Posts

Showing posts with the label ANDHRA PRADESH

కొండ వెంకట ప్రసాద్ కు వింజమూర్ ఆర్యవైశ్య సంఘం వైశ్య సంఘం మరియు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం తరపున తెలిపిన అభినందనలు

Image
  కొండ వెంకట ప్రసాద్ కు వింజమూర్ ఆర్యవైశ్య సంఘం వైశ్య సంఘం మరియు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం తరపున తెలిపిన  అభినందనలు కరోనా కష్టకాలంలో మార్చి నుంచి ఆరు నెలలుగా వింజమూరు మండలం లో లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న కొన్ని వందల మంది పేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఈ కరోనా కష్టకాలంలో ఆర్యవైశ్యుల  ఆరోగ్యం బాగుండాలని , ' ఆరోగ్యమే మహాభాగ్యం ' గా ఉండాలని  వారికి ఉన్నటువంటి పరిచయాలతో కరోనా పరీక్షలు ప్రతి ఒక్కరిని  చేయించుకోమని చెబుతూ, కరోనా వచ్చిన వ్యక్తులు యొక్క ఆరోగ్య మరియు యోగక్షేమములు కనుక్కుంటూ విశిష్ట సేవలు అందిస్తున్నటు  వంటి కొండా గరుడయ్యా రామచంద్రయ్య వెంకటసుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ , వింజమూర్, ఫౌండర్  కొండా వెంకట ప్రసాద్ గారికి వింజమూర్ ఆర్యవైశ్య సంఘం వైశ్య సంఘం మరియు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. కొండా బ్రదర్స్ హైదరాబాదులో ఉన్నప్పటికీ వారికి మన వింజమూరు మీద ఎనలేని ప్రేమ అభిమానం కలిగి ఉండడం మన అదృష్టం. చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ అభినందనలు..

జూన్ 11 ఏపీ కరోనా సమాచారం

ఏపీ కరోనా బులిటెన్ అమరావతి : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో 135 కేసులు నమోదవగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 38 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే విదేశాల నుంచి వచ్చి 9 మందికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఏపీలో 182 పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. ఏపీకి చెందిన 11,602 శాంపిళ్లను పరిశీలించగా 135 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా 65 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఏపీలో నమోదైన మొత్తం 4261 పాజిటివ్ కేసులకు గాను.. 2540 మంది డిశ్చార్జ్ అవగా.. 80 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1641 మంది కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు.

ఏపీ కరోనా 2 జూన్ బులిటెన్

Image
ఏపి లో 3200 కి చేరుకున్న కరోన పాజీటివ్ కేసులు.గడిచిన 24 గంటల్లో 82 కేసులు నమోదు 

ఆ డాక్టర్‌పై నమ్మకం లేదు: సుధాకర్ తల్లి కావేరి భాయ్

ఆ డాక్టర్‌పై నమ్మకం లేదు: సుధాకర్ తల్లి కావేరి భాయ్ విశాఖ: తన కుమారుడు సుధాకర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ రామిరెడ్డిపై తనకు, తన కుమారుడికి నమ్మకం లేదని సుధాకర్ తల్లి కావేరి భాయ్ అన్నారు. అదే విషయం తన కొడుకు కూడా డాక్టర్‌తో చెప్పాడన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మెంటల్ లేని తన కొడుకును పిచ్చాసుపత్రిలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ అందరితో చాలా చక్కగా మాట్లాడుతున్నాడని.. అలాంటి వ్యక్తిని తీసుకువెళ్లి మెంటల్ ఆస్పత్రిలో ఎలా ఉంచుతారని ఆమె ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదని, ప్రభుత్వంపై కూడా తమకు నమ్మకం లేదని ఆమె అన్నారు. ఇవన్నీ చూస్తుంటే తన కొడుక్కు ప్రాణహాని ఉందనిపిస్తోందని కావేరి భాయ్ అనుమానం వ్యక్తం చేశారు. నిన్న నాలుగు పేజీల లెటర్ రాశారని, అలాంటి వ్యక్తిని మెంటల్ ఆస్పత్రిలో ఎందుకు ఉంచారో అర్థంకావడంలేదన్నారు. సరైన చికిత్స ఇవ్వడంలేదని ఆమె ఆరోపించారు. సరైన చికిత్స చేయపోవడంతో తన కొడుక్కి కొత్త సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరుగుతుందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామన్నారు. తీర్పు వచ్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారం పై హైకోర్టు తీర్పు

