Posts

Showing posts from February, 2024

CDPO అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్‌!

Image
డైరెక్టర్ ఆఫ్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ హైదరాబాద్ కార్యాలయం లో CDPO పనిచేస్తున్న అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్‌!  ఆదిలాబాద్‌ జిల్లా జైనూర్‌లో ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ సీడీపీవోగా పనిచేస్తున్న టైమ్‌లో నిధుల గోల్‌మాల్‌ చేసినట్లు గుర్తింపు.! ట్రైబల్‌ పిల్లలకు డిస్ట్రిబ్యూట్‌ చేసే ఆరోగ్యలక్ష్మి మిల్క్‌ స్కీమ్‌లో 65 లక్షల 78 వేలు  అవకతవకలు గుర్తించిన ACB

ఘనంగా శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు

Image
ఘనంగా శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నల్గొండ జిల్లా కేంద్రాల 285  శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను క్లాక్ టవర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి asp నాయక్ మరియు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అభగోని రమేష్ గౌడ్ రావడం జరిగింది ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ కొండ జిల్లాలో బంజారా భవన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సేవాలాల్ ఆసియా సాధన కోసం కృషి చేయాలని విద్యతోనే రాజ్యాధికారం సాధించవచ్చని తెలియజేశారు కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్డిఓ ప్రవీణ్ నాయక్ నల్గొండ ఎమ్మార్వో ఆర్డీవో డిటిడబ్ల్యూ రాజకుమార్ కౌన్సిలర్ ప్రదీప్ డాక్టర్ మాతృ రవి నాయక్ వెంకటేష్ నాయక్ త్రిక చైర్మన్ బిక్కు కమిషన్ నెంబర్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ రాజ్యాధికార సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గపు సతీష్ ఇమ్రాన్ భగవాన్ నాయక్ చందులాల్ సురేందర్ నాయక్ మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు  

ఇంటి దగ్గర నుండే PVC ఆధార్ కార్డు ఎలా పొందాలి?

Image
  ఇంటి దగ్గర నుండే PVC ఆధార్ కార్డు ఎలా పొందాలి?  ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇటువంటి మీ ఆధార్ కార్డ్ పోయినా లేదా పాడైనా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణాలో మహాలక్ష్మి పథకం లో మహిళలు rtc బస్ లో ఉచితంగా ప్రయానించాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆధార్ పీవీసీ కార్డ్ని ఆర్డర్ చేయవచ్చు. కేవలం రూ.50 రుసుము చెల్లించి యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కార్డ్ని ఆర్డర్ చేయవచ్చు. PVC Card పై ఆధార్ కార్డ్ సమాచారంతా ముద్రిస్తారు. యూఐడీఏఐ ప్రకారం.. ఈ కార్డ్ సురక్షిత క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, జారీ చేసిన తేదీ, కార్డ్ ప్రింటింగ్ తేదీ తదితర సమాచారాన్ని కలిగి ఉంటుంది.  పీవీసీ కార్డ్న ఆర్డర్ ఇలా ఆర్డర్ చేసి పొందండి  *యూఐడీఏఐ వెబ్ సైట్ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. https://uidai.gov.in/ *యూఐడీఏఐ వెబ్సైట్, మీ 12 అంకెల ఆధార్ నంబర్ను నమోదు చేయండి *తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చాను ఎంటర్ చేయండి *ఓటీపీ కోసం Send OTP’పై క్లిక్ చేయండి. *తర్వాత రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట

విజ్ఞాన భారతీ ఆధ్వర్యంలో చాయసమేశ్వరాలయం వద్ద వర్క్ షాప్

Image
 విజ్ఞాన భారతీ ఆధ్వర్యంలో చాయసమేశ్వరాలయం వద్ద వర్క్ షాప్ నల్గొండ ఫిబ్రవరి 27(గూడచారి) నల్లగొండ నగరంలోని స్థానిక పానగల్లో గల ఛాయా సోమేశ్వరాలయం వద్ద మంగళవారం విజ్ఞాన భారతి ఎన్జీవో (NGO) ఆధ్వర్యంలో ఆప్టిక్స్ పై వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డి.ఆర్.డి.ఓ (DRDO) శాస్త్రవేత్తలు G.N.రావు , శ్రీ లక్ష్మీ,G.L.N మూర్తి హాజరై విద్యార్థులకు ఛాయా సోమేశ్వర ఆలయంలో శివలింగంపై ఛాయా ఏ విధంగా పడుతుంది,అలా ఎందుకు జరుగుతుందనే కోణంలో ప్రయోగాత్మకంగా వివరించి విద్యార్థుల చేత అనేక ప్రయోగాలు చేయించడం జరిగింది.అలాగే వారు మాట్లాడుతూ భారతీయ జీవిత విధానం ప్రతిదీ సైన్స్ తో ముడిపడిందని,ప్రతి గుడిలో సైన్స్ ఉందని వారు అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నల్లగొండ డీఈవో (DEO) బిక్షపతి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని సైన్స్ లో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలయ్యి దేశానికి సేవ చేయాలని ఆలోచనత్మకంగా మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్.పి.ఆర్ విద్యాసంస్థల చైర్మన్ నన్నూరి రాంరెడ్డి, ఎం వి ఆర్ విద్యాసంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్ , న్యూస్ విద్యాసంస్థల చైర్మన్ గంట్ల అనంత

