Skip to main content

Posts

Showing posts from March, 2024

మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బిజెవైయం నల్గొండ జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి

 మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బిజెవైయం నల్గొండ జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి బిజెపి ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిజెవైయం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యేలు 8 మంది వెంకట్ రెడ్డి గారితో మరియు కాంగ్రెస్ అధిష్టానంతో అందుబాటులో ఉన్నారని చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో డబ్బు అహంకారం చూపిస్తే నల్లగొండ అసెంబ్లీ ప్రజలు గతంలో ఓడించారు. మళ్లీ దొంగ హామీలను ఇచ్చి ఇప్పుడు ఆరు దొంగ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మళ్లీ మభ్యపెట్టి అధికారాన్ని తెచ్చుకున్నారు. మరియు ఇప్పుడు అధికార అహంతో భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఆ వ్యాఖ్యలు సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతోని అందుబాటులో ఉండి రాజగోపాల్ రెడ్డి గారికి సహకరించింది వాస్తవమా కాదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారతీయ జ

ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగు తొలగించాలి - పాలడుగు నాగార్జున

 ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగు తొలగించాలి - పాలడుగు నాగార్జున   పార్లమెంట్ ఎన్నికల నిబంధనల ప్రకారంగా రాజకీయ నాయకులకు ముసుగులు వేస్తారు. ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నల్లగొండ పట్టణం లోని పెద్ద గడియారం సెంటర్లో గల జ్యోతిబాపూలే కు తెల్లటి గుడ్డలతో ముసుకు కప్పడం జరిగిందని, గతంలో జరిగిన ఏ ఎన్నికలలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబాపూలే విగ్రహాలకు ముసుగులు కప్పబడి లేదని, నేడు మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి ముసుకు కప్పారని, తగు పరిశీలన జరిపి ఎన్నికల నిబంధనావలి కి లోబడి ముసుగు తొలగించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున వినతి పత్రం సమర్పించారు.

టేట్ అర్హత ఫీజును తగ్గించాలి: బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి

 *టేట్ అర్హత ఫీజును తగ్గించాలి: బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి*  గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుంది నల్గొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు వంగూరు రాఖీ అన్నారు. గతంలో టెట్ అర్హత ఫీజు ఒక పేపర్ కు రూ.200 ఉండగా దాని రూ.1000కి ఫీజు పెంచారు,రెండు పేపర్లు వస్తే అభ్యర్థులకు గతంలో రూ.300 ఉండగా దాని ఏకంగా రూ.2000కి పెంచారు.ఈ సాయి పెంచడం నిరుద్యోగులకు అన్యాయం చేయటమే, ఈ యొక్క ఫీజులను తక్షణమే తగ్గించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది.

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవం

 బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవం  నల్గొండ బార్ అసోసియేషన్ 28-3-2024 జరగబోయే ఎన్నికల్లో , ట్రెజరర్ గా మంచుకొండ రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా లేడీ రిప్రజెంటేటివ్ గా నాంపల్లి భాగ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 

కార్పోరేషన్ ప్రకటించినందుకు సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్

 ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పోరేషన్ ప్రకటించినందుకు సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేసిన ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. *_ఎన్నో సంవత్సరాల చిరకాల వాంఛ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు.. చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ ఆర్యవైశ్యులలో కూడా పేద ఆర్యవైశ్యులు ఉంటారు అని గుర్తించి ఆర్యవైశ్య కార్పొరేషన్ కి కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా.. ఈరోజు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ తరపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపిన అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న "తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్" (TFJA)..

 రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న "తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్" (TFJA).. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ "డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్" పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో "విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ "కె.శ్రీనివాస్ రెడ్డి", తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు "దిల్ రాజు", పీపుల్ స్టార్ "ఆర్.నారాయణమూర్తి", TUWJ ప్రధాన కార్యదర్శి "విరహత్ అలీ" తదితరులు పాల్గొన్నారు.... తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) గత 20 సంవత్సరాలుగా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అధ్యక్షుడు "వి.లక్ష్మీనారాయణ", ప్రధాన కార్యదర్శి "వై.జె.రాంబాబు", కోశాధికారి "నాయుడు సురేంద్ర కుమార్" వివరించారు...

జర్నలిస్టుల డిమాండ్స్ ను* *పరిష్కరించాలి* *-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి* *టీయూడబ్ల్యూజే వినతి పత్రం*

 *జర్నలిస్టుల డిమాండ్స్ ను* *పరిష్కరించాలి* *-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి* *టీయూడబ్ల్యూజే వినతి పత్రం*  దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ, షహీద్ భగత్ సింగ్ వర్ధంతి రోజైన మార్చ్ 3న, "జర్నలిస్ట్స్ డిమాండ్ డే"కు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఆయా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సందర్బంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, ప్రెస్ కమిషన్ చివరి నివేదిక 1982లో వెలువడిందని, ఆతర్వాత దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా రాకతో మీడియా దృష్టాంతంలో పెనుమార్పు వచ్చిందని, ఇందుకుగాను మీడియా సమస్యలను పరిష్కరించడానికి కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జర్నలిస్టులకు

ఆది పరాశక్తి

 *ఆది పరాశక్తి* *పదాలు రెండూ పరస్పర విరుద్ధంగా వున్నా, గుణాన్ని లెక్కగట్టే విషయంలో భావం ఒక్కటే. బాధితులు "రాక్షసి" అంటే, హర్షించినవారు "ఆదిపరాశక్తి" అంటారు.* *ఈ రెండింటి ప్రతిరూపం భానుప్రియ మీనా. 2015 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి, ఢిల్లీ ఎన్ ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టరు మరియు ఢిల్లీ మద్యం కుంభకోణం కూపీలు లాగుతున్న అద్వితీయ మహిళ.* *మనం సాధారణంగా టివి ఒ.టి.టిలో క్రైం థ్రిల్లర్ సీరియల్ చూసినా, సినిమా చూసినా ఇలాంటి లేడీ ఆఫీసర్ చేసిన నటిని "ఎంతబాగా చేసిందో" అంటూ ఉంటాం.* *అదే దృశ్యం నటన కాకుండా నిజం అయితే?*💪 *హైదరాబాదులో కవిత అరెస్టు, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కచ్చితంగా అపూర్వం. భానుప్రియ ఆ రెండు విధులునూ ఎంత తెగింపుతో చేసిందో, ఎంత చాకచక్యంగా హ్యాండిల్ చేసిందో, ఎంత పరిపక్వత, అనుభవం చూపించిందో చూసినవారు చప్పట్లు కొట్టిఉంటారు.* *కల్వకుంట్ల తారక రామారావుని "ఎక్కువ మాట్లాడితే నిన్నూ జైల్లో పడేస్తా" అనడానికి ఎంత గుండె ధైర్యం ఉండాలి?* *తొమ్మిది సార్లు తప్పించుకున్న అరవింద్ కేజ్రీవాల్ ను పదవసారి కారెక్కెంచుకుని తన ఆఫీసుకి లాక్కెళ్ళిన ధీశ

జర్నలిస్టులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

 జర్నలిస్టులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణలో అనేక పోరాటాలు చేసిందని జర్నలిస్టులు అనేవారు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నించాలన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి కలిసి రఘునందన్ రావుకు డైరీ అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కప్పర్ ప్రసాద్ రావు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి విలేకరి నుంచి రఘునందన్ రావు ఇంత ఎత్తుకు ఎదగడం సంతోషంగా ఉందని జర్నలిస్టుల సమస్యల కోసం అసెంబ్లీలో గళం విప్పిన రఘునందన్ రావు రేపు పార్లమెంట్లో దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడేలా అవకాశం వస్తున్నందుకు సంతోషించారు

పర్యావరణ క్యాలెండర్ ఆవిష్కరించిన పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు

 పర్యావరణ క్యాలెండర్ ఆవిష్కరించిన  పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు నల్లగొండ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ ఇండియన్ ఎన్విరాన్ మెంట్ సోషల్ ఫోరం (ఐ ఈ ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నల్లగొండ పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక పర్యావరణ అంశాలతో కూడిన ప్రకృతి దినాలను పొందుపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పర్యావరణ కార్యకర్త జీడిమెట్ల రవీందర్ ,సహాయ పర్యావరణ ఇంజనీర్ ఎండి సజీనా బేగం, సహాయ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.పురుషోత్తం రెడ్డి, డాక్టర్ యం.రామకృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది రహిమ, కె.నాగరాజు, విజిత, తదితరులు ఉన్నారు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

  జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి  తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ( టి జే యు) 2024 డైరీ ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పౌర సంబంధాల శాఖ, రెవిన్యూ శాఖ మంత్రి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2024 డైరీ ని ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు పెద్దపీట  వేస్తుంది అన్నారు. జర్నలిస్టుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే తీరాయని ఇప్పటి ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులు అందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనతంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి జర్నలిస్టుల సమస్యలు వివరించగా ప్రభుత్వము లో చర్చిస్తా మన్నారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు  మాట్లాడుతూ 2012న ఏర్పాటు అయినా జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ ఏర్పాటు కోసం అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసిందని 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులన్నారు. కెసిఆర్ కు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలకు యూనియన్ లకు తప్ప ప్రజా సమస

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: విలేకరుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్*

*ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: విలేకరుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్*    *హైదరాబాద్, మార్చి 16:*   జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్  జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్  రోనాల్డ్ రోస్ అన్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా శనివారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్లో  సి పి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.... పార్లమెంట్ ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి నేటి (శనివారం) నుండి అమలులోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ లోక్ సభ సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిందని, తెలంగాణ లో ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడుతుందని, ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 26న స్క్రూటిని, 29న విత్ డ్రాయల్ ఉంటాయని, మే 13న పోలింగ్ జరుగుతుందని, జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ కు ఆర్.ఓ గా హైదరాబాద్ జిల్లా కలెక్టర

కౌటికె ఆదిత్య కు ఘనంగా సన్మానం

 కౌటికె ఆదిత్య కు ఘనంగా సన్మానం భారతీయ జీవిత బీమా సంస్థ సౌత్ సెంట్రల్ జోన్ సికంద్రాబాద్ డివిజన్ లో గత క్యాలెండరు ఇయర్ లో అత్యధిక ప్రీమియం సంస్థ లో మదుపు చేసి అందరికంటే ముందు ఉన్న సందర్భమున ఈ రోజు హోటల్ మ్యారెట్ లో ఏజెంట్ల కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో కౌటికె ఆదిత్య కు సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ ఎల్ కె శామ్ సుందర్ ఘనంగా సన్మానం చేసారు. దాదాపు 300 మంది డివిజన్ లోని ప్రముఖ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భముగా ముఖ్య అతిథి గ విచ్చేసిన జోనల్ మేనేజర్ గ ఆదిత్య చేస్తున్న జీవిత బీమా ప్రొఫెషనల్ విధానాన్ని ప్రశంసించారు . ఈ సందర్భముగా విడుదల చేసిన టాప్ ఏజెంట్ల వివరాలతో విడుదల చేసిన పుస్తకం లో సీనియర్ డివిజనల్ మేనేజర్ రామయ్య కౌటికె ఆదిత్య కౌటికె కావ్య గార్లు డివిజన్ లో వున్న అందరు MDRT ఏజెంట్ల కంటే ప్రతి సంవత్సరం లాగే ఎక్కువ చేసి అందరికంటే ముందు వున్న సందర్భముగా శుభాకాంక్షలు తెలియచేసారు. అంతే కాకుండా వారు చేస్తున్న ప్రొఫెషన్ లో అందరి కంటే ఎక్కువ చేసి No 1 ఉండడం పట్ల ఆభినందించారు. ముఖ్య అతిథి గారి మోటివేషనల్ ప్రసంగం అందరికి నచ్చింది. ఈ సమావేశములో మార్కెటింగ్ మేనేజర్ శ్రీమతి కె
  ⚪ *ఢిల్లీ* || *సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన సీఈసి*||  ◻️ దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా. ◻️ దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ◻️ లోకసభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు .. ◻️ *ఏపీ ,ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్.. ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు నోటిఫికేషన్ విడుదల– ఏప్రిల్ 18  నామినేషన్లకు చివరి తేదీ- ఏప్రిల్ 25 నామినేషన్ల స్క్రూటినీ– ఏప్రిల్ 26 నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం- ఏప్రిల్ 29  ఎన్నికల తేదీ— మే 13 ఎన్నికల కౌంటింగ్- జూన్ 4 ◻️ కాస్మిర్ లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది:ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ◻️ దేశ వ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. ◻️ ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది  ◻️ 55 లక్షల ఈవిఎం లు వినియోగిస్తున్నాం... ◻️ కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు.. ◻️ దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు.. ◻️ వాలంటీర్, కాంట్రాక్టు ఉద్యోగాలు చేసే వారు ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదు  *జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం..* *Model Code of Conduct..* *దేశవ్యాప్తంగా మోడల్ కోడ్

జర్నలిస్టు సమస్యల పరిష్కారమే IFWJ ప్రధాన ధ్యేయం: జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జునయ్య

జర్నలిస్టు సమస్యల పరిష్కారమే IFWJ ప్రధాన ధ్యేయం: జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జునయ్య 1951నుండీ దేశంలో పని చేస్తున్న ఏకైక యూనియన్ ప్రభుత్వాలు ఏవి ఉన్నా జర్నలిస్టుల హక్కులకై పోరాటాలు తప్పవు జాతీయ నాయకుల ఆధ్వర్యంలో టీజేయు 2024 డైరీ ఆవిష్కరణ  యూనియన్ విస్తరణకు కలిసికట్టుగా పనిచేద్దాం  ఆంధ్ర ప్రదేశ్  ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) లో జరిగిన 133వ వర్కింగ్ కమిటీ సమావేశంలో  జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య  సెక్రెటరీ జనరల్ పరమానందం పాండే లు మాట్లాడుతూ ఐ ఎఫ్ డబ్ల్యూ జే దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని పిలపునిచ్చారు. జర్నలిస్టుల హక్కుల లక్ష్యమే ధ్యేయంగా పనిచేస్తూన్న యూనియన్ ను బలహీన పరచాలని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అంతకు రెండింతల శక్తితో దేశంలో బలంగా పనిచేస్తున్న యూనియన్ మనదే అన్నారు.  1951 నుండి జర్నలిస్టుల హక్కులకై పోరాటం చేస్తున్న ఏకైక సంఘం దేశంలో మరొకటి లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఏవి ఉన్నా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం చేసే పోరాట ప్రతిమ ఉన్న ( IFWJ) మరింత బలంగా కావాలని ఆకాంక్షించారు.  దేశంలోనే కాకుండా ప్రపంచంలో మరిన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి పనిచేస్తున్న యూ

34 వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీ థర్డ్ ఫేస్ లో పార్కు కి శంకుస్థాపన చేసిన మునిసిపల్ చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి

 34 వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీ థర్డ్ ఫేస్ లో పార్కు కి శంకుస్థాపన చేసిన మునిసిపల్ చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి   నల్గొండ, మార్చ్ 11:  34 వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీ థర్డ్ ఫేస్ లో పార్కు శంకుస్థాపన పనులను నల్లగొండ పురపాలక సంఘం చైర్ పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.  34 వార్డు కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మరియు బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ బండారు ప్రసాద్ మాట్లాడుతూ 20 లక్షల రూపాయలతో చేపడుతున్న పార్కు చుట్టుపక్కల ప్రహరీ గోడ, పార్కు మంజూరు చేయడం జరిగినదని తెలిపారు. భవిష్యత్తులో కాలనీలో గల సమస్యలను తీర్చుతామని, కాలనీలో గల పిల్లలకు మహిళలకు వృద్ధులకు అందరికీ పార్కు అందుబాటులోకి రానుందని తెలిపినారు.  న్యూ శ్రీ వెంకటేశ్వర కాలనీ పార్కు పక్కన జరుగుతున్న వరద కాలువ పనులను పరిశీలించారు.  కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర్లు, కాలనీ అధ్యక్షులు నూకల జైపాల్ రెడ్డి కాలనీ సమస్యలు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి వెళ్ళగా పార్కు పక్కన వరద కాలువ వెళ్తున్నందున పిల్లలు ,మహిళలు, వృద్ధులు,

చిన్న పత్రికలకు చేయూత తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

  చిన్న పత్రికలకు చేయూత  తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : చిన్న పత్రికలతో పాటుజర్నలిస్టుల సమస్యలపై  పూర్తి అవగాహన  ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన పిదప తెలంగాణ చిన్న మధ్య తరహా దిన, మాస పత్రికల సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి, బొకే అందించి సత్కరించారు. అనంతరం చిన్న పత్రికల సమస్యల పరిష్కారం కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అక్షిత చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి, గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనం, ప్రధాన కార్యదర్శి అహమ్మద్ అలీలతో కూడిన బృందం వినతి పత్రాన్ని సమర్పించారు. చిన్న పత్రికలకు చేయుత నందించాలని కోరారు.జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు అవసరమైన శిక్షణ, గత కొంతకాలంగా చిన్న, మధ్య తరహా పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఆఫ్ గ్రేడ్ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని, ఏడాదిన్నర కాలంగా ఆర్థిక శాఖలో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, దిన పత్రికలతో పాటు మ్యాగజైన్ లకు కూడా ప్రకటనలు జారీ చేసేలా తగు సూచనలు ఇవ్వాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి - గుమ్మల

 07/03/2024 *పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి* *నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి* ******************************************"******* *నల్లగొండ*: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ పని చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని నల్గొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్,ఎన్ ఎస్ యు ఐ రెండు కళ్ళని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యూత్ కాంగ్రెస్ నాయకులు డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టి అభ్యర్థులు గెలుపు కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరే విధంగా తమవంతుగా యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే యువజన కాంగ్ర

శ్రీమతి టీజీ గౌరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ ఆర్యవైశ్య మహా సభ నాయకులు

 కర్నూలులోని టీజీ వెంకటేష్ నివాసంలో  అయన తల్లి శ్రీమతి టీజీ గౌరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ ఆర్యవైశ్య  మహా సభ నాయకులు అమరవాది లక్ష్మినారాయణ, కొండ్లే మల్లికార్జున్, ఆగీర్ వెంకటేష్, యిరుకుల్ల రామకృష్ణ.

LRS పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు వట్టి మాటలయ్యాయి - ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల

  LRS పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు వట్టి మాటలయ్యాయి - ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల  *LRS పై భట్టి మాటలు.. వట్టి మాటలేనా..* *ఉత్తమ్ ముచ్చట.. ఉత్త ముచ్చటేనా..!* *గతంలో LRSపై కోర్టు కెళ్ళిన కోమటిరెడ్డి... ఇప్పుడు ఏ బార్లో తాగిపడుకున్నాడు* *LRS పేరుతో 20 వేల కోట్ల దోపిడికి కాంగ్రెస్ కుట్ర..* *నో ఎల్ ఆర్ ఎస్.. నో కాంగ్రెస్.... .ఈ ఉత్తమ కుమారుల పాలనకు ఇక విఆరెఎస్సే...* *LRS పై ఉప ముఖ్యమంత్రి భట్టి మాటలు... వట్టి మాటలయ్యాయని..ఉత్తమ్ కుమార్ ముచ్చట.. ఉత్త ముచ్చటేనని ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు. బారుకు వెళ్ళడమే తెలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.. గతంలో LRSపై కోర్టుకు వెళ్ళారని.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 20 వేల కోట్ల దోపిడీకి కుట్ర చేస్తే ఎక్కడకి పోతాడో చెప్పాలని వారు ప్రశ్నించారు. LRSను ఉచితంగా అమలు చేయాలని క్లాక్ టవర్ సెంటర్లో BRS రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం ధర్నా కార్యక్రమం చేపట్టింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ZP ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్

ధరణి దరఖాస్తులను ఎప్పడికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన

 నల్గొండ, 6.3.2024          ధరణి దరఖాస్తులను ఎప్పడికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు.        బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఆన్లైన్ ద్వారా "రైతు నేస్తం " వీడియో కాన్ఫెరెన్స్ విధానాన్ని ప్రారంభించగా , తిప్పర్తి రైతు వేదికలో ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం వచ్చిన జిల్లా కలెక్టర్ ముందుగా తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి వెబ్ సైట్లో ని దరఖాస్తులు, ఫైళ్ళ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ధరణిలో ఉన్న వివిధ రకాల మాడ్యూల్స్ పై వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. భూముల సర్వే ,కోర్ట్ కేసులు తదితర అంశాలను తహసీల్దార్ స్వప్న ద్వారా అడిగి తెలుసుకున్నారు.     మండల తహసిల్దార్ తో పాటు, డిప్యూటీ తహసీల్దార్,సర్వేయర్ లకు పలు సూచనలు చేశారు.        అనంతరం కార్యాలయ ఆవరణలో సైదు బాయి గూడెం కి చెందిన దివ్యాంగురాలు జక్కా లక్ష్మి తనకు రేషన్ కార్డు కావాలని జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ఇవ్వగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు .రేషన్ కార్డుతో పాటు ఉపాధి చేసుకునేందుకు ముందుకు వస్తే అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపా

క్రైస్తవులకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి - రేఖల భద్రాద్రి-

  *క్రైస్తవులకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి* *కాంగ్రెస్ నాయకులు,జిల్లా గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ రేఖల భద్రాద్రి* ************************************************* *నల్లగొండ*: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని క్రైస్తవులకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, ఏఐసిఎఫ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ రేకల భద్రాద్రి కోరారు. మంగళవారం నల్గొండ కలెక్టరేట్ సమీపంలో గల చర్చిలో పాస్టర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో క్రైస్తవులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా గెలిపించుకోవడం జరిగిందని తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో కూడా 16 వేల మంది క్రైస్తవులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అండగా ఉండి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్లకు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ, రాజ్యసభ , రెండు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చే

ఏసీబీ వలలో JAO

 ఏసీబీ వలలో JAO హబ్సిగూడ విద్యుత్ కార్యాలయంలో దాడులు జూనియర్ అకౌంట్స్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన హబ్సిగూడ విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం చోటు చేసుకుంది. నాచారం ఏడీఈ కార్యలయంలో పనిచేస్తున్న ఆర్టిజెన్ భరత్కు సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని జూనియర్ అకౌంట్స్ అధికారి విజయ్ సింహారెడ్డిని కొద్దిరోజులగా వేడుకుంటున్నాడు. లంచం చెల్లిస్తే కానీ చెల్లించేది లేద న్నాడు. సక్రమంగా పనిచేసిన వేతనాలు విడదల చేసేందుకు రూ.35వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో హైదరాబాద్-2 ఏసీబీ యూనిట్ అధికారులను ఆశ్రయించాడు. ఈక్రమంలోనే శుక్రవారం విజ య్ సింహారెడ్డి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన నాంపల్లి కోర్టుకు తరలించి చంచల్గూడ జైలుకు రిమాండ్ కు తరలించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే చట్టప్రకారం చర్య తీసుకోవడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి సంప్రదించాలని ఏసీబీ అధికారులు ప్రజలకు కోరారు.