*ఆన్ లైన్ బెట్టింగ్, బెట్టింగులు, జూదం, గ్యాంబ్లింగ్, వడ్డీ వ్యాపారులపై పోలీసుల నజర్* - - బెట్టింగులకు, అధిక వడ్డీకి వ్యాపారానికి పాల్పడే వారి సమాచారం ఇవ్వండి - - బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్స్ నిర్వహణ పై పోలీస్ నిఘా - - సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం - - అధిక వడ్డీలు, బెట్టింగుల బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సామాన్యులు - - బెట్టింగులు, జూదం, గ్యాంబ్లింగ్ లపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ నల్గొండ : జిల్లాలో బెట్టింగులు, జూదం, గ్యాంబ్లింగ్ లకు పాల్పడే వారితో పాటు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న వ్యాపారుల వివరాలు నేరుగా తనకు, పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు. ఎంతో మంది సామాన్య, పేద ప్రజలు డబ్బు ఆశతో జూదానికి, ఆన్ లైన్ బెట్టింగులకు, బెట్టింగులకు పాల్పడుతూ, తమ వద్ద డబ్బులు లేక అప్పులు తీసుకొని సర్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఇటీవలి కాలంలో బెట్టింగులు, జూదం నడుస్తున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చిందని ఈ క్రమంలో జిల్లాలో జూదం, బెట్టింగులు జరగకుండా పోలీసులు అన్