Skip to main content

*రాజేష్ కుటుంబానికి అండగా* *ఉంటాం* *-మీడియా అకాడమీ చైర్మన్* *కె.శ్రీనివాస్ రెడ్డి*


 *రాజేష్ కుటుంబానికి అండగా* *ఉంటాం*

*-మీడియా అకాడమీ చైర్మన్* *కె.శ్రీనివాస్ రెడ్డి* 

----------------------------------------

యువ ఫోటో జర్నలిస్ట్ నర్రా రాజేష్ ఆకస్మిక మరణం అత్యంత విషాదకరమని, అతని కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ 

కె.శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు.

శుక్రవారం నాడు బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రాజేష్ సంస్మరణ సభ, అసోసియేషన్ నుండి బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఆయా పత్రికల్లో ఫోటో జర్నలిస్టుగా సేవలందించిన రాజేష్, ఎంతో బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడని ఆయన కొనియాడారు. మీడియాకు ఫోటో జర్నలిస్టులు కళ్ళు, చెవుల లాంటి వారన్నారు. పత్రికల్లో వార్తలకు సాక్ష్యంగా నిలిచేది ఫోటోలేనని, ఆ ఫోటోల కోసం ఫోటో జర్నలిస్టులు పడే తిప్పలు వర్ణనాతీతమని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పాత్రికేయ వృత్తి అభద్రతా, అత్యంత ప్రమాదకరమైనట్లు ప్రజాస్వామిక దేశాలకు ఐక్యరాజ్య సమితి ఎప్పుడో సూచించిందని ఆయన గుర్తుచేసారు. ఫోటో, వీడియో జర్నలిస్టుల ఆరోగ్య భద్రత పై మీడియా సంస్థల యాజమాన్యాలు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, ప్రాణాలను ఫణంగా పెట్టి మీడియా రంగంలో వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్న ఫోటో, వీడియో జర్నలిస్టుల జీవితాలు అంధకారంలో మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో లాఠిలను, తూటాలను, కేసులను లెక్కజేయకుండా ఫోటో జర్నలిస్టులు పోషించిన సాహసవంతమైన పాత్ర అభినందనీయమన్నారు. ఫోటో, వీడియో జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం తమ సంఘం నాటి నుండి నేటివరకు అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఎప్పుడూ చిరునవ్వులతో పలకరించే రాజేష్ ఆకస్మిక మృతి తమను ఎంతో కలచివేసిందని, అతని కుటుంబానికి చేయూతనిస్తామని విరాహత్ అన్నారు. హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ, రాజేష్ మృతితో తమ సంఘం క్రియాశీలక సభ్యుడిని కోల్పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి హరి, జె.ఎన్.జె.హెచ్.ఎస్ అధ్యక్షులు బి.కిరణ్ కుమార్, రాజేష్ భార్య లావణ్యతో పాటు ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్