Posts

Showing posts from November, 2022

BHUPATHI TIMES, TELUGU DAILY, 29th Nov. 2022.

  https://drive.google.com/file/d/1XCu2EeEjkJUmNbjm5YCxLHHMnjx2z4Ba/view?usp=drivesdk

గుజరాత్ మొదటి దశలో జరిగే ఎన్నికలకు ప్రచారం నేటి సాయంత్రం ముగియనున్నది...

Image
 గుజరాత్ మొదటి దశలో జరిగే ఎన్నికలకు ప్రచారం నేటి సాయంత్రం ముగియనున్నది... 89 స్థానాలకు జరిగే ఈ తోలి దశ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు సోమ్‌నాథ్, భావ్‌నగర్, నవ్‌సారిలో ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు... అలాగే హోంమంత్రి అమిత్ షా కూడా ఈ రోజు పలు చోట్ల ఎన్నికల సభల్లో పాల్గొంటారు... డిసెంబరు 1 గురువారం రోజు మొదటి దశ పోలింగ్ జరుగుతుంది...

స్టాంపు పేపర్లు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి:-చికిలంమెట్ల అశోక్

Image
  *"స్టాంపు పేపర్లు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి:-చికిలంమెట్ల అశోక్ *"ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు విక్రయిస్తున్న వారిని గుర్తించి  వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు చి కి లం మెట్ల అశోక్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.* *సంక్షేమ పథకాల అమలు,  విద్యార్థుల ఉపకార వేతనాలు,  స్థిరాస్తి ఒప్పందాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ లో రుణాలు పొందేందుకు వీటి అవసరం ఉంటుంది కాబట్టి, వినియోగదారుల బలహీనతలను పసిగట్టి స్టాంపు వెండర్లు, స్టాంపు పేపర్లను విక్రయించాల్సిన ధరకు అధికంగా వసూలు చేస్తుండడంతో.. ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.* *వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నిర్ణీత ధరకు స్టాంపు పేపర్లు విక్రయాలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని, పేదల  అవసరాలను బలహీనతలుగా పసిగట్టి దోపిడీ చేస్తున్న వారి లైసెన్సులు రద్దు చేయాలని ఒక ప్రకటనలో అశోక్ డిమాండ్ చేశారు.*

హయత్ నగర్ తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో దారుణం

Image
 హయత్ నగర్  తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలో దారుణం* పదవ తరగతి విద్యార్థిని పై తోటి క్లాస్ మెంట్స్ ఐదుగురు అత్యాచారం. అత్యాచారం చేసే సమయం లో వీడియో తీసిన నిందితులలో ఒకరు. ఎవరికైనా చెబితే విడియో ని సోషల్ మీడియాలో పెడతాం అంటూ బెదిరించి  *పదిరోజుల తరువాత మరోసారి అత్యాచారం చేసిన నిందితులు* విడియో తీసి తోటి విద్యార్థులకి పంపిన నిందితులు. పోలీస్ లకి పిర్యాదు చేసిన బాదిత కుటుంబ సబ్యులు. అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమో

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో తుషార్ పిటిషన్

Image
  ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో తుషార్ పిటిషన్ హైకోర్టులో కేరళ బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి పిటిషన్ ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని తుషార్ పిటిషన్ ఎమ్మెల్యేలకు ఎరపై సిట్ దర్యాప్తుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరిన తుషార్ పిటిషన్ లో సీఎం కేసీఆర్ ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్న తుషార్ కేసీఆర్ రాజకీయ అజండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని పిటిషన్ లో పేర్కొన్న తుషార్ ఈనెల 21న విచారణకు రావాలని 16వతేదీన తనకు 41ఏ నోటీసు ఇచ్చారన్న తుషార్ అనారోగ్యం కారణంగా వైద్యుల సూచనల మేరకు 2 వారాల గడువు కోరానన్న తుషార్ తన మెయిల్ కు రిప్లై ఇవ్వకుండా లుక్ అవుట్ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమేనన్న తుషార్

యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుంది-ముఖ్యమంత్రి కెసీఆర్

Image
 యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్  యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుంది-ముఖ్యమంత్రి కెసీఆర్ నల్గొండ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పెర్కోన్నారు. తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి ... ప్రైవేట్ కార్పోరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్  పవర్ ప్రాజెక్ట్ లాంటివి చేపడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్  పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకార్ రావు, బిహెచ్ఈఎల్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం, వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. తొలుత రెండు హెలికాప్టర్ లలో మంత్రులు, ప్రజాప్రత

పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకుంటాం. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటాం - బండి సంజయ్

Image
  పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకుంటాం. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటాం - బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్  కరీంనగర్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  అందులోని ముఖ్యాంశాలు.... • ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకున్నాం. పూజలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. • నిన్న పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొదటి సభ నిర్వహించుకోవాలని అనుమతిచ్చి... ఆ తరువాత కుంటి సాకులతో అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారు. • ఇప్పటి వరకు 4 విడతలుగా ప్రజాసంగ్రామ యాత్ర జరిగింది. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్దంగా పాదయాత్రను కొనసాగించాం. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డకునేందుకు యత్నించింది. • అందుకే హైకోర్టుకు వెళ్లాం... హైకోర్టు ఉత్తర్వులపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. • కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తాం. • అందులో భాగంగా ఈరోజే నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వెళుతున్నా. • అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తాం.  అక్కడినుండే లాంఛనంగా పాదయాత్రను ప్రారంభిస్తాం... •

దేశానికే తలమానికంగా 125 అడుగుల భారీ విగ్రహం-మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి

Image
  **దేశానికే తలమానికంగా 125 అడుగుల భారీ విగ్రహం-మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి **ట్యాంక్‌బండ్‌ ఒడ్డున మ్యూజియం **ఫిబ్రవరి నాటికి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పనులు పూర్తి హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌ బండ్‌ పక్కనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే ఎత్తయిన 125 అడుగు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్‌ విగ్రహ తెలంగాణ కే   మాణిహరంగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.  అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పనులు 2023 ఫిబ్రవరి నాటికి పూర్తి అవుతాయాని  వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనులు త్వరితగతిన జరుగుతున్నాయని చెప్పారు.  హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద11.5 ఎకరాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపు దిద్దు కుంటున్న 125 అడుగుల పొడవైన అంబేద్కర్ విగ్రహా నిర్మాణం పనులను సోమవారం నాడు అధికారులతో కలిసి మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్ది  పరిశీలించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌

అబ్బురపరిచేలా ఆహ్లాదం కలిగించేలా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం చేయాలి -నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

Image
 అబ్బురపరిచేలా ఆహ్లాదం కలిగించేలా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం  చేయాలి -నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి *సాధ్యమైనంత త్వరగా శిల్పారామం పనులు ప్రారంభం* *15 రోజుల్లో కళాభారతి డిపిఆర్ ను పూర్తి చేయాలి* *నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి* నల్గొండ,నవంబర్28... నల్గొండ పట్టణ శివారులోని పానగల్ ఉదయ సముద్రం అలుగు నుండి ఏర్పాటు చేయనున్న సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టణ ప్రజలను ఆకట్టుకునేలా వారికి ఆహ్లాదం కలిగించేలా ఏర్పాటు చేయాలని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఏజెన్సీ ప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి శిల్పారామం, ప్రత్యేక అధికారి రిటైర్డ్ ఐఏఎస్ గావోజి కిషన్ రావు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వి. రమాణచారి లతో కలిసి శిల్పారామాన్ని కళాభారతిని సస్పెన్షన్ బ్రిడ్జిని సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించి వాటిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణం తెలంగాణ రాష్ట్రానికి తల మానికంగా నిలబడపోతుందని అన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సహకారంతో వందలాది కోట్ల రూపాయలతో పట్టణం లో పలు రకాల అభివృద్ధి పనులు జరు

