Posts

Showing posts from July, 2022

బీజేపీ ముట్టడి - పోలీసుల అరెస్టు

Image
  https://youtu.be/j7FcXP-YRIM బీజేపీ ముట్టడి - పోలీసుల అరెస్టు నల్గొండ:  వార్డుల్లో ఉన్న రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపాలిటీ బీజేపీ ముట్టడి. బిజెపి పట్టణ నాయకులను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించన పోలీసులు

*7 months* ? *7 countries…* ?

Image
 *7 months* ? *7 countries…* ? వెలుగులోకి వస్తున్న చికోటి ప్రవీణ్‌ బాగోతాలు,.. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో క్యాసినో నిర్వహించిన చికోటి... ? శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌లో క్యాసినో, ? ఇప్పటి వరకు వెయ్యిమందికి పైగా విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించిన ప్రవీణ్?

మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించనున్న బీజేపీ కౌన్సిలర్లు

Image
మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించనున్న బీజేపీ కౌన్సిలర్లు  నల్గొండ పట్టం లోని సమస్యల సాధన కొరకు బీజేపీ  కౌన్సిల్లెర్స్ నేటి మున్సిపల్ కౌన్సిల్  సమావేశాన్ని ను బహిష్కరించి బయటకు రావాలని నిర్ణయించుకున్నారని,    బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం  జరుగుతుందని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ తెలిపారు.  బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంఛార్జీలు,పట్టణం లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ మోర్చాల నాయకులు,మరియు రాష్ట్ర,జిల్లా నాయకులు కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా కోరారు.  

మున్సిపల్ సమావేశానికి 14 మంది TRS రెబల్ కౌన్సిలర్లు గైర్హాజరు..?

Image
 నల్గొండ : నేటి మున్సిపల్ సమావేశానికి 14 మంది TRS రెబల్ కౌన్సిలర్లు గైర్హాజరు..? -నిన్న సాగర్ లో.. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, టౌన్ ప్రెసిడెంట్ పిల్లి రామరాజు ఆధ్వర్యంలో.. 14 మంది కౌన్సిలర్ల సమావేశం. - మున్సిపల్ సమావేశానికి హాజరు కామంటూ తేల్చి చెప్పిన కౌన్సిలర్లు. - పట్టణంలోని వార్డుల అభివృద్ధిని MLA పట్టించుకోవడంలేదని ఆరోపణ.

Casino king Updates:::

Image
 Casino king Updates::: చికోటి ప్రవీణ్ వాట్సాప్‌లో కీలక సమాచారం చికోటి ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసిన ఈడీ లావాదేవీలకు సంబంధించి చికోటి వాట్సాప్‌లో సమాచారం చికోటికి చెందిన 4 బ్యాంకు అకౌంట్లను గుర్తించిన ఈడీ పెద్దమొత్తంలో హవాలా జరిగినట్లు గుర్తింపు సినీ, రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వనున్న ఈడీ 10 మంది సినీ ప్రముఖులతోపాటు 20 మంది ప్రజాప్రతినిధులకు నోటీసులు చికోటి వాట్సాప్‌లో ప్రముఖులతో చాటింగ్ తెలుగురాష్ట్రాలకు చెందిన వ్యాపార, రాజకీయవేత్తలతో పరిచయాలు బిగ్‌డాడీ అడ్డా ప్రమోషన్ కోసం తారలతో ఎర తారలతో తయారు చేసిన ప్రోమోలను వాట్సాప్‌లో ప్రముఖులకు పంపిన చికోటి నగదు లావాదేవీలకు సంబంధించి వాట్సాప్‌లో కీలక డేటా. **** Chikoti farm house lo forest raids.  ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ... కడ్తాల్ సమీపం లోని సాయి రెడ్డి గూడెం లోని  చికోటి ఫార్మ్ హౌస్ లో అటవీ శాఖ అధికారుల తనిఖీలు... నిబంధనలకు విరుద్ధంగా వున్న పాములు, ఆఫ్రికన్ దేశానికి చెందిన ఇగుణ లు ఫార్మ్ హౌస్ లో వుండటానికి వీలు లేదు.. ఫ్రెండ్లీ గా వుండే పక్షులు వుండొచ్చు.. ఫార్మ్ హౌజ్ లో పైథాన్ వుందని సమాచారం వచ్చింది...కానీ అది ఇక్కడ కనిపించట్లేదు

యస్.ఐ నన్ను కొట్టాడు అంటున్న ఆంధ్ర వ్యక్తి? వీడియో చూడండి.

Image
   యస్.ఐ  నన్ను  కొట్టాడు అంటున్న  ఆంధ్ర వ్యక్తి?  వీడియో చూడండి. ⚪️ సూర్యాపేట జిల్లా ◻️  మఠం పల్లి మండలం యస్.ఐ  రవి నన్ను ఇష్టానుసారంగా కొట్టాడు అని ఆంధ్ర వ్యక్తి ఆరోపణలు...❗️ ◻️ ఆయన మాటల్లోనే ఈ వీడియో మీరు చూడండి... ❔️ ◻️ ఘటన కి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

చీకోటి వ్యవహారం తో ఓ వైశ్య బిజినెస్ గ్రూప్ లోని కొందరి నాయకుల గుండెల్లో దడ?

Image
  చీకోటి వ్యవహారం తో   ఓ వైశ్య  బిజినెస్   గ్రూప్ లోని కొందరి నాయకుల గుండెల్లో దడ? క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ కుమార్   ఇళ్లలో  హైదరాబాదులో  ఈ.డీ దాడుల నిర్వహించదాంతో  చీకోటి ప్రవీణ్ కుమార్  తో  సన్నిహితంగా ఉన్న కొంత మంది వైశ్య బిజినెస్ గ్రూప్ సభ్యుల,  తెలంగాణ ఆర్యవైశ్య   నాయకుల, పలు మహాసభ ల నాయకుల ప్రపంచ  సంఘం   నాయకుల   గుండెల్లో గుబులు మొదలయ్యిందని టాక్. మరి వీరి ఆర్దిక  సంబంధాలపై  ఈడీ   దృష్టిపెడుతుందా లేదా అని వేచి చూడాల్సిందే.   సేవ పేరుతో దాతల నుండి సేకరించిన  విరాళాల ల్లో 30 శాతం జేబులో వేసుకుంటున్న నాయకుల పై ఈడీ కి ఫిర్యాదు చేయడానికి  వైశ్య జర్నలిస్టుల్లో  ఒక టీమ్  తయారు అవుతున్నట్లు గుస గుస లు.

మారెడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వర్ రావుకు బిగుస్తున్న ఉచ్చు…!

Image
  మారెడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వర్ రావుకు బిగుస్తున్న ఉచ్చు…! నాగేశ్వర్ రావును హయత్ నగర్ కోర్టు లో హాజరు పరిచిన పోలీస్ లు.. అత్యాచారం, కిడ్నాప్  తరువాత మారేడ్ పల్లీ పీ ఎస్ లో డ్యూటీ చేసిన నాగేశ్వర్ రావు..! డ్యూటీ చేసి , జీ డీ ఎంట్రీ , వెపన్ సరెండర్  చేసింది నాగేశ్వర్ రావెనా, ఆయన చేసినట్టుగా క్రియేట్ చేశాడా  అన్నది నిర్ధారించుకుంటున్న  పోలీసులు. నాగేశ్వర్ రావు స్పెసిమెన్ సిగ్నేచర్స్   తీసుకుంటున్న కోర్టు..

వీఆర్ఏ లకు పేస్కేలు జీఓ విడుదల చేయాలి - పాలడుగు డిమాండ్

Image
  *వీఆర్ఏ లకు పేస్కేలు జీఓ విడుదల చేయాలి*   *-- పాలడుగు నాగార్జున* సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిమాండ్  *నల్లగొండ తహసీల్దార్ ముందు దీక్ష*       నల్గొండ: ఎండా అనేక వాననకా రేయింబవళ్లు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే వీఆర్ఏలకు ప్రభుత్వం పే స్కేలు  జీఓ ను వెంటనే విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.            ఈరోజు నల్లగొండ తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ ఏ లా మూడవ రోజు దీక్షకు మద్దతుగా పాల్గొని మాట్లాడడం జరిగింది..  ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానం  అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు అర్హత కలిగిన వారికి ప్రమోషన్ ఇవ్వాలని  అన్నారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కరోనా కష్టకాలంలో పనిచేసి ప్రాణాలు కోల్పోయినా వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగం 5 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు వెంటనే ఇచ్చి అమలు జరిగే విధంగా ప్రయత్నించాలని కోరారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం జరిగేవరకు సీపీఎం పార్టీ అం

15 🧡 30 - 15 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న 30 ఏళ్ల మహిళ,

