Posts

Showing posts from October, 2023

*బిజెపి ని ఓడించడం ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి*

Image
  *బిజెపి ని ఓడించడం ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి* *దళితుల సమస్యలను ఎన్నికల మ్యానిఫెస్టోలలో చేర్చాలి* *దళితుల్లో చైతన్యం కల్పించడం కోసం ప్రజా సంఘాలు, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో నల్గొండలో కోటి సంతకాల సేకరణ.* నలగొండ:  భారత రాజ్యాంగ స్థానంలో మను అధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్న బిజెపిని తిరిగి అధికారంలో రాకుండా ఓడించడం ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోగలమని అట్టడుగు వర్గాలైన దళితుల్లో చైతన్యం కల్పించడం కోసం ప్రజా సంఘాలు సమాజిక సంఘాల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ అని దళిత్ సమ్మిట్ రాష్ట్ర నేతలు నారి ఐలయ్య పాలడుగు నాగార్జున బోల్గూరి నరసింహ ఊరు పక్క వెంకటయ్యలు  పిలుపునిచ్చారు.   ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రం సుభాష్ విగ్రహం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వారు మాట్లాడుతూ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు పెరిగాయని అన్నారు బాధితులకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వం దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్న పెత్తందారులకు కొమ్ముకాస్తున్నది భారత రాజ్యాంగ హక్కులను అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధపడటం లేదు ఎస్సీ ఎస్టీ అ

విలేఖరుల ముసుగులో ప్రభుత్వ భూమి క్రమబద్దీకరణ సంఘటన పై కలెక్టరు కు ఫిర్యాదు - విచారణకు ఆదేశించిన కలెక్టర్

Image
  విలేఖరుల ముసుగులో  ప్రభుత్వ భూమి క్రమబద్దీకరణ సంఘటన పై కలెక్టరు కు ఫిర్యాదు - విచారణకు ఆదేశించిన కలెక్టర్  ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరణ జి.ఓ.యం.యస్. నెం. 58 పేరుతో జర్నలిస్టుల ముసుగులో కొందరువ్యక్తులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో క్రమబద్దీకరణ చేసిన విషయమై విచారణ జరిపి రద్దు చేయులని ఆ ధరకాస్తు లో కోరిన నల్గొండ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ. వెంటనే విచారణ జరపాలని జెసి నీ ఆదేశించిన కలెక్టర్.  ఫిర్యాదు వెంట అక్రమముగా క్రమబద్ధీకరణ చేసుకున్నవారి జాబితా జతపరచమని వారు తెలిపారు. నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ రెవిన్యూ పరిధిలోని సర్వే నెం. 370, 371లలో కొందరు వ్యక్తులకు రెవిన్యూ, మున్సిఫల్ అధికారులు గత 13 సంవత్సరాలుగా ఆయా సర్వే నెంబరులో నివాసముంటున్నట్లు తప్పుడు ఇంటి నెంబర్లు మున్సిఫల్ అధికారులు కేటాయించడం, వారికి నల్లగొండ తహశీల్దార్ ఎటువంటి విచారణ జరుపకుండానే రాజకీయ నాయకుల ఆదేశాలకు తలొగ్గి ఇంటి స్థలాలను కేటాయించారని పేర్కొన్నారు. అట్టి జాబితాలో తహశీల్దార్ బంధువులు, యం.ఎల్.ఎ. అనుచరులు ఉన్నట్లు తెలుస్తుందనీ, అట్టి స్థలములో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబరు కేటాయించారని, వెంటనే తప్పుడు క్ర

పలువురు కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు, అధికారులను బదిలీ చేసిన ఎలక్షన్ కమీషన్

Image
  పలువురు కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు, అధికారులను బదిలీ చేసిన ఎలక్షన్ కమీషన్  రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ వి. సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్ అలీతో పాటు సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎస్పీ భాస్కర్, మహబూబ్ నగర్ ఎస్పీ నర్సింహ, నాగర్ కర్నూల్ ఎస్పీ మనోహర్, జోగులాంబ గద్వాల ఎస్పీ సృజన, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎస్పీ చంద్రమోహన్, భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

బిజేపి మేనిఫెస్టో -ప్రచార కమిటీ సభ్యునిగా కప్పర ప్రసాద్ రావు నియామకం

Image
 బిజేపి మేనిఫెస్టో -ప్రచార కమిటీ సభ్యునిగా కప్పర ప్రసాద్ రావు నియామకం గజ్వేల్ నియోజవర్గం  తిగుల్ గ్రామానికి చెందిన కపర ప్రసాద్ రావు గత 30 సంవత్సరాలు నుండి బిజెపి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు బిజెపి మేనిఫెస్టో -ప్రచార కమిటీ కన్వీనర్ గా మాజీ ఎంపీ వెంకటస్వామి ఉన్న కమిటీలో సభ్యునిగా అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టో ప్రచార కమిటీ సభ్యునిగా అవకాశం ఇచ్చిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజల సమస్యలతో పాటు జనానికి కావలసిన అభివృద్ధి పనులను మేనిఫెస్టోలో చేర్చేందుకు మంచి అవకాశం అన్నారు. జర్నలిస్టుగా తనకున్న 30 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం మేనిఫెస్టోను అన్ని పార్టీలకు భిన్నంగా బిజెపి పార్టీ విడుదల చేయబోతుందని బిజెపి పార్టీ అంటేనే పేదల పార్టీ అని నరేంద్ర మోడీ అంటేనే పేదల నాయకుడు అని ఆయన సారాధ్యంలో పనిచేస్తున్న బిజెపి ప్రతి కార్యకర్త దేశ రక్షణ ధ్యేయంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తామని దేశం బాగుంటే మనం బాగుంటాము అని నమ్ముతూ ప్రజల సేవ కొరకై నిరంతరం బిజెపి పార్టీ పనిచేస్తుందన్నారు. ఈ ఎన్నికలు దేశద్రోహులకు దేశభ

కాల్గరీ కెనడా లో ఘనంగా జరుపబడిన హిందూ హెరిటేజ్,గణపతి నవరాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు

Image
  కాల్గరీ కెనడా లో ఘనంగా జరుపబడిన హిందూ హెరిటేజ్,గణపతి నవరాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు కాల్గరీ కెనడాలో, శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం  ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవ వేడుకలు ఎంతో  ఘనంగా జరిగాయి . ఆలయ ధర్మకర్తలు శ్రీమతి లలిత ద్వివేదుల మరియు శైలేష్ భాగవతుల గారి ఆధ్వర్యంలో గణపతి ఊరేగింపు వేడుకలు కాల్గరీ నగర డౌన్ టౌన్ వీధులలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు  రాజ్‌కుమార్ శర్మ మందిరంలో ప్రతిరోజు గణపతి అభిషేకము, అర్చన, గణపతి హోమము మరియు హారతులు విధిగా నిర్వహించారు. గణపతి నవరాత్రి మరియు ఊరేగింపు సంబరాలు ఘనంగా నిర్వహించుటకు చాలా మంది వాలంటీర్లు మరియు వ్యాపార యజమానులు తమ  ప్రత్యేక సహాయాన్ని అందించారు  నగర వీధుల్లో గణపతి ఊరేగింపు కోసం హెచ్&హెచ్ డెకర్స్, హేమ మరియు హర్షిణి ట్రక్ ను ఎంతో అందంగా అలంకరించారు.  గణనాధుని యాత్రకు కాల్గరీ ఎమ్మెల్యే అయిన గౌరవనీయులైన పీటర్ సింగ్ గారు విచ్చేసారు, ఊరేగింపులో పాల్గొన్న భక్తులను, ప్రజలను ఉద్దేశించి కాల్గరీ నగరంలో ఇటువంటి దైవ  కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు శ్రీ అనఘా దత్త యజమాన్యం వారిని ప్రశంసించారు. మరి

బంజారా హిల్స్ ఏసీబీ కేసులో ట్విస్ట్.. పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు

Image
  బంజారా హిల్స్ ఏసీబీ కేసులో ట్విస్ట్..  పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు రూ.4.5 లక్షలు అడిగారు అని ఫిర్యాదు.. ఇవ్వకపోవడంతో తనను వేధిస్తున్నారనీ ఫిర్యాదు.. గత నెల 30 న పబ్ నిర్వాహకుడిని ps కు తీసుకు వెళ్ళారని ఫిర్యాదు చేసిన యజమాని లక్ష్మన్ రావు. మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేసిన ఏసీబీ.  Ao 1 గా నరేందర్ Ao 2 గా ఎస్ ఐ నవీన్  Ao 3 గా హోం గార్డు హరి ఏసీబీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారా హిల్స్ ఇనస్పెక్టర్ నరేందర్,తో పాటు ఎస్ ఐ, హోమ్ గార్డు ల మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం

*అడ్డదారిలో పదవులు చేపట్టమని మహాసభ తెలియ చేసిందా ?

Image
 ఆర్యవైశ్య మహాసభ నాయకులుగా చెలామణి అయ్యేవారికి ప్రశ్నలు సందిస్తు సోషల్ మీడియా లో పోస్టు *ఆర్యవైశ్యులరా ఇకనైనా మేల్కోండి . తప్పు చేసిన వాడిని నిలదీసిన రోజే ఆర్యవైశ్య జాతి సభ్య సమాజంలో తలెత్తుకుంటుంది . *ఆర్యవైశ్య మహాసభ నియమావళి ప్రకారం మూడు నెలలకు ఒకసారి జరగవలసిన కార్యవర్గ సమావేశాలు పెడుతున్నారా? , *బైలా తెలియనివాళ్లు పదవులు చేపడితే ఇలాగే ఉంటుంది *అడ్డదారిలో పదవులు చేపట్టమని మహాసభ తెలియ చేసిందా ? *జాతికి ద్రోహం చేస్తూ పదవులను అలంకరించడం మహాసభ నియమ నిబంధనలో ఉన్నదా ? *ఆర్యవైశ్య మహాసభ ఎవరి సొత్తు , ఎవరి జాగీరు కాదు9 సంవత్సరాల నుండి రాష్ట్ర ఎన్నికల నిర్వహించకుండా ఎవరికివారు స్వార్థపూరితంగా వ్యవహరించడం మహాసభ నియమ నిబంధనలో ఉన్నదా ?  *ఆర్యవైశ్య జాతికి ద్రోహం చేసే వారిపై చర్యలు ఉండవు , పాటుపడే వారిపై చర్యలు ఉంటాయా . మహాసభ నియమావళి అదేవిధంగా ఉన్నదా . ఆర్యవైశ్య మహాసభ నియమావళి ప్రకారం మూడు నెలలకు ఒకసారి జరగవలసిన కార్యవర్గ సమావేశాన్ని సకాలంలో , సరైన సమయంలో నిర్వహించకుండా ఎవరు రాలేని సందర్భాన్ని పురస్కరించుకొని సమావేశాన్ని ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా సమావేశాన్ని నిర్వహించి ఇచ్చిన హామీలను విస్మరించడమే

వైశ్య జాతిని కించ పరిస్తే ఖబర్దార్ - కాచం - వైశ్య గర్జన విజయవంతం

Image
  వైశ్య జాతిని కించ పరిస్తే ఖబర్దార్ - కాచం వైశ్య గర్జన విజయవంతం హైదరాబాద్:  వైశ్య గర్జన విజయవంతం అయ్యింది. నిర్వాహకులు శ్రమ ఫలించిందని, కుట్రలు చేసిన వారికి దిమ్మ తిరిగే జవాబు వైశ్యులు ఇచ్చారని పాల్గొన్న పలువురు అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ గర్జన లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైశ్యులు డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి , వారికి అండగా ఉంటా అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.ఆదివారం సరూర్ నగర్ స్టేడియం లో వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో వైశ్యుల ఆత్మగౌరవం -హక్కుల సాధనకై ఏర్పాటు చేసిన" వైశ్య గర్జన కార్యక్రమం కు ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి హాజరు అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో కూడా ఎంతోమంది ఆర్యవైశ్యులు అండగా ఉన్నారని గుర్తుకు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వైశ్యులకు కొన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.నియోజక వర్గంలో ఇప్పటికే 11 కేటాయించామని , మరికొన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగా కూడా ఎల్బీనగర్లో భవిష్యత్తులో సీట్లు కేటాయిస్తము అని