Skip to main content

Posts

Showing posts from August, 2021

నల్గొండ ప్రభుత్వ హాస్పటల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి - బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయిత రాజు సిద్దు

  నల్గొండ ప్రభుత్వ హాస్పటల్లో  సమస్యలు వెంటనే పరిష్కరించాలి -  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయిత రాజు సిద్దు నల్గొండ : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి బీజేవైఎం ఆధ్వర్యంలో సందర్శించి సమస్యలు  పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయిత రాజు సిద్దు  మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో నల్లగొండలోని ప్రైవేట్ హాస్పిటల్ లో అధిక ఫీజుల దోపిడీ కి పాలు పడుతూ ఉంటే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం అరకొర సౌకర్యాలతో పేద మధ్యతరగతి ప్రజలకు అనేక సమస్యల తో స్వాగతం పలుకుతున్నదిని ఆయన అన్నారు.  ప్రభుత్వ హాస్పిటల్  సిబ్బంది  ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని  ప్రభుత్వ హాస్పిటల్ ను పట్టించుకోవడం లేదని,   ఎన్ని సమస్యలు ఉన్న ప్రభుత్వ అధికారులు  పట్టించుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ సమస్యల పైన జిల్లా అధికారులు పట్టించుకోకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో లో బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ముంత సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక వెంకటరెడ్డి జిల

బిసీ క‌మిష‌న్‌లో మైనార్టీలకు చోటేది? : సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డ ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌

  బిసీ క‌మిష‌న్‌లో మైనార్టీలకు చోటేది? : సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డ ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌. ముస్లిం మైనార్టీలు బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీల‌కే  ప‌నికోస్తారా ? గ‌త ఏడేళ్లుగా మోస‌పోతున్న ముస్లిం మైనార్టీల‌కు మ‌రోసారి దొక ఇచ్చిన సీఎం కేసీఆర్‌ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 24:  బిసీ క‌మిష‌న్‌లో ముస్లిం మైనార్టీల‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌.  తెరాస స‌ర్కార్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి మైనార్టీల‌కు స‌ముచిత స్థానం వ‌స్తుంద‌ని ఆశించిన మైనార్టీల‌కు మ‌రోసారి అన్యాయం చేశార‌ని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్‌ని న‌మ్ముకున్న వారికి దోకా మీద దోకా ఇస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీన్ని ప్ర‌తి ఒక్క ముస్లిం సోద‌రి, సోద‌రీమ‌ణులు ఆలోచించాల్సిన విష‌య‌మ‌న్నారు.  " 240 జీవో జారీ చేస్తూ... బిసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా తెరాస నాయ‌కులు వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్, స‌భ్యులుగా ఉపేంద్ర‌, శుభ‌ప్ర‌ద్ ప‌టేల్‌, కిషోర్‌గౌడ్‌ల‌ను నియ‌మించారు. ఇప్ప‌టికైన పున‌రుద్ద‌రించినందుకు స్వాగ‌తిస్తున్నాం. అయితే బిసి క‌మిష‌న్‌లో మైనార్టీ వ‌ర్గాల సంబం

తెలంగాణ తాలిబన్లలాగా మారిన టీఆర్ఎస్

తెలంగాణ తాలిబన్లలాగా మారిన టీఆర్ఎస్ అప్గానిస్తాన్ని తాలిబన్లు నాశనం చేసినట్టు, కేసీఆర్ సేన తెలంగాణను  చేరబట్టింది - ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రవణ్h 👉  సీఎం కేసీఆర్ తాలిబన్ల‌ మాదిరిగా ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు :ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు 👉 కేసీఆర్ దళిత బంధుతో మోసం చేస్తున్నారు, హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత దళిత బంధు ఉండదు.  👉 హుజురాబాద్‌లో ప్రభుత్వ సమావేశమా.. పార్టీ సమావేశమా..? ప్రభుత్వ సమావేశం అయితే,పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎందుకు ఉన్నారు? 👉 సీఎస్ సోమేశ్ కుమార్ చిల్లరగా వ్యవహరిస్తున్నారు  👉 7 ఏళ్లలో సీఎంగా కేసీఆర్ ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయలేదు. 👉  మొట్టమొదటి సారిగా ఏడేళ్లలో ప్రగతి భవన్ లోకి దళిత ఐఏఎస్ కు అడుగుపెడుతున్నారు. ఏడేళ్లలో దళితులకు లక్షా 25 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా చేయలేదు. ఏడేళ్లలో దళితులకు వాటాగా రావాల్సిన నిధులలో 65 శాతం పక్కదారి పట్టించారు. హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్గానిస్తాన్ తాలిబన్లాగా మారారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీని

నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా భూపతి రాజు

 నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా  భూపతి రాజు నల్గొండ : నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గా నల్గొండ పట్టణాన వాసి సీనియర్ కార్యకర్త    భూపతి రాజును బీజేపీ జిల్లా అధ్యక్షులు  కంకణాల శ్రీధర్ రెడ్డి నియమించారు. పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి పార్టీ అభివృద్ధి కి  తోడ్పడాలని ఆయన కోరారు. తన ను  నియమించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి గారికి మరియు  నియమానికి సహకరించిన నాయకులకు  భూపతి రాజు కృతజ్ఞతలు తెలుపుతు,  పార్టీ నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని  అన్నారు.