PDS బియ్యం అక్రమ నిల్వ మరియు రవాణా చేస్తున్న నలుగురు నిందితుల అరెస్ట్ - జిల్లా యస్.పి చందనా దీప్తి IPS

Image
 *నకిరేకల్,తిప్పర్తి పోలీస్ స్టేషన్ ల పరిధిలో 35 క్వింటాళ్ల PDS బియ్యం అక్రమ నిల్వ మరియు రవాణా చేస్తున్న నలుగురు నిందితుల అరెస్ట్*  నల్గొండ:   *జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలతో అక్రమార్కుల ఆట కట్టిస్తున్న జిల్లా పోలీస్* ..  *--- అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు జిల్లా యస్.పి చందనా దీప్తి IPS*    ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ గారు ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.    ఈ రోజు జిల్లా యస్.పి గారి ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారం మేరకు నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ టీం నకేరేకల్ మరియు తిప్పర్థి పోలీస్ స్టేషన్ ల సిబ్బంది సమన్వయంతో తాటికల్ గ్రామంలో గల సురారపు పిచ్చయ్య తండ్రి లచ్చయ్య ఇంట్లో అక్రమ నిల్వ ఉంచిన 22 బస్తాలలొ 10 కింటాల్ పిడిఎస్ బియ్యం మరియు తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మామిడాల స్టేజ్ వద్ద నుండి బోలోరో వెహికిల్ ద్వార అక్రమ రవాణా చేస్తున్న మొగిలి ఉపేందర్ తండ్రి మైసయ్య,మొగిలి నాగరాజు తండ్రి

విజయ సంకల్పయాత్ర ను జయప్రదం చేయండి - జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల

Image
 విజయ సంకల్పయాత్ర ను జయప్రదం చేయండి - జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల నల్గొండ:  కలిసి కదులుదాం... మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ని గెలిపిద్దాం అనే లక్ష్యంతో తెలంగాణ బిజెపి చేపట్టిన విజయ సంకల్పయాత్ర కృష్ణమ్మ క్లస్టర్ క నల్గొండ జిల్లాలో ఈ నెల 28 నుండి ప్రారంభం కానున్నదని నల్గొండ జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజ శేఖర్ రెడ్డి తెలిపారు.ఈ యాత్రను జయప్రదం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

అమృత్ భారత్ స్టేషన్ గా నల్లగొండ రైల్వే స్టేషన్

Image
 అమృత్ భారత్ స్టేషన్ గా నల్లగొండ రైల్వే స్టేషన్ నల్లగొండ రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ లో బాగంగా అభివృధి పనులను  ఈ నెల 26న ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదములు తెలిపిన నల్లగొండ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్శిత్ రెడ్డి,

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కే శ్రీనివాస్ రెడ్డి

Image
  తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా   కే శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ   జీవో  నంబర్ 300 ను ఆదివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చైర్మన్ పదవి కాలం  2 సంవత్సారాలు ఉంటుందని ఆ జీఓ లో పేర్కొన్నారు.  తదనుగుణంగా తదుపరి చర్య లు తీసుకోవాలని  సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ను  ఆదేశించారు.

మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

Image
 *మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు* నల్లగొండ పట్టణం పాత బస్తి హనుమాన్ నగర్ లో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈరోజు మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో పట్టణంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.. ఈ కార్యక్రమంలో అర్షకులు వెంకటేశ్వర శర్మ, కార్యక్రమం, నిర్వాహకులు తోగోటి రమేష్ చారి, మరియు దేవాలయం అధ్యక్షులు బైరగోని రాజయ్య మరియు దేవాలయ కమిటీ సభ్యులు ఊట్కూరి శ్రీనివాస్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోండి - ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Image
  యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోండి - ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  @పెరుగుతున్న అంచనాలతో ఖజానా పై అదనపు భారం ఆందోళనకరం @ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి @ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వ పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం @ పాత ప్రభుత్వం పద్ధతులు, ఆలోచనలు మానుకోండి @ యాదాద్రి ధర్మల్ పవర్ సంపద రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడాలి @ నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోము యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ----------------- యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకు ముందుగా థర్మల్ పవర్ స్టేషన్లో స్థానికుల నుం

వికలాంగుల పెళ్లికి అండగా ఉప్పల

Image
  *వికలాంగుల పెళ్లికి అండగా ఉప్పల* *ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళసూత్రం,మెట్టెలు,చీర, గాజులు విరాళంగా అందజేత.* సంగారెడ్డి కి చెందిన తండ్రి లేని, నిరు పేద వికలాంగురాలు, *ప్రవళిక వివాహం కోసం..*ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో..* తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ *శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త మరియు వారి సతీమణి ఉప్పల ఫౌండేషన్ కో చైర్ పర్సన్ ఉప్పల స్వప్న గార్ల చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు విరాళంగా ఇవ్వడం జరిగింది.*  *ఈ కార్యక్రమంలో..* పెళ్లి కూతురు వారి కుటుంబ సభ్యులు, మరియు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్, అమ్మ ఫౌండేషన్ అధినేత నాగమళ్ల అనిల్ కుమార్ అరుణ,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు శివ కృష్ణ,తుల్జమ్మ, చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.

WAM మరియు ఆకృతి ఆధ్వర్యంలో పద్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు చే స్వీయ పరివర్తనతో విశ్వ పరివర్తన ప్రవచనం - కౌటికె విఠల్

Image
 WAM మరియు ఆకృతి ఆధ్వర్యంలో పద్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు చే స్వీయ పరివర్తనతో విశ్వ పరివర్తన ప్రవచనం - కౌటికె విఠల్ హైదరాబాద్: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభతెలంగాణ రాష్ట్ర విభాగం మరియు ఆకృతి ఆధ్వర్యంలో * వైవిధ్యం * వైశిష్ట్యం మహా సహస్రావధాని పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. గరికిపాటి నరసింహారావు చే స్వీయ పరివర్తనతో విశ్వ పరివర్తన ప్రవచన ప్రభంజనం నిర్వహిస్తున్నారు. భక్తులు అందరికీ ఇదే మా సాదర ఆహ్వానమని ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ తెలిపారు.  కార్యక్రమం శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్ కాలనీ లో సమయం: 25 ఫిబ్రవరి 2024, ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని వారు తెలిపారు.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్ సైట్ లో కాలం చెల్లిన సమాచారం - RTI అమలు లో విఫలం

Image
  పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్ సైట్ లో  https://tspcb.cgg.gov.in/Pages/RTI.aspx కాలం చెల్లిన సమాచారం -  RTI అమలు లో విఫలం RTI Act 2005 ప్రకారం ప్రతి సంవత్సరం సెక్షన్ 4 (1) బి అనెక్సర్స్ నవీనకరించి ప్రకటించాలి. వెబ్సైట్ లో పెట్టాలి. నోటీస్ బోర్డ్ లో అందరికి అందుబాటులో ఉంచాలి. దాని కి విరుద్ధంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్ సైట్ RTI డాక్యుమెంట్స్ లో కాలం చెల్లిన సమాచారాన్నే ఉంచారు.  RTI సెక్షన్ 4 (1) బి ప్రకారంగా ఉంచిన డాక్యుమెంట్స్ లో అ నెక్సర్ 2 లోని స్టాఫ్ వివరాల్లో మెంబర్ సెక్రటరీ గా ఇంకా నీతు కుమారి ప్రసాద్ ఉన్నట్లు తెలుపుతుంది.  ఈ అధికారి ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయ్యి  కృష్ణ ఆదిత్య వచ్చారు. వారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు మెంబర్ సెక్రటరీగా  జ్యోతి బుద్ధ ప్రకాష్ ఉన్నారు. ప్రధాన కార్యాలయపు అధికారుల పని విభజన (Work Allocation) వివరాల్లో కూడా ఎప్పుడో పదవి విరమణ పొందిన చీఫ్ ఎనివిరొన్మెంటల్ ఇంజనీర్  గా విశ్వనాధం పేరే ఉంది. సమాచార హక్కు చట్టం 2005 లో సెక్షన్ 4 (1) బి ని  ప్రతి సంవత్సరం నవీనకరించి వెబ్సైట్ లో నోటీస్ బోర్డులో పెట్టాలని నిబంధన ఉన్నా సమాచార అ

