టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త హైద్రాబాద్, గూఢచారి: టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నియామకం పట్ల TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త శుభాకాంక్షలు తెలిపారు. NSUI రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ గా ఆయన చేసిన సేవలకు పీసీసీ అధ్యక్షుడు గా నియామకం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నూతన TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అని ఆయన అన్నారు.