Skip to main content

కేటీఆర్ పై విరుచుకుపడ్డ బండి సంజయ్ కుమార్*

 




*తెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటావా?*

 

*కొట్లాడి తెలంగాణ సాధించి అధికారమిస్తే...తెలివిలేనోళ్లంటావా?*

 

*తెలంగాణ సొమ్మును దోచుకుని తెలివిలేనోళ్లంటావా?*

 

*అమెరికాలో చిప్పలు కడిగిన నిన్ను మంత్రి చేస్తే ఇదేనా నువ్విచ్చే బహమతి?*

 

*తెలంగాణ ప్రజలారా... బీఆర్ఎస్ ను ఈడ్చి తన్నండి*

 

*తెలివిలేనోళ్లు మాత్రమే బీఆర్ఎస్ కు ఓటేయండి...*

 

*తెలివి ఉన్నోళ్లెవరూ బీఆర్ఎస్ కు ఓటేయకండి*

 

*బీఆర్ఎస్ కార్యకర్తలారా... మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే ‘క్విట్ బీఆర్ఎస్‘*

 

*కేటీఆర్ పై విరుచుకుపడ్డ బండి సంజయ్ కుమార్*

 

తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రోళ్లు తెలివైన వాళ్లంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ భగ్గుమన్నారు. ‘‘కొట్లాడి రాష్ట్రం సాధించిన తెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటావా? అమెరికాలో చిప్పలు కడిగిన నీకు అధికారం అప్పగిస్తే.. తెలివిలేనోళ్లంటావా. సకల జనుల సమ్మె చేసి ఉద్యోగాలనే ఫణంగా పెట్టిన తెలంగాణ ఉద్యోగులను తెలివిలేనోళ్లంటావా? తెలంగాణ కోసం పోరాడి బలిదానమైన 14 వందల మంది నీకు తెలివిలేనోళ్లా?’’ అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలారా.... పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బీఆర్ఎస్ ను ఈడ్చి తన్నాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో తెలివిలేనోళ్లు మాత్రమే బీఆర్ఎస్ కు ఓటేయాలని, తెలివి ఉన్నోళ్లెవరూ బీఆర్ఎస్ కు ఓటేయొద్దని, బీజేపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ‘బీఆర్ఎస్ కార్యకర్తలారా... మీరు నిజంగా తెలంగాణ వాదులైతే... మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే బీఆర్ఎస్ నుండి బయటకు రండి... బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయండి’’అని పిలుపునిచ్చారు...

 

ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని 21వ వార్డు బాలాజీనగర్ లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. తాగడానికి నీళ్లు లేక, అస్తవ్యస్తమైన డ్రైనేజీతో ఇబ్బంది పడుతున్న బాలాజీ నగర్ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 


అనంతరం మీడియాతో మాట్లాడారు... ఏమన్నారంటే…


బాలాజీ నగర్ పాకిస్తాన్ లో ఉందా? బంగ్లాదేశ్ లో ఉందా? ... ఇది కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనిదే.. ఇక్కడికి నీళ్లు రావు... మరి మిషన్ భగీరథ ఏమైంది? కమీషన్ల కోసం మిషన్ భగీరథ పేరుతో పైపులు వేసిర్రు తప్ప... ఎవ్వరికైనా నీళ్ళు ఇచ్చారా? .... కరీంనగర్ కార్పొరేషన్ లోనే ఉన్న బాలాజీనగర్ కే నీళ్లు రాకపోతే... ఇక తండాల, గ్రామల పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోండి.. పన్నులు కట్టించుకుంటారు? నీళ్లు ఇవ్వరా?... నీళ్లు ఇచ్చేదాకా వెంటపడతా....

 

మా తెలంగాణోళ్లకు తెలివి లేదా? సిగ్గుండాలే...మా తెలంగాణ ప్రజలకు తెలివిలేదు కాబట్టే తెలంగాణ కోసం ఉద్యమం చేసి 14 వందల మంది బలిదానమయ్యారా? మా తెలంగాణ వాళ్లకు తెలివి లేదు కాబట్టే తెలంగాణ సాధించుకున్నమా?.... మా తెలంగాణోళ్లకు తెలివి లేదు కాబట్టే మీకు అధికారం కట్టబెట్టామా? మా తెలంగాణ ఉద్యోగులు తెలివిలేకనే సకల జనుల సమ్మె చేశారా? ఇప్పుడు.. మీకు తెలంగాణ ప్రజలు తెలివి లేనోళ్లుగా కన్పిస్తున్నారా?

సిగ్గుండాలే....తెలంగాణ ప్రజలారా... కేటీఆర్ కొడుకు మాటలు విన్నారు కదా.... మనమంతా తెలివిలేనోళ్లమట. దద్దమ్మమలట. మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా.... ఇక మీరంతా ఆలోచించండి... మనకు తెలివి ఉందా? లేదా? తెలివిలేనోళ్లంతా బీఆర్ఎస్ కు ఓటేయండి... తెలివి ఉన్నోళ్లంతా బీజేపీకి ఓటేయండి....

 

సిగ్గులేని పార్టీ బీఆర్ఎస్... తెలంగాణ ప్రజల ఓట్లు వేస్తేనే మీ అయ్య సీఎం అయ్యిండు... అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు మంత్రి అయినవ్. నీ చెల్లి ఎంపీ, ఎమ్మెల్సీ అయ్యింది... తెలంగాణ కోసం కొట్లాడి వందలాది మంది బలిదానమై తెలంగాణ సాధించి నీకు అధికారమిస్తే.... వేల కోట్లు దోచుకున్న మీ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన బిరుదు ‘తెలంగాణోళ్లకు తెలివి లేదని అంటవా?’’...

 

తెలంగాణ ప్రజలారా.... ఈ ఎన్నికలు ఓటుతో కొడితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల దిమ్మ తిరగాలే.. ఒక్క ఓటు కూడా వేయొద్దు... అప్పుడు తెలంగాణ ప్రజల తెలివి ఏందో తెలుస్తది.. బహుశా... కేటీఆర్ కు చేపల పులుసు ఎఫెక్ట్ పడ్డట్లుంది. చేపల పులుసు తిన్నాక తెలంగాణోళ్లు తెలివి లేనోళ్లుగా కన్పిస్తున్నారా...

 

బీఆర్ఎస్ కార్యకర్తలారా... మీరు నిజంగా తెలంగాణ వాదులైతే... మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే క్విట్ బీఆర్ఎస్.... ఆ పార్టీని వదిలి బయటకు రండి... తెలంగాణ ప్రజలను అవమానించిన కేసీఆర్, కేటీఆర్ 


తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదు… కేసీఆర్ కుటుంబానికి అసలే లేదు.. ఇంత అహంకారమా? అధికారం పోయినంక మైండ్ దొబ్బినట్లుంది. ఏది పడితే అది వాగుతున్నరు… తెలంగాణ సమాజమంతా ఆలోచించాలి…..


నేను ఈడీ, సీబీఐ అధికారిని కాదు.. కవితను ఎందుకు అరెస్ట్ చేశారో… ఏ ఆధారాలున్నాయో ఈడీ, సీబీఐని అడగండి…


ఫోన్ ట్యాపింగ్ పై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…. ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం. దీనిపై బాధ్యులైన నేతలను ఎందుకు అరెస్ట్ చేయరు. ఈ రాచమర్యాదలేంది? పట్టుకుని జైల్లో వేసి ఉచలు లెక్కపెట్టించాలి. అంతే తప్ప ఫోన్ ట్యాపింగ్ తో ఒకరు, కాళేశ్వరం  పేరుతో ఇంకొకరు డ్రామాలాడుతూ ప్రజా సమస్యలను దారి మళ్లిస్తున్నరు.. మా ఎజెండా ప్రజా సమస్యలే…  ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నా…


ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నారంటూ వినోద్ కుమర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.....‘నా ఇష్టం.. ఎక్కడైనా పోటీ చేయొచ్చు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. ఎంపీగా పోటీ చేసే హక్కు నాకుంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఆయనెవరు అడగడానికి? దమ్ముంటే స్మార్ట్ సిటీ నిధుల్లో అవకతవకలపై కేసీఆర్ ను ఎందుకు నిలదీయలేదో అపర మేధావి చెప్పాలి....’

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్