  అమరావతి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారం పై హైకోర్టు తీర్పు ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కొట్టి పారేసిన హైకోర్టు ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ కొట్టిపారేసిన హైకోర్టు  రమేశ్ కుమార్ ని  కమిషనర్ గా కొనసాగించాలని ఆదేశాలు

విశాఖపట్నం మృతుల వివరాలు

విశాఖపట్నం మృతుల వివరాలు ఇద్దరు చిన్నారులు కూడా మృతి కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19) మృతి గంగాధర్, నారాయణమ్మ, నరసమ్మ, గంగరాజు, కృష్ణ మూర్తి మృతి మృతుడు చంద్రమౌళి ఏఎంసీలో ఎంబీబీఎస్‌ విద్యార్థి  విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య  9కి చేరిందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణ మూర్తి (73)తో పాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు చంద్రమౌళి విశాఖ పట్నంలోని ఏఎంసీలో ఎంబీబీఎస్‌ తొలి ఏడాదిలో చేరి చదువుకుంటున్నాడు. గ్యాస్‌ లీకైన ప్రాంతాల్లో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మృతుల్లో కొందరు రోడ్డుపైనే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఏపీ సీఎం జగన్ పర్యటన అనంతరం ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.

విశాఖలో భారీ ప్రమాదం కంపెనీ నుంచి లీకైన కెమికల్ వాయువు

Image
విశాఖలో భారీ ప్రమాదం కంపెనీ నుంచి లీకైన కెమికల్ వాయువు రోడ్డుపైనే పడిపోతున్న జనం ఎల్జీ పాలిమర్స్‌లో ఘటన ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసుల హెచ్చరిక భయంతో మేఘాద్రి గడ్డవైపు ప్రజల పరుగులు   విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఆ వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.మరికొందరు రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడిపోయారు. 200 మంది అస్వస్థతకు గురైనారని తెలిసింది.అసవస్థతకు గురైన వారిలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిసింది. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీయగా మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. అప్రమత్తమైన పోలీసులు సైరన్‌ మోగిస్తూ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులు, మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

మే5-  ఆంధ్రప్రదేశ్ కరోనా బులిటెన్

Image
మే5-  ఆంధ్రప్రదేశ్ కరోనా బులిటెన్  మే5 - ఆంద్రప్రదేశ్  కరోనా బులిటీన్ ను   ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారు. ఈ బులిటీన్లో  ఈ రోజు  67 కరోనా పాజిటివ్ కేసులు  నమోదు అయ్యాయని పేర్కొన్నారు. మొత్తం కేసులు 1717. ఆక్టివ్ కేసులు 1094,    ఇప్పటి వరకు 589 డిశ్చార్జ్ లు అయ్యారు. 34 మంది మృతి  చెందారు.

మద్యం దుకాణాలు ఖాళీ

దాదాపు 40 రోజుల లాక్ డౌన్ తరువాత మళ్ళీ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రజలు మద్యం కొనుగోలుకు విపరీతంగా ఎగబడ్డారు. ఇక తిరుపతి పట్టణంలో మద్యం దుకాణాల్లో మద్యం స్టాక్ మొత్తం ఖాళీ అయింది. ఒక్కో షాపులో పది నుంచి పదిహేను లక్షల వరకూ మద్యం అమ్మకాలు జరిగాయి. ఇప్పటికీ వైన్ షాపుల ముందు మందుబాబులు క్యూలైన్లలోనే ఉన్నారు. కాగా.. కొన్ని చోట్ల మద్యం సిబ్బంది మద్యం దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. రేపు డిపో నుంచి మద్యం స్టాక్ వచ్చాకే అమ్మకాలు జరుపుతామని దుకాణదారులు తెలిపారు. నేడు గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి.

