Skip to main content

Posts

**2వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కోర్టు బెంచ్ క్లర్క్**

2వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కోర్టు బెంచ్ క్లర్క్ హైదరాబాద్: కుకత్‌పల్లిలోని 9 వ ఎఎమ్‌ఎం కోర్టుకు చెందిన బెంచ్ క్లర్క్ ఎ శ్రీనివాసులు అనే వ్యక్తిని అవినీతి నిరోధక బ్యూరో (ఎసిబి) అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారికంగా సహాయం చేయడానికి ఫిర్యాదుదారుడి నుండి రూ .2,000 లంచం తీసుకుంటున్నప్పుడు అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బెయిల్ పిటిషన్లను న్యాయమూర్తి ముందు ఉంచడానికి లంచం కోరినట్లు ఫిర్యాదుదారు ఎస్ శివ కుమార్ ఎసిబికి ఫిర్యాదు చేసినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ఫిర్యాదు అందిన తరువాత, అధికారులు నిందితుడిని తన కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఎస్‌పిఇ, ఎసిబి కేసుల  ప్రత్యేక న్యాయమూర్తి ముందు శనివారం హాజరుపరిచారు.

**_గడ్డ పలుగుతో మామను హత్య చేసిన అల్లుడు_ **

_కృష్ణాజిల్లా :_ _జగ్గయ్యపేట పట్టణం ధనంబోడు కాలనీలో దారుణం._  _గడ్డ పలుగుతో మామను హత్య చేసిన అల్లుడు_  _కూతుర్ని కొడుతున్న మామపై తిరగబడి రాడ్ తో బలంగా కొట్టటంతో వృద్ధుడు మృతి._  _మృతుడు పేరేర విజయ్ కుమార్ (58)._  _నిందితుడు అల్లుడు బేరంగుల వెంకటేశ్వర్లు లారీ డ్రైవర్._ _అల్లుడు, కూతురు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయారు._ _పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు._ 

**'ఆపరేషన్ అతిరహస్య':* *

*'ఆపరేషన్ అతిరహస్య':*   *రాజకీయాల్లోను, యుద్ధరంగంలోను* *ఎత్తుగడలు,* *వ్యూహాలు ప్రతివ్యూహాలు* *అనూహ్యంగానే ఉంటాయి* *ఉండాలి కూడా...*  *అని చాణక్యుడు* *ఎప్పుడో చెప్పాడు*  . కానీ దానిలో అతిరహస్యం అన్నదే కీలక పాత్ర పోషిస్తోంది. చేసేది మంచికైనా, చెడుకైనా  గోప్యతను  పాటిస్తే అంత ఫలితం ఉంటుంది. సరిగ్గా మహారాష్ట్ర విషయంలో అదే జరిగింది. ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఉదయం 8 గంటలు  దాటాక ప్రమాణ స్వీకారం ప్రారంభం అయ్యాక మాత్రమే మొత్తం స్థానిక, జాతీయ మీడియాకి ఈ సమాచారం బయటకు పొక్కింది. అంతవరకు ఎవరికీ నామమాత్రంగా కూడా ఈ హఠాత్పరిణామం గురించి తెలియక పోవడం ఇక్కడ ముఖ్య అంశాం. సాధారణంగా తెల్లవారు 3 గంటల వరకు పత్రికలకు వార్తలు ప్రచురించడానికి డెడ్ లైన్ ఉంటుంది. ఆ లోపు ఒక వేళ  సంచలన వార్త చిన్నపాటి ఆధారం అందినా చిన్న స్పేస్ లోనైనా ప్రచురించడం అనేక సందర్భాల్లో చూసాం. కాని మహారాష్ట్ర పరిణామం విషయంలో మాత్రం మీడియా కి కనీసం ఉప్పు కూడా అందలేదంటే ప్రణాళిక ఎంత పగడ్బందీగా జరిగిందో అర్థం అవుతుంది. పెద్ద పత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి తో పాటు ఆంగ్ల ప్రత్రికలు, ఇతర మీడియా అంతా ఉదయాన్నే పతాక శ

పోలీసుల పేరుతో ప్రజలను మోసాగిస్తూ, డబ్బులు వసూలు చేస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేసిన కోరుట్ల పోలీసులు

జగిత్యాల జిల్లా పోలీసుల పేరుతో ప్రజలను మోసాగిస్తూ, డబ్బులు వసూలు చేస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేసిన కోరుట్ల పోలీసులు..

**సంస్కృతి పాఠశాలలో  Yellow colour day**

నల్లగొండ పట్టణంలోని స్థానిక దేవరకొండ రోడ్డు లో గల శ్రీ సంస్కృతి పాఠశాలలో ఈరోజు  Yellow colour day Celebrations .. ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవహర్త చర్లపల్లి గణేష్ మాట్లాడుతూ ప్రతి శనివారం ఒక కలర్స్ డే నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎల్లో కలర్ డే ని నిర్వహించామని అలాగే కలర్స్ డే చేయడం వలన విద్యార్థులకు ఆ కలర్స్ మీద అవగాహన పెరగడంతోపాటు ఆ కలర్ యొక్క ప్రాముఖ్యత అర్థం అవుతుందని అన్నారు.. ఇందుకు సహకరించిన పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ... చిన్నారులు అందరూ ఎల్లో కలర్  డ్రెస్ లో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అలాగే వారు ధర్మకోల్ తయారుచేసిన వివిధ రకాల ఫ్లవర్స్ ఫ్రూట్స్ ప్రదర్శించడం.. చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్   గుంజ . అలివేలు, విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

***Biodiversity flyover* పై నుండి పడిన కారు. **

*Biodiversity flyover* పై నుండి పడిన కారు.  కారు లో ముగ్గురు వ్యక్తులు.  కింద ముగ్గురు వ్యక్తులు మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రమాదంలో గాయాలు.  వారంలో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ మీద ఇది రెఙడో ప్రమాదం

**చదువుల తల్లికి చెప్పుకోలేని కష్టం - నిరుపేద కుటుంబానికి శరాఘాతం**

చదువుల తల్లికి చెప్పుకోలేని కష్టం - నిరుపేద కుటుంబానికి శరాఘాతం - 19యేళ్ల చిన్నారికి డయాలసిస్‌ - కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తప్పదంటున్న వైద్యులు - దాతల కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు  చదువులో ఎంతో చురుగ్గా ఉండే ఆ అమ్మాయిని మాయదారి జబ్బు పట్టి పీడిస్తోంది. పోటీ పరీక్షల్లో బీఎస్సీ నర్సింగ్‌లో ఫ్రీ సీటు సంపాదించిన ఆ చిన్నారి రోజూ కాలేజీకి వెళ్లి పాఠాలు నేర్చుకోవడం లేదు. రెండు రోజులకోసారి ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్‌ చేయించుకుంటోంది. రెండు కిడ్నీలు ఫెయిలై నరకయాతన అనుభవిస్తోంది. పందొమ్మిదేళ్ల చిరు ప్రాయంలోనే వయసుకు మించిన బాధను, మానసిక వేదనను అనుభవిస్తోంది. హైదరాబాద్‌ సనత్‌నగర్‌ ప్రాంతంలో నివసించే గోపగాని మేఘన (19)కు ఇటీవల తీవ్ర అనారోగ్యం కలగడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. అయితే.. వైద్యులు రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయని చెప్పడంతో తల్లిదండ్రుల గుండె పగిలింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిన్నారి తీవ్రమైన మనోవేదనకు గురయ్యింది. తరోజూ కాలేజీకి కాకుండా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుండటంతో కన్నీరుమున్నీరవుతోంది.  మేఘన తండ్రి సత్యనారాయణ అమీర్‌పేట్‌లోని ఓ షాపులో పనిచేస్తున్నాడు. సత్యనారాయణక

**ఈజిప్టులో తెలుగు యువకుడికి ఉరిశిక్ష**

. *ఈజిప్టులో తెలుగు యువకుడికి ఉరిశిక్ష* క్షేమంగా దేశానికి రప్పించండి.. విదేశాంగ శాఖమంత్రిని కోరిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు  శ్రీకాకుళం రూరల్‌ మండలం చంద్రయ్యపేటకు చెందిన బగ్గు రమణ అనే వ్యక్తికి ఈజిప్ట్‌ న్యాయస్థానంలో మరణ శిక్ష పడింది. ఆయన పనిచేస్తున్న షిప్‌లో మాదకద్రవ్యాలు లభించడమే ఇందుకు కారణం. 2016 డిసెంబరు 18న ఆయన ఈజిప్ట్‌ పోలీసులకు పట్టుబడగా ఇటీవలే విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటర్‌ చదువుకున్న రమణ విశాఖలోని ఎస్‌కేడీ కంపెనీకి చెందిన వర్మ అనే ఏజెంట్‌ ద్వారా విదేశాల్లో సీమెన్‌గా పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఇందుకుగాను రూ.4 లక్ష లు చెల్లించాడు. 2016 సెప్టెంబరులో ముంబాయి నుంచి ఇరాన్‌కు విమానంలో వెళ్లాడు. అక్కడ ఏజెంట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అబ్బాన్‌ సిరదౌసీ కంపెనీకి చెందిన షిప్‌లో సీమెన్‌గా చేరాడు. సంబంధిత షిప్‌ ఈజిప్ట్‌ జలాల్లోకి ప్రవేశించగా.. అక్కడి పోలీసులు తనిఖీ చేయగా నిషేధిత మాదక ద్రవ్యాలు దొరికాయి. ఈ కేసులో రమణను అరెస్ట్‌ చేయగా అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించినట్టు తెలిసింది. కాగా రమణ విదేశాలకు వెళ్లిన నాటి నుంచి ఆయన ఆచూకీ లే

** అమరావతి గుర్తిస్తూ కొత్త మ్యాప్ రిలీజ్ చేసిన కేంద్ర హోమ్ శాఖ**

ఏపీ రాజధాని గా అమరావతి ఎట్టకేలకు గుర్తిస్తూ కొత్త మ్యాప్ రిలీజ్ చేసిన కేంద్ర హోమ్ శాఖ.

***పోలీసుల విస్తృత తనిఖీలు**

*తాడేపల్లి స్క్రోలింగ్* *పోలీసుల విస్తృత తనిఖీలు* హోటళ్లు, అపార్ట్ మెంట్లు లక్ష్యంగా తనిఖీలు. *కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలింపు...* *గుంటూరుజిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు...* ఆన్ లైన్లో  హోటల్స్ తీసుకుని అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించిన పోలీసులు.... *అదుపులోకి తీసుకున్న వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపిన పోలీసులు*