ప్రవేట్ స్కూల్లు కాలేజీల యాజమాన్యం తాయిలాలకు ఆశపడి స్కూళ్లను, కాలేజీలను పర్యవేక్షించని అధికారులు- BJYM అధ్యక్షులు అయితరాజు సిద్దు

Image
ప్రవేట్ స్కూల్లు కాలేజీల యాజమాన్యం  తాయిలాలకు ఆశపడి స్కూళ్లను, కాలేజీలను పర్యవేక్షించని అధికారులు- BJYM అధ్యక్షులు అయితరాజు సిద్దు  నల్గొండ: ప్రవేట్ స్కూల్లు కాలేజీల యాజమాన్యం  ఇచ్చే తాయిలాలకు ఆశపడి స్కూళ్లను, కాలేజీలను  అధికారులు పర్యవేక్షించడం లేదని BJYM  అధ్యక్షులు అయితరాజు సిద్దు  ఆరోపించారు.   ఆయా స్కూల్లో, కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు ఉన్నటువంటి మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి విద్యార్థులు తాగడానికి ఎక్కడ కూడా మంచినీటి వ్యవస్థ లేదు బోధన విషయంలోకొస్తే సరైన అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు లేరు కనీసం డిగ్రీ కూడా లేనటువంటి వ్యక్తులను ఉపాధ్యాయులుగా నియమించుకొని కాలం వెళ్లదీస్తున్నారు విద్యార్థులకు మంచి బోధన అందక చదువులలో ఉత్తీర్ణత రాణించలేకపోతున్నారు వేలకు వేల రూపాయలు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు కానీ సరైన భోదన లేదు, సరైన సౌకర్యాలు లేవు మరి నల్లగొండ జిల్లా అదికారులు స్కూల్లను, కాలేజీలను ఎందుకు పర్యవేక్షించట్లేదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నామని అన్నారు. వివిధ కల్చరల్ ప్రోగ్రామ్ ల పేరు మీద విద్యార్థుల దగ్గర డబ్బ

*యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత* *డిసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అరెస్టు*

Image
  *యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత*   *డిసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అరెస్టు*  నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో గల యాదాద్రి ధర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. పవర్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని హామీలు ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. దీంతో శంకర్ నాయక్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

మానవాళి జీవించాలంటే కాలుష్యాన్ని నివారించాలి - మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రకళ వెంకన్న

Image
మానవ మనుగడ కోసం పర్యావరణ సైకిల్ యాత్ర  మానవాళి జీవించాలంటే కాలుష్యాన్ని నివారించాలి మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రకళ వెంకన్న చండూర్ నవంబర్ 27 మానవ సమాజం బాగుండాలంటే కాలుష్యాన్ని నివారించాలని సైకిల్ యాత్ర చేపట్టిన ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్ రెండవ రోజు  మునుగోడు నియోజకవర్గ పరిధిలో చండూరు మండల  కేంద్రం చౌరస్తాలో పర్యావరణ జెండాను ఊపి సైకిల్ యాత్రను చండూర్ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య నివారించడం కోసం కృషి చేస్తున్న పర్యావరణ ప్రేమికుడు రవీందర్ ను అభినందించారు కాలుష్యానికి కారణం మైన ప్లాస్టిక్ను నివారించి రసాయన లను వాడకుండా ప్రకృతి వైపు ప్రజలు నడవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో దుబ్బ విజయభాస్కర్, ఆడపు పరమేష్, లింగస్వామి, వెంకన్న తదితరులు ఉన్నారు

BHUPATHI TIMES TELUGU DAILY 26TH, NOV. 2022

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ54.. ప్రయోగం విజయవంతమవ్వాలని ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు

Image
 నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ54.. ప్రయోగం విజయవంతమవ్వాలని ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమయింది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ54 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగానికి రెడీ అయింది. కాసేపట్లో ప్రయోగం చేసేందుకు కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ ఉదయం 11.56 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రయోగానికి సంబంధించి షార్‌లోఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ జరిగింది. కాగా ఈ ప్రయోగం ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో 960 కేజీల ఓషన్‌శాట్-3తో పాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇస్రోకు చెందిన ఈఓఎస్‌–06 ఉపగ్రహంతో పాటు 8 ఉప గ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తోంది. షార్‌ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో 56వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ల్‌ వెర్షన్‌లో 24వది కావడం విశేషం. ఇక్కడికి వచ్చిన ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌.. పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ను మరోమారు తనిఖీలు నిర్వహించారు. క

వీటి కాలనీ వాసులను బెంబేలు ఎత్తిస్తున్న దొంగలు

Image
  వీటి కాలనీ వాసులను బెంబేలు ఎత్తిస్తున్న దొంగలు నల్గొండ లోని వీటి కాలనీ లో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.  నెల రోజుల్లో పలు  దొంగతనాలు జరిగాయి.  దీనితో కాలనీ వాసులకు భద్రత కరువయ్యింది.  ఈ కాలనీలో పలువురు వి ఐ పి లు నివసిస్తున్నప్పటికి పోలీసులు సరిగ్గా  గస్తీ లు నిర్వహించడం లేదని పలువురు కాలనీ వాసులు వాపోతున్నారు. శాసన సభ్యులు కంచర్ల కూడా ఈ  కాలనీలోని నివాసం ఉంటారు.  పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు ఆఫీస్, బీజేపీ రాష్ట్ర నాయకులు, మునిసిపల్ కమీషనర్ రమణాచారి, పోలీసులు అధికారులు, వి ఐ పి లు ఎందరో నివాసం ఉన్న ఈ కాలానికి దొంగల భయం పట్టుకుంది.  పోలీసులు గస్తీ పెంచి కాలనీ ప్రజలకు భరోసా కల్పించాలని వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు నూకల జయపాల్ రెడ్డి  డిమాండ్ చేశారు.

గూఢచారి ఎఫెక్టు తో సూర్యాపేట మిల్లుల పై యాక్షన్ ఫుల్ ! నల్గొండ లో యాక్షన్ నిల్? నల్గొండ అధికారుల పై రాజకీయ గ్రహణమా? లోపాయికారా ఒప్పందామా?

Image
  గూఢచారి ఎఫెక్టు తో సూర్యాపేట  మిల్లుల పై యాక్షన్ ఫుల్ ! నల్గొండ లో యాక్షన్ నిల్? నల్గొండ అధికారుల పై రాజకీయ గ్రహణమా? లోపాయికారా ఒప్పందామా? - ప్రముఖ హై కోర్టు  అడ్వకేటు  సోమవరపు సత్యనారాయణ  నల్గొండ : (గూఢచారి),  రైతుల దగ్గర మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని  మిల్లు ఆడించి బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి  రైస్ మిల్లర్ల కు పంపుతారు. నల్గొండ, జిల్లాల్లో  కొందరు మిల్లర్లు గత 4 సీజన్ల నుండి వచ్చిన ధాన్యాన్ని ఆడించి  బియ్యాన్ని  ప్రభుత్వానికి ఇవ్వకుండా దారి మళ్లించిన్నట్లు అక్రమాలకు పాలుపడుతున్నట్లు హై కోర్టు అడ్వాకేటు సోమవరపు సత్యనారాయణ చేసిన  ఆరోపణల పై  మరియు సూర్యాపేట జిల్లా మిల్లులపై వస్తున్న ఆరోపణలపై  గూఢచారి వార్తల ద్వారా  విషయాన్ని వెలుగులోకి తెచ్చింది, దీనితో పలు వార్త సంస్థలు కూడా దృష్టి సారించి  అక్రమాలను బహిర్గత పరిచాయి. https://www.gudachari.page/2022/11/10.html https://www.gudachari.page/2022/11/blog-post_71.html https://www.gudachari.page/2022/11/blog-post_51.html వార్తలు వచ్చిన  నేపథ్యంలో సూర్యాపేట  మిల్లుల పై యాక్షన్ ఫుల్  గా, నల్గొండ లో యాక్షన్ నిల్ గా ఉన్

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది - శాసనమండలి చైర్మన్ గుత్తా

Image
నల్గొండ : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్స్... తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది.... ఆర్ధిక వనరులను కట్టడి చేయాలనే దురాలోచన లో ఉంది.... ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే చర్య.... తెలంగాణ లో అధికారంలోకి రావడం కోసం బిజెపి ఎంతకైనా తేగించెలా ఉంది... కేంద్ర పరిధిలో ఉన్న అన్ని శాఖలతో ఇబ్బంది పెడుతోంది,వ్యక్తి గత కక్ష కు పాల్పడుతోంది... ఇప్పటికైనా కేంద్ర వైఖరి మారాలి.. తెలంగాణ కు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే....అభివృద్ధి చేసి చూపించాలి,ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలి.

Bhupathi Times Telugu Daily, 25th Nov. 2022

 

కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాల్సిందే - బండి సంజయ్

Image
  కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాల్సిందే - ఎఫ్ఆర్ఓ హత్యకు బాధ్యుడు ముఖ్యమంత్రే - పోడు భూములకు పట్టాలిస్తానంటూ... దాడులు చేయించడంవల్లే ఈ దుస్థితి - అసెంబ్లీ సాక్షిగా కుర్చీ వేసుకుని పోడు పట్టాలిస్తానన్న సీఎం హామీ ఏమైంది? - సీఎం కుట్రలకు అధికారులను, అమయాక ప్రజలను బలి చేస్తారా? - అవినీతి తిమంగలాలపై ఐటీ, ఈడీ దాడులు చేస్తే అడ్డుకుంటారా? - ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులను వదిలేయాలా? - స్వయం ప్రతిపత్తిగల సంస్థలపై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటు - బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కస్తానని, కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలిస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈరోజు వేములవాడలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారి హత్య, మంత్రి మల్లారె

ఐటీ రైడ్స్ లో సీజ్ చేసిన అమౌంట్

Image
ఐటీ రైడ్స్ లో సీజ్  చేసిన అమౌంట్  Seized amount total : (Approx) ₹10.74 Cr Mallareddy residence :  Mahender reddy residence : 12 lakhs Badra reddy residence : 6lakhs Rajashekar reddy residence : ₹3 cr Sudheer reddy residence : ₹2.50 cr Raghunandan Residence : ₹2 cr Praveen reddy residence : ₹1 cr Trishul reddy residence : ₹2 cr తెలంగాణ మంత్రి మల్లారెడ్డి  ఇంటిలో ఐటీ సోదాలు  ముగిశాయి. రెండు రోజుల పాటూ 65 ఐటీ టీమ్‌లు.. 400మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ సోదాల్లో రూ.10కోట్ల 50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సోదాలు ముగిసిన తర్వాత సోమవారం ఐటీ విచారణకు రావాలని మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తనిఖీల తర్వాత ఐటీ అధికారులు పంచనామాపై సంతకాలు తీసుకునేందుకు మూడు గంటల పాటూ అక్కడే ఉన్నారని సమాచారం. చివరికి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సంతకాలు తీసుకున్నారు. ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లిన కుమారుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తన

BHUPATHI TIMES TELUGU DAILY, 24th, Nov. 2022

Image
 

ఏసీబీ వలలో మున్సిపల్ కమీషనర్ మరియు మేనేజర్

Image
 ఏసీబీ వలలో మున్సిపల్ కమీషనర్ మరియు మేనేజర్  సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కమీషనర్  సుభాష్ రావు దేశ్‌ముఖ్  మరియు  మేనేజర్  మనోహర్ లు బుధవారం సాయంత్రం 4.30 లకు    బాధితుడు నిసరుద్దీన్ నుండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాకేష్ ద్వారా 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డారు.  Md. నిసరుద్దీన్   కొనుగోలు చేసిన ఇంటి ని    మ్యుటేషన్ చేసి మ్యూనిసిపల్ రికార్డు లో ఆయన పేరు ను  మార్పుచేయడానికి 2 లక్షలు డిమాండ్ చేసి  తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.  మున్సిపల్ కమీషనర్  సుభాష్ రావు దేశ్‌ముఖ్ ,  మేనేజర్  మనోహర్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాకేష్ లను అరెస్టు చేసి ఏసిబి కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టి కేసును విచారణ చేస్తున్న అధికారులు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు.

*సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారిని దుర్బాష లాడి, బెదిరించిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి: ఉద్యోగ జె. ఏ.సి.డిమాండ్*.

Image
 *సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారిని దుర్బాష లాడి, బెదిరించిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి: ఉద్యోగ జె. ఏ.సి.డిమాండ్*.                 నల్గొండ,(గూఢచారి) నవంబర్ 23. సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి.యం.శ్రీనివాసులు ను మంగళ వారం  దుర్భాష లాడి,దూషించిన  భాష పాక హరికృష్ణ వైఖరిని ఉద్యోగ జె. ఏ. సి.నాయకులు తీవ్రంగా ఖండించారు.మంగళవారం విధి నిర్వహణ లో ఉన్న సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి. ని కలెక్టర్ కార్యాలయం లో అధికారి ఛాంబర్ లో వివాద స్పద భూమిని తనకు అనుకూలంగా సర్వే చేయమని ఒత్తిడి చేస్తూ పెట్రోల్ బోసి తగల బెడతా అంటూ పరుష,అసభ్య పదజాలం తో దూషించి అవమాన పరిచి భయందోలనకు గురి చేసిన సంఘటన ను  టి.జి. ఓ.,టి.ఎన్.జి. ఓ ఉద్యోగ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం సంక్షేమ భవన్ లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయం లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టి.జి. ఓ) అధ్యక్షులు ముజీ బుద్దిన్  అధ్యక్షతన సమావేశం జరిపి ఈ సంఘటన కు కారణమైన హరికృష్ణ అనే వ్యక్తి పై చర్య తీసుకోవాలని,సంఘటనని అందరూ ముక్తంఠంతో ఖండించారు.అదే విధంగా నిన్న భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో అటవీ రేంజ్ అధికారి శ్ర

నల్గొండ మున్సిపాలిటీలో ఘరనా మోసం...

Image
నల్గొండ మున్సిపాలిటీలో ఘరనా మోసం... చనిపోయినవారి పేరుతో నెల నెలా పెన్షన్ తీసుకుంటున్న మోసగాడు ఇన్నాళ్లు అధికారులను బురిడీ కొట్టిస్తూ...మోసానికి పాల్పడుతున్న నాగరాజు అనే వ్యక్తి.... సుమారు 35 మంది చనిపోయిన వారి పేరుతో ప్రతి నెల పెన్షన్ డ్రా చేసుకున్న నిందితుడు... నాగరాజుకు పోస్టాఫీసు, కొందరు మున్సిపల్ సిబ్బంది సహకరించినట్లు ఆరోపణలు... మోసాన్ని పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమీషనర్ రమణాచారి.... నిందితుడిని‌ అదుపులోకి‌ తీసుకుని విచారిస్తున్న టూటౌన్ పోలీసులు... భారీగా పెన్షన్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

BHUPATHI TIMES TELUGU DAILY 23rd Nov. 2022

Image
 

ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి కి సంతాపం తెలిపిన ప్రముఖ వ్యాపారవేత్త చకిలం రమణయ్య

Image
  ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి కి సంతాపం తెలిపిన ప్రముఖ వ్యాపారవేత్త చకిలం రమణయ్య ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు పై గుత్తి కోయల దాడి తో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందడం పై విచారం వ్యక్తం చేశారు  ప్రముఖ టింబర్ వ్యాపార వేత్త చకిలం రమణయ్య. శ్రీనివాసరావు కుటుంబానికి  ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, ఆయనకు  ఆత్మకు శాంతి చేకూర్చాలని  ఆ భగవంతున్ని ప్రార్ధించారు.

ఈనెల 28 నుండి బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర షురూ...

Image
 ఈనెల 28 నుండి బండి సంజయ్  5వ విడత పాదయాత్ర షురూ... • బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైంసా నుండి పాదయాత్ర ప్రారంభించనున్న బండి సంజయ్ • కరీంనగర్ లో ముగింపు సభ • డిసెంబర్ 15 లేదా 16 వరకు కొనసాగనున్న 5వ విడత పాదయాత్ర  • 5వ విడత పాదయాత్ర వివరాలను ప్రకటించిన ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టి.వీరేందర్ గౌడ్ • కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు 4 విడతలు పాదయాత్ర చేసి 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మొత్తం 21 జిల్లాల్లో 1178 కి.మీల మేర నడిచినట్లు వెల్లడి.   • పాదయాత్రతో అనేక మార్పులు సంభవించాయని, తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేననే సంకేతాలు వెలువడ్డాయని పేర్కొన్న వీరేందర్ గౌడ్.

షాకింగ్ స్థాయిలో మల్లారెడ్డి ఆస్తులు

Image
షాకింగ్ స్థాయిలో మల్లారెడ్డి ఆస్తులు హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై నేడు ఐటీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని పలుప్రాంతాలలో అధికారులు పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించినట్లు సమాచారం.. యూనివర్శిటీతో కలిపి 38 ఇంజనీరింగ్ కాలేజీలు మల్లారెడ్డికి ఉన్నాయి. మెడికల్ కాలేజీలు రెండు నారాయణ హృదయాలయ, మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు.. మొత్తం 6కు పైగా పాఠశాలలు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు, దేవరాంజల్, షామీర్ పేట్, జవహర్ నగర్‌, మేడ్చల్, ఘట్కేసర్, కీసరలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.  

*ముత్యపుపందిరిపై బకాసుర వధ అలంకారంలో అల‌మేలుమంగ‌*

Image
 *ముత్యపుపందిరిపై బకాసుర వధ అలంకారంలో  అల‌మేలుమంగ‌* *తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో మూడో రోజైన మంగళవారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు  ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు.* *తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని విశ్వాసం. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్త

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్

Image
  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్.. నోటీసులు జారీ చేసిన ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీ. బి ఎల్ సంతోష్, తుషార్, జగ్గుసాములపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సీట్ నిన్న ముగ్గురు విచారణకు హాజరు కాకపోవడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ. నిన్ననే అడ్వకేట్ శ్రీనివాస్ని విచారించిన సిట్. ఇవాళ మరోమారు సిట్ ఎదుట హాజరుగానున్న శ్రీనివాస్.

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై IT దాడులు

Image
  మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై IT దాడులు హైదరాబాద్:- నగరంలోని పలు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ దాడులు చేపట్టింది.  తెల్లవారుజాము నుంచే అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు.  తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు.  కొంపల్లిలోని పాం మెడోస్‌ విల్లాలోనూ సోదాలు చేపట్టారు.  దాదాపు 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై అనేక ఆరోపణలు..  కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేటు వ్యక్తులకు కోట్లకు అమ్ముకున్న మల్లారెడ్డి కాలేజ్ ?.. మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ల బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్న ఐటీ.. మెడికల్ కాలేజ్ లావాదేవీల్లో భారీ వ్యత్యాసాలు.. ఎట్టకేలకు మంత్రి మల్లారెడ్డి  సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న ఐటీ..తన నివాసం పక్క క్వార్టర్స్ లో  జూట్ బ్యాగ్ లో పెట్టి దాచిన సిబ్బంది..జూట్ బ్యాగ్ లో ఉన్న సెల్ ఫోన్ స్వాధీనం