ఏప్రిల్-29-ఆంధ్రప్రదేశ్-కరోనా-బులిటీన్

Image
ఏపి లో 1332 కి చేరుకున్న కరోన పాజిటివ్ కేసులు. గడిచిన 24 గంటల్లో73 కేసులు నమోదు అయ్యాయి. అత్యందికంగా గుంటూరు లో 29 కేసులు నమెదు  అయ్యాయి. ఆక్టివ్ కేసులు 1014, ఇప్పటివరకు 287 డిశ్చార్జ్ అయ్యారు, 31 మంది  మృతి చెందారు.    

ఏప్రిల్ 25 - AP కరోనా బులిటీన్ -

Image
ఏపీలో 1016కు చేరిన కరోనా పాజిటీవ్ కేసులు* గడిచిన 24గంటల్లో కొత్తగా 61 పాజిటీవ్ కేసులు నమోదు కృష్ణాజిల్లాలో మరింత విజృంభిస్తున కరోనా గడిచిన 24గంటల్లో కృష్ణ లో కొత్తగా 25 పాజిటీవ్ కేసులు నమోదు.జిల్లాలో మొత్తం 127కు చేరిన పాజిటీవ్ కేసులు. కృష్ణా జిల్లా ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

 రూ.1400 కోట్లు మహిళా సంఘాల ఖాతాల్లో వేసిన ఏపీ సీఎం జగన్

 రూ.1400 కోట్లు మహిళా సంఘాల ఖాతాల్లో వేసిన ఏపీ సీఎం జగన్ సెర్ప్, మెప్మా పరిధి ప్రాంతాల్లోని పొదుపు సంఘాల ఖాతాల్లో నగదు జమ 90,37,254 మంది మహిళలకు లబ్ధి 'వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం' కింద సాయం కట్టవలసిన మొత్తం వడ్డీని వేసిన ప్రభుత్వం  కరోనా విజృంభణ నేపథ్యంలో మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు సీఎం జగన్ ఈ రోజు సున్నా వడ్డీ పథకం ప్రారంభించారు. ఈ మేరకు రూ.1400 కోట్లు విడుదల చేశారు. వడ్డీ కింద ఈ డబ్బులు జమ చేస్తారు.  ఈ మేరకు రూ.1400 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఏపీలో 90,37,254 మందికి లబ్ధి చేకూరుతుంది. 'వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం' కింద స్వయం సహాయక సంఘాలు  2019, ఏప్రిల్ 1 నుండి 2020, మార్చి 31 వరకు కట్టవలసిన మొత్తం వడ్డీ రూ.1400 కోట్లను మహిళల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆయా సంఘాల ఖాతాల్లో జమచేసింది. సెర్ప్, మెప్మా పరిధి ప్రాంతాల్లోని పొదుపు సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ అయింది. దీని వల్ల పేద మహిళలకు ఎంతగానో లాభం చేకూరుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా ఒకే ఒక్క క్లిక్‌తో సీఎం జగన్‌ నగదు బదిలీ  చేశారు. దీంతో సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండ

ఆంద్రప్రదేశ్ కరోనా బులిటీన్, ఏప్రిల్ 22

Image
24గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదు... పెరిగిన కేసులతో కలుపుకొని ఏపీలో 813కు చేరుకున్న పాజిటివ్ కేసుల సంఖ్య కర్నూల్ 19,  గుంటూరులో 19, చిత్తూర్ 6, కడపలో 5, కృష్ణా 3, ప్రకాశంలో 4 కేసులు నమోదు గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో ఇద్దరు మృతి ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ తో 24 మంది మృతి మొత్తం 5757 మంది శాంపిల్స్ పరీక్ష ఆసుపత్రి నుంచి 120 మంది కోలుకుని డిశ్చార్జ్ ప్రస్తుతం 669 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స

కరోనా AP బులిటీన్, 21 ఏప్రిల్

Image
కరోనా AP బులిటీన్,  21 ఏప్రిల్

కోవిడ్19 ఆంద్రప్రదేశ్ బులిటీన్, 20 ఏప్రిల్

Image
కోవిడ్19 ఆంద్రప్రదేశ్  బులిటీన్, 20 ఏప్రిల్.  

కరోనా AP బులిటీన్ 19 ఏప్రిల్

Image
కరోనా AP బులిటీన్ 19 ఏప్రిల్

జర్నలిస్టులకు సరుకులు అందించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను 

Image
జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను  కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా జర్నలిస్ట్ కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో వారికి ఆసరాగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను భావించారు. ఈ సందర్భంగా శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో గల ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, 1 లీటర్ నూనె, 1 కేజీ బొంబాయి రవ్వ, 1 కేజీ ఇడ్లి రవ్వ, 1 కేజీ పల్లీలు, 1 కేజీ సెమియా, 1/2 కేజీ బెల్లం, 1కేజీ ఉప్పు, 1/2 కేజీ చింతపండు, పసుపు, కారం, మినపప్పు, సంతూరు, XXX సబ్బులు, వెల్లుల్లి, తాలింపు గింజలు, టీ పోడి లను ఆయన అందజేశారు.

ఏపీలో మరో 38 కరోనా పాజిటివ్

Image
  ఏపీలో మరో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు .  ఏపీలో మొత్తం 572కు చేరిన కరోనా కేసులు .  ఇప్పటి వరకు ఏపీలో 14 మంది కరోనాతో మృతి . కరోనాతో కోలుకున్న 35 మంది .  కర్నూలు 13, అనంతపురం 5, చిత్తూరు 5,  గుంటూరు 4, కృష్ణా 4, నెల్లూరు 6, కడపలో ఒక కేసు నమోదు.

తిరుమలలో ఎలుగుబంట్ల సంచారం

Image
తిరుమలలో ఎలుగుబంట్ల సంచారం శ్రీవారి సన్నిధిలో భయం..భయం   తిరుమలేశుని సన్నిధిలో క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి.  కొన్ని రోజుల క్రితం శ్రీవారి సన్నిధి ఆనందనిలయం చెంత అడవి పందులు సంచారం చేయగా తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు యధేచ్ఛగా తిరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తిరుమలేశుని సన్నిధిలో క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం శ్రీవారి సన్నిధి ఆనందనిలయం చెంత అడవి పందులు సంచారం చేయగా తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు యధేచ్ఛగా తిరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాన రోడ్లకు అడ్డంగా ఎలుగు బంట్ల సంచరిస్తుండడం గమనించిన కొందరు ఈ వీడియోలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రతి నిత్యం వేలాది మంది భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల రోడ్లన్నీ ఇపుడు నిర్మానుష్యంగా మారాయి. కొండమీద నివాసముండే వారికి సైతం లాక్ డౌన్ ఆంక్షలు వుండడంతో రోడ్లమీద జన సంచారం లేకుండా పోయింది. ఈక్రమంలో సమీపంలోని చిట్టడవుల నుంచి కొన్ని జంతువులు తిరుమల వీథులకు యధేచ్ఛగా వచ్చేస్తున్నా

**ఆంగ్ల మాధ్యమంపై ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు**

ఆంగ్ల మాధ్యమంపై ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85ను రద్దు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ భాజపా నాయకుడు సుదీష్‌ రాంబొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు.  ఏ మాధ్యమంలో చదవాలన్న అంశం విద్యార్థుల నిర్ణయానికే వదిలివేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేయడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు ఆంగ్లమాధ్యమం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచి ఈరోజు వెలువరించింది. జీవోలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది