సమాచార భారతి ఆధ్వర్యంలో వైభవోపేతంగా సోషల్ మీడియా సంగమం
సమాచార భారతి ఆధ్వర్యంలో వైభవోపేతంగా సోషల్ మీడియా సంగమం హైదరాబాద్: సమాచార భారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబద్ లోని కేశవ మెమోరియల్ విద్యాసంస్ధల ఆవరణంలో సర్దార్ పటేల్ హాల్ లో సోషల్ మీడియా సంగమం 5వ సంచిక వైభవోపేతంగా జరిగింది. సమాచార భారతి అధ్యక్షులు గోపాల్ రెడ్డి స్వాగతోపన్యాసంలో భారతీయ మూలాలు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సోషల్ మీడియా సంగమం ద్వారా ఏ ఫలితాలు ఆశించామో ఆ దిశగానే ఈ సంచిక కూడా జరుగుతోందని తెలిపారు. మూడు అంశాలు ప్రాతిపదికగా సదస్సులు నిర్వహించారు. ఆత్మ నిర్భరత అంశంపై జి .ఎన్ . రావు, శ్రీమతి కాశీనాథుని శిరీష విలువైన విషయాలు తెలియజేశారు . ప్రాధాన్యత రంగాల్లో ఆత్మ నిర్భరత యొక్క ఆవశ్యకతని జి .ఎన్ . రావు వివరిస్తూ .. భారతదేశం రక్షణ రంగంలో సాధించిన విషయాలను వివరంగా తెలియజేశారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరిశోధన చేసిన శ్రీమతి కాశీనాథుని శిరీష మాట్లాడుతూ సోషల్ మీడియాను అవసరమైన అంశాలలో ఎలా ఉపయోగించుకోవాలో , అనవసరమైన సమాచారాన్ని ఎలా నిరసించాలో వివరించారు. నారేటివ్ సదస్సులో దేవగిరి ప్రాంతంలోని బంజారా కుంభమేళా నిర్వహణ ఏ విధంగా బంజారాలను ఐక్యం చేసిందో భారతీయ