WAM మరియు ఆకృతి ఆధ్వర్యంలో పద్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు చే స్వీయ పరివర్తనతో విశ్వ పరివర్తన ప్రవచనం

Image
  WAM మరియు ఆకృతి ఆధ్వర్యంలో పద్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు చే స్వీయ పరివర్తనతో విశ్వ పరివర్తన ప్రవచనం - కౌటికె విఠల్ హైదరాబాద్: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభతెలంగాణ రాష్ట్ర విభాగం మరియు ఆకృతి ఆధ్వర్యంలో * వైవిధ్యం * వైశిష్ట్యం మహా సహస్రావధాని పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. గరికిపాటి నరసింహారావు చే స్వీయ పరివర్తనతో విశ్వ పరివర్తన ప్రవచన ప్రభంజనం నిర్వహిస్తున్నారు. భక్తులు అందరికీ ఇదే మా సాదర ఆహ్వానమని  ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ తెలిపారు.  కార్యక్రమం శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్ కాలనీ లో సమయం: 25 ఫిబ్రవరి 2024, ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని వారు తెలిపారు.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ మల్లు రవి గారికి ఇవ్వాలి - తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన సంఘాల డిమాండ్.

Image
  నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ మల్లు రవి గారికి ఇవ్వాలి - తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన సంఘాల డిమాండ్.. గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణా రాష్ట్ర ప్రజల, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల సమస్యలను, తనదైన శైలిలో పరిష్కారిస్తూ, దళిత , బడుగు ,బలహీన వర్గాల కు బాసటగా నిలిచి నిరంతరం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మల్లు రవి కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బే షరతుగా పార్లమెంట్ అభ్యర్థి గా వెంటనే ప్రకటించాలని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు , ప్రజాస్వామ్య వాదులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన సంఘాల నాయకులు అన్నారు. నాలుగు దశాబ్దాలుగా మల్లు స్వర్గీయ మల్లు అనంతరాములు , సోదరునిగా మల్లు ఆశయాలకు అనుగుణంగా, డాక్టర్ బాబా సాహెబ్ చూపిన మార్గంలో ప్రజలతో మమేకమై నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న మల్లు రవి ని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, నాగర్ కర్నూలు ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లు రవి గారిని పార్లమెంట్ అభ్యర్థి గా వెంటనే బే షరతుగా ప్రకటించాలని తెలంగా

పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలి - స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

Image
 నల్గొండ;            ఈ నెల 28 నుంచి మార్చి 19వ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు, అలాగే  మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు  తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు.            గురువారం  జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.      ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జిల్లాలో 50 పరీక్షా కేంద్రాల్లో 32,895 మంది జనరల్, వొకేషనల్ విద్యార్థులు, 10వ తరగతికి సంబంధించి 473 పరీక్షా కేంద్రాల్లో 19,715 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. అధికారులకు కేటాయించిన విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను, పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలనీ అందుకు రెవెన్యూ అధికారులను ఆదేశించారు.  పరీక్షా కేంద్రాల వద్ద పరిశుభ్రతతో పాటు, తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ కమీషనర్లు, గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు.  

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పై ప్రజాభిప్రాయ సేకరణ

Image
  యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పై ప్రజాభిప్రాయ సేకరణ  నల్గొండ : యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (YTPS) నిర్మాణంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ హారిచందన దాసరి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.        నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న (5x800) మెగావాట్ల సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (YTPS) నిర్మాణాన్ని తెలంగాణ జెన్‌కో చేపట్టింది. ఈ నిర్మాణంలో భాగంగా పర్యావరణంపై అధికారులు, ప్రజల సమక్షంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించగా, 48 మంది తమ అభిప్రాయాలను నేరుగా వెల్లడించగా,ఇదే అంశంపై 22 మంది తమ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా అందజేశారు. 35 ధరకాస్తులు ఆన్లైన్, ఈ మెయిల్స్ ద్వారా వచ్చినట్లు అధికారులు వివరించారు.           ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు సందర్బంగా పర్యావరణంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని, ప్రజల నుండి విజ్ఞాపనలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదికను పంపిస్తామని చెప్పారు.     

అన్ని పథకాల యూనిట్ల గ్రౌండింగ్ ను మార్చి నాటికి పూర్తి చేయాలి - అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.

Image
  అన్ని పథకాల యూనిట్ల గ్రౌండింగ్ ను మార్చి నాటికి పూర్తి        చేయాలి -  అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్. నల్గొండ: ఫిబ్రవరి 20,          బ్యాంకుల అనుసంధానంతో అమలు చేస్తున్న అన్ని పథకాల యూనిట్ల గ్రౌండింగ్ ను మార్చి నాటికి పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు.        మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ లు ప్రతినెల ప్రభుత్వ శాఖల సహకారంతో కనీసం ఒక ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు.    సామాజిక భద్రత పథకాల అమలలో  ఇంకా  పురోగతి తీసుకురావాలన్నారు.  బ్యాంకుల అనుసంధానంతో అమలు చేసి అన్ని ప్రభుత్వ పథకాల యూనిట్లు మార్చినాటికి గ్రౌండ్ చేయాలని అన్నారు. ప్రాధాన్యత రంగం కింద విద్యా రుణాలను ఇంకా పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా 2024- 25 సంవత్సరాలకు సంబంధించి 12,835.58 కోట్ల రూపాయలతో రూపొందించిన వనరుల ఆధారిత రుణ  ప్రణాళికను విడుదల చేశారు.           2023 సంవత్సరం  డిసెంబర్ త్రైమాసికానికి నిర్దేశించిన లక్ష్యాలను  సాధించినట్లు బ్య

ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతీ అరెస్ట్.

Image
ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతీ అరెస్ట్.  జ్యోతి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు బంగారు ఆభరణాలు స్వాధీనం. 84 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి. జ్యోతి ఇంటిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ..   జ్యోతి ఇంటిలో ఎక్కడపడితే అక్కడ నగదు స్వాధీనం .. ఇంటిలో 65 లక్షల రూపాయల నగదు స్వాధీనం పరుచుకున్న ఎసిబి..  నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీన పరుచుకున్న ఏసీబీ.. 84 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జ్యోతి.. జ్యోతిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు..  మరికాసేపట్లో జ్యోతి నీ కోర్టులో హాజరు పరుచనున్న ఏసీబీ అధికారులు.!

నల్గొండలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

Image
  *నల్గొండలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు* *తిరుమల తిరుపతి ధర్మ ప్రచార పరిషత్* ఆధ్వర్యంలో నల్గొండ పాతబస్తీ హనుమాన్ నగర్ లోనీ 18 అడుగుల అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఈ శనివారం 24వ తేదీ న ఉదయం 10 గంటలకు  *సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు* నిర్వహించడం జరుగుతుంది.. ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ తప్పకుండా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదంలు స్వీకరించి, స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ పాతబస్తీ హనుమాన్ నగర్ నల్లగొండ వారు   కోరారు. వ్రతానికి సంబంధించిన వ్రతం పిట మరియు వ్రతం దగ్గర కావలసినటువంటి పూజా సామాగ్రి అందరికీ ప్రసాదం మరియు తిరుపతికి సంబంధించిన కంకణాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరుగుతుందనీ పూజలో పాల్గొనే దంపతులు తీసుకురావాల్సిన పూజ సామాగ్రి1)పసుపు 2) కుంకుమ 3) కొబ్బరికాయ, అగరబత్తులు, కొన్ని విడి పూలు..4) మంగళ హారతి తెచ్చుకోవాలని తెలిపారు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొనేవారు ముందుగా సమాచారం ఇవాలని, పూర్తి వివరాల కొరకు 8985508263,95

84000 లంచం తో గిరిజన సంక్షేమ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి జగత్ జ్యోతి

Image
  84000 లంచం తో గిరిజన సంక్షేమ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీమతి జగత్ జ్యోతి

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

Image
  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

మనసురాబాద్ వాసవి క్లబ్ అధ్యక్షులుగా మొరిశెట్టి సంతోష్

Image
   మనసురాబాద్  వాసవి క్లబ్ అధ్యక్షులుగా మొరిశెట్టి సంతోష్ కుమార్ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమ శ్రీనివాసరావుని జనరల్ సెక్రటరీగా మరియు సరబ్ అంజిబాబుని ట్రెజరీగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులు విఎన్ గోల్డెన్ కే సి జి ఎఫ్ శ్రేయోభిలాషి అల్లడి పరమేశ్వరరావు వైస్ గవర్నర్ విఎన్ గుడ్డేటి నరసింహులు రీజియన్ చైర్మన్ మరియు విఎన్ శ్యాంసుందర్ రీజియన్ సెక్రటరీ మరియు విఎన్ శివ నాగేశ్వరరావు జోన్ చైర్మన్ మరియు సాయి మోహన్ ఎన్నుకోవడం జరిగింది.   ఈ   కార్యక్రమానికి హాజరైనటువంటి వైశ్యులు పోలేపల్లి బద్రీనాథ్ విశ్వనాథ్ జనార్దన్ దామెర సత్యనారాయణ బండారు అశోక్ రంగా శ్రీధర్ రంగా నరేందర్ అనిల్ వెంపటి గోపి గార్లపాటి రమేష్,  పోలా నరసింహ గుప్తా, నాంపల్లి రమణ తదితరులు పాల్గొనడం జరిగింది.

నల్గొండ ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ ట్రాప్..

Image
 నల్గొండ : బ్రేకింగ్.. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.... నల్గొండ ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ ట్రాప్.. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుంచి రూ 3 లక్షలు తీసుకుంటుండగా ఎసిబికి దొరికిన లచ్చూ నాయక్... లచ్చు నాయక్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు... లచ్చు నాయక్ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు...

సేవాలాల్ 285వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ

Image
  సేవాలాల్ 285వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ నందు సంత్ సేవాలాల్ 285వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ ప్రభుత్వ హాస్పిటల్ నందు పేదలకు వృద్ధులకు మరియు బాలింతలకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సదర్భంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ సంతు సేవాలాల్ గిరిజనుల ఆరాధ్య దైవం ఆయన గిరిజనుల కోసమై పెద్ద ఎత్తున వారికోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో నిన్న వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషిచేసిన మహనీయులు సంతు సేవాలాల్ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాస్పిటల్ సూపర్డెంట్ లచ్చు నాయక్ మరియు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి తెలంగాణ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ చిత్రం శ్రీను విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అలంపల్లి కొండల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వంగాల బిక్షమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ నవీన్ సుధీర్ తదితరుల

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు..

Image
  *బిగ్ బ్రేకింగ్* *భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు..* *11 ఏళ్ల అనంతరం తీర్పు వెళ్ళండించి యావజ్జీవశిక్ష విధించిన కోర్ట్* హైదరాబాద్ చిక్క డపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2013లో అచ్చయ్య నగర్ లో ఉండే భార్య రజినిని హత్య చేసిన భర్త జి. బాలకృష్ణ. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన బాలకృష్ణ. నిందితుడు బాలకృష్ణ కు జీవిత ఖైదు శిక్ష విధించిన నాంపల్లి మూడవ అడిషనల్ మెట్రోపాలిటెన్ సెషన్ కోర్ట్ జడ్జి.

నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి.రాములు నాయక్

Image
  నల్లగొండ జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన  బి.రాములు నాయక్  : జిల్లా పోలీస్ కార్యాలయం నల్లగొండ జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా బి.రాములు నాయక్  బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు అడిషనల్ ఎస్పీగా సంగారెడ్డి లొ పని చేస్తూ నల్లగొండ అడిషనల్ ఎస్పీ (పరిపాలన అధికారిగా)నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జిల్లాలో వివిధ స్థాయిలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉన్నందున జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పని చేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల మరియు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ గారిని జిల్లా పోలీస్ అధికారులు స్వాగతం పలికారు.

నామినేషన్ దాఖలు చేసిన మేడం విశ్వ ప్రసాద్

Image
 నామినేషన్ దాఖలు చేసిన మేడం విశ్వ ప్రసాద్  శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామ కోటి స్థూప దేవాలయము నల్లగొండ, ఆలయమునకు చైర్మన్ పదవికి ఆలయ ఎలక్షన్ అధికారులకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన ఆలయ ట్రస్టు సభ్యుడనైన మేడం విశ్వ ప్రసాద్ 

రాజేంద్ర నగర్ *అడిషనల్* *DCP* _గా పోలా విజయకుమార్

Image
 🌹శుభాకాంక్షలు 🌹 రాజేంద్ర నగర్ *అడిషనల్* *DCP* _గా బాధ్యతలు స్వీకరిస్తున్న అమరాబాద్_ వాస్తవ్యులు *ఆర్యవైశ్య* *ముద్దుబిడ్డ* శ్రీ *పోల విజయకుమార్*గారికి _ఇవే మా హృదయపూర్వక_ *శుభాభినందనలు🌹 భూపతి రాజు, జర్నలిస్టు

బిజెపి లో చేరిన రిటైర్డ్ ఇన్కమ్ అసిస్టెంట్ కమిషనర్ మోహన్ రాథోడ్

Image
  రిటైర్డ్ ఇన్కమ్ అసిస్టెంట్ కమిషనర్ మోహన్ రాథోడ్ కేంద్ర మంత్రి సమక్షం లో భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ సందర్భగా అయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మేడి మరియు రాష్ట్ర అద్యక్షులు మరియు కేంద్ర క్యాబినెట్ మంత్రివర్తులు శీ. జి. కిషన్ రెడ్డి చేయుచున్న అభివృద్ధి పనులు చూసి నేను భారతీయ జనత  పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిననీ, ప్రజాసేవచేయాలనే ఉద్దేశ్యంతో ప్రజలకు దగ్గరై వారి కష్ట సుఖాలకు నా వంతు కృషి చేసి అధిష్టానానికి, దృష్టికి తీసుకువెళ్ళి  ప్రజలకు మేలు చేస్తానని తెలిపారు. రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి పార్టీ లోకి ఆహ్వానించారనీ తెలిపారు. అయన మాట్లాడుతూ, మా మిత్రులూనీతి రాజేశ్వరరావు ప్రోత్సాహంతో పార్టీలోకి చేరానాని, పార్టీ నిబందనలకు భద్ధుడనై ఉంటానని తెలిపారు. పార్టీలో చేర్చుకున్నందుకు రాష్ట్ర అద్యక్షుల కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నా శక్తి మేరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

మార్కెట్ చైర్మన్ బలుస అరుణపై దాడికి నిరసనగా ధర్నా స్తంభించిన రాకపోకలు* *నింధితులను అరెస్ట్ చేసే వరకు పోరాటం ఆగదు*

Image
  * మార్కెట్ చైర్మన్ బలుస  అరుణపై దాడికి నిరసనగా  జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో  అంబేద్కర్ చౌరస్తా దగ్గర రాస్తారోకో ధర్నా  స్తంభించిన రాకపోకలు* *నింధితులను అరెస్ట్ చేసే వరకు పోరాటం ఆగదు* -----------------:-------------::---:-------::----::---:::---::---:: RDO కు వినతి పత్రం ఇస్తున్న మహిళలు.... అచ్చంపేట పట్టణంలో  నిన్న  మార్కేట్ యార్డ్ లో చైర్మన్ అరుణ పై జరిగిన దాడికి నిరసనగా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో స్థానిక వాసవీ మాత దేవాలయంలో సమావేశం నిర్వహించి అక్కడి నుండి  ర్యాలీగా ఆర్డీవో కార్యలయం దగ్గరకు  చేరుకొని ఆర్డీవో కి వినతి పత్రం ఇచ్చిన అనంతరం  అంబేద్కర్ కూడలి దగ్గర రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు అక్కడి నుండి పోలీస్ స్టేషన్ లో  ci కి వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత అక్కడి నుండి నేరుగా చైర్మన్ అరుణ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన తర్వాత  వాసవి మాత దేవాలయానికి చేరుకొని  మళ్ళీ సమావేశం నిర్వహించి తదుపరి కార్యచరణ పై చర్చించడం జరిగింది.

మార్కెట్ చైర్మన్ అరుణ గుప్త పై దాడి అమానుషం* ....తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య జర్నలిస్ట్ యూనియన్

Image
  *మార్కెట్ చైర్మన్ అరుణ గుప్త పై దాడి  అమానుషం* ....తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య జర్నలిస్ట్ యూనియన్  అచ్చంపేట మార్కెట్ చైర్మన్ అరుణ పై రైతులు దాడి చేయడం అమానుషమని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ మల్లేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బల్లు సతీష్,ఉపాధ్యక్షులు నరేంద్రుల అమర్ గుప్తా  తీవ్రంగా ఖండించారు. ఆర్య వైశ్యులు మార్కెట్ చైర్మన్ గా ఉండడాన్ని  కొందరు జీర్ణించుకోలేక ఇలాంటి అమానుష చర్యలకు పాలుపడుతున్నారని ఆరోపించారు.  ఒక మహిళ అని కూడా చూడకుండా ఈవిధంగా వ్యవహరించడం సభ్యసమాజం తలదించుకునే విధంగా చేసిన చర్యను కులాలకు అతీతంగా   సమాజంలో అన్ని కులాలకు చెందిన ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని అయన డిమాండ్ చేశారు. వైశ్యులకు కూడా రాజకీయాల్లో ఉండేందుకు హక్కు ఉందని అన్నారు. తుకాలలో మోసాల జరిగితే గీట్టు గిట్టుబాటు ధర లభించకపోతే చైర్మన్ కు సెక్రటరీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సమంజసం కాదని అన్నారు. ఆమెను కొట్టుకుంటూ తీసుకురావడం అమానుషమైన చర్యని అన్నారు. ఇప్పటివరకు ఎందరో అచ్చంపేట మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ లు చేసిన వార

