేతువుల కధ అందరికీ తెలిసిందే. గెలీలియో, కెప్లర్, కోపర్నికస్ వంటి ఖగోళశాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితంగా

**వంగవీటి మోహన్ రంగా 31 వ వర్ధంతి ***

విజయవాడ  వంగవీటి మోహన్ రంగా 31 వ వర్ధంతి  ఎంజి రోడ్ లో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ  కార్యక్రమంలో పాల్గొన్న రాధా రంగా మిత్రమండలి సభ్యులు, అభిమానులు  *వంగవీటి రాధా కామెంట్స్.... నా తండ్రి రంగా పేదల కోసం ఎంతో కృషి చేశారు  కులమతాలకు అతీతంగా రంగా అందరి మనసులో  నిలిచిపోయారు  నా తండ్రి ఆశయాలను  ముందుకు తీసుకెళ్లేందుకు  నా వంతు కృషి చేస్తాను  రాధా రంగా మిత్రమండలి రాజకీయాలకు అతీతంగా, రంగా అభిమానులతో  ఏర్పడింది  నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది  వారందరికీ నా వంతు సహాయ, సహకారాలు అందిస్తాను

**పెళ్లి చేసుకుంటానని ఎయిర్‌హోస్టెస్‌ను నమ్మించి...***

హైదరాబాదు: పెళ్లి చేసుకుంటానని ఎయిర్‌హోస్టెస్‌ను నమ్మించి నాలుగేళ్లు సహజీవనం చేసి ఆమె నుంచి రూ.లక్షలు తీసుకుని తీరా పెళ్లి మాట ఎత్తేసరికి మొహం చాటేసిన విదేశీ యువకుడిని బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. న్యూఢిల్లీ, ఆర్కేపురం, మహ్మద్‌పూర్‌ ప్రాంతానికి చెందిన యువతి సౌదీలోని రియాద్‌లో ఉంటూ సౌదీ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసేది. 2015 మార్చిలో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా విమానంలో రియాద్‌కు చెందిన  అలీ–అల్‌–ఖఫియా సాలెం అలీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనను యమన్‌ దేశస్తుడిగా పరిచయం చేసుకున్న అతను రియాద్‌లో ఉంటానని హైదరాబాద్‌లోని  ఫరా ఇంజినీరింగ్‌ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నట్లు చెప్పాడు. పారామౌంట్‌ కాలనీలో ఉంటూ కాలేజీకి వెళుతున్నట్లు చెప్పాడు. వీరిద్దరి పరిచయం స్నేహానికి ఆ తరువాత ప్రేమకు దారితీసింది. తరచూ ఇద్దరూ కలుసుకునేవారు. పెళ్లి చేసుకుంటానని సాలెం చెప్పడంతో ఇద్దరూ పారామౌంట్‌ కాలనీలోని అతడి ఇంట్లోనే సహజీవనం చేశారు. నాలుగేళ్లుగా సాలెం ఆమె నుంచి పలుదపాలుగా రూ.15 లక్షల వరకు తీసుకున్నాడు.