Skip to main content

Posts

పార్లమెంట్ ఎన్నికలో 400 సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం - బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానం పూడి సైది రెడ్డి

  పార్లమెంట్ ఎన్నికలో 400 సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం - బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానం పూడి సైది రెడ్డి నల్గొండ:  వచ్చే పార్లమెంట్ ఎన్నికలో 400 సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని నల్లగొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానం పూడి సైది రెడ్డి అన్నారు. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి యువత ,మహిళలు ,వృద్దులు అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. పిల్లిరామరాజు రాకతో నల్లగొండ నియెజకవర్గ ములో పార్టీకి మంచి పట్టు వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పచ్చీస్ పతకాలను అమలుకానీ హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారనీ దుయ్యబట్టారు. నల్లగొండ పార్లమెంట్ నియెజకవర్గ పరిధిలో యువతకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని తెలిపారు. ఢిల్లీ లో మోడీ ,నల్లగొండ లో సైదిరెడ్డి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన యువత కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్ల

దివంగత సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం రంజాన్ సందర్భంగా పేదలకు కిరణం అందుచేత

దివంగత సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం రంజాన్ సందర్భంగా 25 పేద కుటుంబాలకు అయన కుమారుడు ప్రముఖ హైకోర్టు అడ్వకేటు సోమవరపు సత్యనారాయణ కిరణా సరకులు అందించాడు.  

స్వరూప వైవిధ్యం.. శుభవసంతం..! @ ఘనంగా ఉగాది పర్వదిన వేడుక

 స్వరూప వైవిధ్యం.. శుభవసంతం..! @ ఘనంగా ఉగాది పర్వదిన వేడుక @ పర్యావరణానికి ప్రతిరూపం ఉగాది @ అలరించిన కవి సమ్మేళనం @ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ @ పచ్చడి వితరణ పండుగలు ప్రకృతితో మమేకం చేస్తాయని.. మనుషులందరినీ కలిపి ఆహ్లాద వాతావరణం సృష్టిస్తాయని విశ్వహిందూ పరిషత్ పెద్దలు అన్నారు. ప్రధానంగా ఉగాది పర్వదినం సంస్కృతి సంప్రదాయానికి ప్రతిబింబమని.. స్వరూప వైవిధ్యం. స్వభావ ఏకత్వం అన్నారు. ఉగాది అంటేనే శుభ వసంతం అని వివరించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరం పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం..కవి సమ్మేళనం.. పచ్చడి వితరణ.. ప్రముఖులకు ఘన సన్మానం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి, మాసన చెన్నప్ప, రిటైర్డ్ తెలుగు లెక్చరర్లు, ప్రొఫెసర్లు, పండితులు హాజరై చక్కటి కవి సమ్మేళనం నిర్వహించారు. క్రోధి నామ సంవత్సరం సకల జగత్తుకు శుభం కలగాలని అభిప్రాయపడ్డారు. ధర్మం జయించాలని, అధర్మం అంతం అవ్వాలని అభిలాషించారు. అయోధ్య లో శ్రీ బాల రాముడి ప్రాణప్రతిష్ట చేసుకున్న శుభ సందర్భంగా అయోధ్య బలరా

పల్లె రవి కుమార్ కు తృటిలో తప్పిన ప్రమాదం

 *పల్లె రవి కుమార్ కు తృటిలో తప్పిన ప్రమాదం* తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ కు మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో కొత్తపేట వద్ద ప్రమాదం తృటిలో తప్పింది. స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఖైరతాబాద్ లో ఆసుపత్రిలో ఒక మిత్రుడిని పరామర్శించి తిరిగి ఇంటికి వస్తుండగా తను ప్రయాణిస్తున్న కారు కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలోటైరు పగిలిపోవడంతో అదుపు తప్పి డివైడర్ కు, మెట్రో రైలు పిల్లరుకు గుద్దుకన్నది. కారు ఎయిర్ బేలూన్లు ఒపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. పల్లె.రవి కుమార్ తో పాటు ఆయన మిత్రుడు రాజు, డ్రైవరు ఖదీర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

కేంద్ర మంత్రి వర్యులు జి. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ లో చేరిన పిల్లి రామరాజు యాదవ్...

 ఈరోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు & కేంద్ర మంత్రి వర్యులు జి. కిషన్ రెడ్డి  సమక్షంలో బీజేపీ లో చేరిన పిల్లి రామరాజు యాదవ్...  • కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో నేడు బీజేపీ లో చేరిన నల్లగొండ నియోజకవర్గం AIFB నేత పిల్లి రామరాజు యాదవ్ . • ముఖ్య కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీ గా హైదరాబాద్ కి బయల్దేరిన రామరాజు యాదవ్    *రామరాజు యాదవ్ కామెంట్స్ :-*  • భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ ... మోడీని మూడవసారి పీఎం చేసుకొని దేశాభివృద్ధిలో భాగస్వామి అవుతాను  • అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను కుటుంబ సభ్యుడిగా భావించి నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు  • నల్లగొండ నియోజకవర్గం ప్రజల కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పని చేస్తా   • అసెంబ్లీ ఎన్నికలలో ఎంతమంది ఇబ్బంది పెట్టిన ప్రజలు నాకు మద్దతుగా దాదాపు 30 వేల ఓట్లు వేశారు  • నల్గొండ పార్లమెంట్లో బిజెపి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత నల్గొండ మున్సిపాలిటీ పై దృష్టి పెడతా   • నల్గొండలో నా ఎదుగుదలను ఓర్వలేక చాలామంది నన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు  • బ

అంగరంగ వైభవంగా సుంకరి ఫౌండేషన్ ఉగాది ఉత్సవాలు

 అంగరంగ వైభవంగా సుంకరి ఫౌండేషన్ ఉగాది ఉత్సవాలు  నల్గొండ లో అంగరంగ వైభవంగా జరిగిన సుంకరి ఫౌండేషన్ ఉగాది ఉత్సవాల సన్మాన సభ. ఈ ఉగాది ఉత్సవాల సన్మాన సభ లో ప్రతిభామూర్తులకు శ్రీ సుంకరి ఫౌండేషన్ నల్లగొండ వారిచే ఉగాది పురస్కారాలు బహుకరణ చేశారు. కూరెళ్ళ విఠలాచార్య, కొండవీటి రాధాకృష్ణ, దుచ్చెర్ల సత్యనారాయణ, కొల్లా భాస్కర రావు, J.S.శెట్టి, చిన్న వెంకట్ రెడ్డి, పుల్లెముల వెంకట్ నారాయణ గౌడ్, వేణు సంకోజ్, ఏనుగుల లక్ష్మారెడ్డి, కృష్ణ కౌండిన్య, కోమటిరెడ్డి బుచ్చి రెడ్డి, సముద్రాల మల్లికార్జున్, సుదర్శన్ రెడ్డి , కంది సూర్యనారాయణ, K.మట్టపల్లి, గోన రెడ్డి, రఘువర్ రావు, అమరేందర్ రావు,డాక్టర్ కొండల రావు,డాక్టర్ పుల్లారావు, శ్రీమతి కొండవీటి అంజనీ భాయ్, శ్రీమతి పిచ్చమ్మ , శ్రీమతి మామిడి ప్రమీల, K.పర్వతాలు, మాదగోని బిక్షపతి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పబ్బు వీరస్వామి, జర్నలిస్టు సుధాకర్, పున్న అంజయ్య, బోర్ర సుధాకర్, అంబటి వెంకన్న, మునస వెంకన్న, ఎల్వీ కుమార్, కొండూరు సత్యనారాయణ గార్లకు పాల్గొని ఫౌండేషన్ వారు ఉగాది పురస్కారాలు, సన్మానం చేశారు. ఈ సన్మాన సభను విజయవంతం చేసినందుకు వారందరికీ పత్రికాముఖం

మహిళలు ధైర్యంగా అన్ని రంగాల్లో రాణించాలి...యోగ గురూజీ సంధ్య

మహిళలు ధైర్యంగా అన్ని రంగాల్లో రాణించాలి...యోగ గురూజీ సంధ్య  మహిళలు అన్ని రంగాలలో ధైర్యంగా రాణించాలని ఆర్యన్స్ యోగ అండ్ ఫిట్నెస్ సెంటర్ యోగ గురూజీ సంధ్య అన్నారు. ఆదివారం ఫన్ డే కార్యక్రమాన్ని స్థానిక పంచ తత్వ పార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు నిర్వహించిన ఫన్ డే కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ అమ్మ ఆరోగ్యం అంటే ఇంట్లో ఉన్న మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుందని అందుకోసం ప్రతి ఒక్కరు యోగ అలవర్చుకొని ఆ కుటుంబాన్ని ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని అన్నారు. ఈ సందర్భంగా యోగాలో శిక్షణ పొంది బాగా బరువు తగ్గిన వారికి చోక్కారపు మాధవి బహుమతులు అందజేశారు. అనంతరం మహిళలు చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా జారుడుబండ ,ఉయ్యాల ఊగడం, మరికొన్ని క్రీడలు ఆడి ఆనందంగా గడిపారు.  

బీజేపీ లో చేరానున్న పిల్లి రామరాజు యాదవ్!

  *ఈ నెల 9వ తారీకు నా బీజేపీ లో చేరానున్న పిల్లి రామరాజు యాదవ్..* బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు.. మరియు అధిష్టాన పెద్దలతో జరిపిన చర్చలు సఫలం.. కేంద్ర ప్రభుత్వం..మోడీ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమలకు ఆకర్షతులై చేరిక కు రంగం సిద్ధం చేసుకున్న రామరాజు యాదవ్.. ఇటీవల తన రాజకీయ భవిష్యత్తు పై అనుచరులు.. కార్యకర్తలు.. అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్న రామరాజు  కాంగ్రెస్ లో చేరాలని భావించిన అనుచరులు బీజేపీ లో చేరాలని ఒత్తిడి.. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధిష్టానం తో మంతనలు  ఈ నెల 9న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సమక్షంలో చేరిక.. రాష్ట్ర స్థాయి లో సమూచిత స్థానం కల్పించనున్న బీజేపీ  రామరాజు చేరిక తో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం తో పాటు పార్లమెంట్ స్థాయి లో బలపడనున్న బీజేపీ

తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో.. బిజెపి నాయకులు ఈటెల రాజేందర్ తో “మీట్ ది ప్రెస్”

 ఆదిత్య పార్క్ ఇన్ హోటల్, అమీర్పెట్ లో.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో.. బిజెపి నాయకులు ఈటెల రాజేందర్ తో   “మీట్ ది ప్రెస్” కార్యక్రమం. ఈటెల రాజేందర్ కామెంట్స్:  రేవంత్ కేసీఆర్ లాగే మాట తప్పారు.. తానూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: ఈటెల రాజేందర్ తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం.  రాజకీయ వ్యవస్థలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలే.. గెలిపించేది ఓడించేది ప్రజలే తెలంగాణ యువనయ్య జాగిరి కాదు ప్రజలది ప్రజలనే నమ్ముకున్నా.. ధర్మాన్ని నమ్ముకున్నా.. శ్రమను నమ్ముకున్నా... బిజెపి మల్కాజ్ గిరి ఎంపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించిందని  స్వతంత్ర్యాన్ని తెచ్చిన పార్టీగా, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో గెలవడం కోసం జిల్లాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు చేస్తుంది ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ “మీట్ ద ప్రెస్“ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ రావు అధ్యక్షతన  కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత, మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అ
చర్లపల్లి లో వాసవి భవన్ ప్రారంభోత్సవం చేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు చిత్ర రవిచంద్రన్ నల్గొండ లోని చర్లపల్లి లో వాసవి భవన్ ప్రారంభోత్సవం చేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు చిత్ర రవిచంద్రన్ చేశారు.    వాసవి క్లబ్ చర్లపల్లి ప్రమాణ స్వీకారం వాసవి క్లబ్ చెర్లపల్లి , అధ్యక్షులు Vn.ఇమ్మడి హరిప్రసాద్, కార్యదర్శి Vn.ఇమ్మడి విజయకుమార్, కోశాధికారి Vn.కొండూరు తేజ చే I.E.C. Vn. యామా దయాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా గవర్నర్104/A Vn.Daimond KCGF SHREYOBHILASHI రాచర్ల లక్ష్మీ కమలాకర్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేశారు. వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ Vn.KCGF గజవెల్లి సత్తయ్య, కార్యదర్శి బిక్కుమల్ల రవీందర్,కోశాధికారి గజవెల్లి యాదయ్య, మరియు క్లబ్ పూర్వ అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పై కార్యక్రమమునకు, జిల్లా ఐపిసి, ఐఇసి, ఆర్సి, జెడ్ సి, వివిధ క్లబ్ సభ్యుల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు, మరియు వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ క్లబ్ సభ్యులు, హాజరై కార్యక్రమం దిగ్విజయం చేసినారు.