Image
 15 🧡 30 15 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న 30 ఏళ్ల మహిళ,  మాయమాటలతో బాలుడిని  కిడ్నాప్ చేసిన కేసును కృష్ణాజిల్లా గుడివాడ   పోలీసులు చేదించారు. గుడివాడ గుడ్ మేన్ పేటలో ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న స్వప్న అనే మహిళ, బాలుడు గత 19వ తేదీ నుండి కనిపించకపోవడంతో బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో మాయమాటలతో స్వప్న బాలుడిని అపహరించినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన పోలీసులు స్వప్న, బాలుడు హైదరాబాద్ బాలానగర్ లో ఉన్నట్లు గుర్తించారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు స్వప్న పై ఫోక్సో చట్టం, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. టూ టౌన్ సిఐ దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం ఫోన్లో పోర్న్ వీడియోలు చూపించి బాలుడిని ప్రలోభ పెట్టిన, స్వప్న గత నెల రోజులుగా శారీరిక సంబంధం ఏర్పరచుకుందని తెలిపారు. మాయమాటలతోనే బాలుడిని స్వప్న కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

క్యాసినో వ్యవహారంలో ఈడీ దాడులు

Image
   హైదరాబాద్:  క్యాసినో వ్యవహారంలో ఈడీ దాడులు  చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు  గుడివాడ క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్‍పై ఆరోపణలు - మొత్తం ఎనిమిది చోట్ల ఈడీ దాడులు

కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి పరమేష్.

Image
 కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి పరమేష్. *********************::::************:*:**:******** కాంగ్రెస్ ఓబీసీ సెల్ నల్గొండ జిల్లా నూతన చైర్మన్ గా నియమితులైన జిల్లపల్లి పరమేష్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి,పున్న కైలాస్ నేతతో కలిసి హైదరాబాద్లోని గాంధీభవన్లో ఓబీసీ రాష్ట్ర చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జిల్లపల్లి పరమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా చైర్మన్ పదవికి న్యాయం చేస్తానని తెలిపారు.నల్లగొండ జిల్లాలో ఓబీసీ సెల్ ను మరింత పటిష్ట పరిచి కాంగ్రెస్ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తానని పేర్కొన్నారు.త్వరలోనే జిల్లా వ్యాప్తంగా మండల కమిటీలన్నింటినీ పూర్తి చేస్తానని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఓబీసీ సెల్ తన వంతు క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్

నటి తో అసభ్యకరంగా...

Image
 *నటి  తో అసభ్యకరంగా ప్రవర్తించిన బిల్డర్ ప్రవీణ్  పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు*

ఏసీబీ దాడులు

Image
 ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం మొదటి అంతస్తు ఇంజనీరింగ్ విభాగంలో ఏసీబీ దాడులు

ఐదుగురు యువతుల అరెస్టు

Image
 బ్రేకింగ్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమాజిగూడలో  బ్యూటీ అండ్ స్పాపై పోలీసుల దాడులు.. ఐదుగురు యువతులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు.

ప్రెస్ అకాడమీ నిధుల జమా ఖర్చులు, అక్రిడేషన్ల పై ఆర్టీఐ దరఖాస్తు సంధించిన సీనియర్ జర్నలిస్టు రూపారాణి కోనేరు

Image
 ప్రెస్ అకాడమీ నిధుల జమా ఖర్చులు, అక్రిడేషన్ల  పై ఆర్టీఐ దరఖాస్తు సంధించిన సీనియర్ జర్నలిస్టు రూపారాణి కోనేరు హైద్రాబాద్:  సమాచారహక్కు చట్టం పరిధిలో తెలంగాణ ప్రెస్ అకాడమీ నిధుల జమాఖర్చుల వివరాలు,  అక్రిడిటేషన్లు పొందినవారి వివరాలు. సంక్షేమ లబ్ది పొందినవారి వివరాలు కోరుతూ సీనియర్  జర్నలిస్టు రూపారాణి దరఖాస్తు చేశారు   తెలంగాణ ఏర్పడిన తరువాత పాత్రికేయుల సంక్షేమం కోసం 100 కోట్లు ప్రెస్ అకాడమీకి 8 ఏళ్ల క్రితం కేటాయించింది రాష్ట్రప్రభుత్వం. వాటిలో 16 కోట్లు ఖర్చు చేసినట్టుగా పెస్ అకాడమీ చైర్మన్ ప్రకటించారని. అలాగే 18 వేల మందికి అక్రిడిటేషన్లు ఇచ్చినట్టు, నాలుగువేల మందికి శికణ ఇచ్చినట్లు కూడా వెల్లడించారని, ఆయా వివరాలను కోరుతూ పారదర్శకత కోసం ఒక పాత్రికేయురాలిగా సమాచారం హక్కు చట్టం పరిధిలో 20 ప్రశ్నలతో  పాత్రికేయురాలు గా   దరఖాస్తును  పోస్టు ద్వారాను, మెయిల్ ద్వారా, స్వయంగా ఆఫీస్ కు వెళ్లి దరఖాస్తు అందచేయడం జరిగిందని యూట్యూబ్ లో  ( లింక్ ను టచ్ చేసి చూడొచ్చు)    https://youtu.be/7_nofsA1pag   ఓ వీడియో చేశారు.  ప్రజాసంబంధ విషయాలలో సమాచారం అందరికి అందించడం  బాధ్యత కనుక ఈ వీడియోను చేయడం జరిగిందన

జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి.....

Image
 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మహిళ అధికారిపై లైంగిక దాడి ...పరారీలో నిందితుడు......     ఆర్టీఏ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న మహిళ పై అదే డిపార్ట్మెంట్ లో హోమ్ గార్డు గా పని చేస్తున్న వ్యక్తి ఆమే పై లైంగిక వేధింపులు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం 2018 లో బదిలీపై ఖమ్మం కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ తనకు ఎవ్వరు పరిచయం లేకపోవడంతో అదే ఆర్టీ ఏ లో హోమ్ గార్డు గా పని చేస్తున్న స్వామి అనే వ్యక్తి ఆమెకు అన్నీ విధాలుగా సహాయం చేశాడు.అప్పటి నుంచి ఆమే నమ్మకాన్ని ,ఆమే కుటుంబ సభ్యులకు దగ్గర అయ్యాడు. బాధితురాలు తన భర్త తో వచ్చిన మనస్పర్థల కారణంగా భర్త నుంచి దూరంగా ఉంటుంది. ఆమెకు సంభందించిన వ్యక్తి గత విషయాలను తెలుసుకున్నాడు .కాగా ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని  ఆమెకు మాయమాటలు చెప్పి ఆమే ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఆమే కు జ్యుస్ లో మత్తు మందు ఇచ్చి ఆమే పై అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాన్ని తన మొబైల్లో చిత్రీకరించి వాటి ని ఇతరులకు చూపిస్తాను అని చెప్పి ఆమెను బయ బ్రాంతులకు గురి చేశాడు.వీడియోల ను బూచి గా చూపి ఆమే వద్ద నుంచి లక్షలు వసూలు చేశాడు.నిందితుడి నుంచి ద

బీజేఆర్ నగర్‌ ప్రభుత్వ పాఠశాలను దుస్థితిఫై ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ఫైర్

Image
 బీజేఆర్ నగర్‌ ప్రభుత్వ పాఠశాలను దుస్థితిఫై ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ఫైర్ హైదరాబాద్, జులై 25: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బీజేఆర్ నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గత 15 రోజులుగా వరద ముంపుకు గురైంది. వందలాది మంది విద్యార్థులు చదువుకునే ఈ పాఠశాల లో మోకాల్లోతు నీరు వచ్చి చేరిన.. ఒక్కసారి కూడా అధికారులెవరూ వచ్చిపాఠశాలలో ఉన్న నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకపోవడం పట్ల ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. పాఠశాలలోని గదులతో సహా ఆవరణ మొత్తం మోకాల్లోతు నీటితో నిండిపోయింది. ఇంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నప్పటికీ దీనిని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మరియు విద్యాశాఖ అధికారులపై పట్టించుకోకపోవడం ఫై  డాక్టర్ దాసోజు శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కనీసం సొయా ఉందా అని ప్రశ్నించారు. మీ నియోజకవర్గం లో గత రెండువారాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా నీరు ఉంటె మీరు ఏంచేస్తున్నారు..? పంపులు పెట్టించి ఈ వాటర్ ను తీసేయొచ్చు..ఒకవేళ నాలా ఔట్లెట్ లేకపోతే.. దానిని ఏర్పటు చేయొచ్చు.. GHMC అధికారులుకానీ , స్థానిక నేతలు కానీ , విద్యాశాఖ అధ

వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్ అధ్యక్షులుగా నూకల జైపాల్ రెడ్డి

Image
 నల్గొండ:  వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్  అధ్యక్షులుగా   నూకల జైపాల్ రెడ్డి ఎన్నికైనారు. ఎన్నికైన నూతన  అధ్యక్షుడు కి మరియు వారి కార్యవర్గ సభ్యులకు కాలనీవాసులు  హార్దిక శుభాకాంక్షలు

ప్రముఖ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ కన్ను మూత

Image
  ఆమనగల్లు: ప్రముఖ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఆయన్ను కడ్తాల్‌ మహేశ్వర పిరమిడ్‌కు తరలించారు. ఆదివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం 5గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పిరమిడ్‌ ధ్యాన్‌ ట్రస్టు సభ్యులు తెలిపారు.

ప్రముఖ అడ్వకేట్, ఆర్టీఐ ట్రైనర్ కె.ఎన్. సాయికుమార్ పిల్ తో తెలంగాణ లో వన్ టైం యుస్డ్ ప్లాస్టిక్ నిషేధం

Image
 ప్రముఖ అడ్వకేట్, ఆర్టీఐ ట్రైనర్ కె.ఎన్. సాయికుమార్  పిల్ తో  తెలంగాణ లో వన్ టైం యుస్డ్ ప్లాస్టిక్ నిషేధం హైదరాబాద్: 2016 లో  కేంద్ర  ప్రభుత్వం ఫ్లెక్సీ బ్యానర్లు మరియు వన్ టైం యుస్డ్ ప్లాస్టిక్ వాడకము పై , తయారీ పై నిషేధం విధించింది. అట్టి నిషేధం  తెలంగాణలో అమలు కాకపోడంతో ప్రముఖ అడ్వకేట్, ఆర్టీఐ ట్రైనర్ కె.ఎన్. సాయికుమార్ 2020లో తెలంగాణ హైకోర్టులో నిషేధం అమలు పరచాలని పిల్ దాఖలు చేశానని తెలిపారు. .  ఈ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు   జూన్ లో రెండు వారాల్లో  తీసుకున్న   చర్యలు  కోర్టు కు తెలపాలని    ప్రభుత్వాన్నీ అదేశించింది.  దీంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం  జులై 1 నుండి  నిషేధం విధిస్తూ జీవో 40 ని విడుదల చేసినట్లు తెలిపింది.

యాదగిరిగుట్టపైన అడవి పంది హల్ చల్.

Image
  యాదగిరిగుట్ట యాదాద్రి: యాదగిరిగుట్టపైన అడవి పంది హల్ చల్. క్యూలైన్ల ద్వారా ఆలయ మాడవీధుల్లోకి వచ్చిన అడవి పంది. భయంతో అటు ఇటు పరిగెత్తి క్యూకాంప్లెక్స్ బిల్డింగ్ పై నుండి పడి చనిపోయిన అడవి పంది. ఆలయంలో లఘు పుణ్యాహవచనం చేపడతామన్న ఆలయ ఆఫీసర్లు.

గడువు ముగిసిన వాటిని హాస్టళ్లకు అందించే సప్లయర్స్ పై చర్యలు - జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి

Image
 గడువు ముగిసిన వాటిని హాస్టళ్లకు అందించే సప్లయర్స్ పై చర్యలు - జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి నల్గొండ : జిల్లా కేంద్రం లో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, బాలికల జూనియర్ కళాశాల, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో శుక్రవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా కళాశాలలో పాఠశాలలో కిచెన్ తో పాటు కుకింగ్ చేసే పరిసరాలను పరిశీలించారు. సందర్భంగా ఆమె వంట చేసే వారికి ఆయా ప్రిన్సిపల్ లకు పలు సూచనలు చేశారు. కూరగాయలను వేడి నీటిలో కాసేపు ఉంచాకనే వాటిని వంటకు ఉపయోగించాలని సూచించారు. వంట సిబ్బంది వంట చేసే సమయంలో పరిశుభ్రతను పాటించాలన్నారు. హాస్టల్లో ఉన్న బాలబాలికలతో వారికి అందుతున్న ఆహారం గురించి తెలుసుకున్నారు ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో పని చేస్తుందని , ఆ దిశగా ఫుడ్ సేఫ్టీ తరఫున ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో గడువు ముగిసిన పసుపు ప్యాకెట్లను తో పాటు పల్లి పట్టి ప్యాకెట్లను జిల్లా కేంద్రం లో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, బాలికల జూనియర్ కళాశా

గూఢచారి అప్పుడే చెప్పింది. అర్భటాలు వద్దు. కార్పొరేషన్ కొరకు ఉద్యమం ముద్దు అని

Image
 గూఢచారి అప్పుడే చెప్పింది. అర్భటాలు వద్దు. కార్పొరేషన్ కొరకు ఉద్యమం ముద్దు అని. కోట్లు వృధా. బౌన్సర్లతో ఆర్యవైశ్యులకు అవమానం. Qr కోడ్ అన్నారు మరి వచ్చేవారికి వచ్చి నట్లే ఇస్తే బాగుండేది కదా.  వ్యాపార , రియల్ ఎస్టేట్ వెంచర్లకు స్టాళ్లకు ఎంత వసూలు అయ్యిందో. ఆ డబ్బు అన్న పేద ఆర్యవైశ్యులకు ఖర్చు పెడితే బాగుంటది కదా! ఆర్యవైశ్యులకు జరిగిన అవమానానికి పలు గ్రూపుల్లో స్పందన చూడండి. అవమానము ఆర్యవైశ్యు లకు మరి శిక్ష  నిర్వహికులకు వేయాలికదా.

ఇది ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ బృందం 2022 అందించిన బహుమతుల దృశ్యం

Image
  ఇది ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ బృందం 2022 అందించిన బహుమతుల  దృశ్యం

గూఢచారి చిన్నదే అది సృష్టించే భూకంపం పెద్దదే?

Image
  గూఢచారి చిన్నదే అది  సృష్టించే భూకంపం పెద్దదే? వైశ్య సంఘాల పేరున  జరుగుతున్న దారుణాలను ప్రపంచ సంఘం లో దుబారా, జవాబు దారి లేకపోవడాన్ని, తెలంగాణలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని ఇటీవల " గూఢచారి " పత్రిక ద్వారా  ప్రశ్నీంచిన విషయం మీ అందరికి తెలిసినదే....  ఆ సంఘం లో స్థాయి లేని వారికి పదవులు ఇచ్చి వారి చేతులారా వారే ఆ సంఘాన్ని బజారుకు ఈడ్చుకున్నారు. మీడియా  ఇంచార్జి ఏం చేయాలో కూడా నాలెడ్జి లేని వ్యక్తులను పెట్టి పరువు తీసుకొన్నారు.  నా వార్తను పట్టించుకోవద్దని, తప్పుడు వార్తని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని  మరియు మా పత్రిక ప్రతినిధిని బెదురుస్తూ వాయిస్ రికార్డులు పెట్టారు.  చాలా చిన్నోడు పట్టించుకోవద్దని వీడియో మెసేజ్ లు పెట్టారు.  పత్రిక  ప్రశ్నిస్తే , అదో  చిన్నపత్రిక అని,  చిటికన వేలు అని అపహస్యం చేసారు సదరు ఆసంఘ నాయకులు కానీ వారు తెలుసుకోవలసింది ఎమిటంటే , మీరు బహుమతులు, కవర్లు, బ్రైబ్ లు ఇవ్వడానికి మీకు చిన్నపత్రిక,  పెద్ద పత్రిక అని కొలమాణాలు వుంటాయోమో కానీ   నిజాలు పరిశోదించి రాయడానికి , ప్రజల తరుపున ప్రశ్నించడానికి జర్నలిజంలో చిన్నపత్రిక పెద్దపత్రిక అని తేడా వుం

హరిత హోటల్ కు జరిమానా

Image
జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో గల హరిత హోటల్ పై ఒక వినియోగదారుని ఫిర్యాదు పై నల్గొండ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ , జ్యోతిర్మయి గారి ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి మున్సిపల్ అధికారులక సహకారంతో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంట గదిని , స్టోర్ రూమ్ ను  పరిశీలించారు. వంట గదిలో అపరిశుభ్రంగా ఉండడంపై ఆమె హోటల్ యజమాని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే హోటల్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యత కలిగిన ఆహార పదార్థాలను మాత్రమే ప్రజలకు అందించాలని, కల్తీ లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు విక్రయించాలని, మరో కొద్ది రోజులు సమయం ఇస్తామని. అప్పటిలోగా శుభ్రంగా ఉంచుకోకపోతే ఫుడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఫ్రిజ్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తక్షణమే తొలగించారు నిల్వ ఉన్న పెరుగు శాంపిల్స్ సేకరించారు. వాటిని ల్యాబ్ కి పంపించు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు  హోటల్లో అపరిశుభ్రంగా ఉండడంతోపాటు  నిషేధిత ప్లాస్టిక్ కవర్లు ఉండడంతో   వారికి ఐదు వేల జరిమానా విధించారు. హోటల్స్ లో అపరిశుభ్రంగా ఉన్న, నిల్వ ఉన్న పదార్థాలను ప