Posts

Showing posts from January, 2021

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులకు ఘనంగా సన్మానం

Image
  మైనార్టీ మోర్చ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి    షేక్ బాబా, సోషల్ మీడియా కన్వీనర్  సయ్యద్ పాష,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బషీర్  గార్లకు ఘనంగా సన్మానం మైనారిటీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ మజీద్ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతాపార్టీ నల్గొండ జిల్లా కార్యాలయంలో మైనారిటీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ లో  ఎన్నుకోబడిన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి    షేక్ బాబా కు,  రాష్ట్ర మైనారిటీ మోర్చా  సోషల్ మీడియా కన్వీనర్  సయ్యద్ పాష మరియు మైనారిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బషీర్  గార్లకు ఘనంగా సన్మానించారు . . ఈ భాద్యతలు   కల్పించిన  బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరియు రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు అప్సర్ భాషా గార్లకు  జిల్లా అధ్యక్షులు  కంకణాల శ్రీధర్ రెడ్డి కి మరియు ఇతర సీనియర్ నాయకులకు  కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా యువ మోర్చా  అధ్యక్షులు సిద్దు ప్రధాన కార్యదర్శి  సయ్యద్ ,అబ్రహం  ఉపాధ్యక్షులు జావిద్  ,కార్యదర్శి యూసుఫ్ , అజీజ్ బిజెపి నాయకులు మరియు  మైనార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

టూ టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన చంద్ర శేఖర్ రెడ్డి

Image
  *టూ టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన చంద్ర శేఖర్ రెడ్డి* - - సిసిఎస్ నుండి టూ టౌన్ సీఐగా బదిలీ నల్లగొండ : పట్టణ టూ టౌన్ సీఐగా చంద్ర శేఖర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. 199 బ్యాచ్ కు చెందిన నల్లగొండ సిసిఎస్ సీఐగా విధులు నిర్వహిస్తున్న ఆయనను నల్లగొండ టూ టౌన్ కు బదిలీ చేయగా ఆయన శనివారం సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో డిండి సీఐగా పని చేసిన ఆయన అంతకు ముందు నారాయణపేటలో, అంతకు ముందు నిజామాబాద్ ఏ.సి.బి. సీఐగా విధులు నిర్వహించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో కేంద్ర ప్రభుత్వ 3446 ఉద్యోగాలు.

Image
  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో కేంద్ర ప్రభుత్వ 3446 ఉద్యోగాలు. అర్హత పదవ తరగతి పోస్టల్ ఉద్యోగాలు .తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్  విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో మొత్తం 3446 ఖాళీలు ఉండగా.. అందులో ఏపీలో 2296, తెలంగాణలో 1150 ఉన్నాయి. ఇందులో బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్,  అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్,  డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు.. పదో తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు మాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో మంచి మార్కులు సాధించాలి. వయస్సు జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. SC/ST అభ్యర్థులకు ఐదేళ్లు, OBC అభ్యర్థులకు మూడేళ్లు, PWD అభ్యర్థులకు పదేళ్లు వయో సడలింపు ఇచ్చారు. ఇతర వివరాలు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్థానిక భాషలో మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల విద్యార్హతలు, పదో తరగతిలో గణితం, ఆంగ్ల సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని

కేటీఆర్ ని క‌లిసిన తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల ‌.

Image
 ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్ ని క‌లిసిన తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త‌. తెలంగాణ రాష్ట్ర వ‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త‌.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ని  క‌లిశారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వెళ్లిన ఆయ‌న కేటీఆర్‌కు పుష్ప‌గుచ్చం అంద‌జేశారు. తెలంగాణాలో ఆర్థికంగా వెనుక‌బడిన వ‌ర్గాల‌కు (ఈ.డ‌బ్ల్యూ.ఎన్) 10 శాతం ఇచ్చినందుకు కేటీఆర్ గారిని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన‌ట్లు ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త తెలిపారు. ఈ సంద‌ర్బంగా టూరిజం కార్పోరేష‌న్ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నందుకు కేటీఆర్‌ అభినందించిన‌ట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని జిల్లాలు తిరిగి మ‌రింత క‌ష్ట‌ప‌డాల‌ని ఆయ‌న చెప్పార‌న్నారు. సీఎం కేసీఆర్ గారి నాయ‌క‌త్వంలో రాష్ట్రం అభివృద్ధిలో మ‌రింత ముందుకు వెళుతుంద‌న్నారు.

నెల్లూరునగర శివారులో ప్రేమజంట ఆత్మహత్య

Image
  *నెల్లూరునగర శివారులో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా రూరల్‌ మండలానికి చెందిన హరీష్‌ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌గా, నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్‌వోగా పనిచేస్తున్నారు. వీరుద్దరూ శుక్రవారం విధులకు హాజరుకాలేదు.*   *నెల్లూరు నగర శివారు ప్రాంతమైన నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఏ కారణమో స్పష్టంగా తెలియదు కాని ఇద్దరూ కలిసి ఓకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రయినా హరీష్‌, లావణ్య ఇంటికి రాకపోవడంతో ఇరువురు కుటుంబ సభ్యులు వీరి కోసం గాలింపు చర్యలుచేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు అర్ధరాత్రి దాటే వరకు ఎలాంటి సమాచారం అందేలేదు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు తెలియాల్సి ఉంది.*

ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో లేగదూడపై చిరుతపులి దాడి

 రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో లేగదూడపై చిరుతపులి దాడి జంగిటి రమేశ్ అనే రైతుకు చెందిన లేగదూడ,ఆందోళనలో గ్రామస్తులు

మితిమీరిన వేగం, మద్యం మత్తులో మరో...

  మితిమీరిన వేగం, మద్యం మత్తులో మరో • మితిమీరిన వేగం, మద్యం మత్తులో మరో రోడ్డు ప్రమాదం. ఐదుగురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు.  • రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ORR పై స్తంబానికి ఢీకొన్న  TS 12EK 0298 నెంబర్ గల షిఫ్ట్ కారు.  • కారు లో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. వారి పరిస్థితి విషమం.  • కారు లొ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో తప్పి పెను ప్రమాదం.  • గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం.  • క్షతగాత్రులు అంతా హైదరాబాద్ లోని టౌలి చౌకి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తింపు.

హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వాడ్టర్స్ లో చోరీ!

  హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వాడ్టర్స్ లో చోరీ! - 16 తులాల బంగారం, కేజీ వెండి, రూ.6లక్షల నగదు అపహరణ - ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో శుక్రవారం సాయంత్రం జరిగిన చోరీ - రంగంలోకి ఏసీపీ వెంకట్ రెడ్డి, సిఐ రమేష్ కుమార్ లు - చోరిపై గోప్యత పాటిస్తున్న పోలీసులు - పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉండే క్వార్టర్స్ లో చోరీ కావడంతో పలు అనుమానాలు

ఒంటిమిట్ట కోదండ రాముని సన్నిధిలో AP రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్..

  ఒంటిమిట్ట కోదండ రాముని సన్నిధిలో AP రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన టీటీడీ వేద పండితులు, అధికారులు.. అభిషేకం లో పాల్గొని సీతారామలక్ష్మణులకు ప్రత్యేక పూజలు.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. పాల్గొన్న రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ కార్గ్, డి.ఎస్.పి శివ భాస్కర్ రెడ్డి..

ఉద్యోగుల సంక్షేమమా.. ఉద్యోగుల దోపిడీనా.. సర్కార్ తేల్చుకోవాలి-బిజెపి నాయకులు పి.మురళీధర్ రావు

Image
  ఉద్యోగుల సంక్షేమమా.. ఉద్యోగుల దోపిడీనా.. సర్కార్ తేల్చుకోవాలి-బిజెపి  నాయకులు పి.మురళీధర్ రావు కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో పీఆర్ సీ ఆలస్యం అయ్యిందని బిజెపి  సీనియర్ నాయకులు పి.మురళీధర్ రావు విమర్శించారు.  బీజేపీ రాష్ట్ర  కార్యక్రమంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీఆర్ సీపై టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు మరో కరోనాలా ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్మెంట్ గణనీయంగా పెంచాలిని  డిమాండ్  చేశారు. కేసీఆర్ అప్పుల సాకుతో ఉద్యోగుల కడుపు కొడుతున్నారుని  ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టే తెలంగాణ ఉద్యోగులకు రూ.20 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలిని గుజరాత్, యూపీలో రూ.20 లక్షల గ్రాట్యుటీ ఇస్తున్నారని. తెలంగాణలో ఎందుకివ్వరని ప్రశ్నించారు. వివిధ యాజమాన్యాల కింద పని చేస్తున్న ఉద్యోగులకు పీఆర్‌సీ ఎందుకు వర్తింపచేయరని  ఉద్యోగుల సంక్షేమమా.. ఉద్యోగుల దోపిడీనా.. టీఆర్ఎస్ సర్కార్ తేల్చుకోవాలిని అన్నారు.

మే 13 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఆచార్య'

Image
  మే 13 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఆచార్య'  మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఆచార్య' టీజర్ విడుదల చేసిన కొన్ని గంటలకే, ఆ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మే 13 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు. చిరంజీవికి మే నెల బాగా అచ్చివచ్చిందనే చెప్పాలి.  'ఖైదీ'తో చిరంజీవి స్టార్ గా మారిన తరువాత మే నెలలో ఆయన నటించిన "వేట, జగదేకవీరుడు - అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు" చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో 'వేట' అపజయాన్ని చవిచూడగా, 'మెకానిక్ అల్లుడు' సో సోగా ఆడింది. ఇక చిరంజీవి, శ్రీదేవి జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'జగదేకవీరుడు-అతిలోకసుందరి' చిత్రం 1990 మే 9న విడుదలై విజయఢంకా మోగించింది. ఆ తరువాతి సంవత్సరం అంటే 1991లో అదే తేదీకి విడుదలైన విజయబాపినీడు 'గ్యాంగ్ లీడర్' బాక్సులు బద్దలు చేసింది. 'గ్యాంగ్ లీడర్' ఆ రోజుల్లో ఘనవిజయం సాధించడమే కాదు, ఆ సినిమా వంద రోజుల వేడుకలను సైతం వైవిద్యంగా తెలుగు చిత్రరంగానికి నెలవైన నాలుగు ప్రాంతాల్లోనూ జరిపారు. ఆ తరువాత చిరంజీవి నటించిన 'మ

పోలీస్ శాఖ గౌరవం పెంచడంలో డయల్ 100 సిబ్బంది కీలకం : అదనపు ఎస్పీ నర్మద

Image
 *పోలీస్ శాఖ గౌరవం పెంచడంలో డయల్ 100 సిబ్బంది కీలకం : అదనపు ఎస్పీ నర్మద* - - డయల్ 100 సిబ్బంది పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలి - - విజిబుల్ పోలీసింగ్, ఘటనా స్థలాలకు త్వరితంగా చేరుకునేలా చర్యలు - - డయల్ 100 పనితీరుపై నిరంతర పర్యవేక్షణ నల్లగొండ : పోలీస్ శాఖ గౌరవం, ప్రతిష్ట పెంచడంలో డయల్ 100 సిబ్బంది పనితీరు చాలా కీలకమని దానిని దృష్టిలో ఉంచుకొని మరింత సమర్ధవంతంగా పని చేయాలని అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డయల్ 100 సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డయల్ 100 సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఘటనా స్థలాలకు సాధ్యమైనంత త్వరగా చేరుకునేలా పనితీరు మెరుగు పర్చుకోవాలని ఆమె చెప్పారు. డయల్ 100 సిబ్బంది ఘటనా స్థలాలకు సకాలంలో చేరుకోవడం ద్వారా అక్కడి పరిస్థితులను అదుపు చేయడం, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడం, ఘటనకు బాద్యులైన వారిని అదుపులోకి తీసుకోవడం లాంటి చర్యల ద్వారా పోలీసుల పట్ల ప్రజలలో నమ్మకాన్ని పెంచాలని సూచించారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న బ్లూ కోట్స్, డయల్ 100ల ద్వారా పోలీసుల

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి పది రోజుల జైలు, జరిమానా, లైసెన్స్ రద్దు : ట్రాఫిక్ సిఐ అనిల్

Image
 * మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి పది రోజుల జైలు, జరిమానా, లైసెన్స్ రద్దు : ట్రాఫిక్ సిఐ అనిల్* - - 24 మందిని కోర్టులో హాజరు పరిచిన ట్రాఫిక్ పోలీసులు - - పలువురికి జైలు, జరిమానా, రెండు నెలల లైసెన్స్ రద్దు - - ప్రమాదాల నివారణ కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నల్లగొండ : మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి పది రోజుల జైలు శిక్ష, రెండు నెలల లైసెన్స్ రద్దు, వెయ్యి రూపాయల జరిమాన విధిస్తూ జిల్లా రెండవ తరగతి న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ సిఐ దుబ్బ అనిల్ కుమార్ తెలిపారు. సాధారణం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ఒకటి నుండి అయిదు రోజుల పాటు జైలు శిక్ష, జరిమానా విధించడం జరుగుతుందని కానీ తొలిసారిగా నల్లగొండకు చెందిన సి.హెచ్. శ్రీధర్ అనే వ్యక్తికి శుక్రవారం పది రోజుల జైలు శిక్ష, రెండు నెలల పాటు లైసెన్స్ రద్దు, వెయ్యి రూపాయల జరిమాన ద్వారా మూడు రకాల శిక్ష విధించడం జరిగిందని చెప్పారు. మొత్తం 24 మందిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా వారిలో వి.నర్సింహా రావుకు ఒక రోజు జైలు, వెయ్యి రూపాయల జరిమాన, జి. అంజయ్యకు మూడు రోజుల జైలు, రెండు నెలల లైసెన్స్ రద్దు, వెయ్యి రూపాయల జరిమాన, వంశీ కి రెండు రో

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష విధించిన నాంప‌ల్లి ప్ర‌త్యేక న్యాయ‌స్థానం

 *గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంప‌ల్లి ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ఏడాది జైలు శిక్ష విధించింది.* * బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేప‌థ్యంలో న‌మోదైన కేసు * శుక్ర‌వారం కేసును విచారించిన నాంప‌ల్లి ప్ర‌త్యేక న్యాయ‌స్థానం

హైదరాబాద్ నాంపల్లి లోని టీఎస్పీఎస్సి కార్యాలయాన్ని ముట్టడించిన టిఆర్టీ హిందీ పండిత్ అభ్యర్థులు.

Image
   హైదరాబాద్ నాంపల్లి లోని టీఎస్పీఎస్సి కార్యాలయాన్ని ముట్టడించిన టిఆర్టీ హిందీ పండిత్ అభ్యర్థులు. 👉 హిందీ భాషా పండిత్ ఫలితాలు వెల్లడించి.. పోస్టులను వెంటనే ప్రకటించాలని డిమాండ్. 👉 ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణించాలని.. దేవుడి రూపంలో ఉన్న కేసీఆర్, ఘంటా చక్రపాణి ల ప్లకార్డులు ప్రదర్శన.

బండి సంజయ్ మూడు కేసులు కొట్టి వేసిన కోర్టు

 బండి సంజయ్ మూడు కేసులు కొట్టి వేసిన కోర్టు ప్రజా ప్రతినిధుల కోర్టులో పలు కేసుల విచారణ వేర్వేరు కేసుల్లో బండి సంజయ్, దానం నాగేందర్ హాజరు బండి సంజయ్ మూడు కేసులు కొట్టి వేసిన కోర్టు ఎన్నికలప్పుడు కరీంనగర్ లో బండి సంజయ్ పై నమోదైన 3 కేసులు కొట్టివేత తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న మంత్రి మల్లారెడ్డి అభ్యర్థన తోసిపుచ్చిన కోర్టు బంజారాహిల్స్ లో  నమోదైన కేసులో మంత్రి మల్లారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత ఫిబ్రవరి 11న మల్లారెడ్డి కచ్చితంగా హాజరు కావాలని ఆదేశం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గ‌జ్వేల్‌లో మొక్క‌లు నాటిన ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల

Image
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా  గ‌జ్వేల్‌లో మొక్క‌లు నాటిన   ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల  గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గ‌జ్వేల్‌లోని హ‌రిత హోట‌ల్ ప్రాంగ‌ణంలో తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త మొక్క‌లు నాటారు. మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్‌.సి రాజ‌మౌలి గుప్త‌, కౌన్సిల‌ర్ల‌తో క‌లిసి ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా శ్రీ‌నివాస్ గుప్త‌తో పాటు వారంతా మొక్క‌లు నాటారు. భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని ఇప్ప‌టినుంచే ప‌చ్చ‌దాన్ని పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని శ్రీ‌నివాస్ గుప్త అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు వెళుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని హరిత హోటల్స్ లో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. పుస్తకాల్లో చదివిన అశోక చక్రవర్తిలా సీఎం కేసీఆర్ గారు చరిత్రకెక్కారన్నారు. దశాబ్దాల వరకు ఆక్సిజన్ కి ఇబ్బందులు లేకుండా కోట్లాది మొక్కలు సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో నాటడం జరిగిందన్నారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మన స్పూర్తితో మొక్కలు నాటుతున్నారన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ వైస్ చై

వారణాసిలో కేసీఆర్ కుటుంబం..

Image
  వారణాసిలో కేసీఆర్ కుటుంబం.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. కేసీఆర్ శ్రీమతి శోభ, ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా వారణాసిలో పర్యటిస్తున్నారు అక్కడ పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం వారణాసికి వెళ్లింది. రెండు రోజుల పాటు అక్కడే కుటుంబ సభ్యులు పర్యటించనున్నారు. సీఎం సతీమణి శ్రీమతి శోభ, కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఇతర కుటుంబ సభ్యులు వారణాసిలో పర్యటిస్తున్నారు. ఇవాళ రేపు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటిస్తారు. తొలుత అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బొట్లో ప్రయాణం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్ లో గంగా హారతి, గంగా పూజలు నిర్వహించనున్నారు. అస్సి ఘాట్ కు బోట్లో‌ తిరుగు‌ ప్రయాణం అవుతారు. సంకత్మోచన్ దేవాలయాన్ని దర్శిస్తారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవుడికి పట్టు వస్త్రాల‌ కూడా సమర్పించనున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల వారణాసి పర్యటన ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేటీఆర్ సీఎం అవుతారన్న వార్తల నేపథ్యంలో సీఎం కుటుంబం వారణాసి పర్యటన మరింత

ఎసిబికి చిక్కిన బొండపల్లి ఎలక్రికల్ ఈ ఈ

 ఎసిబికి చిక్కిన బొండపల్లి ఎలక్రికల్ ఈ ఈ దాసరి మురళీమోహన్ రావు * పొలానికి విద్యుత్ కనెక్షన్ మంజూరుకు 10 వేలు లంచం డిమాండ్ చేసిన ఈ ఈ  * ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు * లంచం ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

తాండూరు విద్యుత్ కార్యాలయంలో ఎసిబి అధికారుల దాడులు..

Image
  వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో ఎసిబి అధికారుల  దాడులు.. 20000రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కంప్యూటర్ ఆపరేటర్  సాబిల్ .. ఏఢి రామ్ దాస్  డబ్బులు డిమాండ్ చేసినట్లుగా సమాచారం .. కొనసాగుతున్న ఏసీబీ అధికారుల దాడులు..

తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర - పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,

తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర  - పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,  తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అన్యాయం చేస్తున్నారు   కెసిఆర్ నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారు  కెసిఆర్ పూర్తిగా నిరంకుశంగా పాలన సాగిస్తున్నారు  7.5% ఫిట్ మెంట్ ఇవ్వడం ఉద్యోగులను తీవ్ర నిరాశ కలిగించింది కెసిఆర్ ఆదేశాల మేరకే 7.5% ఫిట్మెంట్ నిర్ణయం జరిగింది  43% తగ్గకుండా ఉద్యోగస్తులకు ఫిట్మెంట్ ఇవ్వాలి లేకుంటే ఉద్యోగస్తులు చేసే అన్ని ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది  హౌస్ అలవెన్స్ తగ్గించడం ఉద్యోగస్తులంటే చులకన భావంతో చూడటమే  రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ పీఆర్సీ రిపోర్ట్ వెల్లడించింది రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంచడం సిగ్గు చేటు ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు .. అందుకే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్యోగుల ఫ్రెండ్లీ గా పనిచేశాయి ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు .. ఉద్యోగులు గమనించాలి .. ప్రభుత్వంపై ఉద్యోగులు తురగబడాలి .. ఉద్యమించాలి.. *జీవన్ రెడ్డి,ఎమ్మెల్సీ ..* 7.5 %ఫిట్ మెం

కోయిలమ్మ హీరో సమీర్ అలియాస్ అమర్ రాయదుర్గం ps లో కేసు నమోదు

 కోయిలమ్మ హీరో సమీర్ అలియాస్ అమర్  రాయదుర్గం ps లో   కేసు నమోదు కోయిలమ్మ హీరో సమీర్ అలియాస్ అమర్  రాయదుర్గం ps లో   కేసు నమోదైంది  ..తాగిన నిషాలో  మణికొండ లో ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి  దిగాడు  ..ఒంటరిగా ఉన్న మహిళలపై అసభ్యంగా మాట్లాడుతూ  రెచ్చిపోయాడు  రాత్రి  తొమ్మిది గంటలకు  మహిళ ఇంటికెళ్లి attack చేసి ఆమె దగ్గరున్న వస్తువులోనే లాక్కెళ్లి లైంగిక వేధింపులు చేశారని  మహిళ కంప్లైంట్ చేసింది   ..amar తో పాటు ముగ్గురు ఆకతాయిలు  అమర్ girl friend స్వాతి దౌర్జన్యానికి పాల్పడ్డారు  . Boutique  వ్యాపారం చేసుకుంటున్న  శ్రీవిద్య అపర్ణల పై దాడికి పాల్పడ్డారు అయిదు లక్షల నగదు తీసుకున్నారు అడిగితే రౌడీయిజం చేస్తున్నారంటూ..  మహిళలు రాయదుర్గం ps ఆశ్రయించారు వీళ్ల నుంచి ప్రాణహాని ఉంది అంటూ మహిళ వేడుకుంది  దీంతో అలర్ట్ అయిన పోలీసులు మహిళలకి రక్షణ ఇచ్చి  కోకిలమ్మ హీరోపై fir నమోదు చేశారు  .

కరోనా వాక్సిన్ వేయించుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి జిజిహెచ్ లో చికిత్స పొందుతూ మృతి

 కరోనా  వాక్సిన్ వేయించుకున్న  ఆశా  వర్కర్ విజయలక్ష్మి జిజిహెచ్ లో చికిత్స పొందుతూ  మృతి  బ్రెయిన్ స్ట్రోక్  తో చనిపోయిందని వైద్యుల ప్రకటన ! ****        ***** రంగారెడ్డి: • రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డు పై రోడ్డు ప్రమాదం.  • డీవైడర్ ను డీ కొట్టిన ఆశోకా లీల్యాండ్ గూడ్స్ వాహనం. అదుపు తప్పి రోడ్డు పై బోల్తా. డ్రైవర్ మున్నా తో పాటు క్లీనర్ అక్కడికక్కడే మృతి. • ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.

భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సాగు నీటి కోసం రైతుల ధర్నా

Image
  *భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సాగు నీటి కోసం రైతుల ధర్నా*  పెద్దవుర మండలం కొత్తలురు గ్రామం వద్ద చెపురు చెరువుకు నుండి కొత్తలూరు వచ్చె నీటి వినియోగం కోసం ఆ గ్రామంలో *చెక్ డ్యాం* ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది కాని చెక్ డ్యామ్ ఏర్పాటు చేసిన కానీ పక్కన తూము ద్వారా నీటి దిగువకు ఇస్తే 200 ఎకరాల వరకు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అని రైతులు ఓక తూమును ఏర్పాటు చెయ్యాలని రైతులు ధర్నా నిర్వహించడం జరిగినది... విషయం తెలుసుకున్న బీజేపి జిల్లా అధ్యక్షులు *కంకణాల శ్రీధర్ రెడ్డి* గారు ధర్నా కు సంఘీభావం తెలిపారు... అనంతరం సంబంధిత అధికారి DE గారితో మాట్లాడి ప్రస్తుతం నీటి వినియోగం కోసం నీరు వృధా కాకుండా ప్రక్కనే చిన్నా కాలువ ఏర్పాటు వ్యవస్థను శ్రీధర్ రెడ్డి గారు దగ్గర వుండి ఆ కాలువ పనులు పూర్తి చేపించారు... ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి , పెద్దవూర మండల అధ్యక్షులు ఎరుకొండ నర్సింహ , కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నులక వెంకట్ రెడ్డి గారు , కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు శంకర్ రావు , కత్తి శంకర్ రెడ్డి , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండలో నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమం ప్రారంభం

Image
 నల్లగొండలో నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమం  ప్రారంభం నల్లగొండలో నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భసంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగనిరతి, నిబద్దత, ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిలో దేశభక్తిని నింపుతాయని  అన్నారు..... అలనాటి స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోష్ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో జనగణమన ఉత్సవసమితి ఆధవ్వర్యలో నల్లగొండలో నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు... పట్టణంలోని స్ధానిక సుభాష్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా జడ్జి రమేష్ బాబతో పాటు ఎస్పి రంగనాధ్ తో కలిసి మండలి చైర్మన్ గుత్తా పాల్గొన్నారు... ఈసందర్భంగా వారు ముందుగా జాతీయపతాకావిష్కరణ చేసి ముందుగా నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు... అనంతరం ఆజాద్ హిందుఫౌజ్ జండాకూడా ఆవిష్కరించి నేతాజి జయంతి వేడుకలలో పాల్గొన్నారు... విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విగ్రహం వద్ద జైహింద్ నినాదాలు చేశారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుడు, అద

రామాలయం నిర్మాణ నిధి సేకరణకు భారి స్పందన

Image
అయోధ్య రామాలయం నిర్మాణ నిధి సేకరణకు భారి స్పందన నల్గొండ హైదరాబాద్ రోడ్డులో ఉన్న కాకతీయ కాలనీ లో నిధి సేకరణ కు  భారీగా స్పందిస్తున్న కాలనీవాసులు. ఈ నెల 20నుండి ఫిబ్రవరి 15 వరకు నిధి సేకరణ కార్యక్రమంలో భాగంగా  ఈ రోజు కాకతీయ కాలనిలో నిధి సేకరణ ప్రారంభించారు. దీనికి మొదటి రోజే భారీ స్పందన లభించింది. కాలనీ వాసులు గంజి వెంకటేశం, ముల్కి  రమేష్ లు చేరి  5116 రూపాయల చేక్కు అందచేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర బస్తి నిధి సేకరణ డాక్యుమెంట్ ప్రముక్ భూపతి లక్ష్మీనారాయణ, కాలనీ కోశాధికారి రాపోలు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

అంగడిపేట రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు గంగిడి, కంకణాల పరామర్శ

Image
  అంగడిపేట రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు  గంగిడి, కంకణాల పరామర్శ నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం చింతబావి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు కూలీ పనులకై వెళ్లి తిరిగివస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ఆటోను డ్రైవర్ తప్పిదం కారణంగా లారీ ఢీకొనగా, 9 మంది దుర్మరణం చెందారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియ ప్రకటించాలాని డిమాండ్ చేయగా భాజపా శ్రేణులను అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ ఒత్తిడి కారణంగా జిల్లా మంత్రి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియ మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రకటించారని బీజేపీ నాయకులు తెలిపారు. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.20,000 చొప్పున ( 9 కుటుంబాలు) ఆర్థిక సహాయాన్ని బిజెపి నల్గొండ జిల్లాధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి మరియు నియోజికవర్గ నాయకులు కేతావత్ లాలు నాయక్ తో కలిసి  బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా||జి.మనోహర్ రెడ్డి అందజేశారు 

ఎసిబి కి చిక్కిన లేబర్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్

Image
  ఎసిబి కి చిక్కిన లేబర్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ ఈ రోజు  శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు  ఇన్సూరెన్స్ ఫైల్  మూవ్ చేయడానికి15000 లంచం తీసుకుంటు ఎసిబికి చిక్కిన  భద్రాద్రి కొత్తగూడెం  లేబర్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్  ఎస్కె రబ్బానీ. 

అగ్రవర్ణ పేదల 10 శాంతం కు రిజర్వేషన్ అమలుకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపిన కేసీఆర్

Image
  అగ్రవర్ణ పేదల 10 శాంతం కు రిజర్వేషన్ అమలుకు  నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన EBCవర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు  ముఖ్యమంత్రి పేదల పక్షపాతి  కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఇ.డబ్య్యు.ఎస్.లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇడబ్ల్యుఎస్ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. 

* ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్* *సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన ధర్మాసనం*

 *అమరావతి* * ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్* *సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన ధర్మాసనం* *ఎన్నికలు సజావుగా జరగాలన్న హైకోర్టు* *పంచాయితీ ఎన్నికలకు ఈనెల 8న షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ* *ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం* *టీకా పంపిణీ వల్ల ఎన్నికలు ఇప్పుడే ఎన్నికలు నిర్వహించలేమన్న ప్రభుత్వం* *11 న ఎస్ఈసీ ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు సింగిల్ జడ్జి* *సింగిల్ జడ్జి ఆదేశాలపై అప్పీల్ కు వెళ్లిన ఎస్ఈసీ* *3 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం* *ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్న ధర్మాసనం* *హైకోర్టు తాజా తీర్పుపై సుప్రీం కోర్టు కు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం* *ఎస్ఈసీ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 23 నుంచి నోటిఫికేషన్* *4 విడతల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లు* *ఫిబ్రవరి 4 నుంచి ఎన్నికలు నిర్వహించాలని గతంలో ఎస్ఈసీ నిర్ణయం*

రామ మందిరానికి విరాళాలు సేకరణకు జరిగిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే క్రాంతి

Image
 రామ మందిరానికి విరాళాలు సేకరణకు జరిగిన బైక్ ర్యాలీని  జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే క్రాంతి  అయోధ్య శ్రీరామ జన్మభూమిలో జరిగే రామ మందిరానికి విరాళాలు సేకరణ కొరకు జరిగిన బైక్ ర్యాలీలో నియోజకవర్గము హిందూ అన్నదమ్ములతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. నిధి సేకరణ కొరకు నిర్వహించిన ర్యాలీని కాషాయ జెండా ఊపి ప్రారంభించారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్బంగా ఆయన పిలుపునివ్వడం జరిగింది.

ఏసీబీ కి పట్టుబడిన తెలంగాణ రాష్ట్ర వారెహౌసింగ్ కార్పొరేషన్ ఎండి.భాస్కరా చారి,

 *నాంపల్లిలోని గిడ్డంగుల శాఖలో ఏసీబీ అధికారుల సోదాలు* రిటర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ మూమెంట్ లో లంచం అడిగిన అధికారులు 70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన A1 తెలంగాణ రాష్ట్ర వారెహౌసింగ్ కార్పొరేషన్ ఎండి.భాస్కరా చారి,A2 సుపెర్డెన్టింగ్ ఇంజీనీర్&జనరల్ మేనేజర్ ఎం.సుధాకర్ రెడ్డి.

హన్మంత్ పై దాడి అప్రజాస్వామికం :అల్లం

Image
 హన్మంత్ పై దాడి అప్రజాస్వామికం :అల్లం హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, లోక్ జాగారణ్ ఎడిటర్ ఆల్వాల హన్మంత్ పై దాడి ఆప్రజాస్వామికమని టీయూడబ్ల్యూజే 143 అధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మంగళవారం హన్మంత్ ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్మల్ జిల్లా భానాపూర్ పట్టణంలో లోక్ జాగారణ్ తెలుగు దినపత్రిక ఎడిటర్ ఆల్వాల్ హన్మంత్, షత్రిక కార్యాలయంపై దాడి చేయడం అమానుషమన్నారు. ఈనెల 13న హైదరాబాద్ కు వెళ్లేందుకు బస్సులో బయలుదేరగా కార్యాలయానికి చేరువలోకి రాగానే బస్సులో నుంచి సుమారు 15 మంది దుండగులు హన్మంత ను దించివేసి ఈడ్చుకుంటూ కార్యాలయంలోకి లాక్కెళ్లడం రెండుగంటల పాటు నిర్భంధించడం సహేతుకం కాదన్నారు. హన్మంత్ పై దాడిచేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ హన్మంత్ కు యూనియన్ అండగా నిలుస్తుందని టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ యాతాకుల అశోకలు భరోసా కల్పించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకునేందుకు యూన

PCB రంగారెడ్డి రీజినల్ 1లో ఆర్టీఐ బోర్డ్ పెట్టం.. నిబంధనలు పాటించం.. సమాచారం కూడా ఇవ్వం... చేస్తారో.....కోండి.

Image
PCB రంగారెడ్డి రీజినల్ 1లో  ఆర్టీఐ బోర్డ్  పెట్టం.. నిబంధనలు పాటించం.. సమాచారం కూడా ఇవ్వం... చేస్తారో.....కోండి. 2005 ఆర్టీఐ యాక్టు వచ్చి 15 ఏండ్లు అయిన  అమలు పరచడములో మరియు  సమాచారం ఇవ్వడంలో, నిబంధనలు అమలు పరచడములో అధికారులు విఫలం చెందుతున్నారు. అందుకు ఉదాహరణ బేగంపేటలోని  రంగారెడ్డి జిల్లా పర్యావరణ నియంత్రణ రీజినల్ 1 వ కార్యాలయంలో నిబందన ప్రకారం  పిఐవో , apio, అప్పిలేటు అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు వ్రాయించి బోర్డు ఏర్పాటు చేయాలి. దానితో పాటు సెక్షన్ 4 (1)బి ప్రకారం అన్ని 17 annexure లు ఉంచాలి.  కానీ  అధికారులు మాత్రం ఏర్పాటు చేయకుండా  నిర్లక్ష్యం వహించి  చట్ట స్ఫూర్తిని  నీ రుగారుస్తున్నారు. మా ప్రతినిధి rti దరఖాస్తు సమర్పించడానికి ఆ కార్యాలయానికి  వెళ్లి ఈ విషయం పై  పిఐవో అడగ్గా అవునండి బోర్డు ఏర్పాటు చేయలేదని బదులు ఇవ్వడం వారికి విధులు పై ఉన్న శ్రద్ధ  ఏ పాటిదో అర్ధం అవుతుంది. అంతేగాకుండా. దరఖాస్తు రుసుము క్రింద నగదు కూడా తీసుకోవచ్చన్న నిభందనను  అమలు పరచడం లో  విఫలం అవుతు  దరఖా స్తు దారుల హక్కులను కాల రాస్తున్నారు.  ఈ ఆఫీసు పై అంతస్తులో ని  ఆఫీస్ లో  ఈఈ  నిబంధనల కు విరుద్ధంగా 10

చారిత్రాత్మక కాపురాల గుట్టను ఎకో పార్క్ గాఅభివృద్ధికి ఆలోచన

Image
 చారిత్రాత్మక కాపురాల గుట్టను ఎకో పార్క్ గాఅభివృద్ధికి ఆలోచన *దారి లేని ప్రమాదకర జారుడు బండరాళ్లపై నుండి కాపురాల గుట్టను అధిరోహించి గుట్టను  సందర్శించిన. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి *త్వరలోనే ముఖ్యమంత్రి వద్దకు ప్రతిపాదనలు*  *ఇప్పటికే లతీఫ్ సాబ్ గుట్టపైకి, బ్రహ్మంగారి గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం* . నేడు  నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు నల్లగొండ కు సింహద్వారాలు గా ఉన్న  లతీఫ్ సాబ్ గుట్ట, కాపురాల గుట్ట ల ను  పర్యాటక,  సుందర ప్రదేశాలు గా తీర్చిదిద్దడానికి మొడటి అడుగు వేశారు.  ఇప్పటికే లతీఫ్ సాబ్ గుట్టపైకి, బ్రహ్మం గారి గుట్ట పైకి ఘాట్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ లు  సిద్ధం చేయగా,   ప్రస్తుతం నల్గొండ శాసనసభ్యుల మదిలో చారిత్రాత్మక కాపురాల గుట్టను ఎకోపార్క్ గా  అభివృద్ధి చేయటానికి బీజం పడింది ఈరోజు ఎక్కడానికి దారి లేక జారుడు బండ రాళ్లపై నుండి అత్యంత ప్రమాదకర దారి నుండి కాపురాల గుట్ట ను  అధిరోహిస్తూ నల్లగొండ కిరీటం లో మరో మణి నీ పొదగడానికి ఆలోచన చేశారు గుట్టపై వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ ఏ విధంగా గుట్టపై అభివృద్ధి కి అవకాశాలు ఉన్నాయో పరిశీలించారు..  ఇప

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులుగా నూకల నర్సింహ రెడ్డి, పల్లెబోయిన శ్యామసుందర్.

Image
 తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులుగా  నూకల నర్సింహ రెడ్డి, పల్లెబోయిన శ్యామసుందర్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులుగా  బీజేపీ సీనియర్ నాయకులు  నియమింపబడ్డ నూకల నర్సింహ రెడ్డి, పల్లెబోయిన శ్యామసుందర్ లకు శుభాకాంక్షలు.

* సహృదయంతో దాతృత్వం చాటుకున్న కర్నాటి విజయకుమార్ గుప్త కు అభినందనలు*.

Image
*అమ్మా...నాన్న...అన్నీ నాయనమ్మే! అనే వార్త ఈనాడు దినపత్రికలో చూసి సహృదయంతో స్పందించి వెంటనే సిద్ధిపేట జిల్లా రాయపోలు మండలం, అనాజిపూర్ గ్రామంలోని నిరుపేద చిన్నారులు అరుణ్,అరవింద్,హారిక లకు కొత్త బట్టలు అందించి వారితో పాటు సంక్రాంతి పండగ జరుపుకున్నారు అలాగే వారికి తక్షణ అవసరాలకోసం ఇరవైవేల రూపాయలు ఇవ్వడంతో పాటు వాళ్లు చదువుకుని వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేవరకు అండగా ఉంటాను అని ప్రకటించి   నిరుపేదలకు నిజమైన సేవకుడని నిరూపించుకున్నారు. తాను చేస్తున్నఈ సేవాతత్పరత కార్యక్రమాలు మనకు మరెందరికో స్ఫూర్తిదాయకం. మరో సారి హృదయపూర్వక అభినందనలు.

ఈ నెల 18న నల్లగొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం - నిమ్మల

Image
ఈ నెల 18న నల్లగొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం 18.01.2021 సోమవారం ఉదయం 11.00 గంటలకు  బాలాజీ గార్డెన్స్, nidmanoor లో జిల్లా అధ్యక్షుడు  కంకణాల శ్రీధర్ రెడ్డి అధ్యక్షత  జరుగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి  నిమ్మల రాజశేఖర్ రెడ్డ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం లో బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మరియు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొనాలని కోరారు. సమావేశం నకు 10 నిముషాల ముందు రావలెనని విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ కు అల్టిమేటం ఇచ్చిన బండి సంజయ్

Image
 జనగాం ఘటనపై  24 గంటల్లో కేసీఆర్ స్పందించాలని  అల్టిమేటం ఇచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్  జనగామలో మంగళవారం   మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న బిజెపి కార్యకర్తలపై పోలీసులు అప్రజాస్వామికంగా, నిర్ధాక్షిణ్యంగా దాడి చేశారని,  రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు, లాఠీచార్జ్ లను ప్రోత్సహిస్తూ కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  జనగాంలో పోలీసుల లాఠీచార్జ్ లో  గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి కార్యకర్తలను ఆయన  పరామర్శించారు. బిజెపి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫామ్‌హౌస్‌కు పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని, రాష్ట్రంలో స్వామి వివేకానంద గారి జయంతిని జరుపుకునే పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ కార్యకర్తలు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను జరిపితే మున్సిపల్ కమిషనర్‌కు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. అసలు వివేకానందుడి ఫ్లెక్సీ పెడితే అ

శంషాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్.

Image
  కరోనా ఖతం* హైదరాబాద్:-శంషాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్.  పూణే నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కరోనా వ్యాక్సిన్.  మరికొద్ది సేపట్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు కంటైనర్ల ద్వారా పంపిణీ కానున్న వ్యాక్సిన్.

కదంతొక్కిన జర్నలిస్టు

Image
 కదంతొక్కిన జర్నలిస్టు..  తెలంగాణ రాష్ట్రంలో చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారిని ఆదుకోవాలని ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమం అం హైదరాబాదులోని ఎన్టీఆర్ కార్యాలయంలో ఈరోజు సోమవారం విజయవంతం అయింది ఈ కార్యక్రమానికి పలువురు యూనియన్ నాయకులు పాల్గొని మరియు రాష్ట్రంలోని వివిధ చిన్న పత్రిక అధిపతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రియాజ్ మాట్లాడుతూ చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు సమస్యలను అధికారులు కొంతమేరకు పరిష్కరించడానికి కృషి చేశారని అదేవిధంగా చిన్న పత్రికలకు ప్రకటనలు ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ధర్నా అనంతరం అడిషనల్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ   నాగయ్య గారికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ తో మాట్లాడి యూనియన్ నాయకులు తో మాట్లాడే విధంగా కొంత సమయాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమేష్ కార్యదర్శి గోళ్ల  రమేష్ ష్ప్రింట్ మీడి

తెలంగాణ రాష్ట్రం లోని చిన్న పత్రికలకు నెల నెలా యాడ్స్ ఇవ్వాలని డిమాండ్

Image
 *తెలంగాణ రాష్ట్రం లోని చిన్న పత్రికలకు నెల నెలా యాడ్స్ ఇవ్వాలని డిమాండ్* *ఐ అండ్ పి ఆర్ కమిషనర్ కార్యాలయం ముందు బైటాయింపు, నిరసన, ధర్నా* హైద్రాబాద్ జనవరి, 11.  రాష్ట్ర వ్యాప్తంగా  చిన్న పత్రికలకు ప్రతి నెల నెలా ప్రకటనలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం వివిధ చిన్న పత్రికల సంఘాల నాయకులు సమాచార శాఖ ఆఫీస్  లో  ఇంచార్జి  డైరెక్టర్ నాగయ్య ఛాంబర్  ముందు       బైఠాయించి ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఐ అండ్ పి ఆర్  డైరెక్టర్ నాగయ్య కాంబ్లే ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  నాగయ్య మాట్లాడుతూ వారం రోజుల్లో కమిషనర్ గారితో  సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, తో పాటు వివిధ సంఘాల నాయకులు అధ్యక్షులు  మరియు, అగస్టీన్, జానకిరామ్,  దాయనంద్  సెక్రటరీ బాలకృష్ణ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ చాటింపు అశోక్,ఎండి రియాజ్, అజాం ఖాన్, జాన్ షాహీద్, ఇక్బాల్, ఉస్మాన్ రాసీద్, సమద్,   మాతంగి దాస్,   గొల్ల రమేష్,    అక్తర్ హుస్సేన్,  రవి,  సుధీర్  కుమార్, నరసింహ, మసూద్,నవీన్ కుమార్, ఖాసీం,ఆఫ్రోజ్ ,అలీ,మహీమూద్, వెంకటయ్య, కొండ కింది మాధ

తండా బచావో అంటూ గిరిజన చైతన్య యాత్ర చేపడుతున్న కంకణాల నివేధిత.

Image
తండా బచావో అంటూ పొడు భూముల పట్టాల కోసం నెల్లికల్ లిఫ్ట్ నిర్మాణం కోసం గిరిజన చైతన్య యాత్ర చేపడుతున్న నాగార్జున సాగర్ నియోజక వర్గ  బీజేపీ ఇంచార్జి కంకణాల నివేధిత.  దశాబ్దాల గిిరిజనుల సమస్యల పరిష్కారం  కొరకు ఈ యాత్ర చెపడుతున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు నాగార్జున పేట నుండి ఈ యాత్ర  ప్రారంభమై రాత్రి 10 గంటలకు తండా నిద్ర తో నాయకన్ తండా లో ముగుస్తుంది.

శేషమ్మగుడెంలో బీజేపీ జెండా ఎగరేసిన మాదగోని

Image
  శేషమ్మగుడెంలో బీజేపీ జెండా ఎగరేసిన  మాదగోని నల్గొండ నియోజకవర్గంలోని శేషమ్మ గూడెం 3వ వార్డులో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్  భారతీయ జనతా పార్టీ జెండావిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వివిధ పార్టీల నుండి యువకులు బిజెపి లో చేరారు.మోడీ గారు చేసిన అభివృద్ధి పనులను చూసి పార్టీలో చేరడం జరిగిందని యువకులు అన్నారు. పార్టీలో చేరిన వారిలో గాదరి శ్రీను, పేర్ల ప్రభంజన్, పేర్ల ఎల్లయ్య పలువురు చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఓరుగంటి రాములు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, , మిట్టపల్లి సుదర్శన్, మొరిశెట్టి నాగేశ్వరరావు, మైనం మల్లయ్య, చర్లపల్లి గణేష్, ఐతరాజు సిద్ధు, గుండ వినయ్, పోకల దశరథ,  గాలి శ్రీనివాస్, ఏరుకొండ హరి, బోడ వంశీ యాదవ్ గార్లు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్గొండ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షునిగా పిల్లి రామరాజును, ప్రధాన కార్యదర్శిగా బోనగిరి దేవేందర్ ను నియమించి ఎమ్మెల్యే కంచర్ల

Image
 నల్గొండ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షునిగా పిల్లి రామరాజు  ప్రధాన కార్యదర్శిగా బోనగిరి దేవేందర్ ను నియమించినట్లు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ నిర్ధేశించిన కార్యక్రమాలు విజయవంతం చేస్తూ , కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సంక్షేమ పథకాలు గడప గడపకు చేరాలని,  పార్టీ అభివృద్దికి తోడ్పడాలని కోరారు.

జిల్లా కేంద్రం లో ఈ నెల 16 వ తేదీ న గొర్రెల పంపిణీ కార్యక్రమం

Image
  *జిల్లా కేంద్రం లో ఈ నెల 16 వ తేదీ న గొర్రెల పంపిణీ కార్యక్రమం* *కార్యక్రమం లో పాల్గొననున్న రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, రాష్ట్ర పురపాలన,పట్టణ అభివృద్ధి,  ఐ.టి. శాఖ మంత్రి కె. టి.ఆర్., విద్యుత్ శాఖ మంత్రి జి.జగ దీశ్ రెడ్డి,రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి శాఖ మంత్రి టి. శ్రీనివాస్ యాదవ్* నల్గొండ,జనవరి 9.ఈ నెల 16 వ తేదీన జిల్లా కేంద్రం లో గొర్రెల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, రాష్ట్ర పురపాలన, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె. తారక రామారావు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, రాష్ట్ర పశు సంవర్థక,  మత్స్య,పాడి పరిశ్రమ అభివృద్ధి,సినిమోటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమోటగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లా కేంద్రం లో నిర్వహిం

కొమురవెళ్ళి మల్లన్నను దర్శించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
 కొమురవెళ్ళి మల్లన్నను దర్శించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  కోమురవెళ్ళి శ్రీ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణం సందర్భంగా.. శనివారం రోజున  తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సతిసమేతంగా కోమురవెళ్ళి శ్రీ మల్లికార్జున స్వామి వార్లను దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వార్లకు కోరమీసాలు సమర్పించి మెుక్కులు చెల్లించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ నుండి టూరిజం బస్ హైదరాబాద్ నుండి కోమురవెళ్ళి దేవాలయంనకు ఎర్పాట్లు చేస్తానని తెలిపారు.  అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో చర్చించి కొమురవెళ్ళిలో టూరిజం హోటల్ (హరిత) ఎర్పాటు తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. వీరి వెంట తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక కమిటీ చైర్మెన్(ఐవిఎఫ్) వంగపల్లి అంజయ్య స్వామి, మంచాల శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు, ఐవిఎఫ్ నాయకులు, కొమురవెళ్ళి

జిల్లా లో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతం

Image
*జిల్లా లో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతం* * *జిల్లా కలెక్టర్,జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారితో కలిసి డ్రై రన్ ప్రక్రియ  పర్యవేక్షణ* * *నల్గొండ జిల్లా కేంద్రం లో పానగల్,లైన్ వాడ అర్బన్ హెల్త్ సెంటర్ లు,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, మాన్యం చెల్క,రాముల  బండ పిహెచ్.సి  లలో డ్రై రన్ ను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్* నల్గొండ,డిసెంబర్ 8.కోవిడ్   టీకా   ముందస్తు  సన్నాహకాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా  వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యం లో  డ్రై రన్  కార్యక్రమం  విజయవంతం గా నిర్వహించారు. నల్లగొండ  జిల్లా వ్యాప్తంగా  47 కేంద్రాల్లో  ముందుగా రిజిస్టర్ చేసుకున్న 1175 మంది వైద్య ఆరోగ్య శాఖ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి   శుక్రవారం నమూనా  వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నినిర్వహించారు. 47 కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం లో రిజిష్టర్ చేసుకిన్న 25 మంది వైద్య,ఆరోగ్య సిబ్బందికి నమూనా వ్యాక్సి సెషన్ నిర్వహించారు.నల్లగొండ పట్టణంలోని పానగల్ , లైన్ వాడ అర్బన్ హెల్త్  సెంటర్ లలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం,మాన్యం చెల్క,రాముల బండ పి.హెచ్.సి .కేంద్రాల్లో  డ్రై రన్ కార్యక్రమాన్ని  జిల

*శిశు గృహ,చిల్డ్రన్ హోమ్,వృద్ధాశ్రమం వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణ) ప్రతిమా సింగ్*

Image
  *శిశు గృహ,చిల్డ్రన్ హోమ్,వృద్ధాశ్రమం వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణ) ప్రతిమా సింగ్* నల్గొండ,జనవరి 5.నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచన మేరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,ఉద్యోగ సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు అందచేసిన106 దుప్పట్లు,బ్లాంకెట్ లను  అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణ)ప్రతిమా సింగ్ శిశు గృహ,చిల్డ్రన్ హోమ్,వృద్ధాశ్రమం ల లోని వృద్ఫులకు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రం లోని చిల్డ్రన్ హోమ్ కు 8 బెడ్ షీట్ లు,8 బ్లాంకెట్ లు,శిశు గృహ కు 10 బెడ్ షీట్ లు,10 బ్లాంకెట్ లు,గంధంవారి గూడెం మెయర్స్ బాల భవన్ కు 10 బ్లాంకెట్ లు,కలెక్టరేట్ దగ్గర  ఉన్న శాంతి మహిళా మండలి కి 20 బెడ్ షీట్ లు,20 బ్లాంకెట్ లు,నార్కట్ పల్లి లోని ఆదరణ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ కి  10 బెడ్ షీట్ లు,10 బ్లాంకెట్లు మొత్తం  అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిమా సింగ్ పంపిణీ చేశారు. నూతన్ సంవత్సరం సందర్భంగా బొకే లు, స్వీట్ లకు బదులుగా స్వచ్ఛందంగా ఇవ్వదలుచుకుంటే బెడ్ షీట్ లు,బ్లాంకెట్ లు ఇవ్వ వచ్చని కలెక్టర్ సూచన మేరకు పలువురు అధికారులు,సంస్థలు జిల్లా కలెక్టర్ కు అంద చేస

నల్లగొండ లో.. IT హబ్, పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయమని కేటీఆర్ ను కోరిన ఎమ్మెల్యే కంచర్ల

Image
 నల్లగొండ లో.. IT హబ్, పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయమని  కేటీఆర్ ను కోరిన ఎమ్మెల్యే  కంచర్ల నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి  ప్రగతిభవన్ లో పురపాలక,  ఐటీ శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారిని కలుసుకొని నూతన సంవత్సర  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నల్లగొండ లో.. IT హబ్, పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయమని కోరిన ఎమ్మెల్యే . MG యూనివర్సిటీ ని NACC చే గుర్తించబడే  A గ్రేడ్ పొందుటకు కావలసిన మౌలిక వసతులఏర్పాటుచేయాలని, సెరి కల్చర్  మల్బరీ  రైతుల ప్రోత్సాహకాలు విడుదల చేయించాలని  విజ్ఞప్తి చేశారు.  నల్గొండ ను  IT హబ్ తో  ద్వితీయ శ్రేణి నగరంగా సాంకేతిక రంగంలో  అభివృద్ధి పరచాలని, రాష్ట్ర రాజధాని కి అతి దగ్గరగా వున్న ప్రాంతమని,  ప్రతిపాధిత రీజనల్ రింగు రోడ్డు కు కేవలం నలభై కిలోమీటర్ల దూరం లో ఉండడం  అంతర్జాతీయ విమానశ్రాయం అందుబాటులో ఉండడం  మరియు నల్గొండ కు చెందిన NRI లు స్పెల్ బి కంపెనీ అధినేత పాశం కిరణ్ రెడ్డి, మరో కంపెనీ అధినేత పల్రెడ్డి శ్యామ్ తమ సంస్థల ను నల్లగొండ  లో ఏర్పాటు కు  సంసిధత వ్యక్తం చేశారని,  దాదాపుగా ఇరవై కంపెనీ లు, బిపిఓ కేపీఓ కంపెనీ లు సైతం తమ సంస్థ ల ఏర్పాటు కు  సాను

బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలోబండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.

Image
 బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోండి: తిరుపతి ప్రజలకు సంజయ్ పిలుపు ఏపీ ప్రభుత్వం, వైసీపీలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. సోమవారం రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో పునరావృతమవ్వబోతున్నాయని జోస్యం చెప్పారు. ఏపీ హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన ఆయన.. వైసీపీ రెండు కొండలు అంటోందని.. ‘ఏడు కొండలవాడా గోవిందా గోవిందా’ అనేది బీజేపీ సిద్ధాంతమన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం‌ కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామన్నారు. ఏపీ దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు.‌ హిందువుల కానుకలను దారి మళ్ళిస్తోందని ఆరోపించారు. ఏపీ బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. దేవాలయాలపై దాడులకు ఏపీ సీఎం జగన్ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్నారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బీజేపీ పోరాట

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి వాకర్స్ తో నిర్వహించిన ప్రచారానికి అనూహ్య స్పందన

Image
 బీజేపీ  ఎమ్మెల్సీ అభ్యర్థి  ప్రేమేందర్ రెడ్డి వాకర్స్ తో  నిర్వహించిన ప్రచారానికి అనూహ్య స్పందన  నల్గొండ  స్థానిక ఎన్జి కళాశాలలోని వాకర్స్  సభ్యులను కలసి ప్రచారం నిర్వహించిన  బీజేపీ  ఎమ్మెల్సీ అభ్యర్థి  ప్రేమేందర్ రెడ్డి. ఈ ప్రచారానికి  అనూహ్య స్పందన  లభించింది.  పలువురు వాకర్స్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకే భవిష్యత్తు ఉన్నదని మా  సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. కొందరు మైనార్టీ సోదరులు ప్రేమిందర్ రెడ్డికి  సూచనలు చేశారు. ఈ సంధర్బంగా ప్రేమేందర్ రెడ్డి. మాట్లాడుతూ  ఉద్యోగ, నిరుద్యోగ సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలిపారు.  తెలంగాణ లో కేంద్ర  పధకాలను కేసీఆర్ అమలు పర్చక ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. కేంద్రం నుండి అన్ని రకాల నిధులు రప్పించి అభివృద్ధి  కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్,  బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, పల్లెబోయిన శ్యామ్ సుందర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మొరిశెట్టి నాగేశ్వర్ రావు, చర్లపల్లి గణేష్, మాజీ కౌన్సిలెర్స్ రావిరాల వెంక