Skip to main content

Posts

Showing posts from August, 2023

జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదు: కప్పర ప్రసాదరావు

  జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదు: కప్పర ప్రసాదరావు కేసిఆర్ ప్రభుత్వం చెప్పేది ఒక్కటి చేసేది మరొక్కటి సునీతమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  హెల్త్ కార్డుల పంపిణీ అందరి జర్నలిస్ట్ లకు ఆరోగ్యం విద్య నివాసం మా లక్ష్యం సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటుచేసిన జిల్లా రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ శివశంకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి న్యూరో ఆసుపత్రి హెల్త్ కార్డులు డా అనీల్ కుమార్ డా శంకర్ డా శివశంకర్ పంపిణీ చేశారు జర్నలిస్టుల కుటుంబీకులకు ఇందులో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు . సమాజానికి ఎంతో మేలు చేసే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేయడం సమాజానికి చేసిన సేవే అని ఈ అవకాశం కల్పించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన పలువురు నాయకులు ప్రభుత్వం జర్నలిస్టుల

వైశ్య గర్జనకు IVF & WAM మద్దతు

  వైశ్య గర్జనకు IVF & WAM మద్దతు నల్గొండ: నల్గొండ వాసవి భవన్  నుండి కార్పొరేషన్ డిమాండ్ తో  బైక్ ర్యాలీ ప్రారంభ  కార్యక్రమంలో  IVF రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాదీనం, WAM గ్లోబల్ ప్రధాన కార్యదర్శి పసుమర్తి మల్లికార్జున్, కోశాధికారి ఎల్వి కుమార్ మాట్లాడుతూ వైశ్యుల కొరకు 7 డిమాండ్లతో అక్టోబర్ 1న వైశ్య వికాస వేదిక అధ్వర్యంలో నిర్వహిస్తున్న వైశ్య గర్జన మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు.  మద్దతు ప్రకటించిన IVF & WAM  లకు వైశ్య వికాస వేదిక అధ్యక్షుడు   కాచం   సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.  కార్పోరేషన్ కోరుతూ ఆర్యవైశ్య సంఘాల  సమాఖ్య అధ్వర్యంలో  నేహృగంజ్, క్లాక్ టవర్, ప్రకాశం బజార్, మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ జరిగింది. కలెక్టరేట్ లో జిల్లా కలక్టర్ కు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం  అందజేశారు.  ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు యమా మురళి, వైశ్య వికాస వేదిక అధ్యక్షుడు  కాచం  సత్యనారాయణ, నల్గొండ పార్లమెంట్ కు గత ఎన్నికల్లో  బీజేపీ తరపున పోటీ చేసిన గార్లపాటి జితేంద్ర కుమార్,  IVF రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాదీనం, WAM గ్లోబల్ ప్రధాన కార్యదర్శి

కేసీఆర్‌ను నియంత్రిస్తున్న ఒవైసీ - అమిత్ షా

  కేసీఆర్‌ను నియంత్రిస్తున్న ఒవైసీ - అమిత్ షా తెలంగాణలోని ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ' రైతు గోస బీజేపీ భరోసా' బహిరంగసభలో కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. అవినీతిలో కూరుకుపోయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో విఫలమైందని విమర్శించారు. అసదుద్దీన్ ఒవైసీ ఇష్టానుసారంగా కేసీఆర్ (కె.చంద్రశేఖర్ రావు) ప్రభుత్వం నడుస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వంశ పారంపర్య పాలన గా రాజకీయ పార్టీలను షా వర్గీకరించారు: కాంగ్రెస్ నాలుగు తరాల ప్రభుత్వం, BRS రెండు తరాల ప్రభుత్వం మరియు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మూడు తరాల పార్టీ పాలనగా ఆయన అభివర్ణించారు. వంశపారంపర్య పాలన, అవినీతి, పేదల వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు రానున్న ఎన్నికలను ఒక అవకాశంగా ఆయన నొక్కి చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు, యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు, దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని షా ఆరోపించారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 'రైతు గోస బ

వైశ్య ద్రోహులుగా మిగలకండి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

 వైశ్య ద్రోహులుగా మిగలకండి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ తేదీ 29 ఆగస్టు 2023 మంగళవారం నాడు నల్లగొండ పట్టణంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన కొరకు ఆర్య వైశ్యులు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ తదనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని ఆర్యవైశ్యులొ ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలకు నిజంగా లబ్ధి చేకూరాలని భావించే ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు మద్దతు పలికి కార్యక్రమం విజయవంతం చేయాలి ఈ కార్యక్రమాన్నికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతుంటే దురదృష్టకరమైన విషయం కొన్ని *వైశ్య సంఘాలు* వ్యతిరేకిస్తున్నాయి అని సమాచారం నిజంగా వైశ్యుల అభ్యున్నతి కొరకు ఏర్పాటు చేసిన సంఘాలు ఏవి కూడా వైశ్య కార్పొరేషన్ కొరకు చేస్తున్న పోరాటాన్ని వ్యతిరేకించరు అలా వ్యతిరేకిస్తున్నారు అంటే వారు *వైశ్య ద్రోహులుగా పరిగణించవచ్చు* . కార్పొరేషన్ పోరాటాలను వ్యతిరేకించే వైశ్య సంఘాలు వారి స్వార్థం కొరకే సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సమాజంలో వారి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కొరకు వైశ్యులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్న వారే అని అనుకోవాలి. కాబట్టి అలాంటి వారి ప్రకటనలను ఎవరు కూడా పట్టించుకోవద్దు ఇప్పటికే సమాజంలో వైశ్యులలో

కౌటికె విఠల్కు అరుదైన గౌరవం

  కౌటికె విఠల్కు అరుదైన గౌరవం - ఫ్లాగ్ ఫుట్బాల్ ఇండియన్ టీంకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక హైదరాబాద్ వాస్తవ్యులు LIC లో No 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్సు అడ్వైసర్ అయిన కౌటికె విఠల్కు అరుదైన గౌరవం లభించింది. అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తున్న ఫ్లాగ్ ఫుట్బాల్ టీమిండియా కు ఆయన బ్రాండ్ అంబాసిడర్ నియమితులయ్యారని అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ డాక్టర్ సందీప్ చౌదరి వెల్లడించారు. విఠల్ ఈ నెల 20న నగరంలో జరగనున్న నేషనల్ చాంపియనపు చీఫ్ గెస్ట్ గా హాజరవుతారు. మలేషియాలో ఈ ఏడాది అక్టోబర్ 23 నుంచిజరగనున్న ఆసియన్ చాంపియన్ షిప్లో ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ టీంకు ప్రత్యేక అతిథిగా, బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారు. - నెదర్లాండ్స్ ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మాసాల్లో జరగనున్న అంతర్జాతీయ చాంపియన్షిప్లో ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ టీంకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆయన ఇటీవల నియామక పత్రాన్ని అందుకున్నారు.

దళితబందు, మైనార్టీ బందు బీసీ బందు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా

 దళితబందు, మైనార్టీ బందు బీసీ బందు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా  నల్గొండ (గూడచారి ప్రతినిధి) :   ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబందు, మైనార్టీ బందు బీసీ బందు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ *నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం జరిగినది . ఇట్టి కార్యక్రమంలో అడ్వకేట్ మరియు నల్గొండ పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య   

ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు - యమా దయాకర్

ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు - యమా దయాకర్   నల్గొండ : (గూడచారి ప్రతినిధి) : భారత స్వాతంత్ర్య దినోత్సవము తేదీ 15.08.2023 మంగళవారం రోజున భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో( శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం ప్రక్కన.రామగిరి) ఉదయం గం.10.00 లకు జిల్లా అధ్యక్షులు వనమా వేంకటేశ్వర్లు చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ మహోత్సవం జరుప బడునని ప్రధాన కార్యదర్శి యమా దయాకర్ తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ మండల,పట్టణ, జిల్లా నాయకులు బాధ్యులు అందరిని ఆహ్వానించారు.

కార్పొరేషన్ సాధనకు లక్ష మందితో వైశ్య గర్జన

 కార్పొరేషన్ సాధనకు లక్ష మందితో వైశ్య గర్జన   హనంకొండ(గూఢచారి ప్రతినిధి) అవోపా భవనంలో వైశ్యులు -ఆత్మగౌరవం అనే అంశంపై వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో హక్కుల సాధన చర్చాగోష్టి సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కాచం సత్యనారాయణ మాట్లాడుతూ గత రెండు ఎన్నికలలో మేనిఫెస్టోలో ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఇంతవరకు ఇంతవరకు అమలు చేయలేదు వెంటనే కార్పొరేషన్ తో పాటు వైశ్య కమిషన్, పేద విద్యార్థులకు విదేశీ విద్యా నిధి, ఈ డబ్ల్యూ ఎస్ పథకంలో దామాషా ప్రకారం రిజర్వేషన్లు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం ఐదు ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు, మరియు అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వైశ్య బంధు లాంటి పథకాలు అమలు చేయాలని 7డిమాండ్లతో కూడిన తీర్మాన పత్రాన్ని మరియు అక్టోబర్ ఒకటో తేదీ హైదరాబాదులో లక్ష మందితో నిర్వహించబోయే వైశ్య గర్జన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ వేదిక ఉద్దేశించి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ మాట్లాడుతూ మా సంస్థ కూడా గత 11 సంవత్సరాల లో రాస్తారోకోలు అసెంబ్లీ ముట్టడి పాదయాత్రలు వంటి క

సమస్యలపై పాట ద్వారా ఆట ద్వారా ప్రజానాట్యమండలి ప్రజల చైతన్యమే ధ్యేయంగా పనిచేస్తుంది

  సమస్యలపై పాట ద్వారా ఆట ద్వారా ప్రజానాట్యమండలి ప్రజల చైతన్యమే ధ్యేయంగా పనిచేస్తుంది  ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు నల్లగొండ దొడ్డి కొమురయ్య భవన్లో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ* మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పాట ద్వారా ఆట ద్వారా ప్రజానాట్యమండలి ప్రజల చైతన్యమే ధ్యేయంగా పనిచేస్తూ నాటి చదువు వెలుగు సాక్షరతా ఉద్యమం మొదలుకొని నేటి మూఢనమ్మకాలు నీరు పారిశుధ్యం ఎయిడ్స్ అనేక రకాల కళారూపాలు పాటలన్నీ తయారుచేసి ప్రజల చైతన్యం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాల వ్యాప్తంగా 5000 మంది కళాకారులకు శిక్షణ శిబిరాలు పెట్టి కళాకారుల తయారుచేసిందని ప్రజానాట్యమండలి కళకళ కోసం కాదు కల ప్రజల కోసం ప్రజల చైతన్యం కోసమని ఆయన అన్నారు పల్లె సుద్దులు ఒగ్గు కథ డోలు డప్పు వివిధ కళారూపాలు తయారు చేసింది ఒక సంస్కృతిక ఉద్యమాన్ని నడిపింది ప్రజానాట్యమండలి కొని ఆడారు ఆ సందర్భంలోనే ప్రజానాట్యమండలి 80 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబోతున్నట్టు దానికి కళాకారులు కళాభిమానులు మేధావులు ప

15న నల్గొండ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం - ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ కర్నాటి నగేష్

  ఈ నెల 15న నల్గొండ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం - ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ కర్నాటి నగేష్ నల్గొండ, ఆగస్టు 11,  (గూడచారి ప్రతినిధి) నల్గొండ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 15న  స్థానిక చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జర్గుతున్నదని ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ కర్నాటి నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి  రాష్ట్ర అధ్యక్షులు  ఉప్పల శ్రీనివాస్, ముఖ్య అతిథులుగా చైర్మన్, తెలంగాణ శాసనమండలి గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లగొండ శాసనసభ్యులు  కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గార్లు పాల్గొంటారని, అయన తెలిపారు. నూతన జిల్లా అధ్యక్షుడుగా రేపాల భద్రాద్రి, ప్రధాన కార్యదర్శి గా నూనె కిషోర్, కోశాధికారి గా  గోవిందు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు గా తేలుకుంట్ల శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శివగా గౌరు శ్రీనాథ్, జిల్లా కోశాధికారి గా మిర్యాల మహేష్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షరాలుగా కొమిరిశెట్టి రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వందనపు జ్యోతి, జిల్లా కోశాధికారిగా వనమా శ్రీదేవి గార్లు  ప్రమాణ స్వీకారం చ

ప్రారంభానికి సిద్దమైన సైకిల్ ట్రాక్...

  సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభానికి సిద్దమైన సైకిల్ ట్రాక్... 23 కిలోమీటర్ల దూరం సోలార్ రూఫ్ తో ఏర్పాటు చేయబడ్డ ఈ సైకిల్ ట్రాక్... నానక్ రాం గూడ నుండి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు... కొల్లూర్ నుండి నార్సింగి వరకు 14.5 కిలోమీటర్లు...

అక్టోబర్‌ 1వ తేదీన హైదరాబాద్‌లో వైశ్యగర్జన

అక్టోబర్‌ 1వ తేదీన హైదరాబాద్‌లో వైశ్యగర్జన వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ హైదరాబాద్, (గూడచారి ప్రతినిధి) : తెలంగాణలో తక్షణం వైశ్యకమిషన్‌ను ఏర్పాటు చేయాలని వైశ్య వికాస వేదిక ప్రభుత్వాన్ని కోరింది. వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకోసం వైశ్య వికాస వేదిక చైర్మన్‌ డా.కాచంసత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 1వ తేదీన హైదరాబాద్‌లో వైశ్యగర్జన నిర్వహించనున్నట్లు  వైశ్య వికాస వేదిక చైర్మన్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి పలు డిమాండ్లను విన్నవించారు. ముఖ్యంగా ewsలో వర్గీకరణ తేవాలని వైశ్యకార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. విదేశీవిద్య సహాయనిధిని ఏర్పాటుచేసి వైశ్య విద్యార్థులకు తోడ్పాటు అందించాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయాలలో వాటా కల్పించాలని వైశ్యబంధు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర కుటుంబసర్వే నివేదికలోని అగ్రవర్ణాల వివరాలు, జనసంఖ్య, గణాంకాలు ప్రకటించాలని కోరారు.  

వైశ్య కార్పొరేషన్ విషయంలో ఏం జరుగుతుంది...?, రాష్ట్రస్థాయి సంస్థలు లేకుండా జేఏసీ ఏ విధంగా ఆవిర్భవించింది? - బల్లు చంద్రప్రకాష్ గుప్త

వైశ్య కార్పొరేషన్ విషయంలో ఏం జరుగుతుంది...?, రాష్ట్రస్థాయి సంస్థలు లేకుండా జేఏసీ ఏ విధంగా ఆవిర్భవించింది? - బల్లు చంద్రప్రకాష్ గుప్త సోషల్ మీడియా పోస్ట్ యదావిదంగా వైశ్య సోదరులందరికీ విజ్ఞప్తి ****************** తెలంగాణలోని యావత్ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా వైశ్య కార్పొరేషన్...రాజకీయ అభివృద్ధి పై గమనించాల్సిన సమయం ఆసన్నమైనది. అసలు తెలంగాణ రాష్ట్రంలో వైశ్య కార్పొరేషన్ విషయంలో ఏం జరుగుతుంది...?, అన్న అంశంపై నిరుపేద వైశ్య సమాజం సర్వత్ర ఆసక్తి కనబరుస్తున్నారు. "ఎవరికి వారే యమునా తీరే" అన్న చందంగా వైశ్య కార్పొరేషన్ విషయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైశ్య కార్పొరేషన్ సాధించాలన్న ఉద్దేశంతో అనేక రాష్ట్రస్థాయి సంస్థలు అనేక విధాల, రకరకాల కార్యాచరణ కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతున్న విషయం విధితమే... ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గౌరిశెట్టి మునిందర్ అధ్యక్షులుగా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆవిర్భవించిందని ఇటీవల ప్రకటించారు. అయితే ఈ (జేఏసీ)లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం, తె

ఆల్ ఇండియా CLIA ఛైర్మన్ *కౌటికె విఠల్* కి సన్మానం

  ఆల్ ఇండియా CLIA ఛైర్మన్ *కౌటికె విఠల్* కి సన్మానం సికింద్రాబాద్ డివిజన్ సౌత్ సెంట్రల్ జోన్ పరిధిలోని నిజామాబాద్ బ్రాంచ్‌లో, CLIA డెవలప్‌మెంట్ కమిటీకి ఇటీవల నామినేట్ చేయబడిన ఆల్ ఇండియా ఛైర్మన్ *కౌటికె విఠల్* కి నిజామాబాద్ జిల్లా భారతీయ జీవిత భీమా ఎజెంట్ల సంఘం సన్మాన కార్యక్రమం నిర్వహించింది, వీరు దేశం లోనే టాప్ CLIA. ఈ సందర్భంగా ఆల్ ఇండియా CLIA చైర్మన్ *కౌటికె విఠల్* ఆధ్వర్యంలో సెల్లింగ్ టెక్నిక్స్ మరియు CLIA అడ్వాంటేజ్‌లపై విద్యా సదస్సు నిర్వహించారు. 150 మంది ఏజెంట్లు పాల్గొని లబ్ధి పొందారు. 1 to 1 ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించబడింది, అది కూడా సూపర్ సక్సెస్ అయింది. సికింద్రాబాద్ డివిజనల్ కౌన్సిల్ అధ్యక్షులు పోతుల రామ స్వామి, సెక్రటరీ దొంతినేని సునీల్ కుమార్, డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ అల్లోల శ్రీనివాస్ రెడ్డి, డివిజనల్ లీగల్ ఛైర్మన్ బిల్లా మహేష్, డివిజనల్ కో ఛైర్మన్ గంగా రెడ్డి Bodhan branch, నిజామాబాద్ శాఖలోని ఇతర డివిజనల్ నాయకులు, చీఫ్ మేనేజర్ యుగంధర్, SO మేనేజర్ శంకర్ CLIA మేనేజర్ శ్రీ వినోద్ గారుల పాల్గొని ఏజెంట్లను ఆర్థికముగా అభివృద్ధి కావడానికి ప్రోత్సహించారు. ఈ సందర్

*జాగో వైశ్య జాగో లేవండి..* ఈ నెల 12న హనుమకొండ లో చర్చా గోష్టి

*జాగో వైశ్య జాగో లేవండి..* ఈ నెల 12న హనుమకొండ లో చర్చా గోష్టి హనుమకొండ (గూడచారి న్యూస్) : తెలంగాణా లో వైశ్యులకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల సాధనకు నడుము బిగించి సమైక్య పోరాటాలకు సిద్ధం కండి పిలుపు నిస్తూ ఈ నెల 12న హనుమకొండ లోని అవోపా భవన్ లో వరంగల్ హనుమకొండ జిల్లా వైశ్యులు చర్చా గోష్టి నిర్వహిస్తున్నారు. లొకేషన్ లింక్ https://maps.app.goo.gl/k4jch7kLufRxNYTp7?g_st=iw వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్, తెలంగాణ సాధన ఉద్యమకారుడు డా|| కాచం సత్యనారాయణ* గారి ఆధ్వర్యంలో వైశ్యుల అన్ని రకాల సమస్యల పరిస్కారానికి *వైశ్య కమీషన్ ఏర్పాటు* *వైశ్యుల ఆర్థికాభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు* *EWS అమలులో వర్గీకరణ,జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాధాన్యం* *వైశ్య విద్యార్థుల ఉన్నత విద్యల కోసం విదేశీ విద్యా నిధి ఏర్పాటు* *వైశ్య బంధు అమలు* *వైశ్య జనాభా గణన వారి స్థితిగతుల పై సర్వే* తదితర అంశాలపై పోరాటం చేసేందుకు తొలిసారిగా హైదరాబాద్ లో *వైశ్యుల ఆత్మ గౌరవం - హక్కుల సాధన* అనే నినాదంతో చర్చా ఘోష్టి మేధోమధనం నిర్వహించి, దీనిని విస్తృతం చేయడానికి జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయికి తీసుకుపోవాలని నిర్ణంచారని వారు

*ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఈనెల 14న సూర్యాపేటలో బైక్ ర్యాలీ*

  *ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో  ఈనెల 14న సూర్యాపేటలో బైక్ ర్యాలీ* *ఆర్యవైశ్యులంతా కదిలి రావాలి* ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దిశగా ఆర్యవైశ్యులందరూ ఏకం కావాలని జిల్లా ఆర్యవైశ్య సంఘo మాజీ అధ్యక్షులు కర్నాటి కిషన్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల లో ఉన్న పేదలు ఆర్థికంగా స్థిరపడాలంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారానే అది సాధ్యమన్నారు. పార్టీల కతీతంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా సైనికుల వలె పని చేయాలన్నారు. ఈనెల 14న జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి బైకు ర్యాలీ నిర్వహిస్తున్నందున ఆర్యవైశ్యులందరూ అధిక సంఖ్యలో పాల్గొని రాజకీయంగా మనకు రావలసిన వాటాను పొందే దిశగా సంఘటితమై మన సత్తా చాటాలన్నారు. కే సి గుప్తా విగ్రహానికి నివాళులు అర్పించి కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా నుండి ఎంజీ రోడ్డు లోని గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి మహాత్మా గాంధీ విగ్రహానికి

వైశ్య కార్పోరేషన్ కోసం కదం తొక్కిన కోదాడ మన ఆర్యవైశ్య సంఘం, అవోప

 వైశ్య కార్పోరేషన్ కోసం కదం తొక్కిన కోదాడ మన ఆర్యవైశ్య సంఘం, అవోప

త్వరలో వైశ్య గర్జన - *హక్కుల సాధనే ఆత్మగౌరవ మార్గం*

 త్వరలో వైశ్య గర్జన - *హక్కుల సాధనే ఆత్మగౌరవ మార్గం*  నల్లగొండ: వైశ్యుల్లో చైతన్యం పెంపొందించడానికి :వైశ్యులు- ఆత్మగౌరవం.: హక్కుల సాధన" పై నల్గొండ జిల్లా కేంద్రంలో చర్చ గోష్టి నిర్వహించారు. ఈ చర్చ గోష్టి లో పాల్గొన్న పలువురు వైశ్య అడ్వకేట్లు, టీచర్లు, మీడియా పర్సన్స్, వ్యాపారులు వైశ్యులు తమ హక్కులు సాధించుకొని ఆత్మగౌరవంతో తలెత్తుకొని మనుగడ సాగించాలంటే రాజ్యాధికారంలో తమ వంతు వాటా సాధించుకోవడం ఒక్కటే మార్గం అని అన్నారు. త్వరలో వైశ్య గర్జన నిర్వహించనున్నమని తెలిపారు. హైదరాబాదులో వైశ్య విద్యావంతులు మేధావుల తో జరిపిన చర్చలు, మేధో మధనాల ఫలితంగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ఉద్యమాల జిల్లా నల్లగొండ జిల్లా నుంచే మొదలు పెడుతున్నామని తెలిపారు. వైశ్యులు ఆత్మగౌరవం హక్కుల సాధన పై వైశ్య వికాస వేదిక ప్రచురించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  బిజెపి సీనియర్ నాయకులు ఓరుగంటి రాములు, వైశ్య వికాస వేదిక అధ్యక్షులు కాచం సత్యనారాయణ, గార్లపాటి జితేంద్ర కుమార్, సీనియర్ జర్నలిస్టులు కోటగిరి దైవాదీనం తదితరులు పాల

అస్తమించిన పొడుస్తున్న పొద్దు (గద్దరన్న గుమ్మడి విఠల్ రావు) కు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఘణ నివాలి.

 #అస్తమించిన_పొడుస్తున్న_పొద్దు# తెలంగాణా ఉద్యమంలో కీలకంగా మారిన పాట పొడుస్తున్న పొద్దు.... పాట పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసి పడేలా చేసినా #ప్రజాయుద్ద_నౌక_గద్దర్# అస్తమించారు.  తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం గుర్తిండిపోయే ఆయన పాటకు మరణం లేదు. నిత్యం పాటల తూటాతో ప్రజలను చైతన్య పరుస్తూ ఆఖరి నిమిషం వరకు ప్రజల కోరకు ప్రభుత్వము పై పోరాటం చేసి అస్తమించిన పొడుస్తున్న పొద్దు (గద్దరన్న గుమ్మడి విఠల్ రావు) కు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఘణ నివాలి.   గద్దరన్న జీవితం మొత్తం ముళ్ళ బాటే గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ లో జన్మించిన ఆయన ఉన్నత విద్య అభ్యసించిన ఆయన నక్సలిజానికి ప్రభావితం అయి నక్సలైట్ ఉద్యమంలో చేరి చురుకుగా పనిచేశారు.  పోలీసుల అరెస్ట్ తర్వాత ప్రజా ఉద్యమాల ద్వారా సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో గద్దర్ పై కాల్పులు జరిగాయి అయిన బ్రతికి బయట పడ్డ గద్దర్ తనపై కాల్పులు జరిపినా దుండగులను అరెస్టు చేయాలంటూ న్యాయ పోరాటం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అనేక మార్లు కాల్పులు జరిపిన వారిని శిక్షించాలంటూ ఆఖరి నిమిషం వరకు న్యాయం చేయాలంటూ వ

ఎంటెక్ పట్టా పొందిన కప్పర సంస్కృతి

  ఎంటెక్ పట్టా పొందిన కప్పర సంస్కృతి హైదరాబాద్ : మహేంద్ర యూనివర్సిటీలో ఎంటెక్ విద్యార్థుల పట్టా ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎంటెక్ పట్టా స్వీకరించిన కప్పర సంస్కృతి. విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే అన్నిటికంటే ముందు ఇగో ను వదిలి పెట్టాలని జిఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు ఉద్భోదించారు. మహేంద్ర యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎంటెక్ విద్యార్థులు పట్టా ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యి ప్రసంగించారు. ఎంటెక్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు ఆయన పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీల అధిపతి, మహేంద్ర యూనివర్సిటీఛాన్స్ లర్ ఆనంద్ మహేంద్ర మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ చూపి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకురావాలని సూచించారు. ఎంటెక్ లో ప్రతిభ కనబరిచిన కప్పర సంస్కృతికి ఆయన చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేసి అభినందించారు.

జాగో వైశ్య జాగో లేవండి - న్యాయమైన హక్కుల సాధనకు నడుము బిగించి సమైక్య పోరాటాలకు సిద్ధం కండి.

  జాగో వైశ్య జాగో లేవండి - న్యాయమైన హక్కుల సాధనకు నడుము బిగించి సమైక్య పోరాటాలకు సిద్ధం కండి. తెలంగాణా లో వైశ్యులకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల సాధనకు నడుము బిగించి సమైక్య పోరాటాలకు సిద్ధం కండి. వైశ్యులారా, వాసవి మాత బిడ్డలారా వైస్యులకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే నాయకుడు కరువయ్యారు. అందుకే వైశ్య వికాస వేదిక చైర్మన్, తెలంగాణ సాధన ఉద్యమకారుడు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో వైస్యుల అన్ని రకాల సమస్యల పరిస్కారనికి వైశ్య కమీషన్ ఏర్పాటు పేద ఆర్య వైశ్యుల ఆర్థికాభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు, EWS అమలులో వర్గీకరణ,జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాధాన్యం, పేద వైశ్య విద్యార్థుల ఉన్నత విద్యల కోసం విదేశీ విద్యా నిధి ఏర్పాటు, వైశ్య బంధు అమలు, వైశ్య జనాభా గణన వారి స్థితిగతుల పై సర్వే తదితర అంశాలపై పోరాటం చేసేందుకు తొలిసారిగా హైదరాబాద్ లో వైష్యుల ఆత్మ గౌరవారం - హక్కుల సాధన అనే నినాదంత చర్చ ఘోష్టి మేధోమధనం నిర్వహించి దీనిని విస్తృతం చేయడానికి జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయికి తీసుకుపోవాలని నిర్ణంచారు. అందులో భాగంగా తొలి సమావేశాన్ని ఆదివారం నాడు అనగా ఆగస్ట్ 6వ తేదీ ఉదయం 10-00 గంటల

వైద్య ఆరోగ్య శాఖ, ఐ.సి.డి.ఎస్.సిబ్బంది కలిసి సమన్వయంతో పని చేయాలి - జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్

వైద్య ఆరోగ్య శాఖ, ఐ.సి.డి.ఎస్.సిబ్బంది కలిసి సమన్వయంతో పని చేయాలి - జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ *డెంగ్యూ,సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణ కు చర్యలు తీసుకోవాలి:జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్* # వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ లు, ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.లు సూపర్ వైజర్ లతో సమీక్షించిన కలెక్టర్# నల్గొండ, dt 4.8.23 వైద్య ఆరోగ్య శాఖ, ఐ .సి.డి.ఎస్.సిబ్బంది సి.డి.పి. ఓ.లు,సూపర్ వైజర్ లు,అంగన్ వాడి టీచర్ లు,వర్కర్ లు,.హెచ్.సి. డాక్టర్ లు,సిబ్బంది సమన్వయం తో పని చేయాలని అన్నారు. పి.హెచ్.సి.డాక్టర్ లు,సిబ్బంది సమర్త్వంతంగా పనిచేస్తూ వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉదయా దిత్య భవన్ లో వైద్య ఆరోగ్య శాఖ పి.హెచ్.సి డాక్టర్ లు, అంగన్ వాడి సి.డి.పి. ఓ.లు,సూపర్వైజర్ లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డెంగ్యూ కేసులు గురించి తెలుసుకున్నారు.డెంగ్యూ వచ్చిన వెంటనే వారికి చికిత్స అందించడమే కాక డెంగ్యూ కేస్ వచ్చిన ఇంటి పరిసరాల లోని 100 గృహాల వరకు డెంగ్యూ నివారణ,దోమల లార్వా నియంత్రణకు అంటి లార్వా ఆపరేషన్ స్ప్రేయింగ్,ఫాగింగ్,నీటి నిల్వ లేక

*ఆగస్ట్ 15 న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి:అర్.వి.కర్ణన్*

  *ఆగస్ట్ 15 న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి:అర్.వి.కర్ణన్* నల్గొండ,ఆగస్ట్3  ఆగస్ట్ 15 న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అర్.వి. కర్ణన్ అన్నారు.గురు వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వేదిక,వి. ఐ.పి.లు,అధికారులు,మీడియా,ఇతరులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. పరేడ్ మైదానంలో త్రాగు నీరు,పారిశుధ్య ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.ముఖ్య అతిధి సందేశం రూపొందించేందుకు ఆయా శాఖలు సాధించిన ప్రగతి నివేదికలు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి పంపించాలని అన్నారు.అటవీ,వ్యవసాయ,ఉద్యాన,జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ,గ్రామీణ నీటి పారుదల శాఖ,పశు సంవర్తక శాఖ,విద్యా శాఖ, ఐ.సి.డి.ఎస్,పరిశ్రమల శాఖలు శకటాలు,ఎస్.సి.,ఎస్.టి.,బి.సి.,గిరిజన,మైనార్టీ సంక్షేమ శాఖలు,అటవీ,సాగు నీటి పారుదల శాఖ,అర్&బి ఆయా