Skip to main content

Posts

Showing posts from April, 2021

Remdesiver ఎంపానెల్డ్ కోవిడ్ హాస్పిటల్స్‌కు అనుసంధానించబడిన అధీకృత ఫార్మసీ దుకాణాల వివరాలు వెల్లడించిన నల్గొండ జిల్లా కలెక్టర్

  ఎంపానెల్డ్ కోవిడ్ హాస్పిటల్స్‌కు అనుసంధానించబడిన అధీకృత ఫార్మసీ దుకాణాలు, ఇవి #Remdesiver ను ఆసుపత్రులలో మాత్రమే అనుమతించబడిన ఇన్‌పేషెంట్లకు విక్రయించడానికి అధికారం కలిగి ఉన్నాయని  నల్గొండ జిల్లా కలెక్టర్ ట్విట్టర్ లో వెల్లడించారు https://twitter.com/Collector_NLG/status/1388126673078419461?s=19 https://twitter.com/Collector_NLG/status/1388126673078419461?s=19

కాంట్రాక్ట్ బేసిస్ లో పల్మోనాలజిస్ట్ ను నియమిస్తామన్న నల్గొండ జిల్లా కలెక్టర్

  కాంట్రాక్ట్  బేసిస్  లో  పల్మోనాలజిస్ట్ ను నియమిస్తామన్న నల్గొండ జిల్లా కలెక్టర్ నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు   అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని. కరోన విలయతాండవం చేస్తున్న పరిస్థితులలో కరోనా వార్డులో రోగులు అధిక సంఖ్యలో జాయిన్ అవుతున్నారని ఆక్సిజన్,వ్వెంటిలేటర్ సౌకర్యం ఉన్నప్పటికీ , పల్మనాలజిస్టు  లేకపోవడం వలన మెరుగైన వైద్యం అందించుటకు ఆటంకంగా ఉన్నదని, వెంటనే  నియమించాలనిKVPS జిల్లా  కార్యదర్శి  పాలడుగు నాగార్జున  నల్గొండ జిల్లా కలెక్టరు కు   వాట్సాప్ లో విజ్ఞప్తి చేయడం తో వెంటనే స్పందించి  కాటాక్టు బేసిస్ లో నియమిస్తున్నామని నల్గొండ  జిల్లా కలెక్టర్  బదులు ఇచ్చారు.

అత్యవసరంగా పల్మోనాలజిస్ట్ ని నియమించండి కలెక్టర్ సారూ - KVPS జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున

  అత్యవసరంగా పల్మోనాలజిస్ట్ ని నియమించండి కలెక్టర్ సారూ - KVPS జిల్లా  కార్యదర్శి  పాలడుగు నాగార్జున                 నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు   అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని. కరోన విలయతాండవం చేస్తున్న పరిస్థితులలో కరోనా వార్డులో రోగులు అధిక సంఖ్యలో జాయిన్ అవుతున్నారని ఆక్సిజన్,వ్వెంటిలేటర్ సౌకర్యం ఉన్నప్పటికీ , పల్మనాలజిస్టు  లేకపోవడం వలన మెరుగైన వైద్యం అందించుటకు ఆటంకంగా ఉన్నదని, వెంటనే  నియమించాలనిKVPS జిల్లా  కార్యదర్శి  పాలడుగు నాగార్జున  నల్గొండ జిల్లా కలెక్టరు కు  విజ్ఞప్తి చేశారు. కరోనా రోగులకు అత్యధికంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్య వస్తున్నదని, డాక్టర్ లేకపోవడం వలన బయటకు రెఫర్ చేస్తున్నారని, హైదరాబాదు గాందీకి లేదా ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లడం వలన   ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన తెలిపారు. చివరికి ప్రాణాలు వదిలిన పరిస్థితులు ఉన్నవిని, అదిక ప్రాణనష్టం జరుగనకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

గుట్కా ప్యాకేట్లు పట్టివేత*

 *గుట్కా ప్యాకేట్లు పట్టివేత* నల్గొండ పట్టణంలో నిషేధిత గుట్కా పాన్ మసాలా విక్రయిస్తున్నారనే   విశ్వసనీయ సమాచారం మేరకు నల్గొండ పట్టణంలో ని ప్రకాశం బజార్  లో రైడ్స్ నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.. పిఎల్.మనోజ్ కుమార్ కి చెందిన షాపులో రైడ్ చేయగా అతనికి చెందిన శివాజీ నగర్ గోడౌన్ లో  20 లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకేట్లను రైడ్ చేసి పట్టుకున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారిని వి.జ్యోతిర్మయి. అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు..

కేటీఆర్ కు పాజిటివ్

 

మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వాక్సినేషన్

మూడో విడత వ్యాక్సినేషన్ కు మార్గదర్శకాలు వెల్లడించిన కేంద్రం  మే 1 నుంచి మూడో విడత  vaccination ప్రక్రియ  మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వాక్సినేషన్

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటీవ్‌

 తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటీవ్‌ *యాంటీజన్* పరీక్షల్లో *సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటివ్* గా నిర్ధారణ... *ఆర్టీపీసీఆర్* ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వైద్య బృందం... స్వల్ప జలుబు లక్షణాలతో బయటపడ్డ కోవిడ్... ప్రస్తుతం వైద్యుల పర్వ్యవేక్షణలో ఫార్మ్ హౌజ్ లో రెస్ట్ తీసుకుంటున్న సీఎం కేసీఆర్... మొన్న 14న జరిగిన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి తో సహా పలువురు రాజకీయ నాయకులకు సోకిన కరోనా...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కెటిఆర్ పర్యటనలో నిరసన సెగ.

  రాజన్న సిరిసిల్ల జిల్లాలో కెటిఆర్ పర్యటనలో నిరసన సెగ. గతంలో కెటిఆర్ ఇచ్చిన మాట ప్రకారం 30 పడకల  ఆసుపత్రిని నిర్మించాలని సెల్ టవర్ ఎక్కిన బిజేపి కార్యకర్తలు. కెటిఆర్ కార్యక్రమం లో  ఇచ్చిన హామిలని అమలు చేయాలని నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ఉద్యోగ ఖాళీలని భర్తీ చేయాలని  ఎబివివి కార్యకర్తల నిరసన. సంఘటన స్థలంలో ఎబివిపి కార్యకర్తల పై చెయి చేసుకున్న పోలీసులు,టిఆర్ఎస్ కార్యకర్తలు. కాంగ్రెస్, ఎబివిపి,బిజేపి కార్యకర్తలని అరెస్టు చేసి ఇల్లంతకుంట పోలీస్ స్టేషను కి తరలింపు. కెటిఆర్ పర్యటన అనంతరం పోలీస్ స్టేషన్ కి చేరుకున్న టిఆర్ఎస్ నాయకులు. మాటమాట పెరగడంతో పోలిసు స్టేషను కి భారీగా చేరుకున్న టిఆర్ఎస్. ఇల్లంతకుంట పోలీసు స్టేషను లోనే బాహాబహికి దిగిన టిఆర్ఎస్, బిజెపి నాయకులు. బిజేపి, ఎబివిపి నాయకులపై టిఆర్ఎస్ నాయకుల దాడి. పరిస్థితి అదుపుచేయలేక అదనపు పోర్స్ లేక చేతిలో వెఫన్ ఉన్నగాని  ఏం చేయలేకపోతున్ననని పై అధికారులతో ఫోన్ లో బహిరంగంగా వేడుకున్న ఎస్సై. సుమారు రెండు గంటలపాటు ఇల్లంతకుంట పోలీసు స్టేషను లో ఉద్రిక్త పరిస్థితులు

కరోన కేసులు 4009

 

తాండూరులో వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాగి అంబలి, మజ్జిగ పంపిణీ

 తాండూరులో వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో  రాగి అంబలి, మజ్జిగ పంపిణీ  వాసవి క్లబ్ తాండూరు జేమ్స్ మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంయుక్తంగా కలిసి తాండూరు వికారాబాద్ డిస్ట్రిక్ఫ్ లో ఏప్రిల్ 01 నుండి ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 నుండి సాయంత్రం 5.00 వరకు రాగి అంబలి, మజ్జిగ  పంపిణీ చేస్తున్నారు. తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి శ్రీ స్వప్న పరిమాల్ గ చేతి మీదుగా పంపిణీ  ప్రారంభించారు   దాతల సహకారం తో  రోజు 50 trs రాగి అంబలి , 50 ltr మజ్జిగ మరియు చల్లని త్రాగు నీరు పంపిణీ చేస్తున్నారు. మే 30 వరకు ఈ కార్యక్రమం నడుస్తుందని, వారం ఒక్క సారి అన్నవితరణ కార్యక్రమం  చేస్తున్నామని  రొంపల్లి సంతోష్ కుమార్ ,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కాబినెట్ జాయింట్ ట్రేసుర్రెర్,  ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వికారాబాద్ డిస్ట్రీట్ , లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు ట్రేసుర్రెర్ , కొక్కాల సంతోష్ కుమార్ , వైష్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నందారం నరసింహ  వైష్ ఫెడరేషన్ కోశాధికారి కెలిగారి ప్రవీణ్ కుమార్ ,  వాసవి క్లబ్ అధ్యక్షులు గుముడలా గౌరీశంకర్,  వాసవి క్లబ్ సెక్రటరీ మోముల హరీష్  వాసవి క్లబ్ ట్రేసుర్రెర్

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు : డిఐజి రంగనాధ్*

  *రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు : డిఐజి రంగనాధ్* - - నాణ్యత, మాయిశ్చర్ లాంటి సాకులతో మద్దతు ధర తగ్గిస్తే సహించేది లేదు - - మద్దతు ధర 1,888, సాధారణ ధాన్యంకు 1,868 చెల్లించాలి - -.మాయిశ్చర్, తాలు, మట్టి లాంటి అంశాలను సాకుగా చూపితే సహించేది లేదు - - రేపటి నుండి రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నల్లగొండ : నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని, మాయిశ్చర్, తాలు, మట్టి లాంటి అంశాలను సాకుగా చూపిస్తూ రైతులకు మద్దతు ధర చెల్లించకుండా మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డిఐజి ఏ.వి. రంగనాధ్. గత కొద్ది రోజులుగా నాణ్యత సరిగా లేదని, ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉన్నదని, తాలు, మట్టి ఎక్కువ ఉన్నదని రైతులు తీసుకువస్తున్న ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా క్వింటాలుకు మూడు నుండి నాలుగు కిలోలను తగ్గిస్తున్నట్లుగా రైతుల వద్ద నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యం నాణ్యత లేకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయించిన విధంగా ధర చెల్లించాలని తెలిపారు. అలా కాకుండా నాణ్యత, మాయిశ్చర్, తాలు సాకుగా క్వింటాలు

శంషాబాద్‌లో కారు,లారీ ఢీ..నలుగురు మృతి, 15 మందికి గాయాలు

 *శంషాబాద్‌లో కారు,లారీ ఢీ..నలుగురు మృతి, 15 మందికి గాయాలు* రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌లో కారును లారీ ఢీకొన్న సంఘటనలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మరో 15 మంది గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కార్మికులు చిక్కుకోగా.. ప్రమాద సమయంలో 30 పైగా కార్మికులు ఉన్నారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.

రియాజుద్దీన్ అకాలమరణానికి చింతిస్తూ సంతాపం ప్రకటించిన జర్నలిస్టులు

  ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షుడు రియాజుద్దీన్ అకాలమరణానికి సంతాపసూచకంగా ఈరోజు అసోసియేషన్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్లాక్టవర్ సెంటర్లో సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రియాజుద్దీన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ స్వర్గీయ రియాజుద్దీన్ జర్నలిస్ట్ యుద్ధ నౌక అని చిన్న పత్రికల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన నిరంతర నిరంతర శ్రామికుడు అని కొనియాడారు జర్నలిస్టుల కోసం స్వార్థం లేకుండా సభ్యులందరికీ నిరంతరం అందుబాటులో ఉండి వెన్నంటి ప్రోత్సహించే వాడని అలాంటి వ్యక్తి అనారోగ్యకారణంగా అకస్మాత్తుగా అందరినీ వదిలి వెళ్లిపోవడం బాధాకరమన్నారు ప్రజాశక్తి విలేకరి గా జర్నలిస్ట్ ప్రస్థానం ప్రారంభించి పౌర స్వేచ్ఛ పత్రికా స్థాపించి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఏది అన్నారు ఆయన నిస్వార్థ సేవ జర్నలిస్టులందరికీ ఆదర్శప్రాయం అన్నారు ఆయన ఆశయ సాధన కోసం చిన్న పత్రికల సంపాదకులు విలేకరులు ఐకమత్యంగా కృషి చేయాలన్నారు ప్రభుత్వం చిన్న ప

11 గంటల వరకు 31 శాతం పోలింగ్

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటలవరకు 31.0 శాతం అయినట్లు అధికారులు తెలిపారు.  

9 గంటలవరకు 12.9 శాతం పోలింగ్

  నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటలవరకు 12.9 శాతం అయినట్లు అధికారులు తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని పరిశీలించి సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్

 రేపు జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో భాగంగా గేమ్యానాయక్ తండా, ఉట్లపల్లి గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని పరిశీలించి సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ *ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పటిష్ట బందోబస్తు : డిఐజి రంగనాధ్* - - 4,000 పైగా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు - - సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతకు ప్రత్యేక చర్యలు - - పారామిలటరీ బలగాల పహారాలో ఈవీఎంల తరలింపు నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పటిష్ట నిర్వహణ కోసం భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాలను సైతం పరిశీలించి పలు సూచనలు చేయడం జరిగిందని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 108 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కనీసం 15 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పోలింగ్ సరళిపై వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు భద్రతతో పాటు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా నిమిషాల వ్యవధిలో అ

గాంధీ ఆస్పత్రి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రి

  Breaking గాంధీ ఆస్పత్రి ని రేపటి నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆదేశాలు జారీ చేసిన ఆరోగ్య శాఖ. శనివారం నుంచి OP ని నిలిపివేయాలని... ఆదేశం ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్  కేసులు మాత్రమే ట్రీట్మెంట్... ఇప్పటికే 450కి పైగా పేషెంట్స్ ఉన్నారు.. నిన్న ఒక్కరోజే 150మంది అడ్మిట్ అయ్యారు... 10నిమిషాలకు ఒక పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు.. IP బ్లాక్ మొత్తం ఇప్పటికే కోవిడ్ పేషెంట్స్ తో నిండిపోయింది... రెపటినుంచి ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా ఆపేసి... కేవలం కోవిడ్ హాస్పిటల్ గా మారనుంది...

హైకోర్టు ను ఆశ్రయించిన కాంగ్రెస్ నేత మానవత రాయ్

 *టీఎస్ హైకోర్టు......* హైకోర్టు ను ఆశ్రయించిన కాంగ్రెస్ నేత మానవత రాయ్... తనను అక్రమంగా అరెస్ట్ చేసి దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు ను కోరిన మమవత రాయ్, ఎలాంటి నోటీస్ లు లేకుండా అరెస్ట్ చేసి, తనపై దాడి చేశారని తన పిటిషన్ లో పేర్కొన్నా మానవత రాయ్, అక్రమ అరెస్ట్ తో 24 గంటలపాటు తనను నిర్బంధించారని,25 లక్షల నష్టపరిహారం చెల్లించేలా పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆదేశించాలని కోరిన మానవత రాయ్.. తనపై దాడి చేసిన పోలీస్ అధికారిపై కేసు నమోదు చేయాలని కోరిన మానవత రాయ్ తన కేసులో డీజీపీ,  మిర్యాలగూడ, నల్గొండ ఎస్పీలను, బాషా టాస్క్ ఫోర్స్, నాగార్జున సాగర్ సీఐ  లను ప్రతివాదులుగా చేర్చిన మమవత రాయ్.

ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

  ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్ 95 శాతం మంది ఇంటి నుంచే చికిత్స పొందుతున్నారు 47 వేల పడకల్లో సగానికి పైగా కరోనా పేషెంట్లకు కేటాయించాం సీరియస్ కేసులను ప్రైవేట్ ఆసుపత్రులు గాంధీ హాస్పిటల్ కు పంపుతున్నాయి సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో 20 శాతం మంది పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరారని... సెకండ్ వేవ్ లో 95 శాతం మంది ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నారని చెప్పారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47 వేల పడకల్లో సగానికి పైగా కోవిడ్ పేషెంట్లకే వాడుతున్నామని తెలిపారు. సీరియస్ కేసులు వస్తే ప్రైవేట్ ఆసుపత్రులు గాంధీ ఆసుపత్రికి పంపుతున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ధర్నాలు చేయవద్దని కోరారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈటల ఈరోజు గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి ఆసుపత్రులను సందర్శించారు. ఆసుపత్రుల్లో ఉన్న ఏర్పాట్లు, ఔషధాల లభ్యత, ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జిల్లాల వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని

ఎర్రబెల్లి శ్రీ లింగమంతుల స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

 నాగార్జున సాగర్ నిడమనూరు మండలం ఎర్రబెల్లి శ్రీ లింగమంతుల స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ..బీజేపీ అభ్యర్థి రవి నాయక్ ను వెంట తీసుకొని దేవాలయన్ని కలియతిరిగారు..అనంతరం స్థానికుల నుండి దేవాలయ చరిత్ర.. అభివృద్ధి కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు.. అనంతరం మీడియా తో మాట్లాడారు..

హాలియా సభకు హాజరుకాకుండా, మిమ్ములను కలవకుండా ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసినయ్ - ముఖ్యమంత్రి కేసీఆర్

  హాలియా సభకు హాజరుకాకుండా, మిమ్ములను కలవకుండా ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసినయ్ - ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియా: నల్గొండ జిల్లా హాలియలో జరిగున నాగార్జున సాగర్ ఉపఎన్నికల  ప్రచార  సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఈ  సభకు హాజరుకాకుండా, మిమ్ములను కలవకుండా ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసినయని ప్రజాస్వామ్యం లో  ఇలాంటి పోకడలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. దేశంలో  ఎన్నో రాజకీయ పార్టీలు సమావేశం లు,సభలు నిర్వహిస్తున్నాయి .కానీ ఇక్కడ ప్రతిపక్షాలకు  విచిత్రమైన పరిస్థితి ఉన్నదిని విమర్శించారు. ఎవరు మంచి చేస్తున్నారో, ఎవ్వరు  అభివృద్ధి చేస్తున్నారో  ప్రజలే సమీక్షలు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఎవరు గెలిస్తే  అభివృద్ధి జరుగుతుందో వారినే గెలిపించండనిబకోరారు. నోముల భగత్ విద్యావంతుడు, యువకుడు,మంచి  విజన్ ఉన్న వాడు.. భగత్ గాలి బాగానే ఉన్నదని అన్నారు. నెల్లికల్లు లిఫ్ట్ లో  నీళ్లు పారిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి దమ్మున్న మాట మాట్లాడిండని, నెల్లికల్లు లిఫ్ట్ పూర్తి చేయకపోతే   రాజీనామా చేస్తా అని జగదీష్ రెడ్డి   మంచి మాట మాట్లాడిండని, నేను దాని  సమర్థిస్తానాని, ఎట్టి పరిస్థితి ల్లో పూర్తి చేస్తామన్నారు. జానార

హాలియా సభకు బయలుదేరిన కెసిఆర్

  నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా బహిరంగ సభకు బయలు దేరిన సీఎం కెసిఆర్. మార్గమధ్యంలో యాచారం వద్ద స్వాగతం పలికిన   పార్టీ నాయకులు కార్యకర్తలు..ప్రజలు. వాహనం నిలిపి ప్రజలకు అభివాదం చేసిన సీఎం కెసిఆర్.

సీఎం సభకు వచ్చేవారు డిస్టన్స్ పాటించాలి .. మాస్క్ తప్పనిసరి -కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

  సీఎం సభకు వచ్చేవారు డిస్టన్స్ పాటించాలి .. మాస్క్ తప్పనిసరి -కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్   సీఎం కేసీఆర్ హాలియ బహిరంగ సభ  సందర్బంగా హాలియా లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్   మాట్లాడుతూ జిల్లాలో ,రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది  కరోనా నిభందలను పాటించాలిని సీఎం సభకు వచ్చేవారు డిస్టన్స్ పాటించాలని .. మాస్క్ తప్పనిసరని అన్నారు  జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానం ఉంటే టెస్టులు చేయించుకోవాలిని కోరారు. డిఐజి రంగనాథ్ మాట్లాడుతూ కోవిడ్ కి సంభందించి ప్రభుత్వ నిభందలను ఎవరు బ్రేక్ చేసిన కేసులు తప్పవని, సీఎం సభ ఏర్పాటు నిబంధనల ప్రకారం ఏర్పాటుచేయడం జరిగిందిని తెలిపారు. ముఖ్యమంత్రి సభను అడ్డుకోవడానికి చూసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని,  రాజకీయ పార్టీలు ఏవైనా నిబంధనలు వర్తిస్తాయని, ఎవరిని ఎవరు ఇబ్బందులు పెట్టిన చర్యలు ఉంటాయని తెలిపారు .17 వ తేదీన ఎన్నికలు ముగిసేవరకు ప్రతిఒక్కరు  అధికారులను, ఉద్యోగులను ఇబ్బందులు పెట్టొద్దని కోరారు. కార్యకర్తలు ఎవరు రెచ్చగొడితే రెచ్చిపోకండిని, తరువాత ఇబ్బందులు ఉంటాయని, కేసులు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి

బిజెపి చీఫ్ బండి సంజయ్ రోడ్ షో

  నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి డాక్టర్ రవి కుమార్ నాయక్ కు మద్దతుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గుర్రంపోడు మండలం కొప్పోలు నుంచి ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారం కోసం వచ్చిన సంజయ్ కుమార్ కు స్థానిక ప్రజలు, బిజెపి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కొప్పోలు నుంచి మొదలుపెట్టిన ఈ రోడ్ షో కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది* 

తిరగబడ్డ అడవిబిడ్డలు.. ఫారెస్ట్ అధికారులను చెట్టుకు కట్టేసిన గిరిజనులు

 తిరగబడ్డ అడవిబిడ్డలు.. ఫారెస్ట్ అధికారులను చెట్టుకు కట్టేసిన గిరిజనులు   భద్రాద్రి జిల్లాలో గిరిజనుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. తమ పోడు భూములు ఆక్రమించుకునేందుకు వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను వారు చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డారు. భద్రాద్రి జిల్లాలో షాకింగ్ ఘటన ఫారెస్ట్ అధికారులను చెట్టుకు కట్టేసిన గిరిజనులు పోడు భూముల స్వాధీనానికి వెళ్లడంతో ఘటna ఫారెస్ట్ ఆఫీసర్‌ని చెట్టుకు కట్టేసిన గిరిజనులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడవి బిడ్డల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అటవీ భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు వారిపై దాడికి పాల్పడ్డారు. దుమ్ముగూడెం మండలంలోని ఢీ కొత్తూరు బీట్ పరిధిలోని చింతగుప్ప గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్న భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లారు. భూములను వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశించడంతో గిరిజనులు తిరగబడ్డారు. తమ పోడు భూమిలోకి మీరు ఎలా వస్తారని నిలదీస్తూ బీట్ ఆపీసర్లను చుట్టుముట్టారు. మహిళలంతా ఏకమైన అధికారులను చెట్టుకు కట్టేసి దాడి

♦️ *కేసీఆర్ హాలియా బహిరంగసభను రద్దు చేయండి

 ♦️ *కేసీఆర్ హాలియా బహిరంగసభను రద్దు చేయండి* *హెచ్చార్సీలో పిటిషన్ దాఖలు చేసిన రాచాల యుగంధర్ గౌడ్* పిటిషన్ లో  పేర్కొన్న అంశాలు  కోవిడ్ దృష్ట్యా సభలు నిర్వహించొద్దని 69 జీవోను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రే ప్రభుత్వ జీవోను ఉల్లంఘిస్తున్నారు.  హాలియా సభ రద్దుకై ఎన్నికల కమిషన్ మరియు డిజిపికి ఆదేశాలివ్వండి  రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు విజ్ఞప్తి చేసిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రజారోగ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి హాలియ సభను రద్దుచేసేవిధంగా చర్యలు తీసుకోవాలి. *రాచాల యుగంధర్ గౌడ్ - తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి*

*తన ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్ష కు దిగిన కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు*

  *తన ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్ష కు దిగిన కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు*  *వి.హనుమంతరావు*  కామెంట్స్ 2019 ఏప్రిల్ 12 న పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాను ఏప్రిల్ 13 న అంబేద్కర్ విగ్రహం కూల్చారు.  అమలాపురం వెళ్లి 5 లక్షలు పెట్టి విగ్రహం తెప్పించా.. దాన్నీ గోషామహల్ స్టేడియంలో పెట్టారు. అంబేద్కర్ బొమ్మను పోలీస్ స్టేషన్ లో పెడతారా ప్రభుత్వం లో ఉన్న ఏ ఒక్కరు మాట్లాడటం లేదు. షర్మిల రాజన్న రాజ్యం అంటుంది. ఆయన రాజ్యం ఎక్కడిది..అది కాంగ్రెస్ రాజ్యం  *అంబేద్కర్ విగ్రహం ఇచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.*  రాజ్యాంగ అధినేతకు తెలంగాణ లో దిక్కు లేదు. అంబేద్కర్ కోసం నేను చావడానికి సిద్ధం. విగ్రహం ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుంది. టీ.ఆర్.ఎస్ లోని ఎస్సీ , బీసీ నాయకులు ఒక్కరూ మాట్లాడటం లేదు.

కేసీఆర్‌కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

  కేసీఆర్‌కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ఏజ్ లిమిట్ 34 నుంచి 44 ఏళ్ళకు పెంచాలన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు సోషల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఐటీఐఆర్ గేమింగ్ అండ్ యానిమేషన్ ఇండస్ట్రీని స్థాపించాలన్నారు. వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మరియు ఒక్కో ప్రాంత నిర్ధిస్ట ప్రతిభకు సంబందించిన పరిశ్రమలను అభివృద్ధి చేయామన్నారు. అలాగే పెద్ద, మైక్రో అండ్ స్మాల్ మీడియం మ్యానుఫాక్యరింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయించాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు హై లెవల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను వివిధ రంగాలకు చెందిన మేధావులు, పారిశ్రామిక రంగాల వారితో ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ, ఎసీ, ఎస్టీ మైనార్జీలకు ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా  స్వయం ఉపాధి మరియు సొంత వ్యాపారాలను పెంపొందించేందుకు లోన్స్ విడుదల చేయాలన్నారు. ఉద్యోగ నియామకాలు చేసి నిరుద్యోగ సమస్య పర

*నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు : డిఐజి ఏ.వి.రంగనాధ్*

 *నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు : డిఐజి ఏ.వి.రంగనాధ్* - - ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పార్టీలు, అభ్యర్థులపై కేసులు - - ఇప్పటి వరకు 46.79 లక్షల నగదు, 35 లక్షల విలువైన మద్యం సీజ్ - - కాన్వాయి నిబంధనలు ఉల్లంఘనలపై ఆరు కేసులు నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని, ఇప్పటికే అలాంటి ఘటనలపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటున్నామని డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల క్రమంలో చెక్ పోస్టుల వద్ద వాహనాల తనిఖీతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల సీనియర్ నేతల వాహనాలను తరచూ తనిఖీ చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, కాన్వాయి నిబంధనల ఉల్లంఘన లాంటి అంశాలపై సునిశితంగా దృష్టి సారించి కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రచారంలో మాస్కులు ధరించని వారిపై జరిమానాలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వినియోగిస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నామని తెలిపారు. పలు ప్రాంతాలలో బెల్ట్ షాపులను సీజ్ చేశామని, ఎక్కడా శాంతి భద

ఈ నెల 12న అంబేడ్కర్ సందేశ్ యాత్ర నీలి దండు కవాతు - పాలడుగు నాగార్జున

  ప్రభుత్వ రంగ పరిరక్షణకై పూలే - అంబేడ్కర్ సందేశ్ యాత్ర  నీలి దండు కవాతును ఈ నెల 12న  ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం  జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. ఈ యాత్ర      జిల్లా కోర్టు ప్రక్కనగల అంబేద్కర్ భవనం నుండీ ప్రారంబమయి,ప్రకాశం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం , అంబేద్కర్ విగ్రహం డిఈవో ఆఫీస్ వరకు వుంటుందిని తెలిపారు కవాతు లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాస్క్ తప్పనిసరీ ధరించేసులని  కోరారు. ఈ కార్యక్రమంలో   ముఖ్య అతిధిగా ఉపాధ్యాయ యం యల్ సి.అలుగుబెల్లి నర్సిరెడ్డి, స్వేరోస్ ఎంప్లాయీస్ అసోసియేషన్  రాష్ట్ర అద్యక్షులు. పొడపంగు రాధా గార్లు  పాల్గొంటారని ఆయన తెలిపారు.

జానారెడ్డికి పెద్దకొడుకును - రేవంత్ రెడ్డి

 నాగార్జున సాగర్లో  ఇప్పటి వరకు ఒక లెక్క , ఇక నుండి ఒక లెక్క  పెద్దాయన అని చూడకుండా...పది మంది సన్నాసులతో తిట్టించి ఆనంద పడే వ్యక్తులకు ఒకటే మాట  కెసిఆర్ తో జానారెడ్డి పెద్ద కొడుకు వచ్చాడు అని చెప్పు...అతనే రేవంత్ రెడ్డి అని చెప్పు  అని సాగర్ ఎన్నికల సభలో ప్రసంగించిన ఎంపీ రేవంత్ రెడ్డి

భార్య డెలివరీకి డబ్బుల్లేవని భర్త ఆత్మహత్య

 భార్య డెలివరీకి డబ్బుల్లేవని భర్త ఆత్మహత్య  భార్య డెలివరీకి డబ్బుల్లేక భర్త ఆత్మహత్య కు పాల్పడిన విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది గౌరారంకు చెందిన రాజిరెడ్డి (32) పెయింటింగ్స్ వేసేవాడు. భార్య 8 నెలల గర్భవతి కాగా, రెండేళ్ల పాప ఉంది. 6 నెలలుగా ఒక్క కాంట్రాక్టు దొరక్కపోవడంతో చేతిలో పైసలు లేవని తల్లితో చెబుతూ బాధపడేవాడు భార్య య డెలివరీ టైం దగ్గరకొస్తున్నా, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో రాజిరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

తిరుమలగిరి మండలాన్ని చుట్టి వచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

  నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు అమరబాద్ అడవులను అనుకుని ఉన్న తునికినూతల తాండా తో పాటు నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలాన్ని ఆసాంతం చుట్టి వచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఈ రాత్రి తిరుమల గిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో సహచర మంత్రి శ్రీనివాస్ గౌడ్,టి ఆర్ యస్ అభ్యర్థి నోముల భగత్,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మండల ఎన్నికల ఇంచార్జ్,హుజుర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి,సీనియర్ టి ఆర్ యస్ నేత యం సి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమాన్యునివలె బోంచేసిన కేంద్ర మంత్రి అది బీజేపీకు చెల్లు

 సమాన్యునివలె బోంచేసిన కేంద్ర మంత్రి అది బీజేపీకు చెల్లు నాగార్జున సాగర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ: నాగార్జున సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రహోమ్ శాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా నేడు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలంలో పెద్ద దేవులపల్లి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీజేపీ సాగర్ అభ్యర్థి రవికుమార్ నాయక్  మంత్రి వెన్నంటే ఉన్నారు.ఉదయం పెద్దదేవుళ్లపల్లి నుంచి మొదలుపెట్టున ప్రచారం బాబుసాయి పేట,త్రిపురారం,ముకుందా పురంలో రోడ్ షోలు నిర్వహించి హాలియలోని sr ఫంక్షన్ హాల్లో "సాగర్ అభివృద్ధి కి బీజేపీ మ్యానిఫెస్టో "ను మంత్రి విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో mla రఘునందన్ రావు,పలువురు రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కిషన్ రెడ్డి   గత పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురైన సాగర్ ను బీజేపీ మాత్రమే అభివృద్ధి చేయగలదని ,ఈసారి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.అలానే సాగర్ కు kv స్కూల్ ,ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని,గిరిజనులకు న్యాయమైన రిజర్వేషన్ వచ

మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం

 నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలగిరి మండలం *కొంపెల్లి* గ్రామంలో ఈ మధ్యాహ్నం  జరిగిన టి ఆర్ యస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,టి ఆర్ యస్ అభ్యర్థి నోముల భగత్,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ సీనియర్ టి ఆర్ యస్ నేత యం సి కోటిరెడ్డి తదితరులు....

ఏసీబీ వలలో.. తిరుపతి నగరపాలక సంస్థ అవినీతి చేప..

  బ్రేకింగ్ న్యూస్ ఏసీబీ వలలో.. తిరుపతి నగరపాలక సంస్థ అవినీతి చేప..  తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రఫీ ఆస్తి పన్ను మార్పు కోసం నరసింహా రెడ్డి నుంచి.. రూ.9 వేలు నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ  వైనం.. శనివారం శ్రీదేవి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బట్టల దుకాణంలో చోటుచేసుకున్న సంఘటన..

పెద్దదేవులపల్లిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారం

 పెద్దదేవులపల్లిలో  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ప్రచారం త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి  డాక్టర్ పానుగోతు రవి కుమార్  గెలుపు కోసంకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారితో కలిసి జిల్లా అధ్యక్షులు  కంకణాల శ్రీధర్ రెడ్డి ప్రచారము చేశారు

శ్రీభద్రాచల దేవాలయ ఆగమ, సంప్రదాయములకు మద్దతు గా శ్రీ రామ సేన పేరుతో జాయింట్ యాక్షన్ కమిటీ

శ్రీభద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి దేవాలయ ఆగమ, సంప్రదాయములకు , అర్చక సిబ్బందికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ  శ్రీ రామ సేన పేరుతో జాయింట్ యాక్షన్ కమిటీ హిందూ ధర్మం అంతా కూడానూ ఆలయాల మీద ఆధారపడి ఉంది. ఆలయం అనేది హిందూధర్మానికి ఆయువుపట్టు వంటిది. అలాంటి ఆలయాలు ఎలా నిర్వహించబడాలి అని చెప్పేవి ఆగమ శాస్త్రాలు. అది దేవతలని బట్టి, ఒక్కొక్క ఆగమం, ఒక్కొక్క సంప్రదాయం ప్రకారం నడుస్తూ ఉంటాయి. ఇటువంటి పద్ధతులతో శ్రీభక్త రామదాసుగారి చేత ఏర్పాటు చేయబడి, సుమారు 350 ఏళ్ల నుండి నడుస్తున్న దేవాలయం శ్రీభద్రాచల దివ్యక్షేత్రం. అటువంటి  శ్రీభద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి దేవాలయ ఆగమ, సంప్రదాయములకు , అర్చక సిబ్బందికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ శుక్రవారం రోజున  ఎల్బీనగర్ లో జరిగిన కార్యక్రమంలో శ్రీభద్రాచల రామ మహా సేన (శ్రీ.రా.మ.సేన) పేరుతో జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆవిర్భావం జరిగింది.    దీనికి శ్రీ శ్రీ శ్రీ కమలేష్ మహారాజ్ స్వామీజీ అధ్యక్షుడిగా, బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ గంగు ఉపేంద్ర శర్మ గారు కన్వీనర్ గా,  శ్రీభాష్ యదుమోహన్ ఆచార్య గారు కో కన్వీనర్ గా,  శ్రీ ఆనంద్ గౌడ్ గారు ప్రధాన కార

సాగర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

  నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా తిరుమలగిరి మండలంలోని శ్రీరాంపల్లి, అల్వాల్ మరియు రంగుండ్ల గ్రామాల్లో బిజెపి అభ్యర్థి డాక్టర్ రవి కుమార్ నాయక్ గారికి మద్దతుగా, ప్రచారం నిర్వహించిన దుబ్బాక శాసనసభ్యులు  మాధవనేని రఘునందన్ రావు 

నేడు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల*

  నేడు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల* ఈరోజు శనివారం మద్యాహ్నం: 01:00 గం"లకు హాలియా లోని SR ఫంక్షన్ హాల్ నందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి. G.కిషన్ రెడ్డి, బీజేపీ MLA రఘునందన్ రావు సాగర్ ఉప ఎన్నికల బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేస్తారని బీజేపీ పార్టీ మీడియా  ఇంచార్జి పెరిక మునికుమార్ తెలిపారు. 

మాస్కులు ధరించని 20 మందిపై కేసులు నమోదు : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి

  *మాస్కులు ధరించని 20 మందిపై కేసులు నమోదు : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి* - - ప్రజారోగ్యం కోసమే మాస్కులపై కఠిన వైఖరి - - కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి - - మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నల్లగొండ : మాస్కులు ధరించని 20 మందిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్ది తెలిపారు. శుక్రవారం సబ్ డివిజన్ పరిధిలోని నల్లగొండ, చండూర్, నల్లగొండ రూరల్, చిట్యాల, నకిరేకల్ తదితర ప్రాంతాలలో మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించి కోవిడ్ నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేశామన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రించడం లక్ష్యంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండడం కోసమే మాస్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో మాస్కుల ఆవశ్యకతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు ఎందుకు ఎండింది - మంత్రి జగదీశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు ఎందుకు ఎండింది తెలంగాణాను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లిచ్చిన ఘనులు ఎవరూ?  పదవుల కోసం పెదవులు మూసుకుంది నిజం కాదా  *-కాంగ్రెస్ పార్టీ పై ధ్వజమెత్తిన మంత్రి జగదీష్ రెడ్డి* కాంగ్రెస్ పార్టీ ఎలుబడిలో సాగర్ ఎడమ కాలువ కింది భూములు ఎందుకు ఎండిపోయాయో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడీ డిమాండ్ చేశారు. తెలంగాణాను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లిచ్చిన ఘనత కాంగ్రెస్ నేత జానారెడ్డి ది కాదా అని ఆయన సూటిగా నిలదీశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం నుండి నిడమనూర్ మండల పరిధిలోని తుమ్మడం,నారమ్మగూడెం తదితర గ్రామాల్లో జరిగిన ఎన్నికల సమావేశలలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టి ఆర్ యస్ అభ్యర్థి తో పాటు ఈ ప్రచారంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్,శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు యన్. భాస్కర్ రావు,బొల్లం మల్లయ్య యాదవ్,టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్లగొండ జిల్లా టి ఆర్ యస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ తక్కెళ్

30 లక్షల విలువైన మద్యం నిల్వలు పట్టివేత..

  నల్గొండ జిల్లా: గుర్రంపోడు మండలం........ లో రూ. 30  లక్షల విలువైన మద్యం నిల్వలు పట్టివేత.. మొసంగి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున హనుమాన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు మద్యం నిల్వలను పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు

కోవిడ్ బులిటీన్ నేటి పాజిటివ్ కేసులు 2055 - జిల్లాల వివరాలు చూడండి

 కోవిడ్ బులిటీన్ నేటి పాజిటివ్ కేసులు 2055 - జిల్లాల వివరాలు చూడండి

మా నాన్నను వదిలిపెట్టండి....అంకుల్ ప్లీజ్

  మా నాన్నను వదిలిపెట్టండి....అంకుల్ ప్లీజ్..  చత్తీస్ ఘడ్ కాల్పుల ఘటన తర్వాత నక్సలైట్లు రాకేష్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ ని తమ వెంట తీసుకెళ్లారు.  ఈ విషయాన్ని స్వయంగా నక్సల్స్, జర్నలిస్ట్ లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు.  రాకేష్ సింగ్ బతికే ఉన్నాడన్న సంతోషంతోపాటు.. ఆయన నక్సల్స్ దగ్గర బందీగా ఉన్నారన్న వార్త కుటుంబాన్ని కలచి వేసింది.  రాకేష్ సింగ్ కుమార్తె ఏడుస్తూ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

10 శాతం ఈ డబ్ల్యూ యెస్ రిజెర్వేషన్ విజయోత్సవ సభ

    10 శాతం ఈ డబ్ల్యూ యెస్ రిజెర్వేషన్ విజయోత్సవ కార్యక్రమము హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో  జరిగింది.  కేంద్ర  ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ ప్రకటించిిిన రాష్ట్ర ప్రభుత్వం అమలు  చేయకపోవడం తో ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించరు. ఐక్య వేదిక అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్ ఆమరణ దీక్ష చేస్తా నని  ప్రకటన చేయడం, పలు ఓసి సంఘాలు  ఉద్యమాలకు  పూనుకోవడం తో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం అమలుకు నిర్ణయించింది.  రిజర్వేషన్లు అమలుఅవుతున్నందున విజయోత్సవ సభ నిర్వహించారు.  ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది అద్దంకి దయాకర్,   ఆర్యవైశ్య మహాసభ మాజీ  అధ్యక్షులు  సీనియర్ నాయకులు గంజి రాజమౌళి గుప్తా, తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పడకంటి రమేష్ ,  మొగుల్లపల్లి ఉపేందర్ మరియు oc సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గోన్నారు. 

బండి సంజయ్ కుమార్ అరెస్టు

  #బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్టును తీవ్రంగా  పార్టీ ఖండించింది. మంథని నుండి మహబూబాబాద్ బయలుదేరిన ఆయనను భూపాలపల్లి అడవి వద్ద అడ్డుకొని అరెస్టు చేయడం టీఆర్ఎస్ సర్కార్ దుర్మార్గానికి నిదర్శనమని,. ఒక ఎంపీని ఇలా దారుణంగా..* *#అడ్డకోవడమంటే.. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..? బాధల్లో ఉన్న కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్తే అడ్డుకుంటారా అని  పార్టీ  ప్రశ్నిచిందీ.

*టివిని మాయం చేసిన నల్గొండ డిపిఆర్వో*

 *టివిని మాయం చేసిన  నల్గొండ  డిపిఆర్వో* *పై అధికారూలకు ఫిర్యాదు పోవడంతో హడావిడిగా టివిని ఆఫీసులో అమర్చిన  అధికారి* నల్గొండ డిపిఆర్వో కార్యాలయములో  ప్రజలకు, జర్నలిస్టులకు   ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం , వార్తలు   చూడడానికి  సమాచార కేంద్రానికి  ప్రభుత్వం  టివి మంజూరు చేసింది .అట్టి టివి ద్వారా ప్రజలకు, జర్నలిస్టులకు  తాజా సమాచారం చూసేవారు.   అట్టి టివిని   జిల్లా అధికారి  తన ఇంటికి తరలించాడు.  ఈ విషయం పై    హైదరాబాద్ లో ఉన్న పై అధికారులకు  ఫిర్యాదు పోవడంతో   సదరు అధికారి హడావిడిగా  టివి తెచ్చి  ఆఫీస్ లో అమర్చాడని తెలిసింది.  ఈ అధికారి ప్రవర్తన మొదటి నుండి వివాదస్పదంగా ఉంది. గతంలో కూడా ఈ అధికారి ప్రవర్తనపై  పలు జిల్లాల్లో ఫిర్యాదులు వచ్చాయి.  నల్గొండ జిల్లాలో కూడా కార్యాలయ సిబ్బంది  వేధింపులు గురి చేస్తున్నాడని ఈయన పై  జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులు కూడా ఈయన ప్రవర్తనపై మంత్రి జగదీశ్వర్ రెడ్డికి, జిల్లా కలెక్టరు కు ఫిర్యాదు చేశారు. అట్టి ఫిర్యాదుల విచారణ జరగకుండా కొంత మంది  లాబీయింగ్ చేసినట్లు తెలిసింది.   ఇప్పటికైనా పై అధికారులు  విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉద్యోగ