Skip to main content

Posts

కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం

 *కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం * తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కలాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ, అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై, ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది.  చాలా సంవత్సరాల తరువాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని సీనియర్ సిటిజన్లు హర్షం వెలిబుచ్చగా, తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందని తెలుసుకోవడం తమ అదృష్టమని యువత ఆనందం వ్యక్తం చేసారు. ఆ విధంగా అన్ని వయసుల వారిని ఉర్రూతలూగిస్తూ పద్మాకర్ గారు చేసిన అష్టావధానంతో తెలుగు సాహితీ కాంతులు కెనడాలో వెల్లివిరిసాయి. గత రెండునెలలుగా బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు అమెరికా, కెనడా దేశాలలో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ప్రవచానాలు, ఒక అష్టావధానము, ఒక శతావధానము కూడా నిర్వహించి ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుత

అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంఛార్జిగా అవ్వారి భాస్కర్ నియామకం

 *అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంఛార్జిగా అవ్వారి భాస్కర్ నియామకం* *అవ్వారి భాస్కర్ నియామకంతో పద్మశాలి యువతలో నయా జోష్*   *వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పద్మశాలి యువత పాత్ర కీలకం* *రాజ్యాధికార సాధన లక్ష్యంగా ముందుకు సాగాలి* *దేశవ్యాప్తంగా యువజన కమిటీలు* - *అవ్వారి భాస్కర్* అఖిల భారత పద్మశాలి సంఘం మీడియా విభాగం అధ్యక్షులు *అవ్వారి భాస్కర్* కు అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలను సంఘ అధ్యక్షులు కందగట్ల స్వామి ఇచ్చారు. ఈ మేరకు నారాయణగూడ లోని పద్మశాలి భవన్ లో నియామక పత్రాన్ని గురువారం అప్పగించారు . ఈ సందర్భంగా సంఘ పెద్దలు అవ్వారి భాస్కర్ ని ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు. తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా , రాష్ట్ర అధ్యక్షులుగా అవ్వారి భాస్కర్ సుదీర్ఘకాలంగా సేవలందించారు. భాస్కర్ సేవలను గుర్తించి అఖిల భారత పద్మశాలి సంఘంలో మీడియా విభాగం జాతీయ అధ్యక్షునిగా నియమించారు. తాను చేపట్టిన ప్రతి పదవిని బాధ్యతగా స్వీకరించి ఆ పదవులకే భాస్కర్ వన్నె తెచ్చారు. మీడియా రంగంలో భాస్కర్ కు ఉన్న అనుభవం అఖిల భారత పద్మశాలి

భూపతి టైమ్స్ దిన పత్రిక, జూన్ 29, 2023 ను ఈ క్రింద లింక్ టచ్ చేసి చదవండి

 భూపతి టైమ్స్ దిన పత్రిక, జూన్ 29, 2023 ను ఈ క్రింద లింక్   టచ్ చేసి చదవండి   

ACB వలలో చిక్కిన నిజామాబాద్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అసిస్టెంట్ డైరెక్టర్, మరో ఇద్దరు

  ACB వలలో  చిక్కిన నిజామాబాద్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్,  అసిస్టెంట్ డైరెక్టర్, మరో ఇద్దరు 28.06.2023న సుమారు 12.15 గంటలకు నిందితుడునిజామాబాద్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్,  అసి. డైరెక్టర్ (AO-1) శ్రీ శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష రూపాయలు లంచం డిమాండ్‌ చేసి స్వీకరించినప్పుడు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారు శ్రీ దుగ్గేన రాజేందర్ R/o ధర్మోరా గ్రామం, మోర్తాడ్ మండలం,నిజామాబాదు జిల్లా నుండి10,000/- అధికారిక ఉపకారం చేయడానికి అంటే సరిహద్దు సర్టిఫికేట్ జారీ చేయడానికి మరియు ఫిర్యాదుదారు యొక్క 5 గుంటల భూమికి సంబంధించి లొకేషన్ స్కెచ్ రిపోర్ట్/మ్యాప్. ఇవ్వడానికి లంచం తీసుకున్నారు. AO-1l ఆఫీసు టేబుల్ డ్రాయర్ నుండి కళంకిత లంచం మొత్తం రికవరీ చేయబడింది అంతకు ముందు 19.06.2023, ది (A0-2) శ్రీ ముచ్చటి వెంకటేష్,సూపరింటెండెంట్ & (AO-3) శ్రీమతి.  రహీమా, జూనియర్ అసి. అదే ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి వరుసగా 3,000/- & 2,000/-లంచం మొత్తం డిమాండ్ చేసి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుకు సంబంధించినది. AO-1, AO-2 & AO-3 అక్రమ ప్రయోజనం పొందేందుకు అక్రమంగా మరియు ని

నల్లగొండలో ఫ్రూట్ మార్కెట్ లో దారుణం

 నల్లగొండలో ఫ్రూట్ మార్కెట్ లో దారుణం ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి  మాంసం ముద్దులైన మృతదేహాలు  నల్లగొండ: నల్లగొండలో ని బర్కత్ పురా కాలనీ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజి లో ఏసి గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా పేలింది. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ముక్కలు ముక్కలై చనిపోయారు. ఈ సంఘటనలో కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతులుగా గుర్తించారు. పేలుడు జరిగిన సమయంలో అక్కడ నలుగురు వ్యక్తులు ఆ స్టోరీజి పేలుడు నుండి తప్పించుకున్నట్లు అక్కడి వారు తెలిపారు. నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డి.ఎస్.పి నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు కూడా ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు.

ముదిరాజ్ కులమును దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి - నల్గొండ జిల్లా ముదిరాజ్ సంఘం

 ముదిరాజ్ కులమును దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి - నల్గొండ జిల్లా ముదిరాజ్ సంఘం  నల్గొండ:  ముదిరాజ్ జర్నలిస్టు పై దాడి చేసి అసభ్య పదజాలంతో ముదిరాజ్ కులమును దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముదిరాజ్ సంఘం నల్గొండ జిల్లా కమిటీ, ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం పెద్ద గడియారం చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజులకు క్షమాపణ చెప్పాలని, అతని MLC పదవి తొలగించే వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కేశబోయిన శంకర్, జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు కట్ట సుధాకర్, ప్రధాన కార్యదర్శి పిట్టల రామకృష్ణ ముదిరాజ్ చిట్టబోయిన అంజయ్య చాగంటి రాములు చాగంటి వెంకన్న , గుడిసె పరుష రాములు సింగారపు మల్లయ్య తదితరు పాల్గొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు మతి భ్రమించినట్లుంది - విజయశాంతి

 తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు మతి భ్రమించినట్లుంది - విజయశాంతి ఫేస్ బుక్ లో విజయశాంతి పోస్ట్

పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి

 *#హైదరాబాద్:-* *పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి*  ప్రస్తుతం బిజెపిలోనే ఉన్న.. ఊహాగానాలు నమ్మవద్దు  తమ అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్ వివరిస్తామని చెప్పిన రాజగోపాల్ రెడ్డి  కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి  ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు  టిఆర్ఎస్ బిజెపి మధ్య అండర్ స్టాండింగ్ ఉందని ప్రజలు భావిస్తున్నారు వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం ఇస్తుంది అందులో భాగంగానే  కేటీఆర్ కు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్  కేటీఆర్ కు  కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు  నేను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియా ఎక్కువ చేసి చూపిస్తుంది  మోదీ , అమిషా తలుచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది  కర్ణాటక ఎన్నికల తర్వాత కొంచెం ప్రజల ఆలోచనలో కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతుంది

BHUPATHI TIMES DAILY JUNE, 24, 2023

 

మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆవరణలో రూ.1.4 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడి.

  మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆవరణలో రూ.1.4 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడి. పీజీ మెడికల్ సీట్ల బ్లాకింగ్ స్కామ్‌కు సంబంధించి 21.06.2023న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ మరియు తెలంగాణ వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించామని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 ఫిబ్రవరిలో, గుర్తు తెలియని వ్యక్తులపై అప్పటి కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్) రిజిస్ట్రార్ దాఖలు చేసిన ఫిర్యాదుపై వరంగల్‌లోని మట్వాడ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇడి మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది.  కొన్ని ఏజెన్సీలు తెలంగాణ & ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులు/ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై సీట్ బ్లాకింగ్‌లో పాల్గొంటున్నాయి మరియు KNRUHS కింద రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన అభ్యర్థుల సంబంధిత పత్రాలను పొందడంలో పాల్గొంటున్నాయి. ED చేసిన పరిశోధనలో విశ్వవిద్యాలయం, దాని స్వంత విచారణల సమయంలో, KNRUHSతో కౌన్సెలింగ్‌కు కూడా దరఖాస్తు చేయలేదని తెలియజేసిన ఐదుగురు అభ్యర్థులను గుర్తించిం