*మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయండి*
*మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయండి* నల్లగొండ పట్టణంలో రేపు ఆదివారం 28వ తేదీన జరిగేటటువంటి మహిళా శక్తి సమ్మేళనం కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కార్యదర్శి dr. సింధూర కోరారు. మహిళల్లో చైతన్యం కలిగించడం కోసం, సాంస్కృతి, కుటుంబ విలువలు పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళలని భాగస్వామ్యం పెంచడం, మహిళలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం అనే ఉద్దేశంతో మహిళా శక్తి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరుగుతుందని పత్రిక ప్రకటన ద్వారా నిర్వాహకురాలు నన్నూరి లత తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఎస్పీ చందనా దీప్తి పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి, విద్య ,వైద్య సామాజిక, ధార్మిక, ఉద్యోగ, సేవ, వ్యాపార, వ్యవసాయ, పారిశ్రామికవేదలు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలు పాల్గొన గలరని కోరారు. రేపు జరిగే ఈ కార్యక్రమం నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి జిఎం గార్డెన్స్ (గుండెగోని మైసయ్య కన్వెన్షన్ ఫంక్షన్ హాల్) ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని తెలియజేశారు.