Posts

Showing posts from April, 2023

రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కోరం అశోక్ రెడ్డి

Image
 రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా కోరం అశోక్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సం సందర్బంగా రెండవ అంతస్తులోని తన సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కార్యాలయంలో మధ్యాహ్నం 1.50 గంటల ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని జిల్లా పౌర సంబంధాల అధికారులకు వాహన సౌకర్యం కల్పించేందుకై అనుమతినిమిత్తం ఆర్థిక శాఖకు పంపే తొలి ఫైలు పై సంతకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమాచార, పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ గా, రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా, E.O. కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ రెడ్డిని సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, కె.వెంకట రమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధుసూదన్, హష్మీ, సి.ఐ.ఇ రాధాకిషన్, ఆర్.ఐ.ఇ జయరాంమూర్తి, ఎఫ్.డి.సి. ఇ.డి కిషోర్ బాబు తదితరులు అభినందించారు.

ఘనంగా శ్రీ శ్రీ శ్రీ విశ్వజనని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు

Image
  ఘనంగా శ్రీ శ్రీ శ్రీ విశ్వజనని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు నల్గొండ: ఆదివారం రోజున పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో స్థానిక వాసవి భవన్ యందు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, అమ్మవారికి పంచామృతాభిషేకములు, అనంతరం సామూహిక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యమా మురళి, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భూపతి రాజు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుబ్బా శ్రీనివాస్, భాస్కర్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసం శేకర్, వందనపు వేణు, అర్థం శ్రీనివాస్, నీలా వెంకన్న, మిరియాల మహేష్, తెలుకుంట్ల శ్రీకాంత్, వనమా రమేష్, తాళం గిరి, నూనె కిషోర్, కోటగిరి రామకృష్ణ, గజవెల్లి సత్తయ్య, ప్రొద్దుటూరు రాజలింగం, శీలా శేకర్, బండారు హరి, పారెపల్లి, వెంకన్న, నాంపల్లి భాగ్య, మిరియాల రాధ, సోమా దీప్తి, కాసం శోభారాణి, యమా శారద, తల్లం కల్పన, మిరియాల అనూష, మరియు పట్టణ ఆర్యవైశ్య బంధువులు, మిత్రులు, అందరూ అమ్మవారి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.

నల్గొండ జిల్లా IVF నూతన కార్యవర్గం

Image
 నల్గొండ జిల్లా IVF నూతన కార్యవర్గం నల్గొండ: నల్గొండ జిల్లా IVF నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులుగా ప్రముఖ వ్యాపార వేత్త రేపాల భద్రాద్రి ని రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ ఎంపిక చేశారు. కార్యదర్శి గా నూనె కిషోర్, కొశాదికారిగా గోవిందు బాలరాజు, జాయింట్ సెక్రటరీ తేలుకుంట్ల వీరయ్య, మహిళ విభాగ్ జిల్లా అద్యక్షురాలుగా కొమిరిశెట్టి రమాదేవి, కార్యదర్శి గా వందనపు జ్యోతి, కోశాధికారిగా వనమా శ్రీదేవి, జాయింట్ సెక్రటరీ నల్గొండ సుమలత, యువజన విభాగ్ జిల్లా అధ్యక్షులుగా తేలుకుంట్ల శ్రీకాంత్, కార్యదర్శి గౌరు శ్రీనాథ్, కోశాధికారిగా మిర్యా ల మహేష్ లు ఎంపికైనట్లు రాష్ట్ర నాయకులు కోటగిరి దైవాదీనం తెలిపారు.

కన్నీరు చుక్క కారిస్తే కాదు.. చెమట ముక్క చిందిస్తే.. చరిత్ర రాయగలవని తెలుసుకో...

Image
  శ్రీ సాహిత్య చార్య మహాకవి,అభ్యుదయ సాహిత్యానికి యుగకర్త శ్రీ శ్రీ జయంతి సందర్భంగా :- ==== ఆ సృష్టి లో చలనం ఉన్నది ఏదీ ఆగి పోకూడదు పారే నది... విచే గాలి.. ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు  అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తున్నది ఆ నెత్తురుతో సహా ఏదీ ఆగిపోకుడదు.... పుట్టడం గొప్పకాదు. బతకడం గొప్ప మంచి బతకడం గొప్పగాదు.. మంచిని పంచి బతకడం గొప్ప నీకు నువ్వే గొప్ప అనుకోకు  నీగురించి నలుగురు..  గొప్పగా చెప్పుకుంటే గొప్ప.. కుదిరితే పరుగెత్తు... లేకపోతే నడు అది చేత కాకా పోతే పాకుతూ పో.. అంతే కానీ... ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు.. ఏదీ తనంతట తాను నీదరి చేరదు  ప్రయత్నపూర్వకంగా సాధిస్తేనే విజయం నీ సొంతమవుతుంది. చదివితే ఇవి పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రా లుగా తెలుగు సాహిత్యంలో తన కలంతో కథంతొక్కి సిరా చుక్కలతో అగ్రి జ్వాలలు కురిపించిన మహాకవి శ్రేణీ 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించి, ఈ శతాబ్దం నాది అని చెప్పుకున్న దమ్మున్న కవి శ్రీ శ్రీ. అభ్యుదయ కవి , విష్ణవ కవిగా సాంప్రదాయ చందో బద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన ప్రజాకవి శ్రీ శ్రీ.శ్రీ శ్రీ అసలుపేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన హేతువాది, నాస

I & PR కమీషనర్ గా అశోక్ రెడ్డి

Image
 I & PR కమీషనర్ గా అశోక్ రెడ్డి కె. అశోక్ రెడ్డి IAS(2014) ని సమాచార పౌర సంబధాల శాఖ కమీషనర్ మరియు Ex.Officio Spl. కార్యదర్శి గా ప్రభుత్వ నియమిస్తూ జివో జారీచేసింది. ఇప్పటి వరకు ఇయన ఆర్థిక మంత్రి OSD గా పని చేశారు. ఇప్పటి వరకు భాద్యతలు నిర్వహిస్తున్న అరవింద్ కుమార్,IAS(1991)ని పూర్తి గా రిలీవ్ చేసింది.

ఘనంగా ఐవిఎఫ్ తెలంగాణ నూతన కార్యాలయం ప్రారంభం

Image
  ఘనంగా ఐవిఎఫ్ తెలంగాణ నూతన కార్యాలయం ప్రారంభం హైదరాబాద్, నారాయణ గూడ కుబేర ఎస్టేట్ లో నూతనంగా నిర్మించిన IVF- తెలంగాణ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం మరియు ఐవీఎఫ్ బెనారస్ ఆనంద నిలయం బ్రోచర్ ఆవిష్కరణ మహోత్సవమునకు ముఖ్య అతిధులుగా ఐవీఎఫ్ చీఫ్ అడ్వయిజర్, మాజీ పార్లమెంట్ సభ్యులు టి.జి.వెంకటేష్, ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్ మరియు అతుధులుగా ఐవీఎఫ్ కేంద్ర కమిటీ సీనియర్ కార్యనిర్వాహక అధ్యక్షులు గంజి రాజమౌళి గుప్త మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ మరియు ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ చీఫ్ అడ్వయిజర్, మాజీ పార్లమెంట్ సభ్యులు టి.జి.వెంకటేష్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఊర్లో బడి, గుడి, అన్నదానం, ఎటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు అయినా చేయడానికి ఆర్యవైశ్య సోదరులు, మహిళలు ముందుంటారని, సామాజిక సేవా కార్యక్రమం ఏదైనా కావచ్చు తెలంగాణ రాష్ట్రం లో IVF నాయకులు ఆర్యవైశ్యులు ముందు ఉంటారని అన్నారు.ఈ సందర్భంగా.ల ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు అ

జర్నలిస్టు లను మోసం చేసిన కేసీఆర్ కు ప్రజలను మోసం చేయడం ఓ లెక్కా: ఎమ్మెల్యే రఘునందన్ రావు

Image
 జర్నలిస్టు లను మోసం చేసిన కేసీఆర్ కు ప్రజలను మోసం చేయడం ఓ లెక్కా: ఎమ్మెల్యే రఘునందన్ రావు   బిఆర్ఎస్ వ్యతిరేక వార్తలు రాయండి మూడు రోజుల్లో కేసీఆర్ జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరిస్తారు. ఆల్లం బెల్లం అని చెప్పే పెద్ద మనిషి కుర్చీకి పవర్ లేదంటూ జర్నలిస్టులకు న్యాయం చేయనివారు  ఎర్ర బుగ్గ కారులో ఎందుకు తిరుగుతున్నారు అని  దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు  మండి పడ్డారు.అన్ని వర్గాలను మోసం చేసినట్లే కెసిఆర్ జర్నలిస్ట్ లను మోసం చేశారన్నారు.  ఇదిగో ఇల్లు అదిగో స్థలాలు జర్నలిస్టులో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జర్నలిస్టులు అధైర్య పడవద్దని ఏక తాటిగా ఉంటే ప్రభుత్వమే దిగివచ్చిందన్నారు.  ప్రభుత్వం చేపట్టి ఆత్మీయ సమ్మేలాన్ని పత్రికల్లో ప్రచూరించకుంటే పత్రికల విలువ తెలుస్తుంది అన్నారు.  మాస్టర్ ప్లాన్ లో రైతులు ఏ విధంగా  ఉద్యమంలో చేపెట్టారు అదే స్ఫూర్తిలో జర్నలిస్టులు ఏకతాటిపై వచ్చి స్థలాల కోసం పోరాడాలన్నారు.   తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సకల జనులను  ఏకం చేసి చైతన్య వంతమైన  పోరాట ఉద్యమన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన బాధ్యతగల వ్య

*కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్*

Image
 *కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్* ఈ నెల 23న ఎల్లుండి మ.3.30 గం.కు శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. మధ్యాహ్నం 3.50 గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గం.కు ఆస్కార్‌ విజేతలతో అమిత్‌షా తేనీటి విందులో పాల్గొంటారు సాయంత్రం 5.15 గం.కు నోవాటెల్ నుంచి చేవెళ్లకు అమిత్ షా వెళ్తారు. అక్కడ పార్లమెంటు ప్రవాస్ యోజనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో సాయంత్రం 6 గంటలకు అమిత్ షా పాల్గొంటారు. అనంతరం రాత్రి 7.50 గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమవుతారు.

ఎన్జీ కాలేజ్ లో స్టూడెంట్ వర్సెస్ లెక్చరర్స్...

Image
  నల్గొండ : ఎన్జీ కాలేజ్ లో స్టూడెంట్ వర్సెస్ లెక్చరర్స్... రెండు రోజుల క్రితం ఓ విద్యార్దిని తో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ.... ఓ లెక్చరర్ పై చేయి చేసుకున్న విద్యార్దిని పేరెంట్స్.... అకారణంగా దాడి చేశారని నిరసిస్తూ...విధులు బహిష్కరించి ధర్నా చేపట్టిన లెక్చరర్లు... ధర్నాను చిత్రీకరిస్తున్న ఓ పత్రికా ఫోటోగ్రాఫర్ పై దాడికి యత్నించిన లెక్చరర్లు... ఘటనపై విచారణ చేపట్టిన టూటౌన్ పోలీసులు....

వచ్చిన తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే :TJU రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు

Image
 వచ్చిన తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే :TJU రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు వచ్చిన తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణ జర్నలిస్టులే అని కోరుకున్న తెలంగాణ కోసం మరోమారు ఉద్యమం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు అన్నారు. నాగారం ప్రెస్ క్లబ్ లో వివిధ పత్రికల్లో ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు టీజేయులో జాయిన్ అయిన సందర్భంగా హాజరయ్యారు. తోలి, మలి తెలంగాణ ఉద్యమాలు జర్నలిస్టుల వల్లే ఉవ్వెత్తున ఎగిసాయని అలాంటి జర్నలిస్టులను మోసం చేసిన కేసీఆర్ ఉద్యమకారులను ప్రజలను మోసం చేయడం ఆయనకు లెక్క కాదన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొంటేనే జర్నలిస్టులకు వచ్చే హక్కులు వస్తాయని జర్నలిస్టులకు రాజకీయ కోణం ఉండాలన్నారు. జర్నలిస్టుల బాగుకోరే ప్రభుత్వం ఏర్పాడాలని అలాంటి ప్రభుత్వానికి మనం మద్దతు తెలపాలని అన్నారు. 9 సంవత్సరాలుగా ఇవిగో ప్లాట్లు అవిగో ప్లాట్లు అంటూ కెసిఆర్ జర్నలిస్టులను ఆట పట్టిస్తున్నాడని అది ఇంకా కొంతమంది జర్నలిస్టులకు అర్థం కావడం లేదన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ ఇంటి స్థలాలు . హెల్త్ కార్డు

ఎయిర్‌పోర్ట్ మెట్రోకు ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌ల ఎంపిక

Image
  ఎయిర్‌పోర్ట్ మెట్రోకు ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌ల ఎంపిక           Hyderabad: ఎయిర్‌పోర్ట్ మెట్రోకు జనరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ గా Systra, RITES, DB ఇంజనీరింగ్ సంస్థల కన్సార్షియంను ఎంపిక చేసినట్లు MD, HAML శ్రీ ఎన్వీయస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కన్సార్షియంలోని మూడు సంస్థలు ప్రజా రవాణారంగంలో ముఖ్యంగా మెట్రో రైళ్ల నిర్వహణలో విశేష అనుభవం గల సంస్థలుగా ప్రఖ్యాతి చెందాయి. Systra సంస్థ - ఫ్రాన్స్, RITES - భారతీయ రైల్వేలు, DB – జర్మనీ దేశాలలకు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ దిగ్గజాలుగా ప్రఖ్యాతి. జనరల్ కన్సల్టెంట్ ఎంపిక కోసం మొత్తం ఐదు అంతర్జాతీయ కన్సార్టియాలు పోటీపడ్డాయి. కాగా, Systra నేతృత్వంలోని కన్సార్టియం విజేతగా నిలిచింది. ఈ కన్సార్టియం సాంకేతికంగా అత్యధిక మార్కులు పొందడంతో పాటు, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సేవలను అందించేందుకు గాను రూ. 98.54 కోట్లు కోట్ చేసినట్లు, ఇది పోటీలో పాల్గొన్న ఇతర సంస్థలకన్నా తక్కువ అని ఎండి శ్రీ ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్వేలోని పలు విభాగాలలో నిష్ణాతులైన 18 మంది ఇంజనీరింగ్ నిపుణులను అలాగే క్షేత్ర స్థాయిలో మరో 70 మంది సీనియర్ ఇంజనీర్లు, తదిత

చిన జీయర్ స్వామికి VHP శుభాకాంక్షలు

Image
  చిన జీయర్ స్వామికి VHP శుభాకాంక్షలు త్రిదండి చిన జీయర్ స్వామి కి విశ్వ హిందూ పరిషత్ (VHP) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును అందుకున్న శుభ సందర్భంగా స్వామిని ఆత్మీయంగా సత్కరించింది. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకొని, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన చిన జీయర్ స్వామి బుధవారం తిరిగి వచ్చారు. గురువారం విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు వెళ్లి ముచ్చింతల లోని స్వామివారి ఆశ్రమంలో ఆత్మీయంగా కలిశారు. స్వామి ధార్మిక, సామాజిక సేవను భారత ప్రభుత్వం గుర్తించి అవార్డు అందజేయడం గొప్ప విషయమని విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యకారిణి సభ్యులు రాఘవులు అన్నారు. విశ్వహిందూ పరిషత్ నాయకులు లక్ష్మి శేఖర్, పగుడాకుల బాలస్వామి, డివిఎస్ఎన్ మూర్తి, పతంజలి ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రావు , సురేష్, తదితరులు స్వామీజీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

దళిత యువకుడు నవీన్ ది ముమ్మాటికి పరువు* *హత్యే -.పాలడగు నాగార్జున*

Image
  *దళిత యువకుడు నవీన్ ది ముమ్మాటికి పరువు*  *హత్యే* *ఫాస్ట్రాక్ కోర్టు* *ఏర్పాటు చేయాలి* *నిష్పక్షపాతమైన విచారణ చేపట్టాలి* *దోషులను కఠినంగా శిక్షించాలి* *కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున* నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో దళిత యువకుడైన ఇరిగి నవీన్ ను అతి దారుణంగా కుల దురాహంకారంతో హత్య చేసినారని ఇది ముమ్మాటికి పరువు హత్యేనని *కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున* అన్నారు. నవీన్ పరువు హత్య విషయమై సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాధితుని తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో కలిసి *నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ క్రిష్ణా రెడ్డిని, జిల్లా ఎస్పీ అపూర్వరావు* వేరువేరుగా కలిసి కేసును పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా చూడాలని  వినతిపత్రం ఇచ్చి విన్నవించడం జరిగింది. అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *నాగార్జున* మాట్లాడుతూ కేసు లో సత్వరమే విచారణ పూర్తి చేసి ముద్దాయిలకు కఠిన శిక్షలు పడేందుకు ప్రత్యేక న్యాయమూర్తిని(పాస్ట్రాక్ కోర్టు), ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలన్నారు, పరువు హత్యగా కేసు నమ

నాణ్యత పరీక్షలు లేకుండా గోడౌన్లకు దిగుమతి అవుతున్న బియ్యం పై విచారణ చేపట్టాలి - హైకోర్టు న్యాయవాది సోమవరపు డిమాండ్

Image
   నాణ్యత పరీక్షలు లేకుండా గోడౌన్లకు దిగుమతి అవుతున్న బియ్యం పై విచారణ చేపట్టాలి - హైకోర్టు న్యాయవాది సోమవరపు డిమాండ్  నాణ్యతను ధృవీకరించకుండ మరియు పరీక్షలు నిర్వహించకుండ  రైస్ గోడౌన్లకు దిగుమతి చేస్తున్న సిఎంఆర్ బియ్యంపై విజిలెన్స్ అధికారులతో విచారణ  జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ హైకోర్టు న్యాయవాది సోమవరపు సత్యనారాయణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.  ఈరోజు సూర్యాపేటకు చెందిన కొందరు మిల్లర్లు అధికారులతో కుమ్మక్కై సేకరించిన రేషన్ బియ్యాన్ని సీఎంఆర్ బియ్యంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బాదలాపురం గోడౌన్ కు దిగుమతి చేస్తున్నట్లు తెలిసిందని దాదాపు 115 ఏ సి కె ల బియ్యాన్ని గోడౌన్ లో దింపినట్లు దాదాపు మరో 60 లారీలు దింపడానికి వెయిటింగ్ చేస్తున్నాయని ఈ విషయంపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, నాణ్యతా పరీక్షలు చేయకుండా బియ్యాన్ని డెలివరీ తీసుకుంటున్న అధికారుల పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  గత సంవత్సరం కూడా సూర్యాపేట మిల్లర్లు నల్లగొండ దగ్గర ఉన్న దుప్పలపల్లి

*చిన్నపత్రికలకు డిస్ప్లే కలర్ ప్రకటనలు ఇవ్వాలి*

Image
  *చిన్నపత్రికలకు డిస్ప్లే కలర్ ప్రకటనలు ఇవ్వాలి* హైదరాబాద్:   భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈనెల 14 న సమాచార శాఖ తరపున మంజూరు చేసిన ప్రకటనల విషయంలో చిన్న పత్రికలపట్ల వివక్ష చూపించింది. సమాచార శాఖ కక్షపూరితంగా వ్యవహరించి కేవలం బ్లాక్ అండ్ వైట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ప్రాంతీయ పత్రికల ఎడిటర్లు ఈరోజు మాసాబ్ ట్యాంక్ లోని సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో ఆందోళన చేశారు. కార్యాలయం ముందు బైఠాయించారు. సమాచార శాఖ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరకు డైరెక్టర్ పిలవడంతో ఆయనతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోరుతూ ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. తెలంగాణ చిన్న తరహా దిన మాస పత్రికల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది పెండింగ్లో ఉన్న చిన్న పత్రికల సమస్యలను పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం రోజు మా పత్రికలకు ఇవ్వకపోవడం అన్యాయమని సదరు వినతి పత్రంలో జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొంది. ఈనెల 30న జరిగే సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రాంతీయ పత్రికలకు మ్యాగజైన్లకు కలర్ యాడ్ ఇచ్చి

నిరుద్యోగ మార్చ్

Image
  *హనుమకొండ జిల్లా* *నిరుద్యోగ మార్చ్ సభ* లో *బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు* *బండి సంజయ్ కుమార్*కరీంనగర్ ఎంపీ*  *కామెంట్స్* అయన మాటల్లో... పోలీసుల వలయం దాటి వచ్చిన వీరులు.. మీరు.. కేసీఆర్ కు బలగం కవిత, కేటీఆర్..నన్ను ఇక్కడే అరెస్ట్ చేసారు.. తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన వీరుల గడ్డ ప్రొఫెసర్ జయశంకర్ పుట్టిన గడ్డ అన్న సామ జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డ అన్న, నిరుద్యోగ మార్చు కు రైతులు, వచ్చారు అన్న,  ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారు.. బీజేపీ పార్టీ కి రాజకీయాలు అవసరం లేదు.నిరుద్యోగులకు 1లక్ష ఇవ్వాలి. పేపర్ లీకేజీ అయితే బండి సంజయ్, ని అరెస్ట్ చేసారు. మా అత్తమ్మ దశదిశ కర్మ ఉంటే అరెస్ట్ చేశారు .  రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి ఉంటే కూడా అరెస్ట్ చేసారు. ని కొడుకు ట్విట్టర్ టిల్లు శాఖ , పేపర్ లికెజి అయితే బర్తరఫ్ చేయకండ ఉన్నారు. రాజయ్య ను బర్తరఫ్ చేసిన విధంగా బర్తరఫ్ చేయాలి. ఈడీ దర్యాప్తు అంటే కవిత కు కాలుకు గాయం, జ్వరం వస్తుంది ఈడీ బీజేపీ సంస్థ నా ?  నిరుద్యోగులకు నోటిఫికేషన్ రాగానే విద్యార్థులు లైబ్రరీ లో చదువు కోసం పోతున్న విద్యార్థులు కడుపు మాడ్చుకొని చదువుకున్నారు. బీఆర్ ఎస్ పార

నారాయణపేట జిల్లా కలెక్టర్ పై DOPT కి VHP ఫిర్యాదు

Image
  నారాయణపేట జిల్లా కలెక్టర్ పై DOPT కి VHP ఫిర్యాదు నారాయణపేట జిల్లా కలెక్టర్ పై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రి జితేంద్ర సింగ్ కు విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. అదేవిధంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీని పలుమార్లు అపాయింట్మెంట్ కోరినా స్పందించకపోయిన విషయాన్ని కూడా ఆ ఫిర్యాదు లో ప్రస్తావించినట్లు తెలిపారు. జాతీయ జెండాను అవమానపరిచిన ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన విశ్వహిందూ పరిషత్ నాయకులపై నారాయణపేట జిల్లా కలెక్టర్ దురుసుగా ప్రవర్తించి, అమర్యాదగా మాట్లాడిన తీరును తప్పుపడుతూ డి ఓ పి టి కి ఫిర్యాదు చేశారు. గత జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూజ చేసే విషయంలో మరియు జాతీయ జెండా ఆవిష్కరణ చేసే విషయంలో అంగన్వాడీ టీచర్ ఎస్తేర్ ప్రవర్తన భారత జాతి వ్యతిరేకతకు నిదర్శనంగా ఉన్నదని, ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్దామని జనవరి 27వ తేదీన విశ్వహిందూ పరిషత్ నేతలు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని దీంతో కలెక్ట

చర్లపల్లి లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, 132 వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి

Image
  చర్లపల్లి లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, 132 వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ పట్టణ బిజెపి ఉపాధ్యక్షుడు బద్దం నాగేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కిందని సగర్వంగా ప్రజానీకానికి తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపాలిటీ కార్మికులచే కొబ్బరికాయ కొట్టించారు. అదేవిధంగా ప్రజలకు మున్సిపాలిటీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమానికి బిజెపి ఓబీసీ నల్లగొండ పట్టణ ఉపాధ్యక్షుడు సైదులు గౌడ్, ఏర్పుల వెంకన్న, జి నాగేష్ గౌడు, కే రామకృష్ణ నేత, రాములు మధు కత్తుల కృష్ణ నాగరాజు గణేషు శీను మున్సిపాలిటీ కార్మికులు, బిజెపి కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

ఓబీసీ మోర్చా అధ్వర్యంలో. ఇంటి ఇంటి కి మోడీ బిసిలకు చేకూర్చిన పథకాలు

Image
 గూడచారి న్యూస్ చిట్యాల= నకిరేకల్ నియోజకవర్గo చిట్యాల మండలం వెంబాయి గ్రామంలో పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా భరోసా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బిజేపి ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండ భవాని ప్రసాద్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు పాల్గొని మాట్లాడారు పల్లె పల్లెకు ఓబీసీ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు చేకూర్చిన ప్రయోజనాలు గురించి తెలియజేయడం జరిగింది. వెంబాయ్ గ్రామంలో ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బీసీలకు ప్రవేశపెట్టిన పథకాలు లబ్ధి పొందిన ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారని తెలియజేస్తూ వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ 102 వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ కి రాజ్యాంగ హోదాను అందిస్తుందన్నారు, 105వ రాజ్యాంగ సవరణ చట్టం, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి రాష్ట్రాల ఓబిసి జాబితాను రూపొందించే హక్కు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు కల్పించిన కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేం

నల్గొండ జిల్లా కేంద్రంలో అర్థరాత్రి దొంగల ముఠా హల్చల్...

Image
  నల్గొండ జిల్లా కేంద్రంలో అర్థరాత్రి దొంగల ముఠా హల్చల్... బృందావన్ కాలనీ,విశ్వనాథ కాలనీలో దొంగల సంచారం.... లక్ష్మి నివాస్ అపార్ట్ మెంట్ లో నాలుగు ఇళ్ళ తాళాలు పగలగొట్టి వెళ్ళిన దొంగలు.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దొంగల ముఠా కదలికలు.... రాత్రి వేళల్లో మారణాయుధాలతో తిరుగుతున్నట్టు సమాచారం... అంతర్ రాష్ట్ర దొంగల ముఠాగా ఖాకీల అనుమానం...

బండి సంజయ్ వ్యాఖ్యలపై వరంగల్ సిపి కామెంట్స్

Image
  *బండి సంజయ్ వ్యాఖ్యలపై వరంగల్ సిపి కామెంట్స్ :*  వాళ్ళ ఆరోపణలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. సెటిల్మెంట్ చేసినట్టు చూపిస్తే ఉద్యోగం వదిలేస్తా . సత్యం బాబు కేసుపై బండికి పూర్తిగా అవగాహన లేదు.  సత్యం బాబు కేసు నేను హ్యాండిల్ చేయలేదు.  నిందితులుగా ఉన్నవాళ్లు దర్యాప్తును తప్పు పట్టడం సాధారణం . గతంలో చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు. రఘునందన్ కాల్ డేటా విషయంలో కొన్ని తెలుసుకోవాలి . దర్యాప్తును రాజకీయ కోణంలో చూడకూడదు . బండి సంజయ్ తో నాకేమైనా గట్టుపంచాయతీ ఉందా . బండి సంజయ్ ఫోన్ మా దగ్గరికి రాలేదు వరంగల్ సిపి . రాత్రి 1.14 గంటలకు లాస్ట్ కాల్ ఉంది. బండి లాస్ట్ లొకేషన్ బెజ్జంకి అని చూపిస్తుంది . మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి  బండి కోపంగా ఉన్నారు. పరువు నష్టం దావా వేసుకోవచ్చు.  నేను మాత్రం పరువు నష్టం దావా వేయను. దర్యాప్తును తప్పు పట్టడం సర్వసాధారణం. దర్యాప్తును రాజకీయ కోణంలో చూడకూడదు కోర్టుకు ఆధారాలు సమర్పిస్తాం వరంగల్ సీపీ

ఏసీబీకి వలలో సబ్ రిజిస్ట్రార్

Image
  అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి అధికారిని పట్టుపడింది. మంగళవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ల కోసం పూదరి శ్రీనివాస్ నుండి 60వేల రూపాయలు తీసుకుంటుండగా పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ దేవనగిరి నిర్మల, అటెండర్ శ్రీనివాసులను ఏసీబీ డీఎస్పీ భద్ర ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో సైతం డాక్యుమెంట్ల కోసం నగదు తీసుకొని మరోసారి డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా ఈరోజు పట్టుకున్నారు.

బిజెపి ఓబిసి మోర్చ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి

Image
  బిజెపి ఓబిసి మోర్చ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి నల్గొండ: మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆనంతరం జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్లో గల జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సదర్భంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిభా పూలే ఆయన ఆశయాలను సాధించే దిశగా మనం అందరం పని చేయాలి అని అన్నారు. మహిళలకు విద్య అవసరం అని తన భార్యకు చదువు చెప్పించిన వ్యక్తి పూలే అని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు సాధించాలి అని అన్నారు.ఆయన గొప్ప సంఘ సంస్కర్త  అన్నారు.దేశానికి ఆయన మహాత్ముడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగొని శ్రీనివాస్ గౌడ్ గారు,జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ గారు,ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు కొండ భవాని ప్రసాద్ ,జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి చారి, జిల్లా అధికార ప్రతినిధి బొగరి అనిల్ కుమార్

ఏకగ్రీవంగా ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్ ఎన్నిక

Image
  ఏకగ్రీవంగా ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్  ఎన్నిక హైదరాబాద్ , ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి గుప్త మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గార్ల అధ్యక్షత న జరిగిన సమావేశంలో ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ సభ్యులు ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతారు.ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ గా గంజి రాజమౌళి గుప్త గారిని, జనరల్ సెక్రటరీ గా బొగ్గారపు దయానంద్ గారిని, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ,గారిని ఆర్గనైసింగ్ సెక్రటరీ గా ఎన్నుకున్నారు.ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్ ట్రెసరర్ గా గెల్లి ప్రభాకర్ గారిని,వైస్ చైర్మన్ గా సుబ్బారాయుడు, వైస్ ప్రెసిడెంట్ గా వాసు, రాఘవేంద్ర, అడ్వైసర్ గా గౌరు శ్రీనివాస్, గెల్లి రమేష్, గార్లని ఎన్నుకోవడం జరిగింది.

తెలంగాణలో వ్యాపారులకు శుభవార్త...* ఇకపై 24X7 షాపులు

Image
 తెలంగాణలో వ్యాపారులకు శుభవార్త... * ఇకపై 24X7 షాపులు తెరిచి వ్యాపారం చేసుకోవచ్చు.... *తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988* కు సవరణ చేసిన ప్రభుత్వం.... ఏడాదికి 10వేలు చెల్లించి అనుమతి పొందాలి.

అంబేడ్కర్ జాతర జయప్రదం చేయండి - పాలడుగు నాగార్జున

Image
*ఏప్రిల్ 28న పూలే అంబేడ్కర్ జాతర నల్లగొండలో జయప్రదం చేయండి* - పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పిలుపు        మహాత్ముల జయంతుల సందర్భంగా ఏప్రిల్ 10 నుండి 14 వరకు నియోజకవర్గస్థాయిలో పూలే అంబేడ్కర్ సందేశ్ యాత్ర భారత రాజ్యాంగ రక్షణ యాత్ర పేరిట గ్రామాల్లో పర్యటనలు చేయనున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. ఈరోజు దొడ్డి కొమరయ్య భవనంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సమావేశం కోడి రెక్క మల్లయ్య అధ్యక్షతన జరిగింది.   ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మహనీయుల స్మరించుకుంటూ ఏప్రిల్ మాసమంతా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్త ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న మనుధర్మ శాస్త్రాన్ని ఆధునిక భారత రాజ్యాంగం అని చెప్పడం దుర్మార్గమైన విషయమన్నారు. ప్రజలు ప్రజాతంత్ర వాదులు సామాజిక సంఘాలు ఖండించాలని పిలుపునిచ్చారు.  ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కర్తవ్యాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని ఏప్రిల్ 28న నల్లగొండ అంబేద్కర్ కల్చరల్ అడిటోరియంలో జరిగే పూలే అంబేడ్కర్ జాతరకు వేలాదిగ

సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే ఇంత వరకు కొనసాగా- టీఎస్ టీడీసీ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా

Image
  సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే ఇంత వరకు కొనసాగా-   టీఎస్ టీడీసీ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా  హైదరాబాద్:   ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగానని, తోడబుట్టిన సోదరుడిగా యువనేత, మంత్రి కేటీఆర్ తన వెంట నిలిచారని, టూరిజం శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనకు ఎంతగానో సహకరించారని మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తనపట్ల బీఆర్ఎస్ పెద్దలు చూపిన అభిమానం ఎప్పటికీ మరచి పోలేనని, టూరిజం అధికారులు అందించిన సహకారంతో టూరిజం అభివృద్ధికి కృషి చేశానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. టూరిజం శాఖ నూతన చైర్మన్ గా నియమితులైన గెల్లు శ్రీనివాస్ కు ఈ సందర్భంగా ఉప్పల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ఆర్యవైశ్యులకు మేలు జరిగిందని, అన్నివర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోెందని, కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం ఖాయమన్నారు. పాలనాధక్షుడైన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని ఆయన తెలిపారు

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్

Image
  ‘తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్’ చైర్మన్ గా... గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం గారి నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.

రాజేంద్రనగర్ బండ్లగూడ లో రెండు మిస్సింగ్ కేసులు

Image
  రాజేంద్రనగర్ బండ్లగూడ లో రెండు మిస్సింగ్ కేసులు రాజేంద్రనగర్ బండ్లగూడ లో గాయత్రి అనే యువతి మిస్సింగ్ కలకలం.  బజార్ కు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిన యువతి. రాత్రి ఎంతకీ తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల, బంధువులకు ఫోన్ చేసి వకాబు చేసిన కుటుంబ సభ్యులు.  ఎక్కడా తమ కూతురు ఆచూకీ తెలియక పోవడంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు.  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాప్స్. **************************** రాజేంద్రనగర్ బండ్లగూడ డాక్టర్స్ కాలనీలో 9 దవ తరగతి విద్యార్థి కిడ్నాప్ కలకలం.  ఇంట్లో నుండి కనిపించకుండా పోయిన విద్యార్థి. చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు పరుగులు.  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.  ఓ ఆటో లో వెళ్లినట్లు సమాచారం. సి.సి టివీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్న కాప్స్.

*వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం : ఎస్పీ అపూర్వ రావు*

Image
 *వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం : ఎస్పీ అపూర్వ రావు* - - జగిని దంత వైద్య శాల, జగిని టెక్స్ టైల్స్ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ముందు చలి వేంద్రం ఏర్పాటు - - సమాజ సేవలో నిరంతరం ముందున్న జగిని సంస్థలు నల్లగొండ : వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం జగిని వారు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు జిల్లా ఎస్పీ అపూర్వా రావు. జగిని టెక్స్ టైల్స్, జగిని డెంటల్ కేర్ సంస్థల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించి ఆమె మాట్లాడుతూ సమాజ సేవా కార్యక్రమాలలో జగిని సంస్థల అధినేత జగిని వెంకన్న నిరంతరం ముందుండడం అభినందనీయమన్నారు. వేసవిలో చలివేంద్రాల ఏర్పాటుతో పాటు బారికేడ్లు ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతూ పట్టణ ప్రజల మన్ననలు అందుకుంటున్నారని అభినందించారు. వేసవి కాలంలో రోడ్లపై వెళ్లే పాదచారులు, వాహనదారులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఎస్పీ కార్యాలయానికి వచ్చే ప్రజలకు చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రాబోయే రోజులలో ఎండలు మరింత పెరిగే పరిస్థితి ఉన్న క్రమంలో ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్య పరిరక్షణ చూసుక

పదవ తరగతి పరీక్ష లీకేజీ కారణానికి ముఖ్య కారకుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందప్పని విచారిస్తున్న తాసిల్దార్

Image
పదవ తరగతి పరీక్ష లీకేజీ కారణానికి ముఖ్య కారకుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందప్పని విచారిస్తున్న తాసిల్దార్  తాండూరు 10వ తరగతి ఎగ్జామ్ పేపర్ బైటికి వెళ్లిన ఘటనలో ముగ్గురు సస్పెండ్. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, మరోకరిపై వేటు. ఇన్విజిలేటర్ బందప్ప మీద గతంలోను ఆరోపణలు. 2017లో బందప్ప మీద పోక్సో కేసు ఉంది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఓ IAS కు జైలు శిక్ష

Image
  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఓ IAS కు జైలు శిక్ష సిబిఐ కేసుల కోసం, హైదరాబాద్‌లోని డిజిగ్నేటెడ్ కోర్ట్ అప్పటి ప్రభుత్వ కార్యదర్శి కావడి నరసింహ, IAS (AGMUT-1991)కి శిక్ష విధించింది.  మిజోరాంలో అసమాన ఆస్తులు కలిగి ఉన్నందుకు రూ.1,00,000/- జరిమానాతో మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితుడు 15.09.1991 నుండి 19.10.2006 మధ్య కాలంలో మిజోరం ప్రభుత్వ కార్యదర్శి గా పని చేస్తున్నప్పుడు ఆరోపణలపై అయన పై 21.12.2006న అప్పటి CBI కేసు నమోదు చేసింది. తనకు తెలిసిన ఆదాయ వనరులకు పొంతన లేని రూ.32,31,000/- వరకు ఆస్తులు కూడబెట్టారు. విచారణ తర్వాత, నిందితులపై 30.06.2010న ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది. ట్రయల్ కోర్టు పేర్కొన్న నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది.

చంద్రబోసుకు పుట్టిన గడ్డపై ఆత్మీయ సత్కారం

Image
 చంద్రబోసుకు పుట్టిన గడ్డపై ఆత్మీయ సత్కారం ఆస్కార్ అవార్డు పొందిన తెలంగాణా బిడ్డ, సినీ గేయ రచయిత చంద్రబోసుకు పుట్టిన గడ్డపై ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేయడమైనది.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో ఈ నెల 2న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల మైదానంలో జరుప తలపెట్టామని చల్లగరిగె గ్రామస్తులు తెలిపారు. ముందుగా చంద్రబోసు ఇంటి పక్కనే ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వేద ఆశీర్వచనం ఉంటుందని, ఆ తర్వాత అక్కడి నుంచి పాఠశాల మైదానం వరకు భారీ ర్యాలీగా చేరుకుంటారుని, వేదికపై గ్రామస్తులు, బాల్యమిత్రులు, అభిమాన సంఘాల వారు సత్కరిస్తారని తెలిపారు. . ఆ తర్వాత చంద్రబోసు ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమం గ్రామస్తులు, బాల్యమిత్రుల ఆధ్వర్యంలో జరుగుతుందని, చుట్టూ ఉన్న గ్రామాల నుంచి ప్రజలు, చంద్రబోసు అభిమానులు తరలివస్తున్నారని తెలిపారు.