Posts

Showing posts from September, 2019

టీడీపీ కి గుడ్ బై చెప్పిన వీరేందర్ గౌడ్

Image
టీడీపీ కి గుడ్ బై చెప్పిన వీరేందర్ గౌడ్ టీడీపీ సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామ చేసిన తూళ్ళ వీరేందర్ గౌడ్.  అక్టోబర్ 3న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం

జాతిపిత మహాత్మ గాంధీ 150వ  జయంతి ఉత్సవాలు

Image
  ఆర్యవైశ్య సంఘం నల్గొండ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మ గాంధీ 150వ  జయంతి ఉత్సవాలు      2 అక్టోబర్ 2019 రోజున ఉదయం  9 గంటలకు స్థానిక వాసవి భవన్లో   మహాత్మాగాంధీ 150వ  జయంతిని ఆర్యవైశ్య సంగం ఆధ్వర్యంలో  ఘనంగా  నిర్వహించుచున్నామని ప్రోగ్రాం కన్వీనర్లు.  నాంపల్లి నరసింహ,  దుండిగల్ల ఓంప్రసాద్, బెలిదే వెంకన్న, గుండా కరుణాకర్లు తెలుపారు.  తొలుత మహాత్మా గాంధీ, కస్తూరిభా  విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, అనంతరం జాతీయ  పతాక ఆవిష్కరణ చేయబడునని తెలిపారు.              మధ్యాహ్నం 12 గంటలకు  క్లాక్  టవర్ (పెద్ద గడియారం) సెంటర్లో  అన్న సంతర్పణ  కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు  వారు తెలిపారు..           అందురు  కార్యక్రమాలకు హాజరై   మహాత్మాగాంధీ కి నివాళులు  అర్పించి విజయవంతం  చేయవలసిందిగా  కోరుచున్నామని  తెలిపారు  

199 బి' పోస్టులకు ఆర్‌బిఐ నోటిఫికేషన్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు

Image
ఆర్‌బిఐ నోటిఫికేషన్ 2019  199 గ్రేడ్ 'బి' పోస్టులకు  రిక్రూట్‌మెంట్ 2019 కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేడ్ 'బి' పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్య అర్హత వివరాలు, అవసరమైన వయస్సు పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఆర్గనైజేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఎంప్లాయ్‌మెంట్ బ్యాంక్ ఉద్యోగాల రకం మొత్తం  ఖాళీలు .199 లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా పోస్ట్ నేమ్ ఆఫీసర్ గ్రేడ్ బి అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in అప్లైడ్ మోడ్ఆన్‌లైన్ స్టార్టింగ్ తేదీ 21-9-2019  చివరి తేదీ11-10-2019 అర్హత వివరాలు: అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్, M.A, M.Sc, PG డిప్లొమా, MBA / PGDM, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి సమానమైన ఉత్తీర్ణులై ఉండాలి. అవసరమైన వయస్సు పరిమితి: కనీస వయస్సు: 21 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు జీతం ప్యాకేజీ: రూ. 35,150 - రూ. 62.400 / - ఎంపిక మోడ్: ప్రముఖమైనవి ఇంటర్వ్యూ దరఖాస్తు రుసుము: జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ. 850 / - ఎస్సీ

సిట్టిగాడి వార్త...వాత...😊😊😊

సిట్టిగాడి వార్త...వాత...😊😊😊 పాకిస్తాన్ లో ఇమ్రాన్ సారు, అమరావతిలో మా పెద్ద సారు ఒకే రీతిలో బాధ అనుభవిస్తున్నారని వారు పెడుతున్న పెడబొబ్బల వల్ల పరిస్థితి తీవ్రంగా ఉందని పరిశీలకులు అంచనా వేశారని సిట్టికి సమాచారం అందగానే ఇమ్రాన్ సంగతి సెప్పలేను గాని సారు సెప్పినట్లు సిన్న సారు పాలన ఘోరంగా ఉంటే మళ్ళీ పదవి మనకే అని ఎగిరి గంతులు వెయ్యాలి కానీ ఈ పెడబొబ్బలు యేటి అని సిట్టి రుసరుస లాడుతూ ఎడవకు,ఎడవకు ఊరుకో హృదయానికి గాయమైనా తేరుకో అని పాట అందించాడు...ఏటి సెత్తమ్... చిన్న సారు ప్రేమ స్వరూపులు అని సారు అభిమానుల గట్టి నమ్మకం...కొడాలి నాని సారు ఒక పక్క ఎన్టీఆర్ సారు బొమ్మ,మరో పక్క వైస్సార్ గారి బొమ్మ ఎత్తుకుని సేలాకిగా తిరుగుతుంటే కనపడటం లేదా...లక్ష్మీ పార్వతి గారికి మా పార్టీలో సముచిత స్థానం ఇచ్చి గౌరవించాం కదా...మముల్ని ఆడి పోసుకోవటం ఏమి బాగా లేదు అని వారి వాదన... వీరి వాదన ఇలా ఉంటే పెద్ద సారు అభిమానుల వాదన మరోలా ఉంది..ఆరోపణలు చేసినంత ఈజి కాదు మా సారుని ఇరికించటం,ఇప్పటికి ఏమి నిరూపించలేక పోయారు అనే సమయానికి సారు ఎన్నిక సెల్లదు అని హైకోర్టు లో పిటిషన్ వేశారట...పెద్ద సారు  ఇలాటివి ఎన్ని సూడలేదు

వాసవి ట్రస్ట్ వారి శత గురువులకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా

Image
*శ్రీ వాసవి ట్రస్ట్ వారి శత గురువులకు సన్మానం*         సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్  పబ్బ శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యములో ఈరోజు జగిత్యాల లోని వాసవి గార్డెన్ లో నిర్వహించిన ఈ కార్యక్రానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు..

ఇంగ్లీష్ మోజులో తెలుగు భాష ప్రాధాన్యత తగ్గుతుందన ఆందోళన వ్యక్తం చేసిసి మంత్రి జగదీష్ రెడ్డి.  

Image
ఇంగ్లీష్ మోజులో తెలుగు భాష ప్రాధాన్యత తగ్గుతుందన ఆందోళన వ్యక్తం చేసిసిమంత్రి జగదీష్ రెడ్డి.   ఆదివారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని గొట్టిపర్తి గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూరేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ దీపికా యూగందర్ రావు,స్థానిక శాసనసభ్యుడు గాధారి కిశోర్ కుమార్ లతో కలసి ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషను అమ్మ మనసుతో పోల్చారు. అంతటి పవిత్రమైన భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్న విషయాన్ని విస్మరించరాదని ఆయన కోరారు.ఇంగ్లీష్ బాషా అన్నది అవసరం కోసమే నన్న విషయాన్ని గుర్తెరగాలని మంత్రి సూచించారు. తెలుగును నేర్చుకోవడం తో పాటు నేర్పాల్సిన బాధ్యత నేటి సమాజానికి ఉందన్నారు.

మొక్కలు నాటిన ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు.

Image
తెలంగాణ హరిత హారం లో భాగంగా ఆగ్రోస్ చైర్మన్ గారి స్వగ్రామంమైన వరంగల్ రూరల్ జిల్లా, నడికూడా మండలం, నర్సక్కపల్లి గ్రామంలో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటిన ఆగ్రోస్ చైర్మన్  లింగంపల్లి కిషన్ రావు.  

కేటాయించలేదన్న కోపంతో డ్రైవర్‌ ఆటోకు నిప్పు

Image
  పుట్టపర్తి టౌన్‌: పోలీసులు తన ఆటోకు నంబర్‌ కేటాయించలేదన్న కోపంతో డ్రైవర్‌ ఆటోకు నిప్పు పెట్టాడు. ఈ సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చోటు చేసుకుంది. పుట్టపర్తిలో తిరిగే కొన్ని ఆటోల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని భావించిన పోలీసులు కొత్త పద్ధతి తీసుకొచ్చారు. ఆటోలకు నంబర్లు కేటాయించి.. వాటిని మాత్రమే పట్టణంలో తిరిగేందుకు అనుమతులు ఇచ్చారు. ఇంకా 150 ఆటోలకు వివిధ కారణాలతో నంబర్లు కేటాయించలేదు. ఇలా నంబర్‌ లేని డ్రైవర్లు తమ ఆటోలకు నంబర్లు కేటాయించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డీఎస్పీకి, సీఐకి వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం కనిపించలేదు.ఈ క్రమంలో పుట్టపర్తిలోని సాయినగర్‌కు చెందిన నాగేంద్ర ఆదివారం మధ్యాహ్నం తన ఆటోకు నిప్పుపెట్టుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే ఆటో కాలిపోయింది. దీంతో పోలీసులు నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు  పుట్టపర్తి టౌన్‌: పోలీసులు తన ఆటోకు నంబర్‌ కేటాయించలేదన్న కోపంతో డ్రైవర్‌ ఆటోకు నిప్పు పెట్టాడు. ఈ సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చోటు చేసుకుంది. పుట్టపర్తిలో తిరిగే కొన్ని ఆటోల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని భావించిన పోలీసులు

సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంబించిన బీజేపీ

*హైదరాబాద్ .. హైదర్ గూడా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంబించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. కేంధ్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. ఎమ్మెల్సీ రాంచంధర్ రావ్* *బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  లక్ష్మణ్ కామెంట్స్..... ఈ కార్యలయం సేవలు ఆందరూ వినియోగించుకోవాలి మన ప్రాంత అభివృద్ధి కి అందరూ సహకరించాలి ఈ కార్యాలయం అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది ప్రజాసమస్యల పరిష్కారం లో ఈ కార్యాలయం ఆదర్షంగా ఉండాలని కోరుకుంటున్నా దీనిని ఇదర్శవంతమైన కార్యాలయం గా రూపుదిద్దుకోవాలి ***కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి*** హైదరాబాద్ అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మెట్రో.. ఎంఎంటీఎస్.. విషయంలో.. ఇల్లనిర్మాణంలో... తాగునీరు ఇవ్వడం లో ప్రభుత్వం వైఫల్యం చెందింది సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అందుబాటులో కార్యాలయం ఉంటుంది దేశవ్యాప్తంగా రుణమేళా ను ప్లారంభించబోతున్నాం  పన్ను చెల్లింపు ను పదిశాతం తగ్గించిన ఘనత మోదీకి దక్కింది 133కోట్లమంది కాకుండు ప్రపంచం అంతా మోదీ పాలన వైపు చూస్తున్నారు మోదీ ప్రభుత్వం పఇరదర్శక పాలన అందిస్తున్నారు మురికి వాడల వారే

కనకదుర్గమ్మ ను దర్శించుకొన్న కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతురావు

  కనకదుర్గమ్మ ను దర్శించుకొన్న కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతురావు అమ్మవారిని శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా రెండు కోర్కెలు కోరుకున్న వి.హెచ్ యూరోనియం తవ్వకాలు ఆపాలని గోదావరి జలాలు తెలంగాణ రాయలసీమ ప్రజలకు ఉపయోగ పడెలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చోరవ చూపాలని కోరా..వి.హెచ్ తెలంగాణా తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి తిరిగి కాంగ్రెస్ తెలంగాణలో అధికారం చేపట్టాలని అమ్మవారిని కోరా..వి.హెచ్

హుజుర్నగర్ టీడీపీ అభ్యర్థిగా కిరణ్మయి.

Image
హుజుర్నగర్ టీడీపీ అభ్యర్థిగా కిరణ్మయి.

భారత్‌కు పర్యాయ పదమే ఆరెస్సెస్, ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో పాక్ ప్రధాని ఇమ్రాన్ RSS గురించి మాట్లాడటంపై ఆ సంస్థ స్పందన

Image
"భారత్‌కు పర్యాయ పదమే ఆరెస్సెస్" ౼ సహకార్యవాహ్ కృష్ణగోపాల్ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో పాక్ ప్రధాని ఇమ్రాన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి మాట్లాడటంపై ఆ సంస్థ స్పందించింది.  భారత్‌కు పర్యాయపదంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను పాక్ ప్రధాని ఇమ్రాన్ మార్చారని, మేమూ అదే కోరుకుంటున్నామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ కార్యవాహ కృష్ణగోపాల్ పేర్కొన్నారు.  ఆరెస్సెస్ ఉగ్రవాదానికి వ్యతిరేకం కాబట్టే ఇమ్రాన్ తమను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. ఇమ్రాన్ తన ఉపన్యాసాన్ని ఆరెస్సెస్ గురించి చెబుతూ ముగించారని, ఇకపై కూడా ఇలాగే కొనసాగిస్తూ ఉండాలని ఎద్దేవా చేశారు.   ఆరెస్సెస్ కేవలం భారత్ కోసమే పనిచేస్తోందని, భారత్‌లోనే పనిచేస్తోందని తేల్చి చెప్పారు.  తమకు పాక్‌తో సహా ప్రపంచంలో మరెక్కడా శాఖలు లేవని తేల్చి చెప్పారు. సంఘ్ పై పాక్ ఎందుకు కోపంగా ఉంది? అంటే.... ఒకవేళ సంఘ్ పై పాక్‌కు కోపం ఉంటే భారత్‌పై కూడా కోపం ఉన్నట్లే లెక్క.  ఎందుకంటే ఆరెస్సెస్, భారత్ రెండూ పర్యాయపదాలు అని  ఆయన తెలిపారు.   ఆరెస్సెస్, భారత్ రెండూ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని, ప్రపంచం కూడా ఇదే దృష్టి కోణంలో చూడాలని తాము భావిస్

సిట్టిగాడి...వార్త...వాత....😊😊

సిట్టిగాడి...వార్త...వాత....😊😊 జననీ శివగామిని జయ శుభకారిణి, విజయ రూపిణి జననీ శివగామిని...నేడు దేవీ నవరాత్రులు ప్రారంభ శుభ సమయంలో మనకి మంచి జరగాలని అమ్మవారిని సిట్టి వేడుకుంటున్నాడు... తిరుపతి లో బ్రహ్మోత్సవం ప్రారంభం కూడా నేడే అవటంతో వ్ స్వామిని కూడా సిట్టి వేడుకుంటున్నాడు...అందరినీ చల్లగా సూడమని.... గ్రామ వాలంటీర్ ఉద్యోగ ముచ్చట...ఈ ఉద్యోగం ఏ మూర్తనా ప్రాంభించారో కానీ విమర్శల సుడి గుండంలో ఇరుక్కుని ఉద్యోగం చేసే వారికి ఆవేదన కలిగించేటట్లుగా రభస కొనసాగుతోంది...చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం రాక వయసు పెరుగుతూ ఇంట్లో వారిని డబ్బు అడగలేక తమ చేతి ఖర్చులకు అయినా వస్తాయి అనే ఉద్దేశంతో అనేక మంది చేరి ఉద్యోగం చేసుకుంటున్నారు...వారికి లేని బాధ విమర్శలు చేస్తున్న వారికి ఎందుకో అర్థం కాదు... ఖాళీగా ఉంటే మీ అబ్బాయి ఇంకా ఉద్యోగం చేయటం లేదా అనే మాటలు పిల్లల తల్లి తండ్రులకి నిత్యం ఎదురు వచ్చే ప్రశ్నలే...అంతెందుకు ఒక సందర్భంలో సిన్న బాబు తమ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనములో ఒక ప్రశ్నకి జవాబుగా గూగుల్ లో నాకే రాలేదు,నీకు ఎలా వస్తది జాబు అని చమత్కారం సేసినట్లు అప్పట్లో ఒక వార్త రౌండ్ వేసింది... మంచి ఉద్యోగం

దశల వారీగా పోలీసులకు వీక్లీ ఆఫ్ లు!

Image
హైదరాబాద్ లో దశల వారీగా పోలీసులకు వీక్లీ ఆఫ్ లు! తొలిదశలో వెస్ట్ జోన్ పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ లు ఆ తర్వాత సిటీ అంతటా అమలు చేస్తాం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ హైదరాబాద్ నగరంలో పోలీసులకు దశల వారీగా వీక్లీ ఆఫ్ విధానం అమలు కానుంది. తొలిదశలో వెస్ట్ జోన్ లోని పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ప్రకటించారు. ఆ తర్వాత సిటీ అంతటా అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. కాగా, వెస్ట్ జోన్ లో 1367 మంది పోలీసులు తొలి దశలో వీక్లి ఆఫ్ లు పొందనున్నారు. 

ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం హైలైట్స్

Image
ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం హైలైట్స్ ఆయన మాటల్లోనే ***జీవుడిలో దేవుడిని చూడటం మా సంస్కృతి.*** ***సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌' నినాదంతో ముందుకెళ్తున్నాం*** **అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటుకు కృషిచేశాం** ***125 ఏళ్ల క్రితం భారత ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద ఇదే అమెరికాలోని షికాగో వేదికగా ప్రపంచానికి శాంతి, సామరస్య సందేశమిచ్చారు. ఈ రోజు కూడా అంతర్జాతీయ సమాజం కోసం భారత్‌ అదే సందేశాన్ని వినిపిస్తోంది.*** ***అందరి కోసం త్రికరణ శుద్ధితో ఆలోచిస్తాం*** ***ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా భారత్‌లో మేం పెద్దయెత్తున ప్రచారోద్యమం ప్రారంభించాం.***  ***రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం.*** **బుద్ధుడి శాంతి సందేశాన్ని ఇచ్చిన దేశవాసులం*** వేల ఏళ్లనాటి గొప్ప సంస్కృతి, జీవన విధానాలను ఇరుసులుగా చేసుకొని భారత్‌ వేగంగా ప్రగతి పథంలో దూసుకెళ్లగలుగుతోంది. జీవుడిలో దేవుడిని చూడటం మా సంస్కృతి. జన భాగస్వామ్యంతోనే సంక్షేమం సాధ్యమన్నది మా విధానం. భారత్‌ ప్రపంచ కలలను తన కలలుగా చూస్తుంది. ప్రపంచ సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఆ స్ఫూర్తితోనే 'సబ్‌కా సాత్‌

వీటి కాలనీ దేవాలయంలో ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు

Image
నల్గొండ వీటి కాలనీ శ్రీ దేవి భూదేవి  సాహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో  మహాలయ అమావాస్య బతుకమ్మ  ఉత్సవములో  భారీగా మహిళలు ఆడి పాడారు. వేడియా చూడండి. https://youtu.be/3hUUPe05G80

హుజర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు స్పోక్స్ పర్సన్ గా కల్వ సుజాత గుప్త

Image
హుజర్నగర్  అసెంబ్లీ ఉప ఎన్నికలకు స్పోక్స్  పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ  వైశ్య కమ్యూనిటీ కి  చెందిన కల్వ సుజాత గుప్తను నియమించింది.        TRS పార్టీ ఇంచార్జీలుగా ఏకంగా  9 మంది  వైశ్య  కమ్యూనిటీ కి చెందిన వారిని నియమించారు.  మరి బీజేపీ  వైశ్య కమ్యూనిటి నుండి ఎవరిని ఇంచార్జీలుగా  నియమిస్తారో చూడాలి.

సుష్మా చివరి వాగ్దానాన్ని నెరవేర్చిన కూతురు

సుష్మా చివరి వాగ్దానాన్ని నెరవేర్చిన కూతురు దిల్లీ: తెలంగాణ చిన్నమ్మగా పేరుగాంచిన దివంగత నేత సుష్మా స్వరాజ్‌ చివరి వాగ్దానాన్ని ఆమె కూతురు బన్సూరి స్వరాజ్‌ నెరవేర్చారు. గూఢచర్యం ఆరోపణలతో పాక్‌ చెరలో ఉన్న కుల్‌భూషణ్‌ జాదవ్‌ తరఫున అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ఆయన ఒక రూపాయి ఫీజు పుచ్చుకుంటానని గతంలో సుష్మాతో అన్నారు. అయితే గత నెల ఆరో తేదీన మరణించడానికి కొన్ని గంటల ముందు ఆమె సాల్వేకు ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా ఒక రూపాయి ఫీజు తీసుకునేందుకు ఇంటికి రావాలని కోరారని సాల్వే తెలిపారు. ఆ తర్వాత గంట సేపటికే ఆమె గుండెపోటుతో మరణించారు. తన తల్లి చివరి వాగ్దానాన్ని నెరవేర్చాలని బన్సూరి నిర్ణయించుకున్నారు. హరీశ్‌ సాల్వేను శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిసి రూపాయి ఫీజు అందజేశారు. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్‌ జైల్లో ఉన్న మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాక్‌ న్యాయస్థానం విధించిన మరణశిక్షను నిలుపుదల చేస్తూ ఐసీజే ఇచ్చిన తీర్పులో హరీష్‌ సాల్వే వాదనలే కీలకం. విదేశీ జైల్లో ఉన్న కుల్‌భూషణ్‌ను అధికారులు కలుసుకోడానికి అప్పట్లో వి

హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికల ఇంచార్జ్ గా TRS పార్టీ నియమించిన 70 మంది ఇంచార్జుల్లో ఉప్పల శ్రీనివాస్

Image
టీఆర్ఎస్ పార్టీ నుండి  హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికల ఇంచార్జ్ గా ఐవీఫ్ రాష్ట్ర అధ్యక్షులు,తెరాస రాష్ట్ర నాయకులు  ఉప్పల శ్రీనివాస్ గప్తను నియమించిన పార్టీ  అధిష్టానం. అధిష్టానం నియమించిన 70  మంది ఇంచార్జుల్లో ఆర్యవైశ్య కమ్యూనిటీ  అగ్రనేతగా ఉప్పల ఒకరు.

అమెరికాలో భారత సంతతి సిక్కు పోలీసు అధికారిని ఓ దుండగుడు కాల్చి వేత

అమెరికా: అమెరికాలో భారత సంతతి సిక్కు పోలీసు అధికారిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. టెక్సాస్ రాష్ట్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఓ ట్రాఫిక్ స్టాప్ వద్ద సందీప్ సింగ్ ధలివాల్ అనే అధికారి విధులు నిర్వహిస్తున్న సమయంలో వెనుకవైపు నుంచి ఆయనను కాల్చి చంపాడు. ఈ అధికారి వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండవచ్చు.           ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పిన వివరాల ప్రకారం... విధుల్లో ఉన్న సందీప్ సింగ్ ఓ కారును ఆపాడు. అందులో ఓ పురుషుడు, మహిళ ఉన్నారు. కారును ఆపిన వెంటనే అందులో ఉన్న వ్యక్తి వెంటనే కిందకు దిగి.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు సమీపంలోని షాపింగ్ సెంటర్ వైపు పరుగెత్తాడు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని గుర్తించామని అతడితో పాటు ఉన్న మహిళను కూడా అదుపులోకి తీసుకున్నామని సదరు అధికారి తెలిపారు. విచారణ కొనసాగుతోందని చెప్పారు. సందీప్ సింగ్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

రెయిన్ బో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి...

కూకట్‌పల్లి హైదర్ నగర్ రెయిన్ బో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి... వైద్యుల నిర్లక్ష్యం వల్ల వైద్యం వికటించి పసికందు మృతి చెందిందంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టిన బంధువులు...

*కేటీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్‌*  

*కేటీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్‌*   టీమిండియా మాజీ సారథి, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)  అధ్యక్షుడు మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ శనివారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌ను బుద్ధ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.  అజహర్‌తో పాటు తాజాగా ఎన్నికైన హెచ్‌సీఏ ప్యానల్‌ సభ్యులు కూడా కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.  ఈ సందర్భంగా హెచ్‌సీఏ కొత్త ప్యానల్‌కు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.  క్రికెట్‌ అభివృద్దికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని, హెచ్‌సీఏ కూడా తగిన కృషి చేయాలని సభ్యులకు సూచించారు.  అయితే ఈ భేటీపై అనేక రాజకీయ ఊహాగానాలకు తెరదీస్తోంది. 

రోడ్డు మధ్యలో ఎద్దుల కొట్లాటలో వృద్ధుడు మృతి 20లక్షల నష్టపరిహారానికి హైకోర్టు ఆదేశం..

Image
రోడ్డు మధ్యలో ఎద్దుల కొట్లాటలో వృద్ధుడు మృతి 20లక్షల నష్టపరిహారానికి హైకోర్టు ఆదేశం..  ============================== రోడ్డు మధ్యలో పశువుల కారణంగా ప్రమాదాలు జరిగి, మనుషులకు ఏదైనా జరిగితే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పంజాబ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భివానీ పట్టణంలో రోడ్డుపై రెండు ఎద్దులు కొట్లాడుకుంటూ ఓ వృద్ధుడిపై పడటంతో ఆ వృద్ధుడు చనిపోయాడు. దీంతో అతడి భార్య మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రోడ్డుపై పశువులు ఉంటున్నాయని, అవి రెండూ పోట్లాడుకోవడం వల్లే తన భర్త ప్రాణం పోయిందని, అందువల్ల తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందని నోటీసులిచ్చింది. మున్సిపాల్టీ ఆ నోటీసుని పట్టించుకోకపోవడంతో ఆమె హైకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు, రోడ్డులో ట్రాఫిక్ సులువుగా ఉండేందుకు పశువులను రాకుండా చేయాల్సిన బాధ్యత మున్సిపాల్టీకి, ప్రభుత్వానికి ఉందని, దానిని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఆ వృద్ధుడు చనిపోయాడని అభిప్రాయపడుతూ 20లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-నల్లగొండ ఆధ్వర్యంలో వ్యక్తిత్వవికాస శిబిరం -THE PERSONALITY CAMP

Image
*వ్యక్తిత్వవికాస*శిబిరం* ************************ వ్యక్తిత్వవికాస  శిబిరం  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-నల్లగొండ ఆధ్వర్యంలో మిర్యాలగూడ సరస్వతి శిశుమందిర్లో  జరుగుతుంది. ఈ శిబిరం ఈ నెల 29న ప్రారంభమై అక్టోబర్ 5 న ముగుస్తుంది.  ఈ శిబిరంలో నల్గొండ నగరం, గ్రామీణ, నిడమనూరు, హాల్య,మిర్యాలగూఢ-నగరా,గ్రామీణ ప్రాంతాల ఖండల   10వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థులు,  వ్యవసాయదారులు, వివిధ వృత్తి పనివారు , ఉపాధ్యాయులు, వ్యాపారస్తులఅందరూ ఈ శిబిరంలో  పాల్గొనవచ్చు. ఈ శిబిరంలో   నేర్పించే అంశాలు* 1) ప్రాణాయామం.  2)  యోగ. 3) సూర్య నమస్కారాలు. 4) కరాటే. 5) కర్ర సాము. 6) భారతీయ ఆటలు. 7) దేశభక్తి పాటలు. 8) మహనీయుల జీవిత చరిత్రలు. 9) చర్చ ఘోస్టులు. 10) భారతీయ సంస్కృతి పట్ల అవగాహన. అహల్య ఖండా విస్తారక్ రమేష్ జీ... 9100491511 ఖండ కార్యవహ చెలమల. వెంకట్ రెడ్డి జీ. 9948867486 లను  సంప్రదించి  పూర్తి వివరాలను పండవచ్చు.      The personality camp is held at the Miryalaguda Saraswati Shishu Mandir under the direction of Rashtriya Swayamsevak Sangh-Nalgonda. The camp starts on the 29th of this month and ends on the 5th of

సిట్టిగాడి వార్త...వాత....😊😊😊

సిట్టిగాడి వార్త...వాత....😊😊😊 పారిన పవార్ సారు పాచిక...ED రమ్మని పిలవగానే రావలనేవున్నది విలువిచ్చి మనసిచ్చి పిలిచే మనిషి ఉంటే రావాలనే ఉన్నది అంటూ సారు పేరడీ పాట అందుకోగానే ED సార్లు మనం పిలిస్తే అందరూ సవాలక్ష కారణాలు సెప్పి తప్పించుకు తిరుగుదామని సుస్తారు ఈయన రివర్స్ లో వస్తున్నాడేంటి అనుకుంటా దరికి రాబోకు రాబోకు రాజా అనే పాటతో సారుకి ప్రస్తుతం ఊరట కలిగించినట్లు వార్త... అందమైన రంగమని రంగురంగులువుంటాయని అందరూ అంటుంటారు రామ రామ అంత అందమైంది కానే కాదు ఓయమ్మ అని సిరు సారు తన రాజకీయ అనుభవాన్ని రంగరించి రజనీ సారుకి, కమల్ సారుకి సెప్పి ఇటు తొంగి సూసి జీవితం నాశనం సేసుకోకండి అని సెప్పారని వార్త...ఇక వాళ్ళ ఇష్టం... అజ్జు భాయికి hca అధ్యక్ష పదవి వరించిన తరుణంలో ఆయన అభిమానులు ఎన్నాళ్ల కెన్నాళ్ల కెన్నాలకు వెన్నేళ్ళు తిరిగొచ్చే మా కళ్ళకు అనే పాటతో అజ్జు సారుకు స్వాగతం సెప్పారట... సిట్టి కూడా ఆయన కష్ట కాలం తీరినందుకు సంతోషించి శుభాకాంక్షలు అందచేస్తున్నాడు... అమెరికాలో మోదీసారు అంతా ప్రేమ మయం జగమంతా ప్రేమమయం అని పేరడీ పాటతో జనాలకి ప్రేమ పంచుతుంటే మరో పక్క ఇమ్రాన్ సారు యుద్ధ ప్రేలాపనలతో రెచ్చి పోత

*ఆదివారం నుంచి పాత సచివాలయానికి తాళం!!*

Image
*ఆదివారం నుంచి పాత సచివాలయానికి తాళం!!* పాత సచివాలయ ప్రాంగణం నుంచి ఖాళీ చేసి వెంటనే వెళ్ళిపోవాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ మౌఖిక ఆదేశాలు. సచివాలయ భవనాల నుంచి శాఖల తరలింపు వేగవంతం. ఇప్పటికే 90% ఖాళీ అయిన పాత సచివాలయం బ్లాకులు. ఎల్లుండికల్లా పూర్తిగా ఖాళీ అవనున్న సచివాలయం. సమూహాలుగా విడిపోయి పాత సచివాలయంలోని అన్ని బ్లాకులు తిరుగుతున్న సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది. బీఆర్కేఆర్ భవనానికి వెంటనే తరలిపోవాలని సూచిస్తున్న సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది. ఆదివారం ఉదయం పాత సచివాలయ ప్రాంగణం ప్రధాన ద్వారానికి తాళం వేయనున్న జీఏడీ అధికారులు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర తాళంచెవి. అవసరం ఉన్నవాళ్లు తాళాలను సీఎస్ దగ్గరి నుంచే తీసుకోవాల్సి ఉంటుందంటున్న జీఏడీ. 

ఆర్యవైశ్యుల పై నిజామాబాద్ లో ఆగడాలపై ప్రెస్ మీట్లో ACPS అధ్యక్షుడు ప్రేమ్ గాంధి వీడియో చూడండి

ఆర్యవైశ్యుల పై  నిజామాబాద్ లో ఎమ్మెల్యే బాజిరెడ్డి  గోవర్ధన్ రెడ్డి  అనుచరులు  గ్యాంగ్ ఆగడాలపై ప్రెస్ మీట్లో ACPS అధ్యక్షుడు ప్రేమ్ గాంధి   వీడియో చూడండి https://youtu.be/pBHUJCYYXQg

హరితారాం కార్యక్రమంలో డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్

Image
బేగంపేట పోలీసు లైన్స్  హరితారాం కార్యక్రమంలో  డిజిపి  ఎం.మహేందర్ రెడ్డి, టిఎస్‌పిహెచ్‌సిఎల్ చైర్మన్  కోలేటి దామోదర్  మరియు ఇతర  సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

గిరిజన మహిళ పై దాడి చేసి అత్యాచారం జరిగిన సంఘటనపై చర్యలకు ఆదేశించిన మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ .

సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, హర్షగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ ముడావతి తిరుపతి,పై దాడి చేసి అత్యాచారం జరిగిన సంఘటనపై గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడి, ఆదేశించారు.  మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్ దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయడంతో పాటు వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడంతో పాటు ఐపీసీ 376(D), 342,324,506 r/w34 సెక్షన్ల కింద నమోదు చేశారు. బాధితులను దవాఖానాకు పంపించి తగిన వైద్యం అందిస్తున్నామని, బాధితులకు న్యాయం చేస్తామని, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.  మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తక్షణమే స్పందించి, దాడికి ప

గ్రామీణాభివృద్ధికి, రైతుల పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది- నరేంద్ర సింగ్ తోమర్

Image
గ్రామీణాభివృద్ధికి, రైతుల పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది- నరేంద్ర సింగ్ తోమర్ హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డిపిఆర్‌లో రెండు రోజుల గ్రామీణ ఇన్నోవేటర్స్ స్టార్ట్-అప్ సదస్సు 2019 ను ప్రారంభించిన కేంద్ర మంత్రి            కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి  నరేంద్ర సింగ్ తోమర్  హైదరాబాద్ లోని ఎన్‌ఐఆర్‌డిపిఆర్‌(జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయత్ రాజ్ సంస్థ) లో రెండు రోజుల పాటు జరగనున్న గ్రామీణ ఇన్నోవేటర్స్ స్టార్ట్-అప్ సదస్సు 2019 ను ఈ రోజు ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం లోని ప్రతి గ్రామానికి మౌళిక సదుపాయాలు అందుతున్నాయని అన్నారు. గ్రామీణాభివృద్ధికి, రైతుల పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాలు నవ భారత నిర్మాణానికి పునాదిగా నిలుస్తున్నాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి కల కన్నట్లు 2024 వరకు భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలి  అంటే  దేశంలోని నగరం నుంచి గ్రామం వరకు ప్రతి పౌరుడు తమ వంతు సహకారం అందించాలి.మన ఆలోచన నూతనంగా ఉంటే మన ఊరు బాగుంటుంది తద్వారా నవ భా

IVF రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ సూచన మేరకు మహముత్తారం సుద్దాల నాగభూషణం కుటుంబానికి 1,40,000/- చెక్కు అందచేత

Image
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్  సూచన మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా , మహముత్తారం మండలం లో సుద్దాల నాగభూషణం కుటుంబానికి రు!!1,40,000/- చెక్కు రుపేన ఆర్థిక సహయం అందించడం జరిగిందని రాష్ట్ర పొలిటికల్ కమిటీ చైర్మన్    బచ్చు శ్రీనివాసు తెలిపారు. ఈ  కార్యక్రమం లో  జిన్నం వేణు,  బిజ్జాల శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, మహముత్తారం MPDO పెద్ది ఆంజనేయులు, స్థానిక జిల్లా ఐవిఎఫ్ నాయకులు ప్రకాష్,  అల్లాడి శ్రీనివాస్,  శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ తమ అభ్యర్థిని విరమించి మల్లన్నకు మద్దతు ఇవ్వండి ..:చెరుకు సుధాకర్.

Image
బీజేపీ తమ అభ్యర్థిని విరమించి మల్లన్నకు మద్దతు ఇవ్వండి ..:చెరుకు సుధాకర్. హుజుర్నగర్: తెలంగాణ ఇంటి పార్టీ మరియు ఇంటి పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న సంయుక్త ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్బంగా ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ మన వర్గాలకు న్యాయం జరగాలంటే మల్లన్ననే గెలిపించాలని దొంగలు దొంగలు ఒక్కటై వస్తున్నారు ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, ఈ ఉపఎన్నికతో ప్రజల ఆక్రోశాన్ని పాలకవర్గానికి తెలియజెయ్యాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే కుటుంబ పరిపాలన కాదని అయితే రాష్టంలో కెసిఆర్ కుటుంబం లేకుంటే హుజుర్నగర్ లో ఉత్తమ్ కుటుంబం తప్ప రాజకీయాలు ఎవ్వరు చెయ్యొద్దని విధంగా చెయ్యడం సరికాదని హితువు పలికారు. బీజేపీ దిద్దుబాటు చర్య చేసి బిసి అభ్యర్థిని నిలిపిన సమయం దాటిపోయిందని తాము విరమించుకునే ప్రసక్తే లేదని  తేల్చిచెప్పారు . బీజేపీ తమ అభ్యర్థిని విరమించుకొని మల్లన్నకు మద్దతివ్వాలని కోరారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ: నేను వచ్చింది రెండు లక్షల ప్రజలను గెలిపించడానికని, ఉత్తమ్ కెసిఆర్ ఇద్దరు తోడుదొంగలు వీళ్ళ బాస్ మై హోమ్ రామేశ్వర్ రావు  అని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

కోర్ట్ ధిక్కరణ కేసులో కరీంనగర్ పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు !!!!????

కోర్ట్ ధిక్కరణ కేసులో కరీంనగర్ పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు !!!!???? కోర్టు ధిక్కరణ కేసులో కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి, ఏసీపీ తిరుపతి, సీఐ శశి ధర రెడ్డికి 6 నెలల జైలు శిక్ష, 10వేల జరిమానా విధించిన హైకోర్టు రమ్మీ ఆడుతున్నారంటూ.. తన రిసార్ట్స్ లోకి వచ్చి వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగపతి రావు హైకోర్టు లో పిటిషన్  పిటిషన్ పై గతంలో హైకోర్టు పోలీసులకు పలు ఆదేశాలు కోర్ట్ ఆదేశాలను పాటించని అధికారుల పై  హైకోర్టు తీర్పు. *కేసు వివరాలు*  :  పుష్పాంజలి రిసార్ట్ పై దాడులు చేసి పోలీసులు వేధిస్తున్నారని కోర్ట్ కు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే.. గతంలో కేసీఆర్ సభ ఉందని మా పేకాట ఆడుకోకున్న మా రీసర్ట్ పై రైడ్స్ చేశారు అంటూ ఆరోపణ  ఎలాంటి ఆధారాలు లేకుండా మాపై కేసులు పెట్టారు  సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి వేధిస్తున్నారు అని కోర్ట్ కి వెళ్లిన వెలిచాల జగపతి రావు.

ఇరాన్ అధ్య‌క్షుడి తో భేటీ అయిన ప్ర‌ధాన మంత్రి

Image
ఇరాన్ అధ్య‌క్షుడి తో భేటీ అయిన ప్ర‌ధాన మంత్రి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యుఎన్‌జిఎ 74వ స‌మావేశం సంద‌ర్భం గా ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఆఫ్‌ ఇరాన్ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ హ‌స‌న్ రూహానీ తో ఈ రోజు న ప్ర‌త్యేకం గా స‌మావేశ‌మ‌య్యారు.  నేతలు ఇరువురూ ద్వైపాక్షిక సంబంధాల ను గురించి చ‌ర్చించ‌డ‌ంతో పాటు ప‌ర‌స్ప‌ర హితం ముడిప‌డిన ప్రాంతీయ ప‌రిణామాలు మ‌రియు ప్ర‌పంచ ప‌రిణామాల పై వారి అభిప్రాయాల ను ఒకరి తో మరొకరు వెల్లడించుకొన్నారు. ఇరాన్ కు, భార‌త‌దేశాని కి ప్రాచీన‌ నాగ‌ర‌క‌తపరమైన బంధాలు ఉన్నాయ‌ని, 2015వ సంవ‌త్స‌రం లో ఉఫా లో వారి తొలి స‌మావేశం నాటి నుండి ద్వైపాక్షిక సంబంధాల లో చోటు చేసుకొన్న పురోగ‌తి ని ఉభయులూ స‌కారాత్మ‌క రీతి న అవలోకించారు.  ప్ర‌త్యేకించి చాబ‌హార్ నౌకాశ్ర‌యం కార్యక‌లాపాలు ఆరంభం అయిన సంగ‌తి ని వారు ప‌రిగ‌ణ‌న లోకి తీసుకొని, అది అఫ్గానిస్తాన్ మ‌రియు మ‌ధ్య ఆసియా ప్రాంతం లో కు ఒక ముఖ‌ద్వారం వలె ఉందని పేర్కొన్నారు.   భారతదేశానికి గ‌ల్ఫ్ ప్రాంతం కీలక ప్రాముఖ్యం కలిగినటువంటిదని, ఆ ప్రాంతం యొక్క శాంతి, భ‌ద్ర‌త‌ మ‌రియు స్థిర‌త్వం ల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా దౌత్యం, సంభాషణలు మరియు విశ్వాస ప్రోత్సాహ‌

విశిష్ట సంపర్క అభియాన్ లో భాగంగా పారిశ్రామికవేత్త శ్రీమతి మద్ది వినీల రెడ్డి విజయమోహాన్ కి ఆర్టికల్ 370 గురించి వివస్తరిస్తున్న బీజేపీ మురళీధర్ రావు

Image
విశిష్ట సంపర్క అభియాన్ లో భాగంగా నల్లగొండ పట్టణంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి మద్ది వినీల రెడ్డి విజయమోహాన్ ని  కలిసి ఆర్టికల్ 370 గురించి వివస్తరిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి  మురళీధర్ రావు ,మాజీ శాసన సభ్యులు  చింతల రామచంద్ర రావు, అమర్ నాద్ , జిల్లా అధ్యక్షులు నూకల నరసింహ రెడ్డి,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  చింతా సాంబమూర్తి ,  గొంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కిసాన్మోర్చా అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి , వీరెళ్ళి చంద్ర శేఖర్ , ఒరుగంటి రాములు , పల్లె బోయిన శ్యామ్ సుందర్ గా, చింతా ముత్యాల్ రావు , పోతేపాక సాంబయ్య , సయ్యద్ పాషా ,గడ్డం మహేష్  తదితరులు పాల్గొన్నారు.... 

నల్గొండ విశ్వబ్రాహ్మణ వసతి గృహంలో ప్రముఖులు సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర రావు,

Image
నల్గొండ విశ్వబ్రాహ్మణ వసతి గృహంలో ప్రముఖులు సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర రావు, మాజీ శాసనసభ్యులు  చింతల రామచంద్ర రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి , మనోహర్ రెడ్డి  జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  షణ్ముఖ బండార్ ప్రసాద్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు  గోలి మధుసూధన రెడ్డి,  వీరెళ్ళి చంద్రశేఖర్, గార్లపాటి జితేందర్ కుమార్, రాష్ట్ర బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భరత్ గౌడ్ , మాదగోని శ్రీనివాస్, మరియు విశ్వ బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు

12 లక్షల ఉపాధి హామీ నిధుల  గోల్ మాల్!!*

*షాద్ నగర్ లో 12 లక్షల ఉపాధి హామీ నిధుల  గోల్ మాల్!!* *పనులు చెయ్యకుండానే బిల్లులు లేపినా వైనం!!* *చర్యలు తీసుకోవాలని కొందుర్గ్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు!!* *జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేస్తాం ఆవేదనతో రైతులు గ్రామస్థులు!* దొంగలు ,దొంగలు కలిసి గట్లు పంచున్న చందంగా మారింది అధికారుల తీరు,పనులు చేయకుండానే బిల్లులు  ఎత్తినా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వీరిపై గ్రామస్థులు,మరియు  రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సుమారు 12,లక్షల ఉపాధి హామీ నిధులను పనులు చెయ్యకుండానే బిల్లులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ కు కూడా పిర్యాదు చేస్తామని అన్నారు.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గ్ మండలం వెంకిర్యాల గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పొలంలో భూమి చదును చేసినట్టు కంపచెట్లు తీసినట్టు రైతులకు తెలియకుండానే పనులు జరిగినట్టు గ్రామ (పిల్డ్ అసిస్టెంట్ )మరియు (ఏపీఓ)మరి కొంతమంది కుమ్మకై గ్రామంలో ఉన్న రైతుల పొలాల్లో పనులు జరిగినట్టు (మస్టర్)పై రాసి బిల్లులు లేపారని రైతులలు సొంత డబ్బులతో పనులు చేయించుకుంటే అధికారులు మాత్ర

ఎంతపని చేశావ్...శృతి..!

ఎంతపని చేశావ్...శృతి..! ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య ఖిలా వరంగల్‌: ఉన్నత విద్యనార్జించిన కన్నకూతురు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో రాణిస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. తనకు కొలువురాలేదని మానసికంగా ఆందోళనతో చిర్ర శృతి అనే యువతి గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని 11వ, డివిజన్‌ క్రిష్టియన్‌ కాలనీలో జరిగింది. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. చిర్ర రవీందర్‌-రాణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారన్నారు. కాగా, పెద్ద కుమార్తెకు వివాహం కాగా, కుమారుడికి సైతం వివాహం జరిగిందన్నారు. చిన్న కుమార్తె శృతి ఎంబీఏ విద్యనార్జించి ఇటీవల ఎస్‌ఐతో పాటు కానిస్టేబుల్‌ ఉద్యోగం రాయడానికి ఎంపికైందన్నారు. అప్పటి నుంచి శృతి ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిన పిదప, రిటర్న్ టెస్ట్‌లో సైతం 106 మార్కులు సాధించిందన్నారు. ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాలలో శృతికి ఉద్యోగం రాకపొవడంతో మానసికంగా ఆందోళన చెంది గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకొందన్నారు. ఉదయం తల్లిదండ్రులు నిద్రనుంచి లేచి చూసేసరికి తాడుకు వేలాడుతుండడంతో వెంటనే ఎంజీఎంకు తరలించామన్నారు. అప

నిర్మాత దిల్ రాజు కి ఝలక్

నిర్మాత దిల్ రాజు కి ఝలక్  ఇచ్చిన   సచివాలయం సెక్యూరిటీ స్టాఫ్ ..... ఐటి  సెక్రటరీ జయేష్ రంజన్ ని కలవడానికి వచ్చిన రాజు ని లోపలికి అనుమతించని భద్రతా సిబ్బంది

సిట్టిగాడి వార్త...వాత...😊😊😊

సిట్టిగాడి వార్త...వాత...😊😊😊 వానా వానా వెల్లువాయే...అనే పాట పాడుకోవలసిన రోజులు ఇవి...ఏది రోడ్డు, ఏది నది అనేది తెలియకుండా ఉంది...సకల జాగ్రత్తలు తీసుకుని మీ జీవన పోరాటానికి కొనసాగించమని సిట్టి జాగ్రత్తలు సెపుతున్నాడు...  గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు పూజకు వేళాయెనే ఇంటి ఇల్లాలు పూజ సేసుకుంటే...గుడి వెనుక నా స్వామి గుర్రమెక్కి పోతున్నాడు అనే పాటకి ఊపు తెస్తూ భోపాల్ పెద్ద తలకాయలని శృంగార ఊబిలోకి నెట్టింది అంట ఒక గడుసరి... సింహ భాగం బీజేపీ సార్లు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు అని వస్తున్న వార్తలు బట్టి తెలుస్తోంది...పెజా సేవకు,వారి సెలబ్రిటీ హోదాకి భంగం వస్తది అని సెప్పి పేర్లు బయట పెట్టంటం లేదు మీడియా వారు..ఎప్పుడూ ఉన్నదే కదా... పెద్ద సారు ఊరు వాడ ఏకమై సిన్న సారు పాలన మీద గగ్గోలు పెడుతుంటే సిన్న సారు పలుకె బంగార మాయెరా అన్న విధంగా మౌనంగా ఉండి నవ్వే వాళ్లు  నవ్వని,ఏడ్చే వాళ్లని ఎడవని డోంట్ కేర్ అనే బాల మావయ్య పాట పాడుకుంటూ పాలన సాగిస్తున్నారు...తీర్పు ఇచ్చేది ప్రజలు కానీ వీరి తో నాకేంటి అన్న విధంగా సారు ముందుకు పోతున్నారు... పిల్ల స్కూల్ ఫీజు కట్టమని గొడవ చేస్తోంది అని కూతురిని చంపి

పూణేలో భారీ వర్షం - 17 మంది మృతి

Image
పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో భారీ వర్షాల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న 16 వేల మందిని అధికారులు రక్షించారు. ముంబై- బెంగళూరు జాతీయ రహదారిపై ఖేద్‌-శివపూర్‌ గ్రామంలోని ఓ దర్గాలో నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చిన వరదలకు కొట్టుకుపోయారు. అరణ్యేశ్వర్‌ ప్రాంతంలో గోడకూలిన ఘటనలో ఐదుగురు చనిపోయారు. మిగతా ప్రాంతాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. పుణేతో పాటు బారామతి తహ్‌శీల్‌లో ప్రజలను రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)ను పంపించారు.కాగా.. కుంభవృష్టి కారణంగా పుణె నగరంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సహకార్‌నగర్, పర్వతి, సింహగడ్ రోడ్, దండేకర్ బ్రిడ్జి, పద్మావతి సా లాంటి పల్లపు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. పుణె నగర వీధుల్లో వరదనీరు భారీగా చేరింది.  

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 190 వద్ద రోడ్డుపై నిలిచిన వరద నీరు.  

రంగారెడ్డి , రాజేంద్రనగర్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 190 వద్ద రోడ్డుపై నిలిచిన వరద నీరు.   రాత్రి కురిసిన భారీ వర్షంతో  పలు అపార్ట్ మెంట్ ల  సెలార్  లలోకి చేరిన వరద నీరు.  వరద నీటిలో చిక్కుకున్న లారీలు , కార్లు ఇబ్బందులు పడుతున్న అపార్ట్ మెంట్ వాసులు

ESI డైరెక్టర్ దేవికా రాణిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

Image
ESI డైరెక్టర్ దేవికా రాణిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు షేక్ పేట్ లోని తన నివాసం నుండి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలింపు ఈ రోజు  Acb అరెస్టు చేసిన వ్యక్తుల వివరాలు:  1. దేవికరణి డైరెక్టర్, 2.పద్మ జాయింట్ డైరెక్టర్, 3.వశాంత ఇందిరా, అసిస్టెంట్ డైరెక్టర్, 4.రాధిక ఫార్మసిస్ట్, 5.నాగరజు, ఓమ్ని మెడి ఉద్యోగి, 6.హర్వర్దన్, సీనియర్ అసిస్ట్ ఐఎంఎస్, 7.శ్రీహరి ఎండి ఓమ్ని మెడి కంపెనీ.  

గిరిజన మహిళపై గ్యాంగ్‌ రేప్‌!

గిరిజన మహిళపై గ్యాంగ్‌ రేప్‌! నలుగురితోపాటు యజమాని అఘాయిత్యం వెలుగులోకి ఘోరం, ఐదుగురిపై కేసు ఉప్పునుంతల/నాగర్‌ కర్నూల్‌/చార్మినార్‌/హైదరాబాద్‌, బతుకుదెరువు కోసం వచ్చిన గిరిజన కుటుంబానికి ఆశ్రయం ఇచ్చినట్లు నటించాడు అతను. ఆ గృహిణిపై కన్నేశాడు ఆ యజమాని. మభ్యపెట్టి ఆమెను ఓ గదిలో నిర్బంధించి మరో నలుగురితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమెకు మత్తు ఇచ్చి చిత్రహింసలకు గురిచేశాడు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పహాడిషరీఫ్‌ పోలీసులను ఆశ్రయించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఓ తండాకు చెందిన కుటుంబం నగర శివారులో ఉంటోంది. ప్రతాప్   రెడ్డి అనే వ్యక్తి నడిపించే కోళ్ల ఫారంలో వాళ్లు పనికి కుదిరారు.   నెలకు 15 వేలు జీతమిచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈనెల 18న స్నేహితుడి కోళ్ల ఫారంలో పని ఉందని ప్రతా్‌పరెడ్డి గిరిజన కుటుంబాన్ని కారులో అక్కడికి తీసుకువెళ్లాడు. ఆమె భర్తను ఓ గదిలో ఉంచాడు. గృహిణిని మరో గదిలో నిర్బంధించి, లైంగిక దాడి చేశాడు. వెంటనే మరో నలుగురు వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు మందు ఇచ్చి వారు చిత్రహింసలకు గురిచేశారు.   మూడు రోజులపాటు మూకుమ్మడిగా అత్యాచారానికి పాల్పడిన తర్వ

కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అవకతవకలు అక్రమాలపై, గ్రానైట్ మైనింగ్ మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరిన బీజేపీ నాయకులు

Image
కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ,  తక్షణమే విచారణకు ఆదేశించాల్సిందిగా... అక్రమాలకు పాల్పడుతోన్న గ్రానైట్ మైనింగ్ మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్ నేతృత్వంలోని బృందం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతనిధులు కొల్లి మాధవి, ఎన్.వి.సుభాష్ తదితరులు ఉన్నారు.

వేలంలో పొందిన కానిపాకం ఆలయం లడ్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులకు అందజేసిన టిటిడి బోర్డు సభ్యులు మొరం శెట్టి రాములు.

Image
కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాల సందర్భంగా  21 రోజులు పూజలు అందుకున్న లడ్డు వేలం వేయగా, వేలంలో పొందిన లడ్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులకు అందజేసిన టిటిడి బోర్డు సభ్యులు మొరం శెట్టి రాములు.

ఐద్వా ఎస్ఎఫ్ఐ ఆధర్యంలో బతుకమ్మ సంబరాలు

Image
ఐద్వా ఎస్ఎఫ్ఐ ఆధర్యంలో నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి ఎస్సై జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కందాల ప్రమీల సహాయ కార్యదర్శులు కొండా అనురాధ తుమ్మల పద్మ జిట్టా సరోజ కృష్ణవేణి భూతం అరుణ కనుకుంట్ల ఉమా శివలీల తదితరులు పాల్గొన్నారు ..

సమస్యలు, రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై చర్చించిన కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి

Image
సికింద్రాబాద్ రైల్ నిలయంలో  దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో  రైల్వే జీఎం గజానన్, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  రైల్వే సమస్యలు, రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై చర్చించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమావేశంలో అనేక ప్రతిపాదనలు వచ్చాయని, వీటన్నింటినీ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో  చర్చించి  త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత చర్లపల్లిలో టెర్మినల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి పనులు వేగవంతం చేసామని, ఈ టెర్మినల్ పూర్తయితే  హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు రద్దీ తగ్గుతుందని అన్నారు. దీనిని అత్యంత విశాలంగా నిర్మించాలని ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సరిపోయినంతగా భూమి ఇవ్వనందుకు 50 ఎకరాల్లోనే ఈ టెర్మినల్ నిర్మిస్తున్నామని, రూ.81కోట్లతో పనులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఘట్ కేసర్- రాయగిరి రైల్వే లైన్, MMTS ఫేజ్ 2కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వనందుకే పనులు పెండింగ్ ల

మొక్కలు నాటిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టి-సాట్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఎస్.కె.జోషీ

Image
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టి-సాట్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్  ఎస్.కె.జోషీ గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. టి-సాట్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన జోషీ తొలుత టి-సాట్ సీఈవో కార్యాలయంలో సీఈవో ఆర్.శైలేష్ రెడ్డితో టి-సాట్ నిర్వహణ గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జోషీ మాట్లాడుతూ టి-సాట్ భవనం చుట్టూ ఆహ్లాదకర వాతావరం ఉందని అందుకు అనుగుణంగా విరివిగా చెట్లు పెంచాలని సూచించారు.నాటిన మొక్కలు పెరిగి పెద్దవయ్యే వరకు సంరక్షించాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నారు.సీఎస్ వెంట డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.మొక్కలు నాటే కార్యక్రమం ముగిసాక జోషీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం టి-సాట్ కార్యాలయ ఆవరణలో ఉన్న వి.హబ్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

మెదక్ లో త్వరలో సిపెట్ కేంద్రం ఏర్పాటు –సదానంద గౌడ సిపెట్-చర్లపల్లి లో నూతనం గా నిర్మించిన బాలుర వసతిగృహాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

Image
మెదక్ లో త్వరలో సిపెట్ కేంద్రం ఏర్పాటు –సదానంద గౌడ సిపెట్-చర్లపల్లి లో నూతనం గా నిర్మించిన బాలుర వసతిగృహాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి మెదక్ లో సిపెట్ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ) నూతన కేంద్రం రానున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ ప్రకటించారు. రూ . 58.32 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే ఈ సంస్థ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తితో  భరిస్తాయి. ఈ సంస్థ ఏర్పాటుకు భూ సేకరణ జరిగినట్లు మంత్రి తెలిపారు . ఈ కేంద్రం అండర్ గ్రాడ్యుయేట్,  గ్రాడ్యూయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పిహెచ్ డి కోర్సులను అందిస్తుందని మంత్రి తెలిపారు. సిపెట్- చర్లపల్లి వద్ద నూతనంగా నిర్మించిన బాలుర వసతిగృహాన్ని ఈ రోజు కేంద్ర మంత్రి  ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వసతిగృహంలో 145 గదులు ఉన్నాయని, 450 మంది విద్యార్థులు ఉండే సామర్థ్యం కలిగివుందని అన్నారు.  దీని వల్ల  పాలిమర్ టెక్నాలజీలో విద్యను అభ్యసించే విద్యార్థులను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ నిషేధంపై ప

నరేంద్ర మోదీ యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఐక్య రాజ్య సమితి సమావేశాల సందర్భం గా డోనాల్డ్ ట్రంప్ తో స‌మావేశ‌మైన‌ప్ప‌టి దృశ్యం.

Image
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఐక్య రాజ్య సమితి సమావేశాల సందర్భం గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) అధ్య‌క్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ తో స‌మావేశ‌మైన‌ప్ప‌టి దృశ్యం.

27 న జిల్లా కలెక్టర్ కార్యలయం ముందు CPIM ఆధ్వర్యంలో ధర్నా - పాలడుగు నాగార్జున

Image
27 న జిల్లా కలెక్టర్ కార్యలయం ముందు జరిగే ధర్నా ను జయప్రదం చేయండని cpim జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.  .విషజ్వరాలు-ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మందుల కొరత లేకుండా చుాడాలని ఆవసరమైన ప్రైమరీ హెల్త్ సంటర్స్ లో అవసరమైన టెస్ట్ లు చేయడానికి కిట్టు ఇవ్వాలని  డిమాండ్‌ చేస్తుా 27న ఉదయం 10 గంటలకు ధర్నా నిర్మావహిస్తున్నామని ఆయన తెలిపారు.  ప్రజలు అదిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. .ఈధర్నాకు cpim రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జుాలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుదాకరెడ్డిముఖ్య అతిథిలుగా పాల్గొంటారని తెలిపారు .

ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Image
ఆర్యవైశ్య కార్పోరేషన్ త్వరగా  ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్థికమంత్రి  హరీష్ రావు కు వినతి పత్రం అందజేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే  జగ్గారెడ్డి.

*పాత నేరస్తులపై పటిష్టమైన నిఘా : ఎస్పీ రంగనాధ్*

Image
*పాత నేరస్తులపై పటిష్టమైన నిఘా : ఎస్పీ రంగనాధ్* నల్గొండ : జిల్లాలో సమర్ధవంతంగా శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఏ.వి. రంగనాధ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్స్, సిసిఎస్ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పాత నేరస్తులు, గతంలో దొంగతనాలకు పాల్పడిన వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు పట్టణ ప్రాంతాలలో దొంగతనాలను తగ్గించడం, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం కోసం పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో సిసి కెమెరాల ఏర్పాటుతో పాటు కాలనీలు, అపార్ట్ మెంట్లు తదితర ప్రాంతాలలో కమ్యూనిటీ పోలీసింగ్ , నేను సైతం కింద కెమెరాలు ఏర్పాటు చేయించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఎన్నో కేసులలో సిసి కెమెరాలు నేరస్థులను పట్టించిన విషయాన్ని ప్రజలలోకి మరింత బలంగా తీసుకెళ్లడం ద్వారా సిసి కెమెరాల ఏర్పాటు పెద్ద ఎత్తున జరిగే విధంగా చూడాలని అన్నారు. ప్రతి అంశంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ విధి నిర్వహణను నిబద్దతతో

*సోదరుడిపై గొడ్డలితో దాడి కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా*

*సోదరుడిపై గొడ్డలితో దాడి కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా* నల్గొండ : జిల్లా కేంద్రమైన నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రాంతంలో పక్కపక్కనే ఇండ్లు కట్టుకుంటున్న సోదరులు ఘర్షణ పడి గొడ్డలితో దాడి చేసుకున్న కేసులో నిందితునికి అయిదు సంవత్సరాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమాన విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎం. వెంకటేశ్వర్ రావు తీర్పునిచ్చారు. కేసు వివరాలలోకి వెళితే నల్గొండ పట్టణం బొట్టుగూడ ప్రాంతంలో తాతల ద్వారా సంక్రమించిన భూమిలో పక్కపక్కనే ఇండ్లు కట్టుకుంటున్న సోదరులు మహ్మద్ షాకీర్, ఎం.డి. సాబేర్ లకు బాత్రూమ్ నిర్మాణ విషయంలో ఘర్షణ పడ్డారు. తనతో ఘర్షణ పడ్డాడని మనసులో పెట్టుకొని మహ్మద్ షాకీర్ ఘర్షణ జరిగిన వారం రోజుల తర్వాత తేది. 30.10.2015 రోజున  ఉద్దేశ్య పూర్వకంగా గొడ్డలితో తన ఇంటి పక్కనే బాత్రూమ్ నిర్మిస్తున్న సోదరుడు ఎం.డి.సాబేర్ పై ప్రకాశం బజార్ వెనుక భాగంలో వస్త్రలత బజార్ లో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యాయత్నం చేయబోయాడు. షాకీర్ గొడ్డలితో వెంటపడి సాబేర్ పై దాడి చేయగా తల వెనుక భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. సాబేర్ బంధువు అయిన ఎం.డి.

ఆర్డీవోపై మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం

ఆర్డీవోపై మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం సంగారెడ్డి: సంగారెడ్డి ఆర్డీవో శ్రీనుపై మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవోకి హరీష్‌రావు పదిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదని తెలుస్తోంది. దీంతో చివరికి ఆయన జేసీకి ఫోన్‌ చేసి ఆర్డీవోతో మాట్లాడించాలని చెప్పినా కూడా ఆర్డీవో స్పందించలేదని సమాచారం. తనకు ఎంతకీ ఆర్డీవో నుంచి ఫోన్‌ రాకపోవడంతో అసహనానికి గురైన హరీష్‌రావు.. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆర్డీవోపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న

హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా  తీన్మార్ మల్లన్న ని పోటీలోకి దింపుతున్నాం......చెరకు సుధాకర్

విరాళం ఇచ్చిన మూడో రోజే ఆత్మహత్య , ఒంటరితనం భరించలేక చనిపోతున్నట్లు లేఖ

విరాళం ఇచ్చిన మూడో రోజే ఆత్మహత్య , ఒంటరితనం భరించలేక చనిపోతున్నట్లు లేఖ బంజారాహిల్స్‌: 'నాకు నా జీవితం నచ్చలేదు... నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు... నేను చనిపోతే ఎవరూ బాధపడొద్దు.. అంటూ ఓ అనాథ యువకుడు లేఖరాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం బంజారాహిల్స్‌ పరిధిలో చోటు చేసుకుంది. తన అంత్యక్రియలు ఎవరు చేయాలో నిర్ణయించుకుని ముందే వారిని కలిసి ఆ సంస్థకు విరాళంగా రూ.6 వేలు ఇచ్చాడు. చనిపోయిన తర్వాత ఏ డాక్టర్‌ దగ్గరికి తన బాడీని తీసుకెళ్ళాలో.. ఎవరిని కలవాలో కూడా లేఖలో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళ్తే...  నిజామాబాద్‌ జిల్లా గాంధీనగర్‌ తండాకు చెందిన బొంతు విజయ్‌(26) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. డిగ్రీ చదివిన విజయ్‌ ఎనిమిదేళ్ళ క్రితం హైదరాబాద్‌కు వచ్చి శ్రీకృష్ణానగర్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.          గత కొంత కాలంగా తనకు ఎవరూ లేరని మానసికంగా మరింత కుంగిపోయాడు. గతంలో ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ఉండరని భావించిన విజయ్‌ ఈ నెల 22న సర్వ్‌నీడీ(అనాథలకు అంత్యక్రియలు నిర్వహంచే సంస్థ) స

రేపు 27న నల్గొండకు రానున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు

Image
రేపు 27న నల్గొండకు రానున్న బీజేపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు నల్గొండ  లక్ష్మిగార్డెన్స్లో  సాయంత్రం 5 గంటలకు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో  జరగనున్న జనజగరణ సభకు  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ముఖ్య అతిదిగా పాల్గొంటారని కాంపైన్   ఇంఛార్జీలు శ్రీ రామోజు షణ్ముఖ, డా  వైవి రాజశేకేర్ రెడ్డి తెలిపారు  ఈ సభలో  చరిత్రాత్మక రాజ్యాంగ సవరణ   ఆర్టికల్ 370 రద్దు  పై ముఖ్యఅతిధి  ప్రసంగింస్తారని తెలిపారు. అతిధులుగా జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్య దర్శులు చింత సాంభమూర్తి, మనోహర్  రెడ్డి, నార్కెట్పల్లి కిమ్స్ అసిస్టెంట్  ప్రొఫెసర్   కె. హరినాధ్ లు హాజరౌతారని తెలిపారు. ఈ సభకు మేధావులు,  ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావలసింది వారు కోరారు.  

LIC నోటిఫికేషన్ 2019 -   7871  Assistent Posts

Image
LIC నోటిఫికేషన్ 2019 -   7871  Assistent Posts  కోసం  దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.   లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) 2019 నియామకానికి సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్య అర్హత వివరాలు, అవసరమైన వయస్సు పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.  ఆర్గనైజేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) ఉపాధి రకం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు  మొత్తం ఖాళీలు 7871 లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా పోస్ట్ నేమ్ అసిస్టెంట్లు అధికారిక వెబ్‌సైట్ www.licindia.in   ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు.  తేదీ 17.09.2019 చివరి తేదీ 01.10.2019  ఖాళీల వివరాలు:  1544 నార్త్ సెంట్రల్ జోన్ ,1242 ఈస్ట్ సెంట్రల్ జోన్, 1497 ఈస్టర్న్ జోన్, 980 సెంట్రల్ జోన్, 472 ,సౌత్ సెంట్రల్ జోన్  632 , సదరన్ జోన్ 400  వెస్ట్రన్ జోన్, 1104 . అర్హత వివరాలు: అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (10 + 2 + 3 నమూనా) ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి సమానమైనది.  అవసరమైన వయస్సు పరిమితి: కనీస వయస

శ్రీమంతుడు నంబరు వన్.. ముఖేష్ అంబానీ

శ్రీమంతుడు నంబరు వన్.. ముఖేష్ అంబానీ రూ.3,80,700 కోట్ల సంపదతో అగ్రస్థానంలో ముఖేష్  రెండుమూడు స్థానాల్లో హిందూజా, విప్రో అధినేతలు  25 ఏళ్లకే జాబితాకెక్కిన ఓయో రూమ్స్ సీఈవో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోమారు భారత్‌లోనే అత్యంత శ్రీమంతుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.  ఈ ఏడాదికిగాను ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్‌మెంట్-హ్యూరన్‌లు విడుదల చేసిన ఈ జాబితాలో ముఖేష్ అంబానీ వరుసగా ఎనిమిదోసారి ఈ జాబితాలో అగ్రస్థానాన్ని అలంకరించారు.  రెండో స్థానంలో భారత్‌కే చెందిన లండన్ వాసులు ఎస్‌పీ హిందూజా, ఆయన కుటుంబ సభ్యులు నిలిచారు.  ముఖేష్ సంపద రూ.3,80,700 కోట్లు కాగా, హిందూజాల సంపద రూ.1,86,500 కోట్లు.  రూ.1,17,100 కోట్ల నికర సంపదతో విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ మూడో స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో మొత్తం 152 మందికి ఈ జాబితాలో చోటు లభించగా హెచ్‌సీఎల్ ఎంటర్‌ప్రైజెస్ సీఈవో రోషిణి నాడార్ అత్యంత శ్రీమంతుల్లో మొదటి స్థానంలో నిలవగా, గోద్రెజ్ గ్రూపునకు చెందిన స్మితా వి కృష్ణ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.  ఇక, స్వయం శక్తితో వ్యాపారవేత్తగా ఎదిగిన మహిళల్లో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజ

తెలుగు రాష్ట్రాలకు .. 'హికా' తుపాను హెచ్చరికలు..!!

తెలుగు రాష్ట్రాలకు .. 'హికా' తుపాను హెచ్చరికలు..!! ఇప్పటికే భారీ వర్షాలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు మరో పిడుగు వార్త, హికా తుపాను.. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు సిద్ధమైంది. రాగల 24 గంటల్లో.. ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD హెచ్చరించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హికా తుపాను ప్రభావంతో.. అరేబియా తీరంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులెవరూ.. చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.మరో.. 48 గంటల్లో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యూపీ, రాజస్థాన్, విదర్భ, చత్తీస్‌ఘడ్, బెంగాల్‌లో కుంభవృష్టి కురుస్తుందని తెలిపారు.  అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆలిండియా వార్నింగ్ బులెటిన్‌లో.. వాతావరణశాఖ

సూర్యాపేటలో ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికిపైగా గాయాలు

  సూర్యాపేటలో ప్రైవేటు బస్సు బోల్తా.. 20 మందికిపైగా గాయాలు దురాజ్‌పల్లిలో ఘటన ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడిన బస్సు క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు సూర్యాపేటలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.  పట్టణ శివారులోని దురాజ్‌పల్లిలో ఈ ఘటన జరిగింది.  వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది.  ఈ ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం.  వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

సిట్టిగాడి వార్త...వాత...😊😊😊

సిట్టిగాడి వార్త...వాత...😊😊😊 హుజూర్ నగర్ ఉపఎన్నిక త్రిముఖ పోటీకి రెడీ అయింది...నాంపల్లి స్టేషన్ కాడి రాజా లింగో రమారాజ్యం తీరు సుడూ శివా సెంబులింగా అనే పాటతో జనం మది దోసుకుందాం పెతి పక్షం వారు పావులు కదుపుతుంటే, ముందు బతుకమ్మ పండుగ వేడుక సందర్భంగా ముత్యాల సెమ్మ సెక్క రతనాల మల్లె మొగ్గ ఓ సెలి ఆడుదమా పాడుదమా కలకిల కిలకిలా నవ్వులతో గాజులు గలగల లాడా పాటతో ముందికి వెళ్లి ఈజయం వరించాలి అని కేసీఆర్ సారు  ప్లాన్ సేస్తున్నారు అని టాక్... రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ లో ఉన్నా ఆయన పెద్దసారు మనిషి అని కాంగ్రెస్ వారు,ప్రజల నమ్మకం...ఈజయం ఎవరికి దక్కుతుందో 24న చూడవలసిందే... మరాఠా యోధుడు పవార్ సారు  ED పిలుపు అందగానే మిగతా వారిలా కాకుండా సానుకూలంగా స్పందించడం,వారు జైలుకు పంపినా అక్కడ శ్రీ కృష్ణ తమ్ముడా అనే పాటతో సాటి ఖైదీల మధ్య సందడి సేస్తాను అని సెప్పటం సిట్టి గాడి బుర్ర తిరిగి పోయింది...ఆరోగ్యం సరిగ్గా లేకున్నా ఆయనకున్న మనో నిబ్బరం సూసి ED సార్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేసి సుడవలసిందే... అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్న సామెత గుర్తు సేసుకుంటూ రిమాండ్ పొడిగించినందుకు కాదు పెద్ద సార

మహారాష్ట్ర ఎన్నికలో TRS నుండి పోటీ చేయుటకు అవకాశం ఇప్పించని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త ను కలసిన మహారాష్ట్ర నాయకులు

Image
నిజామాబాద్ అర్బన్ MLA శ్రీ బిగాల గణేష్ గుప్తాని కలిసిన మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు.. -మహారాష్ట్ర లో త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికలలో TRS పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని మహారాష్ట్ర లోని నాందేడ్  జిల్లా కి చెందిన  సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేదార్ రాయ్ జి రావ్ పటేల్ కే గారు అర్బన్ MLA  బిగాల గణేష్    గుప్తాని  కలిసి విన్నవించారు. - మా గ్రామలన్ని తెలంగాణ రాష్టానికి దగ్గరగా ఉన్నాయని కానీ మా గ్రామలు అభివృద్ధి కి నోచుకోవడం లేదన్నారు. - తెలంగాణ రాష్టం లో అమలయ్యే సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా మా రాష్టం లో అమలు కావడం లేదన్నారు.  -తెలంగాణ లోముఖ్యంగా రైతు లకు ఎకరానికి ఏడాదికి 10000/- రూపాయలు, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్,2 వేయిల రూపాయల ఫించన్ ఇస్తే  మహారాష్ట్ర లో కేవలం 6 గంటల కరెంట్ 600 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. - తెలంగాణ రాష్టం లో  ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసవం జరిగితే KCR కిట్స్,  ఆడ బిడ్డలకి కల్యాణ లక్ష్మీ, పండుగలకి బట్టలు ఇస్తున్నారు. పేద విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్య అందిస్తూన్నారు. కానీ మా రాష్టం లో ఇలాంటి పథకాలు అమలు కావడం లేదు. తెలంగాణ లో రోడ్లు బాగున్నాయి కానీ

Lb నగర్ టూ అమీర్పేట్ టూ మియపూర్ రూట్ లో మెట్రో రైల్ సర్వీసులకు అంతరాయం..

Image
Lb నగర్ టూ అమీర్పేట్ టూ మియపూర్ రూట్ లో మెట్రో రైల్ సర్వీసులకు అంతరాయం.. https://youtu.be/WMFX3bEfyaM 40 నమిషాలుగా నిలిచిపోయిన రైళ్లు... ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు

అక్టోబరు ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లో పలు మార్పులు రాబోతున్నాయి. 

  అక్టోబరు ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లో పలు మార్పులు రాబోతున్నాయి.  డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ)లు కూడా మారనున్నాయి.  అంటే డీఎల్, ఆర్సీలకు సంబంధించిన రంగు, డిజైన్, భద్రతాపరమైన అంశాలన్నీ మారనున్నాయి.  కొత్త రవాణా చట్టం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే డీఎల్, ఆర్సీల విషయంలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది.  డీఎల్, ఆర్సీలు దేశమంతటా ఒకే మాదిరిగా ఉండాలన్నది కేంద్రం లక్ష్యం.  అంటే అంటే ఏ రాష్ట్రంలోనైనా సరే డీఎల్, ఆర్సీల తయారీ విధానం, ఇతర ప్రమాణాలన్నీ ఒకే విధంగా ఉండబోతున్నాయి. కొత్త ఫార్మాట్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్ ఉండబోతున్నాయి.  అంతే కాదు వాహనదారుడి బ్లడ్ గ్రూప్, లైసెన్స్ ఇచ్చిన తేదీ, అత్యవసర సమయంలో కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఉంటాయి. కొత్తగా రాబోయే డీఎల్, ఆర్సీల వల్ల దేశంలోని ప్రతీ వాహనం, వాటి సొంతదారులు, డ్రైవర్లకు సంబంధించిన సమాచారమంతా ఒకే డేటాబేస్ లో స్టోర్ చేసే అవకాశం ఉంటుంది.  దీని వల్ల వాహనానికి, దాని డ్రైవర్ కు సంబంధించిన సమాచారం ఏ రాష్ట్రంలోనైనా సరే తెలుసుకునే అవకాశముంటుంది. ఇక

ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించిన డాక్టర్ లక్ష్మీప్రసన్న

Image
*ప్రాథమిక ఆరోగ్య  కేంద్రం త్రిపురవరం పరిధిలోని వాయిల సింగారం గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని డాక్టర్ లక్ష్మీప్రసన్న బుధవారం పరిశీలించారు గర్భిణీలకు మరియు చిన్నారులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు సిబ్బంది గ్రామాలలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని కోరారు అనంతరం గ్రామంలో  రోగులను  పరిశీలించారు. టీ బి అనుమానిత లక్షణాలున్న వ్యక్తులు గ్రామానికి సంబంధించిన ఆరోగ్య కార్యకర్తల వద్ద ఆశా కార్యకర్తల వద్ద ఉచిత టీబి పరీక్షలు చేయించుకోవాలని అని కోరారు ఎడతెరిపి లేకుండా దగ్గు మరియు జ్వరంతో ఉన్న వారు ఎక్కువగా తేమడ లేదా కల్లె వస్తున్న వారు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేశారు . క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దోమకాటు వ్యాధులు ఈ కాలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కావున పరిసరాల పారిశుధ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని అని కోరారు ఆరోగ్య కార్యకర్తలు గ్రామంలోని ప్రజలకు సూచనలు ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు వెంకమ్మ రేణుక ఆరోగ్య కార్యకర్తలు కిరణ్, ఆశా కార్యకర్తలు మరియమ్మ  మరియు ప్రజలు పాల్గొన్నారు*  

*జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల సౌకర్యాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది: అల్లంనారాయణ* *అక్రెడిటేషన్ కార్డులను సెప్టెంబర్ 26వ తేదీ నుండి పొందవచ్చు*

Image
*జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల సౌకర్యాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది: అల్లంనారాయణ* జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల సౌకర్యాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మొట్టమొదటిసారి అక్రెడిటేషన్లను ఆన్ లైన్ లో ఇవ్వడం ఇంకొక ముందంజ అని, ఆన్ లైన్ లో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయగలిగామని ఆయన అన్నారు. ఇందుకు సహకరించిన మీడియా మిత్రులందరికీ, అక్రెడిటేషన్ కమిటీ సభ్యులకు, సమాచార పౌర సంబంధాల అధికారులను ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  బుధవారంనాడు సమాచార భవన్ లోని బోర్డురూమ్ లో రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీ ద్వితీయ సమావేశం జరిగింది. అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన అక్రెడిటేషన్ కమిటీ సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన 943 ఆన్ లైన్ దరఖాస్తులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది.                   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆన్ లైన్ దరఖాస్తులలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు ఇండిపెండెంట్, చిన్న పత్రికలు, కేబుల్ ఛానల్స్, ఏజెన్సీలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా నమోద

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం హైదరాబాద్ భరత్ నగర్ రైల్వే ట్రాక్ పై ఉన్న తల్లీ బిడ్డల్ని కాపాడిన రైల్వే పోలీసులు భర్త, మరిది వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నంకు చేసుకోవాల్సి వచ్చిందని వాపోయిన ఇల్లాలు తల్లీబిడ్డలకు కౌన్సెలింగ్ ఇస్తున్న ఎస్.ఆర్.నగర్ పోలీసులు భర్త, మరిదిలను పిలిపించి విచారిస్తామని భరోసా ఇచ్చిన పోలీసులు

కొరియా కారవాన్”తో సమావేశం అయిన KTR

Image
తెలంగాణలోకి వచ్చే దక్షిణ కొరియా పెట్టుబడులకు పూర్తి సహాకారం ఉంటుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామరావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లో కొరియా దేశ ప్రతినిధి బృందం “ కొరియా కారవాన్”తో సమావేశం అయ్యారు. ప్రతి ఎడాది దేశంలోని రెండు మూడు రాష్ట్రాలను ఎంచుకుని స్ధానిక కొరియా రాయభార కార్యాలయం ఈ కొరియా కారవాన్  కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈసారి తెలంగాణను  ఎంచుకుని ఇక్కడి పెట్టుబడి అవకాశాలు, రాష్ట్రంతో సంబంధాలను బలోపేతం చేయడం కోసం 48 మందితో కూడిన బృందం తెలంగాణలో పర్యటిస్తున్నది. ఈ సందర్భంగా కొరియా బృందంతో సమావేశం అయిన మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను వివరించారు. తెలంగాణ భారతదేశంలో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మెదటి స్ధానంలో ఉన్నదని, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ దేశంలోనే అత్యుత్తమైనదని తెలిపారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన భారీ పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని, ముఖ్యంగా ఐటి రంగంలో టాప్ 5 కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలు ఏర్పాటు చేశాయన్నారు. ఐటి తోపాటు 14 ఇతర రంగాలను తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి అనుమతులు, రాయితీలను కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో

సినీహీరో వేణు మాథవ్  మృతి పట్ల పలువురు సంతాపం

Image
సినీహీరో వేణు మాథవ్  (40) మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఈనెల 6న చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఆయన దీంతో ఈరోజు కనుమూసారు ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు సినీ పరిశ్రమ బంధువులు స్నేహితులు తీవ్ర దిగ్ర్భాంతి కి గురైయారు దీంతో ఆయనకు సంతాపం తెలిపారు కాగా కోదాడ కు చెందిన వ్యక్తి కావడంతో కోదాడ మూగబోయింది ఈ కార్యక్రమంలో అభిమానులు రాష్ర్టీయ హీందూ సేన కోదాడ నియోజకవర్గం కన్వీనర్  చల్లా సతీష్ తదితరులు ఉన్నారు

ABVP ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు......

Image
నల్గొండ పట్టణ కేంద్రంలో ABVP ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు......