Skip to main content

Posts

Showing posts from May, 2024

గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి - ఈటెల

 గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి - ఈటెల *ఇంత తక్కువ కాలంలో ప్రజల చేత ఛీ కోట్టించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ :* *కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఉంది:* *ప్రజలకు పాలన అందించే శక్తి, సత్తా బీజేపీ కి మాత్రమే ఉంది:* *ప్రజలు ఏ పార్టీ వైపు ఉండరు డైనమిక్ గా మారుతారు:* *గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి : మాజీ మంత్రి, / బీజేపీ చేరికలు కమిటీ చైర్మన్/ మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్.* నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తి ప్రేమేంధర్ రెడ్డి అన్నారు,ప్రజలకు న్యాయకత్వం వహించే వ్యక్తి ఈయన అన్నారు. 40 ఏండ్ల త్యాగానికి ఎన్ని వడుదొడుకులు వచ్చిన పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారు.34 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంచార్జి ని నియమించి పట్టభద్రులను దగ్గర అయ్యేలా చేస్తాం అన్నారు.ప్రజలకు పాలన అందించే సత్తా..శక్తి ఒక్క బీజేపీ కి మాత్రమే ఉంది,కేవలం ఒక్క ప్రాంతానికి పరిమితం అనుకున్నరు కానీ దేశం అంత బీజేపీ చాలా గట్టి పోట

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల Final Trunout

  తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల Final Trunout 65.67% నియోజవర్గము వారికి క్రింద లింక్ ను టచ్ చేసి చూడండి https://drive.google.com/file/d/1udYw-PfeYJ4BBv7iZujEuUYs1BbErAc5/view?usp=drivesdk

ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీచేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన

         పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచే అని శెట్టి దూప్పలపల్లి గోదాంలో ఈవీఎంల రిసెప్షన్ కేంద్రంలో   ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూదాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన ఆదేశించారు.         సోమవారం ఆమె  అనిశెట్టి దుప్పలపల్లిలోని పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేశారు.         కౌంటింగ్ కేంద్రాల ఆవరణ మొత్తం పూర్తిస్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేయాలని, పోలీస్ సెక్యూరిటీ కి అవసరమైన వసతి ,షామియానాలు ఏర్పాటు చేయాలని, వర్షం వచ్చిన ఇబ్బంది కాకుండా అవసరమైనన్ని టార్పాలిన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈవీఎంలను స్వీకరించే సందర్భంలో సిబ్బందికి, సెక్టోరల్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి భద్రపరిచే ఈవీఎంల స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఎన్నికల పరిశీలకులు వసతి ని పరిశీలించారు.          పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న తదితరులు ఉన్నారు ____________________________________  జారీ చేసిన వారు సహయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన

   @ అని శెట్టి దుప్పలపల్లి గోదాంలో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన        నల్గొండ పట్టణ సమీపంలోని  అని శెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకై ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దాసరి చందన ఆదివారం తనిఖీ చేశారు.       ఓట్ల లెక్కింపు కు ఏర్పాటు చేసే టేబుళ్లు ,బ్యారీకేడింగ్, ఏజెంట్లు బ్యారేడింగ్ ,భద్రత, తదితరాలను పరిశీలించారు .అంతేకాక ఓట్ల లెక్కింపుకు రెండు రోజుల ముందు నుండి కేంద్ర ఏన్నికల సంఘం పరి శీలకులు, రిటర్నింగ్ అధికారితో పాటు, సహాయ రిటర్నింగ్ అధికారులు అందరూ అక్కడే బస చేసేందుకు వసతి చూడాలని ఆదేశించారు.        జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి ,డిఆర్ డి ఏ నాగిరెడ్డి ,నల్గొండ ఆర్డీవో రవికుమార్,పంచాయతీ రాజ్ ఈ ఈ భూమన్న, తదితరులు ఉన్నారు ____________________________________  జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

మాజీ గవర్నర్ శ్రీమతి డా. తమిళిసాయి సౌందరరాజన్‌తో గెట్ టు గెదర్ లో పాల్గొన్న వామ్ నాయకులు

