Skip to main content

Posts

Showing posts with the label NATIONAL

*జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నాం* కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి

  *జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నాం*   కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి న్యూడిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నియంత్రణ ఛాయలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కోరారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాలు అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిబెంగాల్‌లో తాజాగా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 22 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతంగా ఉందని వెల్లడించారు. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో కరోనా మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభమైందని, 18 – 44 వయస్సు ఉన్న 20 లక్షల మందికి టీకాలు అందాయని పేర్కొన్నారు.

భారత్‌ కోలుకుంటోంది

భారత్‌ కోలుకుంటోంది. భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ఈ వైరస్‌ కోరల్లోంచి బయటపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో వరుసగా మూడో రోజూ కరోనాను జయించిన వారి సంఖ్య 24గంటల్లో మరో రికార్డును నమోదు చేసింది. గురువారం ఒక్కరోజే 34,602 మంది రోగులు కోలుకోవడంతో దేశంలో రికవరీ రేటు 63.45శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది._  _ఈ రోజు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం దేశంలో  ఈ ఒక్కరోజే అత్యధికంగా 49,310 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో  మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,87,945కి పెరిగింది. వీరిలో 8,17,209 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..  30,601 మంది ప్రాణాలు కోల్పోయారు.  దేశంలో మరణాల రేటు కూడా 2.38శతానికి పడిపోవడం విశేషం. ప్రస్తుతం 4,40,135 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కరోనా పరీక్షలను పెంచి పాజిటివిటీ రేటు తగ్గిస్తామని ప్రకటించిన కేంద్రం అందుకనుగుణంగా టెస్టుల సంఖ్యను పెంచుతోంది. దేశవ్యాప్తంగా 1290 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే 3,52,801 శాంపిల్స్‌ పరీక్షించారు. దేశంలో నిన్నటి వరకు 1,54,28,170 శాంపిల్స్‌ను పర

దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.

  దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ. 11 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన మూడు రోజుల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసుల నిర్ధారణ. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 40, 425 పాజిటివ్ కేసులు నమోదు కాగా 681 మంది మృతి.  దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 11, 18, 043 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 3, 90, 459 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 7, 00, 087 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 27, 497 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 22, 664 మంది బాధితులు.

జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్‌ 30 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్‌ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. ఫేజ్‌-1 జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి ఫేజ్‌-2 పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది. వీటికి అనుమతి లేదు.. మెట్రో రైలు సేవలకు అనుమతి లేదు. అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు. సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు,

దూసుకొస్తున్న భారీ తుపాన్.. ఎంఫాన్ గా నామకరణం

ఏపీ వైపు దూసుకొస్తున్న భారీ తుపాన్.. ఎంఫాన్ గా నామకరణం తెలుగు రాష్ట్రాలకు భారీ తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడం వల్ల వచ్చే మూడు రోజుల ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తుపాను ముప్పు పొంచి ఉందని ఆంధ్ర ప్రదేశ్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. ఇది మరింత బలపడి సుమారుగా మే 7 వ తేదీన ఆగ్నేయబంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా..ఇది మే 7 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దక్షిణ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తదుపరి 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈ

లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు

లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు న్యూఢిల్లీ: ఈనెల 3వ తేదీతో దేశవ్యాప్తంగా ముగియనున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ  తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 4 నుంచి 17వ తేదీ వరకూ లాక్‌డౌన్ కొనసాగనుంది. తాజా ఆదేశాల ప్రకారం, కంటైన్మెంట్ జోన్లలో పూర్తిగా ఆంక్షలు అమల్లో ఉంటాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, విమానాల రాకపోకలపై నిషేధం యథాప్రకారం కొనసాగుతుంది. సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లు తిరగవు. బార్బర్ దుకాణాలు, స్పా, సెలూన్లు తెరవరాదు. అంతర్ జిల్లా, రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది. డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం-2005 కింద రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రిత్వా శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

లాజిక్ తో లేఖ వ్రాసిన కాంగ్రెస్ MLA భరత్ సింగ్ 

లాజిక్ తో లేఖ వ్రాసిన కాంగ్రెస్ MLA భరత్ సింగ్  శానిటైజర్ తో చేతులు కడుకుంటే  కరోనా వైరస్ పోతుంది అంటున్నారు కదా.  శానిటైజర్ లో ఆల్కహాల్ ఉండడం వల్లనే వైరస్ పోతుందని నిర్దారణ అయింది కదా.. అలాంటప్పుడు ఆల్కహాల్ తాగితే  గొంతులో వున్నా కరోనా వైరస్ కూడా పోతుంది కదా. అందుకే మీరు మద్యం దుకాణాలను తేరవడానికి అనుమతి ఇవ్వండని రాజస్థాన్ సీఎం కు అక్కడి కాంగ్రెస్ MLA భరత్ సింగ్ లేఖ రాసిండు.

లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి - కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా

లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి - కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా స్థానికంగా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు ప్రజలంతా తప్పనిసరిగా మాస్కు ధరించాలి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయించిన రంగాల్లో జాగ్రత్తలు పాటించాలి ఉపాధి హామీ పనులు, గ్రామీణ అభివృద్ధి పనులకు అనుమతి వ్యవసాయాధారిత పనులు ఆటంకం కలిగించవద్దు వలస కూలీల కనీస వసతులు కల్పించాలి కోవిడ్ 19 వైరస్ నివారణ, పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎస్ లు,జిల్లా కలెక్టర్ లు,ఎస్.పి.లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నల్గొండ, ఏప్రిల్ 25:  కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణ కొరకు చేపట్టిన లాక్ డౌన్ అమలు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు,జిల్లా కలెక్టర్ లు, ఎస్. పి.లకు సూచించారు. లాక్ డౌన్ అమలు తీరు పై తీసుకుంటున్న చర్యలపై ఆయన శనివారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు,జిల్లా కలెక్టర్ లు,ఎస్.పి.లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ప్రపంచంలోని అగ్ర రాజ్యాల సైతం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తితో తీవ్ర సంక

GMR పెట్రోలింగ్  డ్రైవర్   మృతి

GMR పెట్రోలింగ్  డ్రైవర్   మృతి మెదక్ జిల్లా:- నార్సింగి మండలం సంకాపూర్ చౌరస్తా వద్ద  పాల వ్యాన్  బోల్తా , GMR పెట్రోలింగ్ వెహికిల్ క్రేన్ సాయంతో వ్యాన్ ను  తీస్తుండగా, వెనక నుండి స్పీడ్ గా వస్తున్న మరో వ్యాన్ GMR పెట్రోలింగ్ వెహికల్ ను డి కొట్టగా పెట్రోలింగ్  డ్రైవర్  ప్రశాంత్ మృతి.

ఢిల్లీలో దారుణం.. అత్త, మామలను కడతేర్చిన కోడలు

ఢిల్లీలో దారుణం.. అత్త, మామలను కడతేర్చిన కోడలు కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో దేశ రాజధానిలో దారుణం జరిగింది. భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగానే అత్తా, మామలను అత్యంత కిరాతకంగా@@ కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో దేశ రాజధానిలో దారుణం జరిగింది. భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగానే అత్తా, మామలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కోడలు ఉదంతం వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీ చావ్లా ప్రాంతంలోని దుర్గా విహార్‌ ఫేజ్‌-2లోని తమ ఇంటిలో కవిత (35) అనే మహిళ తన అత్తమామలు రాజ్‌ సింగ్‌(61), ఓంవతి (58)లను దారుణంగా కొట్టి ఆపై కసితీరా కత్తితో పొడిచి చంపిందని పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె భర్త సతీష్‌ సింగ్‌ (37)నూ ఈ కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. జంట హత్యల కేసులో కవిత, ఆమె భర్తను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఆర్ణబ్ గోస్వామి పై దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు

ఆర్ణబ్ గోస్వామి పై దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు. సీనియర్ పాత్రికేయుడు, ఎడిటర్ ఆర్ణబ్ గోస్వామి పై  దాడి చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ)లు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో తమ భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తీకరించే జర్నలిస్టులపై దాడులు చేయడం సరైంది కాదని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, వర్కింగ్ కమిటీ సభ్యులు ఎల్గొయి ప్రభాకర్ లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులకు  రాజకీయ,మతపరమైన సంస్థలు, పార్టీలతో సంబంధం లేకుండా ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తీకరించే హక్కు వుంటుందని అన్నారు. జర్నలిస్టులు వ్యక్తపరిచే అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వ్యక్తపరిచేందుకు అనేక మార్గాలున్నాయని,కానీ ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడడం సరైంది కాదని, ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని అన్నారు. ఆర్ణబ్ గోస్వామి పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. STAY HOME - STAY SAFE భౌతిక దూరం

ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ:  ఏప్రిల్  22 వరకు పురోగతి 

  ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ:  ఏప్రిల్  22 వరకు పురోగతి  ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద 33 కోట్లకు పైగా పేదలకు 31,235 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం లభించింది.  మహిళా జన ధన్ ఖాతాదారులకు రూ .10,025 కోట్లు 20.05 కోట్లకు పంపిణీ చేశారు  సుమారు 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ .1405 కోట్లు పంపిణీ చేశారు  పిఎం-కిసాన్ మొదటి విడత: 8 కోట్ల మంది రైతులకు రూ .16,146 కోట్లు బదిలీ  68,775 స్థావరాలలో రూ .162 కోట్లు ఇపిఎఫ్ సహకారంగా బదిలీ చేయబడి 10.6 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూర్చింది;  2.17 కోట్ల భవనం; నిర్మాణ కార్మికులకు 3497 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం లభించింది ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ఆన్ యోజన 39.27 కోట్ల మంది లబ్ధిదారులు ఆహార ధాన్యాల ఉచిత రేషన్ పంపిణీ చేశారు పప్పుధాన్యాల 1,09,227 మెట్రిక్ టన్నులు; వివిధ రాష్ట్రాలు / యుటిలకు పంపించారు  ప్రధాన్ మంత్రి ఉజ్జ్వాల యోజన: 2.66 కోట్ల ఉచిత ఉజ్జ్వాలా సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయి   భౌతిక దూరం పాటించండి - మాస్కు ధరించండి కరోనా  నివారణకు పాటు పడండి  

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో  వీడియో కాల్ కాన్ఫిరెన్సు లో రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్.

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో  వీడియో కాల్ కాన్ఫిరెన్సు లో రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్.   వీడియో కూడా చూడండి. https://youtu.be/WDxCKFe3HGI వీడియో కాల్ కాన్ఫెరెన్సులో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో పాల్గొన్న రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్. కరోనా నేపథ్యంలో  IVF ద్వారా రాష్ట్రంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి వివరించారు.  తెలంగాణలో కేసీఆర్ కరోనా నివారణకు చేపడుతున్న  కార్యక్రమాలు వివరించారు.  ఈ వీడియో కన్ఫరెన్సీలో ఫౌండర్ ప్రేసిడెంట్  అశోక్ అగర్వాల్ జి ,ఐవీఫ్ పది రాష్ట్రాల అధ్యక్షులు,హాంగ్ కాంగ్ ,ఇతర దేశాల ఐవీఫ్ అధ్యక్షులు పాల్గొన్నారు.  రాష్ట్రం లో సేవ కార్యక్రమాలు చేపట్టిన ఉప్పల శ్రీనివాస్ ను అభినందించిన  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.  

50 లక్షల బీమా పథకాన్ని అమలు చేయాలి-టీయూడబ్ల్యూజే (ఐ జే యు)డిమాండ్

50 లక్షల బీమా పథకాన్ని అమలు చేయాలి-టీయూడబ్ల్యూజే (ఐ జే యు)డిమాండ్ కరోనా మహమ్మారిని అరికట్టడంలో వైద్య ఆరోగ్య మున్సిపల్ పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులు ఉద్యోగుల తో పాటుగా జర్నలిస్టులు కూడా ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని వారికి కూడా కేంద్రం ప్రకటించిన 50 లక్షల బీమా పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఇండియన్ జర్నలిస్టుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి ముంబైలో లో 53 మంది జర్నలిస్టులకు కరోనా వ్యాధి సోకిన నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు ప్రత్యేక బీమా పథకాన్ని అమలు చేయడంతోపాటు  వారి కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని గుర్తించాలని టీయూడబ్ల్యూజే (ఐ జే యు) అధ్యక్షులు నగునూరి శేఖర్,  ప్ర.కార్యదర్శి కే. విరాహత్అలీ  డిమాండ్ చేశారు.  తమిళనాడు ప్రభుత్వం వారి రాష్ట్రంలో లో పనిచేస్తున్న జర్నలిస్టులకు లాక్ డౌన్ కాలంలో నెలకు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడాన్ని గుర్తు చేస్తున్నామని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆర్థిక బీమా పథకాలను ప్రకటించాలని టీయ

సంస్కారం

                                  సంస్కారం రాజస్థాన్ లోని సికర్ జిల్లా లోని ఒక గ్రామంలో కొంతమంది  కార్మికులను ఒక పాఠశాల భవనంలో క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. ఊరక తిని కూర్చోవడంతో విసుగెత్తిపోయింది. ఆ పాఠశాల భవనానికి ఎన్నో ఏళ్ళుగా సున్నం లేదా పెయింటింగ్ చేయడం జరగలేదని ఆ క్వారంటైన్ లో ఉన్న కార్మికులకు అనిపించింది. వాళ్ళు వెంటనే ఆ గ్రామ సర్పంచ్ తో పాఠశాల భవనానికి పెయింట్ వేస్తామని ప్రస్తావన చేశారు. దాంతో ఆ సర్పంచ్ అవసరమైన వస్తువులు తెప్పించాడు. కార్మికులు తమ క్వారంటైన్ వ్యవధి ముగిసేలోగా భవనానికి పెయింట్ వేసేశారు. ఆ పని చేసినందుకు ఆ గ్రామ సర్పంచ్ , వారికి డబ్బులివ్వబోతే, మాకు ఇన్నాళ్ళూ ఉచితంగా భోజనాలు పెట్టారు. అందుకుగాను మేమూ ఏదో ఒకటి చేయాలనుకున్నాము. పాఠశాల భవనానికి పెయింట్ వేసే అవకాశం లభించింది. మాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు.అయినా మీరు ఏమైనా ఇవ్వదలచుకుంటే మీ ఊరి ఈ పాఠశాలకే ఇవ్వండి అని , డబ్బును నిరాకరించారు.                  ఇదీ సంస్కారం. - మరోవైపు చూస్తే, దీనికి భిన్నంగా విధ్వంసకాండ, ఉన్న ప్రదేశాన్ని అసహ్యంగా మార్చుకోవడం అపరిశుభ్రంగా తయారు చేయడం, వైద్యులు, నర్సుల పట్ల అసహ్య ప్రవర్తన,

జర్నలిస్టులందరూ జాగ్రత్తలు తీసుకోవాలి -  రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం

జర్నలిస్టులందరూ జాగ్రత్తలు తీసుకోవాలి -  రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం ముంబయిలో 53 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకిన వార్తలు వస్తున్నందున తెలుగు రాష్టాల్లోని జర్నలిస్టులందరూ ఈ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు.   వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు,  పారిశుధ్య కార్మికులు, పారిశుధ్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా వైరస్ ప్రభావం పొంచి ఉన్నప్పటికీ జర్నలిస్టులు సమాచార సేకరణ కోసం విధి నిర్వహణలో నిరంతరం పాల్గొంటున్నారు. ఇట్లాంటి క్లిష్ట  పరిస్థితిలో జర్నలిస్టులు వృత్తి కత్తి మీద సాము లాంటిది. వార్తలు, సమాచారం కోసం అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాపించిన ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉన్నందున, జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. వృత్తి కన్నా ప్రాణం విలువైనదని, ముందుగా ప్రాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులనుండి వస్తున్న సమాచారం మేరకు జర్నలిస్టులు కరోనా వైరస్ పట్ల తగిన జాగ్రత్తలు పాటించడం లేదని తెలియవస్తున్నదని ఈ

సింగిల్ లేడీ కావాలంటే ఈ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టండని మోసం

  ఫ్రెండ్ షిప్  పేరుతో మోసం.  మీకు సింగిల్ లేడీ కావాలంటే ఈ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టండి.  గంటలో మీ ఇంట్లో ఉంటుంది అని ఫేస్ బుక్ లో ఫోన్ నెంబర్ పెట్టిన సైబర్ నేరగాళ్లు.  అమ్మాయి అనుకోని చాటింగ్ చేసినా హైదరాబాద్ బొల్లారం కు చెందిన వ్యక్తి.  చాటింగ్ చేస్తూ సైబర్ లేడీ పంపించిన అకౌంట్లకు 91000 వేల రూపాయల నగదు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్  చేసిన బాధితుడు.  డబ్బులు రావడంతో నంబర్ బ్లాక్ చేసిన చీటర్.  మోసపోయానని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు..

మాస్కు పెట్టుకుంటేనే పెట్రోల్

  మాస్కు లేకుంటే పెట్రోల్  పోయనంటున్న   డీలర్లు పెట్రోల్ కొట్టించుకునేందుకు వెళుతున్నారా.. అయితే జేబులో డబ్బులు ఉంటే సరిపోదు.. ముఖానికి మాస్కు కూడా ఉండాలి.. అవును మాస్కు లేకుండా పెట్రోల్ బంకుకు వచ్చిన వారికి  పెట్రోల్  అమ్మవద్దని  డీలర్లు నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ పంపులు సంవత్సరం పొడవునా.. 24 గంటలూ తెరిచే ఉంటాయి. వీటిలో పనిచేసేవారు ఎల్లప్పుడూ కస్టమర్లతో ప్రత్యక్షంగా కాంటాక్ట్‌లో ఉండవలసి ఉంటుందని వారి రక్షణ కూడా మా  భాద్యత అని  డీలర్లు అంటున్నారు.  ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా పాటించేందుకు కూడా ఈ నియమం ఉపయోగపడుతుంది.  మాస్కు లేకుండా ఏ కస్టమర్ వచ్చినా వారికి పెట్రోల్‌ను ఎట్టిపరిస్థితీుల్లో విక్రయించేది లేద’ని వారు తేల్చి చెప్పారు. ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఉన్న పెట్రోల్ బంకుకు వచ్చిన ఓ కస్టమర్‌ను మాస్క్ ధరించాల్సిందిగా అక్కడి సిబ్బంది కోరారు. అంతేకాకుండా మాస్క్ లేకపోవడంతో అతడికి పెట్రోల్‌ను విక్రయించేందుకూ వారు నిరాకరించారు. దీనిని ఆ కస్టమర్‌ కూడా సమర్థించారు. .

సైబర్ మోసాలు జర జాగ్రత్త

సైబర్ మోసాలు జర జాగ్రత్త హైదరాబాద్ ఫోన్ పే కు క్యాష్ బ్యాక్ఆఫర్ వచ్చిందంటూ మోసం.  ఓపెన్ చేసి చూడమని చెప్పిన సైబర్ నేరగాళ్లు.  ఫోన్ పే మెసేజ్ ని చదవకుండానే క్లిక్ చేసిన బషీర్ బాగ్ చెందిన.  సర్వేష్ jaiswal అనే బిజినెస్ మాన్. అతని అకౌంట్ నుండి 59 వేల నగదు డ్రా చేసిన.  సైబర్ చీటర్ మోసపోయాను గమనించి.  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు                  మరో మోసం పేటీఎం కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఫోన్ కు వచ్చిన మెసేజెస్ లోని.  నెంబర్ కు ఫోన్ చేసిన అంబర్ పేట్ లోని బాగ్ అంబర్ చెందిన శ్రీనివాస్ చారి అనే వ్యక్తి.  నంబర్ కట్ చేసి మరో నంబర్ తో ఫోన్ చేసిన చీటర్.  వారు చెప్పినట్టు హాప్ డౌన్లోడ్ చేసుకొని కేవైసీ నంబర్ అప్డేట్ చేసిన బాధితుడు.  ఈ అకౌంట్ నంబర్ అప్డేట్ కావడం లేదని. మరో అకౌంట్ నెంబర్ ఉంటే చెప్పమని సైబర్ నేరగాళ్లు అడగడంతో మరో అకౌంట్ నెంబర్ చెప్పిన బాధితుడు.  రెండు అకౌంట్ నెంబర్ లో నుండి 70 వేల నగదు  ద్వారా డ్రా చేసిన మోసగాళ్లు. తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు. ఫిర్యాదు చేసిన బాధితుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు. కెనడాలో ఉద్య

రక్తదానం చేసిన  చిరంజీవి

రక్తదానం చేసిన  చిరంజీవి రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో…బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గుతున్నాయి.  ఈ క్రమంలో తన వంతు సాయంగా సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ డొనేట్ చేశారు. హైదరాబాద్ లోని బ్లడ్ బ్యాంకులో ఆయన రక్తదానం చేశారు. లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు అందించే బ్లడ్ బ్యాంకులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా ఉండేందుకు, వాటిలో రక్త నిల్వలు తగ్గకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌జ‌లు అభిమానులు విరివిగా ర‌క్త‌దానం చేయాల‌ని అందుకు స‌మీప బ్ల‌డ్ బ్యాంక్స్ కి వెళ్లాల‌ని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు . అంతేకాదు లాక్ డౌన్ ఉన్నా ర‌క్త‌దానం చేయొద్ద‌ని ఎవ‌రూ ఆప‌రని.. పోలీసులతో ఏ ఇబ్బందీ రాదన్నారు. ర‌క్త‌దానం చేస్తున్నాం అని తెల‌ప‌గానే బ్ల‌డ్ బ్యాంక్ వారి నుంచి మీ ఫోన్ వాట్సాప్ కు పాస్ వ‌స్తుంది. అది పోలీసుల‌కు చూపిస్తే స‌రిపోతుందని తెలిపారు చిరంజీవి.