Skip to main content

Posts

*మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయండి*

  *మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయండి*  నల్లగొండ పట్టణంలో రేపు ఆదివారం 28వ తేదీన జరిగేటటువంటి మహిళా శక్తి సమ్మేళనం కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కార్యదర్శి dr. సింధూర కోరారు. మహిళల్లో చైతన్యం కలిగించడం కోసం, సాంస్కృతి, కుటుంబ విలువలు పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళలని భాగస్వామ్యం పెంచడం, మహిళలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం అనే ఉద్దేశంతో మహిళా శక్తి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరుగుతుందని పత్రిక ప్రకటన ద్వారా నిర్వాహకురాలు నన్నూరి లత తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఎస్పీ చందనా దీప్తి పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి, విద్య ,వైద్య సామాజిక, ధార్మిక, ఉద్యోగ, సేవ, వ్యాపార, వ్యవసాయ, పారిశ్రామికవేదలు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలు పాల్గొన గలరని కోరారు. రేపు జరిగే ఈ కార్యక్రమం నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి జిఎం గార్డెన్స్ (గుండెగోని మైసయ్య కన్వెన్షన్ ఫంక్షన్ హాల్) ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని తెలియజేశారు.

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించిన ఏసీబీ

  HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించిన ఏసీబీ 45పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ సంచలన విషయాలు శివ బాలకృష్ణ ఇల్లు సహా 18చోట్ల హి ఏసీబీ సోదాలు  భారీగా ఆస్తుల గుర్తింపు, 50ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు సేకరించిన ఏసీబీ ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం ఐదు కోట్లు బహిరంగ మార్కెట్ లో 10రెట్లు 99లక్షల నగదు, నాలుగు కార్ల విలువ 51లక్షలు,బ్యాంకు బాలెన్స్ 58లక్షలు గోల్డ్ , సిల్వర్, వాచ్ లు,ఫోన్స్ , గృహోపకరణాలు మొత్తం వాల్యూ8కోట్ల 26లక్షలు  పలు ఇన్ఫ్రా కంపెనీ లపై సైతం ఏసీబీ సోదాలు 155డాక్యుమెంట్ షీట్స్, 4పాస్బుక్స్ స్వాధీనం Lic పాలసీ బాండ్స్ 20 ఐటీ రిటర్నస్ డాక్యుమెంట్లు స్వాదనం నాలుగు బ్యాంకు పాస్బుక్స్ భినామీలను విచారించాల్సి ఉంది ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉంది  పలువురు భినామీలను గుర్తించిన ఏసీబీ ఫిర్జాదిగూడలో పెంట రమాదేవి, మైహోం భూజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్ లో ప్రమోద్ కుమార్, మాదాపూర్ లో కొమ్మిడి సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి నివాసాల్లో సహా 18చోట్ల  ఏసీబీ సోదాలు!

స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ హైద్రాబాద్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ ఆఫ్ జాయ్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో విమలా దేవి చిత్రాలు

 స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ హైద్రాబాద్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ ఆఫ్ జాయ్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో విమలా దేవి చిత్రాలు స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ హైద్రాబాద్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ ఆఫ్ జాయ్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ శుక్రవారం 26 జనవరి 2024 న ప్రారంభమైంది. ఈ 31 జనవరి వరకు జరగుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో ప్రముఖ చిత్రకారిని శ్రీమతి మారోజు విమలా దేవి చిత్రించిన చిత్రాలు ప్రదర్శింప బడ్డాయి..

చిన్న పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం

  చిన్న పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం నల్లగొండ జిల్లాలో చిన్న పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం సమర్పించారు శుక్రవారం నాడు మంత్రి స్థానికంగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా చిన్నపత్రికల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించడం జరిగింది .జిల్లా కేంద్రంలో సుమారు 50 మందికి పైగా చిన్న దినపత్రికలతో పాటు మాస పక్ష వారపత్రికలు నడుపుతున్నారని వారు తెలిపారు గత కొన్ని దశాబ్దాలుగా చిన్న పత్రికలు నిర్వహిస్తూ ఆర్థిక భారంతో సతమగుతమవుతున్నారని సొంత గూడు లేక అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్నారని చెప్పారు ఒక వైపు పత్రిక నిర్వహణ మరొకవైపు తన కుటుంబ పోషణ భారాన్ని భరించలేక ఆర్థికంగా నలిగిపోతున్నారని అన్నారు పాత్రికేయుల పట్ల పక్షపాతిగా పేరున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయాంలో చిన్నపత్రిల వారందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి పత్రిక బాంధవుడుగా పేరు తెచ్చుకోవాలని కోరారు వినతిపత్రం సమర్పించిన వారిలో సీనియర్ జర్నల

జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తేనేటి విందు

  75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా  నల్గొండ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తేనేటి విందు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ 200 సంవత్సరాల పోరాటం,ఎందరో మహనీయులు త్యాగం పలితంగా భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు. భారత దేశం రాజ్యాంగ విలువలు కాపాడుతూ పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు,జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బాలూ మాస్టర్ ఆధ్వర్యం లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.జిల్లా అధికారులు డి.యం.హెచ్. ఓ డా.కొండల్ రావు తన పాటలతో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.ఆయన పాటలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమం లో సీనియర్ సిటిజెన్ లను జిల్లా కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమానికి ఎస్.పి.చందన దీప్తి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్,అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లాక్ష్మా రెడ్డి,అర్ డి. ఓ రవి,రిటైర్డ్ ఐ. ఏ ఎస్.అధికారి చోల్లెటి ప్రభాకర్,డి.సి.సి.అధ్యక్షులు శంకర్ నాయక్, జిల్లా అధికారులు హాజరు అయ్యారు.

6 గ్యారంటీలు అమలు కొరకు 5 లక్షల 27వేల 492 దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు - జిల్లా కలెక్టర్ హరుచందన దాసరి

6 గ్యారంటీలు అమలు కొరకు 5 లక్షల 27వేల 492 దరఖాస్తులను  ఆన్లైన్ లో నమోదు - జిల్లా  కలెక్టర్ హరుచందన దాసరి నల్గొండ :  6 గ్యారంటీలలో భాగమైన మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందరమ్మ ఇల్లు మరియు చేయుత పథకాల అమలు కొరకు 5 లక్షల 27వేల 492 దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్ లో నమోదు చేశామని నల్గొండ జిల్లా  కలెక్టర్ హరుచందన దాసరి తెలిపారు. గణతంత్ర దిన్నాన్ని పురస్కరించుకొని నల్గొండ పోలీస్  హెడ్ క్వార్టర్స్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నల్గొండ జిల్లా  కలెక్టర్ హరుచందన దాసరి జాతీయ  జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ 75వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలనీ, జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థినీ విద్యార్థుల కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మనందరికి పండుగ రోజని, ప్రపంచంలోనే గొప్ప సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రదేశంగా భారతదేశమును నిలుపుకునేందుకు భారతరత్న డా.బి.ఆర్ . అంబేడ్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం1950, జనవరి 26న అమలులోకి తెచ్చుకున్నామని, భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరా

ACB అదుపులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ

  ACB అదుపులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ  బాలకృష్ణ ఆదాయానికి మించి నుంచి ఆస్తులు కలిగి ఉన్న ఆరోపణలకే సోదాలు చేసి బాలకృష్ణను  అదుపులోకి తీసుకున్నామని,  కోర్టులో హాజరు పరుస్తామని ACB అధికారులు తెలిపారు. సోదాల్లో  భారీగా ఆస్తులు,  మార్కెట్ వేల్యూ ప్రకారం 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులుగా గుర్తింపు. నగలు నగదు ఆస్తుల పత్రాలను స్వాధీనపరచుకున్న అధికారులు. నానక్ రామ్ గూడ లోని బాలకృష్ణ ఇంట్లో 84 లక్షల నగదు స్వాధీనం.  హైదరాబాదులో విల్లా లు..ఫ్లాట్లు తో పాటుగా శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్ది ల్యాండ్. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల ల్యాండ్ పత్రాలు స్వాధీనం. మొత్తం 20 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు. బాలకృష్ణ ఇంటి తోపాటు బంధువులు మిత్రులు కంపెనీలో సోదాలు. దాదాపు రెండు కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు భారీగా వెండి స్వాధీనం. 80 కి పైగా అత్యంత ఖరీదైన వాచీలు కూడా స్వాధీనం. పెద్ద మొత్తంలో ఐఫోన్లను సీజ్ చేసిన అధికారులు. 90 ఎకరాలకు సంబంధించిన భూమి పత్రాలు స్వాధీనపరచుకున్న అధికారులు కొడకండ్లలో 17 ఎకరాలు.. కల్వకుర్తిలో 26 ఎకరాలు.. యాదాద్రి లో 23 ఎకరాల ..జనగామలో 24 ఎకరా

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ప్రస్తుత RERA సెక్రటరీ, మెట్రో రైల్ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు

 హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ప్రస్తుత RERA సెక్రటరీ, మెట్రో రైల్ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెర సెక్రటరీ, మెట్రో రైల్ డైరెక్టర్ శివ బాలకృష్ణ సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, ఇతర సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ బృందాలు ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన శోధన ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నాయి. 👇👇👇👇 HMDA పై ACB కన్ను అనే ఆర్టికల్ ను గూఢచారి ప్రచురించిన కొన్ని రోజుల్లోనే మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ACB బృందాలు సోదాలు చేయడం గమనార్హం. వార్త లింక్  ఓపెన్ చేసి చదవ వచ్చు  https://www.gudachari.page/2024/01/hmda-acb_19.html హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెర సెక్రటరీ, మెట్రో రైల్ డైరెక్టర్ శివ బాలకృష్ణ తో సంబంధం ఉన్న ఇళ్లు, కార్యాలయాలు, ఇతర సంస్థలపై అవినీతి నిరోధక శాఖ బృందాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బుదవారం ఉదయం నుంచి భారీ సోదాలు నిర్వహిస్తున్నాయి.  అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. శివ బాలకృష్ణ ఇళ్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. శివ బాలకృష్ణ తన ప

*KVPS మహనీయుల స్ఫూర్తి క్యాలండర్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*

  *KVPS మహనీయుల స్ఫూర్తి క్యాలండర్ ఆవిష్కరించిన  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*    సమాజంలో వేలునుకున్న అసమానతలు కుల వివక్షకు వ్యతిరేకంగా తమ జీవితాంతం పోరాడిన మహనీయులు సామాజిక తత్వవేత్తలు మనందరికీ మార్గదర్శకులని, ఆ మహనీయుల స్ఫూర్తితో కేవీపీఎస్ ముందుకు సాగుతూ సామాజిక ఉద్యమాలు చేయడం అభినందనీయమని రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు.     సోమవారం రోజున నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  చేతుల మీదుగా కెవిపిఎస్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను కెవిపిఎస్ జిల్లా నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం కేవిపియస్ నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మహనీయుల స్ఫూర్తితో కేవీపీఎస్ నిర్వహిస్తున్న సామాజిక ఉద్యమాలు ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని, ప్రతిఘటన శక్తిని పెంపొందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కోసం కెవిపిఎస్ పోరాటాలు నిర్వహించి అనేక చట్టాలను సాధించిందని అన్నారు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ద్వారా రావలసిన నిధులు పక్కదారి పడుతున్నాయని దళిత గిరిజన

ఈ నెల 28 న నల్గొండ లో మహిళా శక్తి సమ్మేళనం.

  ఈ నెల 28 న నల్గొండ లో మహిళా శక్తి సమ్మేళనం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ మహిళలలో చైతన్యం కలిగించటం ద్వారా భారతీయ సంస్కృతి కుటుంబ విలువలను పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళా భాగస్వామ్యాన్నిపెంచడం వివిధ రంగాలలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనడం మహిళలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంఅనే ఉద్ధేశముతో ' మహిళాశక్తి సమ్మేళనం ' ఏర్పాటు చేయడమైనదని మహిళాశక్తి సమ్మేళన నిర్వహులు తెలిపారు. మహిళాశక్తి, సమ్మేళనంలో పాల్గోందాం – వైభవోపేతమైన సమాజాన్ని నిర్మిద్దాం మని మహిళ లోకానికి పిలుపు నిచ్చారు. విద్య, వైద్య సామాజిక, ధార్మిక, ఉద్యోగ, సేవ, వ్యాపార, వ్యవసాయ, పారిశ్రామిక, రాజకీయ, పత్రికారంగాలలో పనిచేస్తున్న మహిళలు, కళాశాల విద్యార్థినీలు, కళాకారులు, క్రీడాకారులు, మరియు పొదుపు సంఘాల మహిళలు అందరూ ఆహ్వానితులే నని వారు తెలిపారు. తేది. 28 - 01- 2024, ఆదివారం సమయం : ఉదయం 10-00 గంటల నుండి సాయంత్రం 4-00 గంటలకు వరకు వేదిక : గుండగోని మైసయ్య కన్వెన్షన్, గంధంవారి గూడెం రోడ్, నల్లగొండ.