  మాజీ గవర్నర్ శ్రీమతి డా. తమిళిసాయి సౌందరరాజన్‌తో గెట్ టు గెదర్ లో పాల్గొన్న వామ్ నాయకులు హైదరాబాద్. హోటల్ మారియట్ లో  తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీమతి డా. తమిళిసాయి సౌందరరాజన్‌తో గెట్ టుగెదర్ అయిన వామ్ నాయకులు. వామ్‌ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ & తమిళనాడు బీజేపీ మీడియా సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు రంగనాయకులు పొన్నూరు నేతృత్వంలో ఈ  గెట్ టుగెదర్ జరిగింది. ఈ సమావేశం లో జాతీయ సలహాదారు కౌటికే విఠల్,  వూరబాబు రావు, గ్లోబల్ చైర్మన్,  సిటిజన్ ఫోరం,  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింగిరికొండ నరసింహ, తెలంగాణ కోశాధికారి కొత్త వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ ఫోరం కోశాధికారి రాఘవేందర్,  వామ్ నాయకులు సుంకు రమేష్,    మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి శ్రీ మధు  గెట్ టుగెదర్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ మాట్లాడుతూ సమీప ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని కోరారు.

టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్గా ‘ఉప్పల శ్రీనివాస్ గుప్త

  టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్గా ‘ఉప్పల శ్రీనివాస్ గుప్త హైద్రాబాద్:  టీపీసీసీ ప్రచారకమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొ రేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా నియమితు లయ్యారు. ఈ మేరకు కన్వీనర్ మధుయాష్కీగౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భం గా మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. గత పది సంవ త్సరాలుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్య క్షుడిగా కొనసాగుతూనే గత ప్రభుత్వంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా సేవలు అందించారన్నారు. ప్రజలతో ఆయనకు ఉన్న సత్సంబంధాలను గుర్తించి పదవిని అప్పగించడం జరిగిందన్నారు. ఉప్పల శ్రీని వాస్ గుప్తా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి తన సేవ లు ఎలా వినియోగించుకోవాలో తెలుసన్నారు. సేవా నిరతి, పార్టీ పట్ల అంకితభావం, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వి జయానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియ మాకానికి సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, మధు యాష్కీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియామకం పట్ల తెలంగాణ వ్యాప్తంగా పలు ఆర్యవైశ్య సంఘాలు, పలువురు ఆర్యవైశ్యులు, రాజ కీయ ప్ర

కేటీఆర్ రోడ్ షోలో హనుమాన్ దీక్ష పరుల నిరసన

  కేటీఆర్ రోడ్ షోలో హనుమాన్ దీక్ష పరుల నిరసన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ వద్ద హనుమాన్ దీక్ష పరుల నిరసనకు దిగారు. గత కొన్ని రోజుల క్రితం జై శ్రీరామ్ అనే పదం అన్నం పెడుతుందా అని అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్న దీక్షాపరులు. టీఆర్ కి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నిరసన. దీక్షాపరులకు నచ్చచెప్పిన పోలీసులు.

సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి..

  సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి. . ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసిన విశ్వహిందూ పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందుత్వంపై.. హిందూ విశ్వాసాలపై.. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు, సీతామాతలపై విమర్శలు గుప్పించడాన్ని విశ్వహిందూ పరిషత్ తప్పుపడుతోంది. ఇటీవల తుక్కుగూడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలను అవమానపరిచారని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. "విశ్వహిందూ పరిషత్ వాళ్లు పంచిన అక్షింతలు అయోధ్య నుంచి వచ్చినవి కాదని, అవి కంట్రోల్ బియ్యంతో తయారుచేసి పెంచారు"అని ఆరోపించడాన్ని వ్యతిరేకించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ.. ముస్లిం, క్రైస్తవుల మెప్పు కోసం ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గురువారం సాయంత్రం బి ఆర్ కే భవన్ లో తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజు గారిని కలిసి VHP నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ .. జై శ్రీరామ్ అం

8 crores seized

 8 crores seized @ at jaggayyapeta Krishna district

నామినేషన్ దాఖలు చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.

 వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి చివరి రోజు(9-5-2024) గురువారం బిజెపి పార్టీ అభ్యర్థిగా (4 ) సెట్లు నామినేషన్ దాఖలు చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.         అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, రెవిన్యూ అదనపు కలెక్టర్ ములుగు జిల్లా, సిహెచ్. మహేందర్ జీ కు నామినేషన్ సమర్పణ .

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ఖరారు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ఖరారు తెలంగాణలో జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.  

12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన

  12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన  నల్గొండ:  పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు.         కేంద్ర ఎన్నికల సంఘం అనువర్తించిన గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు ,బ్యాంకు ,లేదా పోస్ట్ ఆఫీస్ లు ఫోటోతో సహా జారీ చేసిన పాస్ బుక్ , కేంద్ర కార్మిక శాఖ ద్వారా జారీ చేయబడిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆర్జిఐ ఎన్ పి ఆర్ కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు, ఇండియన్ పాస్ పోర్ట్, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టర్ అండ్ టేకింగ్ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు వారి ఉద్యోగులకు జారీచేసిన ఫోటో గుర్తింపు కార్డు, ఎంపీ ,ఎమ్మెల్యే ,

హిందుత్వం బలపడితే భయమెందుకు..? - విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

 హిందుత్వం బలపడితే భయమెందుకు..? - విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి పగుడాకుల బాలస్వామి స్టేట్మెంట్ యదావిధిగా ఇస్తున్నాం చదవండి ఈ సాధారణ ఎన్నికల్లో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో హిందుత్వంపై తీవ్రస్థాయిలో విషం కక్కుతున్నాయి. ఇది ముమ్మాటికి సరికాదు. ఈ దేశ అస్తిత్వాన్ని, మెజారిటీ ప్రజల మనోభావాలను కాల రాసే విధంగా మాట్లాడటం.. వ్యంగంగా చలోక్తులు విసరడం.. తీవ్ర స్థాయిలో హిందుత్వంపై, అయోధ్య రామ మందిర్ పై విమర్శలు గుప్పించడం అనేది దుర్మార్గం. ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్దపీట వేస్తూ.. హిందువుల గుండెలపై గుణపాల దించే స్థాయిలో తీవ్ర పదజాలాలను ఉపయోగించడం ఏమాత్రం భావ్యం కాదు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు.."అసలు హిందుత్వం బలపడితే ఈ నేతలకు భయం ఎందుకు..? " అని హిందూ సమాజం హిందూ విరోధినిధులను ప్రశ్నిస్తోంది. ఇటీవల భువనగిరి బహిరంగ సభలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ.. అయోధ్య శ్రీరాముడి అక్షింతల పంపిణీ.. ప్రసాదం వితరణ.. శ్రీరామనవమి రోజు కాషాయ జెండాల అలంకరణ.. దేవుడి ఊరేగింపులు.. దేవుడి తీర్థప్రసాదా

13 మంది అభ్యర్థులు (16) సెట్ల నామినేషన్లు

  నల్గొండ:    వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా 5 వ రోజైన సోమవారం 13 మంది అభ్యర్థులు (16) సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు .ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టపద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్ జి కి వీరు నామినేషన్లను సమర్పించారు.         సోమవారం నామినేషన్లు సమర్పించిన వారిలో తెలుగుదేశం పార్టీ నుండి ముండ్ర మల్లికార్జునరావు 2 సెట్ల నామినేషన్లను, ధర్మ సమాజ్ పార్టీ నుండి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ 1 సెట్ నామినేషన్, బిఆర్ఎస్ నుండి ఆనుగుల రాకేష్ 1 సెట్, నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా కర్ని రవి 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు .      స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత 2 సెట్ల నామినేషన్లు, చీదల్ల వెంకట సాంబశివరావు 1 సెట్, చీదల్ల ఉమామహేశ్వరి 1 సెట్, తాడిశెట్టి క్రాంతి కుమార్ 2 సెట్లు, అయితగోని రాఘవేంద్ర 1 సెట్, భక్కా జడ్సన్ 1 సెట్,బుగ్గ శ్రీకాంత్ 1 సెట్, పాలకూరి అశోక్ కుమార్ 1 సెట్, దేశ గాని సాంబశివరావు 1 సెట్ నామినేషన్లను దాఖలు చేశారు. __________________________________  జారీ

జేపీ నడ్డా సభను విజయవంతం చేయండి

6.05.2024 సోమవారం రోజున జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా అద్యక్షుడు డా" నాగం వర్షిత్ రెడ్డి  నల్గొండ:  బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల సమావేశంలో  జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి  భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి గెలుపొంది మోడీ  హ్యాట్రిక్ ప్రధానమంత్రి కావాలని చెప్పి యావత్ నల్గొండ ప్రజలకు కోరుకున్న తరుణంలో కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ కూడా నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది నీ అన్నారు.  అందులో భాగంగానే  జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా  6.5.2024 సోమవారం మ" 3:30 కి ఔట్ డోర్ స్టేడియం లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు తర్వాత ఇంకొక మీటింగ్ ఉంటదిని,  పార్లమెంట్ సెగ్మెంట్లో మూడు బహిరంగ సభలు ఉండబోతాయి వాటికి సంబంధించి కూడా కేంద్ర స్టార్ కంపైనర్స్ పాల్గొనున్నారు అందులో భాగంగా యోగి ఆదిత్యనాథ్  కూడా వచ్చే అవకాశం ఉన్నది ఉమ్మడి జిల్లాకు సంబంధించి మోది  పర్యటనలో కూడా ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ గెలిపించుకోవాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు నల్గొండ పార్లమెంటు

4 గురు అభ్యర్థులు (5) సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

         వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి మూడవ రోజైన (4-5-2024) శనివారం 4 గురు అభ్యర్థులు (5) సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.      నేషనల్ నవ క్రాంతి పార్టీ అభ్యర్థిగా (1) సెట్, స్వతంత్ర అభ్యర్థిగా మరో సెట్ నామినేషన్ ను కర్నే రవి దాఖలు చేశారు.స్వతంత్ర అభ్యర్థులుగా భైరవభట్ల శ్రీనివాసరావు (1) సెట్, బక్క జడ్సన్ (1) సెట్, దైద సోమ సుందర్ (1) సెట్ నామినేషన్ దాఖలు చేశారు.        నామినేషన్ పత్రాలను నల్గొండ జిల్లా కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సిహెచ్. మహేందర్ జీ కి సమర్పించారు. ____________________________________ జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ ,నల్గొండ*

బీజేపీ 400 స్థానాలకు పైగా గెలుచుకుంటాం*

*బీజేపీ 400 స్థానాలకు పైగా గెలుచుకుంటాం* *-పెరిక మునికుమార్* బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి  *నల్లగొండ పాతబస్తీ 12వార్డ్ పోలింగ్ బూత్ 50,51 లలో బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారం లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పెరిక మునికుమార్   పాల్గొన్నారు... కేంద్రం లో మరో సారి నరేంద్ర మోదీ కి మద్దతు తెలియజేయాలనీ బీజేపీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి  కమలం పువ్వు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుతు.. పోలింగ్ బూత్ అధ్యక్షులు.. బూత్ కో-అడినేటర్స్, BLA- 2 మరియు బీజేపీ కార్యకర్తలను కలుపుకొని..ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది..ఈ సందర్బంగా పెరిక మునికుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఓటర్ ల దగ్గరకు వెళ్ళినప్పుడు .. ఈసారి మా ఓటు బీజేపీ కే అని.. నరేంద్ర మోదీ గారికి మా సంపూర్ణ మద్దతూ అని.. ఈ సారి మా ఓటు దేశ అభివృద్ధి కోసమే..అంటూ.. నల్లగొండ లో కుటుంబ రాజకీయలకు బుద్ది చెప్పితమని.. శానపూడి సైదన్నను తప్పకుండ గెలిపించుకుంటాం అని 400 సీట్ల లో నల్లగొండ కూడా ఉంటుందని తెలుపుతూ బీజేపీ ని ఆశీర్వాదిస్తున్

మిర్యాలగూడలో బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం.

 *మిర్యాలగూడలో బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం.* నలగొండ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు కోసం సీతారాంపురం 44వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నేరెళ్ల అజయ్ మాట్లాడుతూ ఈసారి కేంద్రంలో ఇండియా సర్కార్ 400 సీట్లతో ఏర్పడుతుందని అందులో నల్గొండ పార్లమెంటు కూడా ఉంటుందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు పార్టీలో కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పిచ్చుకోవడం జరిగిందినీ, ఇటువంటి ప్రజా ప్రతినిధి అనుభవం లేని వ్యక్తులు. ఇటు బిజెపి అభ్యర్థి హుజూర్నగర్ మాజీ శాసనసభ్యులు అనేక విధాలుగా హుజూర్నగర్ నియోజకవర్గం నీ అభివృద్ధి చేశారనీ అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ  గత పది సంవత్సరాలుగా అనేక అభివృద్ధి పదంలో ప్రపంచంలోనే భారత్ ను తొలి స్థానంలో నిలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ రమణ మహేష్ ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు

MLC ఉప ఎన్నిక స్థానానికి 5 గురు అభ్యర్థులు (7) సెట్ల నామినేషన్లు దాఖలు

 MLC ఉప ఎన్నిక స్థానానికి 5 గురు అభ్యర్థులు (7) సెట్ల నామినేషన్లు దాఖలు            వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి రెండవ రోజైన (3-5-2024) శుక్రవారం 5 గురు అభ్యర్థులు (7) సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.         కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న (2) సెట్లు నామినేషన్ దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థులుగా మాధవ పెద్ది వెంకట్ రెడ్డి (1) సెట్, చాలిక చంద్రశేఖర్ (2) సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. అలియన్స్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా ఈడ.శేషగిరిరావు(1) సెట్, తెలంగాణ సకలజనుల పార్టీ అభ్యర్థిగా నందిపాటి జానయ్య (1)సెట్ ( ఈనెల 2 న ఒక సెట్,ఈరోజు మరో సెట్ దాఖలు చేశారు) నామినేషన్ దాఖలు చేశారు.      నామినేషన్ పత్రాలను నల్గొండ కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సిహెచ్. మహేందర్ జీ కి సమర్పించారు. ____________________________________ జారీ చేసిన వారు సహయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

జిల్లా బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలిగా ఒక సామాన్య బీజేపీ మహిళా కార్యకర్త శ్రీమతి రావెల్ల కాశమ్మ

 జిల్లా బిజెపి మహిళా మోర్చ  అధ్యక్షురాలిగా ఒక సామాన్య బీజేపీ మహిళా కార్యకర్త శ్రీమతి రావెల్ల కాశమ్మ నల్గొండ:  ఒక సామాన్య బీజేపీ మహిళా కార్యకర్త శ్రీమతి రావెల్ల కాశమ్మ మొక్కవోని దైర్యంతో ఎన్నో పోలీస్ కేసులు ఎదుర్కొని, పలుమార్లు జైలు పాలైన ,పార్టీలో ఎంతో మంది మహిళా నాయకురాలు సూటి పోటీ మాటలతో విమర్శించిన ,తను నమ్మిన సిద్ధాంతం కోసం ,తను నమ్ముకున్న పార్టీ కోసం గత 30 సంవత్సరాలు గా పార్టీ లో భాధ్యత వున్న లేకున్నా,పని చేస్తూ పార్టీ అభివృధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఈసారి జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. కాశమ్మ కు చదువు రాదని, ఆస్తి లేదని పార్టీ లో భాద్యతలు ఇవ్వవద్దని కొంత మంది లీడర్స్ ప్రయత్నం చేసిన ఒక సామాన్య కార్యకర్తను జిల్లా అధ్యక్షురాలిగా చేసిన జిల్లా బీజేపీ నాయకత్వం అభినందనీయమని కార్యకర్తలు అంటున్నారు. శ్రీమతి కాశక్కగా పిలువ బడుతున్న పాత బస్తీ ముద్దుబిడ్డ,ఎంతో మంది మహిళలకు ఆదర్శనీయం కషక్క జీవితం.ఎన్నో విమర్శలు వచ్చిన ఎవరు ఎన్ని మాటలు అన్న పట్టించుకోకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తూ పార్టీని జిల్లాలో ఇప్పట

పిల్లి రామరాజు యాదవ్ ప్రచారం

 నరేంద్ర మోడీ గారిని మూడవ సారి కూడా ప్రధానిగా చేయాలనే సంకల్పంతో .. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నల్లగొండ పట్టణంలోని 03వ వార్డు శేషమ్మగూడెం, పాత పల్లె,04వ వార్డు కేషరాజుపల్లి లో స్థానిక నాయకత్వంతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించిన *నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ - పిల్లి రామరాజు యాదవ్ ..* నరేంద్ర మోడీ గారు మూడవసారి కూడా అధికారంలోకి రావాలని ఈ 10 ఏళ్ళ కాలంలో బీజేపీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను గడప గడపకు తిరుగుతూ వివరించారు.నల్లగొండ లో బీజేపీ పార్టీ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైది రెడ్డి కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు..

మూడు నామినేషన్లను దాఖలు.

             వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఉప ఎన్నికలలో భాగంగా మొదటి రోజైన గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.            స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు ఒక సెట్ నామినేషన్ ను దాఖలు చేయగా ,ప్రజావాణి పార్టీ తరఫున పాటి శ్రీకాంత్ రెడ్డి ఒక సెట్, తెలంగాణ సకల జనుల పార్టీ నుండి నందిపాటి జానయ్య ఒక్కో సెట్ నామినేషన్లను దాఖలు చేశారు .      ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికు గురువారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు . అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది . గ్రాడ్యుయేట్ ఎం ఎల్ సి ఎన్నికలలో మొదటి రోజు మొత్తం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. ____________________________________ జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

ఓట్ల లెక్కింపు కేంద్రం తనిఖీ చేసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు

 నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లోక సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, కళ్యాణ్ కుమార్ దాస్, ఆమోగ్ జీవన్ గాంకర్లు జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తిలతో కలిసి గురువారం తనిఖీ చేశారు.         ఈ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కై ఏర్పాటు చేసిన బారికేడింగ్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు హాళ్లను తనిఖీ చేశారు.        ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావ్ సూర్యవంశి ఓట్ల లెక్కింపుకు వినియోగించనున్న టేబుల్లు, పోలింగ్ కేంద్రాలు, సిసి టీవీల ఏర్పాటు తదితర వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు .