వానా కాలామ్ పంటకు రైతులకు ఎరువులు,విత్తనాలు అందు బాటులో ఉన్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ లతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం పంటకు ఎరువులు,విత్తనాలు సరఫరా, యాసంగీ ధాన్యం కొనుగోళ్లు సమీక్షించారు.జిల్లాలో ఎరువులు రెండు లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల వానాకాలం సాగుకు అవసరం కాగా అందులో 80,000 మెట్రిక్ టన్నులు యూరియా,36,000 డి. ఏ.పి.,66,000 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు అవసరం కాగా, యూరియా,డి. ఏ.పి.,కాంప్లెక్స్ ఎరువులు 29,000 మెట్రిక్ టన్నులు అందు బాటులో వుందని వ్యవసాయ అధికారులు మంత్రికి వివరించారు. ఇందు లో 11,000 మెట్రిక్ టన్నుల యూరియా,2700 మెట్రిక్ టన్నుల డి. ఏ.పి.,13600 కాంప్లెక్స్ ఎరువులు అందు బాటులో వున్నట్లు వారు వివరించారు.ఎప్పటి కప్పుడు వచ్చిన ఎరువుల ర్యాక్ పి. ఏ.సి.ఎస్.,డీలర్ లకు పొజిషన్ చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకు 1900 మెట్రిక్ టన్నులు ఎరువులు డీలర్ లు,పి. ఏ.సి.ఎస్., అగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా రైతుల కు విక్రయించి నట్లు అధికారులు