ఉత్తమ జర్నలిస్ట్ గా బింగి స్వామి

Image
  ఉత్తమ జర్నలిస్ట్ గా బింగి స్వామి పినాకిని మీడియా  ఉత్తమ జర్నలిస్టు అవార్డులు హైదరాబాద్ రవీంద్రభారతిలో 8వ వార్షికోత్సవ వేడుకలకు సిద్దం ఇతర రంగాల వారికి సైతం అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైన పినాకినిమీడియా  ఉత్తమ జర్నలిస్టు అవార్డు ను రవీంద్రభారతి లో నేడు మంగళవారం ఫిబ్రవరి 6న అందించ నున్నట్లు *పినాకిని మీడియా చైర్మన్ వంశీకృష్ణ శాస్త్రి* మీడియా ప్రకటనలో తెలిపారు. గజ్వేల్  పట్టణానికి చెందిన  బింగి స్వామి జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి ఐ న్యూస్ సాక్షి హెచ్ఎంటీవీ భారత్ జయహో అనేక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల ద్వారా అనేక కథనాల ద్వారా తక్కువ సమయంలోనే గొప్ప పేరుగాంచి పేదల పక్షాన జర్నలిస్టులు పనిచేయాలని అది తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ద్వారానే సాధ్యమని నమ్మి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా సేవలు కొనసాగిస్తు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు సారధ్యంలో అనేక అక్రమాలపై పోరాటం చేస్తూ జర్నలిస్టుగా అక్రమాలను బయటకు తీస్తు జర్నలిస్టు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న  బింగి స్వామి పినాకిని ఎనిమిదవ వార

సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌గా ఎం హనుమంత రావు

Image
 హైదరాబాద్, ఫిబ్రవరి 5 సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌గా  ఎం హనుమంత రావు సోమవారం మాసాబ్ ట్యాంక్ సమాచార్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. అశోక్ రెడ్డిహార్టికల్చర్ డైరెక్టర్ గా బదిలీ పై వెళ్లడంతో ఆయన స్థానంలో కమిషనర్‌గా  ఎం హనుమంత రావు నియమితులయ్యారు.            పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కమిషనర్‌ ఆ శాఖ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ప్రచారం చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు అందుకు అణుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. సచివాలయంలో I&PR ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు.  కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎఫ్‌డీసీ కిషోర్‌బాబు, అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య కాంబ్లే, జాయింట్‌ డైరెక్టర్లు జగన్‌, వెంకట్‌ రమణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్‌, సీఐఈ రాధాకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా 32వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి

Image
 బ్రేకింగ్...... నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా 32వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక. ఆర్అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా ఎన్నుకున్న హాజరైన మెజారిటీ కౌన్సిలర్లు. గత నెల జనవరి 8న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయిన బీఆర్ఎస్.

శ్రీ రాముడు , రామాయణం పై అనుచితవ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావు ని వెంటనే అరెస్ట్ చేయాలని హిందూ సంస్థల ఆద్వర్యం లో నిరసన

Image
  శ్రీ రాముడు ,  రామాయణం పై అనుచితవ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావు ని వెంటనే అరెస్ట్ చేయాలని  హిందూ సంస్థల ఆద్వర్యం లో  నిరసన అయోధ్య లో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరిగిన సందర్భంగా విషం కక్కుతున్న హిందూ ద్వేషుల దుశ్చర్యలకు మరియు శ్రీ రాముడు ,  రామాయణం పై అనుచితవ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావు ని వెంటనే అరెస్ట్ చేయాలని హిందూ సంస్థల ఆద్వర్యం లో  ఈ కార్యక్రమం జరుగుతుందనీ నిర్వాహకులు తెలిపారు. స్థలం :-  తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద అంబేద్కర్ స్టాట్యు , ట్యాంక్ బండ్ , భాగ్యనగరం , ఆదివారం (4-02-2024) ఉదయం 11.00 గంటలకు.

అడవిలో చిరుత పులి మృత్యువాత

*అడవిలో చిరుత పులి మృత్యువాత*   *షాద్ నగర్ నియోజక వర్గం పరిధిలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామ అడవిలో ఘటన*   *సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు* రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగుడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల అటవీ క్షేత్రంలో చిరుత పులి అనుమానస్పద రీతిలో మృత్యు వాత పడింది. గత మూడు రోజుల క్రితమే చిరుత మృత్యువాత పడ్డట్టు ప్రాథమిక అంచనాగా అటవి అధికారులు గుర్తిస్తున్నారు. శనివారం ఉదయం అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. చిరుత పులి మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు.