Skip to main content

Posts

Showing posts from June, 2020

ఏ సి బి దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :పాల్వంచ మండలం  కిన్నెరసాని విఆర్వో పై ఏసీబీ దాడులు ఏడు వేల రూపాయల నగదు స్వాధీనం కొనసాగుతున్న విచారణ.

జూన్ 11 ఏపీ కరోనా సమాచారం

ఏపీ కరోనా బులిటెన్ అమరావతి : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో 135 కేసులు నమోదవగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 38 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే విదేశాల నుంచి వచ్చి 9 మందికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఏపీలో 182 పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. ఏపీకి చెందిన 11,602 శాంపిళ్లను పరిశీలించగా 135 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా 65 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఏపీలో నమోదైన మొత్తం 4261 పాజిటివ్ కేసులకు గాను.. 2540 మంది డిశ్చార్జ్ అవగా.. 80 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1641 మంది కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు.

జూన్ 10 తెలంగాణ కరోనా సమాచారం

జూన్ 10 తెలంగాణ కరోనా సమాచారం క్రొత్త పాజిటివ్ కేసులు 191 ఈ రోజు మృతి చెందినవారు 8 మొత్తం కేసులు 4111 అక్టీవ్ కేసులు 2138 డిశ్చార్జ్ అయినవారు 1817 మృతి చెందినవారు 156

జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు అందిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రకటించారు.రెండు నెలల వ్యవధిలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయనున్నట్లు  ఆయన వెల్లడించారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తి అయ్యాయని ఆయన వెల్లడించారు.ఏజెన్సీల నిర్లక్ష్యంతో మిగితా పనులలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడమే తక్షణ కర్తవ్యమని ఆయన తెలిపారు.మిషన్ భగీరథ పురోగతి పై బుధవారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షకు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ 40,123 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం చరిత్రాత్మక మైనదన్నారు.ఏడు దశాబ్దాల పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పటి పాలకులు  త్రాగు నీటి మీద 590 కోట్ల

తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మూడు జిల్లాల్లో పర్యటన

తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం  పరిశీలించేందుకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌  మూడు జిల్లాల్లో పర్యటన తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ముందుగా కామారెడ్డికి చేరుకోనున్నారు. జిల్లాలోని రెండు గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. అనంతరం అక్కడి నుండి సంగారెడ్డి జిల్లాకు, ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లాకు వెళతారు. ఆయా జిల్లాల్లోనూ రెండేసి గ్రామాల్లో పనులు జరుగుతున్న విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ప్రతి నెలా ప్రభుత్వం రూ .308 కోట్లను జిపిలకు విడుదల చేస్తోంది. పర్యటన సందర్భంగా పారిశుధ్యం, డంప్ యార్డులు, శ్మశానవాటిక, నర్సరీ, టికెహెచ్‌హెచ్‌పై సిఎస్ దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ ఈ పర్యటన చేపట్టారు. గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే పల్లె ప్రగతి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది

జూన్ 4 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణా కరోనా బులిటిన్ విడుదల ఇవాళ 127 పాజిటివ్ కేసులు నమోదు ఇవాళ 6 గురు మృతి ఇప్పటి వరకు 105 మంది మృతి తెలంగాణ లో మొత్తం 3147 కేసులు నమోదు ఇవాళ జిహెచ్ఎంసీ లో 110 కేసులు రాష్ట్రంలో 1455 అక్టీవ్ కేసులు

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు-భారీగా చోరీ సొత్తు స్వాధీనం

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు-భారీగా చోరీ సొత్తు స్వాధీనం తాళం వేసివున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను గురువారం సి.సి.ఎస్ మరియు ఖాజీపేట పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. పోలీసులు అరెస్టు చేసిన దొంగ నుండి సూమారు 30లక్షల విలువగల 475 గ్రాముల బంగారు, 3 కి.లోల వెండి అభరణాలతో పాటు, 2లక్షల 50వేల నగదు, 5ఎల్.ఈ.డీ టివిలు, 4ల్యాప్ ట్యా న్లు , ఒక ప్రింటర్, 2 సెల్ ఫోన్లు, 6కెమెరాలు, ఒక ట్యాబ్, ఒక డిజిటల్ వాచ్ ఖరీదైన చలువ అద్దాలతో పాటు ఒక గ్యాస్ సిలెండర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి పూర్తి వివరాలు: సయ్యద్ ఆలాఫ్ ఆలియాస్ అఫ్రోజ్, తండ్రి పేరు భక్షి, వయస్సు 37, నివాసం నవపేట గ్రామం, మండలం చీరాల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు సయ్యద్ అల్తాఫ్ బాల్యం నుండే చిల్లర చోరీలకు పాల్పడటంతో నిందితుడి తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన నిందితుడు విజయవాడలో కారు డ్రైవింగ్ నేర్చుకోని కోద్ది రోజులు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఇదే సమ

జూన్ 3 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణ కరోనా బులిటిన్ విడుదల  ఇవాళ 129 పాజిటివ్ కేసులు..  ఇప్పటి వరకు రాష్ట్రంలో 3020 పాజిటివ్ ఇవాళ 7 గురు మృతి ఇప్పటి వరకు రాష్ట్రంలో 99 మంది మృతి జిహెచ్ఎంసీ లో ఇవాళ 108 కేసులు నమోదు

మెట్రో రైలు టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్

  మెట్రో రైలు టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్ దాఖలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి రాయితీ ఒప్పందానికి విరుద్ధంగా మెట్రో టిక్కెట్ల ధరలు ఖరారు చేశారని పిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్ టీకి హైకోర్టు నోటీసులు. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం ఇప్పటికే కొంతమంది డాక్టర్లకు కరోనా.... దాదాపు వంద మందికి కరోనా పరీక్షలు.. ఉస్మానియా  మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్థులకు కారోనా. ఓ పిజి స్టూడెంట్ కి ఇటీవల పాజిటివ్ రావడం తో టెస్ట్ లు ప్రారంభించిన వైద్యులు. ఉస్మానియా హాస్టల్ లో ఉన్న మొత్తం 296 మందికి టెస్ట్ లు. ఇందులో 180 మంది యువతులు, 116 యువకులు. వారందరి పరీక్షల ఫలితాలు రేపు వచ్చే అవకాశం.

కోవిడ్19 పై ప్రజలకు అవగాహన కల్పించడం లో జర్నలిస్టుల సేవలు మారవలేమన్న హైకోర్టు

కోవిడ్19 పై ప్రజలకు అవగాహన కల్పించడం లో జర్నలిస్టుల సేవలు మారవలేమన్న హైకోర్టు కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ ధాఖలైన పిల్ పై హైకోర్టు విచారణ.. పిల్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జర్నలిస్ట్ పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని కోర్టుకు తెలిపిన పిటీషనర్ పిటీషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటీషనర్... కరోనా వార్తలను కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరిన పిటీషనర్... జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు, ఉచితంగా అందించాలని కోర్టును కోరిన పిటీషనర్.. న్యాయవాదులకు 25 కోట్ల కేటాయించిన ప్రభుత్వం జర్నలిస్టులను సైతం ఆదుకోవాలన్న పిటీషనర్.. జర్నలిస్టుల పై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్... రెండు వారాల్లో ప్రభుత్వం కు జర్నలిస్టుల సమస్యలపై  రెప్రజెంటేషన్ ఇవ్వాలని కోరిన

ఏపీ కరోనా 2 జూన్ బులిటెన్

ఏపి లో 3200 కి చేరుకున్న కరోన పాజీటివ్ కేసులు.గడిచిన 24 గంటల్లో 82 కేసులు నమోదు 

గన్ పార్క్ వద్ద అలజడి

గన్ పార్క్ వద్ద అలజడి అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులర్పించిన సిఎం కేసిఆర్... కేసిఆర్ కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన  ఓ యువకుడు... అరెస్టు చేసిన పోలిసులు

ఎనిమిది రోజుల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పకడ్బందీగా చేపట్టాలి;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

ఎనిమిది రోజుల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పకడ్బందీగా చేపట్టాలి;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్   పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం లో బాగంగా కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి జూన్ ఒకటి నుండి జూన్ 8 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేకk పారిశుధ్య కార్యక్రమంలో బాగంగా  పరిసరాలు,గ్రామం పరిశుభ్రతను సంతరించుకునే లా గ్రామాల్లో పారిశుధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.సోమవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం లో బాగంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ లు కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామంలో  పాల్గొన్నారు.ముందుగా గ్రామంలో వార్డుల వారీగా పర్యటించి ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్నారు.గ్రామంలో ఉన్న డ్రైన్ లు మురుగు నీరు పోయేలా శుభ్రం చేయాలని ఆదేశించారు.మంచి నీటి ట్యాంకు లు దగ్గర బ్లీచింగ్ వేసి పరిశుభ్రం చేయాలని వారు ఆదేశించారు.మంచి నీటి ట్యాంకు లను నెలలో మూడు సార్లు శుభ్రపరచాలి అన్