Skip to main content

Posts

ఉప్పల ఫౌండేషన్ భోజన వితరణ మలక్ పెట్,  అల్కపురి, చైతన్య పురి, కొత్తపేట,  సీతాఫల్ మండిల లో

ఉప్పల ఫౌండేషన్ భోజన వితరణ మాలక్ పెట్,  అల్కపురి, చైతన్య పురి, కొత్తపేట,  సీతాఫల్ మండిల లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఉప్పల ఫౌండేషన్ తరపున లాక్ డౌన్ విధించిన నాటినుండి ప్రతీరోజూ ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ మలక్ పేట గంజ్ హైదరాబాద్ మార్కెట్ లో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చీదర రాధగారి కోరిక మేరకు హమాలీలకు, డ్రైవర్లు, క్లీనర్లు శానిటర సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి భోజనం ఏర్పాటు చేసారు. అలాగే అల్కపురి, చైతన్య పురి, కొత్తపేట, సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి ప్రాంతాల్లో గల వలస కార్మికులకు, జీహెచ్ఎంసీ పరిధిలోని కూలీలకు, విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, జీహెచ్ఎంసీ సిబ్బందికి, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భోజనాన్ని అందించారు. ముఖ్యంగా నా అనేవారు లేని అభాగ్యులకు, తల్లితండ్రిలేక అనాధాశ్రమాల్లో ఉంటున్న చిన్న బిడ్డలకు వయసు పైబడి ఓల్డేజ్ హోంలలో ఉంటున్న పెద్దవారికి ఉప్పల ఫౌండేషన్ తరపున ఆకలి తీర్చుతున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకూ వనస్థలిపురంలోని కరుణ జ్యోతి ట్రస్ట్ కు, నాగోల్ లోని

సూర్యాపేటపై దృష్టిసారించండి- అధికారులకు జగదీశ్‌రెడ్డి ఆదేశాలు

సూర్యాపేటపై దృష్టిసారించండి- అధికారులకు జగదీశ్‌రెడ్డి ఆదేశాలు హైదరాబాద్‌: కనా కల్లోలంతో తల్లడిల్లుతున్న సూర్యపేట పట్ణణంలో పరిస్థితి పై అధికారులు దృష్టిసారించాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిఅధికారులను ఆదేశించారు. ఇక్కడి పరిస్థితులను దారిలో పెట్టేందుకు అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పరిస్థితి ఉగ్రరూపం దాలుస్తుండడంతో గురు, శుక్రవారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌ నుంచే పరిస్థితులను మానిటరింగ్‌చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదేశంతో రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం ఉపశమన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే శనివారం ఉదయం నుంచి రెడ్‌జోన్‌ ఏరియాలో కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌లు విస్తృతంగా పర్యటించారు. పట్టణ ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలపై మున్సిపాలిటీ దృష్టి సారించింది. అదే విధంగా మొట్టమొదటి సారిగా చివ్వేంట మండలం బీబీగూడెంలో కరోనా పాజటివ్‌ కేసు వెలుగు చేసిన నేపధ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి పాజిటివ్‌ కేసు బాధితుడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నవారి

కోవిడ్ 19 నల్గొండ జిల్లా బులిటీన్ 18 ఏప్రిల్

కోవిడ్ 19 నల్గొండ జిల్లా బులిటీన్ 18 ఏప్రిల్

మరింత పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేయండి - ఐజి స్టీఫెన్ రవీంద్ర

నల్లగొండ : రేంజ్ ఐజి స్టీఫెన్ రవీంద్ర నల్లగొండ జిల్లాలో లాక్ అమలు, పోలీసులు తీసుకున్న చర్యలను పర్యవేక్షించారు. శనివారం జిల్లాలోని చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టు పరిశీలించడంతో పాటు లాక్ డౌన్ పటిష్ట అమలుకు జిల్లాలో తీసుకుంటున్న చర్యలను ఎస్పీ రంగనాధ్ ను అడిగి తెలుసుకున్నారు. అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా పోలీసులు అన్ని రకాలుగా ప్రజలకు అండగా నిలిస్తారనే నమ్మకం, అభిమానము కలిగేలా పని చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. లాక్ డౌన్ నేపద్యంలో ప్రజలు బయటికి రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న క్రమంలో అంతర్ జిల్లా సరిహద్దు వద్ద మరింత పటిష్టంగా వ్యవహారించాలని, అత్యవసరమైతే తప్ప వాహనాలు అనుమతించవద్దని అధికారులకు సూచించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్పీ రంగనాధ్, ట్రైనీ ఐపీఎస్ వైభబ్ గైక్వాడ్, సిఐ శంకర్

సమాజ సేవలో నల్గొండ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా

నల్గొండ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో  ఈరోజు రక్త దానం నిర్వహించడం జరిగింది.  లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో రక్త కొరత ఏర్పడటంతో రక్తదాతలు ముందుకు రావాలని ప్రభుత్వం కోరుతోంది.    ఇందుకు సంబంధించి నల్లగొండ జర్నలిస్టులు, కెమెరామెన్ లు తమవంతు బాధ్యతగా రక్తదానం చేశారు....   సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంలో కూడా ముందుండే జర్నలిస్టులు రక్తదానం చేయడం మరి కొందరికి ఆదర్శం కావాలని... యువజన సంఘాలు, స్వచ్ఛంద రక్త దాతలు ముందుకు రావాలని జర్నలిస్టులు కోరుతున్నారు...

బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన బీజేపీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్

శనివారాం నాడు తన ఇంటి వద్దకు విచ్చేసిన 35,36వార్డు పేద ప్రజలకు 80 మందికి బియ్యం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్  బిజెపి ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ గారు  చేయటం జరిగింది

లాక్ డౌన్ మార్గ దర్శకాలు ఈ నెల 20 నుండి వీటికి అనుమతులు

లాక్ డౌన్ మార్గ దర్శకాలు ఈ నెల 20 నుండి వీటికి అనుమతులు.... 1. నిత్యావసరాలు తప్ప అన్నీ క్లోజ్ 2. వ్యవసాయ,ఉద్యాన వన పనులకు పూర్తి అనుమతి 3.భవన నిర్మాణ పనులకు షరతులతో అనుమతి 4.చేపలు,రొయ్యల రవాణా కు అనుమతి 5.వ్యవసాయ మార్కెట్ లో కొనుగోళ్లకు అనుమతి 6.కొరియర్,ఈ కామర్స్ కు అనుమతి 7 అన్ని రకాల సరుకుల రవాణాకు అనుమతి 7.ఎక్కడ ఉండే కార్మికులకు అక్కడే పనులకు అనుమతి 8.ఉపాధి హామీ పనులకు గ్రీన్ సిగ్నల్ 9. స్కూళ్లు,కాలేజీలు,కోచింగ్ సెంటర్లకు అనుమతి *లేదు* .. 10.ఆస్పత్రులు,టెలీ మెడిసిన్ యధాతధం 11.సరిహద్దులు దాటేందుకు అనుమతి *లేదు*  12. బ్యాంకు కార్యాకలాపాలు యధాతధం 13.బార్లు మూసివేత 14.బహిరంగ ఉమ్మివేయడం నేరం 15.అంత్యక్రియలు,ఇతర కార్యాక్రమాలకు 20 మంది వరకు అనుమతి 16.విత్తనోత్పత్తి,పురుగు మందుల దుకాణాలకు అనుమతి 17. దాణా,ఆక్వా హేచరీస్ కు అనుమతి 18.ఔషద పరిశ్రమలకు అనుమతి 19.అనాద, దివ్యాంగ,కేంద్రాలకు అనుమతి 20 కూలీల తరలింపునకు అనుమతి..లేదు. 21. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అనుమతి

జర్నలిస్టులకు సరుకులు అందించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను 

జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను  కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా జర్నలిస్ట్ కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో వారికి ఆసరాగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను భావించారు. ఈ సందర్భంగా శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో గల ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, 1 లీటర్ నూనె, 1 కేజీ బొంబాయి రవ్వ, 1 కేజీ ఇడ్లి రవ్వ, 1 కేజీ పల్లీలు, 1 కేజీ సెమియా, 1/2 కేజీ బెల్లం, 1కేజీ ఉప్పు, 1/2 కేజీ చింతపండు, పసుపు, కారం, మినపప్పు, సంతూరు, XXX సబ్బులు, వెల్లుల్లి, తాలింపు గింజలు, టీ పోడి లను ఆయన అందజేశారు.

ఆంద్రప్రదేశ్ కరోనా బులిటీన్ 18 ఏప్రిల్

  ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన కలిగిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు 603కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  గడచిన 24 గంటల్లో  కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ 128 బులిటెన్‌ విడుదల* కృష్ణా జిల్లా లో 18 కేసులు నమోదు కర్నూల్ లో అత్యధికంగా 129 కరోనా పాజిటివ్ కేసులు  పాజిటివ్‌ కేసుల్లో 546 మంది చికిత్స  కరోనా పాజిటివ్ నుండి కోలుకుని  42 మంది డిశ్చార్జి కాగా,  ఇప్పటి వరకు ఏపీ లో కరోనా పాజిటివ్ తో 15 మంది మృతి

కోవిడ్-19 నివారణ పై. కె.టి.ఆర్ వీడియో కాన్ఫరెన్స్

అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కె.టి.ఆర్ వీడియో కాన్ఫరెన్స్ కంటైన్మెంట్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలి - అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్ లు - అందులో జిహెచ్ఎంసి పరిధిలోనే 146 జోన్లు* వలస కార్మికుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి* వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ నల్గొండ, ఏప్రిల్ 17, కోవిడ్-19ను అరికట్టుటకు కంటైన్మెంట్ జోన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కే తారక రామారావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిలో జిహెచ్ఎంసి పరిధిలోనే 146 జోన్లు ఉన్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లోని 43 మున్సిపాలిటీలలో మిగిలిన 114 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్లు తెలిపారు. మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి జిహెచ్ఎంసి కార్యాలయం నుండి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. కంటైన్మెంట్ జోన్లలో వున్న ప్రజలను ఇండ్లకే పరిమితం చేయాలని మున్సిపల్ క